Sunday, November 17, 2024

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల తేదీ ఇదే.. ఫ్రీ కోచింగ్‌కు రేపటితో ముగుస్తున్న గడువు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు త్వరలో వెలువడనున్న మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ మేరకు ప్రభుత్వం కూడా నోటిఫికేషన్‌ త్వరలో జారీకి ఏర్పాట్లు చేస్తుంది. అందిన సమాచారం మేరకు నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీ ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్‌ ఇవ్వాలని విద్యాశాఖ కూడా యోచిస్తోంది. ఈ మేరకు కసరత్తులు చేస్తుంది. ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇటీవల జరిగిన ‘టెట్‌’ పరీక్షల ఫలితాలు నవంబరు 2న విడుదలవనున్నాయి. విభాగాల వారీగా చూస్తూ.. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) పోస్టులు 7725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీ) పోస్టులు 1781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ (పీజీటీ) పోస్టులు 286, ప్రిన్సిపల్‌ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (పీఈటీ) 132 వరకు ఉన్నాయి.

వెబ్‌సైట్లో అన్ని సబ్జెక్టులు టెట్‌ ప్రిలిమినరీ కీలు అందుబాటులోకి

ఏపీ టెట్ జులై-2024 పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక ఆన్సర్‌ కీలు అన్నింటినీ విద్యాశాక విడుదల చేసింది. ఈ మేరకు అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’లను సెషన్ల వారీగా పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. పేపర్‌ 2ఎ సోషల్‌ స్టడీస్‌ పరీక్ష ఆన్సర్ ‘కీ’పై అభ్యంతరాలను అక్టోబర్‌ 25లోపు దాఖలు ఆన్‌లైన్‌లో దాఖలు తెలియచేయాలని సూచించింది. కాగా టెట్‌ జులై సెషన్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,68,661 మంది అంటే 86.28 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 17 రోజల పాటు రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలు జరిగాయి. టెట్‌ తుది ఆన్సర్‌ ‘కీ’ అక్టోబర్‌ 27న విడుదల కానుంది. ఇక టెట్‌ ఫలితాలు నవంబర్‌ 2న ప్రకటిస్తారు.

రేపటితో ముగుస్తున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులు

మరోవైపు మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు కూటమి సర్కార్‌ రాష్ట్రంలోని నిరుపేద అభ్యర్ధులకు బంపరాఫర్‌ ప్రకటించింది. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా అభ్యర్ధులకు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వనుంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. రేపటి (అక్టోబర్‌ 25)తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. రాత పరీక్ష, టెట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధన, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతోపాటు మెటీరియల్‌ కూడా ఉచితంగా అందిస్తారు. ఆయా జిల్లాల్లో మూడు నెలల పాటు తరగతులు నిర్వహించనున్నారు.

రచ్చకెక్కిన వైఎస్​ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు.. జగన్‌ నోటీసుల వెనక రాజకీయం ఉందా?

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ ప్రత్యర్ధులుగా ఉన్న అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంచాయితీ మొదలైంది. తనకు తెలియకుండానే తన కంపెనీ షేర్లు బదలాయించారంటూ తన తల్లి విజయమ్మకు లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

అదే సమయంలో ఆస్తుల పంపకం అగ్రిమెంట్‌ రద్దు చేసుకుందామంటూ షర్మిలకు లేఖ రాయడంతో అంతే ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు చెల్లెలు. అయితే జగన్‌ నోటీసులు ఇవ్వడం వెనక రాజకీయం ఉందా? పాత కేసుల భయం దాగుందా? షర్మిలతో జగన్‌ చేసుకున్న ఒప్పందం ఏంటి? అన్నదీ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో తల్లి విజయమ్మకు తాను ఇచ్చిన 1శాతం వాటా గిఫ్ట్‌ డీడ్‌ను తనకు తెలియకుండా షర్మిలకు బదలాయించారని.. దీనిని రద్దు చేయాలంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు మాజీ సీఎం జగన్‌. సరస్వతీ పవర్‌ కంపెనీలో 99శాతం షేర్లు జగన్‌కూ, 1శాతం షేర్లు విజయమ్మకూ ఉన్నాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈ ఆస్తికూడా అటాచ్‌మెంట్లోకి వెళ్లిపోయింది. దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.

అయితే, తన చెల్లెలపై ప్రేమకొద్దీ రాసిన MOUలో సరస్వతీ సిమెంట్స్‌లో 49శాతం షేర్లు ఇస్తానని జగన్‌ చెప్పారు. నేరుగా షర్మిలకు బదిలీ చట్టవిరుద్ధం కాబట్టి, నమ్మకంకోసం అప్పటికే 1శాతం వాటాదారుగా ఉన్న తల్లికి ఇస్తానన్న ఈ షేర్లపై గిఫ్ట్‌ డీడ్‌ రాసిచ్చారు. కేసులు తేలాక షర్మిల పేరుమీద బదిలీ చేసుకోవచ్చని జగన్‌ ఈ గిఫ్ట్‌డీడ్‌ను 2019లోనే రాసిచ్చారు.

అయితే కోర్టు కేసుల్లో, అటాచ్‌మెంట్లో ఉన్న ఆస్తిని నిర్వహించుకోవడానికే తప్ప ఏరకంగానూ క్రయ, విక్రయాలు చేసుకోవడానికి వీల్లేదు. 2021లో సరస్వతీ పవర్‌లో జగన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను ఆధారంగా చేసుకుని విజయమ్మ దగ్గరనుంచి షేర్లను బదిలీ చేయించుకున్నారు షర్మిల. కోర్టుల్లో స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం లీగల్‌గా ఇబ్బంది తెచ్చిపెడుతుందని జగన్‌ను న్యాయవాదులు హెచ్చరించారు. దీంతో న్యాయవాదుల సూచనలతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్‌ లీగల్‌గా NCLTని ఆశ్రయించారు.

తాజా నోటీసుల నేపథ్యంలో కుటుంబ ఆస్తుల వ్యవహారంలో అన్నాచెల్లెళ్ల మధ్య గతంలో జరిగిన ఒప్పందాలు తెర మీదకు వచ్చాయి. వైఎస్సార్‌ ఉన్నపుడే వారసత్వంగా వచ్చిన కొన్ని ఆస్తుల్లో జగన్‌కూ, షర్మిళకూ మధ్య పంపకాలు పూర్తయ్యాయి. మరికొన్ని ఆస్తులు కూడా బదిలీ చేయడానికి జగన్‌ సిద్దపడ్డారు. అయితే సరిగ్గా ఈ సమయంలో వైయస్సార్‌ మరణం తర్వాత సీబీఐ, ఈడీ కేసులతో వైయస్‌.జగన్‌ కు చెందిన ఆస్తులు, కంపెనీలన్నీ కూడా అటాచ్‌మెంట్లోకి వెళ్లిపోయాయి. అటాచ్‌మెంట్‌ కిందున్న ఆస్తులు బదిలీచేయడం కాని, విక్రయించడంకాని చట్ట విరుద్ధం.

దీన్ని దృష్టిలో ఉంచుకుని, తన చెల్లెలితో ఉన్న అనుబంధం దృష్ట్యా, ప్రేమకొద్దీ తాను సొంతంగా సంపాదించిన ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలికి ఇవ్వాలని జగన్‌ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 2019 ఆగస్టు 31న షర్మిలకు అగ్రిమెంట్‌ రాసిచ్చారు. కేసుల్లో ఆస్తులు ఉన్నందున వాటిని నేరుగా బదిలీ చేయడానికి చట్టపరంగా ఆస్కారం లేనందున తన చెల్లెలకు నమ్మకం కలిగించేందుకు అవగాహనా ఒప్పందాన్ని రాసిచ్చారు. ఇలా రాసిన మొత్తం పది రకాల ఆస్తుల్లో సరస్వతీ సిమెంట్స్‌ కూడా ఒకటి. కేసులు తేలిన తర్వాత వాటిని అప్పగిస్తామని అందులో పేర్కొన్నారు.

అయితే మొత్తం ఆస్తుల బదిలీ ప్రక్రియ కోర్టు తీర్పులకు లోబడి ఉంటాయని రాసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా లావాదేవీలు జరపకూడదు. కానీ షర్మిల సరస్వతి పవర్‌లో తన తల్లి విజయలక్ష్మి పేరుతో ఉన్న గిఫ్ట్‌ డీడ్‌ షేర్లను తనపేరుతో రాయించుకున్నారు. దీనిపై అభ్యంతరం చెబుతూ షర్మిలకు జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశారు. చట్టవిరుద్దంగా జరిగిన షేర్ల బదిలీ వల్ల న్యాయపరంగా చిక్కులు తప్పవని.. తన బెయిలు కూడా రద్దయ్యే అవకాశం ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తనకు తెలియకుండా, చట్ట విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీ వ్యవహారంపై వైఎస్ జగన్‌ వెంటనే తన తల్లికి, చెల్లెలకు కూడా అభ్యంతరాలు తెలియజేశారు. తాను ప్రేమకొద్దీ నమ్మకంతో ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను వినియోగించుకుని, షేర్ల బదిలీ చేయడం సరికాదని తెలిపారు. ఇది నమ్మకాన్ని వమ్ము చేయడమంటూ స్పష్టం చేశారు. షర్మిల, విజయమ్మ స్పందించకపోవడంతో NCLTని ఆశ్రయించినట్టు చెబుతున్నారు. అదే సమయంలో షర్మిలతో చేసుకున్న MOU రద్దుకు కూడా జగన్ సిద్దపడుతూ లేఖ రాశారు.

కుటుంబ పెద్దగా అందరికీ ఆస్తులు సమంగా పంచాల్సిన బాధ్యతలో ఉండి నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమంటూ ప్రతి లేఖ రాశారు వైఎస్ షర్మిల. ఆస్తుల పంపకంపై చట్టబద్దంగా చేసుకున్న అగ్రిమెంట్‌ రద్దు చేయాలన్న జగన్‌ ఆలోచన ఆచరణసాధ్యం కాదన్నారు షర్మిల. నిర్ణయం మార్చుకుని వైఎస్‌ఆర్‌ వారసులకు సమంగా ఆస్తులు పంచకపోతే తానే లీగల్‌ ఫైట్‌ చేయడానికి సిద్ధమవుతానంటూ అల్టిమేటం ఇచ్చారు షర్మిల. తన రాజకీయాలకు, ఆస్తుల పంపకాలకు ముడిపెట్టడాన్ని షర్మిల తప్పబట్టారు. కుటుంబ ఆస్తుల విషయంలో జరిగిన చర్చలు, పరిణామాలకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న తల్లి విజయలక్ష్మి కూడా లేఖలో సంతకం చేశారని.. ఇది గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు షర్మిల.

అయితే తండ్రి ఉండగా సంపాదించిన ఆస్తుల్లో వాటాలు ఇప్పటికే ఇచ్చామని.. కేవలం ప్రేమాభిమానాలతో తన ఆస్తులు ఇవ్వడానికి జగన్‌ సిద్దపడ్డారని, అయినా తప్పుగా ప్రచారం చేయడం తగదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి అన్నా చెల్లెళ్ల మధ్య లేఖాస్త్రాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆస్తుల పంపకం విషయంలో విబేధాలు ఉన్నాయని ఇంతకాలం ప్రచారం జరిగినా తాజా పరిణాయాలు వాటిని నిజం చేస్తున్నాయి. మరి వైఎస్‌ఎర్‌ కుటుంబంలో తలెత్తిన ఈ సంక్షోభం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి..!

మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆగకుండా తుమ్ములు వస్తున్నాయా? మీరు ప్రమాదంలో ఉన్నట్లే..

నేటి కాలంలో అధికంగా పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న వాతావరణం కారణంగా జీవనశైలి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి.

కొందరికి నిద్రలేవగానే తుమ్ములు ప్రారంభమవుతాయి. దీనిని అలర్జిక్ రినిటిస్ అని పిలుస్తారు. దీనిని గవత జ్వరం అని కూడా పిలుస్తారు. ఇది అలెర్జీ పరిస్థితి. తుమ్ములు, ముక్కు దిబ్బడ, ముక్కులో దురద, కళ్లలో నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలెర్జీ రినిటిస్ ఎవరికైనా సంభవించవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దాని లక్షణాలు పెరిగితే, రోగి చాలా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అలర్జిక్ రైనైటిస్ సమస్య ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా తుమ్ములు మొదలవుతాయి. ధూళి కణాలు శ్వీసనాళంలోకి రావడం వల్ల కూడా ఇది జరగవచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో గాలిలో ఉండే అతి చిన్న రేణువులు కూడా అలర్జీని కలిగిస్తాయి. ఈ చిన్న కణాలు ముక్కు, నోటి ద్వారా ప్రవేశించినప్పుడు తుమ్ములు మొదలవుతాయి.

అలెర్జీ రినిటిస్ లక్షణాలు

తుమ్ములు
నాసికా రద్దీ
ముక్కు, గొంతు, నోరు మరియు కళ్లలో మంట
ముక్కు కారటం
ముక్కు, గొంతు, కళ్లలో నీరు కారడం
కళ్ళు ఎర్రగా మారడం
తలనొప్పి, సైనస్, కళ్ల కింద నల్లటి వలయాలు
ముక్కు, గొంతులో శ్లేష్మం ఏర్పడటం
విపరీతమైన అలసట
గొంతు నొప్పి
శ్వాసలో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

అలెర్జీ రినిటిస్ కారణాలు

లేడీ హార్డింజ్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి మాట్లాడుతూ.. ఇండోర్, అవుట్‌డోర్ అలెర్జీల వల్ల అలర్జీ రినైటిస్ వస్తుంది. ట్రిగ్గర్‌లలో చెట్లు, మొక్కలు, కలుపు మొక్కలు, పెంపుడు జంతువుల శరీరం నుంచి వెలువడే చుండ్రు, చిన్న దుమ్ము రేణువుల వంటి పుప్పొడి వల్ల ఈ అలెర్జీ వస్తుంది. ఇది కాకుండా ఇతర కారకాలు కూడా రోగులను ప్రేరేపించగలవు. వాతావరణం మారుతున్నప్పుడు, పెరుగుతున్న కాలుష్యం, వసంత ఋతువు, శరదృతువు ప్రారంభంలో అలెర్జీ రినిటిస్ చాలా సాధారణం. ఎందుకంటే ఈ సమయంలో గాలిలో ధూళి కణాలు పెరుగుతాయి. కొన్నిసార్లు ఇది పెంపుడు జంతువుల జుట్టు, చుండ్రు వల్ల కూడా వస్తుంది.

అలెర్జీ రినిటిస్ నివారణ

ముఖాన్ని పదే పదే తాకడం మానుకోవాలి
కళ్లు, ముక్కును ఎక్కువగా రుద్దకూడదు
కాలుష్యం పెరిగినప్పుడు లేదా గాలిలో ధూళి ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంటి లోపల ఎక్కువగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.
దుమ్ము నుండి రక్షించడానికి దిండ్లు, పరుపులు, పరుపులను శుభ్రంగా కవర్లతో ఉంచాలి.
పెంపుడు జంతువుల నుండి కూడా దూరం పాటించాలి.
ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలి.
ఇంట్లో అగరుబత్తీలు కాల్చడం మానుకోవాలి.
మీ చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన నీటితో మాత్రమే కడగాలి.
బయటకు వెళ్లేటప్పుడు కళ్ళు, గొంతును కప్పి ఉంచేలా గాగుల్స్, మాస్క్ ఉపయోగించాలి.
ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకోవాలి.

వంటల్లో కరివేపాకు తీసి పక్కనపడేస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే ఇకపై అలా చేయరు

దక్షిణాది వంటల్లో కరివేపాకు తప్పనిసరి. వంటల్లో కొన్ని కరివేపాకు రెబ్బలను జోడిస్తే అద్భుతమైన రుచి వస్తుంది. పైగా వండినప్పుడు అద్భుతమైన వాసన కూడా వస్తుంది.

కానీ వంట రుచిని పెంచడానికి మాత్రమే కాదు, ఈ కరివేపాకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి వివిధ ఉపయోగకరమైన పదార్థాలు ఇందులో అధికంగా ఉన్నాయి.

ఈ కరివేపాకు కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, కొవ్వు తగ్గడం వంటి వివిధ శరీర వ్యాధులకు ఉపయోగిస్తారు. వంటకే కాదు నీళ్లలో కలిపి డిటాక్స్ డ్రింక్ కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకును రోజూ తింటే గుండె సమస్యలు దూరమవుతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. కరివేపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో ‘చెడు’ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌ల స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

కరివేపాకులో నానబెట్టిన నీరు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను సహజ పద్ధతిలో తొలగించడానికి సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన ఈ విషపదార్థాలను తొలగించగలిగితే పొట్ట, చర్మం, జుట్టు మొదలుకుని అన్ని సమస్యలూ నయమవుతాయి. అధిక శరీర బరువు కూడా తగ్గుతుంది.

కొంతమంది జీర్ణ రుగ్మతలతో బాధపడుతుంటారు. అందుకు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే కరివేపాకు నానబెట్టిన నీళ్లను తాగితే మాత్రం రకరకాల కడుపు సమస్యలు నయమవుతాయి. పైగా కరివేపాకు మలబద్ధకం నయం చేయడంలోనూ సహాయపడుతుంది

కరివేపాకులో కార్బజోల్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇది శరీరం నుండి అదనపు కొవ్వును తొలగించడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఆహారం, వ్యాయామంతో పాటు, కరివేపాకులను క్రమం తప్పకుండా ఉదయం ఖాళీ కడుపుతో లేదంటే వంటలో తినడం వల్ల కొవ్వు వేగంగా తగ్గుతుంది. అలాగే బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

ఇకపై ఏపీలో ఇసుక ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. కానీ అలా చేస్తే పీడీ యాక్ట్

ఏపీ ప్రజలకు బిగ్‌ అలెర్ట్‌… ఇసుక పాలసీపై సంచలన నిర్ణయం తీసుకుంది సర్కార్. ఏపీలో ఇకపై ఇసుక ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ. సొంత అవసరాలకు ఎంతైనా వాడుకోవచ్చు… లిమిట్‌ క్రాస్‌ చేస్తే మాత్రం చర్యలు తప్పవ్‌… అంటోంది ఏపీ కేబినెట్‌.

అవును… ఉచిత ఇసుక విషయంలో ఏపీ కేబినెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సీనరేజ్, జీఎస్టీ చార్జీల రద్దుకు ఆమోదం తెలిపింది. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇసుక లేని జిల్లాల్లో మినరల్‌ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించింది. ఇసుక విధానంలో తమ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులతోనే NGT పెనాల్టీలు వేసిందని చెప్పారు. ఇసుక ఎవరికి వారు సొంతంగా లోడ్ చేసుకోవచ్చని, అయితే.. సొంత అవసరాలకే వాడుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్‌ పెడతామని హెచ్చరించారు కొల్లు రవీంద్ర.

మొత్తంగా.. ఏపీ కేబినెట్‌ నిర్ణయంతో ఇకపై ఇసుక ఉచితంగా దొరకనుంది. ఇప్పటికే.. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో ఇసుక ఉచితంగా తీసుకేళ్లేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా.. సొంత అవసరాలకు ఎంతైనా వాడుకోవచ్చని కేబినెట్‌లో తీర్మానించడంపై హర్షం వ్యక్తమవుతోంది.

శారదాపీఠానికి గత ప్రభుత్వ భూకేటాయింపులు రద్దు.. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులేంటి.

గత ప్రభుత్వం విశాఖలోని శారదాపీఠానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ ఇష్యూపై రకరకాల వాదనలూ ఊపందుకున్నాయి. విశాఖ జిల్లా భీమిలి పట్టణం సమీపంలోని కొత్తవలస గ్రామంలో ఉన్న 15 ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించింది. ఒక ఎకరా భూమికి కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే తీసుకుని… ఆ భూమిని శారదా పీఠానికి ఇచ్చేసింది. అంటే మొత్తం 15 లక్షల రూపాయలకే 15 ఎకరాలను పిఠానికి గత ప్రభుత్వం అప్పగించింది. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలువురు టీడీపీ నేతలు ఈ ఇష్యూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేశారు. భీమిలి సమీపంలో ఎకరా భూమి 15 కోట్లకు పైగా ఉందని ఇటు అధికారులు కూడా చెబుతున్నారు.

ఇక అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం… విశాఖ శారదా పీఠానికి సంబంధించిన భూములపై దృష్టి సారించింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం అధికారులతో భూములపై విచారణ జరిపించింది. అమ్మకాలు, కొనుగోళ్ల లెక్కలన్నీ బయటకు తీశారు. కోట్లు విలువ చేసే 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. ఇక మంత్రివర్గంలోనూ భూముల రద్దుకు గ్రీన్‌ సిగ్నల్‌ దొరికింది.

రోజూ ప‌ర‌గ‌డుపునే రెండు పుదీనా ఆకుల‌ను తినండి.. జ‌రిగే అద్భుతాల‌ను చూడండి

చాలా మంది పుదీనాని వంటల్లో వాడుతూ ఉంటారు. పుదీనా వల్ల చక్కటి లాభాలు కలుగుతాయి. పుదీనా ఆకులు ఔషధ గుణాల‌ను కలిగి ఉంటాయి. అందుకే పురాతన కాలం నుండి కూడా ఈ మొక్కని అనేక చికిత్సల కోసం వాడుతున్నారు. పుదీనా ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ సి తోపాటుగా బి కాంప్లెక్స్ విట‌మిన్లు, ఇలా పోషకాలు చాలా ఉన్నాయి. పుదీనా ద్వారా ఐరన్, పొటాషియం, మాంగనీస్ ని కూడా మనం పొంద‌వ‌చ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ ని పెంచి మెదడు పనితీరుని మెరుగుపరచడానికి కూడా పుదీనా మనకి ఉపయోగపడుతుంది.

పుదీనాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. తక్కువ మొత్తంలో ప్రోటీన్, కొవ్వు కలిగి ఉంటుంది పుదీనా. పుదీనాని తీసుకోవడం వలన మనం బరువు కూడా తగ్గ‌వ‌చ్చు. ఉదయాన్నే పరగడుపున రెండు లేదా మూడు పుదీనా ఆకుల్ని తీసుకుంటే చక్కటి లాభాలను పొంద‌వ‌చ్చు. మరి ఎలాంటి లాభాలని పొంద‌వ‌చ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే పరగడుపున పుదీనాని తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య నుండి బయటపడ‌వ‌చ్చు.

జీర్ణవ్యవస్థలోని కండరాలని ఇది సడలిస్తుంది. పుదీనాని తీసుకోవడం వలన శ్వాస సంబంధిత సమస్యల నుండి కూడా దూరంగా ఉండ‌వ‌చ్చు. ఆస్తమాతో బాధపడే వాళ్ళకి చక్కటి ఉపశమనాన్ని అందిస్తుంది. పుదీనాను తీసుకోవడం వలన నోటి శుభ్రత ఉంటుంది. పుదీనా ఆకుల ర‌సం దంతాల నుండి ఫలకాన్ని తొలగించేందుకు సహాయపడుతుంది.

బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా నోటిని శుభ్రంగా ఉంచుతుంది. పుదీనాతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ నుండి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా టీ చేసుకుని తీసుకోవడం వలన బరువు తగ్గ‌వ‌చ్చు. పుదీనాని తీసుకుంటే మార్నింగ్ సిక్‌నెస్ నుండి కూడా బయటపడ‌వ‌చ్చు. ఇలా అనేక లాభాలు పుదీనా ద్వారా మనం పొంది ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

ఇంట్లో బ్రెడ్ ఉందా? ఇన్స్టంట్‌గా బ్రెడ్ ఊతప్పం చేసేయండిలా

ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు చాలా సింపుల్ గా ఈ బ్రెడ్ ఊతప్పం తయారు చేయొచ్చు. దీనికోసం తక్కువ పదార్థాలే అవసరం అవుతాయి. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూడండి.

అప్పటికప్పుడు ఏదైనా అల్పాహారం చేయాలంటే ఈ బ్రెడ్ ఊతప్పం బెస్ట్ ఆప్షన్. ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు వీటిని సింపుల్ గా చేసేయొచ్చు. పిండి కూడా పులియబెట్టాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. ఈ బ్రెడ్ ఊతప్పం అల్పాహారంలోకి, స్నాక్స్ లోకి బాగుంటాయి.

బ్రెడ్ ఊతప్పం తయారీకి కావాల్సినవి:

6 బ్రెడ్ స్లైసులు

సగం కప్పు సన్నం రవ్వ

సగం కప్పు పెరుగు

2 చెంచాల బియ్యం పిండి

2 ఉల్లిపాయల సన్నటి ముక్కల తరుగు

1 టమాటా సన్నటి ముక్కల తరుగు

అరచెంచా అల్లం తరుగు

గుప్పెడు జీడిపప్పు సన్నం ముక్కలు

1 క్యారట్ తురుము

గుప్పెడు కొత్తిమీర తరుగు

అరచెంచాడు ఉప్పు

2 చెంచాల నెయ్యి లేదా నూనె

బ్రెడ్ ఊతప్పం తయారీ విధానం:

ముందుగా బ్రెడ్ చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పట్టుకోవాలి. అందులోనే రవ్వ, బియ్యం పిండి కూడా వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టాలి.
అన్నీ కలిసేలా ముద్దలాగా అయ్యేలా కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. అందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, క్యారట్ తురుము, అల్లం తరుగు, జీడిపప్పు ముక్కలు వేసుకోండి.
మరిన్ని నీళ్లు పోసుకుని పిండి బాగా కలుపుకోండి. మరీ ముద్దలాగా పిండి ఉండకూడదు.
ఇప్పుడు పెనం పెట్టుకుని వేడెక్కాక నెయ్యి రాసుకుని ఒక గరిటెడు పిండి పోసుకుని కాస్త వెడల్పుగా గుండ్రంగా అనేయండి. ఇవి ఊతప్పం కాబట్టి కాస్త మందంగానే ఉండాలి.
అంచుల వెంబడి నూనె వేసుకుని బాగా కాల్చుకోండి. మీడియం మంట మీద మరో వైపు కూడా కాల్చుకుంటే బ్రెడ్ ఊతప్పం రెడీ అవుతుంది.

పొట్ట దగ్గరి కొవ్వును కరిగించే మ్యాజిక్ టీ ఇదిగో, దీన్ని ప్రతిరోజూ తాగితే నెలలోనే మార్పు కనిపిస్తుంది

పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య. ఆ కొవ్వును కరగించే చిట్కాలను ఎంతో మంది వెతుకుతూ ఉంటారు. ఇక్కడ మేము సెలెరీ టీ గురించి చెప్పాము. సెలెరీలో అధిక మొత్తంలో ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీని మెటబాలిజం పెరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బరువు పెరగడం అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా కొవ్వు పొట్ట చుట్టూ పేరుకుపోయి అందవిహీనంగా మార్చేస్తోంది. బెల్లీ ఫ్యాట్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. పొట్ట దగ్గరి కొవ్వు కరిగించుకోవడానికి ఎక్కువమంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు. వ్యాయామాలతో పాటూ ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు. ఇక్కడ మేము బెల్లీ ఫ్యాట్ కరిగించే సెలెరీ టీ గురించి చెప్పాము. దీన్ని ప్రతిరోజూ తాగడం వల్ల కొవ్వు కరిగే అవకాశం ఉంది.

సెలెరీ అంటే ఏమిటి?

సెలెరీ అనేది ఒకరకమైన ఆకుకూర. ఇది కొత్తిమీరలాగే ఉంటుంది. చాలా సూపర్ మార్కెట్లలో ఇది లభిస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన ఆకుకూరలు. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. సెలెరీని నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిని పాశ్చాత్య దేశాల్లో ఎసిడిటీ నుండి ఉపశమనం పొందడానికి శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.
కొవ్వును కరిగించే సెలెరీ

సెలెరీలో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి ఉంటుంది. సెలెరీ టీ తయారుచేసే విధానం, బరువు తగ్గడంలో దాని ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాము. సెలెరీలక్షణాల ఆధారంగా దాని ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సెలెరీలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గట్ బ్యాక్టిరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మందగించేలా చేసి కొవ్వు నష్టం జరిగేలా చేస్తుంది. ఆకలిని అరికట్టి ఆహారం అధికంగా తినకుండా అడ్డకుంటుంది. దీని వల్ల కొవ్వును కరగడం మొదలవుతుంది. కాబట్టి కొవ్వును తగ్గించడానికి సెలెరీ అద్భుతంగా పనిచేస్తుంది.
సెలెరీ టీ తయారీ

బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి ప్రతి రోజు ఉదయం ఖాళీ పొట్టతో సెలెరీ నీటిని తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. దీన్నే సెలెరీ టీ అంటారు. నీటిలో సెలెరీ కాండాలను వేసి బాగా మరగకాచాలి. ఆ నీటిని వడకట్టి ఆ నీటిలో ఒక స్పూను తేనె వేసి కలుపుకుని తాగాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయం ఖాళీ పొట్టతో తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.

సెలెరీ పానీయాన్ని తాగడం వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆర్ధరైటిస్ వంటి ఎముకల వ్యాధుల నుంచి బయటపడేందుకు ఇది ఉపయోగం పడుతుంది. అలాగే శరీరంలో ఉన్న ఇన్ ఫ్లమ్మేషన్ ను తగ్గిస్తుంది. సెలెరీ ఆకులే కాదు సెలెరీ గింజలు కూడా ఇందుకు ఉపయోగపడతాయి. వీటిలో 25 రకాల యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అన్ని రకాలుగా రక్షిస్తాయి.

సెలెరీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి వంటివి ఉంటాయి. అలాగే క్యాన్సర్ కణాలను పెరగకుండా అడ్డుకునే గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. సెలెరీలో థాలైడ్ మొక్కల సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ ను అడ్డుకుంటుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని పొట్ట నిండుగా ఉంచుతుంది. కాబట్టి ఇతర ఆహారాలు తినకుండా అడ్డుకుంటుంది. తద్వారా త్వరగా సన్నబడవచ్చు.

ఇంటి బాల్కనీలో ఈ నాలుగు మొక్కలు కచ్చితంగా ఉండేలా చూసుకోండి, డెంగ్యూ దోమలు రావు

కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రావు. కొన్ని మొక్కలు డెంగ్యూను, మలేరియాను తెచ్చే దోమలను దూరంగా ఉంచుతాయి. ఈ మొక్కలు కచ్చితంగా బాల్కనీలో ఉండేట్టు చూసుకోండి.

ఈ రోజుల్లో దోమల బెడద ఎక్కువగానే ఉంది. దోమల వల్ల రోజురోజుకూ డెంగీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా దోమలు రావడం ఆగడం లేదు. దోమలను తొలగించడానికి కాయిల్స్, దోమ వికర్షక క్రీమ్ వంటి అనేక ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయి. వాటి నుంచి భద్రత కావాలంటే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి.

ఇంటిని సరిగ్గా శుభ్రపరచడం, కిటికీలు, తలుపులను మూసి ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంటి బాల్కనీలో కొన్ని ప్రత్యేక మొక్కలను పెంచడం వల్ల దోమలు దూరంగా ఉంటాయి. కొన్ని మొక్కల వాసన దోమలకు నచ్చదు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలకు కారణమయ్యే దోమలను దూరంగా ఉంచాలంటే పెంచుకోవాల్సిన మొక్కలు ఇవే.
లెమన్ గ్రాస్ ప్లాంట్

సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన లెమన్ గ్రాస్ మీ ఇంటి నుండి దోమలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిని అనేక సహజ దోమల నివారిణి ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. వాస్తవానికి నిమ్మగడ్డి వాసన మీ మూడ్ ను రిఫ్రెష్ అవుతుంది. నిమ్మగడ్డి ఉన్నచోట దోమలు ఉండవు. దోమలకు వాటి వాసన ఇష్టం ఉండదు. అవి లెమన్ గ్రాస్ నుండి పారిపోతాయి. అందుకే ఇది మీ బాల్కనీకి మంచి మొక్క కావచ్చు.
బంతిపువ్వు మొక్క

బంతిపువ్వుల సీజన్ ఇది. ఒక మొక్క తెస్తే చాలు బంతిపువ్వులు విపరీతంగా పూస్తాయి. బాల్కనీ అందాన్ని పెంచే బంతిపువ్వులు మొక్కను కొని ఇంటికి తెచ్చుకుంది. బంతిపూల మొక్కల నుంచి వచ్చే వాసన దోమలకు నచ్చదు. నిజానికి బంతిపూల మొక్క వాసన దోమలకు అలెర్జీలా ఉంటుంది. కేవలం దోమలే కాదు అనేక చిన్న చిన్న కీటకాలు కూడా మీ ఇంటి చుట్టూ రావు. బంతి మొక్కను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అన్ని రకాలు ఉపయోగాలు ఉంటాయి. ఆ పువ్వులను దేవునికి సమర్పించవచ్చు.

లావెండర్ మొక్క

లావెండర్ మొక్క మెదడును రిఫ్రెష్ చేసే వాసనను విడుదల చేస్తుంది. లావెండర్ వాసన దోమలకు నచ్చదు. అవి ఆ గాలిని పీల్చడానికి ఇష్టపడవు. దీనిని అనేక దోమల నివారిణి ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. ఈ సందర్భంలో, మీరు మీ బాల్కనీలో లావెండర్ మొక్కను పెంచవచ్చు. లావెండర్ మొక్కలు మీ బాల్కనీలో ఉంచడం వల్ల దోమలకు చికాకుగా అనిపిస్తుంది. డెంగ్యూ, మలేరియా వ్యాధులు రాకుండా ఉండాలంటే లావెండర్ మొక్కలు కొని ఇంట్లో పెట్టుకోండి.
పుదీనా మొక్క

పుదీనా మొక్కలు ఆహారానికి మంచి రుచిని అందిస్తాయి. మీరు దాని రుచికరమైన చట్నీని ఆస్వాదించి ఉంటారు. మీరు దాని తాజా సువాసనను కూడా గుర్తించే ఉంటారు. పుదీనా మొక్కలను కచ్చితంగా మీ బాల్కనీలో ఉండేలా చూసుకోండి. ఇవి మీకు రుచికరమైన ఆహారాన్ని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. మీరు ప్రతిరోజూ రుచికరమైన పచ్చడి తినడం వల్ల దోమలు మీకు దూరంగా ఉంటాయి. పుదీనా వాసన దోమలకు నచ్చదు. మీ నుంచి కానీ, మీ ఇంట్లోని కానీ పుదీనా వాసన వస్తే దోమలు అక్కడ ఉండేందుకు ఇష్టపడవు. కాబట్టి చిన్న కుండీల్లో పుదీనా మొక్కలు అధికంగా పెంచడం అలవాటు చేసుకోండి.

రైళ్లలో ఇచ్చే దుప్పట్లు ఉతికేది నెలకి ఒకసారి లేదా రెండు సార్లే, వాటితో ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు

ఏసీ రైళ్లలో ప్రయాణించేటప్పుడు తెల్లటి దుప్పట్లు ఇస్తూ ఉంటారు. అవి చూసేందుకు అప్పుడే ఇస్త్రీ చేసినట్టుగా ఉంటాయి. కానీ వాటిని ఉతికి మాత్రం నెల రోజులు అయ్యే అవకాశం ఉంటుంది.

రైళ్లలో ప్రయాణించే వారికి ఈ దుప్పట్ల గోల బాగా పరిచయమే. ఎందుకంటే ఏసీల్లో ప్రయాణం చేసేవారికి రైల్వే వారే కప్పుకోవడానికి దుప్పట్లను ఇస్తారు. ఆ బెడ్ షీట్లను చూస్తే వేడిగా అప్పుడే ఐరన్ చేసి ఇచ్చినట్టుగా ఉంటుంది. అది నిజమే ఎందుకంటే వాటిని ఉతకడం నెల రోజులకు ఒకసారి మాత్రమే, అందుకే ప్రతిసారీ ఇస్త్రీ చేసి ప్రయాణికులకు ఇచ్చేస్తూ ఉంటారు. ఒక ప్రయాణికుడు వాడిన తర్వాత వాటిని తీసి ఇస్త్రీ చేసి తిరిగి ఇంకో ప్రయాణికులకు అందిస్తూ ఉంటారు. దీని వల్ల వారికి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆర్‌టీఐ చట్టం ద్వారా ఒక వ్యక్తి రైల్వేలో ఇచ్చే దుప్పట్లను ఎన్నిసార్లు ఉతుకుతారో తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. రైల్వే వారు అతడికి ఇచ్చిన సమాధానం చూస్తే రైలు ప్రయాణికులకు దిమ్మతిరిగిపోతుంది. రైళ్లలో ఏసీ కోర్సులలో ఇచ్చే దుప్పట్లో నెలకు ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే ఉతుకుతారు. ప్రయాణికుడు వాడిన వెంటనే వాటిని ఉతకరు. కేవలం ఇస్త్రీ చేసి మాత్రమే ఇచ్చేస్తారు. దీనివల్ల ఆ బెడ్ షీట్లపై కోట్ల కొద్ది బ్యాక్టీరియాలు, వైరస్ లు చేరిపోతాయి. కొన్నిసార్లు ఇవి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం అవుతాయి.

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం మన శరీరం రోజు 30 నుంచి 40 వేల చర్మ మృతకణాలను తొలగిస్తుంది. అలాగే చెమట, లాలాజలం, చుండ్రు వీటన్నింటిని వదిలించుకుంటూ ఉంటుంది. అవి ఎక్కువగా పడేది మనం కప్పుకునే బెడ షీట్లపైనే. వీటన్నింటి కలయిక బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు వంటి వాటికి నిలయంగా మారుతుంది. దీనివల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు శరీరంలో చేరే అవకాశం ఉంటుంది.

ఒక రెండు వారాలు పాటు పిల్లో కవర్‌ను వాడితే దానిపై ఉండే బ్యాక్టీరియా… మీ ఇంట్లోని కుక్క తినే గిన్నెపై ఉన్న బ్యాక్టీరియా ల కన్నా 40 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇక బెడ్ షీట్ లలో చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. వాటి నిండా బ్యాక్టీరియా పేరుకు పోతుంది. అందుకే తరచూ వాటర్ ఉతుక్కోమని చెబుతూ ఉంటారు. అలాంటిది నెలకు ఒకసారి 20 నుంచి 30 మంది వాడే దుప్పట్లపై ఎన్ని రకాల బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, వైరస్‌లు చేరుతాయో అర్థం చేసుకోండి. ఇవి కొందరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతాయి.

దుప్పట్లపై ఉండే వైరస్ లు, బ్యాక్టీరియాలు వంటివి మీ చర్మంపై ఉన్నా వైట్ హెడ్స్, పగుళ్లు, గాయాల ద్వారా శరీరంలోకి చొచ్చుకెళ్తాయి. అక్కడ తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం ఉంటుంది.

అలాగే నిమోనియా, గోళ్లు ఇన్ఫెక్షన్ బారిన పడి ఊడిపోవడం, చర్మానికి దురదలు, దద్దుర్లు వంటివి రావడం, తామర వంటి సమస్యలను ఈ బెడ్ షీట్లపై పేర్కొన్న బ్యాక్టీరియా ల వల్ల కలిగే అవకాశం ఉంది.

వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం బెడ్ షీట్లపై ఉండే బ్యాక్టీరియాలు ఎన్నో రకాల అలర్జీలకు కారణం అవుతాయి. వీటివల్ల శ్వాస ఆడక పోవడం వంటి శ్వాస సంబంధిత సమస్యలు మొదలవుతాయి. మీకు తెలియకుండానే ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియాలు చేరి కొన్నాళ్లకు మీకు ఆస్తమా, నిమోనియా వంటి సమస్యలు వచ్చేలా చేస్తుంది. పిల్లల్లో కొత్త అలెర్జీలు, శ్వాస సమస్యలు మొదలవుతాయి. నిద్రలేమి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా అలాంటి ఉతకని బెడ్ షీట్ల మూలాన వచ్చే అవకాశం ఉంది.

వీలైనంతవరకు రైళ్లల్లో ఇచ్చే బెడ్ షీట్లను తీసుకోపోవడమే మంచిది. మీ సొంత బెడ్ షీట్లను తీసుకెళ్లి వాటిని వాడడం ఉత్తమం. ఇంటికి వచ్చాక వాటిని పరిశుభ్రంగా ఉతుక్కోవడం చాలా ముఖ్యమైన విషయం.

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్, దానా తుపాను ఎఫెక్ట్ తో మూడు రోజుల్లో 67 రైళ్లు ర‌ద్దు

దానా తుపాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 67 రైళ్లు రద్దు చేశారు. బుధ‌వారం 19 రైళ్లను, గురువారం 37 రైళ్లను, శుక్రవారం 11 రైళ్లను ర‌ద్దు చేసిన‌ట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్, దానా తుపాను ఎఫెక్ట్ మూడు రోజుల్లో 67 రైళ్లు ర‌ద్దు

రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే బిగ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల్లో 65 రైళ్లను ర‌ద్దు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రాంతంలో దానా తుపాను పరిస్థితుల దృష్ట్యా రైళ్లు రద్దు చేశారు. బుధ‌వారం 19 రైళ్లను, గురువారం 37 రైళ్లను, శుక్రవారం 11 రైళ్లను ర‌ద్దు చేసిన‌ట్లు వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ డివిజ‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ కె. సందీప్ తెలిపారు.

23వ (బుధ‌వారం) తేదీన 19 రైళ్లు రద్దు

1. 22503 కన్నియాకుమారి- దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్

2. 12514-సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్

3. 17016-సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్

4. 12840-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్

5. 12868-పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్

6. 22826-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్

7. 12897-పుదుచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్

8. 18464-కేఎస్ఆర్ బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్

9. 11019-సీఎస్టీ ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్

10. 12509-ఎస్ఎంవి బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్

11. 18046-హైదరాబాద్- హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్

12. 12704-సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

13. 22888-ఎస్ఎంవీటీ బెంగళూరు- హౌరా హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్

14. 12864-ఎస్ఎంవీటీ బెంగుళూరు- హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

15. 09059- సూరత్-బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్

16. 12552- కామాఖ్య- ఎస్ఎంవీ బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్

17. 22504- దిబ్రూఘర్- కన్నియాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్

18. 22973-గాంధీధామ్-పూరీ ఎక్స్‌ప్రెస్
24వ (గురువారం) 37 రైళ్లు ర‌ద్దు

1. 03429-సికింద్రాబాద్-మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

2. 06087-తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

3. 12703-హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

4. 22603-ఖరగ్‌పూర్-విల్లుపురం సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్

5. 18045 -షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్

6. 22851- సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్

7. 12841 -షాలిమార్ – ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్

8. 12663 -హౌరా-తిరుచ్చిరాపల్లి సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

9. 12863 -హౌరా- ఎస్ఎంవీటీ బెంగళూరు సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్

10. 18047 -షాలిమార్-వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్

11. 12839 -హౌరా- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ మెయిల్

12. 22644 -పాట్నా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్

13. 06090 -సంత్రాగచ్చి- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

14. 18117 -రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్

15. 08421 -కటక్- గుణుపూర్ మెము

16. 08521 -గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్

17. 07471 -పలాస-విశాఖపట్నం మెము

18. 20837 -భువనేశ్వర్-జునాగర్ ఎక్స్‌ప్రెస్‌

19. 18447- భువనేశ్వర్-జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్

20. 18417 -పూరీ- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్

21. 20842 -విశాఖపట్నం-భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్

22. 22874 -విశాఖపట్నం-దిఘా ఎక్స్‌ప్రెస్

23. 18118- గుణుపూర్-రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్

24. 22820 -విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

25. 08532 -విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

26. 12842- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్

27. 22808 -ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి ఏసీఎక్స్‌ప్రెస్

28. 15227 -ఎస్ఎంవీటీ బెంగళూరు-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్

29. 20838 -జునాగర్ రోడ్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్

30. 18448 -జగదల్పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్

31. 06095- తాంబరం- సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్

32. 12246 -ఎస్ఎంవీ బెంగళూరు- హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్

33. 18418- గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్

34. 17479 -పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్

35. 08522 -విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్

36. 07470- విశాఖపట్నం- పలాస మెము

37. 18526 -విశాఖపట్నం- బ్రహ్మపూర్

25వ (శుక్రవారం) తేదీన 11 రైళ్లు ర‌ద్దు

1. 09060- బ్రహ్మపూర్-సూరత్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్

2. 22873- దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్

3. 22819- భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

4. 08531- బ్రహ్మపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్

5. 08521- గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేకం

6. 18525- బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్

7. 08422- గుణుపూర్- కటక్ ఎక్స్‌ప్రెస్

8. 20807- విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్

9. 18418- గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్

10. 08522- విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్

11. 18417- పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్

విద్యార్థుల ఫీజు బకాయిలపై నారా లోకేష్‌ గుడ్‌ న్యూస్‌.. విద్యార్థుల కష్టాలకు త్వరలో పరిష్కారం

ఆంధ్రప్రదేశ్‌లో కోర్సులు పూర్తైనా ఫీజులు చెల్లించకపోవడంతో లక్షలాది విద్యార్థులు సర్టిఫికెట్లు అందక అవస్థలకు గురవుతున్నారు.ఏడాది కాలంగా కాలేజీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించక పోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి.ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి శుభవార్త వింటారని లోకేష్ ట్వీట్ చేశారు.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై త్వరలో శుభవార్త వింటారని మంత్రి లోకేశ్ మంగళవారం రాత్రి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్‌కు సంబంధించి విద్యార్థులు త్వరలోనే శుభవార్తను వింటారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. “వైసీపీ ప్రభుత్వం రూ.3500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించ కుండా మోసం చేసిందని, మంత్రులు, విద్యాశాఖలోని సహచరులతో కలిసి సమస్య పరిష్కరిస్తానని, త్వరలోనే శుభవార్త వింటారని హామీ ఇస్తున్నా అని ‘ఎక్స్’లో ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు.

నిధులు ఉన్నా చెల్లించకుండా తాత్సారం..

ఏపీలో చివరి విడతగా గత మార్చి 1న విద్యాదీవెన నిధులను మాజీ సీఎం జగన్ విడుదల చేశారు. పామర్రులో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లిస్తున్నట్టు బటన్ నొక్కారు. విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత పక్షం రోజులకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

ఎన్నికల కోడ్‌ విడుదలయ్యే లోపు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేసేస్తున్నామని చెప్పినా అవి బటన్‌ నొక్కడానికి పరిమితం అయ్యాయి. ప్రభుత్వ ఖజానాలో సరిపడా నిధులు ఉన్నా వాటిని విద్యార్థులకు చెల్లించలేదు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన నిధులను విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్టు చెప్పారు.

జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను మార్చి 1న విడుదల చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు వసతి దీవెన నిధులు కూడా విడుదల చేస్తున్నట్టు జగన్ చెప్పుకున్నారు.

ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో వసతిదీవెన ఫీజులను రియింబర్స్ చేస్తున్నారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసిందని చెప్పారు.

ఎన్నికల కోడ్‌తో ఆగిన పంపిణీ..

విద్యాదీవెన బటన్‌ నొక్కినా తల్లుల ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో ఇప్పుడు ఫీజులు కట్టాలని కాలేజీలు విద్యార్ధులపై కొన్నినెలలుగా ఒత్తిడి చేస్తున్నాయి. కోర్సులు పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్ధులకు పోస్ట్‌ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ బకాయిలను చెల్లించకుండానే ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులను ఎన్నికలకు షెడ్యూల్ రావడానికి ముందే విడుదల చేసినా డబ్బులు మాత్రం విద్యార్ధుల ఉమ్మడి ఖాతాలకు చేరలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను 2019కు ముందున్న పేర్లుగా మార్చింది.

రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటి సదుపాయాలు, ఫ్యాకల్టీ, రేటింగులను బట్టి ఫీజులు ఉన్నాయి. మంచి కాలేజీల్లో సగటున రూ.77వేల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా మొదటి విడతగా రూ.19వేలు మాత్రమే విద్యార్ధుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన ఫీజు చెల్లించకపోతే డిగ్రీ అర్హత పత్రాలను జారీ చేయమని, మిగిలిన వారిని పరీక్షలకు హాజరు కానివ్వమని కాలేజీలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఇలా ఫీజు రియింబర్స్‌మెంట్ ద్వారా చదువుకుంటున్న విద్యార్ధులు దాదాపు పదిలక్షల మంది ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు.. అంటే పెద్ద చదువులు చదువుతున్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేశామని జగన్ చెప్పుకున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.3500కోట్లను బకాయిలుగా చెల్లించాల్సి ఉంది. వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ, రాజకీయాలంటే వ్యాపారం కాదంటూ జగన్‌పై తీవ్ర ఆరోపణలు

వైసీపీ నాయకురాలు, మాజీ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు వాసిరెడ్మి పద్మ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. జగ్గయ్యపేట నియోజక వర్గ బాధ్యతలు అప్పగించకపోవడంపై కినుక వహించిన వాసిరెడ్డి పద్మ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు
వైఎస్సార్సీపీ రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ

ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ వైయస్ఆర్ సీపీకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ ‘గుడ్ బుక్’ , ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “ గుండె బుక్ ” అని వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదని పేర్కొన్నారు. జీవితాలు , ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు ‘గుడ్ బుక్’ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారని ఆరోపించారు.

పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యత లేదని పరిపాలన చేయడంలో బాధ్యత లేదని సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని మండిపడ్డారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందని లేఖలో పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశానని చెప్పారు. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మధనం చెంది YCPను వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన వాసిరెడ్డి పద్మ గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా వెలుగులోకి వచ్చారు. వైఎస్సార్పీపీ స్థాపించిన తర్వాత ఆ పార్టీ మహిళా నాయకురాలిగా ఎదిగారు. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలని భావించినా సాధ్యపడలేదు. జగ్గయ్యపేటలో పోటీ చేసిన సామినేని ఉదయభాను ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేనలో చేరిపోయారు. నియోజక వర్గం బాధ్యతలు ఆశించిన వాసిరెడ్డి పద్మకు నిరాశ తప్ప లేదు. జగ్గయ్యపేట బాధ్యతలు తన్నీరు నాగేశ్వరరావుకు అప్పగించడంపై ఆమె కినుక వహించినట్టు తెలుస్తోంది.

వైఎస్ ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు – సోదరి, తల్లిపై NCLTలో జగన్ పిటిషన్, కారణమిదే…

వైఎస్ జగన్ కుటుంబంలో ఆస్తి పంపకాలు తెరపైకి వచ్చాయి. న్యాయపరంగా ముందుకెళ్లే దిశగా వైఎస్ జగన్ అడుగు ముందుకేశారు. సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లపై వివాదం నెలకొంది .
వైఎస్ షర్మిలపై జగన్ పిటిషన్

గత కొంతకాలంగా వైఎస్ ఫ్యామిలీలో విబేధాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా సోదరి వైఎస్ షర్మిల… కాంగ్రెస్ లోచేరారు. సోదరుడిపై తీవ్రస్థాయిలో రాజకీయపరంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆస్తి పంపకాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే… తాజాగా ఓ కంపెనీ షేర్ల విషయంలో వివాదాలు తెరపైకి వచ్చాయి. ఏకంగా సోదరుడు వైఎస్ జగన్… నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో కూడా పిటిషన్ వేశారు. దీంతో వైఎస్ ఫ్యామిలిలో విబేధాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

NCLTలో జగన్ పిటిషన్…!

తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతిలు పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల కేటాయింపుపై వివాదం నెలకొంది. దీంతో జగన్.. NCLTను ఆశ్రయించారు. సెప్టెంబర్ 10న ఎన్‌సిఎల్‌టిలో జాబితా చేయబడిన ఈ కేసు… కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద దాఖలు చేయబడింది.

ఈ కేసులో సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిల రెడ్డి, వైఎస్ విజయమ్మ, చగరి జనార్థన్ రెడ్డి, యశ్వనాథ్ రెడ్డి కేతిరెడ్డితో పాటు రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెన్స్ తెలంగాణ పేర్లను ప్రతివాదులుగా చేర్చారు.

సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ వృద్ధిలో తమ పాత్ర కీలకంగా ఉందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. షర్మిలకు వాటాలు కేటాయించేందుకు తాము 2019 ఆగస్టు 21న అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశామని తెలిపారు. అయితే… వాటా కేటాయింపు ఇప్పటికీ ఖరారు కాలేదని… ఇది ప్రస్తుత వివాదానికి దారి తీసిందని పిటిషన్ లో ప్రస్తావించారు.

తన సోదరి వైఎస్ షర్మిలకు మొదట్లో వాటాలు కేటాయించాలని భావించామని జగన్ తన పిటిషన్ లో వివరించారు. అయితే ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. ఈ కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని.. తన సోదరి, తల్లి షేర్ల బదిలీని రద్దు చేయాలని ఎన్‌సీఎల్‌టీని జగన్, భారతి అభ్యర్థించారు.

పిటిషన్ ను స్వీకరించిన NCLT… ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8, 2024కి షెడ్యూల్ చేసింది. ఈ కేసు దాఖలు నేపథ్యంలో… సరస్వతి పవర్ మరియు ఇండస్ట్రీస్‌పై మాత్రమే కాకుండా వైఎస్ కుటుంబంలోని విబేధాలకు మరింత ఆజ్యం పోసినట్లు అయిందన్న చర్చ వినిపిస్తోంది.

మీ బండికి ఏ ఇంజిన్ ఆయిల్ మంచిదో తెలుసుకోండి. ప్యాకేజీ పై ఉన్న నంబర్లకు అర్థమేంటి

మీ వాహనానికి ఎక్కువ జీవితకాలం ఇవ్వడానికి సరైన ఇంజిన్ ఆయిల్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇంజిన్ ఆయిల్స్ లో మినరల్ ఆయిల్స్, సెమీ సింథటిక్ ఆయిల్స్, సింథటిక్ ఆయిల్స్ ఉంటాయి. వీటిలో మీ వాహనానికి సరిపోయే ఇంజిన్ ఆయిల్ ను తెలుసుకోవాలి.

ఇంజిన్ ఆయిల్ మీ వాహనం ఇంజన్ జీవితకాలాన్ని పెంచుతుంది. మీ వాహనం పని తీరును మెరుగుపరుస్తుంది. ఇంజిన్ ఆయిల్ ప్రధాన పని ఇంజిన్ లోపల కదిలే భాగాలను కందెనగా ఉపయోగపడడం. కాంపోనెంట్ ల మధ్య ఘర్షణను తగ్గించడం. అందువల్ల మీ వాహనానికి ఉద్దేశించిన సరైన రకం ఇంజిన్ ఆయిల్ ను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

ఎన్ని రకాలు? ఎన్ని గ్రేడ్ లు..

వివిధ రకాలైన ఇంజిన్ ఆయిల్ లను, వివిధ గ్రేడ్ ల ఆయిల్ ల ఉపయోగాలను అర్థం చేసుకోవడం వల్ల సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలు అవుతుంది. సాంప్రదాయ మినరల్ ఇంజన్ ఆయిల్ లు పాత వాహనాలకు బాగా పనిచేస్తాయి. కానీ సెమీ-సింథటిక్, సింథటిక్ నూనెలు కొత్త లేదా అధిక-పనితీరు ఇంజిన్లకు ఎక్కువ రక్షణను అందిస్తాయి. మీ ఇంజిన్ ను ఉత్తమంగా ఉంచడానికి మీ వాహనం అవసరాల కోసం తెలుసుకోవడం కోసం యూజర్ మాన్యువల్స్ ను ఎల్లప్పుడూ అనుసరించండి.
ఇంజిన్ ఆయిల్: రకాలు
సంప్రదాయ (మినరల్) ఆయిల్

ఇది అందుబాటులో ఉన్న అత్యంత ప్రాథమిక ఇంజిన్ ఆయిల్. దీనిని ముడి చమురు నుండి శుద్ధి చేస్తారు. కారు పూర్తి సామర్థ్యంతో పనిచేయాల్సిన అవసరం లేని పాత కార్ మోడళ్లకు ఇది అనుకూలంగా ఉంటుంది. సాంప్రదాయ మినరల్ ఆయిల్ ధర కూడా తక్కువగా ఉంటుంది. కానీ తీవ్రమైన ఉష్ణోగ్రతలలో లేదా విభిన్న ఉష్ణోగ్రతలతో లేదా, సుదీర్ఘ రోడ్డు ప్రయాణాల్లో ఇది బాగా పనిచేయదు.

సింథటిక్ బ్లెండ్ ఆయిల్

ఈ ఇంజిన్ ఆయిల్ సింథటిక్, సంప్రదాయ నూనెల మిశ్రమం. ఇది సింథటిక్ ఆయిల్ ఇచ్చే కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది. దీని ధర మధ్యస్తంగా ఉంటుంది. ఈ రకం నూనె సగటు వినియోగదారుడికి మంచి ఎంపిక అవుతుంది. సాంప్రదాయ నూనె కంటే మెరుగైన రక్షణను కోరుకునేవారికి, సింథటిక్ ఆయిల్ ఖరీదైనదని భావించే వారికి ఇది మంచి ఎంపిక.
సింథటిక్ ఆయిల్

సింథటిక్ ఆయిల్ మీ వాహనానికి ఉత్తమ రక్షణ అందిస్తుంది. మీ వాహనం పనితీరు చాలా మెరుగుపడుతుంది. ఇది పూర్తిగా రసాయనికంగా రూపొందించబడింది. సింథటిక్ ఆయిల్ ను చల్లని ఉష్ణోగ్రతలలో మరింత సులభంగా ప్రవహించేలా, అధిక ఉష్ణోగ్రతల వద్ద విచ్ఛిన్నం కాకుండా, ఘర్షణను నిరోధించేలా రూపొందించారు. సింథటిక్ ఆయిల్ కొత్త ఇంజిన్లు, అధిక పనితీరు కలిగిన కార్లు, ట్రక్కులు, తీవ్రమైన వాతావరణంలో ప్రయాణించే వాహనాలకు అనువైనవి. ఈ రకమైన నూనె ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. కాని దీని ధర ఎక్కువగా ఉంటుంది.
ఇంజిన్ ఆయిల్: గ్రేడ్లు అంటే ఏమిటి?

ఇంజిన్ ఆయిల్ (Engine oil) కంటైనర్లపై ‘5W-30’ వంటి అంకెలు, అక్షరాలను మీరు బహుశా చూసి ఉంటారు. ఈ సంఖ్యలు ఆ ఆయిల్ గ్రేడ్ ను సూచిస్తాయి, ఇది దాని స్నిగ్ధత (viscosity), వివిధ ఉష్ణోగ్రతలలో దాని పనితీరును వివరిస్తుంది.

స్నిగ్ధత (viscosity)

స్నిగ్ధత అనేది వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఆయిల్ ఎంత సులభంగా ప్రవహిస్తుందో సూచిస్తుంది. మందపాటి నూనె అంత సులభంగా ప్రవహించదు కాని కదిలే భాగాలకు ఎక్కువ రక్షణను అందిస్తుంది. అయితే సన్నని నూనె సులభంగా ప్రవహిస్తుంది కాని అరుగుదలకు తక్కువ నిరోధకతను అందిస్తుంది.
సంఖ్యలు (ఉదా. 5W-30)

మొదటి సంఖ్య (5W): “W” అంటే శీతాకాలం. ఈ సంఖ్య చల్లని ఉష్ణోగ్రతలలో నూనె ఎలా ప్రవహిస్తుందో సూచిస్తుంది. సంఖ్య ఎంత తక్కువగా ఉంటే, నూనె సన్నగా ఉంటుంది మరియు చల్లని వాతావరణంలో ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ఉదాహరణకు, 10 వాట్ ఆయిల్ కంటే 5 వాట్ ఆయిల్ శీతాకాలంలో బాగా ప్రవహిస్తుంది.

రెండవ సంఖ్య (30): ఈ సంఖ్య సాధారణ ఇంజిన్ ఆపరేటింగ్ ఉష్ణోగ్రతల వద్ద (సుమారు 100°C లేదా 212°F) ఆయిల్ ఎలా ప్రవహిస్తుందో సూచిస్తుంది. ఈ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, నూనె అధిక ఉష్ణోగ్రతల వద్ద మందంగా ఉంటుంది. ఉదాహరణకు, 30-బరువు నూనె 40-బరువు నూనె కంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద సన్నగా ఉంటుంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా ధర పెరిగింది.. కొత్త ధరల వివరాలు ఇవే.

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఈ ఏడాది ప్రారంభంలో తన లైనప్ లోకి కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్నోవా క్రిస్టా జీఎక్స్ ప్లస్ వేరియంట్ల ధరలను పెంచింది. ఇతర వేరియంట్లైన జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్ ధరలు ప్రస్తుతానికి మారలేదు.

టయోటా ఇన్నోవా క్రిస్టా ఎంపిక చేసిన వేరియంట్ల ధర స్వల్పంగా (price hike) పెరిగింది. టయోటా ఇన్నోవా క్రిస్టా జిఎక్స్ ప్లస్ వేరియంట్ల ధరలను రూ. 10 వేల వరకు పెంచింది. ఇతర వేరియంట్లైన జి, జిఎక్స్, విఎక్స్, జెడ్ఎక్స్ ధరలు ప్రస్తుతానికి మారలేదు. టయోటా ఇన్నోవా క్రిస్టా ధర రూ .19.99 లక్షల నుండి రూ .26.55 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా ధర పెంపు

తక్షణమే వర్తించే ధరతో, టయోటా ఇన్నోవా క్రిస్టా జిఎక్స్ ప్లస్ ఇప్పుడు ఏడు సీట్ల వెర్షన్ ధర రూ .21.49 లక్షలకు లభిస్తుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా జిఎక్స్ + ఎనిమిది సీట్ల ధర రూ .21.54 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఇతర మార్పులేమీ లేవు.
టయోటా ఇన్నోవా క్రిస్టా జిఎక్స్ ప్లస్: ప్రత్యేకతలు

టయోటా ఇన్నోవా క్రిస్టా జిఎక్స్ ప్లస్ మరింత విలాసవంతమైన రూపాన్ని ఇవ్వడానికి ప్రత్యేక ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అప్ గ్రేడ్ లను తీసుకువచ్చింది. మిడ్-స్పెక్ వేరియంట్ సిల్వర్ సరౌండ్ పియానో బ్లాక్ గ్రిల్, 17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్స్ తో వస్తుంది. సిల్వర్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, అవంట్ గార్డ్ బ్రాంజ్ మెటాలిక్, సూపర్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఇన్నోవా క్రిస్టా 148బిహెచ్ పి పవర్, 343ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 2.4-లీటర్ డీజల్ ఇంజన్ తో మాత్రమే లభిస్తుంది. కియా కారెన్స్, మారుతి సుజుకి ఎర్టిగా వంటి ప్రత్యక్ష ప్రత్యర్థులు, మహీంద్రా ఎక్స్ యువి 700, టాటా సఫారీ వంటి మల్టీ-సీటర్ ఎస్ యూవీ (SUV) లతో ఈ ఎంపీవీ పోటీ పడుతోంది.

టయోటా ఫెస్టివ్ సీజన్ స్పెషల్ ఎడిషన్లు

టయోటా ఇన్నోవా క్రిస్టా భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీ. టయోటా ఇన్నోవా క్రిస్టాపై ధరలను పెంచినప్పటికీ, పండుగ స్పెషల్ ఎడిషన్ కోసం గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైసర్, రుమియాన్, అర్బన్ క్రూయిజర్ హైదర్ పండుగ ఎడిషన్లలో మరింత సరసమైన శ్రేణిలో ప్రత్యేక ఎడిషన్లను కూడా టయోటా (toyota) విడుదల చేసింది.

మీరు ఊర్లోనే ఉంటే తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేసేందుకు 40 ఐడియాలు

చాలా మందికి సొంత ఊర్లో ఉండాలనే కోరిక ఉంటుంది. అలాంటివారు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం బెస్ట్. అక్కడే బాగా సంపాదించొచ్చు. మీ కోసం 40 బిజినెస్ ఐడియాలు ఉన్నాయి.

అప్పుడప్పుడు కొన్ని వార్తలు వింటుంటాం. లక్షల్లో జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ఊర్లో డైరీ ఫామ్ నడుపుతున్నారు అని. చాలా మందికి ఇలా సొంత ఊర్లో ఏదో ఒక పని చేసుకోవాలని ఉంటుంది. అలాంటివారు ధైర్యం చేసి ముందడుగు వేస్తే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు.

మీరు గ్రామీణ ప్రాంతంలో విజయవంతమైన చిన్న వ్యాపార ఆలోచనల కోసం చూస్తున్నట్లయితే ఈ సమాచారం కచ్చితంగా మీకు సహాయం చేస్తుంది. భారతదేశంలో ఇప్పటికీ అత్యధిక జనాభా గ్రామాలల్లో ఉన్నారు. పట్టణ ప్రాంతాలకు భిన్నంగా గ్రామాలకు వాటి స్వంత మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయంపై ఆధారపడే ఊర్లోలోనూ మీరు బిజినెస్ చేయవచ్చు. గ్రామంలో స్థిరపడిన వ్యక్తి అక్కడే వ్యాపారం ప్రారంభించడం లాభదాయకంగా ఉంటుంది. మీరు నివసిస్తున్న ప్రాంతంలో చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి తక్కువ తక్కువ పెట్టుబడి అవసరం. ప్రతి ఒక్కరూ తెలిసిన వ్యక్తులే కాబట్టి అక్కడ వ్యాపారాన్ని నిర్వహించడం కూడా సులభం అవుతుంది. నోటి మాటల ద్వారా మీకు పబ్లిసిటీ కూడా వస్తుంది.

జనాభాలో 70 శాతం కంటే ఎక్కువ మంది గ్రామాలు, చిన్న పట్టణాలలో నివసిస్తున్నారు. మీరు చేసే వ్యాపారం అందరికి అవసరాన్ని తీర్చేలా ఉండాలి. అప్పుడు మీ బిజినెస్ బాగా జరుగుతుంది. గ్రామాలు కూడా ఇప్పుడు అప్డేట్ అయ్యాయి. దానికి తగ్గట్టుగా మీ వ్యాపారం ప్లాన్ చేసుకోవాలి. గ్రామాల్లో చేసేందుకు 40 ఉత్తమ వ్యాపార ఆలోచనలను చూద్దాం.

సోలార్ పవర్ ప్రొడక్ట్స్
మెుబైల్ రిపేర్ షాప్
బాంబూ ప్రొడక్ట్స్
హర్టికల్చర్ బిజినెస్
ఆర్గానిక్ ఫార్మింగ్
తేనె టీగల పెంపకం
పుట్టుగొడుగుల ఫార్మింగ్
హైడ్రోపోనిక్ ఫార్మింగ్(మట్టి లేకుండా నీరు, సూక్ష్మ పోషకాలతో ఆకుకూరలు, ఇతర పంటలు పెంచే పద్ధతి)
పచ్చళ్ల తయారీ
బెల్లం తయారీ
స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్
వర్మీ కంపోస్ట్ అమ్మకం
డైరీ ఫార్మ్
అగ్రో టూరిజం
చేపల పెంపకం
మెుక్కల పెంపకం
ఆయుర్వేద మెుక్కల పెంపకం
పిండి మిల్లు
కోళ్ల పెంపకం
వ్యవసాయ పనిముట్ల అమ్మకం
అప్పాడాలు, స్నాక్స్ బిజినెస్
వాటర్ సప్లై బిజినెస్
జనరల్ స్టోర్
హ్యండీక్రాఫ్ట్ బిజినెస్
వ్యవసాయ సంబంధిత మెషినరీ అమ్మకాలు
రవాణా సౌకర్యానికి వాహనాలు
రైస్ మిల్లు
కారం పొడి అమ్మకం
కోళ్ల దాన అమ్మకాలు
టైలరింగ్
మేకల పెంపకం
బెకరీ బిజినెస్
నూనె ఉత్పత్తి
ఇటుకల తయారీ
జూట్ బ్యాగుల తయారీ
పూల పెంపకం
విత్తనాల ఉత్పత్తి
ఆర్గానిక్ సబ్బుల తయారీ
రూరల్ కోచింగ్ సెంటర్

మీరు ఇష్టపడేవాళ్లకు క్రెడిట్‌ కార్డ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి, పండుగ సంతోషాన్ని పెంచండి

చాలా బ్యాంకుల ద్వారా ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. దీంతోపాటు, ప్రి-పెయిడ్‌ కార్డ్‌ను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.

ఇష్టమైన వాళ్లకు ఇచ్చేందుకు బోలెడు

బహుమతులు ఉన్నాయి. అందునా, పండుగ సమయంలో ఇచ్చే బహుమతులు మరింత పసందుగా ఉంటాయి. ప్రస్తుతం, ఫెస్టివ్‌ గిఫ్ట్స్‌లో (Festive gifting) లెక్కలేనన్ని ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం సరైన బహుమతిని కనిపెట్టడంలో చాలా మంది కష్టపడుతుంటారు. మీరు విభిన్నంగా ఆలోచించి, క్రెడిట్ కార్డ్ రూపంలో ప్రత్యేకమైన బహుమతిని ఇవ్వండి. ఇది, మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా పెంచుతుంది.

మీరు మీ పేరిట ఉన్న క్రెడిట్‌ కార్డ్‌ను ఇంకొకరికి ఇవ్వకూడదు. లేదా, మీ క్రెడిట్ కార్డ్‌ను వేరొకరికి బదిలీ చేయలేరు. కానీ, మీ క్రెడిట్‌ కార్డ్‌లో ఉన్న అన్ని సౌలభ్యాలను వినియోగించుకునేలా యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.

యాడ్-ఆన్ కార్డ్ అంటే?
చాలా బ్యాంకులు, కస్టమర్‌ క్రెడిట్ కార్డ్ ఖాతాలో జీవిత భాగస్వామిని, పిల్లలు (18 ఏళ్లు పైబడినవారు) లేదా తల్లిదండ్రులు వంటి కుటుంబ సభ్యులను యాడ్‌ చేసుకోవడానికి అనుమతిస్తాయి. వీరిని యాడ్-ఆన్ కార్డ్‌హోల్డర్‌లు అంటారు. యాడ్-ఆన్ కార్డ్‌హోల్డర్‌ల పేరిట ప్రత్యేక క్రెడిట్‌ కార్డ్‌ వస్తుంది. ఇది, ప్రైమరీ కార్డ్‌హోల్డర్‌ ఖాతాతో ముడిపడి ఉంటుంది.

— యాడ్-ఆన్ కార్డ్‌హోల్డర్‌ చేసే అన్ని లావాదేవీలకు ప్రాథమిక కార్డ్‌హోల్డర్‌ బాధ్యత వహిస్తారు.
— క్రెడిట్ పరిమితి ప్రైమరీ & యాడ్-ఆన్ కార్డ్ మధ్య షేర్‌ అవుతుంది. దీని అర్థం.. ప్రాథమిక కార్డ్ మొత్తం క్రెడిట్ పరిమితికి మించి యాడ్-ఆన్ కార్డ్‌హోల్డర్లు కొనుగోళ్లు చేయలేరు.
— యాడ్-ఆన్ కార్డ్‌ విషయంలో రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్, బీమా కవరేజ్ వంటి అన్ని బెనిఫిట్స్‌ ప్రైమరీ కార్డ్ లాగానే ఉంటాయి.

యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
సాధారణంగా, బ్యాంకులు యాడ్-ఆన్ కార్డ్‌లను జారీ చేస్తాయి. మీరు కార్డ్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న వ్యక్తికి బ్యాంక్‌ నిర్దేశించిన అన్ని అర్హతలు ఉన్నయో, లేవో ముందుగా చెక్‌ చేయాలి. యాడ్-ఆన్ కార్డ్‌ పొందే అన్ని అర్హతలు ఉంటే, దాని కోసం ప్రైమరీ కార్డ్‌హోల్డర్‌ దరఖాస్తు చేయాలి. బ్యాంక్‌ మొబైల్ యాప్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, బ్రాంచ్‌కు వెళ్లి అప్లై చేయొచ్చు. మీరు బ్రాంచ్‌కు వెళితే… యాడ్-ఆన్ కార్డ్‌హోల్డర్‌ ID రుజువు, చిరునామా రుజువు, ఫోటో వంటి అవసరమైన పత్రాలు తీసుకెళ్లండి. ప్రాథమిక కార్డ్‌హోల్డర్‌ అర్హత, క్రెడిట్ స్కోర్‌లను బట్టి బ్యాంకులు కొన్నిసార్లు ముందస్తుగా ప్రి-అప్రూవ్డ్‌ యాడ్-ఆన్ కార్డ్‌లను అందిస్తాయి. ఇలాంటి కేస్‌లో ప్రాసెస్‌ అతి వేగంగా పూర్తవుతుంది.

అప్లికేషన్‌ను బ్యాంక్‌ ఆమోదిస్తే, మీరు యాడ్‌ చేసిన వ్యక్తి పేరు మీద బ్యాంక్ యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌ని జారీ చేస్తుంది. ఈ కార్డ్‌ను యాడ్‌-ఆన్‌ కార్డ్‌హోల్డర్‌ స్వతంత్రంగా ఉపయోగించుకోవచ్చు. ఆ బిల్లు ప్రైమరీ కార్డ్‌హోల్డర్‌ ఖాతాకు యాడ్‌ అవుతుంది.

ప్రి-పెయిడ్‌ కార్డులు (Prepaid Cards)
గిఫ్ట్‌గా ఇవ్వదగిన వాటిలో ఇదొక టైప్‌. ఈ కార్డ్‌లో ముందుగానే బ్యాలెన్స్‌ లోడ్‌ ‍‌(pre-loaded balance) చేస్తారు. దీనిలో బ్యాలెన్స్‌ ఉన్నంతవరకు ఖర్చు చేసుకోవచ్చు. ప్రి-లోడెడ్ బ్యాలెన్స్‌తో వస్తుంది కాబట్టి దీనిపై ఎలాంటి వడ్డీ ఛార్జీలు లేదా పెనాల్టీలు ఉండవు. అంతేకాదు, పరిమితికి మించి ఖర్చు పెట్టే ప్రమాదంమూ లేదు. ప్రి-పెయిడ్‌ కార్డ్‌లను చాలా షాపులు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఆమోదిస్తారు.

ప్రి-పెయిడ్‌ కార్డ్‌ను ఎలా బహుమతిగా ఇవ్వాలి? (How to Gift a Prepaid Card?)
ప్రి-పెయిడ్‌ కార్డ్‌ను బహుమతిగా ఇవ్వాలంటే, ముందుగా, దానిని ఒక బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి కొనుగోలు చేయాలి. మీకు ఇష్టం వచ్చినంత డబ్బును ఆ కార్డ్‌లో లోడ్ చేయొచ్చు. ఆ కార్డ్‌ను మీకు ఇష్టమైనవారికి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ప్రి-పెయిడ్‌ కార్డులను వాడడం చాలా ఈజీ. పైగా, భద్రతను & నగదు రహిత లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తాయి.

దీపావళి స్పెషల్ స్వీట్స్.. సింపుల్​గా ఇంట్లో చేసుకోగలిగే రెసిపీలు

దీపావళికి రోటీన్​కి భిన్నంగా, స్పెషల్​గా ఏ స్వీట్స్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే సింపుల్​గా ఇంట్లో చేసుకోగలిగే స్వీట్స్ రెసిపీలు ఇక్కడున్నాయి ట్రై చేయండి.

దీపావళి (Diwali 2024) సమయంలో స్వీట్స్​ని ఎక్కువగా చేసుకుంటారు. ఒకరికొకరు ఇచ్చుకోవడంతో పాటు.. ఇంట్లో వారి కోసం ట్రెడీషనల్ స్వీట్స్ చేస్తారు. అయితే కొన్ని ఫేమస్​ స్వీట్స్​ని ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీ స్వీట్స్​ని పండుగ సమయంలో తక్కువ సమయంలో ఎలా చేసుకోవచ్చో.. సింపుల్ రెసిపీలు, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బాదం హల్వా

ముందుగా బాదం పప్పులను నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి. వాటిపై ఉన్న తొక్కను తీసి.. మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. పాన్ పెట్టాలి. దానిలో పాలు వేసి.. అవి కాస్త వేడి అయిన తర్వాత దానిలో బాదం పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ చిక్కగా మారేవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దానిలో పంచదార వేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకుని.. చివర్లో కుంకుమ పువ్వు వేసుకుని కలపాలి. నెయ్యి వేసి.. అది పూర్తిగా హల్వాలో మిక్స్​ అయ్యేవరకు ఉంచుకోవాలి. ఇది చిక్కగా మారిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. బాదం పలుకులు వేస్తే బాదం హల్వా రెడీ.
గులాబ్ జామున్

గులాబ్ జామున్​ని పండుగల సమయంలోనే కాకుండా రెగ్యూలర్​గా కూడా చేసుకోవచ్చు. దీపావళి సమయంలో ఇవి కూడా కచ్చితంగా ఉంటాయి. అయితే వీటిని తయారు చేయడం చాలా సింపుల్. గులాబ్ జామున్​ పౌడర్ తీసుకుని.. దానిలో చిటికెడు ఉప్పు వేసి పాలతో కలుపుకోవాలి. దీనిని నీటితో కూడా చేసుకోవచ్చు. కానీ పాలతో కలిపితే మంచి రుచి వస్తుంది. పిండిని ముద్దగా చేసుకోవాలి. ఇలా చేసిన

పిండిని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అనంతరం చిన్న చిన్న బాల్స్​గా చేసుకోవాలి.
డీప్​ ఫ్రై కోసం నూనెని వేడి చేసుకోవాలి. మరో స్టౌవ్​పై షుగర్​ సిరప్​ని సిద్ధం చేసుకోవాలి. దానిలో యాలకుల పొడి వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత.. ముందుగా చేసుకున్న బాల్స్ వేసుకోవాలి. అవి కలర్ మారి ముదురు గోధుమరంగులోకి వచ్చిన తర్వాత షుగర్ సిరప్​లో వేసుకోవాలి. వాటిని ఓ గంటపాటు పక్కన పెట్టేస్తే.. సిరప్​ గులాబ్ జామున్స్​ లోపలికి బాగా వెళ్తుంది. అంతే టేస్టీ గులాబ్​ జామున్స్​ రెడీ.

కొబ్బరి లడ్డూలు

దాదాపు ప్రతి పండుగ సమయంలో కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు. దీపావళికి కూడా వీటిని ఎక్కువమంది చేసుకుంటారు. ముందుగా స్టౌవ్ వెలిగించి పాన్​ పెట్టాలి. దానిలో నెయ్యి వేసి.. తురిమిన కొబ్బరి వేసుకోవాలి. ఇది కాస్త రంగు మారి.. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో కాచిన పాలు, పంచదార వేసి కలపాలి. యాలకుల పొడి వేసుకుని.. మిశ్రమం చిక్కబడేవరకు ఉడికించుకోవాలి. పాలు కొబ్బరిలో కలిసి చిక్కబడుతుంది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి. వీటిని డ్రై ఫ్రూట్స్ తురుముతో గార్నీష్ చేసుకోవచ్చు.

మైసూర్ పాక్​

మైసూర్​ పాక్​ని ఒక్కోక్కరు ఒక్కోలా చేస్తారు. దానిలో ఇది కూడా ఓ మంచి రెసిపీనే. అదేంటంటే ముందుగా స్టౌవ్ వెలిగించి దానిలో నెయ్యి వేయాలి. అది వేడి అయిన తర్వాత శనగపిండి వేసి.. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలోని పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు దానిలో పంచదార, యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు వేసుకుంటూ.. పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత పిండి స్మూత్​గా, క్రీమీగా మారుతుంది. అప్పుడు స్టౌవ్ ఆపేసి.. నెయ్యిని రాసిన ప్లేట్​లో ఈ పిండిని వేసి.. పరచుకోవాలి. నచ్చిన షేప్​లలో కట్ చేసుకోవాలి. అంతే టేస్టీ మైసూర్ పాక్ రెడీ.

ఇవే కాకుండా ఎన్నో స్వీట్స్, వివిధ రకాల హాట్, క్రిస్పీ వంటకాలు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే మీ రెసిపీలతో పాటు.. ఈ సింపుల్ స్వీట్స్​ను కూడా చేసేయండి.

కార్ కొనాలనుకుంటున్నారా? ఇలా చేస్తే EMI భారం తగ్గించుకోవచ్చు

మనలో చాలా మందికి కూడా కార్ కొనాలని ఆశ ఉంటుంది. కార్ అనేది బైక్ తో పోల్చుకుంటే చాలా సేఫ్. కార్ లో వెళ్ళే వారికి పెద్దగా యాక్సిడెంట్స్ జరగవు. ఒకవేళ జరిగినా 70 పర్సెంట్ ప్రాణాలతో బయట పడతారు. మరీ మేజర్ యాక్సిడెంట్స్ అయితే తప్ప పెద్దగా ప్రాణాపాయం ఉండదు. ఎండ, వాన ఇలా ఏ కాలంలో అయినా కారులో మనం చాలా కంఫర్ట్ గా ప్రయాణించవచ్చు. చక్కగా లాంగ్ డ్రైవ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చు. ఇన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కాబట్టే కార్ అంటే అందరికీ చాలా ఇష్టం. అయితే కార్ మెయింటెనెన్ చేయాలంటే చాలా కష్టం. దాని ఖర్చులు భరించాలంటే ఖచ్చితంగా చుక్కలు కనపడతాయి. కంఫర్ట్ సంగతి ఏమో కానీ ఖర్చు మాత్రం ఎక్కువ అవుతుంది. అయితే కార్ మెయిన్టెనెన్స్ ఖర్చు లని ఒక టిప్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. EMI భారం తగ్గించుకోవచ్చు. సొ ఆ టిప్ ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కార్ ని వాడే వారికి దాని ఖర్చులను తగ్గించుకోవడానికి ఒక రూల్ ఉంది. ఆ రూల్ పేరే 20:10:4. మీ కార్ పై ఈ రూల్ అప్లై చేశారంటే మీ కార్ ఖర్చులను బాగా తగ్గించుకోవచ్చు. ఈ రూల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే ముందుగా 20 గురించి మాట్లాడుకుందాం.. 20:10:4 లో 20 అంటే 20% .. అంటే మీరు కార్ ని EMI ద్వారా కొనలనుకుంటే ఆ కార్ ఎక్స్ షో రూమ్ ధరలో 20% డౌన్ పేమెంట్ కట్టేలా ప్లాన్ చేసుకోండి. అది కూడా ఎక్కడా అప్పు చేయకుండా మీరు సేవ్ చేసుకున్న డబ్బుతోనే డౌన్ పేమెంట్ కట్టుకోవాలి. అంత సంపాదన ఉంటే మాత్రమే కారుని కొనుక్కోండి. సపోజ్ కార్ ఎక్స్ షోరూం ప్రైజ్ 10 లక్షలు అనుకుందాం. అందులో 20 % అంటే 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకోండి. 20 % కంటే తక్కువ డౌన్ పే మెంట్ అస్సలు కట్టొద్దు. చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా దాని ధరలో 20% డౌన్ పేమెంట్ కట్టుకునేలా ప్లాన్ చేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకోవడం వలన మీకు EMI భారం తగ్గుతుంది.

ఇక 20:10:04 లో 10 అంటే .. 10%.. అంటే మనం కార్ కొన్నాక దాని మెయింటెనెన్స్ ఖర్చులు మామూలుగా ఉండవు. అయితే ఈ రూల్ ఫాలో అయితే ఆ ఖర్చులను తగ్గించుకోవచ్చు. సపోజ్ మీ జీతం లక్ష రూపాయలు అనుకుందాం. ఆ లక్ష రూపాయల జీతంలో కేవలం 10 % మాత్రమే మీ కార్ మెయింటెనెన్స్ కి ఖర్చు అయ్యేలా చూసుకోండి. లక్షలో 10% అంటే 10 వేలు. సో మీ శాలరీ నెలకు లక్ష రూపాయలు అయితే అందులో 10 వేలు మాత్రమే ప్రతి నెల కార్ ఖర్చులకు పెట్టండి. అంటే పెట్రోల్, సర్విస్ ఖర్చులు అనమాట. మీ శాలరీ ఎంతైనా కానీ అందులో కేవలం 10% మాత్రమే ప్రతినెలా కార్ మెయింటెనెన్స్ కి ఖర్చు చెయ్యండి. ఇక 20:10:4 లో 04 అంటే .. 4 సంవత్సరాలు.. మీరు EMI లో కార్ కొంటె దానికి టెన్యూర్ 4 సంవత్సరాలకు మించి దాటకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. 4 సంవత్సరాల టెన్యూర్ పెట్టుకుంటే మీకు EMI భారం ఈజీగా తగ్గుతుంది. ఇలా మీరు 20:10:4 రూల్ తో మీ కార్ EMI భారాన్ని సింపుల్ గా తగ్గించుకోవచ్చు.

ఎయిర్ పోర్టులో 1066 ఉద్యోగాలు

మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? జాబ్ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నారా? జాబ్ కొట్టడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్ పోర్టులో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇంకా నిరుద్యోగులుగా ఎంతకాలం ఉంటారు. ఈ పోస్టులకు ట్రై చేయండి. ఎయిర్ పోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కళ్లు చెదిరే జీతం అందుకోవచ్చు. ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఏకంగా 1066 పోస్టులు సిద్ధంగా ఉన్నాయి. ఏఐ ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పలు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22 నుంచి 26 వరకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

మొత్తం 1066 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ టెర్నినల్ మేనేజర్, డ్యూటీ మేనేజర్, డ్యూటీ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్, ర్యాంప్ మేనేజర్, డిప్యూటీ ర్యాంప్ మేనేజర్, డ్యూటీ మేనేజర్, జూనియర్ ఆఫీసర్, డిప్యూటీ టెర్మినల్ మేనేజర్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వంటి పలు విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు పోస్టులను అనుసరించి టెన్త్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 28-55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ ఉద్యోగాలకు ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైతే పోస్టులను అనుసరించి నెలకు 27 వేల నుంచి 75 వేల వరకు జీతం పొందొచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూలను అక్టోబర్ 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా ఇంటర్వ్యూ తేదీల్లో జీఎస్డీ కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, సీఎస్ఎంఐ విమానాశ్రయం, టెర్మినల్-2, గేట్ నం.5, సహర్, అంధేరి-ఈస్ట్, ముబయిలో హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం www.aiasl.inను సందర్శించాల్సి ఉంటుంది.

Honor నుంచి రెండు కొత్త 5జి ఫోన్స్ లాంచ్.. తక్కువ ధర, క్రేజీ ఫీచర్లు

బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చే కొంపెనీలు కొన్ని ఉన్నాయి. వాటిలో హానర్ కంపెనీ కచ్చితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు క్రేజీ స్పెసిఫికేషన్స్ తో కొత్త మొబైల్స్ ను లాంఛ్ చేస్తుంది. అది కూడా అందుబాటు ధరకే. ఇప్పటికే ఎన్నో క్రేజీ ఫోన్లని తీసుకొచ్చిన హానర్ తాజాగా మరో రెండు క్రేజీ 5జి ఫోన్లని లాంచ్ చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. యువతను కచ్చితంగా ఈ క్రేజీ ఫీచర్స్ ఆకట్టుకోవడం ఖాయం. Honor X60 సిరీస్ లో Honor X60, Honor X60 Pro అనే రెండు మొబైల్స్ లాంచ్ చేసింది కంపెనీ. ఇక ఈ బ్రాండ్ న్యూ 5 జి స్మార్ట్ ఫోన్స్ లో ఎలాంటి ఫీచర్లు వస్తాయి? వీటి ధరలు ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా Honor x 60 విషయానికి వస్తే.. ఈ ఫోన్ డిస్ ప్లేను చాలా బాగా డిజైన్ చేశారు. దీన్ని రెగ్యులర్ గా కాకుండా లేటెస్ట్ వెర్షన్ లో డిజైన్ చేశారు. ఇది 6.8 ఇంచెస్ ఉంటుంది. ఇది FHD + 120 HZ LED స్క్రీన్. 850 బ్రైట్నెస్ తో మిలమిల మెరిసిపోతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇక ర్యామ్ విషయానికి వస్తే 12GB దాకా RAM ఉంటుంది. ఇందులో 512GB దాకా ఇంటర్నల్ ఆన్‌బోర్డ్ స్టోరేజీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో అన్నిటికంటే కూడా కెమెరా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. దీనికి 108 MP Samsung HM 6 బ్యాక్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ Honor x 60 స్మార్ట్ ఫోన్ కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. హానర్ స్టాండర్డ్ వేరియంట్ లో 35 w ఫాస్ట్ ఛార్జింగ్ ఆడాప్టర్, 5800 mah బ్యాటరీలు ఉంటాయి. ఇందులో హై స్టాండర్డ్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

ఇక Honor X60 Pro విషయానికి వస్తే.. దీనికి 66 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఇది 6600 mah బ్యాటరీ. ఇది స్కై బ్లూ, బర్నింగ్ ఆరెంజ్, బ్లాక్ కలర్స్ లో వస్తుంది. దీని ఫీచర్స్ కూడా honor x 60 లాగానే ఉంటాయి. దీని స్క్రీన్ 6.8 ఇంచెస్ ఉంటుంది. ఇది FHD + 120 HZ LED స్క్రీన్. 850 బ్రైట్నెస్ తో ఈ స్క్రీన్ వస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇక ర్యామ్ విషయానికి వస్తే 12GB దాకా RAM ఉంటుంది. ఇందులో కూడా 512GB దాకా ఇంటర్నల్ ఆన్‌బోర్డ్ స్టోరేజీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కూడా కెమెరానే స్పెషల్ అట్రాక్షన్. దీనికి 108 MP Samsung HM 6 బ్యాక్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో కూడా హై స్టాండర్డ్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ ధరల విషయానికి వస్తే.. HONOR X60 8GB+128GB వేరియంట్ 14,160 రూపాయలు, HONOR X60 8GB+256GB – Rs. 16,520, HONOR X60 12GB+256GB – Rs. 18,880, HONOR X60 12GB+512GB – Rs. 21,245, HONOR X60 Pro 8GB+128GB – Rs. 17,700, HONOR X60 Pro 8GB+256GB – Rs. 20,065, HONOR X60 Pro 12GB+256GB – Rs. 23,605 దాకా ఉంటాయి. ప్రస్తుతం చైనాలో చలామణి అవుతున్న ఈ స్మార్ట్ ఫోన్లు త్వరలోనే ఇండియాలో సేల్స్ జరుపుకొనున్నాయి.

జియో, ఎయిర్‌టెల్‌‌ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన BSNL.. ఇక నుంచి ఆ సమస్య ఉండదు

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ నెట్వర్క్స్ టెలికాం రంగంలో తిరుగులేని కంపెనీలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమ ప్లాన్స్ రేట్లు పెంచినా కూడా స్టాండర్డ్ యూజర్లను మెయింటైన్ చేస్తూ ముందుకు వెళుతున్నాయి. దానికి కారణం వీటి సిగ్నల్స్. ఈ నెట్ వర్క్స్ వాడే యూజర్లకు పెద్దగా సిగ్నల్ ప్రాబ్లం ఉండదు. అందుకే ఈ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్స్ పెంచినా కూడా కస్టమర్స్ తగ్గరు. ఆ ధీమాతోనే ఈ నెట్ వర్క్స్ టెలికాం రంగంలో చలామణీ అవుతున్నాయి. అయితే వీటికి గవర్నమెంట్ టెలికాం కంపెనీ BSNL మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ప్రజలకు అందుబాటు ధరలో చవక రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంది BSNL. దాంతో చాలా మంది ఈ నెట్ వర్క్ కి మారారు. ఆ విధంగా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చింది BSNL. ఇక ఇప్పటికే అల్లడిపోతున్న జియో, ఎయిర్టెల్ కంపెనీలకు తాజాగా మరో సారి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది BSNL. ఇంతకీ BSNL ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ఇచ్చిన ఆ షాక్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

BSNL ఎంత తక్కువ ధరకి మంచి ప్లాన్స్ అందిస్తున్నా కానీ ఇప్పటికీ ఒక మాయని మచ్చని పెట్టుకుంది. అదే పూర్ సిగ్నల్స్. ఇది BSNL కి ఎప్పటి నుంచి తీరని సమస్యగా మిగిలింది. సిగ్నల్స్ ప్రాబ్లెం కారణంగా చాలా మంది BSNL కి మారడానికి ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా ఈ మచ్చని చెరిపేసుకోవాడానికి సిద్ధం అవుతుంది BSNL. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అందిస్తున్న వియసత్‌(VIASAT)తో టై అప్ అవుతుంది. దానితో కలిసి ఓ కొత్త టెక్నాలజీని BSNL అందుబాటులోకి తీసుకొస్తుంది.ఆ టెక్నాలజీ పేరు Direct to Device. ఈ టెక్నాలజీ ద్వారా మొబైల్ టవర్లతో పనిలేకుండానే ఫోన్ కాల్స్ వచ్చే విధంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లు శాటిలైట్ కమ్యూనికేషన్‌పై పని చేస్తాయి. ఈ టెక్నాలజీపై బీఎస్ఎన్ఎల్ చేసిన ట్రయల్స్ కూడా సక్సెస్ అయ్యాయట. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ కూడా అందుబాటులోకి రానుంది. కేవలం సిటీలల్లోనే కాదండోయ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎనీ టైమ్ సిగ్నల్స్ ఉండేలా BSNL ఈ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ టెక్నాలజీ ద్వారా మొబైల్లో సిమ్ కార్డు కూడా అవసరం లేదట. సిమ్ కార్డ్ లేకుండానే కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వాచ్లు, ఇంటర్నెట్ ఉన్న కార్లు, టాబ్, లాప్టాప్ లలో కూడా కాల్స్ మాట్లాడుకోవచ్చట. పర్సనల్, డివైజ్ కమ్యూనికేషన్‌కు సపోర్ట్ చేసే విధంగా దీనిని డిజైన్ చేశారు. ఎక్కడున్నా కానీ ఎనీ టైమ్ కనెక్టివిటీని ఈ టెక్నాలజీ అందిస్తుంది. యూజర్లకు ఇది మంచి కవరేజీ ఇవ్వడంతోపాటు అద్భుతమైన కమ్యూనికేషన్ ని ఇస్తుందట. ఈ టెక్నాలజీ వల్ల మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ టెక్నాలజీకి మొబైల్ టవర్లతో పని ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే శాటిలైట్ ఫోన్లలాగా అన్నమాట. BSNL కొన్ని రోజులుగా దీనిపైన ప్రయోగాలు చేస్తుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కొన్ని వందల కాల్స్ కూడా ట్రయల్ చేసింది. కొద్ది నెలల్లోనే ప్రజలకు ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉందట. ఒకవేళ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందంటే జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు చుక్కలు కనిపించడం ఖాయం.

పసుపును ఇలా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం..! తప్పక తెలుసుకోండి

పసుపు.. అల్లం కుటుంబానికి చెందిన మొక్క. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. పసుపులో ఉన్న కుర్కుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఈ ప్రయోజనాలన్నీ సంపూర్ణంగా అందాలంటే..పసుపును సరైన పద్ధతిలోనే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఏసమయంలో ఎలా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు-వేడినీరు: ఉదయం ఖాళీ కడుపుతో అర టీస్పూన్ పసుపును ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. అంతేకాదు దీనివల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. తద్వారా బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక మంట గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధితో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. పసుపు నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది, ఇది దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది .

పసుపు-పాలు: రాత్రి పడుకునే ముందు ఒక కప్పు వేడి పాలలో పసుపు కలుపుకుని తాగండి. మంచి నిద్రతో పాటు, కొవ్వు కూడా తగ్గుతుంది. అజీర్తి, ఛాతీలో మంట వంటివి తగ్గిపోతాయి. కీళ్ల నొప్పుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా రక్తపోటు నియంత్రణలో వుంచుతాయి. ఈ పాలలోని గుణాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. జీవక్రియల పనితీరు మెరుగవుతుంది. దీనివల్ల అదనపు బరవు తగ్గి కంట్రోల్‌లో వుంటుంది. కేన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. కనుక పసుపు పాలను తాగుతూ వుంటే అనారోగ్యాలను దరి చేరనివ్వదు.

పసుపు, నిమ్మరసం తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ కలిగిస్తాయి. పసుపు, నిమ్మరసం కలిపి సేవిస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపు, నిమ్మ రసం వల్ల గుండె జబ్బులను దూరం పెట్టొచ్చు. వీటిలో ఉండే యాంటీయాక్సిడెంట్లు, యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. నిమ్మరసం, పసుపు మిశ్రమాన్ని ముఖానికి ఫేస్‌ ప్యాక్‌లా ఉపయోగించవచ్చు. చర్మ సమస్యలు తగ్గుతాయి. ముఖంను అందంగా మార్చుతుంది.

పసుపు -దాల్చిన చెక్క: పసుపు దాల్చిన చెక్క పొడిని కలిపి వేడి నీటిలో తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా వేగంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. పెరుగుతున్న జీవక్రియతో పాటు, పసుపు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, దీని కోసం శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది,కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు,నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

పసుపు- అల్లం టీ: తేనె, నిమ్మకాయలతో కలిపి అల్లం, పసుపు టీ తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. అల్లంలో జీర్ణం ఎంజైములు ఉత్పత్తి చేసే శక్తి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. పొట్ట ఆరోగ్యం చక్కగా ఉంటుంది. పసుపు, అల్లం ఈ రెండిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 12 వేలలో కళ్లు చెదిరే ఫీచర్లు..

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 29వ తేదీతో ముగియనున్న ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై ఈ సేల్‌లో భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా టెక్నో కంపెనీకి చెందిన ఓ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇంతకీ ఏంటా ఫోన్‌.? అందులో ఉన్న ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టెక్నో పోవా 6 నియో 5జీ ఫోన్‌పై అమెజాన్‌లో మంచి డీల్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 16,999గా ఉంది. అయితే అమెజాన్‌ సేల్‌లో భాగంగా 18 శాతం డిస్కౌంట్‌తో రూ. 13,999కి లభిస్తోంది. ఇక ప్రత్యేకంగా ఈ ఫోన్‌పై రూ. 1000 కూపన్‌ను అందిస్తోంది. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. వెయ్యి డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 12వేలకే సొంతం చేసుకోవచ్చు. కాగా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 13 వేల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. కెమెరా విషయానికొస్తే టెక్నో పోవా నియో 5జీలో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. డీ6300 వంటి పవర్‌ ఫుల్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఇన్‌ఫ్రారెడ్‌, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లను ఇచ్చారు.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చార. అలాగే ఏఐ ఎరెజర్‌, ఏఐ కట్‌ అవుట్‌, ఏఐ వాల్‌ పేపర్‌, ఆస్క్‌ ఏఐ వంటి అధునాతన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్స్‌ను ఇందులో ఇచ్చారు. ఐపీ54 రేటింగ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇక సౌండ్ విషయానికొస్తే ఇందులో డాల్బీ ఆట్స్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌ను ఇచ్చారు. తక్కువ ధరలో లాంటి బెస్ట్‌ ఫీచర్స్‌ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్‌ యంగ్ హీరో, కేరింత ఫేమ్ విశ్వంత్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ భావన అనే అమ్మాయితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. అయితే ఈ శుభవార్తను అతనే తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అంతేకాదు తన పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ ‘ఏ ప్రామిస్ ఆఫ్ లైఫ్ టైమ్’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఏడాది ఆగస్టులో విశ్వంత్- భావనల నిశ్చితార్థం జరిగింది.

అయితే ఎలాంటి హడావుడి లేకుండా మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారీ లవ్లీ కపుల్. ఇక ప్రస్తుతం విశ్వంత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సామర్ల కోటకు చెందిన విశ్వంత్ కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆతర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ‘కేరింత’ సినిమా లో విశ్వంత్ కు ఆఫర్ వచ్చింది. దీంతో ఇంజినీరింగ్ మధ్యలో ఆపేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. కేరింత సినిమా సూపర్ హిట్ కావడం, విశ్వంత్ నటనకు మంచి పేరు రావడంతో ఈ నటుడికి వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా టాలీవుడ్‌ కంటిన్యూ అవుతున్నాడు ఈ యంగ్ హీరో.

స్మార్ట్ ఇన్సులిన్.. ఇక డయాబెటీస్ బెంగ తీరినట్టేనా

డయాబెటీస్… 50 కోట్ల మందిని సైలెంట్‌గా చావుకు దగ్గరగా తీసుకెళ్తున్న వ్యాధి. డాక్టర్లు డయాబెటీస్ వచ్చినా నష్టం లేదని.. దాంతో కలిసి జీవించడం నేర్చుకోవాలని ధైర్యం చెబుతున్నప్పటికీ… ఒక్కసారి ఆ వ్యాధి సోకిందంటే ఎంతో కంట్రోల్‌లో ఉంచుకుందామని ట్రై చేసినా… పదేళ్లకే, 20 ఏళ్లకో శరీరంలో ఒక్కో ఆర్గాన్ నెమ్మది నెమ్మదిగా మొరాయించడం మొదలెడుతుంది. ఈ విషయం ఓపెన్ సీక్రెట్.

ఏటా ఎంత లేదనుకున్నా ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ కారణంగానే 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే డయాబెటీస్ విషయంలో యావత్ వైద్యలోకం అంత సీరియస్‌గా ఎఫెర్ట్స్ పెడుతోంది. ఒకసారి డయాబెటీస్ సోకిన వాళ్లకు తమ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకోవడం సవాల్‌గా మారుతుంటుంది. వ్యాధి తీవ్రత బట్టీ కొందరికి మాత్రలతో కంట్రోల్‌ చెయ్యగల్గుతుంటే.. మరి కొందరికి మాత్రం ఇన్సులిన్ ఇవ్వక తప్పని పరిస్థితి. అంటే శరీరంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని అందుకు అనుగుణంగా ఇన్సూలిన్ తీసుకోవాలి. ఇది… నిజానికి అలవాటైపోయిన లేదా అలవాటు చేసుకున్న డయాబెటీస్ రోగులకు ఫర్వాలేదేమో కానీ… కొత్తగా ఇన్సులిన్ వాడే వాళ్లకు మాత్రం నిజంగా ఇబ్బందికర పరిస్థితే. అలాంటి వారి కోసం ఇన్సులిన్ సెన్సార్ ప్యాచ్‌ల వంటి అనేక రకాల పరికరాలొచ్చాయి. అయితే ఈ సెన్సార్ ప్యాచ్‌లు కేవలం మన శరీరంలో షుగర్ లెవల్స్‌లో హెచ్చుతగ్గుల్ని మాత్రమే గుర్తిస్తాయి.

ఆకాశంలో అద్భుతం.. చరిత్ర సృష్టించిన అమరావతి డ్రోన్ షో.. ఐదు ప్రపంచ రికార్డులు కైవసం

ఆ తర్వాత కళ్లు మిరుమిట్లు గొలిపేలా లేజర్‌ షో, క్రాకర్స్‌ షో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని 8 వేల మంది ప్రత్యక్షంగా వీక్షిస్తే…విజయవాడ నగరంలో ఏర్పాటుచేసిన 5 భారీ స్క్రీన్ల దగ్గర వేలాదిమంది డ్రోన్‌ ప్రదర్శనను చూశారు. డ్రోన్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ ఈవెంట్ నిర్వహించారు. డ్రోన్ షోకి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 400కి పైగా కంపెనీలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. పలు రకాల థీమ్‌లతో డ్రోన్‌ హ్యాకథాన్‌ సాగింది.

ఆకాశపు కాన్వాస్‌పై డ్రోన్లు గీసిన చిత్రాలు అబ్బురపరిచాయి. దేశంలోనే అతి పెద్ద డ్రోన్‌ షో అదరహో అనే రేంజ్‌లో జరిగింది. కృష్ణా తీరంలో…పున్నమి ఘాట్‌లో…పున్నమి వెలుగులను మించి డ్రోన్‌ హ్యాకథాన్‌ జరిగింది. ఒకటి కాదు రెండు కాదు..ఒకేసారి 5,500 డ్రోన్లు వెలుగులు విరజిమ్మూతూ ఆకాశంలోకి దూసుకెళ్లి పలు థీమ్‌లను ఆవిష్కరించాయి. దేశంలోనే అతి పెద్ద డ్రోన్‌ షోకి విజయవాడ వేదికగా మారింది. ఆకాశంలో చుక్కలు కుప్పబోసినట్లు…నక్షత్రాల్లా మిలమిలా మెరిసిపోయాయి డ్రోన్లు. డ్రోన్ల తళుకుబెళుకుల ముందు నక్షత్రాలు చిన్నబోయాయి. ఇక ఈ డ్రోన్ షో ద్వారా అమరావతిలో ఒకే రోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. డ్రోన్ షో, లేజర్ షో అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ రికార్డులకు సంబంధించిన పత్రాలు అందించారు.

– లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ క్రియేషన్

– లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్

– డ్రోన్ల ద్వారా అతి పెద్ద జాతీయ జెండాప్రదర్శన

– అతిపెద్ద ఏరియల్ లోగోతో మొత్తం ఐదు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి

ఈ డ్రోన్ షో ను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. అమరావతి డ్రోన్ సమ్మిట్ – 2024 లో భాగంగా ఈ సాయంత్రం పున్నమి ఘాట్ లో డ్రోన్ షో, లేజర్ షో, ఫైర్ వర్క్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడులు వీటిని ప్రారంభించారు. విజయవాడ నగరం నుంచి సందర్శకులు భారీగా రావడంతో కృష్ణానదీ తీరం జనసంద్రంగా మారింది. విజయవాడ నగరవాసులు డ్రోన్ షో వీక్షించేలా అధికారులు ఐదు ప్రాంతాల్లో డిస్ ప్లేలు ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతో పాటు లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఇటీవల నిర్వహించిన డ్రోన్ హ్యాకథాన్లో విజేతలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. మొత్తానికి డ్రోన్ షో కు ఐదు గిన్నిస్ రికార్డులు రావడంతో అందరిలో ఆనందం వెల్లివిరిసింది.

ఆకాశంలో రకరకాల ఫార్మేషన్లతో డ్రోన్లు అందరిని ఆకట్టుకున్నాయి. అవి పలు రకాల థీమ్‌లను ప్రదర్శించాయి. డ్రోన్ల కాంతులు…వినీలాకాశంలో రకరకాల ఆకారాలకు ప్రాణం పోశాయి. 1911 ఇండియా కమ్మెమోరేటివ్‌ పోస్టేజ్‌ స్టాంప్‌ ఆకారంలో ఫార్మ్‌ అయిన డ్రోన్లను చూసి, ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆకాశం అనే కాన్వాస్‌ మీద…చెయ్యి తిరిగిన చిత్రకారుడు కుంచె పెట్టి గీసినట్లు…డ్రోన్లు గీసిన చిత్రాలను చూసి చిత్తరువులా మారిపోయారు జనం.

ఆకాశంలో నిమిషానికో రూపం సంతరించుకున్న డ్రోన్‌ చిత్రాలను చూసి వీక్షకులు మంత్రముగ్ధులైపోయారు. విమానం రూపం సంతరించుకున్న డ్రోన్‌ షో అందరిని తన్మయత్వంలో ముంచెత్తింది. 1961లో మొట్టమొదటిసారి పంపిన ఎయిర్‌మెల్‌ని పురస్కరించుకుని ఈ విమాన రూపాన్ని ప్రదర్శించారు. ఇక అమరావతి థీమ్‌కు చిహ్నంగా…డ్రోన్లు గీసిన బుద్ధుడి చిత్రాన్ని చూసి అచ్చెరువొందారు వీక్షకులు. ఇక విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌, యూఏవీలకు చిహ్నంగా థీమ్స్‌ను ప్రదర్శించాయి డ్రోన్లు. ఆ తర్వాత జయహో మ్యూజిక్‌ వస్తుండగా జాతీయ జెండాను ప్రదర్శించాయి డ్రోన్లు.

ఆ తర్వాత కళ్లు మిరుమిట్లు గొలిపేలా లేజర్‌ షో, క్రాకర్స్‌ షో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని 8 వేల మంది ప్రత్యక్షంగా వీక్షిస్తే…విజయవాడ నగరంలో ఏర్పాటుచేసిన 5 భారీ స్క్రీన్ల దగ్గర వేలాదిమంది డ్రోన్‌ ప్రదర్శనను చూశారు. డ్రోన్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ ఈవెంట్ నిర్వహించారు. డ్రోన్ షోకి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 400కి పైగా కంపెనీలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. పలు రకాల థీమ్‌లతో డ్రోన్‌ హ్యాకథాన్‌ సాగింది.

ఈ డ్రోన్‌ షోకు ఐదు గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ దక్కాయి. డ్రోన్లు ఆకాశంలో ఆవిష్కరించిన లార్జెస్ట్ ప్లానెట్ ఆకృతి, నదీ తీరాన లార్జెస్ట్‌ ల్యాండ్ మార్క్‌, అతి పెద్ద ఏరియల్‌ లోగో ఆకృతి, అతి పెద్ద జాతీయ జెండా ఆకృతి, అతి పెద్ద విమానాకృతి…వీటికి ఈ పురస్కారాలు దక్కాయి.

Health

సినిమా