Sunday, November 17, 2024

బ్లూటూత్ స్పీకర్లపై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్లు షురూ

ప్రీమియం క్వాడ్రాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన ఫిలిప్స్ స్పీకర్ నుంచి ధ్వని చాలా స్పష్టంగా వెలువడుతుంది. ఇది వాటర్ ఫ్రూప్ కావడంతో చాలా ఉపయోగంగా ఉంటుంది.

5 వ్యాట్ల అవుట్ పుట్, యూఎస్ బీ 1 పోర్టు, ఎంబోస్ట్ బటన్, ప్లే బ్యాక్ స్లీరియో జత చేసుకోవడం, బ్లూటూత్ నియంత్రణ తదితర ఫీచర్లు ఉన్నాయి. 1.75 అంగుళాల పూర్తి శ్రేణి డ్రైవర్, పాసివ్ రేడియేటర్లు మంచి సౌండ్ ట్రాక్ ను అందిస్తాయి. ఫిలిప్ ఆడియో స్టోర్ ఎస్3505 బ్లూటూత్ స్పీకర్ రూ.4,310కి అందుబాటులో ఉంది.

జేవైఎక్స్ ఇండోర్, అవుట్ డోర్ లో పార్టీలు జరిగినప్పడు చాాలా ఉపయోగపడుతుంది. దీనిలో 8500 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ కు ఇబ్బంది ఉండదు. 8 రంగుల డిస్కో లైటింగ్ మోడ్ అదరపు ఆకర్షణ. బ్లూటూత్ స్పీకర్ రిచ్ బాస్, క్రిస్టల్ క్లియర్ ట్రెబుల్ తో 100 డబ్ల్యూ అవుట్ పుట్, డ్యూయల్ 20 డబ్ల్యూ సబ్ వూఫర్ డ్రైవర్ ఆకట్టుకుంటున్నాయి. వివిధ పరికరాలను త్వరగా కనెక్ట్ చేసుకోవచ్చు. జేవీఎక్స్ వైర్ లెస్ బోట్ బ్లూ టూత్ స్పీకర్ ను అమెజాన్ లో 7,749కి కొనుగోలు చేసుకోవచ్చు.

నాన్ స్టాప్ వినోదం పొందాలనుకునేవారికి ట్రిబిట్ బ్లూటూత్ స్పీకర్ బాగుంటుంది. దీనిలోని 2*5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 24 గంటల పాటు చక్కగా పనిచేస్తుంది. ఎక్స్ బాస్ టెక్నాలజీ తో అత్యుత్తమ ఆడియో విడుదలవుతుంది. ట్యాబ్లెట్, స్మార్ట్ ఫోన్లకు బాాగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంటిలో ఉపయోగించుకోవడానికి మంచి బ్లూటూత్ స్పీకర్ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి ఎంపిక. ట్రిబిట్ అప్ గ్రేడ్ వెర్షన్ స్మార్ట్ బ్యాక్స్ పో బ్లూ టూత్ స్పీకర్ ను అమెజాన్ లో రూ.7,969కి కొనుగోలు చేసుకోవచ్చు.

అకాయ్ స్పీకర్ లు చూస్తున్నా, సంగీతం వింటున్నా, ఇతర కార్యక్రమాలు చూస్తున్నా శ్రావ్యమైన ధ్వనిని విడుదల చేస్తుంది. అకాయ్ యూబీ 80 బ్లూటూత్ స్పీకర్ 80 డబ్ల్యూ ఆర్ఎంఎస్ అవుట్ పుట్ విడుదల చేస్తుంది. దీనిలోని బ్లూటూత్ 5.0తో మీ ఫోన్, ట్యాబ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. హెచ్ డీఎంఐ ఏఆర్సీ సపోర్టుతో మంచి ఆడియో అనుభవం కలుగుతుంది. యూఎస్బీ, ఎఫ్ఎం రేడియా, యాక్స్, వైర్డు మైక్రో ఫోన్ ఇన్ పుట్ తో అనేక రకాల ప్లే బ్యాక్ ఎంపికలు ఉన్నాయి. మైక్ హై బాస్ సౌండ్ తో లభించే అకాయ్ బ్లూటూత్ స్పీకర్ రూ.6,490కి అందుబాటులో ఉంది.

ట్రోనికా ట్విన్ టవర్ స్వష్టమైన ఆడియోతో ఇంటిలోనే మంచి సంగీతానుభవాన్ని ఆస్వాదించవచ్చు. క్లీన్, డీప్, కంట్రోల్డ్ మిశ్రమంగా మంచి పనితీరును అందిస్తాయి. 80 డబ్ల్యూ 5.25 వూఫర్లతో ఆకట్టుకునేలా ధ్వనిని విడుదల చేస్తాయి. 100 ఎంఎం మందపాటి ఫ్రంట్ బ్యాఫిల్ చాంఫెర్డ్ , ఇంటిగ్రేడెట్ వేవ్ గైట్ డైనమిక్ సౌండ్, ఫ్రంట్ ఫైరింగ్ ట్యూబ్ పోర్ట్ అదనపు ప్రత్యేకతలు. ట్రోనికా ట్విన్ టవర్ 80 డబ్ల్యూ బ్లూ టూత్ పార్టీ స్పీకర్ ను అమెజాన్ లో రూ.4,141కి కొనుగోలు చేసుకోవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి కళ్లు చెదిరే ఆఫర్‌.. రూ.87 ప్లాన్‌తో డైలీ 1GB డేటా, అపరిమిత కాల్స్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం చౌకైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకువస్తోంది. ఇటీవల ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు రీఛార్జ్‌ ధరలు భారీగా పెంచడంతో ఆ కంపెనీల వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు.

ఇప్పటికే లక్షలాది మంది పోర్ట్‌ పెట్టుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో మాత్రం ఎలాంటి టారీఫ్‌ ధరలు పెంచలేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రూ. 87 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ తక్కువ బడ్జెట్ ఉన్న వ్యక్తులకు మంచి ఎంపిక. ఎయిర్‌టెల్ ఇప్పటికే ప్రతి సర్కిల్‌లోని వినియోగదారుల కోసం ఎంట్రీ లెవల్ ప్లాన్‌ను రూ.155కి పెంచింది. అందువల్ల రూ. 87 ప్లాన్ వినియోగదారులకు మంచి ఎంపిక. ఇది డేటాతో స్వల్పకాలిక చెల్లుబాటును ఇస్తుంది. ఇది కొత్తగా తీసుకువచ్చిన ఆఫర్‌ కాదు పాతదే. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుండి రూ. 87 ప్లాన్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఈ ప్లాన్‌లో మొత్తం 14 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ 1GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో కూడిన SMS ప్రయోజనాలు ఏవీ లేవు. ఈ ప్లాన్‌తో కస్టమర్ మొత్తం 14GB డేటాను పొందుతారు.

కస్టమర్ మరింత డేటా కావాలనుకుంటే రూ.97 ప్లాన్‌ను కూడా రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కూడా కస్టమర్‌లకు ఎలాంటి ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను ఉండవు. కానీ ఇది 15 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అలాగే 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారు పొందే మొత్తం డేటా 30GB.

మంచి వ్యాలిడిటీ ఉండి వాయిస్ కాలింగ్, ఎక్కువ ఖర్చు చేయకూడదనుకుంటే రూ.99 ప్లాన్ మంచి ఆప్షన్‌. ఎందుకంటే ఈ ప్లాన్‌తో భారతదేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 18 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.

వామ్మో ఇంత టెక్నిక్‌ ఉందా? కారు వెనుక అద్దంపై ఎరుపు రంగు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా?

ద్విచక్ర వాహనాలు లేదా నాలుగు చక్రాల వాహనాలు నేడు మానవ జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు వాహనాలతో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు.

అదే విధంగా మీరు తరచుగా రోడ్డు మీద ప్రయాణిస్తున్న కార్ల వెనుక అద్దాలపై కొన్ని ఎర్రటి గీతలు చూసి ఉంటారు. సాధారణంగా ఈ రెడ్ లైన్లు అన్ని కార్లలో ఉండవు. నిర్దిష్ట మోడల్ టాప్ వేరియంట్ లేదా మిడ్ వేరియంట్ కొన్ని కార్లలో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? దీని వెనుక కారణం ఏంటో తెలుసా..?

ఈ రెడ్ లైన్స్ ఎందుకు..?

ఈ లైన్లు కార్ల వెనుక అద్దాలపై (విండ్‌షీల్డ్) ఉంటాయి. చాలా మంది వీటిని స్టైల్ లేదా డిజైన్ స్టిక్కర్లుగా భావిస్తారు. అయితే, ఈ రెడ్ లైన్లు డిజైన్ స్టిక్కర్లు కావు. ఇది భద్రతా ప్రయోజనం కోసం. ఇది కారును సురక్షితంగా నడపడానికి సహాయపడుతుంది. కారు రియర్ వ్యూ మిర్రర్ పై ఉండే ఈ రెడ్ లైన్స్ మెటల్ తో చేసిన వైర్లు. దీనిని ‘డీఫాగర్ గ్రిడ్ లైన్’ (డీఫాగర్) లేదా ‘డీఫ్రాస్టర్ గ్రిడ్ లైన్’ (డీఫ్రాస్టర్లు) అంటారు.

రెడ్ లైన్స్ ఏం చేస్తాయి..?

సాధారణంగా చలి, వర్షాకాలంలో మంచు, వర్షపు చుక్కలు కారు వెనుక కిటికీలపై పడుతుంటాయి. అందువల్ల కారు నడుపుతున్న డ్రైవర్ వెనుక చూసే అద్దం నుండి వెనుక నుండి వస్తున్న వాహనాలను స్పష్టంగా చూడలేడు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యలను నివారించడానికి ఈ రెడ్ లైన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

అంటే వెనుక అద్దాలపై ఉన్న ఈ ఎరుపు గీతల లోపల ఉన్న వైర్లు మంచు, వర్షం నుండి నీటిని త్వరగా తొలగిస్తాయి. అంటే ఈ డిఫ్రాస్టర్ గ్రిడ్ లైన్‌ని ఉపయోగించడానికి కారు డాష్‌బోర్డ్‌లో స్విచ్ ఉంటుంది. మంచు లేదా వర్షపు నీరు వెనుక గాజును పూర్తిగా కప్పినప్పుడు ఈ స్విచ్ ఆన్ చేయాలి. అప్పుడు ఈ రెడ్ లైన్లలోని వైర్లకు విద్యుత్ ప్రవహించి వేడెక్కుతుంది. ఆ సమయంలో మంచు, నీటి బిందువులు వేడెక్కి ఆవిరైపోతాయి. దీనితో పాటు, డ్రైవర్ వెనుక విండో ద్వారా కూడా వెనుక చూసే అద్దం స్పష్టంగా చూడగలడు. కారు వెనుక గ్లాస్‌పై ఉండే ఈ లైన్లు వర్షాకాలం, శీతాకాల ప్రయాణాలలో సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.

పొగాకు ఆరోగ్యానికి ప్రమాదకరం.. ధూమపానంతో ఈ 4 ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా పొగాకు కారణంగా ప్రతి సంవత్సరం 8 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పొగాకు వాడకం అన్ని విధాలుగా హానికరం.

అంటే తక్కువ మోతాదులో తీసుకున్నా శరీరానికి అందుకు తగిన హాని కలుగుతుంది. సిగరెట్ ధూమపానం అనేది ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడకంలో అత్యంత సాధారణ రూపం. ఇతర పొగాకు ఉత్పత్తులలో వాటర్‌పైప్ పొగాకు, సిగార్లు, బీడీలు ఉన్నాయి. ఇవన్నీ శరీరంలో వివిధ వ్యాధులకు కారణమవుతాయి.

భారతదేశంలో కూడా పొగాకు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే దాదాపు 45 శాతం మంది పురుషులు పొగాకును వినియోగిస్తున్నారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (KGMU)లో ప్రొఫెసర్, థొరాసిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ శైలేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులలో 44.1 శాతం మంది పొగాకును వినియోగిస్తున్నారని చెప్పారు. ఇది షాకింగ్ ఫిగర్. అటువంటి పరిస్థితిలో ధూమపానం చేసేవారి సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. జపాన్, స్వీడన్, అమెరికాలో ధూమపానం మానేయడానికి తీసుకున్న చర్యల చూసి మనం నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. పెరుగుతున్న ధూమపాన అలవాటుని అరికట్టడానికి, పొగాకు ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని సమగ్ర విధానాలను రూపొందించాలని సూచిస్తున్నారు.

పొగాకు వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయంటే

పొగాకు ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్ శైలేంద్ర యాదవ్ చెప్పారు. సిగరెట్లలో ఉండే పొగాకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ మంది దీర్ఘకాలం పాటు పొగ తాగేవారే. పొగాకు వినియోగం గుండెను కూడా బలహీనపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో పొగాకు వినియోగం టైప్-2 డయాబెటిస్‌కు కూడా కారణం కావచ్చు. ప్రజల్లో పొగాకు వినియోగం పెరుగుతున్న తీరు భావితరాలకు పెను ముప్పు అని నిర్వాణ ఆసుపత్రికి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బిహేవియరల్ అండ్ అడిక్షన్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ ప్రాంజల్ అగర్వాల్ అన్నారు. పొగాకు వినియోగం ఏ రూపంలో పెరిగినా వ్యాధుల పరిధి కూడా పెరుగుతుందని అర్థం. అటువంటి పరిస్థితిలో, పొగాకు వినియోగం నివారణ అవసరం.. ఇందుకోసం ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.

వ్యసనాన్ని ఎలా వదిలించుకోవాలంటే

డాక్టర్ శైలేంద్ర యాదవ్ పొగాకు వ్యసనాన్ని విడిచిపెట్టడానికి కొన్ని సూచనలు చేశారు. ముందుగా పొగాకు అలవాటుని విడిచి పెట్టడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు పొగాకు అలవాటు విడిచి పెట్టడం వలన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవచ్చు.. లేదా కుటుంబ ప్రయోజనాల కోసం పొగాకును మానేస్తున్నామని గుర్తు చేసుకోవాలి. ఖాళీగా ఉండడం అనేది పొగాకు వినియోగానికి ట్రిగ్గర్ పాయింట్. కనుక ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఈ విషయంలో వైద్యుల నుండి కూడా సలహా తీసుకోవాలి. కొన్ని మందులు, కౌన్సెలింగ్ సెషన్‌లు పొగాకును విడిచిపెట్టడంలో సహాయపడతాయి. అయితే ఈ అలవాటుని వదిలించుకోవడానికి చాలా నెలలు పట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో పొగాకు వినియోగాన్ని క్రమంగా తగ్గించడం, డాక్టర్ తో నిరంతరం సన్నిహితంగా ఉండటం చాలా ముఖ్యం.

దీపావళికి మీ ప్రియమైన వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.. బెస్ట్ ఎంపికలు ఇవే

దీపావళి భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను దీపాలు, రంగోలీలతో అలంకరించుకుంటారు.

ఇంటి చుట్టూ లైట్లను వెలిగిస్తారు. ఈ రోజున రాముడు 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడని ఓ నమ్మకం. అంతేకాదు లోక కంటకుడైన నరకాసురుడు మరణించినందుకు సంతోషంగా ప్రజలు దీపాలు వెలిగించారని నమ్మకం.

దీపావళి పండగ సందర్భంగా ప్రజలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులు అందజేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో ఇది సామాజిక, కుటుంబ బంధాలను కూడా బలపరుస్తుంది. ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి స్వీట్లు పంచుకుంటారు. పటాసులు కాల్చుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు కూడా దీపావళి రోజున ప్రత్యేక బంధువులు, స్నేహితులకు బహుమతులు ఇవ్వాలనుకుంటే ఈ రోజు కొన్ని వస్తువులను గురించి తెలుసుకుందాం..

దీపాలు లేదా కొవ్వొత్తులు
దీపావళి రోజున ప్రజలు తమ ఇళ్లను లైట్లు, దీపాలు, కొవ్వొత్తులతో ప్రకాశించేలా చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ బంధువులకు ప్రత్యేకమైన లైట్లు, దీపాలు, కొవ్వొత్తులను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇవి ఇంటిని అలంకరించడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. అందంగా డిజైన్ చేయబడిన దీపాలు లేదా సువాసనగల కొవ్వొత్తులు ఇంటి అలంకరణకు మరింత అందాన్ని జోడిస్తాయి.

డ్రై ఫ్రూట్స్
స్వీట్లు కాకుండా మరేదైనా ఇవ్వాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. ఇలాంటి బహుమతులు ఇవ్వడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.. అంతేకాదు చాలా కాలం వాటిని ఉపయోగించవచ్చు. అలాగే ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్‌కి అనేక రకాల ప్యాకేజింగ్‌లు ఉన్నాయి. ఇది చాలా అద్భుతంగా కనిపిస్తాయి.

ఇండోర్ ప్లాంట్స్
దీపావళికి బంధువులకు, స్నేహితులకు పూల కుండలను కూడా ఇవ్వవచ్చు. ఈ ఎకో ఫ్రెండ్లీ బహుమతి దీపావళి రోజున ప్రత్యేకంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచుకోవడానికి ఇండో ప్లాంట్ ఇవ్వవచ్చు. లేదా పూల గుత్తిని కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.

ఎలక్ట్రానిక్ వస్తువులు
ఎలక్ట్రానిక్ వస్తువులను బహుమతులుగా కూడా ఇవ్వవచ్చు. ఇందులో డిజిటల్ వాచ్, మిక్సర్, టోస్టర్, ఇయర్‌ఫోన్‌లు, స్పీకర్లు సహా అలంకరణలో ఉపయోగించే వస్తువులను బహుమతిగా ఇవ్వవచ్చు. దీపావళికి బహుమతిగా ఇవ్వడానికి దీపం కూడా ఉత్తమ ఎంపిక. మార్కెట్లో, ఆన్‌లైన్‌లో అనేక రకాల సైజ్ లలో దీపాలు లభిస్తున్నాయి.

వివిధ ఫుడ్ గిఫ్ట్ హ్యంపర్స్
స్పెషల్ స్నాక్స్, చాక్లెట్లు , డ్రై ఫ్రూట్స్‌తో కూడిన అందమైన ప్యాకెట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో చాలా మంచి ఫుడ్ గిఫ్ట్ హ్యాంపర్‌లు మార్కెట్‌లో సులభంగా దొరుకుతున్నాయి.

కిచెన్ వేర్
వంటగదిలో ఉపయోగించే వస్తువులను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. కిచెన్ సెట్ సహా ఇంట్లో ఉపయోగపడే అనేక ఇతర వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఇండక్షన్ కుక్కర్, ప్రెజర్ కుక్కర్, కడాయి , పాన్, గ్లాస్ లేదా కప్పులను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.

ప్రకృతి ఒడిలో కొలువైన రంగనాథ స్వామి ఆలయం.. ట్రెక్కింగ్ ప్రియులకు ఓ అద్భుత ప్రదేశం

ప్రకృతి అందాలు.. చుట్టూ ప్రవహించే హేమావతి నది.. హాసన్ జిల్లాలోని రంగనాథ స్వామి ఆలయం ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఈ ఆలయం కొండ రాళ్లతో కప్పబడి ఉంటుంది.

ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలు మనసును హత్తుకుంటాయి.

హోలెనరసీపూర్ తాలూకాలోని హలేకోటే గ్రామంలో ఉన్న ఈ ఆలయం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తుంది. హేమావతి డ్యామ్ వెనుక ఒక రహదారి ఉంది. ఈ రహదారి ద్వారా రంగనాథ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. ఇది ఒక ద్వీపంలా కనిపించడం సహజం. ఇక్కడికి వెళ్ళిన వారు ప్రకృతి అందాలను చూసి మైమరచి పోతారు.

దేవుని దర్శనం కోరుకునే వారికి, ట్రెక్కింగ్ ప్రియులకు కూడా ఇది అద్భుతమైన ప్రదేశం. అంతే కాకుండా మరో ప్రత్యేకత ఏమిటంటే కొండమీద రాళ్లు. కొండపై ఉన్న భారీ రాళ్లు ఎలాంటి ఆసరా లేకుండా నిలబడి ఉండడం ఒక్కక్షణం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

కొండ శిఖరంపై ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న రంగనాథ స్వామిని దర్శించుకోవాలనుకునే వారు హాసన్‌లోని హోలేనరసీపూర్ తాలూకాలోని హళేకోట్‌ను సందర్శించవచ్చు. కొండ రంగనాథ అని కూడా పిలువబడే మావినకెరె రంగనాథ స్వామి ఇక్కడ ప్రకృతి రమణీయత మధ్య కొలువై ఉన్నాడు.

ఇది ఒక గుహ దేవాలయం. రంగనాథ స్వామి గర్భగుడి శిలల మధ్య ఉంది. నక్షత్రం ఆకారంలో ఉన్న వాస్తు శైలిని ఇక్కడ చూడవచ్చు. గర్భగుడిలోని రంగనాథ రాయి వెనుక మూడు అడుగుల ఎత్తున్న స్వామి విగ్రహం ఉంది. చుట్టూ ప్రవహించే హేమావతి నది మధ్య.. కొండపై నుండి నిలబడి అందమైన ప్రకృతి అందాల దృశ్యాలను చూడవచ్చు.

పెళ్లి సందడి మొదలైంది.. అట్టహాసంగా నాగ చైతన్య- శోభిత ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఫొటోస్

అక్కినేని వారింటికి కోడలిగా వెళ్లనున్న శోభితా ధూళిపాళ్ల ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తాజాగా పెళ్లికి సంబంధించిన గోధుమ రాయి, పసుపు దంచటం వంటి సంప్రదాయ కార్య క్రమాలను అట్టహాసంగా నిర్వహించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు మొదలుపెట్టారు. తాజాగా పెళ్లికి సంబంధించిన గోధుమ రాయి, పసుపు దంచటం ఫంక్షన్ వైజాగ్‌లోని శోభిత ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది.

పసుపు కొట్టే కార్యక్రమంలో ట్రెడీషనల్ లుక్​తో ఆరెంజ్, గ్రీన్ అంచు శారీలో పసుపు దంచుతూ కనిపించింది శోభితా. ఈ ఫోటోల్లో అందంగా నవ్వేస్తూ.. సంతోషంగా కనిపించింది. శోభిత ఫ్యామిలీ, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శోభిత ఈ ఫోటోలను షేర్ చేసి.. గోధుమ రాయి, పసుపు దంచడం.. పనులు మొదలయ్యాయి అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

పసుపు కొట్టారు అంటే పెళ్లి పనులు మొదలయినట్టే దీంతో త్వరలోనే శోభిత – నాగచైతన్య పెళ్లి ఉంటుందని ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.

ఆగస్టు 8న అక్కినేని నాగచైతన్యతో ఆమె నిశ్చితార్థం జరిగింది. అయితే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ వేడుకలో శోభిత ధూళిపాళ్ల కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

పిల్లల్ని కనండి.. జనాభా పెంచండి.. లేటెస్ట్ స్లోగన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

పిల్లల్ని కనకపోయినా ఫర్వాలేదు.. వాళ్ల ప్లేస్‌లో పందుల్ని పెంచుకోండి అని ఒకప్పుడు చైనా ఇచ్చిన స్లోగన్.

1979లో చైనాలో మోస్ట్‌ పాప్యులర్‌ స్లోగన్‌ ఇది. దాన్నుంచి వచ్చిందే.. One family- One child policy. చైనాలో..

కంటే ఒక్కరినే కనాలి. పొరపాటున ఇంకొకరికి జన్మనిచ్చారా.. ఆ గ్రామంలోని అందరికీ ఆపరేషన్లే. వేసక్టమీ లేదా ట్యూబెక్టమీ.

అంత కఠినంగా వ్యవహరించింది చైనా. కాని, ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటో తెలుసా. ప్లీజ్.. పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, అవసరమైతే లీవ్స్‌ పెట్టండని అంటోంది.

ఎందుకని ఈ మార్పు..! యువత తగ్గిపోతున్న కారణంగా చైనా జీడీపీ కూడా తగ్గుతోంది కాబట్టి. ఇక జపాన్. అమెరికా తరువాత అత్యంత శక్తివంతమైన దేశం.

ఎకానమీలో అమెరికా తరువాత జపానే. కాని, చేజేతులా ఆ ప్లేస్‌ను చైనాకు ఇచ్చేసింది. 2010 తరువాత ఆ సెకండ్ ప్లేస్‌ను చైనా లాగేసుకుంది. కారణం..

జపాన్‌లో పిల్లల సంఖ్య తగ్గడం. యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగినందుకు.. జపాన్ ఆర్థిక వ్యవస్థే కుచించుకుపోయింది. ఇక ఇండియా.

అతి త్వరలోనే జర్మనీని క్రాస్‌ చేసి జపాన్‌ ప్లేస్‌లోకి వెళ్లబోతోంది. మూడునాలుగేళ్లలో టాప్-3 ఎకానమీగా ఇండియా ఉండబోతోంది ఇండియా. కారణం.. యూత్ ఎక్కువగా ఉండడం.

యువత లేని దేశాలు ఆర్థికపరంగా ఎలా కిందకు పడిపోతున్నాయో స్వయంగా చూస్తున్నాం. అదే యువత ఉన్న కారణంగా ఆర్థికంగా ఇండియా ఎలా ఎదుగుతోందో కూడా చూస్తున్నాం. కాని, ఇక్కడే ఓ డౌట్‌ వస్తోంది కొందరికి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే హవా.

కథ రాయాలా.. జస్ట్‌ నోట్స్ ఇస్తే చాలు వచ్చేస్తుంది. బొమ్మ గీయాలా.. ఎలా కావాలో చెబితే చాలు గీసి ఇచ్చేస్తుంది.

ఇళ్లు కట్టాలా త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ ఆల్రడీ వచ్చేసింది. అదే ఇల్లు కట్టించి ఇస్తుంది. ఏం చేయాలన్నా టెక్నాలజీ ఉంది. మరి అలాంటప్పుడు ఇక యూత్‌తో పనేముంది?

ఏం.. యువత తగ్గినంత మాత్రాన చైనా, జపాన్, జర్మనీకి వచ్చిన ఇబ్బందేంటి? ఇప్పటికీ అవి టాప్‌ పొజిషన్‌లోనే ఉన్నాయ్‌ కదా..! వాటికి లేని ఇబ్బంది మనకేంటి?

అని అడుగుతున్నారు. సో, ఇవాళ్టి మన టాపిక్ కూడా యూత్ వర్సెస్ ఓల్డ్ గురించే. మరీ ఓల్డ్‌ గురించి కాదు గానీ.. మధ్యవయసు దాటాక ఇక వారితో పన్లేదా?

అందరికీ యూత్ మాత్రమే కావాలా? ఒక్క యూత్‌ కారణంగానే దేశాలు అభివృద్ధి చెందుతాయా? స్టాటిస్టిక్స్‌ ఏం చెబుతున్నాయో, ఏం కన్‌క్లూజన్‌ ఇస్తున్నాయో చూద్దాం.. ఇవాళ్టి ఎక్స్‌క్లూజివ్‌లో.

రూ.83 వేల మొబైల్‌ కేవలం రూ.36 వేలకే.. ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్‌

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌ 21 అక్టోబర్ అర్ధరాత్రి 12 గంటల నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‌లో పలు ప్రోడక్ట్‌లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లలో Google Pixel 8లో లభించే డీల్‌లలో అత్యుత్తమ డీల్‌లు ఒకటి. ఈ ఫోన్ 256GB వేరియంట్ దాని లాంచ్ ధరలో సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై లభించే తగ్గింపు గురించి తెలుసుకుందాం.

లాంచ్ సమయంలో Google Pixel 8 256GB వేరియంట్ ధర రూ.82,999. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన దీపావళి సేల్‌లో ఈ ఫోన్ ధర రూ.42,999 మాత్రమే. అంటే మీరు ఎలాంటి బ్యాంక్ డిస్కౌంట్ లేకుండా కూడా ఈ ఫోన్‌ని సగం ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఇది కాకుండా, వినియోగదారులు ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించడం ద్వారా 10% అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది కాకుండా, ఈ ఫోన్ మరో కలర్‌ వేరియంట్‌ను కేవలం రూ. 36,499కి ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్‌పై రూ. 42,450 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. అదేవిధంగా ఈ ఫోన్ ఇతర వేరియంట్లపై కూడా అనేక గొప్ప తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి.

Google Pixel 8లో 6.2-అంగుళాల OLED డిస్‌ప్లే, FHD ప్లస్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది కాకుండా, Titan M2 సెక్యూరిటీ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం T3 చిప్‌సెట్ అందించంది కంపెనీ. 50MP + 12MP డ్యూయల్ కెమెరా, 10.5MP ఫ్రంట్ కెమెరా, ఆడియో మ్యాజిక్ ఎరేజర్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ 4575mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

తంగలాన్ ఓటీటీ రిలీజ్‌కు లైన్ క్లియర్.. కేసు కొట్టేసిన కోర్టు

స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్. థియేటర్స్ లో ఈ మంచి విజయాన్ని అందుకుంది. ఈ ప్రేక్షకులను మెప్పించింది. ప్రయోగాలకు విక్రమ్ కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి.

ఇదిలా ఉంటే తంగలాన్ ఓటీటీ విడుదల పై చిక్కొచ్చి పడింది. తంగలాన్ ఓటీటీ విడుదలపై నిషేధం లేదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్‌ దాఖలు చేశారు. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ తదితరులు నటించిన తంగలాన్ లో వైష్ణవులను కించపరిచే సన్నివేశాలున్నాయని వచ్చాయి. బౌద్ధాన్ని పవిత్రంగా, వైష్ణవాన్ని జోక్‌గా చిత్రీకరించే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో ను విడుదల చేయగా, త్వరలో ఓటీటీలో విడుదల చేస్తామని, విడుదల చేస్తే ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసే సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అందువల్ల ఓటీటీలో తంగలాన్‌ విడుదలను నిషేధించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీరామ్, జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం సెన్సార్ సర్టిఫికేట్ పొంది చిత్రం విడుదలైనందున తంగలాన్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశిస్తూ కేసును కొట్టివేసింది.

2021లో ప్రారంభమైన ఈ చిత్రం 2023లో పూర్తయింది. విడుదల తేదీని వరుసగా మూడు వాయిదాల తర్వాత ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు షాకిచ్చిన కోర్టు.. కారణం ఏంటంటే

తిరుమల లడ్డూ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్డు పవన్‌కు సమన్లు జారీ చేసింది.

తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు.. ఆయనకు ఈ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పవన్ కళ్యాణ్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఆమెను కూడా వచ్చే నెలలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోర్టు తేల్చి చెప్పింది.

తిరుమల లడ్డూ విషయంలో పవన్‌ వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సాంకేతిక ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని న్యాయవాది రామారావు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్‌ ఆరోపించారని పిటిషన్‌లో వెల్లడించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని కోర్టును కోరారు. అదే సమయంలో తిరుమల లడ్డూ వివాదం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు సహా పలు అన్ని ప్లాట్‌ఫామ్స్‌ నుంచి తొలగించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది రామారావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పవన్‌కు సమన్లు జారీ చేసింది

ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను అస్స‌లు తిన‌రాదు

అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వాటితో మ‌న‌కు ప‌లు కీల‌క పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. అయితే అర‌టి పండు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అయిన‌ప్ప‌టికీ అంద‌రూ దాన్ని తిన‌కూడ‌దు. కేవ‌లం కొంత మంది మాత్ర‌మే తినాలి. ముఖ్యంగా కింద చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు. దాన్ని ఆహారం నుంచి తొల‌గించాలి. మ‌రి ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండును తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా.

అధిక బ‌రువు ఉన్న వారు, స్థూల‌కాయులు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు. తింటే అందులో ఉండే కార్బొహైడ్రేట్లు వారిలో అధికంగా కొవ్వును ఉత్ప‌త్తి చేస్తాయి. దీంతో ఇంకా ఎక్కువ బ‌రువు పెరుగుతారు. క‌నుక అధిక బ‌రువు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌రాదు. హైప‌ర్ క‌లేమియా వ్యాధి ఉన్న‌వారు కూడా అర‌టి పండ్ల‌ను తిన‌రాదు. తింటే గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. బీపీ పెరుగుతుంది. ఎల్ల‌ప్పుడూ టెన్ష‌న్‌, ఆందోళ‌న‌తో ఉంటారు. అర‌టి పండ్ల‌లో థ‌యామిన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది మైగ్రేన్ ఉన్న‌వారికి మంచిది కాదు. దీని వ‌ల్ల త‌ల‌నొప్పి ఇంకా ఎక్కువ‌వుతుంది. అది నాడుల డ్యామేజ్‌కు దారి తీస్తుంది. కనుక మైగ్రేన్ ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌రాదు.

మ‌ధుమేహం ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తింటే వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త్వ‌ర‌గా పెరుగుతాయి. మ‌ళ్లీ ఆ స్థాయిలు త‌గ్గాలంటే అందుకు లివ‌ర్‌, మూత్ర‌పిండాల‌పై అధిక భారం ప‌డుతుంది. క‌నుక మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు అర‌టిపండ్ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. లేదంటే చ‌క్కెర స్థాయిలు పెరిగి త‌రువాత ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. అల‌ర్జీ స‌మ‌స్య ఉన్న‌వారు అర‌టిపండ్ల‌ను తిన‌రాదు. తింటే ముఖం, ఇత‌ర శ‌రీర భాగాలు ఉబ్బిన‌ట్టు క‌నిపిస్తాయి. దుర‌ద కూడా ఉంటుంది. క‌నుక అలాంటి వారు అర‌టిపండ్ల‌ను మానేయాలి. మూత్ర‌పిండాలు, మూత్రాశ‌య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు అర‌టిపండ్ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే అర‌టిపండ్ల‌లో ఉండే పొటాషియం కిడ్నీల‌పై భారం పెంచుతుంది. దీంతో కిడ్నీలు త్వ‌ర‌గా పాడైపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక వీరు కూడా అర‌టి పండ్ల‌ను తిన‌రాదు.

కొత్త కారు కొంటున్నారా?

భారతీయ కస్టమర్లలో కార్ల కొనుగోలుకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ కొత్త మోడళ్లను నిరంతరం విడుదల చేస్తున్నాయి. మీరు కూడా భవిష్యత్తులో కొత్త కారును కొనాలని చూస్తుంటే.. ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి దేశంలోనే అతిపెద్ద కార్లను విక్రయిస్తున్న మారుతీ సుజుకీ నుంచి హ్యుందాయ్ ఇండియా, హోండా వంటి పెద్ద కంపెనీల వరకు రానున్న రోజుల్లో తమ పలు మోడల్స్‌ను విడుదల చేయబోతున్నారు. రాబోయే మోడల్‌లో ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. ఈ క్రమంలో ఈ 5 కార్ల ఫీచర్లు, పవర్‌ట్రెయిన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Maruti Suzuki eVX దేశంలోనే అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV మారుతి సుజుకి eVX, ఇది 2025 ప్రారంభంలో ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి eVX ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 550 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

Hyundai Creta EV

భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటైన హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు తన ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ క్రెటా EV భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. హ్యుందాయ్ క్రెటా EV ఇప్పుడు తన వినియోగదారులకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్‌ను అందజేస్తుంది. హ్యుందాయ్ క్రెటా EV మార్కెట్లో టాటా కర్వ్ EVతో పోటీపడుతుంది.

Skoda Kylaq ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా తన తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. స్కోడా రాబోయే SUV పేరు కైలాక్. స్కోడా కైలాక్ దాని పవర్‌ట్రెయిన్‌గా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. మార్కెట్‌లో స్కోడా కైలాక్ మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి SUVలతో పోటీపడుతుంది.

New-Gen Maruti Dzire
భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్‌లలో ఒకటైన మారుతి సుజుకి డిజైర్ ఇప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల కానుంది. మారుతి సుజుకి డిజైర్ ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెలలో అంటే నవంబర్‌లో మార్కెట్‌లోకి రానుంది. పవర్‌ట్రెయిన్‌గా, కారులో కొత్త 1.2-లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. దీనిలో కస్టమర్‌లు 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటి ఎంపికను పొందుతారు.

New Honda Amaze భారతీయ కస్టమర్లలో ప్రసిద్ధి చెందిన సెడాన్ హోండా అమేజ్ కూడా అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత పండుగ సీజన్‌లో కంపెనీ అప్‌డేట్ చేయబడిన హోండా అమేజ్‌ను లాంచ్ చేయగలదని చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అప్‌డేట్ చేయబడిన హోండా అమేజ్ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌లో చాలా మార్పులు కనిపిస్తాయి. అయితే ప్రస్తుత 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కారులో పవర్‌ట్రెయిన్‌గా ఉంటుంది. ఇది గరిష్టంగా 90bhp శక్తిని, 110Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రూ.55,000 కొత్త ల్యాప్‌టాప్, రూ.13వేలకే.. EMIలో రూ.1,255కే పొందండి

మీరు బడ్జెట్‌లో మంచి ల్యాప్‌టాప్ కొనాలి అనే ప్లాన్‌లో ఉంటే.. ఇది మీకు బాగా నచ్చుతుంది. దీని ఫీచర్స్ బాగున్నాయి. ఆఫర్ బాగుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొని, కొనాలో వద్దో నిర్ణయం తీసుకోవచ్చు.

ఇది AIR ఫాల్కన్ సిరీస్ నోట్‌బుక్ / ల్యాప్‌టాప్. ఇది ఇంటెల్ i3 కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12TH జనరేషన్ 8 GB ర్యామ్‌, 512 GB స్టోరేజ్ స్పేస్ (SSD) కలిగివుంది. ఇది విండోస్ 11 వెర్షన్‌తో పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌తో 65W టైప్ సీ అడాప్టర్ ఇస్తున్నారు.

ఇది ఎంట్రీ లెవెల్ ల్యాప్‌టాప్, విద్యార్థులకు, స్టడీ పర్పస్ కోసం పనిచేస్తుంది. భారీ గేమ్స్ ఆడేందుకు మాత్రం ఇది పనిచెయ్యదు. దీని కెపాసిటీ చిన్న చిన్న పనులకు పనిచేస్తుంది. దీని స్క్రీన్ సైజ్ 14.1 అంగుళాలు ఉంటుంది. ఇందులో గ్రాఫిక్ కార్డు ఉంది. దీనికి ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉంది. ఇది సన్నగా, బరువు 1.48 కేజీలే ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌కి FHD IPS స్క్రీన్ ఉంది. ఇది కళ్లకు హాని కలగకుండా.. స్పష్టమైన, కాంతివంతమైన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ బ్యాటరీకి 10 గంటల లైఫ్ ఉంటుంది. దీనికి 4000mAh బ్యాటరీ ఉంది.

ఈ ల్యాప్‌టాప్‌ని మహారాష్ట్రలోని ముంబైలో తయారుచేస్తున్నారు. ఇది ‎Sapphire Sea కలర్‌లో ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ ‎1920 x 1080 pixel ఉంటుంది. ప్రాసెసర్ స్పీడ్ 4.4 GHz ఉంటుంది. మాగ్జిమం మెమరీ సపోర్ట్ 32 GB ఉంటుంది. దీనికి USB 2.0 పోర్ట్ 1 ఉండగా.. USB 3.0 పోర్టులు 2 ఉన్నాయి. ఫ్రంట్ వెబ్‌కామ్ రిజల్యూషన్ 1 ఎంపీ ఉంది.

ఈ ల్యాప్ టాప్ ఆసలు ధర రూ.54,990 కాగా.. అమెజాన్‌లో దీనిపై 53 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.25,890కి అమ్ముతున్నారు. ఐతే.. పాత ల్యాప్‌టాప్ ఉంటే.. ఎక్స్‌చేంజ్ కింద రూ.11,200 పొందవచ్చు. అలాగే.. కొన్ని రకాల క్రెడిట్ కార్డుల ద్వారా కొంటే మరో రూ.1,500 తక్కువకి పొందవచ్చు. ఇంకా EMIలో రూ.1,255కి సొంతం చేసుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే.

ఈ చెట్టు చెక్క ముక్కలే కిలో రూ.3 లక్షలు – మన దగ్గరా పెరుగుతుంది – ఒక్కటి పెంచుకున్నా సిరుల పంటే

ఏ మొక్కైనా లేదా చెట్టుకైనా తెగులు వస్తే అది ఎందుకూ పనికిరాదు. రకరకాల రసాయనాలు చల్లి వాటిని కాపాడుకుంటాం. అయితే ఈ ప్రంపంచంలో ఈ చెట్టుకు మాత్రం ఫంగస్ ఎక్కిస్తేనే బలంగా పెరుగుతుంది. అందుకే అది బంగారం కన్నా అధిక ధర పలుకుతుంది. ఇంతకీ ఆ చెట్టు ఏమిటో? ఫంగస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా!

ఫంగస్ కారణంగా సువాసనలు వెదజల్లే కలపనూ, నూనెనూ, మరికొన్ని ఉత్పత్తులను అందిస్తూ రైతులకు లాభాలు తెచ్చిపెట్టే చెట్టే అగార్ వుడ్. ఈ చెట్లకు విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. ఈ చెట్లను ఇప్పుడిప్పుడే మన దగ్గరా సాగు చేస్తున్నారు. బంగారం లాంటి ఈ చెట్టు ఒక్కటి ఉన్నా పెంచిన వారికి కాసులు కురిపించేస్తుంది.

సువాసనతో కూడిన అగరు బత్తీలను, అత్తరును అగార్ వుడ్​తో తయారు చేస్తారు. దీన్ని సింగపూర్, లావోస్, తైవాన్, ఇండోనోసియా, మలేషియా, థాయ్​లాండ్ దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. అరబ్ దేశాల్లో కలపనూ, దానికి సంబంధించిన ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. అసోం, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో అడుగుపెట్టిన అగార్ వుడ్ ఇటీవల తెలుగు రాష్ట్రాలకూ వచ్చేసింది. సువాసనలు వెదజల్లే కలప వృక్షాలైన శ్రీగంధం, ఎర్రచందనం లాంటిదే ఈ అగార్ వుడ్ కూడా.

నాలుగు సంవత్సరాలకే ఆదాయం : అయితే శ్రీగంధం, ఎర్ర చందనం చెట్లు ఆదాయం తెచ్చిపెట్టాలంటే దాదాపు పాతిక నుంచి ముప్పై సంవత్సారాలు ఆగాల్సిందే. అదే అగార్ వుడ్​ చెట్లను సాగు చేస్తే నాలుగు సంవత్సరాలకే ఆదాయం వస్తుంది. ఒక్కసారి చెట్లను సాగు చేస్తే నలభై సంవత్సారాల పాటు పలు రకాలుగా లాభాలు తెచ్చిపెడుతుంది ఈ అగర్ వుడ్ చెట్టు. ఈ చెట్లు చాలా తొందరగా పెరుగుతాయి. నాటిన నాలుగు సంవత్సరాలకే చెట్టు లావు అయ్యాక, కాండానికి రంధ్రాలు చేసి ఫంగస్​ను ఎక్కిస్తారు.

ఫంగస్​ను చెట్టుకు ఎక్కించడం వల్ల కాండం లోపల రెజిన్ లాంటి పదార్థం విడుదలవుతుంది. అది కాండంతో కలిసిపోయి, కొన్ని రకాల రసాయనాలను విడుదల చేయడంతో అగార్ వుడ్ కలప సుగంధ భరితమవుతుంది. కాండంలోపల సువాసన వెదజల్లే కలప లేయర్ నల్లగానూ, ముదురు ఎరుపు రంగులోనూ ఉంటుంది. ఘాటైన సువాసనతో కూడిన ఆ భాగం రైతులకు భారీగానే లాభం చేకూర్చుతుంది.

కిలో అగార్ వుడ్ చెక్క ధర ఎంతంటే : అగార్ వుడ్​కు ఫంగస్​ను ఎక్కించాక రెజిన్​లా ఏర్పడే కలపను బెరడు తీసి సేకరిస్తుంటారు. అలా సేకరించిన అగార్ వుడ్ చెక్క ముక్కలను కిలోల చొప్పున అమ్ముతుంటారు. ఒక చెట్టుకు ఆరు నెలల్లో దాదాపు మూడు కిలోల చెక్క ముక్కలు వస్తే, కిలో ధర రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల వరకు ఉంటుంది. ఈ అగార్ వుడ్ చెక్కను అగరొత్తుల తయారీకీ, ధూపం వేసుకోవడానికీ ఉపయోగిస్తారు. బీడ్స్​గా మార్చి దండలూ, బ్రేస్​లెట్లగానూ రూపొందిస్తారు.

ఈ చెక్కతో నూనె : కొందరేమో ఈ చెక్క ముక్కల్ని ప్రాసెస్‌ చేసి నూనె సేకరిస్తారు. అత్తరు, మెడిసిన్‌ తయారీలో ఉపయోగించే ఈ నూనెకు అరబ్‌ దేశాల్లో ఎంతో డిమాండ్‌ ఉంది. నాణ్యతను బట్టి లీటరు నూనె ధర రూ.ముప్ఫై నుంచి రూ.డెబ్భై లక్షల వరకూ పలుకుతుంది. అలాంటివేమీ చేయకుండా కలప రూపంలో విక్రయించినా ఫర్నీచర్‌ తయారీ సంస్థలు చక్కని గృహోపకరణాలను రూపొందిస్తాయి.

అగార్‌వుడ్‌ ఆకులు కూడా ఉపయోగకరమైనవే : అగార్‌ వుడ్‌ కలపతో పాటు ఆకులు కూడా ఉపయోగకరమైనవే. వాటిని ఎండబెట్టి గ్రీన్‌ టీ ఆకుల మాదిరిగా డ్రై లీవ్స్‌గానూ, పొడిగానూ మార్చుతారు. వీటితో చేసే టీ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. రోజుకోసారి అగార్‌ వుడ్‌ టీ తాగితే ఒత్తిడి, జీర్ణ సంబంధ, శ్వాస సమస్యలూ అదుపులోకి వచ్చి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టే తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఈ ఉత్పత్తులన్నీ తయారు చేస్తూ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందుకే అంటారు అగార్‌ వుడ్‌ సువాసనల పంటే కాదు, సిరుల పంట కూడా అని!

వైసీపీ నేతలకు ఏపీ ప్రభుత్వం షాక్.. అనుకున్నదే జరిగిందిగా, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు మరో మలుపు తిరిగాయి. ఈ రెండు కేసులపై సుప్రీంకోర్టులో జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ రెండు కేసుల్లో వైఎస్సార్‌సీపీ నేతలు జోగి రమేష్, దేవినేని అవినాష్‌ సహా పలువురి పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయగా.. తాము కౌంటర్‌కు రిజాయిండర్‌ దాఖలు చేస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు. కొంత సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరగా.. తదుపరి విచారణను ధర్మాసనం డిసెంబర్‌ 17కి వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు తెలిపింది.

మరోవైపు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న దేవినేని అవినాష్, జోగి రమేష్, ఇతర నేతలు విచారణకు సహకరించట్లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ విచారణకు సహకరించడం లేదంటోంది. అయితే దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని.. పాస్ పోర్టులను కూడా అప్పగించేశామని అవినాష్, జోగి రమేష్ తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. మరి వైఎస్సార్‌సీపీ నేతలు రిజాయిండర్‌లో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారన్నది చూడాలి. అప్పటి వరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు.

ఈ రెండు కేసుల్లో వైఎస్సార్‌సీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విచారణ జరగ్గా.. ఈ కేసులో నిందితులు విచారణకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు.. అయితే వైఎస్సార్‌సీపీ నేతలు విచారణ సరిగా స్పందించడంలేదని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశాన్ని సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య గతవారం కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. చైతన్య ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా చెబుతున్నారు. ఆయన టీడీపీ కార్యాలయంలో దాడికి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తేలింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించిన తర్వాత హటాత్తుగా మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. చైతన్యకు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. ఈ కేసులో మిగిలిన వైఎస్సార్‌సీపీ నేతలు విచారణకు హాజరవుతున్నారు. ఈ రెండు కేసుల్ని ఇప్పుడు సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌‌పై కేసు నమోదు కాగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్ విధించగా జైల్లో ఉన్నారు.. మధ్యలో పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. ఆ వెంటనే వెలగడపూడిలో మరియమ్మ అనే మహిళ హత్యకేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటగా కోర్టు రిమాండ్ విధించగా.. ఆ గడువు ముగిడయంతో మరోసారి కోర్టులో హాజరుపరిచ్చారు. జడ్జి మరో 14 రోజుల పాటూ రిమాండ్ విధించారు. అనంతరం మాజీ ఎంపీ సురేష్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

3 ఏళ్లకే చేతికి డబ్బులు.. ఈ 7 బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ.. రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?

వరుసగా 10వ సారి కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ). అయితే, వచ్చే డిసెంబర్‌లో జరిగే మానీటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే బ్యాంకులు సైతం తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత పెడుతుంటాయి. అందుకే అధిక వడ్డీ కోరుకునే డిపాజిటర్లు ఇప్పుడే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆర్థిక లక్ష్యాలు 2-3 ఏళ్ల మధ్య ఉన్నాయని అనుకుంటే మీరు 3 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ గల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. ఈ మూడేళ్ల డిపాజిట్లపై 7 దిగ్గజ బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో..
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మూడేళ్ల టెన్యూర్ డిపాజిట్లను చూసుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జనరల్ కస్టమర్లకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. ఈ ఏడాది జులై 24 నుంచి కొత్త వడ్డీ రేట్లను అమలు చేస్తోంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు సైతం సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిజిటన్లకు 7.50 శాతం వడ్డీ ఇస్తున్నాయి. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ మాత్రం సాధారణ పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఆయా బ్యాంకుల్లో ఒక సాధారణ కస్టమర్ రూ.5 లక్షలు జమ చేస్తే మూడేళ్ల తర్వాత చేతికి రూ. 6,03,074 వస్తాయి. అలాగే సీనియర్ సిటిజన్లు అయితే చేతికి రూ. 6,10,425 వరకు వస్తాయి. అదే కోటక్ మహీంద్రా బ్యాంకులో సీనియర్లకు రూ.6,11,887 వరకు అందుతాయి.

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో..
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మూడేళ్ల టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త రేట్లను జూన్ 15, 2024 నుంచే అమలులోకి తీసుకొచ్చింది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో జనరల్ కస్టమర్లకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాత వడ్డీ లభిస్తోంది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ కస్టమర్లకు 6.7 శాతం వడ్డీ ఇస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ లభిస్తోంది. ఒక జనరల్ కస్టమర్ రూ.5 లక్షలు జమ చేస్తే స్టేట్ బ్యాంకులో రూ.5,99,374 వస్తాయి. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే రూ. 6,03,074 వస్తాయి. ఇక యూబీఐలో రూ. 5,98,638గా ఉంది. ఇక సీనియర్ సిటిజన్లు అయితే ఎస్‌బీఐలో రూ.6,06,743 వస్తాయి. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో అయితే రూ. 6,10,425 వరకు వస్తాయి. ఇక యూబీఐలో చేతికి రూ. 6,06,019 వస్తాయి.

స్వర్ణాంద్ర ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు.. విజయవాడ ఏపీలో పనిచేయాలి.. నెలకు రూ.75 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు జీతం

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్వర్ణాంధ్ర@2047 విజన్‌ ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.apsdps.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టులు : 13

ప్రోగ్రామ్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్ పోస్టులు : 04
కన్సల్టెంట్/ రిసెర్చ్ అసోసియేట్స్‌ పోస్టులు : 08
డేటాబేస్ డెవలపర్ పోస్టులు : 01

ఇతర ముఖ్య సమాచారం :

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (కంప్యూటర్స్‌), పీజీ లేదా డాక్టరేట్ (పబ్లిక్ పాలసీ/ ఎకనామిక్స్‌/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ ఇంజినీరింగ్/ డెవలప్‌మెంట్ స్టడీస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు రూ.2,00,000- రూ.2.5 లక్షలు.. కన్సల్టెంట్ పోస్టులకు రూ.75,000 – రూ.1.50,000.. డేటాబేస్ డెవలపర్ పోస్టులకు రూ.45,000 – రూ.75,000 వేతనం ఉంటుంది.
వయోపరిమితి: 01-01-2025 నాటికి ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు 55 ఏళ్లు.. కన్సల్టెంట్ పోస్టులకు 45 ఏళ్లు,, డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
పని ప్రదేశం: ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్‌ 29, 2024

అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్లు పొందొచ్చు.. గూగుల్‌లో కొత్త ఫీచర్‌ వచ్చేసింది.. వివరాలివే

అతి తక్కువ ధరకే విమాన టికెట్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్లకి శుభవార్త. ఇలాంటి వాళ్ల కోసం గూగుల్ కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. గూగుల్ ఫ్లైట్స్లో ఇప్పుడు మీరు తక్కువ ధరతో కూడిన విమాన టికెట్లను సెలక్ట్‌ చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే.. అతి తక్కువ ధరలకు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇప్పుడు గూగుల్ మీకోసం కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. దీని ద్వారా సూపర్ చీప్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. టెక్ దిగ్గజం గూగుల్‌ మీ టూల్కిట్లో మరొక ఫీచర్ని జోడించింది. ఇది సూపర్ చీప్‌ విమాన టిక్కెట్లను పొందడంలో సహాయపడుతుంది. మీరు గూగుల్ ఫ్లైట్స్తో సెర్చ్ చేసినప్పుడు.. ధర, సౌలభ్యం ఆధారంగా ఫలితాల పైన్‌ బెస్ట్‌ ఆప్షన్స్ కనిపిస్తాయి.

“చీపెస్ట్” ట్యాబ్ గూగుల్ ఫ్లైట్స్లో అందుబాటులోకి వచ్చింది. మీరు మీ ట్రిప్ వివరాలను ఎంటర్‌ చేసి.. మరింత తక్కువ ధరలతో మరిన్ని ఆప్షన్స్ని చూసేందుకు “చీపెస్ట్” పై క్లిక్ చేయండి. గూగుల్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలో వచ్చే రెండు వారాల్లో ఈ అప్డేట్ అందరికి అందుబాటులోకి రానుంది. ఈ చీపెస్ట్ ట్యాబ్ కింద మీకు మరిన్ని ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. క్రియేటివ్ ఇటినరీస్, లాంగర్ లేఓవర్స్, సెల్ఫ్- ట్రాన్స్ఫర్స్, కొనుగోళ్లు వంటివి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.

అయితే సౌకర్యం కన్నా డబ్బుపై ఎక్కువ ఫోకస్ చేసే వారికి సులభంగా చీపెస్ట్ ఫ్లైట్ టికెట్లు దొరికే విధంగా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అవి చూసిన తర్వాత మీరే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మీరు హాలిడే ట్రిప్‌ వెళ్లాలనుకుంటే ఈ ఫీచర్‌ మీకు ఉపయోగపడుతుంది. థాంక్స్ గివింగ్, క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి హాలిడే సీజన్‌ మొదలవుతున్న వేళ ఈ ఫీచర్‌ అందుబాటులోకి రావడం విశేషం.

ఈ ఫీచర్‌ని ఉపయోగించి చౌక విమానాలను ఎలా బుక్ చేసుకోవాలంటే?
ఈ కొత్త టూల్‌తో చౌక విమానాలను బుక్ చేసుకోవడం చాలా సులభం. మీరు సాధారణంగా Google Flights లో బుక్‌ చేసే విధంగా మీ పర్యటన వివరాలను ఎంటర్‌ చేయండి. ఫలితాలు లోడ్ అయిన తర్వాత మీరు ఖర్చు, సౌలభ్యాన్ని బ్యాలెన్స్ చేసే సాధారణ “బెస్ట్‌” ట్యాబ్‌ను చూస్తారు. అయితే.. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన “cheapest” ట్యాబ్‌పై క్లిక్‌ చేయొచ్చు. ఈ సెక్షన్‌ అన్ని ఆప్షన్లను తక్కువ ధరలతో కూడిన లిస్ట్‌ సిద్ధం చేస్తుంది. అవి కొద్దిగా తక్కువ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.

మ్యూచువల్ ఫండ్ సిప్ స్ట్రాటజీ గురించి తెలుసా? రోజుకు రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఇలా చేతికి రూ. 5 కోట్లు

మీకు ప్రతి నెలా జీతం వస్తుందా.. మొత్తం ఖర్చు చేస్తున్నారా.. ఏమైనా పొదుపు చేస్తున్నారా.. ఇప్పుడు బానే ఉన్నా.. పొదుపు చేయకుంటే దీర్ఘకాలంలో ముఖ్యంగా వయసు మళ్లిన సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అందుకే డబ్బుల్ని ఆదా చేసి.. దీనిని పెట్టుబడులకు మళ్లించాలి. అయితే ఎందులో పెట్టుబడి పెట్టాలనే దానిపై మంచి ప్లాన్ ఉండాలి. పెట్టుబడుల కోసం చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఎందులో ఎక్కువ వస్తాయి.. రిస్క్ తీస్కొని ఎందులో ఇన్వెస్ట్ చేయాలి.. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ ఎక్కడ వస్తాయనే దానిపై ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి.
>> అయితే కాస్త రిస్క్ ఉన్నప్పటికీ లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ కోసం చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో సిప్ విధానంలో పెట్టుబడులు పెడుతుంటారు. ఇక్కడ రోజువారీగా రూ. 100 చొప్పున పెట్టుబడి పెట్టినా.. పదవీ విరమణ కల్లా 5 కోట్ల వరకు సంపాదించొచ్చు. ఇందుకోసం.. ఎంత రిటర్న్స్ ఆశించాలి. నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి. ఎన్నేళ్లలో ఎంతొస్తాయో చూద్దాం.

>> మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ పని చేస్తుంది. అంటే ఇన్వెస్ట్‌మెంట్‌పై చక్రవడ్డీ రూపంలో రిటర్న్స్ వస్తాయి. అంటే.. ఇక్కడ కొంత మొత్తం పెట్టుబడి పెడితే.. ఏడాది చివర్లో దానిపై వడ్డీ రూపంలో కొంత ఆదాయం వచ్చిందనుకుందాం. అయితే.. ఇక్కడ వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం.. అసలులో కలుస్తుంది. అప్పుడు మరుసటి సంవత్సరం ఇలా అసలుపై వడ్డీ, మళ్లీ వడ్డీపై వడ్డీ ఇలా కాలం గడుస్తున్న కొద్దీ రిటర్న్స్ పెరుగుతూనే ఉంటాయి. అందుకే.. ఇక్కడ ఎంత తక్కువ వయసులో పెట్టుబడి పెడితే.. అంత ఎక్కువ రిటర్న్స్ అందుకోవచ్చు. అప్పుడు దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించవచ్చు.

>> ఉదాహరణ చూస్తే.. ఉద్యోగంలో చేరిన 25 ఏళ్ల వ్యక్తి.. సిప్‌లో రోజుకు 100 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ప్రారంభించాడనుకుందాం. అప్పుడు నెలకు రూ. 3 వేలు అవుతుంది. ఇక 60 ఏళ్ల వరకు రిటైర్మెంట్ వరకు ఏటా 10 శాతం పెట్టుబడి పెంచుకుంటూ పోవాలి. ఇలా మరో 35 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే.. రిటైర్మెంట్ కల్లా పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవచ్చు.

>> మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా స్కీమ్స్ సగటున 15 శాతం రిటర్న్స్ కంటే ఎక్కువే ఇస్తాయి. మనం ట్రెండ్‌ను బట్టి 12 శాతం వార్షిక రిటర్న్స్ వస్తుందని అనుకొని లెక్కలు చూద్దాం. రోజుకు రూ. 100 చొప్పున నెలకు రూ. 3 వేలు పెట్టుబడి పెట్టాలి. మొత్తం 35 ఏళ్లు కట్టాలి. సగటు రిటర్న్స్ 12 శాతంగా అంచనా వేస్తే.. పెట్టుబడి మొత్తం = రూ. 3000x 12 నెలలు x 35 సంవత్సరాలు = రూ. 97.56 లక్షలవుతుంది. ఇక దీనిపై వచ్చే రాబడి రూ. 4.35 కోట్ల వరకు ఉంటుంది. పెట్టుబడితో కలిపి మొత్తం చేతికి రూ. 5.33 కోట్లు వస్తాయి. ఇది పెట్టుబడిని, రిటర్న్స్‌ను బట్టి మారుతుంటుంది.

తమిళనాడులో వైసీపీ మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్.. హత్య కేసులో నిందితుడు

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొస్తున్నారు. శ్రీకాంత్‌ని కారులో ఎక్కిస్తున్న సమయంలో మాట్లాడారు. తాను డాక్టర్‌నని.. ప్రాణాలు పోయడమే తప్ప ప్రాణాలు తీయడం చేతకాదంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కోనసీమ జిల్లా విషయంలో జరిగిన.. అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ను 2022 జూన్‌ 6న హత్య చేయించినట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన వడ్డి ధర్మేశ్‌ను పోలీసులు ప్రశ్నించి ఈ నెల 18న రిమాండ్‌కు పంపారు.

ఈ కేసులో మరో నలుగురు నిందితులతో పాటు పినిపె శ్రీకాంత్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన తమిళనాడులో ఉన్నట్లు గుర్తించి మదురైలో అదుపులోకి తీసుకున్నారు. దుర్గాప్రసాద్‌ను హత్య చేయించేందుకు నిర్ణయించిన శ్రీకాంత్‌ ధర్మేశ్‌ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

మరోవైపు తన కొడుకు శ్రీకాంత్ అరెస్టును మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రోద్బలంతోనే పోలీసులు తన కొడుకును అరెస్ట్ చేశారని ఆరోపించారు. తమ రాజకీయ జీవితాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతోనే సుభాష్… తన కొడుకుని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఏ తప్పూ చేయని శ్రీకాంత్ నిర్దోషిగా బయటపడతాడన్న నమ్మకం తనకి ఉందన్నారు. అమలాపురంలో బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ గతంలో వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా ఉండేవారు.

2022లో కోనసీమ అల్లర్ల సమయంలో అప్పటి మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి కేసులో సుభాష్‌పై కేసులు నమోదయ్యాయి. అనంతరం ఆయన వైసీపీకి దూరం జరిగిన మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి రామచంద్రాపురం నుంచి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన సుభాష్‌ను చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తనపై గతంలో కేసులు పెట్టించానన్న కక్షతోనే వాసంశెట్టి సుభాష్ ఇప్పడు తన కుమారుడిని హత్యకేసులో ఇరికించారంటూ విశ్వరూప్ ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఏ కార్డు అవసరం లేదు; జస్ట్ ఆధార్ నంబర్ తో ఏటీఎం నుంచి ఇలా క్యాష్ విత్ డ్రా చేయొచ్చు!

ఎప్పుడైనా బయటకు వెళ్తే, సడన్ గా డబ్బు అవసరమైతే, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు అవసరం లేకుండా, కేవలం మీ ఆధార్ నంబర్ సహాయంతో ఏటీఎంల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. అందుకు, ముఖ్యంగా కావాల్సింది, మీ ఆధార్ నంబర్ తో మీ బ్యాంక్ ఖాతా అనుసంధానమై ఉండడం మాత్రమే.

బిల్లులు చెల్లించడానికి లేదా స్థానిక దుకాణంలో చెల్లింపులు చేయడానికి డిజిటల్ లావాదేవీలు భారతదేశంలో చాలా మంది దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారాయి. అయితే, వివిధ సందర్భాల్లో నగదు అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ప్రజలు సాంప్రదాయకంగా బ్యాంకులు లేదా ఎటిఎంల నుండి డబ్బును ఉపసంహరించుకున్నప్పటికీ, వారు ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన పద్ధతిని ఉపయోగించవచ్చు. అది ఆధార్ కార్డు ద్వారా నగదు ఉపసంహరణ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించిన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS) ద్వారా ఇది సాధ్యమవుతుంది.

ఆధార్, బయో మెట్రిక్ ఆథెంటికేషన్

ఆధార్ నంబర్, బయోమెట్రిక్ అథెంటికేషన్ లను ఉపయోగించి వివిధ రకాల బ్యాంకింగ్ లావాదేవీలను ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా నిర్వహించవచ్చు. మైక్రో ఏటీఎంలు, ఇతర బ్యాంకింగ్ ఏజెంట్ల వద్ద నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి ఆర్థిక సేవలను పొందవచ్చు.
ఆధార్ నంబర్ తో క్యాష్ విత్ డ్రా ఎలా?

మీ ఆధార్ నంబరును ఉపయోగించి నగదు ఉపసంహరించుకోవడానికి, ముందుగా, మీరు మీ ఆధార్ నంబర్ ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. ఆ తరువాత, మీ దగ్గర్లోని మైక్రో ఏటీఎం ల నుంచి ఈ కింది దశలను అనుసరించడం ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.

1. మైక్రో-ఎటిఎంను సందర్శించండి: ఏఈపీఎస్ కు మద్దతు ఇచ్చే బ్యాంకింగ్ ఏజెంట్ లేదా మైక్రో-ఎటిఎంను గుర్తించండి. ఈ ప్రదేశాలు తరచుగా గ్రామీణ ప్రాంతాలలో లేదా మొబైల్ బ్యాంకింగ్ సేవలలో భాగంగా కనిపిస్తాయి.

2. మీ ఆధార్ నంబర్ ఇవ్వండి: మైక్రో ఏటీఎంలో మీ 12 అంకెల ఆధార్ నంబర్ ను నమోదు చేయండి. ఆ నంబర్ సరైనదని ధృవీకరించండి.

3. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్: ఫింగర్ ప్రింట్ స్కానర్ లో మీ బొటనవేలు పెట్టి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకోండి. ఈ సిస్టమ్ మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలను తనిఖీ చేస్తుంది.

4. లావాదేవీ రకాన్ని ఎంచుకోండి: వెరిఫికేషన్ పూర్తయిన తరువాత, “క్యాష్ విత్ డ్రాయల్” ఆప్షన్ ను ఎంచుకోండి.

5. ఉపసంహరణ మొత్తాన్ని నమోదు చేయండి: మీరు విత్ డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని నమోదు చేయండి. ఇది మీ బ్యాంక్ విత్ డ్రా లిమిట్ లోపలే ఉండాలి.

6. నగదు, ధృవీకరణ పొందండి: లావాదేవీ తర్వాత, మీకు మైక్రో ఏటీఎం లేదా బ్యాంకింగ్ ఏజెంట్ ద్వారా నగదు అందుతుంది. లావాదేవీని ధృవీకరించడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది.
విత్ డ్రాయల్ లిమిట్స్

ఎఇపిఎస్ ఉపసంహరణ పరిమితులు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి, సాధారణంగా రోజుకు రూ .10,000 నుండి రూ .50,000 వరకు ఉంటాయి. భద్రతా విధానాల కారణంగా కొన్ని బ్యాంకులు ఏఈపీఎస్ సేవలను పరిమితం చేయవచ్చు. అత్యవసర సమయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏఈపీఎస్ చాలా విలువైనది. సాంప్రదాయ బ్యాంకింగ్ (BANKING) పద్ధతుల ద్వారా నగదు ఉపసంహరణలో ఇబ్బంది పడుతున్న వృద్ధులు లేదా వికలాంగులకు ఈ విధానం చాలా ఉపయోగకరం. అయితే, వినియోగదారులు తమ ఆధార్ (aadhaar) నంబర్లను గోప్యంగా ఉంచడం, లావాదేవీల సమాచారం కోసం వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను నిర్వహించడం కచ్చితంగా చేయాలి.

పిల్లల పేరుతో పాలసీలు, ఆస్తులు కొంటున్నారా..!ఈ జాగ్రత్తలు మరువకండి

తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమతో, తమకు ఏదైనా జరిగితే వారికి ఎలాంటి కష్టాలు రాకూడదని ఇన్స్యూరెన్స్‌ పాలసీలు, ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు. అయితే అలాంటి పాలసీలు, ఆస్తుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరువకూడదు.

జీవితంలో ప్రతి ఒక్కరు కష్టపడేది.. ఉద్యోగం, వ్యాపారంలో సంపాదించేది తమతో పాటు తమ వారసులకు అందించడం కోసమే. నేటి అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేస్తుంటారు. వీటన్నింటి లక్ష్యం పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వారికి స్థిరమైన జీవితం కల్పించాలనే లక్ష్యంతోనే శ్రమిస్తుంటారు.

ఈ క్రమంలో కొత్తగా పెళ్లైన వారు పిల్లలు పుట్టిన వెంటనే బీమా ఏజెంట్లు చెప్పే మాటలకు పడిపోతుంటారు. “పిల్లల పేరుతో ఓ పాలసీ తీసుకోండి”అనగానే మంచిదేనని భావిస్తారు. పిల్లల పేరుతో బీమా పాలసీలు చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటంుంది.

తల్లిదండ్రులు తమకు ఏదైనా జరగరానిది జరిగితే తమ పిల్లలకి ఎలాంటి కష్టం లేకుండా ఆర్థిక సహకారం అందేలా పాలసీలు చేయడం మంచిదే. అదే సమయంలో పిల్లలకు ఏదైనా జరిగితే తాము లాభపడాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ప్రస్తుతం ఇన్స్యూరెన్స్ కంపెనీలు పిల్లల పేరుతో పాలసీలు జారీ చేస్తున్నా వారికి నిర్ణీత వయసు వచ్చే వరకు కవరేజీ ఇవ్వడం లేదు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఇన్స్యూరెన్స్‌ పాలసీలు తీసుకోవడంలో పెద్దగా ఉపయోగం ఉండదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఉదాహరణకు కొత్తగా పెళ్లైన జంటకు ఓ బిడ్డ పుట్టగానే బీమా ఏజంటు మాటలతొ ఓ బీమా పాలసీ తీసుకున్నాడనుకుందాం… పాప పుట్టిన కొన్నేళ్లకు ప్రమాదంలో తండ్రి చనిపోతే ఆ పాలసీ పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలి. చనిపోయే నాటికి ఆ వ్యక్తి పేరుతో ఎలాంటి పాలసీ లేకపోతే ఆ కుటుంబం రోడ్డు పడుతుంది. కూతురి పేరుతో ఉన్న పాలసీ గడువు తీరిన తర్వాత చేతికి అందుతుంది. అదే సమయంలో అప్పటి వరకు అతనిపై ఆధారపడి ఉన్న భార్యా పిల్లలకు మాత్రం కష్టాలు తప్పవు

వయసుకి తగిన బీమా కవరేజ్ ఉంటే, తనతో పాటు కూతురుకు కూడా మరో పాలసీ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. నిజానికి ఎవరైనా బీమా పాలసీల్లో కట్టే ప్రీమియంలో ఏజంటు కమీషన్లు, కంపెనీ ఖర్చులకి ఎక్కువ మొత్తమే చెల్లించాల్సి ఉంటుందని గుర్తించాలి.
పిపిఎఫ్‌ పథకాలు ఉత్తమం..

పిల్లల భవిష్యత్తు కోసం 8 శాతం వడ్డీ వచ్చే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో డిపాజిట్ చేస్తే ఎండోమెంట్ పాలసీల్లో గిట్టుబాటయ్యే వడ్డీ కంటే ఎక్కువ వడ్డీయే గిట్టుబాటవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇందులో కొంత రిస్క్‌కు సిద్ధపడితే నెలనెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లో చెల్లిస్తూ పోతే, దీర్ఘకాలానంతరం పిల్లల అవసరాలకు ఉపయోగపడే మంచి ఫండ్ మొత్తాన్ని సిద్ధం చేయొచ్చు.

బీమా పాలసీ అనేది దీర్ఘకాలిక కాంట్రాక్టు. ఒక్కసారి పిల్లల పేరుతో పాలసీ తీసుకొని భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటిని కట్టలేకపోతే సరెండర్ చార్జీల క్రింద కొంత మొత్తాన్ని కోల్పోవలసి వస్తుంది.పొదుపు పథకాలలో ఈ ఇబ్బంది ఉండదు. డబ్బు అందుబాటులో ఉన్నపుడు చెల్లిస్తే సరిపోతుంది.

ఆస్తులు కొన్న ఇబ్బందులు తప్పవు…

పిల్లల పేరుతో ఇల్లు, స్థలాలు కొనాలని ఆలోచిస్తారు కొందరు. దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులు మైనర్ల పేరిట ఉంటే వాటిని అమ్మాలంటే కుదరదు. మైనర్ పిల్లల అవసరం కోసం ఆ ఆస్తుల్ని అమ్మాలంటే దానికి న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలన్నా, ఆ అప్పు మైనర్ అవసరాల కోసమే అని న్యాయస్థానాన్ని అభ్యర్థించిఅనుమతి పొందాల్సి ఉంటుంది.

ఎప్పుడైనా తల్లిదండ్రుల పేరుతో ఆస్తి ఉంటే దుర్వినియోగం అవుతుందన్న భయం ఉంటే తాతయ్యలు, నానమ్మలు మనవళ్ళ పేరుతో స్థిరాస్తులు కొనవచ్చు. కానీ వారికి మైనార్టీ తీరే వరకు యాజమాన్య హక్కులు రావు.
బ్యాంక్ డిపాజిట్లు ఉత్తమం..

బ్యాంక్‌లో మైనర్ పిల్లల పేరుతో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి మధ్యలో కాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది.డిపాజిట్లపై లోన్ తీసుకోవాలన్నా ఆ డబ్బు మైనర్ అవసరాల కోసమే అని లిఖ‌ితపూర్వకంగా రాసిస్తే చెల్లుతుంది.

పొదుపైనా,బీమా పాలసీ అయినా పిల్లల కోసం చేయొచ్చు కానీ, పిల్లల పేరుతోనే వాటిని చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకు సరియైన బీమా పాలసీ ఉన్న తర్వాత పిల్లల పేరుతో పాలసీ చేయాలి. పిల్లల పేరుతో పాలసీ చేయాలనిపిస్తే తల్లిదండ్రులకి బీమా కవరేజి ఇచ్చే పిల్లల పాలసీలని కొనుగోలు చేయవచ్చు. తల్లిదండ్రులకు ఏమైనా జరిగితే పాలసీ మొత్తాన్ని వెంటనే చెల్లించి, పిల్లలకి మైనార్టీ తీరిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని మళ్ళీ చెల్లించే పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

అసంఘటిత రంగాల కార్మికులకు ఈ-శ్రమ్ కార్డులు-రూ.3 వేల పింఛన్, రూ.2 లక్షల బీమా, ఆన్ లైన్ లో అప్లై ఇలా

అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ-శ్రమ్ కార్డుతో అసంఘటిత రంగాల్లో ఉపాధి పొందుతున్న కార్మికులకు కేంద్రం అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత పింఛన్, రూ.2 లక్షల డేత్ బెనిఫిట్ అందిస్తుంది.

అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ యోజన పథకాన్ని ప్రారంభించింది.అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లోని కార్మికుల కోసం ప్రత్యేకంగా ఈ-శ్రమ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఈ-శ్రమ్ పోర్టల్ ప్రధాన లక్ష్యం అసంఘటిత రంగాల్లోని కార్మికుల విస్తృత డేటాబేస్ ను రూపొందించి, వారికి అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడం. అసంఘటిత రంగాల్లోని కార్మికులకు కేంద్రం e-Shram కార్డు అందిస్తుంది. ఈ కార్డుతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ-శ్రమ్ కార్డు పొందిన కార్మికులు 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత పెన్షన్, మరణాంతరం బీమా, వైకల్యం చెందితే ఆర్థిక సహాయంతో సహా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ-శ్రమ్ పోర్టల్ eshram.gov.in ద్వారా అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ కార్డును ఆన్ లైన్ లో పొందవచ్చు.
ఈ-శ్రమ్ కార్డు పొందేందుకు అర్హతలు

అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్న వ్యక్తి లేదా కార్మికుడు
16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు
దరఖాస్తుదారుడి సెల్ ఫోన్ నంబర్‌ ఆధార్‌తో అనుసంధానం చేసి ఉండాలి
ఆదాయపు పన్ను చెల్లించనివారు.

ఆన్‌లైన్ లో e-Shram కార్డు ఎలా దరఖాస్తు చేయాలి

ఈ-శ్రమ్ పోర్టల్‌ https://eshram.gov.in/ ఓపెన్ చేయండి.
మీ ఆధార్ తో లింక్ చేసిన సెల్ ఫోన్ నంబర్‌ను నమోదు చేయాలి. మీ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.
మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. అనంతరం మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
స్క్రీన్‌పై అడిగిన వ్యక్తిగత డేటాను నమోదు చేయండి.
అవసరమైన ఫీల్డ్‌లలో మీ అడ్రస్, విద్యా విషయాలు ఎంటర్ చేయండి.
ఉపాధి, వ్యాపార రకం, చేస్తున్న పని గురించి వివరాలు తెలపండి.
మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని నమోదు చేసిన సబ్మిట్ చేయండి.
స్క్రీన్ పై e-Shram కార్డు డిస్ ప్లే అవుతుంది. E-Shram కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు

60 ఏళ్లు నిండిన వారికి నెలవారీ పింఛను రూ.3,000
డేత్ బెనిఫిట్ బీమా కవరేజీ మొత్తం రూ. 2,00,000, పాక్షిక వైకల్యం చెందితే రూ. 1,00,000 ఆర్థిక సహాయం
ప్రమాదం కారణంగా లబ్ధిదారుడు మరణిస్తే, జీవిత భాగస్వామి అనుబంధ ప్రయోజనాలను పొందేందుకు అర్హులు
ఈ-శ్రమ్ కార్డు భారతదేశం అంతటా చెల్లుతుంది.

E-Shram కార్డు పొందేందుకు అవసరమైన పత్రాలు

కార్మికుడి పేరుతో బ్యాంక్ ఖాతా
ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్
ఆధార్ కార్డు

ఆన్ లైన్ లో ఈ-శ్రమ్ కార్డు డౌన్‌లోడ్ ఎలా?

ఈ-శ్రమ్ పోర్టల్ https://eshram.gov.in/ పై క్లిక్ చేయండి.
హోంపేజీలోని వన్ స్టాప్ సొల్యూషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ‘Login Using UAN’ పై క్లిక్ చేయండి.
మీ UAN పుట్టిన తేదీ, క్యాప్చా ఎంటర్ చేసి, ఆపై ‘జనరేట్ ఓటీపీ’ పై క్లిక్ చేయండి.
మీ మొబైల్ కు వచ్చిన OTPని నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
మీ వివరాలను నిర్ధారించుకుని ‘ప్రివ్యూ’ క్లిక్ చేసి, ఆపై సబ్మిట్ పై నొక్కండి.
మీ ఫోన్‌ కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి సబ్మిట్ చేయండి.
ఇప్పుడు స్క్రీన్ పై ఈ-శ్రమ్ కార్డు జనరేట్ అవుతుంది. డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్‌ పిటిషన్‌.. రేపు విచారణకు వచ్చే అవకాశం

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హీరో అల్లు అర్జున్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును.. క్వాష్‌ చేయాలని పిటిషన్‌ ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది ఏపీ హైకోర్టు. దీనిపై మంగళవారం (రేపు) విచారణ జరిగే అవకాశం ఉంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు మే 12వ తేదీన నంద్యాలలో సినీ అల్లు అర్జున్‌ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఆయన పర్యటనకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి ఇంటికి అల్పాహారానికి అల్లుఅర్జున్‌ వెళ్లారు. వైసీపీ శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకువచ్చాయి.

అప్పుడు అల్లు అర్జున్ పర్యటనకు అధికారిక అనుమతులూ లేవు. అయినా.. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో.. అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండగా.. ఇంచుమించు అదే సమయంలో హీరో అర్జున్‌ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో ఉత్కంఠ నెలకొంది.

అల్లు అర్జున్‌ పర్యటనలో జనసేన జెండాలు కూడా కనిపించాయి. కొంత మంది పవన్‌కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. చంద్రబాబు పర్యటనకు ముందస్తు అనుమతి తీసుకున్న సమయంలో అల్లు అర్జున్‌ నంద్యాలలో ఎలా పర్యటిస్తారని నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్‌ఎండీ.ఫరూక్‌ ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని సినీనటుడు అల్లు అర్జున్‌, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నంద్యాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పారవి.. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డికి సన్నిహితుడు. దీంతో ఆయనకు మద్దతుగా నంద్యాలలో ఆకస్మిక పర్యటన చేశారు అల్లు అర్జున్. ఆయన రాకతో నంద్యాల పట్టణం కిక్కిరిసిపోయింది. అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. వేలాది మంది మద్దతుదారుల మధ్య అల్లు అర్జున, తన భార్య స్నేహారెడ్డితో కలిసి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.

బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకుని పుష్ప పుష్ప అంటూ నినాదాలు చేశారు. శిల్పా రవి రెడ్డికి అల్లు అర్జున్ మద్దతివ్వడం ఇదే తొలిసారి కాదు. 2019లో కూడా అల్లు అర్జున్ అతనికి మద్దతిచ్చి ప్రచారం చేశారు. అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ శిల్పా రవిరెడ్డికి మద్దతుగా నంద్యాలలోని ఆయన నివాసానికి వచ్చారు.

కొత్తకారు తీసుకోవాలనుకుంటున్నారా? 10లక్షలలోపు ధరలోని వీటిపై లుక్కేయండి

కొత్త కారు తీసుకోవాలి అనుకునేవారికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో చాలా ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు పది లక్షలలోపు ధరతో కారు తీసుకోవాలి అనుకుంటే మీకోసం కింద లిస్ట్ ఉంది. ఓ లుక్కేయండి..

కారు కొనాలి అని అందరికీ ఆశ. అయితే అతిగా రేట్లు పెట్టి మిడిల్ క్లాసు వాళ్లు కొనలేరు. పది లక్షల రూపాయల వరకూ ఏదో కష్టం మీద కొనుక్కుంటారు. బడ్జెట్‌ ధరలో కొనే కారు డిజైన్‌, ఫీచర్లు ఎలా ఉంటాయా అనే ప్రశ్న అందరికీ ఉంటుంది. మీరు కొత్త కారు కొనాలి అని చూస్తుంటే.. మీ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్ఓ, టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్ ఎస్‌యూవీవంటి కార్లురూ.10 లక్షలలోపు లభిస్తాయి.

కియా సోనెట్ ధర రూ. 8 నుండి రూ. 15.77 లక్షలుగా ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో ఉంది. 24.1 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10.25-అంగుళాల), 7-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌తో సహా చాలా ఫీచర్లు ఇందులో ఉంటాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.94 లక్షల నుంచి రూ.13.53 లక్షల మధ్య ఉంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇది 24.2 కేఎంపీఎల్ మైలేజీని కూడా అందిస్తుంది. ఇందులో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (8-అంగుళాల), సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, కనెక్ట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి వివిధ ఫీచర్లు కూడా ఉంటాయి. ఇందులో సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ రూ. 7.79 నుండి రూ. 15.49 లక్షల ఎక్స్-షోరూమ్‌గా దొరుకుతుంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఇది 5 మంది వ్యక్తులకు సౌకర్యవంతంగా వెళ్లేందుకు బాగుంటుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది.

సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీ రూ.7.99 నుండి రూ.13.83 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో వినియోగదారులకు దొరుకుతుంది. పెట్రోల్ ఇంజన్ కూడా వస్తుంది. ఇది 18 నుండి 19.5 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఉంటాయి.

టాటా కర్వ్ కూపే కారు ధర రూ.9.99 నుంచి 17.69 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్‌తో సహా అనేక లక్షణాలను కలిగి ఉంది.

పైన చెప్పిన కార్లలో దీపావళి ఆఫర్లు కూడా ఉంటాయి. దగ్గరిలోని డిలర్‌షిప్‌ను సంప్రదించండి.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉంటే మీ కోసం 5 బెస్ట్ ఆప్షన్స్

ఇటీవలి కాలంలో ఈవీల వాడకం పెరిగింది. చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకుంటున్నారు. అయితే ఈ దీపావళికి మీ ఇంటికి ఎలక్ట్రిక్ స్కూటీ తెచ్చుకోవాలనుకుంటే మీ కోసం బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో చూసేండి..

దీపావళి పండుగ దగ్గరకు వస్తుంది. దీపావళి అనగానే క్రాకర్స్, రుచికరమైన స్వీట్లు మాత్రమే కాదు.. చాలా మంది కొత్త వాహనాలను ఇంటికి తెచ్చుకుంటారు. మార్కెట్‌లో ఏది కొనాలా అని ఆలోచిస్తారు. ప్రతి సంవత్సరం దీపావళికి కంపెనీలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తాయి. దీపావళి సీజన్‌లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలని మీరు అనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కంపెనీలు కూడా వినియోగదారులను పెంచుకునేందుకు కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. అంతేకాదు.. వాటిపై తగ్గింపును కూడా ఇస్తున్నాయి. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకుంటే 5 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

ఓలా ఎస్1 ఎక్స్

ఓలా ఎస్1 అనేది 2kWh బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటి. ఇది పూర్తి ఛార్జింగ్‌తో గరిష్టంగా 151 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ చెప్పింది. స్కూటర్ టాప్-స్పీడ్ 90కేఎంపీహెచ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 7 విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
ఆంపియర్ మాగ్నస్ ఎక్స్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి బ్యాటరీని విడిగా తొలగించవచ్చు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 80 నుండి 100 కి.మీ. దీని ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ.85 వేలుగా ఉంది.
లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ జీ3.0

రోజువారీ ప్రయాణానికి అనువైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఇ-స్కూటర్‌కు సంబంధించిన బ్యాటరీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అందుబాటులో ఉంది. బ్యాటరీ కోసం నెలవారీ ఒప్పందం రూ.999. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి బ్యాటరీ ఛార్జ్‌తో గరిష్టంగా 115 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 18 ఎఎంపీ ఛార్జర్‌తో కేవలం 3 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ జీ2.0

ఇది ఒక ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్. ఎందుకంటే ఈ స్కూటర్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. మీ మొబైల్ ఫోన్‌ను స్కూటర్‌కి కనెక్ట్ చేసేందుకు కూడా వీలుగా ఉంటుంది. ఇది 2.3 KW బ్యాటరీతో వస్తుంది. పూర్తి ఛార్జింగ్‌తో 98 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

జాయ్​ ఈ బైక్

జాయ్​ ఈ బైక్​ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ .1.17 లక్షలు. గ్లోబ్, జెన్ నెక్ట్స్ నాను, వోల్ఫ్, వోల్ఫ్ ఎకో, వోల్ఫ్ ప్లస్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని కూడా ఈ బ్రాండ్ విక్రయిస్తోంది. వీటి ధరలు రూ .70,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్​ దాదాపు 130 కి.మీ రేంజ్​. రెట్రో లుక్స్​తో ఇది వస్తుంది.

నెల నెలా రీఛార్జ్ చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందా? ఇదిగో చౌకైన 1 ఇయర్ ప్లాన్స్

1 Year Recharge Plans : ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవడం కొందరికి ఇబ్బంది. అందుకే ఏడాది ప్లాన్స్ కోసం చూస్తారు. అలాంటివారి కోసం చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ప్రతి నెలా మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకోవడం కాస్త చిరాకుగా అనిపిస్తుంది. ఈ టెన్షన్ వద్దనుకుంటే 365 రోజుల వ్యాలిడిటీతో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. యాన్యువల్ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాది పొడవునా టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఎయిర్‌టెల్, జియో, వొడా ఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ చౌకైన వార్షిక రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. ఏ కంపెనీ తన కస్టమర్లకు అతి తక్కువ ధరకు 365 రోజుల వాలిడిటీ ప్లాన్‌ను అందిస్తుందో చూడండి..

బీఎస్ఎన్ఎల్

బీఎస్ఎన్ఎల్ 365 రోజుల వ్యాలిడిటీతో చౌకైన ప్లాన్‌ను రూ.1198గా నిర్ణయించింది. ఈ ప్లాన్లో కస్టమర్లకు 12 నెలల పాటు 300 నిమిషాల కాలింగ్, 3 జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. కంపెనీ వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం, అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 24 మధ్య రీఛార్జ్ చేసే వినియోగదారులకు 24 రోజుల వ్యాలిడిటీతో 24 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది.
ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ రూ.1999తో 365 రోజుల వాలిడిటీతో చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్లో వినియోగదారులు 365 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్, రోజువారీ 100 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. ఈ ప్లాన్ 24 జీబీ డేటాను అందిస్తుంది. డేటా ముగిసిన తర్వాత మీరు ప్రత్యేక డేటా ప్యాక్ కొనాల్సి ఉంటుంది. అదనపు ప్రయోజనంగా ఈ ప్లాన్‌లో అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్స్, స్పామ్ కాల్ అలర్ట్స్ ఉన్నాయి.

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో రూ.3599తో 365 రోజుల వాలిడిటీతో ప్లాన్‌ను కలిగి ఉంది. ఇందులో వినియోగదారులు 365 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, రోజుకు 2.5 జీబీ డేటా అంటే మొత్తం 912.5 జీబీ, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. రోజువారీ డేటా కోటా అయిపోయిన తర్వాత కూడా వినియోగదారులు 64 కేబీపీఎస్ స్పీడ్‌తో అపరిమిత ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. జియో 5జీ నెట్ వర్క్ మీ ప్రాంతంలో ఉండి, మీ వద్ద 5జీ ఫోన్ ఉంటే అపరిమిత 5జీ డేటాను ఉచితంగా వాడుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ ఈ ప్లాన్‌లో లభిస్తుంది.
వొడాఫోన్ ఐడియా

వొడాఫోన్ ఐడియా (వీఐ) 365 రోజుల వ్యాలిడిటీతో రూ.1999 రీఛార్జ్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్లో వినియోగదారులకు 24 జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌తో మొత్తం 3600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. డేటా కోటా అయిపోతే 1 ఎంబీకి 50 పైసలు, ఎస్ఎంఎస్ కోటా అయిపోయినప్పుడు స్థానిక ఎంఎంఎస్‌కు రూ.1, ఎస్టీడీ ఎంఎంఎస్‌కు రూ.1.5 వసూలు చేస్తారు.

మీ సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 లక్షల లోన్.. ఇలా అప్లై చేయాలి?

సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు రుణాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన పథకాన్ని తీసుకొచ్చింది. అయితే రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకూ దీని కింద రుణం పొందవచ్చు. ఎవరు అర్హులు? ఎలా రుణం పొందాలో తెలుసుకుందాం..

స్వయం ఉపాధిని సృష్టించడంలో సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన మంత్రి ముద్ర పథకాన్ని అమలు చేస్తుంది. దీని కింద సొంత వ్యాపారాలను ప్రారంభించేలా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం దీని కోసం రుణ సౌకర్యం కూడా కల్పిస్తోంది. అర్హులైన వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద రుణాలు అందిస్తారు. ఈ స్కీమ్ కింద మూడు రకాల రుణాలు ఉంటాయి.

మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీకు సహాయం చేస్తుంది. వ్యాపారం ప్రారంభించేందుకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. భారతదేశ పౌరులు ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఆర్థిక సహాయం అందించేందుకు 2015లో ప్రధాన మంత్రి ముద్ర యోజనను ప్రారంభించారు. మీరు దీని కింద వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ పథకం ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద ప్రభుత్వం మూడు కేటగిరీల కింద రుణాలను అందజేస్తుంది. మొదటిది శిశు లోన్, రెండవది కిశోర్ లోన్, మూడోది తరుణ్ లోన్. శిశు లోన్ ద్వారా 50 వేల రూపాయల వరకు రుణం తీసుకొని మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కిశోర్ రుణం ద్వారా మీరు 50 వేల నుండి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ లోన్ కింద మీరు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు రుణం తీసుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు.

ఈ పథకం కింద ముద్ర లోన్ పొందుతున్న వ్యక్తులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ముద్ర రుణంపై వడ్డీ రేటు మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR) ఆధారంగా నిర్ణయిస్తారు. ఎంసీఎల్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం లెక్కిస్తారు. హార్టికల్చర్, చేపల పెంపకం వంటి వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులు కూడా ఈ పథకం కింద రుణం పొందవచ్చు.

సాధారణంగా దాదాపు అన్ని ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తాయి. అయితే అధిక వడ్డీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడటం సహజం. ఇప్పుడు మీరు ప్రధాన్ మంత్రి శిశు ముద్ర యోజన కింద రుణం కోసం దరఖాస్తు చేస్తే ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు. ఈ రకమైన లోన్ ప్రాసెసింగ్ కోసం ఎటువంటి రుసుం కూడా వసూలు చేయరు. కానీ వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మారవచ్చు. ఈ పథకం కింద వడ్డీ రేటు 9 నుంచి 12 శాతం వరకు ఉండే అవకాశం ఉంది.

18 ఏళ్లు పైబడిన భారత పౌరులు ఎవరైనా ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుకు బ్యాంక్ డిఫాల్ట్ చరిత్ర ఉండకూడదు. రుణం పొందడానికి బ్యాంకు ఖాతా అవసరం. రుణం పొందేందుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్ల విషయానికి వస్తే ఆధార్ కార్డు, పాన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బిజినెస్ ప్లాన్, కేవైసీ డాక్యుమెంట్, ఆదాయ రుజువు వంటి పత్రాలు ఉండాలి.

మీరు సమీపంలోని బ్యాంకుకు వెళ్లడం ద్వారా ముద్ర స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేయవచ్చు. మరింత సమాచారం కోసం https://www.mudra.org.in/ని సందర్శించండి. ఈ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు,

చైనాను వెనక్కు నెట్టిన భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మార్కెట్ మనదే!

భారత్‌లో ఆటోమెుబైల్ రంగం దశాబ్ద కాలంలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. ఇక టూ వీలర్ మార్కెట్‌లో చైనాను వెనక్కు నెట్టి నెంబర్ వన్ స్థానానికి వచ్చింది.

భారతదేశం ఇప్పుడు చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మార్కెట్‌గా ఉంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం, 2024 ప్రథమార్థంలో ప్రపంచ ద్విచక్ర వాహనాల విక్రయాలు సంవత్సరానికి 4 శాతం పెరిగాయి. గ్లోబల్ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో హోండా అగ్రగామిగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో హీరో మోటోకార్ప్, యమహా, టీవీఎస్ మోటార్, యాడియా ఉన్నాయి. ఇండోనేషియా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి ఆగ్నేయాసియా దేశాలలో అమ్మకాలు క్షీణించగా.. భారత మార్కెట్ బలం భిన్నంగా ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కఠినమైన రుణ నిబంధనలు ఆ దేశాల్లో క్షీణతకు కారణం అయినట్టుగా తెలుస్తోంది.

ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రపంచంలోని టాప్ 10 ద్విచక్ర వాహన తయారీదారులు మొత్తం అమ్మకాలలో 75 శాతం కంటే ఎక్కువ వాటా అందించారు. ఈ బ్రాండ్లలో టీవీఎస్ మోటార్ సంవత్సరానికి 25 శాతం గణనీయమైన వృద్ధితో నిలుస్తుంది.

ఈ ఏడాది ప్రథమార్థంలో భారత ద్విచక్ర వాహన మార్కెట్ 22 శాతం వృద్ధి చెందిందని సీనియర్ విశ్లేషకుడు సోమ్నే మండల్ తెలిపారు. ఈ అసాధారణ వృద్ధి చైనాను అధిగమించి భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా మార్చింది. భారతదేశంలో ద్విచక్ర వాహనాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.

చైనాలో సంప్రదాయ మోటార్‌సైకిళ్లు, ప్రయాణానికి స్కూటర్‌లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. 125సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలు ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల సౌలభ్యం, పర్యావరణ ప్రయోజనాల కారణంగా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.

భారతీయ మార్కెట్ మాత్రం టూ వీలర్స్ అమ్మకాల్లో ముందుంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారతదేశంలోనే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమాసియా, ఆఫ్రికాలో కూడా పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వినియోగదారులు ఖర్చు తగ్గించుకోవాలని ఆలోచనతో ఆగ్నేయాసియా ద్విచక్ర వాహన విక్రయాల్లో తగ్గుదల కనిపించింది. దీనితోపాటుగా కఠినమైన క్రెడిట్ నిబంధనలు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు వివిధ సమస్యలను కలిగిస్తున్నాయి.

అగ్రగామి టూ వీలర్ మార్కెట్‌గా భారతదేశం సాధించిన విజయం ఈ రంగంలో నిరంతరం కొనసాగేలా కనిపిస్తుంది. ప్రభుత్వ విధానాలు, పెరుగుతున్న గ్రామీణ డిమాండ్‌తో భారతదేశం ఈ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించనుంది.

మెుత్తంగా చూసుకుంటే.. భారతదేశం మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉంది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల విక్రయాలలో మొదటి స్థానంలోకి వచ్చింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం భారతదేశంలో ద్విచక్ర వాహనం నిత్యావసర వస్తువుగా మారింది.

Health

సినిమా