Sunday, November 17, 2024

CCE Marks Online Entry Link

CCE MARKS ENTRY LINK click here to OPEN

*CCE marks Entry info

*Cse సైట్ లో CCE మార్క్స్ మన మొబైల్ లో  ఎంటర్ చేయాలంటే ఈ steps ఫాలో అవ్వాలి… లేకపోతే మనకు Services option కనిపించదు..

*Google Chrome లో cse సైట్ లో login అయిన తర్వాత Right side నిలువుగా కనిపించే 3 చుక్కలపై click చేయాలి…

⬇️

*Settings

⬇️

*Accessibility

⬇️

*Default Size 50%

*ఇలా select చేసుకోగానే మీకు Home, services ఆప్షన్స్ కనపడతాయి… Services లోకి వెళ్ళి Marks ఎంటర్ చేయవచ్చు

లేదంటే

Firefox browser లో అయితే direct గా open అవుతుంది…

CCE MARKS ENTRY LINK click here to OPEN

CCE MARKS ENTRY USER MANUAL DOWNLOAD

మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్, రూ.5 ల‌క్షల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణం-కేంద్ర ప్రభుత్వం స‌రికొత్త ప‌థ‌కం

దేశంలోని మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మ‌హిళ‌ల‌కు వ్యాపారం కోసం రూ.5 ల‌క్షల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాన్ని అందిస్తుంది. మ‌హిళ‌లు సొంతంగా వ్యాపారం చేసేందుకు ఆర్థిక చేయూత‌ను అందిస్తోంది. “ల‌ఖ్‌ప‌తి దీదీ యోజ‌న స్కీం”తో మ‌హిళ‌కు అండ‌గా ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం దేశంలోని అనే ప‌థ‌కాలను అమ‌లు చేస్తోంది. మ‌హిళ‌ల సాధికార‌త కోసం కూడా చాలా కాలంగా ప్రయ‌త్నాలు చేస్తోంది. దీంతో పాటు మ‌హిళ‌ల‌ను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు వివిధ రకాల పథ‌కాల‌ను రూపొందిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా, స‌మ‌ర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం “ల‌ఖ్‌ప‌తి దీదీ యోజ‌న స్కీం” అమ‌లు చేస్తోంది.

మ‌హిళలు వ్యాపారాన్ని ఎలా సెట‌ప్ చేస్తారు?

ఈ ప‌థ‌కం ద్వారా ప్రభుత్వం మ‌హిళ‌ల‌కు రూ.5 ల‌క్షల వ‌ర‌కు వ‌డ్డీ లేకుండా రుణాలు ఇస్తుంది. అయితే ఈ ప‌థ‌కాన్ని మ‌హిళ‌లు ఎలా స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. ఎలా వారి వ్యాపారాన్ని సెటప్ చేసుకోవాల‌నే విష‌యాలు తెలుసుకుంటాం. ఈ ప‌థ‌కం ల‌క్ష్యం మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా బ‌లోపేతం చేయ‌డం, వ్యాపారాల‌ను స్థాపించ‌డంలో వారికి స‌హాయం చేయ‌డం. ఈ ప‌థ‌కం ప్రయోజ‌నాల‌ను పొందేందుకు మ‌హిళ‌లు స్వయం స‌హాయ‌క గ్రూపుల‌లో చేరి ఉండాలి. ఇవి ఎక్కువ‌గా గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సించే మ‌హిళ‌ల కోసం రూపొందించ‌బ‌డ్డాయి. ఈ బృందంలోని ఒక మ‌హిళ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాల‌నుకుంటే, ఆమె త‌న వ్యాపార ప్రణాళిక‌తో స్వయం స‌హాయ బృందం ద్వారా రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తు ఇలా చేసుకోవాలి

మీరు కూడా ల‌ఖ్‌ప‌తి దీదీ స్కీమ్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులైన అభ్యర్థి అయితే, మీరు కూడా ఈ ప‌థ‌కంలో ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకుంటే, మొబైల్ ఫోన్ లేదా కంప్యూట‌ర్ నుండి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.india.gov.in/spotlight/lakhpati-didi ను క్లిక్ చేసి, వెబ్‌సైట్ హోం పేజీలోకి వెళ్లాలి. వివ‌ర‌ణ‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలి. అప్లికేష‌న్ ఓపెన్ అవుతుంది. అప్లికేష‌న్‌లో అవ‌స‌ర‌మైన మొత్తం స‌మాచారాన్ని పూరించాలి. మీరు మీ అన్ని ప‌త్రాల‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అప్పుడు సబ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. అనంత‌రం ర‌సీదు ల‌భిస్తుంది. ఆ ర‌సీదును ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా ల‌ఖ్‌ప‌తి దీదీ యోజ‌న కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆయా బృందంలోని మ‌హిళా స‌భ్యుల వ్యాపార ప్రణాళిక‌ను స్వయం స‌హాయ సంఘాల ద్వారా ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వ అధికారులు వారి ద‌ర‌ఖాస్తును ప‌రిశీలిస్తారు. ఆ త‌రువాత ద‌ర‌ఖాస్తు ఆమోదం పొందితే రూ.5 ల‌క్షల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణం ల‌భిస్తుంది. దీంతో పాటు మీరు లోన్ పొందిన త‌రువాత అవ‌స‌ర‌మైన శిక్షణ‌ను కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఆయా కంపెనీ కోసం అవ‌స‌ర‌మైన నైపుణ్యల‌ను మెరుగుప‌ర్చుకునే అవ‌కాశం క‌ల్పిస్తుంది.

అప్పటికే లోన్ తీసుకుంటే, కొత్తగా రావ‌డానికి ఛాన్స్ త‌క్కువ‌

ల‌ఖ్‌ప‌తి దీదీ యోజ‌న స్కీం ఆధ్వర్యంలో మ‌హిళ‌ల‌కు ప్రయోజ‌నాల‌ను అందించ‌డానికి స్వయం స‌హాయ బృందంలో చేరి ఉండాలి. ఒక వేళ వారి బృందంలోని స‌భ్యులు ఇది వ‌ర‌కే లోన్ తీసుకుని ఉంటే మాత్రం మ‌ళ్లీ కొత్తగా లోన్ వ‌చ్చే ఛాన్స్ త‌క్కువ‌గా ఉంటుంది. పాత లోన్ గ‌డువులోగా తీర్చడం, లేదా వాయిదాలు క్రమంగా క‌ట్టడం ద్వారా వారికి మ‌రిన్ని లోన్ సౌక‌ర్యాలు ల‌భిస్తాయి.
ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హత‌లు

1. ల‌ఖ్‌ప‌తి దీదీ స్కీమ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకుంటే, భార‌త పౌరులై ఉండాలి.

2. 18-50 సంవ‌త్సరాల వ‌య‌స్సు గల మ‌హిళు మాత్రమే ఈ ప‌థ‌కానికి దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

3. స్వయం స‌హాయక బృందాల‌తో సంబంధం ఉన్న మహిళ‌లు మాత్రమే ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

4. మ‌హిళ‌ల వార్షిక ఆదాయం రూ.3 ల‌క్షల‌కు మించ‌కూడదు.

5. మ‌హిళ‌ల‌ కుటుంబంలో ఎవ‌రికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండ‌కూదు.
ల‌ఖ్‌ప‌తి దీదీ యోజ‌న‌కు అవ‌స‌ర‌మైన ప‌త్రాలు

1. ఆధార్ కార్డు

2. మొబైల్ నంబ‌ర్

3. పాస్‌పోర్టు సైజు ఫోటో

4. పాన్‌కార్డ్‌

5. ఆదాయ ధ్ర‌వీక‌ర‌ణ ప‌త్రం

6. చిరునామా

7. విద్యా అర్హత స‌ర్టిఫికేట్

8. బ్యాంకు ఖాతా వివ‌రాలు

ఏపీ విద్యాశాఖలో భారీగా బదిలీలకు రంగం సిద్ధం, తుది ఫైల్ రెడీ

ఏపీ విద్యాశాఖలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విద్యాశాఖలోని ఉన్నతాధికారులతో సహా వివిధ విభాగాల డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, ఇతర అధికారులను బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఏపీ విద్యా శాఖలో భారీ మార్పులకు ప్రభుత్వం సిద్ధమ‌వుతుంది. విద్యాశాఖ‌లో భారీగా ఉన్నతాధికారుల బ‌దిలీల‌కు రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల డైరెక్టర్లు, అద‌న‌పు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లతో పాటు స‌మ‌గ్ర శిక్ష రాష్ట్ర కార్యాల‌యంలో ప‌ని చేస్తున్న కార్యద‌ర్శుల‌ను సైతం మార్చేందుకు నిర్ణయించారు.

మ‌రోవైపు ఉపాధ్యాయ బ‌దిలీలు ప్రక్రియ మాత్రం నిలిచిపోయింది. గ‌త వైసీపీ ప్రభుత్వం చేప‌ట్టిన ఉపాధ్యాయ బ‌దిలీల‌ను నిలిపివేసిన కూట‌మి ప్రభుత్వం, ఇంకా ఆ ప్రక్రియ‌ను చేప‌ట్టలేదు. ఉపాధ్యాయ బ‌దిలీల‌పై రాష్ట్ర ప్రభుత్వం అడుగు కూడా ముందుకు వేయ‌లేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయ బ‌దిలీలను వెంట‌నే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆందోళ‌న‌లను ప్రారంభించాయి.

కానీ వివిధ విభాగాల డైరెక్టర్లు, అద‌న‌పు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లతో పాటు స‌మ‌గ్ర శిక్ష అభియాన్ అధికారుల‌ను బ‌దిలీకి రంగం సిద్ధం చేసింది. జిల్లా విద్యా శాఖ అధికారులు (డీఈవో), టెక్నిక‌ల్ ఎడ్యూకేష‌న్ చూసే రీజ‌న‌ల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)లకు కూడా స్థాన‌చ‌ల‌నం క‌ల్పించ‌నున్నారు. ఈ అంశంపై నెల రోజుల క్రిత‌మే వివ‌రాలు తీసుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యాల‌యం, అధికారుల మార్పుపై తుది ఫైల్‌ను సిద్ధం చేసి ఉన్నతాధికారుల‌కు పంపిన‌ట్లు తెలుస్తోంది.

స‌మ‌గ్ర శిక్ష ఏఎస్పీడీగా ఉన్న శ్రీ‌నివాసుల రెడ్డిని ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల విభాగం (ఎస్ఎస్‌సీ బోర్డు) డైరెక్టర్‌గా బ‌దిలీ చేస్తార‌ని తెలిసింది. ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న దేవానంద‌రెడ్డిని ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌గా, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డిని ఏపీ రెసిడెన్షియ‌ల్ స్కూల్ సొసైటీ సెక్రట‌రీగా బ‌దిలీ చేస్తార‌ని తెలుస్తోంది. అలాగే కేజీబీవీ కార్యద‌ర్శి డి.మ‌ధుసూద‌న‌రావు, ప‌బ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రస‌న్నకుమార్‌ల‌లో ఒక‌రిని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

పాఠ్య పుస్తకాల ముద్రణ విభాగం డైరెక్టర్ కె.ర‌వీంద్రనాథ్ రెడ్డి, ఏపీ రెసిడెన్షియ‌ల్ సొసైటీ కార్యద‌ర్శి న‌ర‌సింహారావు, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం జాయింట్ డైరెక్టర్ గంగాభ‌వానీల‌ను స‌మ‌గ్ర శిక్షకు బ‌దిలీ చేస్తార‌ని తెలుస్తోంది. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అద‌న‌పు డైరెక్టర్‌గా ఇంట‌ర్మీడియ‌ట్ విద్యలో ప‌ని చేస్తున్న శ్రీనివాస‌రావును, ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వర‌రావును ఇంట‌ర్మీడియ‌ట్ విద్యకు బ‌దిలీ చేయ‌నున్నట్లు స‌మాచారం.

వీరితో పాటు జిల్లా విద్యా శాఖ అధికారుల‌ను సైతం బ‌దిలీ చేయ‌నున్నట్టు స‌మాచారం. కృష్ణా జిల్లా డీఈవో త‌ప్ప మిగిలిన 25 జిల్లాల విద్యా శాఖ అధికారుల‌ను ఆరు నెల‌ల క్రిత‌మే మార్చారు. అయినా ఇప్పుడు మ‌రోసారి వీరింద‌రికీ స్థానచ‌ల‌నం క‌ల్పించాల‌ని నిర్ణయించిన‌ట్లు తెలిసింది. ఈ మేర‌కు రెండు, మూడు రోజుల్లో బ‌దిలీల ఉత్తర్వులు జారీ చేసే అవ‌కాశం ఉంది.

భారత్‌, చైనా మధ్య కీలక ఒప్పందం

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వివరాలు తెలిపారు.

తూర్పు లద్దాఖ్ పరిస్థితుల విషయంలో భారత్, చైనా మధ్య భారీ పురోగతి కనపడింది. తూర్పు లద్దాఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (వాస్తవాధీన రేఖ) వెంట పెట్రోలింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి భారత్, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. 16వ బ్రిక్స్ సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కీలక ముందడుగు పడడం గమనార్హం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోనూ రష్యాలో మోదీ చర్చలు జరపనున్నారు.

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వివరాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్‌పై ఒప్పందం కుదిరిందని అన్నారు. ఎన్నో వారాలుగా చర్చలు జరుగుతున్నాయని, దీంతో ఈ ఒప్పందం జరిగిందని చెప్పారు. ఈ ఒప్పందం బలగాల ఉపసంహరణతో పాటు 2020లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

కాగా, ఈ నెల 22, 23న రష్యాలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సులో జరగనుంది. గల్వాన్‌ లోయలో 2020లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. అనంరం భారత్‌, చైనా అక్కడ భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి.

జీపీఎస్ లేకున్నా గూగుల్ మీ లొకేషన్ ట్రాక్ చేయగలదు తెలుసా? ఇలా టర్న్ ఆఫ్ చేయొచ్చు

ప్రైవసీ విషయంలో వినియోగదారులు గతంలో కన్నా ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉన్నారు. దీని కారణంగా, చాలా మంది వినియోగదారులు తమ మొబైల్‌లు, ఇతర గాడ్జెట్‌లలో జీపీఎస్ నిలిపివేస్తారు. తద్వారా గూగుల్ లేదా మరెవరూ వాటిని ట్రాక్ చేయలేరు. కానీ, జీపీఎస్ లేకుండా కూడా గూగుల్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేయగలదని చాలా మందికి తెలియదు. మీరు ఈ సమస్యను నివారించాలంటే మీరు జీపీఎస్ కాకుండా స్మార్ట్‌ఫోన్ అనేక పర్మిషన్లను నిలిపివేయాల్సి ఉంటుంది.

ప్రైవసీ విషయంలో వినియోగదారులు గతంలో కన్నా ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉన్నారు. దీని కారణంగా, చాలా మంది వినియోగదారులు తమ మొబైల్‌లు, ఇతర గాడ్జెట్‌లలో జీపీఎస్ నిలిపివేస్తారు. తద్వారా గూగుల్ లేదా మరెవరూ వాటిని ట్రాక్ చేయలేరు. కానీ, జీపీఎస్ లేకుండా కూడా గూగుల్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేయగలదని చాలా మందికి తెలియదు. మీరు ఈ సమస్యను నివారించాలంటే మీరు జీపీఎస్ కాకుండా స్మార్ట్‌ఫోన్ అనేక పర్మిషన్లను నిలిపివేయాల్సి ఉంటుంది.

వై-ఫై లొకేషన్స్ :
జీపీఎస్ ఆఫ్‌లో ఉంటే గూగుల్ మీ లొకేషన్ ట్రాక్ చేయలేదని భావిస్తారు. కానీ, గూగుల్ వై-ఫై నెట్‌వర్క్ ద్వారా మీ కచ్చితమైన లొకేషన్ చాలా సులభంగా ట్రాక్ చేయగలదు. వాస్తవానికి, మీరు మీ డివైజ్ వై-ఫైకి కనెక్ట్ చేసినప్పుడు గూగుల్ మిమ్మల్ని అక్కడి నుంచి ట్రాక్ చేస్తుంది.

సెల్ టవర్ ట్రిగ్యులేషన్ :
స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ టవర్ సాయంతో గూగుల్ మీ లొకేషన్ సులభంగా ట్రాక్ చేయవచ్చు. వాస్తవానికి, ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో నెట్‌వర్క్‌ను అందించేందుకు టెలికాం కంపెనీలు మొబైల్ టవర్‌లను ఇన్‌స్టాల్ చేశాయి. వాటి సాయంతో గూగుల్ మీ లొకేషన్ ఎప్పుడైనా ట్రాక్ చేయొచ్చు.

ఐపీ అడ్రస్ :
జీపీయఎస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నెట్‌వర్క్ ఐపీ అడ్రస్ సాయంతో గూగుల్ మీ డివైజ్ లొకేషన్ ట్రాక్ చేయగలదు. ఐపీ అడ్రస్ సాయంతో గూగుల్ మీ లొకేషన్ సులభంగా ట్రాక్ చేయగలదు. దీనికోసం గూగుల్‌కు హైస్పీడ్ ఇంటర్నెట్ అవసరం లేదు. చాలా తక్కువ వేగంతో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడా గూగుల్ మీ లొకేషన్ ట్రాక్ చేయగలదు.

గూగుల్ ట్రాకింగ్‌ను బ్రౌజర్ ద్వారా ఎలా ఆపాలంటే? :
గూగుల్ మీ డేటాను కలెక్ట్ చేయడం నిలిపివేయాలి. ఇందుకోసం మీ గూగుల్ బ్రౌజర్ సెట్టింగ్‌లకు వెళ్లండి. మీరు (My Activity)పై క్లిక్ చేసినప్పుడు గూగుల్ యాక్టివిటీ ఆప్షన్ కనిపిస్తుంది.ఆ పక్కన మీరు వెబ్, యాప్ యాక్టివిటీ, యూట్యూబ్ హిస్టరీ, లొకేషన్ హిస్టరీని చూడవచ్చు. మీరు ఈ అన్ని ఆప్షన్లకు వెళ్లడం ద్వారా గూగుల్ ట్రాకింగ్‌ను నిలిపివేయొచ్చు.

విలాసవంతమైన భవనాలను ఏం చేస్తారు? రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

రుషికొండలోని భవనాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. 500 కోట్ల రూపాయలతో గత వైసీపీ ప్రభుత్వం రుషికొండలో అత్యంత విలాసవంతంగా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని అతిథి గృహాల కోసం కట్టామని వైసీపీ చెబుతోంది. మరోవైపు జగన్ కోసమే విలాసవంతమైన నిర్మాణాలు కట్టారని టీడీపీ ఆరోపిస్తోంది.

మరి ఈ భవనాలను ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటారా? ప్రైవేట్ కు ఇస్తారా? అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల లక్షల్లో ఖర్చు అవుతోంది. ఆదాయం కంటే నిర్వహణ భారం ఎక్కువగా మారింది. రుషికొండపై 9.88 ఎకరాల్లో ఏడు భవనాలు నిర్మించారు. రుషికొండ భవనాలకు భారీగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి. 5 నెలల్లో ప్రతి నెల సగటున రూ.6 లక్షలకు పైగానే బిల్లు వస్తోంది. ప్రతి నెల 40వేల నుంచి 60వేల యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది.

గతంలో వైసీపీ ప్రభుత్వంలో రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలిచేందుకు వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ ను అడ్డుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ అదే ప్రాంతంలో పర్యటించారు. రుషికొండ భవనాలను ఆయన పరిశీలించారు. అక్కడే ఉన్న కార్మికులతో పవన్ ముచ్చటించారు. ఏ సమయంలో వారు వస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.

పవన్ కల్యాణ్ ప్యాలెస్ లోపలికి అయితే వెళ్లలేదు. బయటి నుంచే భవనాలను పరిశీలించారు. మొత్తం ఏడు బ్లాక్ లను ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు పవన్ కల్యాణ్ వెంట ఉన్నారు.

రుషికొండ భవనాలను ఏం చేస్తారు? అనేదానిపై ఒక ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వం హయాంలో రూ.500 కోట్లతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాలను ఏం చేస్తారు? అనేది అటు ప్రజల్లోనూ ఇటు అధికారులు, మంత్రుల్లోనూ ఉత్కంఠ నెలకొని ఉంది. వీటిని డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. అలాగే హోటల్ చేయాలని, సినీ పరిశ్రమకు ఇవ్వాలని కూడా ప్రతిపాదనలు వచ్చాయి. అదే సమయంలో ఐటీ పరిశ్రమకు కేటాయించాలనే ప్రతిపాదన కూడా వినిపించింది. ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాల లోపలికి వెళ్లి పరిశీలించారు. దాంతో లోపల ఏం జరిగింది? అనేది అందరికీ తెలిసింది. అత్యాధునిక హంగులతో, భారీ ఖర్చుతో, విలాసవంతమైన భవనాలను నిర్మించినట్లు బయటకు తెలిసింది. ఇంత ఖరీదైన భవనాలను ఏం చేస్తారు? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది అప్పటి నుంచి ఉత్కంఠగా మారింది. ఈ పరిస్థితుల్లో రుషికొండ ప్యాలెస్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించడంతో.. త్వరలోనే దీనిపై కూటమి సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జోరుగా నడుస్తోంది.

ఇప్పుడు 5 రోజుల్లోనే రూ.570 కోట్ల లిక్కర్ సేల్స్.. అప్పుడేమో టెండర్లతో బోలెడు ఆదాయం

గతంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్లు మాత్రమే దొరికేవి. పైగా రేట్లు కూడా ఎక్కువే. దీంతో మద్యం ప్రియులు వైన్‌ షాపుల కంటే బార్లకే వెళ్లేవారు.

ఇప్పుడు 5 రోజుల్లోనే రూ.570 కోట్ల లిక్కర్ సేల్స్.. అప్పుడేమో టెండర్లతో బోలెడు ఆదాయం

కొత్త సీసా..కొత్త మందు..తగ్గిన రేటు. ఇక కిక్కే కిక్కు. ఏపీలో కొత్త మద్యం పాలసీ మందు బాబులకే కాదు..లిక్కర్ వ్యాపారులకు, ప్రభుత్వానికి కూడా మంచిరోజులు తీసుకొచ్చింది. గత ఐదేళ్లలో టేస్ట్‌ లేని మందు..నోటితో పలకలేని బ్రాండ్లు చూసి చిర్రెత్తిపోయిన మందుబాబులు..ఇప్పుడు లో కాస్ట్‌కే ప్రీమియం లిక్కర్‌ను తాగి ఎంజాయ్ చేస్తున్నారు. టెండర్లలో షాపులు దక్కించుకున్న వ్యాపారులకు కూడా మంచిగానే బిజినెస్ అవుతోంది. ఇక ప్రభుత్వానికి టెండర్ ఫీజ్‌ నుంచి సేల్స్‌ వరకు ఖజానాలో కాసులు వచ్చి పడుతూనే ఉన్నాయి.

కొత్త లిక్కర్ షాపులు తెరుచుకుని వారం రోజులే అయింది. ఇప్పటికే రికార్డు స్థాయి సేల్స్ జరుగుతున్నాయి. ఏకంగా ఆరు వందల కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అంచనా. ఇలా తెరుచకున్నాయో లేదో.. కొత్త మద్యం షాపులు సందడిగా మారాయి. పాత బ్రాండ్ల రావడంతో పాటు..రూ.99కే క్వార్టర్‌ మందు దొరుకుతుండటంతో ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు మందుబాబులు.

అయితే కొన్ని షాపుల్లో ఇప్పటికీ కూడా రూ.99కే క్వార్టర్ మద్యం అందుబాటులో లేదు. రూ.145కు క్వార్టర్ మద్యం అంటూ షాపుల నిర్వహకులు అమ్మకాలు చేస్తున్నారు. ఈ విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నా వైన్‌ షాపుల దగ్గర రద్దీ మాత్రం తగ్గడం లేదు.

కొత్త మద్యం పాలసీ స్టార్టింగ్‌లోనే రికార్డు స్థాయి ఆదాయం
ఏపీ ఆబ్కారీ శాఖకు కాసుల మత్తు కిక్కెస్తోంది. కొత్త మద్యం పాలసీ స్టార్టింగ్‌లోనే రికార్డు స్థాయి ఆదాయం రాబడుతోంది ఆబ్కారీ శాఖ. మద్యం అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. కొత్త లిక్కర్ షాపులు మొదలైన వారం రోజుల్లోనే రూ.6వందల కోట్లకు పైగా విలువ చేసే సరుకు గౌడన్ల నుంచి బయటకు వెళ్లింది.

రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి 6లక్షల 77వేల 511 కేసుల మద్యం, లక్షా 94వేల 261 బీర్ల కేసులు అమ్మారు. బార్ల కంటే మందు బాబులు మద్యం షాపుల వైపే వెళ్తున్నారు. ఆబ్కారీ శాఖ ప్రకటించినట్లు రూ.99లకే క్వార్టర్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా..ఇంకా కొన్ని షాపులు ప్రారంభించనప్పటికీ..అమ్మకాలు మాత్రం భారీగానే జరుగుతున్నాయి.

అప్పట్లో మద్యం షాపుల కంటే బార్లకే ఎక్కువ ఆదాయం
గతంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్లు మాత్రమే దొరికేవి. పైగా రేట్లు కూడా ఎక్కువే. దీంతో మద్యం ప్రియులు వైన్‌ షాపుల కంటే బార్లకే వెళ్లేవారు. వివిధ పన్నుల పేరుతో బార్లలో క్వార్టర్ బాటిల్‌కు రూ.80 వరకు వసూలు చేసేవారు బార్ల నిర్వహకులు. గత ప్రభుత్వంలో మద్యం షాపుల కంటే బార్లకే ఎక్కువ ఆదాయం వచ్చిందని చెప్పొచ్చు.

కొత్త మద్యం పాలసీలో పాత బ్రాండ్లు వచ్చేశాయ్. ప్రీమియం బ్రాండ్లు కొన్ని అందుబాటులో ఉన్నాయ్. పైగా రేట్లు కూడా తక్కువే. దీంతో బార్ల కంటే వైన్‌షాపులకే వెళ్తున్నారు పబ్లిక్. ఇలాగే కొద్ది రోజులు కొనసాగితే మందుబాబులు షాపులకు అలవాటు పడతారనే టెన్షన్ బార్ల నిర్వహకుల్లో కనిపిస్తోంది. దీంతో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.30 వరకు తగ్గిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.

కొత్త మద్యం పాలసీతో ప్రభుత్వానికి అయితే ఆదాయం భారీగా పెరిగింది. టెండర్ ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి దాదాపు రూ.18 వందల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు రికార్డు స్థాయి లిక్కర్‌ సేల్స్‌తోనూ ఆబ్కారీ శాఖ ఇన్‌కమ్‌ పెరిగిపోయింది. ఇలా కొత్త లిక్కర్‌ స్కీమ్‌ ఇటు జనాలకు..అటు వ్యాపారులకు..ప్రభుత్వానికి అందరికీ ఉపయోగకరంగా మారింది.

డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ కానుంది.. డ్రోన్ సమ్మిట్-2024లో సీఎం చంద్రబాబు

డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ ఛేంజర్ కానుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పౌరవిమానయాన శాఖ, డీఎఫ్ఐ, సీఐఐ భాగస్వామ్యంతో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో రెండ్రోజులపాటు అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 సదస్సు జరుగుతుంది. ఈ సమ్మిట్ ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో 6,929 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యువత సాంకేతిక నిపుణులతో సదస్సు నిండిపోయిందన్నారు. 1995లో తొలిసారి సీఎం అయ్యాక ఐటీపై దృష్టిసారించా. హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. ఆ రోజుల్లో అమెరికా వెళ్లి పదిహేను రోజులు అనేక సంస్థలను కలిశా. ఆ రోజుల్లోనే పీపీపీ పద్దతిలో హైటెక్ సిటీని నిర్మించాం. ఐటీ, నాలెడ్జ్ ఎకనామీలో భారతీయులు చాలా సమర్ధులని సీఎం చంద్రబాబు అన్నారు.

ఏపీని డ్రోన్ హబ్ గా మార్చడమే లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ వరదల సమయంలో డ్రోన్లు వినియోగించాం. డ్రోన్ సేవలు అద్భుతం. డ్రోన్లతో ఆహారం, మందులు పంపించాం. రెస్క్యూ టీమ్స్ వెళ్లలేని చోటుకు డ్రోన్స్ ద్వారా ఆహారం పంపించాం. డ్రోన్లను వ్యవసాయం సహా అనేక రంగాల్లో వినియోగించవచ్చు. కొత్త ఆలోచనలు వస్తే ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చునని చంద్రబాబు అన్నారు. డ్రోన్ నిబంధనలను కేంద్రం సులభతరం చేసిందని,
డ్రోన్ ఫ్యూచర్ గేమ్ ఛేంజర్ కాబోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. డ్రోన్ల వినియోగంతో రౌడీషీటర్ల కదలికలపై నిఘాతోపటు శాంతిభద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు డ్రోన్ లను వినియోగించొచ్చునని, పోలీసు శాఖలో డ్రోన్ల విస్తృత వినియోగానికి కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు.

టమాటాతో ఈ కూరగాయను ఎప్పుడూ కలిపి తినొద్దు… చాలా డేంజర్

సలాడ్‌లను సాధారణంగా పోషకాలున్న కూరగాయలు ప్రొటీన్ల కలయికతో ఆరోగ్యకరమైన రీతిలో తయారుచేస్తారు. ఇందులో టమోటా మరియు దోసకాయలు ఉన్నాయి. కానీ వీటితో మాత్రం టొమాటో ఎప్పుడూ కలిపి తినకూడదని చాలా మందికి తెలియదు.

ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరూ సలాడ్లు ఎక్కువ లేదా తక్కువ తింటారు. సలాడ్‌లు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో జీర్ణవ్యవస్థను సాధారణంగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

అంతేకాకుండా, అన్ని కుటుంబాలు ఆహారాన్ని క్రమంలో ఉంచడానికి సలాడ్లను తింటాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, రక్త నష్టాన్ని తగ్గించడానికి శక్తిని పెంచడానికి, ఆరోగ్య నిపుణులు ఎల్లప్పుడూ సలాడ్‌లను తినమని సిఫార్సు చేస్తారు.

సలాడ్లు సాధారణంగా పోషకమైన కూరగాయలు ప్రోటీన్ల కలయికతో ఆరోగ్యకరమైన రీతిలో తయారు చేయబడతాయి. ఇందులో టమోటా , దోసకాయలు ఉన్నాయి.

కానీ, దోసకాయ , టొమాటో ఎప్పుడూ కలిపి తినకూడదని చాలా మందికి తెలియదు. ఎందుకంటే, ఇది ఆరోగ్యాన్ని రకరకాలుగా దెబ్బతీస్తుంది.

నీ రేవాలోని శ్యామ్ షా మెడికల్ కాలేజీకి చెందిన పోషకాహార నిపుణురాలు రష్మీ గౌతమ్ ఈ ఆహారాల కలయిక ఆరోగ్యానికి ఎలా ప్రమాదకరమో వివరించారు.

పోషకాహార నిపుణుడు రష్మీ గౌతమ్ ప్రకారం, దోసకాయ , టమోటాలు కలిపి తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఆమ్ల pH బ్యాలెన్స్‌కు కూడా భంగం కలిగిస్తుంది. దీని వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం, అలసట, అజీర్ణం వంటి సమస్యలు మొదలవుతాయి.

పోషకాహార నిపుణుడు రష్మీ గౌతమ్ జతచేస్తుంది, “దోసకాయలు మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడే ఖనిజాలను కలిగి ఉంటాయి, కానీ అవి విటమిన్ సిని గ్రహించడంలో సహాయపడే లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.”

ఆయన మాటల్లో చెప్పాలంటే, “దోసకాయ , టమాటా కలయికకు దూరంగా ఉండాలి. రెండూ పూర్తిగా భిన్నమైన జీర్ణక్రియను కలిగి ఉంటాయి కాబట్టి, ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపు నొప్పికి కూడా కారణం కావచ్చు.”

దోసకాయలు టమోటాలు కూడా శరీరం లోపల కిణ్వ ప్రక్రియ ప్రక్రియను ప్రారంభిస్తాయి. అందుకే ఈ రెండింటినీ కలిపి తింటే పొట్టకే కాదు, మొత్తం శరీరానికీ హానికరం. దీని వల్ల కడుపులో రకరకాల సమస్యలు వస్తాయి.

(Disclaimer: ఈ నివేదిక సాధారణ సమాచారం కోసం మాత్రమే, కాబట్టి వివరాల కోసం ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తక్కువ పెట్టుబడితో నెలనెలా ఆదాయం.. ఇలా చేస్తే సరిపోతుంది

కానీ ఇంటి ముందు ఉన్న చిన్న చెరువు లేదా టాంకులో అలంకార చేపల పెంపకం ద్వారా సులభంగా స్వయం ఉపాధిని పొందవచ్చు. కేవలం నిరుద్యోగులే కాదు, సాధారణ గృహిణులు లేదా ఉద్యోగస్తులు కూడా అలంకార చేపల పెంపకం ద్వారా సులభంగా లాభాలను పొందవచ్చు

ఇంటి ముందు ఉన్న చిన్న చెరువు లేదా టాంకు నిరుద్యోగ యువతీయువకుల అదృష్టాన్ని మార్చగలదు. ఈ చేపల పెంపకం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ప్రస్తుత కాలంలో నిరుద్యోగ సమస్య దేశవ్యాప్తంగా ఉంది. సరైన ఉపాధి అవకాశాల కొరత వల్ల విద్యావంతులైన యువతీయువకులు ఆర్థికంగా వెనుకబడిపోతున్నారు. కానీ ఇంటి ముందు ఉన్న చిన్న చెరువు లేదా టాంకులో అలంకార చేపల పెంపకం ద్వారా సులభంగా స్వయం ఉపాధిని పొందవచ్చు. కేవలం నిరుద్యోగులే కాదు, సాధారణ గృహిణులు లేదా ఉద్యోగస్తులు కూడా అలంకార చేపల పెంపకం ద్వారా సులభంగా లాభాలను పొందవచ్చు.

ఇళ్లలో, రెస్టారెంట్లలో లేదా కార్యాలయాలలో అలంకరణ కోసం అక్వేరియంలు ఉంచడం సర్వసాధారణం. గోల్డ్ ఫిష్, ఫైటర్ ఫిష్ వంటి వివిధ రకాల చేపలను అక్వేరియంలో ఉంచుతారు. ప్రస్తుతం అక్వేరియం చేపల పెంపకం ధోరణి రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో మార్కెట్లో వివిధ రకాల అక్వేరియం చేపలకు మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఈ చేపల వాణిజ్య పెంపకం చాలా లాభదాయకం.

తక్కువ సంరక్షణతో, తక్కువ పెట్టుబడితో ఇంటి ముందు చెరువు లేదా టాంకులో అక్వేరియం చేపలను పెంచవచ్చు. గోల్డ్ ఫిష్ నుండి టైగర్ లేదా మొల్లీ వంటి వివిధ రకాల అక్వేరియం చేపల పెంపకం ద్వారా ఆత్మనిర్భరత సాధించవచ్చు.

అక్వేరియం చేపల పెంపకం గురించి నందిగ్రామ్ 1 బ్లాక్ మత్స్య విస్తరణ అధికారి సుమన్ కుమార్ సాహు మాట్లాడుతూ, “ఇంటి ఆవరణలో 24 చదరపు అడుగుల టాంకును నిర్మించి, అందులో సులభంగా గోల్డ్ ఫిష్‌ను వాణిజ్యపరంగా పెంచవచ్చు. కొద్ది సంరక్షణతో గోల్డ్ ఫిష్ త్వరగా పెరుగుతుంది” అని తెలిపారు. ప్రస్తుతం గోల్డ్ ఫిష్ మార్కెట్ ధర 50 రూపాయల నుండి ప్రారంభమై, వివిధ జాతుల బట్టి వివిధ ధరలు ఉంటాయి. దీంతో ఈ పెంపకం చాలా లాభదాయకం. కేవలం గోల్డ్ ఫిష్ మాత్రమే కాకుండా, దానితోపాటు వివిధ రకాల అలంకార చేపలను తక్కువ కాలంలో మరియు తక్కువ శ్రమతో సులభంగా పెంచవచ్చు. అందుకే ఈ పెంపకం చాలా లాభదాయకం.

ప్రస్తుత కాలంలో చాలా మంది నిరుద్యోగ యువతీయువకులు ఉపాధి అవకాశాల కొరత వల్ల దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అందువల్ల ఇంటి వద్ద చిన్న స్థలంలో తక్కువ కాలంలో మరియు తక్కువ శ్రమతో అలంకార చేపల పెంపకం వారిని స్వావలంబనగా మార్చగలదు. కేవలం నిరుద్యోగులే కాదు, ప్రత్యామ్నాయ వృత్తిని వెతుకుతున్న వివిధ వృత్తుల వారు లేదా గృహిణులు కూడా స్వావలంబన సాధించడానికి అలంకార చేపల పెంపకం చాలా లాభదాయకం.

వీరు పొరపాటున కూడా కాలీఫ్లవర్ తినకూడదు? ప్రాణానికే ప్రమాదం

మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తినాలి. డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలు చేర్చుకోవాలి. అయితే చాలా మంది వారికి తెలియకుండా కొన్నింటిని తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు. అయితే కొన్ని సమస్యలతో బాధ పడేవారు కాలీఫ్లవర్ అస్సలు తినకూడదు. ఎందుకంటే

మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తినాలి. డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలు చేర్చుకోవాలి. అయితే వివిధ సీజన్లలో లభించే దుంపలు, ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుత చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే వెజిటెబుల్స్‌‌ తినాలి.

వీటితో సూప్స్, సలాడ్స్ వంటివి చేసుకుంటే టేస్ట్‌తో పాటు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఈ లిస్టులో కాలీఫ్లవర్‌ కచ్చితంగా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

క్యాబేజీ, బ్రకోలీ లాగే కాలీఫ్లవర్ కూడా క్రూసిఫెరస్ జాతికి చెందినది. సాధారణంగా తెలుపు రంగులో ఉండే కాలీఫ్లవర్ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, పర్పుల్, ఆరెంజ్, గ్రీన్ కలర్ వెరైటీలు కూడా ఉన్నాయి. వివిధ రకాల పోషకాలు, సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు దీని నుంచి లభిస్తాయి

కాలీఫ్లవర్ కలర్ ఎలాంటిదైనా అందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక మీడియం సైజు కాలీఫ్లవర్‌లో 11 గ్రాముల ప్రొటీన్, 12 గ్రాముల డైటరీ ఫైబర్, 129 మిల్లీగ్రాముల క్యాల్షియం, 22 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 259 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 1,760 మిల్లీగ్రాముల పొటాషియంతో పాటు జింక్, ఐరన్, కాపర్, థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, ఫోలేట్, లూటేన్, విటమిన్ K, B6 ఉంటాయి.

కాలీఫ్లవర్ తింటే డయాబెటిస్, గుండె వ్యాధుల వంటి దీర్ఘకాలిక సమస్యలు రావు. వీటిలోని హెల్తీ కాంపౌండ్స్.. క్యాన్సర్‌కి దారితీసే హానికర ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను ఇది కాపాడుతాయి. ముఖ్యంగా ఇందులో గ్లూకోసినోలేట్స్, ఐసోథియోసైనేట్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి. దీంతోపాటు కాలీఫ్లవర్‌లోని సల్ఫోరాఫేన్ బ్లడ్ ప్రెజర్‌ తగ్గించి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది

గోబీ పువ్వులోని సమ్మేళనాలు శరీరంలో మంచి రక్తాన్ని తీసుకెళ్లే ధమనుల వాపును దూరం చేస్తాయి. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ హెల్తీగా ఉంటుంది. దీంట్లోని విటమిన్ C ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది.

మెదడు అభివృద్ధిలోనూ ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. లెర్నింగ్ ఎబిలిటీతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇందులో తక్కువ క్యాలరీలు ఉన్నందున వెయిట్ లాస్ కావాలని అనుకునేవారు కాలీఫ్లవర్‌ని తినొచ్చు. కాలీఫ్లవర్ తింటే ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు కూడా రావు.

కాలీఫ్లవర్ అతిగా తినడం కూడా మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వాడకం పెరిగితే జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగే కొందమందికి క్రూసిఫెరస్ వెజిటెబుల్స్ పడవు. ఇలాంటి వారు గోబీ పువ్వు వంటకాలు తింటే కడుపు ఉబ్బరంగా మారి, గ్యాస్ ఏర్పడి అసౌకర్యానికి గురిచేస్తాయి. దీంతో పాటు విటమిన్ K కంటెంట్ ఎక్కువగా ఉండటం కొందరి ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది.

బ్లడ్ థిన్నర్స్ సమస్య ఉండేవారు దీనికి దూరంగా ఉండాలి. దీంతో పాటు స్కిజోఫ్రినియా, మేగ్రేన్, నాడీ సంబంధిత సమస్యలకు చికిత్స పొందుతున్న వారు కాలీఫ్లవర్‌కి దూరంగా ఉండాలి. ఇలాంటి వారు వైద్యుడిని సంప్రదించాక డైటరీ నియమాలు పాటించాలి.

సిలిండర్లు ఫ్రీ.. ఎవరికీ.. ఎన్ని అంటే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండగ సందర్భంగా మరో కీలక పథకం ప్రారంభించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పండగ సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పారు. దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి.. ఆ రోజున దీపం పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.

ఏడాదికి ఎన్నంటే..

ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు అర్హులైన వారికి దీపం పథకం కింద సిలిండర్లను అందజేస్తారు. ఏడాదికి మూడు సిలిండర్లు మాత్రమే ఫ్రీగా ఇస్తారు. ఇందుకోసం ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుంది. మహిళ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీపం పథకం రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలుస్తోందని అభిప్రాయ పడ్డారు. ఆడ పడుచులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

ఎవరు అర్హులంటే..

ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం ప్రయోజనం పొందేవారికి మాత్రమే దీపం పథకానికి అర్హులు. మిగతా వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఉజ్వల గ్యాస్ లబ్దిదారులకు ఈజీగా దీపం పథకం అమలవుతుంది.

అర్హతలు

-విధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు కావాలి.

-గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి

-ఆర్థికంగా వెనకబడిన వారైతే అర్హులు

-బీపీఎల్ కుటుంబాలు దరఖాస్తు చేయాలి.

-వైట్ రేషన్ కార్డు ఉన్న వారిని ప్రమాణికంగా తీసుకుంటారు.

ఏమేం కావాలంటే..

-ఆధార్ కార్డ్

-రేషన్ కార్డ్

-మొబైల్ నంబర్

-కరెంట్ బిల్లు

-నెటివిటి సర్టిఫికెట్

3 సిలిండర్లు..

దీపం పథకం కింద మూడు సిలిండర్ల కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సూచించిన విధంగా పేరు, చిరుమానా రాయాలి. తర్వాత డాక్యుమెంట్స్ ఫొటోలు అప్ లోడ్ చేయాలి. చివరగా యాక్సెప్ట్ చేసి, సబ్ మిట్ చేయడంతో అప్లై చేసినట్టు అవుతుంది. దానిని అధికారులు పరిశీలించి.. మీరు అర్హులు అయితే ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు అంగీకరిస్తారు.

జగన్‌ నీకు సిగ్గులేదా

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.3,500 కోట్ల బకాయి పెట్టేందుకు సిగ్గులేదా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అని ఎక్స్‌ వేదికగా సోమవారం ఆమె స్పష్టం చేశారు. నాడు వైఎ్‌సఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అద్భుతంగా అమలు చేశారని, ఆయన సొంత కొడుకై ఉండి జగన్‌ తన హయాంలో ఈ పథకాన్ని నీరుగార్చారని అసహనం వ్యక్తం చేశారు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను కూటమి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రతి రోజూ జొన్న రొట్టెలు తింటున్నారా?.. అయితే మీ శరీరంలో కలిగే మార్పులు ఇవే

జొన్నలు లేదా సొర్గమ్ (Sorghum) అనేది ఒక పౌష్టిక ధాన్యం, జొన్న రొట్టెలు తెలుగునాట సంప్రదాయ ఆహార పదార్థాలలో ఒకటి. ఇది పూర్వకాలం నుండి మన ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంది. జొన్నలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, మరియు ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి, శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందిస్తాయి. జొన్న రొట్టెలు రోజూ తినడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

1. శరీరానికి శక్తి జొన్న రొట్టెలు అధిక పౌష్టిక విలువలను కలిగి ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా కలిగి ఉండడం వలన శరీరానికి ఇంధనం అందించి, శక్తిని నిలుపుకొంటాయి. రోజూ ఉదయాన్నే జొన్న రొట్టెలు తినడం వలన శరీరానికి అవసరమైన శక్తిని అందించి, చురుకుదనాన్ని కలిగిస్తాయి.

2. జీర్ణవ్యవస్థకు మేలు జొన్నలలో అధికంగా ఉండే డైట్‌ ఫైబర్ జీర్ణవ్యవస్థను క్రమబద్ధంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్యలను తగ్గించి, పేగు సంరక్షణను మెరుగుపరుస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వలన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. జొన్న రొట్టెలు తీసుకోవడం వలన జీర్ణం సులభంగా జరుగుతుంది.

3. బరువు తగ్గడంలో సహాయం జొన్న రొట్టెలు తినడం వలన బరువు తగ్గేందుకు సహాయపడవచ్చు. వీటిలో ఉండే పీచు (ఫైబర్) మరియు ప్రోటీన్ ఎక్కువ ఉండడం వలన, ఆకలి త్వరగా వేయదు. ఇది చాలా కాలం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ తగ్గించి, అనవసరమైన కేలరీలను తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు జొన్న రొట్టెలను తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

4. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ రొట్టెలు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. జొన్న రొట్టెలు తినడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి, మధుమేహం రాకుండా చూసుకోవచ్చు.

5. హృదయ ఆరోగ్యం జొన్న రొట్టెలు హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తాయి. ఇవి గుండె రోగాలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జొన్న రొట్టెలు తినడం మంచిదని సూచించబడింది.

6. రక్తహీనతను తగ్గిస్తుంది జొన్నలు అధికంగా విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్

B వంటి విటమిన్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇవి శరీరంలో రక్తహీనతను (అనీమియా) తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

7. ఎముకల బలం జొన్నల్లో ఉన్న మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకల బలాన్ని పెంచుతాయి. ఎముకల సంబంధిత వ్యాధులు మరియు నాజుకుతనం సమస్యలను తగ్గించడానికి జొన్న రొట్టెలు మంచి ఆహారం. దీన్ని రోజూ తినడం వలన ఎముకలు బలంగా ఉంటాయి, ముఖ్యంగా వృద్ధులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

8. కాన్సర్ నిరోధకత జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన, ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి. జొన్నలలో పొలీఫినాల్స్ అనే పదార్థం ఉండి, ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను తగ్గిస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్ శరీరానికి హాని చేసేవి కాబట్టి, జొన్నలు తీసుకోవడం వలన ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.

9. రోగనిరోధక వ్యవస్థ బలోపేతం జొన్నల్లో ఉండే విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇది శరీరంలో వ్యాధి కారకులను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటంతో, శరీరం అనేక వ్యాధులను సులభంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది.

10. మానసిక ప్రశాంతత జొన్నల్లో ఉండే ఫైబర్ మరియు ప్రోటీన్లు నెమ్మదిగా జీర్ణమవుతూ, మెదడుకు అవసరమైన శక్తిని అందిస్తాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత కలిగించి, ఉత్కంఠ, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ జొన్న రొట్టెలు తినడం వలన మెదడుకు సరైన ఆహారం అంది, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. జొన్న రొట్టెలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పౌష్టిక విలువలను అందించడమే కాకుండా, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం, బరువు తగ్గించడం, గుండె ఆరోగ్యం, ఎముకల బలం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. సంప్రదాయ ఆహారంలో భాగమైన జొన్న రొట్టెలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ఎన్ టి పీ సి లో జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NTPC Recruitment Notification: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 50

👉అర్హత :అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి అగ్రికల్చరల్ సైన్స్లోలో బీఎస్సీ కలిగి ఉండాలి. ఈ పోస్టులో బయోమాస్ వ్యర్థాలను నిర్వహించడం, ప్రత్యామ్నాయ ఉపయోగాలను అన్వేషించడం, రైతులు, ప్రజలలో అవగాహన పెంచడం వంటివి ఉన్నాయి.

👉శాలరీ : జూనియర్ ఎగ్జిక్యూటివ్ లు రూ.40వేల ఉంటుంది.అదనంగా, కంపెనీ అందించిన వసతి లేదా హెచ్ఎస్ఏ, జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులకు వైద్య ప్రయోజనాలు పొందవచ్చు.

👉వయస్సు : అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10ఏళ్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మాజీ సైనికులకు వయో సడలింపు ఉంటుంది.

👉అభ్యర్థులు బీఎస్సీ డిగ్రీలో కనీసం 40శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీస మార్కుల అవసరం లేదు. కేవలం ఉత్తీర్ణత మార్కులతోనే అర్హులు.

👉దరఖాస్తులకు చివరి తేదీ : అక్టోబర్ 28, 2024

👉ఎన్టీపీసీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష, ఆపై ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తద్వారా ఖాళీల సంఖ్యను సర్దుబాటు చేయవచ్చు. స్టేషన్లు, ప్రాజెక్ట్లు, జేవీలు, అనుబంధ సంస్థలు, కార్యాలయాలతో సహా వివిధ ఎన్టీపీసీ స్థానాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఫీల్డ్వర్క్ కేటాయిస్తారు.

👉ఎంపికైన అభ్యర్థులు ప్రారంభంలో ఒక ఏడాది పాటు శిక్షణ పొందుతారు. పర్ఫార్మెన్స్, సంస్థాగత అవసరాల ఆధారంగా పొడిగింపు అవకాశం ఉంటుంది.

గుంటూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేటర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

DMHO Recruitment Notification: ఉమ్మడి గుంటూరు(Guntur) జిల్లాలోని అర్బన్ క్లినిక్/యూపీహెచ్ సీల్లో(Urban Clinic/ UPHC) ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేటర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల.

👉అర్హత :పోస్టును బట్టి 10th క్లాస్, పీజీడీసీఏ, డీఫార్మసీ/బీఫార్మసీ/ ఎంఫార్మసీ, బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.

👉పోస్టుల వివరాలు:

▪️ల్యాబ్ టెక్నీషియన్ (Lab Technician) : 03 పోస్టులు

▪️శానిటరీ అటెండెంట్ (Sanitary Attendant): 11 పోస్టులు

▪️డేటా ఎంట్రీ ఆపరేటర్ (Data Entry Operator) : 11 పోస్టులు

▪️ ఫార్మసిస్ట్(Pharmacist) : 15 పోస్టులు

👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 1 సెప్టెంబర్ 2024 నాటికి 42 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు ఫీజు : అన్ రిజర్వ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు రూ. 100 ఫీజు ఉంటుంది.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉ఈ పోస్టులకు ఎంపికైన వారిని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకుంటారు.

👉 అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

వన్‌ప్లస్‌ 13 ఫోన్‌ వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌

OnePlus అభిమానులకు మరో శుభవార్త వచ్చింది. ఈ కంపెనీ తదుపరి ప్రీమియం ఫోన్ సిరీస్ OnePlus 13 లాంచ్ తేదీ ప్రకటించింది. గత కొన్ని వారాలుగా OnePlus 13 గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఫోన్ లాంచ్ డేట్ కూడా తెలిసింది. OnePlus 12 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న OnePlus 13 ఈ నెలాఖరున విడుదల కానుంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, OnePlus తన కొత్త ప్రీమియం ఫోన్‌లో Qualcomm అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌ను అందించబోతోంది. ఇది కాకుండా, మునుపటి అనేక వన్‌ప్లస్‌ ఫోన్ సిరీస్‌లలో చూసినట్లుగా, ఈ ఫోన్ కెమెరా సెటప్ కూడా Hasselblad ద్వారా తయారు చేసి ఉంటుందని తెలుస్తోంది.

వన్‌ప్లస్ ప్రకారం, వన్‌ప్లస్ 13 మొదట దాని హోమ్ మార్కెట్‌ చైనాలో అక్టోబర్ 31, 2024న విడుదల చేయనుంది. ఆ తర్వాత ఈ ఫోన్ ప్రపంచంలోని ఇతర దేశాల్లో, భారతదేశంలో కూడా ప్రారంభించనుంది. ఈ ఫోన్ టీజర్ కూడా రివీల్ చేసింది. ఇందులో దాని మూడు కలర్ వేరియంట్‌లను చూడవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌ను అబ్సిడియన్ బ్లాక్, బ్లూ మూమెంట్, వైట్ డ్యూ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేయబోతోంది.

OnePlus 13 స్పెక్స్:

చైనాలో OnePlus 13 లాంచ్ టీజర్ కూడా విడుదలైంది. దీని ప్రకారం ఫోన్ లాంచ్ కార్యక్రమం అక్టోబర్ 31 న చైనా కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి మాట్లాడితే.. ఇప్పటివరకు లీక్ అయిన రిపోర్ట్‌ల ప్రకారం, ఇది ప్రపంచంలోనే మొదటి సెకండ్-జెన్ 2K BOE X2 కర్వ్‌డ్ డిస్‌ప్లేని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది కాకుండా, Snapdragon 8 Elite (8 Gen 4) ఫోన్‌కు అద్భుతమైన ప్రాసెసర్‌ను అందించడానికి ఉపయోగించవచ్చు.

ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని చెబుతున్నారు. ఈ సెటప్ ప్రధాన కెమెరా 50MP LYT808 సెన్సార్ కావచ్చు, రెండవది 50MP JN5 సెన్సార్ కావచ్చు. మూడవది పెరిస్కోప్ సెన్సార్ కావచ్చు. అయితే, దీనికి సంబంధించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ లీకులు, టెక్‌ నిపుణుల నుంచి వివరాలు బయటకు వచ్చాయి.

6000mAh జంబో బ్యాటరీ

ఈ మొబైల్‌కు 6000 mAh జంబో బ్యాటరీని అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది IP68/IP69 రేటింగ్‌ను కూడా పొందవచ్చు. ఇది ఫోన్‌ను నీరు, ధూళి సమస్యల నుండి పూర్తిగా సురక్షితంగా ఉంటుందని తెలుస్తోంది.

మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

బంగారం ధరల్లో ప్రతీరోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఒకరోజు పెరిగితే, మరోరోజు తగ్గుతూ కనిపిస్తాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతోన్న బంగారం ధర..

నిన్న కాస్త తగ్గింది. కానీ నేడు అంటే, మంగళవారం పెరిగి జనాలకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ఏకంగా రూ. 10 మేరకు పెరిగి రూ. 79,650కి చేరింది. అటు 22 క్యారెట్ల తులం గోల్డ్‌ రూ. 10కి పెరిగి రూ. 73,010గా ఉంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులు, గోల్డ్ రిజర్వ్‌ల నిల్వ వంటి అంశాలు గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. మరి దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,160గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 79,800కి ఎగబాకింది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,010గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 79,650 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,650 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,010 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 79,650 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,010గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 79,650 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,010కాగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,650గా ఉంది.

* సాగరనగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,650 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే.. వెండి ధరలోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా మంగళవారం కిలో వెండి ధరలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. దీంతో ఢిల్లీతో పాటు, కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,01,100కి చేరింది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,09,100గా.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 1,09,100గా ఉంది. ఈ ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఇక మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకోవచ్చు. బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

రూ. 10 కాయిన్‌పై ఇండియన్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన.

రూ. 10 కాయిన్‌ ఇస్తే ఇప్పటికీ తీసుకోవడానికి వెనుకడుగు వేసే వారు చాలా మంది ఉన్నారు. కాయిన్‌ చెల్లదంటూ ఓ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ కాయిన్‌కు చెల్లదని ఆర్బీఐ అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు.

అయితే ప్రజల్లో మాత్రం ఓ అపోహ మాత్రం ఉంటోంది. అయితే రూ. 10 కాయిన్‌ తీసుకోవడాన్ని నిరాకరిస్తే నేరంగా పరిగణించాలని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా రూ. 10 నాణేలపై ఇండియన్‌ బ్యాంక్‌ అవగాహణ కార్యక్రమం చేపట్టింది. ఈ కాయిన్స్‌ చట్టబద్ధమైనవని, వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వీటి చలామణిని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలని , ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఇండియన్ బ్యాంక్ చర్యలు చేపడుతోందని చెప్పుకొచ్చారు.

ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్ హిమాయత్ నగర్ బ్రాంచ్ వద్ద 10 రూపాయల నాణేలు చలామణిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తమ ఖాతాదారులకు 10 రూపాయల నాణేలు వినియోగించాలని సూచిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఈ నాణేలు చెల్లబాటు అవుతున్నాయని తెలిపారు. కాగా ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు ఈ నాణేలను జీఎం చేతుల మీదుగా అందుకున్నారు. దీంతో రూ. 10 నాణేంపై జరుగుతోన్న అపోహలకు చెక్‌ పెట్టినట్లు అయ్యింది.

ఇదిలా ఉంటే ఇప్పటికీ చాలా మంది రూ. 10 నాణేలను తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటిపై సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో ఈ కాయిన్స్ చెల్లవన్న అనుమానంతో తీసుకోవడం లేదు. ఈ కారణంగా ఈ నాణేల రొటేషన్ మార్కెట్లో భారీగా తగ్గిపోయింది. అదే విధంగా మార్కెట్లో రూ. 10 నోట్ల కొరత కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. నోట్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాయిన్స్ పై అవగాహన పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది.

LCUలో బిగ్ సర్‌ప్రైజ్.. లోకేష్ ప్లాన్ అఫ్ యాక్షన్ ఏంటి.? అవెంజర్స్ రేంజ్‌లో నెక్ట్స్ ప్రాజెక్ట్‌..

దర్శకుడు లోకేష్ కనగరాజ్ బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. సౌత్ స్క్రీన్‌ మీద తొలిసారి యూనివర్స్‌లకు తెర లేపిన ఈ డైరెక్టర్‌, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అవెంజర్స్ రేంజ్‌లో చూపించబోతున్నారు.
ఇంతకీ లోకేష్ ప్లాన్ చేస్తున్న ఆ సర్‌ప్రైజ్‌ ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరి.

ప్రజెంట్ రజనీకాంత్ హీరోగా కూలీ ను తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్‌. అయితే ఈ లోకి టిక్ యూనివర్స్‌లో భాగం కాదని ఇప్పటీకే వెల్లడించారు చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్.

నెక్ట్స్ బ్లాక్ బస్టర్ ఖైదీకి పార్ట్ 2 ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ ను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు లోకేష్‌. బిగ్గెస్ట్ ఎవ్వర్‌ మల్టీ స్టారర్‌ను ఆడియన్స్‌కు చూపించేందుకు రెడీ అవుతున్నారు.

లోకేష్‌ యూనివర్స్‌లో తొలి గా వచ్చింది ఖైదీ. ఆ తరువాత ఆ కథకు కొనసాగింపుగా విక్రమ్‌, లియో లు వచ్చాయి. అందుకే త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లబోయే ఖైదీ పార్ట్ 2లో ఆ రెండు ల్లో కనిపించిన మెయిన్‌ క్యారెక్టర్స్‌ను చూపించే ప్లాన్‌లో ఉన్నారు.

ఖైదీ 2లో విక్రమ్‌లో నటించిన కమల్‌ హాసన్, సూర్యతో పాటు మాస్టర్ హీరో విజయ్‌ క్యారెక్టర్‌ను కూడా చూపించాలన్నది లోకేష్‌ ప్లాన్‌. ఒక వేళ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా విజయ్‌ గెస్ట్ రోల్‌కు నో చెప్పినా, లియో కథతో లింక్స్‌ మాత్రం ఖైదీ 2లో చూపించబోతున్నారు.

ఖైదీ 2 మూవీని ప్రీక్వెల్‌లా ప్లాన్ చేస్తున్న లోకేష్‌, ఈ కథలో సూర్య చేసిన రోలెక్స్‌ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్న హింట్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి రోలెక్స్‌ను మెయిన్‌ విలన్‌గా చూపించకపోయినా… ఫ్యూచర్‌లో ఆ పాత్ర నేపథ్యంలో ఓ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్.. 160 రోజుల వ్యాలిడిటీతో

Jio, Airtel, Vi, BSNL భారతదేశ టెలికాం పరిశ్రమలో నాలుగు ప్రధాన టెలికాం కంపెనీలు. జియో ప్రస్తుతం అతిపెద్ద టెల్కోగా ఉంది. అయితే కంపెనీ ధరలను పెంచినప్పటి నుండి ప్రభుత్వం టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ముఖ్యాంశాలలో ఉంది.

చౌక రీఛార్జ్ ప్లాన్‌ల కోసం కంపెనీ నిరంతరం చౌకైన ప్లాన్‌లతో గొప్ప ఆఫర్‌లను అందిస్తోంది. ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల కోసం 160 రోజుల చౌకైన ప్లాన్‌తో ముందుకు వచ్చింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుతం టెలికాం పరిశ్రమలోని వినియోగదారులకు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీకి వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, కంపెనీ తన చౌకైన ప్లాన్‌లతో జియో, ఎయిర్‌టెల్‌తో పోటీ పడుతోంది. ఖరీదైన ప్లాన్‌ల కారణంగా లక్షలాది మంది ప్రజలు జియో, ఎయిర్‌టెల్ నుండి బీఎస్ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు.

కస్టమర్ల పెరుగుతున్న డిమాండ్‌ను చూసి బీఎస్‌ఎన్ఎల్‌ 160 రోజుల గొప్ప ప్లాన్‌ జాబితాలో ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కోట్లాది మొబైల్ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.

మీరు ఎక్కువ వ్యాలిడిటీ కోసం చూస్తున్నట్లయితే 160 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో వినియోగదారులకు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. జియో ఎయిర్‌టెల్ మాదిరిగానే, ఈ ప్లాన్ కూడా మీకు రోజుకు 100 ఉచిత SMSలను అందిస్తుంది.

మీరు 160 రోజులకు 1000 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కోసం మీరు కేవలం 997 రూపాయలు మాత్రమే. మీరు 160 రోజుల పాటు మొత్తం 320GB డేటాను పొందుతారు. అంటే మీరు రోజుకు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. BSNL కస్టమర్‌లకు హార్డీ గేమ్స్+ఛాలెంజర్ అరేనా గేమ్స్+ గేమ్‌వన్, ఆస్ట్రోటెల్+గేమ్+జింగ్ మ్యూజిక్+వేవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.

తిరుమలలో హెలికాప్టర్‌ చక్కర్లు.. ఎలా వచ్చింది?

తిరుమలలో హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. వాస్తవానికి తిరుమలో డ్రోన్లు, హెలికాప్టర్లు ఎగరవేయవద్దని రూల్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే తిరుపతిలో నో ఫ్లే జోన్‌ను పోలీసులు ప్రకటించారు.

ఈ నిబంధన ఉన్నా ఆకాశంలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధమని భక్తులు మండిపాడున్నారు. దీంతో టీటీడీ ఆ హెలికాప్టర్‌ ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఈ విషయంపై ఏవీయేషన్ అధికారులకు టీటీడీ సమాచారం అందించారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంపై వారు అధికారులతో చర్చిస్తున్నారు. ఇటీవలే తిరుపతి లడ్డూలలో జంతు కొవ్వు ఉందనే ఆరోపణల వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలో నిజం లేదని ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తోసిపుచ్చింది. తిరుపతి లడ్డూ, ఎంతో గౌరవప్రదమైన ప్రసాదంగా భక్తులు భావిస్తారు. లక్షలాది మంది యాత్రికులకు చాలా కాలంగా స్వచ్ఛత, భక్తికి చిహ్నంగా లడ్డూ ఉంది. అయితే ఇటీవల వచ్చిన వాదనలు తిరుమల ఆలయంలో అమలులో ఉన్న నాణ్యత నియంత్రణ చర్యలపై భక్తుల్లో సందేహాలకు దారితీశాయి.

రూ. 45 వేల ట్యాబ్‌ రూ. 27 వేలకే.. సామ్‌సంగ్‌ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్‌

అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన గ్యాలక్సీ ట్యాబ్‌ ఎస్‌9 ఎఫ్‌ఈ ప భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. సుమారు ఈ ట్యాబ్‌పై ఏకంగా రూ.

20 వేలకిపైగా డిస్కౌంట్‌ లభిస్తోంది.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ట్యాబ్‌ ఎస్‌9 ఎఫ్‌ఈ ట్యాబ్‌ అసలు ధర రూ. 44,999కాగా సేల్‌లో భాగంగా రూ. 27,999కి సొంతం చేసుకోవచ్చు. అయితే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. వెయ్యి డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 26,999కి సొంతం చేసుకోవచ్చు.

అయితే ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. ఎక్స్ఛేంజ్‌ ద్వారా గరిష్టంగా రూ. 25,900 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక సామ్‌సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ ఎస్‌9 ఎఫ్‌ఈ ట్యాబ్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ట్యాబ్‌లో 128 జీబీ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌ను అందించారు. ఇందులో 10.9 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 2304 x 1440 రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ సొంతం. ఈ ట్యాబ్‌ Exynos 1380 చిప్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారచు. 8000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ట్యాబ్ సొంతం. ఐపీ68 రేటింగ్‌తో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు.

విమాన టిక్కెట్లు కొనండి.. భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీలు

దీపావళి ఫ్లైట్ సేల్ విభాగంలోకి ఎయిర్ ఇండియా వచ్చింది. పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం విమాన టికెట్లపై తగ్గింపులు అందజేస్తోంది. కస్టమర్లను ఆకర్షించడం, తోటి విమానయాన సంస్థ పోటీని తట్టుకోవడానికి ఈ చర్యలు తీసుకుంది.

గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం దీపావళికి విమాన టిక్కెట్ల ధరలు 20 నుంచి 25 శాతం తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి. ఎయిర్స్ లైన్స్ సామర్థ్యం పెరగడంతో పాటు చమురు ధరల తగ్గుదల కూడా దీనికి కారణమని చెబుతున్నారు.

ఎయిర్ ఇండియా ఆఫర్లు

దీపావళి సందర్భంగా ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ప్రత్యేక తగ్గింపుపై విమాన టిక్కెట్లను విక్రయిస్తోంది. సింగపూర్ కు, అక్కడి నుంచి తిరిగి వచ్చే వన్ వే టిక్కెట్లను రూ.7,445 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కింద అక్టోబర్ 8 నుంచి నవంబర్ 30వ తేదీ మధ్య ప్రయాణం చేయవచ్చు.
సింగపూర్ వెళ్లే, తిరిగి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సైతం ప్రత్యేక డీల్ అందుబాటులో ఉన్నాయి. వారు 500 డాలర్ల కన్నా (రూ.32,231) తక్కువకు టిక్కెట్లను పొందవచ్చు. వీరు 2025 మార్చి వరకూ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
సౌదీ అరేబియాలోని రియాద్, జెద్దాలకు వెళ్లాలనుకున్న వారికి సైతం టిక్కెట్లపై ఆఫర్ అందుబాటులో ఉంది. నవంబర్ 17వ తేదీలోపు టిక్కెట్ బుక్ చేసుకున్న వారికి కేవలం రూ.32,611 మాత్రమే పడుతుంది. వీరు 2025 మార్చి వరకూ ప్రయాణం చేయవచ్చు.
ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల నుంచి ప్రయాణం చేసేవారు బిజినెస్ క్లాస్ లో 10 శాతం, ఎకానమీ క్లాస్ లో 5 శాతం తగ్గింపు పొందవచ్చు.
వన్ వే డొమెస్టిక్ విమానాల్లో నవంబర్ 30 వరకూ ప్రయాణం చేసే వారికి తక్షణ తగ్గింపుగా రూ.200 అందిస్తున్నారు.

విస్తారా ఆఫర్లు

విస్తారా ఎయిర్ లైన్స్ లో పండగ ఆఫర్లు ఏమీలేవు. ఎయిర్ ఇండియా లో విలీనం కారణంగా నవంబర్ నుంచి విస్తారా కార్యకలాపాలు ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన రూట్లలో టిక్కెట్ల విక్రయాలు విస్తారా నుంచి ఎయిర్ ఇండియాకు మారతాయి.

ఇండిగో

దీపావళి సందర్భంగా విమాన టిక్కెట్లపై ఇండిగో ఎలాంటి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించలేదు. ఇండిగో వెబ్ సైట్, మొబైల్ అప్లికేషన్ నుంచి డైరెక్ట్ బుకింగ్ లపై ప్రయాణికులు పది శాతం వరకూ తగ్గింపును పొందుతున్నారు.

ఖతార్ ఎయిర్ వేస్

ఖతార్ ఎయిర్ వేస్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు దీపావళికి టిక్కెట్ల ఆఫర్లు ప్రకటించాయి. బిజినెస్ క్లాస్ పై 25 శాతం, ఎకానమీ క్లాస్ పై 20 శాతం తగ్గింపును ఆఫర్ చేశాయి.

ఆధార్ కార్డులో మార్పులకూ నిబంధనలున్నాయి.. పేరు మార్చుకోవాలంటే అవి మస్ట్

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ద్వారా ఆధార్ కార్డు జారీ అవుతుంది. బయో మెట్రిక్, డెమో గ్రాఫిక్ డేటా ఆధారంగా దాన్ని రూపొందిస్తారు.

ఆధార్ కార్డులో 12 అంకెల నంబర్ కేటాయిస్తారు. అదే మనకు గుర్తింపు గా ఉపయోపడుతుంది. అయితే ఉద్యోగాలు, వ్యాపారాలు, బతుకుదెరువు కోసం ప్రజలు ఒకచోట నుంచి మరోచోటుకు వలస వెళతారు. అప్పుడు ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులకు కూడా పలు నిబంధనలు వర్తిస్తాయి. ఆధార్ కార్డులో పేరును మార్పు చేసుకునే అవకాశం ఉంది. అది కూడా కేవలం రెండు సార్లు మాత్రమే చేసుకోవచ్చు.

అసాధారణ సమయంలో ప్రత్యేక అభ్యర్థనపై యూఐడీఏఐ కార్యాలయం తదుపరి మార్పులను అనుమతిస్తుంది. ఆధార్ కార్డులోని పేరులో స్పెల్లింగ్ దోషాలు, క్రమాన్ని మార్చడం, సంక్షిప్త రూపంలోకి మార్చడం, వివాహం తర్వాత పేరు మార్పులు తదితర వాటికి అవకాశం ఉంది. సాాధారణంగా ఆధార్ కార్డులో మార్పులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో చేసుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ, లింగం, బయో మెట్రిక్ (వేలి ముద్రలు, ఐరిష్), మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వాటిని మార్చడానికి తప్పకుండా ఆధార్ కేంద్రాలకు వెళ్లాలి. కేవలం చిరునామాను మాత్రం తగిన ధ్రువీకరణ పత్రాలను అప్ లోడ్ చేసి ఆన్ లైన్ లో మార్చుకునే అవకాశం ఉంది.

ఆధార్ కార్డులో పేరు మార్చాలంటే..

సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లండి
యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ నుంచి ఆధార్ ఎన్ రోల్ మెంట్, అప్ డేట్ ఫారం డౌన్ లోడ్ చేయండి. దానిలో వివరాలు నింపండి
కేంద్రంలో ఆపరేటర్ కు గుర్తింపు పత్రాలు అందించండి
ఆధార్ కార్డులో పేరు మార్పునకు రూ.50 చార్జీ చెల్లించండి.
మీరు యూఆర్ఎన్ (అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్) నంబర్ అందుకుంటారు. దాని ద్వారా యూఐడీఏఐ ఆధార్ స్థితిని తనిఖీ చేయవచ్చు.

యువతకు పిచ్చెక్కిస్తున్న డ్యూక్.. నయా మోడల్ ధర ఎంతంటే.

యువతకు ఆకట్టుకునేలా స్పోర్టివ్ లుక్ తో అదిరే స్లైల్ తో రూపొందించిన మోడల్ 250 డ్యూక్ బైక్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆస్ట్రియన్ మోటారు సైకిల్ కంపెనీ అయిన కేటీఎం మన దేశంలోని ద్విచక్ర వాహనాల మార్కెట్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

దీని నుంచి విడుదలైన వాహనాలకు యువత ఆదరణ బాగా లభించింది. దీంతో ప్రీమియం మోాటార్ సైకిల్ విభాగంలో సత్తా చాటడానికి చర్యలు చేపట్టింది. కొత్తగా విడుదల చేసిన 2024 కేటీఎం 250 డ్యూక్ ఈ జోరును కొనసాగిస్తుందని భావిస్తున్నారు. దీనిలో అనేక ఫంక్షనల్, విజువల్ అప్ డేట్ లు చేశారు. మన దేశంలో ఈ బైక్ రూ.2.41 లక్షలకు (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంది.

కొత్త కేటీఎం 250 డ్యూక్ మోటారు సైకిల్ అప్ డేట్ ప్రొఫైల్ తో అందుబాటులోకి వచ్చింది. బూమరాంగ్ ఆకారంలో ఉండే ఎల్ ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు, స్పోర్టియర్ లుక్ తో స్లైలిష్ గా తయారు చేశారు. అలాగే అట్లాంటిక్ బ్లూ, ఎలక్ట్రానిక్ ఆరెంజ్, సిరామిక్ వైట్ అనే మూడు రకాల రంగులతో ఆకట్టుకుంటోంది. 250 డ్యూక్ మోటారు సైకిల్ లోని కొత్త ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలో 5.0 అంగుళాల ఫుల్ కలర్ టీెెఎఫ్ టీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, హెడ్ సెట్ కనెక్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. కేటీఎం కనెక్ట్ యాప్ ద్వారా హెడ్ సెట్ ను ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కు జత చేసుకోవచ్చు. స్విచ్ గేర్ ను కొత్తగా అప్ డేట్ చేశారు. కొత్త ఫోర్ వే మెనూ స్విచ్ లేఅవుట్ తో తీసుకువచ్చారు. ఇది రైడర్ టీఎఫ్ టీ స్క్రీన్ లోని వివిధ నియంత్రణలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇతర భాగాల మాదిరిగానే ఈ స్విచ్ గేర్ ను కూడా డ్యూక్ 390 నుంచి తీసుకున్నారు.

స్ట్రీట్, ట్రాక్ అనే రెండు రకాల రైడ్ మోడ్ లతో 250 డ్యూక్ మోటారు సైకిల్ అందుబాటులోకి వచ్చింది. టీఎఫ్ టీ స్క్రీన్ ద్వారా రైడర్ ఈ మోడ్ లను సులువుగా మార్పు చేసుకోవచ్చు. ట్రాక్ మోడ్ లో టీఎఫ్ టీ స్క్రీన్ గ్రాఫిక్స్ మరింత బాగా పనిచేస్తాయి. ఎన్ లార్జ్డ్ రెవ్ కౌంటర్, ల్యాప్ టైమర్, ప్రిఫర్డ్ రైడర్ ఎయిడ్ సెట్టింగులు కనిపిస్తాయి. కేటీఎం 250 డ్యూక్ బైక్ లో పాత మోడల్ మాదిరిగానే 248 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 9250 ఆర్పీఎం వద్ద 30 బీహెచ్ పీ గరిష్ట శక్తిని, 7250 ఆర్పీఎం వద్ద 25 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కు 6 స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు.

లక్ష పెట్టుబడితో కోటి రూపాయలు.. అద్భుతం చేసిన హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్‌

కోటీశ్వరులు కావాలనే ఆశ అందరిలో ఉంటుంది. కానీ కొందరికి నెరవేరుతుంది.. కొందరికి నెరవేరదు. కోటీశ్వరులు కావాలనే మార్గాన్ని ఎంచుకుంటే సక్సెస్‌ అవుతారన్నది నిపుణులు చెబుతున్న మాట.

కొందరు అందుకు తగినట్లుగా ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తుంటారు. అలా ఈ రెండు ఈఎల్ఎస్ఎస్ లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్ చేసిన వారు కోటీశ్వరులు అయ్యారు. ఈ రెండు స్కీమ్‌లు రూ.1 లక్ష లంప్‌సమ్ పెట్టుబడిని ఏకంగా కోటి రూపాయలు చేశాయి. ఒక్కసారి లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన వారికి కోటి రూపాయలు అందించాయి. మరి ఈ రెండు పథకాల గురించి తెలుసుకుందాం.

హెచ్‌డీఎఫ్‌సీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అద్భుతం చేసింది. రూ.1 లక్ష లంప్‌సమ్ పెట్టుబడిని ఏకంగా రూ.1.05 కోట్లు చేసింది. లంప్సమ్ అంటే మీ మొత్తం పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయడం. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఏకమొత్తం పెట్టుబడి ఒక ప్రసిద్ధ మార్గం. సాధారణంగా లంప్సమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక కార్పస్ డబ్బు ఉన్న వ్యక్తులు ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ మొత్తానికి చేరాలంటే 25 ఏళ్ల సమయం పట్టింది. ఈ స్కీమ్‌ అందుబాటులోకి వచ్చి 25 ఏళ్లు గడుస్తోంది. ఈ సమయంలో 20.45 శాతం CAGR కలిగి ఉంది. ఆ తర్వాత ఫ్రాంక్లిన్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ తం అదరగొట్టింది. 25 సంవత్సరాల కిందట ఈ స్కీమ్‌లో లక్ష రూపాయలు పెట్టినట్లయితే ఇప్పుడు దాని విలువ రూ. 1 కోటి అవుతుంది. ఈ సమయంలో ఈ ఫండ్ సీఏజీఆర్ 20.22 శాతంగా ఉంది.

మరో ఐదు పథకాలు

మరో 5 పథకాలు సైతం మార్కెట్‌లోకి వచ్చిన 25 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ పథకాల్లో ఒకేసారి రూ.10.54 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన వారు ఇప్పుడు రూ.65 లక్షలు అందుకున్నారు. ఈ పథకాలు సీఏజీఆర్ 9.87 శాతం నుంచి 18.11 శాతం మధ్య ఉంది. అందులో అత్యంత పాత స్కీమ్‌ అయిన ఎస్‌బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ స్కీమ్ రూ. 1 లక్ష పెట్టుబడిని 25 ఏళ్లలో 17.06 శాతం రిటర్న్స్‌తో రూ. 51.39 లక్షలు అయ్యింది.

సుందరమ్ ఈఎల్ఎస్ఎస్

ఇక సుందరమ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ రూ.లక్ష లంప్‌సమ్ పెట్టుబడిని 25 ఏళ్లలో రూ. 42.97 లక్షలు చేసింది. ఈ స్కీమ్ సీఏజీఆర్ 16.22 శాతంగా ఉంది. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపులు కూడా పొందే అవకాశం ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఇది పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోండి.

దీపావళి బహుమతులుగా వీటిని ఇస్తే అదుర్స్. మీరూ ఓ లుక్కేయ్యండి

క్రోమా రెడీ గూగుల్ టీవీ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్, ఎల్ఈడీ డిస్ ప్లే తో క్రోమా గూగుల్ టీవీ ఆకట్టుకుంటోంది. కేవలం వాయిస్ తోనే చానల్ మార్చుకోవచ్చు.

సౌండ్ పెంచుకోవచ్చు. దీనిలో వివిధ రకాల ఇన్ బిల్డ్ ఫీచర్లు ఉన్నాయి. మంచి రిజల్యూషన్, హెచ్ డీ రెడీ డిస్ ప్లే కారణంగా స్పష్టమైన విజువల్స్ చూడవచ్చు. డాల్బీ ఆడియో మోడ్ తో థియటర్ లో ఉన్న అనుభవం కలుగుతుంది. అదనపు పరికరాలను కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియా, హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్ లను యాక్సెస్ చేయవచ్చు. క్రోమా 32 అంగుళాల రెడీ గూగుల్ టీవీ ధర రూ.9,990 మాత్రమే.

క్రోమా బ్లూటూత్ పార్టీ స్పీకర్ ఇంటిలో గానీ, బయట గానీ పార్జీలు జరినప్పుడు మంచి సౌండ్ తో పాటలు వినడానికి క్రోమా బ్లూటూత్ పార్టీ స్పీకర్ఉపయోగపడుతుంది. దీనిలోని 50 డబ్ల్యూ పవర్ అవుట్ పుడ్, వైర్డు మైక్ కారణంగా ఆడియో చాలా స్పష్టంగా విడుదల అవుతుంది. బ్లూటూత్ 5.0 కనెక్టివీటితో అంతరాయం లేకుండా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. 5 ఈక్యూ మోడ్ తో పలు రకాల సెట్టింగ్ లను మార్చుకోవచ్చు. క్రోమా బ్ల్యూటూత్ స్పీకర్ 55 శాతం భారీ డిస్కౌంట్ పై రూ.4,490 ధరకు అందుబాటులో ఉంది.

క్రోమా మైక్రో ఓవెన్ చిన్న కుటుంబానికి క్రోమా 20 లీ సోలో మైక్రో ఓవెన్ చక్కగా సరిపోతుంది. దీనిలోని హీట్ సెన్సార్ తో ఆహారాన్ని కచ్చితమైన నియంత్రణతో వేడి చేయవచ్చు. వివిధ అవసరాల కోసం దీనిలో 5 పవర్ సెట్టింగ్ లు ఉన్నాయి. ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ టెక్నాలజీ అదనపు ప్రత్యేకత. మిగిలిన ఆహారాన్ని వేడిచేసుకోవడానికి, ఉడికించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. 20 లీటర్ల సామర్థ్యం గల క్రోమా 20 లీ సోలో మైక్రో ఓవెన్ ను 20 శాతం తగ్గింపుపై రూ.4,790కి కొనుగోలు చేసుకోవచ్చు.

క్రోమా శాండ్ విచ్ మేకర్ శాండ్ విచ్ లంటే పిల్లల నుంచి పెద్దలందరికీ ఇష్టమే. వీటిని తయారుచేసుకునే శాండ్ విచ్ మేకర్ అందరికీ ఉపయోగమే. క్రోమా 4 స్లైస్ శాండ్ విచ్ మేకర్ 35 శాతం తగ్గింపుపై 1,299కి అందుబాటులో ఉంది. నాన్ స్టిక్ కోటెడ్ ప్లేట్లు, ఆటోమెటిక్ ఆపరేషన్, ఎల్ఈడీ లైట్లు తదితర ఫీచర్లు ఉన్నాయి. తక్కు వ నూనెను ఉపయోగించి రుచికరమైన శాండ్ విచ్ లతో పాటు పాన్ కేక్ లు, క్రీప్స్ తదితర వాటిని తయారు చేసుకోవచ్చు.

క్రోమా బ్లూటూత్ సౌండ్ బార్ ఆకట్టుకునే డిజైన్, బ్లూటూత్ కనెక్టివిటీ, రిమోట్ తో కూడిన క్రోమా సౌండ్ బార్ ను దీపావళికి బహుమతిగా ఇవ్వవచ్చు. దీనిలోని 60 డబ్ల్యూ సౌండ్ అవుట్ పుట్, 2.0 సరౌండ్ సౌండ్ తో ఆడియోను చాలా స్పష్టంగా వినవచ్చు. ఈక్యూ మోడ్ ల కారణంగా కంటెంట్ కు అనుగుణంగా ధ్వని విడుదలవుతుంది. టీవీతో పాటు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, పీఎస్ 5 కు సులభంగా కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. క్రోమా సౌండ్ బార్ రూ.3,999కి అందుబాటులో ఉంది

ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం.. చివరి తేదీ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు అక్టోబరు 21 నుంచి నవంబరు 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు.

రూ.100 ఆలస్య రుసుముతో నవంబరు 12 నుంచి 20 వరకు ఫీజు చెల్లించొచ్చని తెలిపారు. మొదటి లేదా రెండో ఏడాది చదివే విద్యార్ధులు జనరల్‌ థియరీ సబ్జెక్టులకు రూ. 600, సెకండ్‌ ఇయర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ. 275, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు రూ. 165 చొప్పున ఫీజు చెల్లించాలని వెల్లడించారు. మొదటి, రెండో ఏడాదికి కలిపి థియరీ పరీక్షలకు రూ. 1200 చెల్లించాలని ఆమె సూచించారు. హాజరు మినహాయింపు కోరేవారు ప్రైవేటు అభ్యర్థులుగా పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుందని, వీరు నవంబరు 15వ తేదీలోపు రూ. 1500 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

‘ఏపీ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ త్వరలో పునఃప్రారంభిస్తాం’ డీజీపీ ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు హాజరయ్యారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో 6 వేలకు పైగా కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియ గత కొంతకాలంగా నిలిచిపోయింది. దీనిపై న్యాయసలహా తీసుకుని త్వరలోనే ఈ ప్రక్రియను పునఃప్రారంభిస్తాం. దేహదారుఢ్య, శారీరక సామర్థ్య, తుది రాతపరీక్షల నిర్వహణకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను మొత్తం 180 రోజుల్లోగా పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవి కాకుండా మిగతా ఖాళీల భర్తీకి కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అక్టోబర్‌ 23 నుంచి డీఈఈసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో డీఎడ్‌ కోర్సుల్లో చేరేందుకు అక్టోబర్‌ 23 నుంచి 26వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని డీఈఈసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 30న వీరికి సీట్లు కేటాయిస్తామన్నారు. అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ సమర్పించని 7 ప్రైవేట్‌ డీఈడీ కాలేజీలకు ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు ఈ విద్యాసంవత్సరం అనుమతి నిరాకరించినట్లు ఆయన తెలిపారు.

మీకు కారు ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేకుంటే భారీ నష్టం

బైక్, కారు, ఆటో మొదలైన వాహనాల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇక బైక్‌లు మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఈ రోజుల్లో సామాన్యులు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నారు.

వ్యాపార అవసరాలకు అనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. కేవలం కారు కొంటే సరిపోదు. దానిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యమే. కారు కొనడంతోపాటు దాన్ని సరిగ్గా మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం.

సాధారణంగా అందరూ కారు మెయింటెనెన్స్ అంటే పెట్రోల్ చెక్ చేయడం, సమయానికి సర్వీసింగ్ చేయడం, ఏదైనా పార్ట్ చెడిపోతే రిపేర్ చేయడం అని అనుకుంటారు. ఇవి కాకుండా గుర్తుంచుకోవలసిన మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీల్ అలైన్ మెంట్ , వీల్ బ్యాలెన్సింగ్, టైర్ రొటేషన్ ఇలా చాలా అంశాలు ఉన్నాయి.

టైర్ల అమరిక:

కారుకు సరైన చక్రాల అమరిక చాలా అవసరం. అంటే నాలుగు చక్రాలు ఒకే స్థితిలో ఉండాలి. అప్పుడు కారు సాఫీగా నడుస్తుంది. కొన్నిసార్లు కొత్త కారులో కూడా వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా ఉండదు. లేదంటే గుంతలు, రాళ్లు తదితర వాటిపై ప్రయాణించేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వేగంగా వెళ్లినప్పుడు వీల్ అలైన్ మెంట్ తప్పుగా మారుతుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్టీరింగ్ వీల్ వైబ్రేట్ అవుతుంది.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనం కుడి లేదా ఎడమ వైపుకు లాగవచ్చు. వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా లేకుంటే టైర్ జీవితకాలం కూడా బాగా తగ్గిపోతుంది. అలాగే స్టీరింగ్, ఇతర ముఖ్యమైన భాగాలు పాడైపోవచ్చు.

టైర్ రొటేషన్:

మూడవ ముఖ్యమైన అంశం టైర్ రొటేషన్. అంటే కారులోని టైర్లు నేరుగా వెళ్లకుండా పొజిషన్‌ను మారుస్తుంటాయి. టైర్ల జీవితాన్ని పొడిగించడానికి టైర్ రొటేషన్ కూడా చేయాలి. దీని అర్థం వాహనం టైర్‌ను ముందు నుండి వెనుకకు లేదా ప్రక్కకు మార్చడం. నిబంధనల ప్రకారం ప్రతి 8000 కిలోమీటర్లకు టైర్లను మార్చాలి. ఇలా మార్చనట్లయితే కారులో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

Health

సినిమా