Sunday, November 17, 2024

సేఫ్టీలో టాటా కార్లు ఇందుకే తోపు- టాటా కర్వ్​తో మళ్లీ రుజువైంది..

సేఫ్టీకి పెట్టింది పేరు టాటా మోటార్స్​! తాజాగా విడుదలైన టాటా కర్వ్​, టాటా కర్వ్​ ఈవీలతో ఇది మరోమారు రుజువైంది. భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ వెహికిల్స్​కి టాప్​ రేటింగ్స్​ లభించాయి. ఇందుకు గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాము..

భారత ఆటోమొబైల్​లో ‘సేఫ్టీ’ టాపిక్​ రాగానే అందరికి గుర్తొచ్చే పేరు టాటా మోటార్స్​! కస్టమర్ల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో కీలక సేఫ్టీ ఫీచర్స్​ని తన వాహానాల్లో ఇస్తుంది ఈ సంస్థ. ఇక ఇప్పుడు టాటా కర్వ్​, టాట కర్వ్​ ఈవీలతో ఈ విషయం మరోసారి రుజువైంది. భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ రెండు వెహికిల్స్​కి కూడా టాప్​ రేటింగ్స్​ లభించాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్స్​లోని సేఫ్టీ ఫీచర్స్​ గురించి, క్రాష్​ టెస్ట్​ గురించి సవివరంగా తెలుసుకుందాము..

రెండు వేరువేరు ప్లాట్​ఫామ్స్​- కానీ బెస్ట్​ ఔట్​పుట్​!

టాటా కర్వ్​, టాటా కర్వ్ ఈవీలు చూడటానికి దాదాపు ఒకేలా ఉండవచ్చు. కానీ కూపే ఎస్​యూవీలు పూర్తిగా భిన్నమైన ప్లాట్​ఫామ్స్​పై తయారయ్యాయి. టాటా కర్వ్ ఈవీ కంపెనీ అడ్వాన్స్​డ్​ కనెక్టెడ్ టెక్-ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ (యాక్టి.ఈవీ) ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్​ఫామ్​ని పంచ్ ఈవీతో పరిచయం చేసింది టాటా మోటార్స్​. ఈ ప్లాట్​ఫామ్​ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించడం జరిగింది. మెరుగైన కనెక్టివిటీ, భద్రతను నిర్ధారించేటప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీకి అనుగుణంగా అధునాతన ఫీచర్లకు ఇది అనుమతిస్తుంది.

మరోవైపు టాటా కర్వ్​ కూపే ఎస్​యూవీ అట్లాస్ (అడాప్టివ్ టెక్ ఫార్వర్డ్ లైఫ్​స్టైల్ ఆర్కిటెక్చర్) అనే కొత్త ప్లాట్​ఫామ్​ మీద నిర్మించింది సంస్థ. టాటా ప్రకారం.. అట్లాస్ కఠినమైన బల్క్ హెడ్ నిర్మాణాలు, సస్పెన్షన్- ఇంజిన్ భాగాల కోసం బలమైన మౌంటింగ్ పాయింట్లతో మంచి ఫ్రేమ్​వర్క్​ని కలిగి ఉంది. ఇది క్రాష్ అయినప్పుడు వాహన పనితీరును మెరుగుపరచడానికి ఉద్దేశించ రూపొందించింది.

ఇక ఇప్పుడు ఈ రెండు వెహికిల్స్​లోని సేఫ్టీ ఫీచర్స్​పై ఓ లుక్కేద్దాము..
టాటా కర్వ్, కర్వ్ ఈవీ: సేఫ్టీ ఫీచర్స్..

టాటా కర్వ్, కర్వ్ ఈవీ భద్రతా ఫీచర్ల లిస్ట్​ ఎక్కువగానే ఉంది. టాటా కర్వ్​లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టీపీఎంఎస్​తో పాటు ఆరు ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్​గా ఉన్నాయి. 360 డిగ్రీల కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్, అన్ని డిస్క్ బ్రేక్లు, ఆటో హోల్డ్​తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్స్​ కూడా ఉన్నాయి.

ఇక టాటా కర్వ్ ఈవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఆటో హోల్డ్ ఫంక్షన్​తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ స్టార్ట్ అండ్ డిసెంట్ అసిస్ట్, ఈఎస్​పీ, డ్రైవర్ స్లీప్ అలర్ట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్లు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాటా కర్వ్ ఈవీ ఏవీఏఎస్ (అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్) వస్తోంది. దీంతో టాటా కర్వ్ ఈవీ గంటకు 20 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు సౌండ్ అలర్ట్స్​ను జనరేట్​ చేస్తుంది.
టాటా కర్వ్, కర్వ్ ఈవీ: క్రాష్ టెస్ట్ రేటింగ్..

ఇటీవల భారత్​ ఎన్​సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్​లో అడల్ట్ ప్రొటెక్షన్ లో 32కు 29.5, చైల్డ్ ప్రొటెక్షన్ లో 49కి 43.66 మార్కులు సాధించింది టాటా కర్వ్​. కాగా, టాటాకర్వ్ ఈవీ వయోజన రక్షణలో 32కు 30.81 పాయింట్లు, పిల్లల రక్షణలో 49 పాయింట్లకు 44.83 పాయింట్లు సాధించింది.

టాటా కర్వ్ ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్​లో 16.00 కు 14.65, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్​లో 16.00 కు 14.85 స్కోరు సాధించాడు. మరోవైపు టాటా కర్వ్ ఈవీ ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్​లో 16.00 కు 15.66, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్​లో 16.00 కు 15.15 పొందింది.

చైల్డ్ ప్రొటెక్షన్ క్రాష్ టెస్ట్​లో వెహికల్ అసెస్​మెంట్ స్కోర్​లో టాటా కర్వ్ 13కు 9 పాయింట్లు సాధించినట్లు వెల్లడైంది. డైనమిక్ స్కోర్​లో 24కు 22.66, సీఆర్​ఎస్​ ఇన్​స్టలేషన్ స్కోర్​లో 12కు 12 మార్కులు వచ్చాయి. చైల్డ్ ప్రొటెక్షన్ పరంగా కర్వ్ ఈవీ డైనమిక్ స్కోర్ లో 24కు 23.88, సీఆర్ఎస్​ ఇన్​స్టలేషన్ స్కోర్ లో 12కు 12 మార్కులు సాధించింది. వెహికల్ అసెస్మెంట్ స్కోర్​లో 13కు 9 మార్కులు సాధించింది.

ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి 11 కంపెనీలను కలిగి ఉన్న కాంపాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్​కు టాటా కర్వ్​తో టాటా మోటార్స్​ గట్టి పోటినిస్తోంది.

త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!

ట్రాఫిక్‌ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో పర్యావరణహిత ప్రయాణ సేవలు అందించేందుకు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సిద్ధమైంది. త్వరలోనే నగరంలో ఎగిరే ట్యాక్సీలు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది.

ప్రస్తుతం ఇందిరానగర్‌ నుంచి విమానాశ్రయానికి చేరాలంటే గంటా 50 నిమిషాలు పడుతోంది. అదే ఎగిరే ట్యాక్సీలతో అయితే కేవలం 5 నిమిషాలు చాలు అని సార్లా ఏవియేషన్‌ సీఈఓ ఏడ్రియన్‌ ష్మిత్‌ అన్నారు. ఇదో గేమ్‌ ఛేంజర్‌గా ఆయన అభివర్ణించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఈ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు 2- 3 సంవత్సరాలు పడుతుందన్నారు.

ఈ ఎగిరే ట్యాక్సీలు సాధారణ హెలికాప్టర్ల కంటే వేగంగా ప్రయాణించడమే కాకుండా వాతావరణానికి ఎలాంటి హాని కలిగించవు. కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నారు. తీవ్రమైన రద్దీతో ఇబ్బంది ఎదుర్కొంటున్న బెంగళూరు నగరవాసులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ తరహా సేవలు తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెడుతూ, పర్యావరణానికి మేలు చేసేవి కావడంతో అందరూ వీటిపై మక్కువ చూపుతున్నారు.

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. ఎటు చూసినా ప్రకృతి రమణీయం

ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, కులుమనాలి, కాశ్మీర్…. ఈ పేర్లు చెబితేనే మనసు ఆహ్లాదంతో పరవశించిపోతుంది. చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు… ఇలా అక్కడి ప్రకృతి అందాలు చూస్తే కవి కాని వాడికికూడా కవిత్వం తన్నుకొస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి ప్రకృతి సోయగమే మన ఏపీలో కనువిందు చేస్తోంది. ప్రకృతి ప్రేమికులను రారమ్మంటోంది.

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. ఎటు చూసినా ప్రకృతి రమణీయం.. ఔరా అనిపించే ఆహ్లాదకర వాతావరణం.. ప్రకృతి ప్రేమికుల్లో అంతులేని ఆనందం.. ఎక్కడో డార్జిలింగ్, నైనిటాల్, ముస్సొరినో అనుకుంటున్నారా…! కానే కాదు… పక్కా ఆంధ్రా. విదేశాలకు ఏమాత్రం తీసిపోని అందాలతో పాటు, గ్రామీణ గిరిజన సంస్కృతికి సజీవ సాక్ష్యంగా, ప్రకృతి ఒడిలో విరిసిన అందాల హరివిల్లు మన అరకులోనే ఈ అద్భుత దృశ్యాలు. సీజన్ మొదలుకావడంతో అరకు అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించింది.

అరకు లోయతో పాటు లంబసింగి, వంజంగిలోని ఈ మేఘాల కొండలు మైమరిపిస్తున్నాయి. ఆకాశమే దిగివచ్చిందా అన్నట్లు ఈ అద్భుత దృశ్యాలు ఔరా అనిపిస్తున్నాయి. అరకులో ఉన్నామా… ఆకాశంలో విహరిస్తున్నామా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. ప్రకృతి రమణీయతకు గిరిజన సంప్రదాయ నృత్యాలు మరింత అందాన్ని అద్దాయి. పైనా మంచు వర్షం… కొండపైన అబ్బురపరిచే నృత్యాలను చూస్తూ పులకించిపోయారు పర్యాటకులు.

అరకు అందాలు అద్భుతమంటున్నారు టూరిస్టులు. సుందర దృశ్యాలకు చూసేందుకు రెండు కళ్లు చాలట్లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు… పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వచ్చిన పర్యాటకులు. ప్రకృతి అందాలు చూసి పరవశించిపోతున్నారు. ఇక ఈ పర్యాటక సీజన్ 6 నెలల పాటు ఉంటుంది. అరకులో ఏర్పాట్లు కూడా అదిరిపోతున్నాయి. టూరిస్ట్ సీజన్‌ కావడంతో సకల సౌకర్యాలు అక్కడ దొరుకుతున్నాయి. మొత్తంగా… ఈ ప్రకృతి వలకబోతున్న అందాలను చూస్తుంటే మన డైరెక్టర్లు సినిమా షూటింగ్‌కు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదనిపిస్తోంది…!

మహీంద్ర కొత్త కారు.. ఫీచర్స్‌ అలా ఉన్నాయి

ప్రస్తుతం మార్కెట్లో ఎక్స్‌యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్‌లో కార్లను ఎక్కువగా తీసుకున్నాయి. ముఖ్యంగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్ర మార్కెట్లోకి ఈ కార్లను పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాయి.

గతంలో మహీంద్ర ఎక్స్‌యూవీ 300 పేరుతో తీసుకొచ్చిన కారుకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్ర ఈ కారుకు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ పేరుతో మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చింది.

ఈ కారు అమ్మకాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ఈ కారును మొత్తం 9 వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌ల వెర్షన్స్‌లో తీసుకొచ్చిన ఈ కారుకు ఇండియన్‌ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. దసరా సీజన్‌లో ఈ కారు బుకింగ్స్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోయి. దీంతో వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగింది. ఈ కారుకు క్రేజ్‌కు ఇదే నిదర్శనమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే మహీంద్ర ఎక్స్‌యూవీ 3×0 ధర విషయానికొస్తే పెట్రోల్ వేరియంట్ బేస్‌ ప్రైజ్‌ రూ. 7.79 లక్షల బేస్ వేరియంట్‌గా ఉంది. అయితే ఇందులో టాప్‌ ఎండ్‌ మోడల్‌ రూ. 15.48 లక్షల వరకు ఉంది. ఇక డీజిల్‌ విషయానికొస్తే బేస్ వేరియంట్‌ రూ. 9.98 లక్షలు కూడా టాప్‌ ఎండ్‌ రూ. 14.99 ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌ వరక5అందుబాటులో ఉంది. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 10.25 ఇంచెస్‌తో కూడిన డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లేను.. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు.

వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇక భద్రతకు కూడా ఈ కారులో పెద్దపీట వేశారు. ముఖ్యంగా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. అలాగే ఇందులో లెవల్ 2 ADAS టెక్నాలజీ, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ రాడార్ సెన్సార్‌ను ఇచ్చారు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ TGDi పెట్రోల్ ఇంజన్ ఈ కారు సొంతం. అలాగే 1.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ను అందించారు. ఇది గరిష్టంగా 115bhp శక్తిని, 300Nm గరిష్ట టార్క్‌ ప్రొడ్యూస్‌ చేస్తుంది.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక నేరుగా శ్రీవారి దర్శనం..! 6 గంటల్లోనే

తిరుమల వెంకన్న భక్తులకు ఇది గొప్ప శుభవార్త..ఇప్పడు నేరుగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం వచ్చింది. తిరుమలలోని కంపార్టమెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా వెంకన్న దర్శనభాగ్యం కలుగుతోంది.

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టగా.. ఇప్పుడు కేవలం 6 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 80,741 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31,581 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కానుకల రూపంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు సమకూరిందని టీటీడీ వెల్లడించింది.

ఇక, తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి రోజు అక్టోబరు 31న దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనుంది టీటీడీ. దీపావళి రోజు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొంటారు.. ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..

ఇరువైపుల పెద్ద పెద్ద కొండలు, మధ్యలో నిశ్శబ్ధంగా ముందుకు సాగే గోదావరి నది. అందులో బోటు ప్రయాణం. ఊహించుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉండే ఈ ప్రయాణం పాపికొండల సొంతం.

ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పాపికొండలను వీక్షించేందుకు ఎంతో మంది ప్రయాణికులు క్యూ కడుతుంటారు.

ఇటీవల వర్షాల కారణంగా నిలిచిపోయిన పాపికొండలు టూర్‌ ప్యాకేజ్‌ తాజాగా మళ్లీ ప్రారంభమైంది. ఈ నేపపథ్యంలో తెలంగాణ టూరిజం పాపికొండలు టూర్‌ ప్యాకేజీని తిరిగి ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ప్యాకేజీని ప్రారంభించనున్నారు. గోదావరి నీటితో నిండి ఉండే ఈ సమయంలో పాపికొండల్లో ప్రయాణం జీవితంలో మర్చిపోలేని ఓ అనుభూతిని ఇవ్వడం ఖాయం. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ఆఫర్‌ చేసే ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ టూరిజం ‘పాపికొండలు రోడ్ కమ్‌ రివర్‌ క్రూయిజ్‌’ పేరుతో ఈ ప్యాకేజీన అందిస్తోంది. మూడు రోజుల పాటు సాగే ఈ టూర్ హైదరాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయాణం ఇలా సాగుతుంది..

* తొలిరోజు రాత్రి 7.30 గంటలకు ఐఆర్‌ఓ ప్రయాణిక్‌ భవన్‌ నుంచి టూర్‌ ప్రారంభమవుతుంది. 8 గంటలకు బషీర్‌బాగ్లోని సీఆర్‌ఓ ఆఫీస్‌ నుంచి బయలుదు దేరుతుంది. రాత్రంతా భద్రాచలంకు జర్నీ ఉంటుంది.

* రెండో రోజుం 6 గంటలకు వరకు భద్రాచలంలోని హరిత హోటల్‌కు చేరుకుంటారు. అనంతరం పోచారం బోటింగ్‌ పాయింట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటు ప్రయాణం ఉంటుంది. రాత్రి హరిత హోటల్‌కు చేరుకుంటారు. బస హోటలోనే ఉంటుంది.

* ఇక మూడో ఉదయం భద్రచలం శ్రీరాముల వారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత పర్నశాలకు వెళ్తారు. అనంతరం మధ్యాహ్నం భోజనం సమయానికి హరిత హోటల్‌కు చేరుకొని భోజనం చేస్తారు. భోజనం చేసిన తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 10గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు..

ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 6999గా, చిన్నారులకు రూ. 5599గా నిర్ణయించారు. టూర్‌ ప్యాకేజీలో నాన్‌ ఏసీ బస్సు, హోటల్‌లో గదులు, బోటింగ్‌, బోట్‌లో ఫుడ్‌ కవర్‌ అవుతాయి. ఇతర ఖర్చులన్నీ ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక సైబర్ నేరగాళ్ల ఆటలు చెల్లవు.. రంగంలోకి సైబర్ కమాండోలు

తెలంగాణలో రూ.759 కోట్లు, మహారాష్ట్రలో రూ.990 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 721 కోట్లు, తమిళనాడులో 662 కోట్లు, గుజరాత్లో 650 కోట్లు.. ఇదీ రాష్ట్రాలవారీగా సైబర్ నేరగాళ్లు ఏడాది కాలంలో కొల్లగొట్టిన సొత్తు విలువ.

సైబర్ నేరాలపై 2023లో ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు దేశవ్యాప్తంగా 11, 28,265 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా బాధితులు మొత్తం రూ.7,488.6 కోట్లు కోల్పోయారు. ఈ సైబర్ ముఠాల ఎత్తుల్ని చిత్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ సైబర్ కమాండోలను రంగంలోకి దించబోతోంది. శిక్షణ పూర్తి చేసుకుని త్వరలో రంగంలోకి దిగబోతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యల్లో సైబర్ నేరాలు ఒకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం వీటిపై ఉక్కుపాదం మోపేందుకు సైబర్ కమాండోలను కేంద్రం సిద్దం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీసులను సైబర్ కమాండోలుగా తీర్చదిద్దబోతోంది. వచ్చే ఐదేళ్లలో సుమారు 5,000 మందిని రంగంలోకి దించాలని కేంద్ర హోంశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ బాధ్యతను ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ)కి అప్పగించింది. ఈ క్రమంలోనే తొలి విడతగా 346 మందిని ఎంపిక చేసింది. ముందుగా రాష్ట్రాల పోలీసులతోపాటు కేంద్ర పోలీస్ సంస్థలు, కేంద్ర పారామిలిటరీ బలగాల నుంచి 2023 అక్టోబరు 5న నామినేషన్లను ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా 1,128 దరఖాస్తులు రాగా….ఈ ఏడాది ఫిబ్రవరి 24న 32 కేంద్రాల్లో శారీరక సామర్థ్య, రాతపరీక్షలు నిర్వహించారు. వీటిలో 747 మంది ఎంపిక కాగా….వారిలో 346 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సైబర్ కమాండోలకు ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చి.. సైబర్ నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, ఛేదన తదితర అంశాల్లో మెరికలుగా తీర్చిదిద్దనున్నారు.

సైబర్ కమాండోలుగా ఎంపికైన వారికి ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో పాఠాలు చెప్పించబోతున్నారు. జాయింట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సమన్వయ), సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్(సీఎఫ్ఎంసీ) తదితర కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లబ్బాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీతోపాటు కాన్పూర్, కొట్టాయం, నయా రాయ్పూర్‌ ఐఐటీలు, గాంధీనగర్ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ(ఆర్ఆర్‌యై). ఢిల్లీ, గోవా, గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలు, పుణె డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(డీఐఏటీ) తదితర ప్రఖ్యాత సంస్థల్లో తర్ఫీదు ఇస్తారు. ఆరు నెలల అనంతరం కమాండోలు విధుల్లోకి చేరనున్నారు. వీరు సొంత రాష్ట్రాల్లో ఐదేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది.అయితే ఈ శిక్షణ కోసం తెలంగాణ నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్లో డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత కుమార్ ఎంపికయ్యారు. బీటెక్ సీఎస్ఈ చదివిన ప్రశాంత్ కుమార్‌కు సాంకేతికతపై పట్టు ఉండటంతో కానిస్టేబుల్‌గా ముందు నుంచీ సైబర్ నేరాల విభాగంలోనే ఉన్నారు.

బొప్పాయిని వీటితో కలిపి తింటున్నారా.? విషంతో సమానం సుమా..

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయిలోని విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కెలతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌లు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

బీపీ మొదలు, జీర్ణ సంబంధిత సమస్యల వరకు బొప్పాయి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే బొప్పాయిని ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బొప్పాయిని పెరుగును ఎట్టి పరిస్థితుల్లో కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిని తిన్న వెంటనే పెరుగు తీసుకుంటే ప్రమాదం తప్పదని నిపుణులు చెబుతున్నారు. సాధారనంగా బొప్పాయికి వేడి చేసే గుణం ఉంటుంది, పెరుగుకు చలువ చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఇలాంటి రెండు విభిన్న లక్షణాలున్న వాటిని వెంట, వెంటనే తీసుకుంటే ఇబ్బంది తప్పదని చెబుతున్నారు.

* బొప్పాయిని తీసుకున్న వెంటనే సట్రస్‌ జాతికి చెందిన పండ్లను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్రూట్‌ సలాడ్‌లో బొప్పాయితో పాటు ఆరంజ్‌ వంటి నిమ్మజాతి పండ్లు కూడా ఉంటాయి. అయితే ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

* బొప్పాయి తీసుకున్న వెంటనే నిమ్మరసం తాగడం కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇది ముమ్మాటికీ విష పూరితం. నిమ్మకాయ, బొప్పాయిని కలిపి తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది రక్తహీనతకు దారితీసే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

* బొప్పాయిని, కివి కలిపి తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. ఈ రెండు కలిపి తీసుకోవడం లేదా ఒకదాని వెంట ఒకటి తిన్నా కడుపులో ఇబ్బంది ఏర్పడుడుతుందని అంటున్నారు.

* బొప్పాయి, టమాటా కాంబినేషన్‌ కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. రెండింటినీ కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష ముప్పు

తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ఉత్తర అండమాన్‌ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అది సోమవారం వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశముందని, 24 నాటికి ఒడిశా-బంగాల్ తీరాలకు చేరుకునే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణకేంద్రం తెలిపింది. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. వేటకు వెళ్లి మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉందని వెల్లడించింది. దీనిప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలుపడేందుకు అవకాశం ఉందని వివరించింది. అలాగే, ఈ నెల 25 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెప్పింది.

ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

దసరా సందడి అయిపోయింది. మళ్లీ దీపావళి హంగామా మొదలు కానుంది. అయితే ఈ పండగకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. కాబట్టి అప్పటివరకు థియేటర్లలో పెద్ద ల రిలీజులేవీ లేవు.

మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ వారం దాదాపు 25 కు పైగా లు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. వీటిలో కార్తీ, అరవింద్ స్వామీల సత్యం సుందరం పైనే ఓటీటీ ఆడియెన్స్ దృష్టి ఉంది. అలాగే ధన్సిక ఐందమ్ వేదమ్, కాజల్, కృతి సనన్ ల దో పత్తి, బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఐదో సీజన్ వంటి క్రేజీ లు, టాక్ షోలు కూడా ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి అక్టోబర్ 4వ వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే లు వస్తున్నాయో ఒక లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

హసన్ మిన్హా (ఇంగ్లిష్ ) – అక్టోబర్ 22
ఫ్యామిలీ ప్యాక్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబర్ 23
ద కమ్ బ్యాక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 23
బ్యూటీ ఇన్ బ్లాక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 24
టెర్రిటరీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ) – అక్టోబర్ 24
ద 90’స్ షో పార్ట్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ) – అక్టోబర్ 24
దో పత్తి (హిందీ ) – అక్టోబర్ 25
డోంట్ మూవ్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబర్ 25
హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
ద లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబర్ 25 (రూమర్ డేట్)

అమెజాన్ ప్రైమ్ వీడియో

కడైసి ఉలగ పొర్ (తమిళ ) – అక్టోబర్ 25
లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
జ్విగటో (హిందీ ) – అక్టోబర్ 25
నౌటిలస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25

ఆహా

అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో) – అక్టోబర్ 25

జీ5

ఐందమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
ఆయ్ జిందగీ (హిందీ ) – అక్టోబర్ 25
జియో
ద బైక్ రైడర్స్ (ఇంగ్లిష్ ) – అక్టోబర్ 21
ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్ ) – అక్టోబర్ 23
ద మిరండా బ్రదర్స్ (హిందీ ) – అక్టోబర్ 25

ఆపిల్ ప్లస్ టీవీ

బిఫోర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25

బుక్ మై షో

ద ఎక్స్‌టార్షన్ (స్పానిష్ ) – అక్టోబర్ 25

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త లు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

చలికాలం వేడి నీటితో స్నానం చేస్తున్నారా.? ఈ సమస్యలు తప్పవు..

చలికాలం వచ్చేస్తోంది. ఇప్పుడిప్పుడే వాతావరణం కూల్‌గా మారుతోంది. మనలో చాలా మందికి వేడి నీటితో స్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే చలి కాలంలో మరింత ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తుంటారు.

అయితే ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. ఇంతకీ వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం చేస్తే చర్మంపై తేమ తగ్గుతుంది. చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. దీంతో చర్మంపై మచ్చలు, దురదలు, మంటలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే వేడి నీటితో స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి.

* వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి. దీంతో జుట్టు మూలాలు బలహీనంగా మారుతాయి. జుట్టురాలడానికి ఇది కారణమవుతుంది. వేడి నీటితో స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజింగ్ హెయిర్ కండీషనర్ అప్లై చేయాలి. దీనివల్ల జుట్లు రాలే సమస్య నుంచి బయటపడొచ్చు.

* బాగా వేడిగా ఉన్న నీరుతో స్నానం చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అందుకే వీలైనంత వరకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని సూచిస్తున్నారు.

* వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఊపిరితుత్తుల్లో వాపు వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఇది దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు.

* ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఆర్థరైటిస్ లేదా కండరాల సంబంధిత సమస్యలు ఉన్న వారిపై మరింత ఎక్కువ ప్రభావం చూపుతుంది.

ఇవి పాటించండి..

విపరీతమైన వేడీ నీటితో స్నానం చేయకూడదు. అందుకు బదులుగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి. తల స్నానం చేసేందుకు వేడి నీటిని అస్సలు ఉపయోగించకూడదు. ఒకవేళ చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ను ఉపయోగించుకోవాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

ప్రేమోన్మాది ఘాతుకానికి బాలిక మృతి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.

నమ్మించాడు.. మాట్లాడుదామని పిలిచాడు.. తీరా వస్తే అడవిలోకి తీసుకెళ్లాడు. అంతటితో ఆగలేదు చచ్చేదాకా కొట్టాడు.. ఆ తర్వాత ఆమె చావడానికి నిప్పంటించాడు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను పిలిచి దారుణంగా కొట్టి.. ఆమెకు నిప్పంటించి.. తిరిగిరాని లోకాలకు పంపించిన ఓ ఆగంతుకుడి క్రూరత్వం.. సంచలనంగా మారింది..

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పట్టణంలో జరిగిన ఓ దుర్ఘటన అందర్నీ కలచివేసింది.. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.. ప్రేమించిన అమ్మాయిని మాట్లాడదామని పిలిచి.. అడవిలోకి తీసుకువెళ్లి ఒంటికి నిప్పంటించాడు దుర్మార్గుడు.. పూర్తి వివరాలలోకి వెళితే.. శనివారం ఉదయం ఏడు గంటలకు బద్వేల్ లోని ఓ ప్రైవేటు కళాశాలకు బయలుదేరింది బాధిత మైనర్ బాలిక (16).. ఇంతలో ఆమెకి ఒక కాల్ వచ్చింది. మనిద్దరం కలుద్దాము.. నీతో మాట్లాడాలని ఫోన్ చేశాడు విగ్నేష్ అనే ఆగంతకుడు.. దీంతో తెలిసిన వ్యక్తే కదా.. గతంలో ప్రేమించిన అబ్బాయే.. అనుకుంటూ వెళ్ళింది ఆ బాలిక.. అదే తనకి శాపంగా మారింది.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.

విఘ్నేష్ మాట్లాడదామని పిలిచి.. బాలికను ఆటోలో ఎక్కించుకొని బద్వేలు శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు.. ఇద్దరూ సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమకు ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలోనికి వెళ్లారు. ఇంతవరకు బాగానే ఉంది.. మాట్లాడుకొని గొడవపడి బయటకు వచ్చేస్తే బాగుండేదేమో కానీ.. అతను మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే ఆమెను తీసుకెళ్లాడు..వెళుతూ వెళుతూ తనతో పాటు పెట్రోల్ కూడా తీసుకువెళ్లాడు. ఏది ఏమైనా ఆ మైనర్ బాలికను చంపాలనే ఉద్దేశంతోనే అక్కడకు తీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది..

వాస్తవానికి.. విగ్నేష్ అనే వ్యక్తికి గతంలోనే వివాహం అయింది. అది కూడా ప్రేమ వివాహమే.. అయితే, ఆమెతో సంసారం చేస్తూనే ఈ మైనర్ బాలికతో పరిచయాన్ని కొనసాగిస్తున్నాడు. పెళ్లైన విషయం తెలిసిన మైనర్ బాలిక విఘ్నేష్ ను వదిలేసింది. కానీ, మనసులో ఏదో పెట్టుకున్న విగ్నేష్ తనతో మాట్లాడాలి.. రమ్మని పిలిచి అడవి ప్రాంతంలోనికి తీసుకువెళ్లి నిలువునా తనపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆ బాలిక మృతికి కారణమయ్యాడు. కనీసం ఆమెను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. నిప్పంటించి అక్కడ నుంచి పరారయ్యాడు.. మంటలలో కాలుకుంటూ అటవీ ప్రాంతంలో నుంచి బోరున ఏడుస్తూ.. అరుస్తూ కాపాడండి అంటూ మైనర్ బాలిక రోడ్డుపైకి పరిగెత్తుకొచ్చింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు.. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను వెంటనే బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 80% ఒంటినిండా కాలిన గాయాలతో ఉన్న ఆ బాలిక ప్రాణాలతో పోరాడి.. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల 40 నిమిషాలకు తుది శ్వాస విడిచింది.

అయితే, నిందితుడి కోసం నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలించి అతడిని శనివారం సాయంత్రమే పట్టుకున్నట్టు తెలుస్తుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని జిల్లా ఎస్పీ సమక్షంలో సంఘటనా స్థలానికి తీసుకు వెళ్లినట్టు సమాచారం.. ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అలాగే హోం మంత్రి కూడా స్పందించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని ప్రకటించారు. నిందితుడిని వదిలే ప్రసక్తే లేదని ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనేదానిపై కూడా విచారణ చేపడతామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.

ఇదే అంశంపై మైనర్ బాలిక కు సంబంధించిన కుల సంఘం నేతలు నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

గూగుల్‌ పిక్సెల్‌8పై భారీ డిస్కౌంట్‌.. సగానికి సగం తక్కువ

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ దీవాళి సేల్‌ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్‌ కంపెనీకి చెందిన పిక్సెల్‌8పై భారీ ఆఫర్‌ లభిస్తోంది. 256 జీబీ వేరియంట్‌ ఫోన్‌పై ఈ డీల్‌ అందిస్తోంది.

గూగులల్‌ పిక్సెల్‌ 8 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 82,999కాగా సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 42,999కి సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు.

దీంతో గూగుల్‌ పిక్సెల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 36,499కి సొంతం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తున్నారు. మీ పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా రూ. 42,500వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.2 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90హెచ్‌జెడ్‌ రిఫ్రెట్ రేట్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. Titan M2 సెక్యూరిటీ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం T3 చిప్‌సెట్ అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 10.5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఆడియో మ్యాజిక్ ఎరేజర్ వంటి ప్రత్యేక ఈ ఫీచర్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 27 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4575 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

వేసవి స్పెషల్ ఫ్రూట్.. ఈత పండ్లను ఎప్పుడైనా తిన్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం

వేసవిలో ఈతపండ్లు విరివిగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా పల్లెటూళ్లలో దొరుకుతాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు.

పచ్చివి అయితే కాస్త వగరుగా, బాగా పండినవి అయితే తియ్యగా ఉంటాయి. ఈతకాయలు మొదట ఆకూ పచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి.

వేసవిలో లభించే ఈత పండ్లను అందరూ తినాలి. మరీ ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఈతపండ్లు తినేవారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారికి ఈ సీజన్‌లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనపడుతుంది.

ఈత చెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి. ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు. ఈత పండులో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ఈత పండ్లను ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరు తినొచ్చు. ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.

ఈత పండ్లు పిల్లలకి తినిపించడం వల్ల కాల్షియం ఎక్కువగా అందుతుంది. దాని వల్ల ఎముకలు బలపడుతయాయి. ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. ప్రతి 100 గ్రాములకు పిండిపదార్థాలు 65 గ్రాములుంటాయి. చక్కెరలు 53 గ్రాములుంటే పీచుపదార్థాలు 6 గ్రాములుంటాయి. ఈత పండ్లలో కొవ్వు పదార్థాలు 0.4 గ్రాములుంటే మాంసకృత్తులు 2.5 గ్రాములుంటాయి. నీరు 21 గ్రాములంటే విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములుంటుంది.

ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్,సుక్రోజ్, ఫ్రక్రోజ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సీజన్‌లో ప్రతి రోజూ ఉదయం పూట ఈతపండ్లు తినడం వల్ల జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల రక్త వృద్ధి జరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటానికి ఉపయోగ పడుతుంది. ఈత కాయలు తింటే అల్జీమర్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఈత పండ్లలో క్యాల్షియం పుష్కలంగా నిండి ఉంటుంది. కనుక వీటిని తినేవారికి ఎముక పుష్టి కలుగుతుంది. ఈత పండ్లు, ఈత కల్లులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్త వృద్ధి జరుగుతుంది. అలాగే నిస్సత్తువ, అలసట వంటివి తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి ఈత పండ్లకు ఉంటుంది. ఈత పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు. వేసవిలో శరీర వేడిని తగ్గించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి ఈత కాయలు, ఈత కల్లు.

దీపావళి పూజ కోసం లక్ష్మి, గణపతి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారా.. ఈ నియమాలు గుర్తుంచుకోండి

లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా పూజించాలి. ఎందుకంటే గణపతిని శుభ చిహ్నంగా భావిస్తారు. ఐశ్వర్య ఇంట్లో ఉన్నప్పుడే లక్ష్మిదేవి నివాసం ఉంటుంది.

అందుకే దీపావళి రోజున గణేశుడితో పాటు లక్ష్మీదేవిని విగ్రహన్ని లేదా పటాన్ని తీసుకుని వస్తారు. ఈ విగ్రహాలు మనిషి జీవితాలపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ విగ్రహాలను చాలా జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. విగ్రహం కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

గణపతి విగ్రహం ఎలా ఉండాలంటే.. గణేశ విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు విగ్రహంలో గణేశ వాహన ఎలుక ఉండటం చాలా ముఖ్యం. అలాగే గణేశుడి చేతిలో లడ్డూలు లేదా మోదకాలు ఉండాలని గుర్తుంచుకోండి. అటువంటి విగ్రహం శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కనుక దీపావళికి ఇటువంటి లక్షణాలున్న గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేయండి..

మార్కెట్ లో చాలా రకాల లక్ష్మీ గణపతి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గణపతి, లక్ష్మీ దేవి విగ్రహాలు కలిసి లేదా విడిగా ఉన్న విగ్రహాలను కూడా విడివిడిగా కాకుండా కలిపి పూజించాలి.

గణేశుడి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు, వినాయకుడి మొండెం ఎడమవైపుకు తిరిగి ఉండాలని గుర్తుంచుకోండి.

లక్ష్మీ విగ్రహం ఎలా ఉండాలంటే ఇంట్లో ఎప్పుడూ కూర్చునే లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకురావాలి. నిలబడి ఉన్న లక్ష్మీ విగ్రహం కదులుతున్నట్లు భావిస్తారు. స్థిరమైన లక్ష్మి కోసం కూర్చున్న లక్ష్మిదేవిని మాత్రమే ఇంటికి తీసుకు రండి. తద్వారా ఆమె ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంటుంది.

గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మి దేవి అశుభం. కనుక కమలం లేదా ఏనుగుపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రాన్ని తీసుకురండి.

లక్ష్మిదేవిని సంపదకు దేవతగా పరిగణిస్తారు. కనుక లక్ష్మీదేవి చిత్ర పటంలో సంపద కురిపిస్తున్నట్లు ఉన్న చిత్ర పటాన్ని లేదా అలాంటి విగ్రహాన్ని తీసుకురావడం వల్ల కుటుంబంలో ధన కొరత తీరుతుందని నమ్మకం.

అలాగే మట్టి విగ్రహాన్ని తీసుకువస్తున్నట్లయితే.. కొత్త విగ్రహాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత.. పాత విగ్రహాన్ని నీటిలో లేదా మట్టిలో కలపాలని గుర్తుంచుకోండి . లేదా ఇత్తడి, బంగారం, వెండి మొదలైన లోహపు విగ్రహాలను తీసుకువస్తున్నట్లయితే… వాటిని తొలగించాల్సిన అవసరం లేదు. వాటిని ఎల్లప్పుడూ పూజించవచ్చు.

కుప్పంలో టీడీపీ Vs వైసీపీ.. సోషల్ మీడియా వార్

చిత్తూరు జిల్లా కుప్పంలో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో టీడీపీ వైసీపీ పోస్టులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఫౌండేషన్ డే ఇన్విటేషన్లో స్థానిక ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు పేరు లేదని కొందరు, కుప్పం వైసీపీ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ కనిపించడం లేదంటూ మరికొందరు ఇలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం వివాదంగా మారింది. కుప్పంలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రచ్చ కొనసాగుతోంది.

పోస్టర్లు వేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి టీడీపీ వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. ఇరు ప్రార్టీల శ్రేణులు పోటాపోటీగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో కుప్పంలో రాజకీయం వేడెక్కింది. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ 27 వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ ఇన్విటేషన్లో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో పాటు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం జిల్లా కలెక్టర్ స్థానిక అధికారుల పేర్లు మాత్రమే ఉండడం చర్చకు దారి తీసింది. దీంతో ఇన్విటేషన్లో స్థానిక ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు పేరు ఎక్కడ? అని టీడీపీ నాయకులు
సోషల్ మీడియాను వేదికగా ప్రశ్నిస్తున్నారు. ద్రవిడ యూనివర్సిటీ ఫౌండేషన్ డే ప్రోగ్రాంలో అధికారులు ప్రోటోకాల్ పాటించుకోకపోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ లోపు జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుకాగానే మరోవైపు వైసీపీ కుప్పం ఇంఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ ఎక్కడుంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేశాయి. ఎమ్మెల్సీ భరత్ కనబడుట లేదంటూ పోస్టులు పెట్టడంతో అధికార ప్రతిపక్షాల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ సాగింది. వైసీపీ అధికారంలో ఉండగా అధికారాన్ని అనుభవించిన భరత్ కనిపించడం లేదంటూ కామెంట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా.. అప్పటికల్లా సాకారం

ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రకారం 2030 నాటికి భారత దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ప్రస్తుతం 3.6 ట్రిలియన్‌ డాలర్లతో 5వ స్థానంలో భారత్‌ కొనసాగుతోంది.

కాగా 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్‌ డాలర్లకు పెరగనుందని అంచనావేస్తున్నారు. అయితే వేగవంతమైన జనభా పెరుగుదలతో దేశం ప్రాథమిక సేవా అవసరాలను తీర్చడంతో పాటు ఉత్పాదనకతను కొనసాగించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్‌అండ్‌ పీ విడుదల చేసిన ‘లుక్‌ ఫార్వర్డ్ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌’ నివేదిక ప్రకారం.. రాబోయే మూడేళ్లలో అత్యంత వేగంగా భారత ఆర్థిక వ్వవస్థ కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే దశాబద్ధంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతోన్న మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

ఎస్‌అండ్‌పీ అభిప్రాయం ప్రకారం అభివృద్ధి చెందుతోన్న మార్కెట్లు 2035 నాటికి సగటున4.06 శాతం జీడీపీ వృద్ధిని సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు మాత్రం కేవలం 1.59 శాతం మాత్రమే కావడం గమనార్హం.

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధిలో సుమారు 65 శాతం వాటాను కలిగి ఉంటడనున్నాయి. రానున్న రోజుల్లో భారత్‌ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే ఇదే తరుణలో వేగంగా పెరుగుతోన్న జనాభా దీనికి ప్రతిబందకంగా మారే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పునరుత్పాదక ఇంధన అభిృద్ధిలో పురోగతి ఉన్నా.. భారతదేశ ఆర్థిక వృద్ధి ఆటోమొబైల్స్‌ వంటి కార్బన్‌ ఇంటెన్సివ్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగడానికి కారణమవుతుందని మూడీస్‌ రేటింగ్స్‌ పేర్కొంది. 2024లో భారత్‌ జీడీ 7.2 శాతం, 2025 నాటికి 6.6 శాతానికి పెరుగుతుందని అంచా వేస్తోంది.

శభాష్ ఇండియా.. చిప్స్ తయారీ రంగంలో ఆ దేశాలకు గట్టిపోటీ

ఇండియా సెమీ కండక్డర్ మిషన్ (ఐఎస్ఎం) కింద కేంద్రం రూ.76 వేల కోట్ల పెట్టుబడితో మొదటి దశ ను ప్రారంభించింది. దీనిలో పూర్తిస్థాయిలో విజయం సాధించింది.

ఇప్పుడు రెండో దశను ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. సెమీ కండక్టర్లను సాధారణ భాషలో చిప్స్ అని వ్యవమరిస్తారు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్స్.. ఇలా ప్రతి దానిలోనూ వీటిని ఉపయోగిస్తారు. కోవిడ్ మహమ్మరి సమయంలో ఏర్పడిన సంక్షోభంతో చిప్స్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే తైవాన్, జపాన్, సింగపూర్, చైనా తదితర దేశాల్లోనే వీటి తయారీ కేంద్రాలు ఉన్నాయి. దీంతో దేశంలోనే సెమీ కండక్టర్ల తయారు చేయడానికి 2022 డిసెంబర్ 15వ తేదీన ఐఎస్ఎంను ప్రారంభించారు. దేశంలో సెమీ కండక్టర్ల తయారీ, ప్యాకేజీ, డిజైన్ తదితర సామర్థ్యాలను పెంచడం ఐఎస్ఎం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడానికి పాలనా, ఆర్థిక ప్రతిపత్తి ఈ సంస్థకు ఉంది. ఈ విభాగంలో సలహా ఇవ్వడానికి ప్రపంచ నిపుణుల బోర్డు కూడా ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో దేశంలో ఐదు సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిలో నాలుగు చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్లు, ఒక చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉన్నాాయి. దాదాపు 36 నెలల కంటే తక్కువ సమయంలో వీటికి ఆమోదం లభించడం అభినందనీయం. ప్రస్తుతం ఇవన్నీ వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయి. వీటిలో 2025 నుంచి 2027 మధ్యలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఐఎస్ఎం మొదటి దశ విజయవంతగా ముగిసింది. ఇక రెండో దశలో మరికొన్నిలక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగనుంది. వాటిలో గ్లోబల్ సెమీ కండక్టర్ లీడర్లతో భాగస్వామ్యం పర్యావరణ రక్షణ, ముడిపదార్థాల అన్వేషణ తదితర అంశాలు ఉన్నాయి. సెమీ కండక్టర్ల తయారీ, అసెంబ్లీ యూనిట్ల ప్రతిపాదనలతో ఈ రంగంలోకి టాటా గ్రూప్, మురుగప్ప గ్రూప్, కేన్స్ సెమికాన్ వంటి సంస్థలు అడుగుపెట్టాయి.

ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మోహింద్రూ మాట్లాడుతూ తాము సెమీ కండక్టర్ల తయారీకి పునాదులు వేశామని, ఇది సుదీర్ఘ ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్, సిజి పవర్, కేన్స్ టెక్నాలజీ తదితర సంస్థలు ఈ రంగంలోకి రావడం శుభపరిణామమన్నారు. ఇండియా ఇన్వెస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈవో నివృత్తి రాయ్ మాట్లాడుతూ అంతర్జాతీయ, దేశీయ భాగస్వామ్యాలతో రూపొందించిన జాయింట్ వెంచర్ల వల్ల మూలధన వ్యయ అడ్డంకులను అధిగమించడం, సాంకేతికతను బదిలీ చేసుకోవడం సులభమవుతుందన్నారు. ఎన్విడియా, ఇంటెల్ వంటి ప్రపంచ దిగ్గజాలతో పోటీ పడాలంటే సాంకేతిక ఆవిష్కరణలతో పాటు బలమైన మౌలిక వసతులు, అమ్మకాలు, బ్రాండింగ్ చాలా అవసరమని చెప్పారు.

మేడ్ ఇన్ ఇండియా వాహనాలకు విదేశాల్లో యమా డిమాండ్.. రికార్డ్ స్థాయిలో ఎగుమతులు

మేకిన్‌ ఇండియా. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమమిది. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఎక్స్‌క్లూసివ్‌ ప్రోగ్రామ్‌తో భారత్‌ వండర్స్‌ సృష్టిస్తోంది.

క్రమంగా దేశంలో తయారీ రంగం పైచేయి సాధిస్తూ.. ఉత్పత్తి భారీగా పెరుగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మేడిన్‌ ఇండియా వస్తువులకు డిమాండ్‌ పెరుగుతోంది.

భారత్‌ మారుతోంది. ఒకప్పుడు ఎన్నో దిగుమతులు.. ఇప్పుడు అన్నీ ఉత్పత్తులే. మేకిన్‌ ఇండియా నినాదం క్రమంగా ప్రతిఫలాలను ఇస్తోంది. ప్రధాని మోదీ కలలు సాకారమవుతుండడంతో పాటు.. దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. 2014లో ప్రతిష్టాత్మకంగా మేకిన్‌ ఇండియాను లాంచ్‌ చేశారు మోదీ. భారత్‌ను ప్రపంచంలో టాప్‌ ఉత్పత్తి దేశంగా మార్చేందుకు కలలు కన్నారు. దీనికోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు దాని ప్రతిఫలాలను దేశం చూస్తోంది. 2014లో దేశంలో 80శాతం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో ఉంటే.. ఇప్పుడు 99.9శాతం మొబైల్స్‌ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాదు.. యూకే, నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, ఇటలీ, సౌతాఫ్రికా వంటి దేశాలకు ఎగుమతులు కూడా సాగుతున్నాయి. డిఫెన్స్‌ ప్రొడక్షన్‌తోపాటు.. అంతరిక్షం, ఎలక్ట్రిక్‌ వాహనాలు, సెమీకండక్టర్ల తయారీ, నిర్మాణ రంగం, రైల్వే ఇన్‌ఫ్రాలోనూ అద్భుత ఫలితాలను సాధిస్తోంది.

ఈ క్రమంలోనే వాహన ఎగుమతుల్లోనే భారత్ చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు అధిక సంఖ్యలో మేడ్ ఇన్ ఇండియా వాహనాలను ఎగుమతి చేస్తోంది. సియామ్ ఇటీవల సెప్టెంబర్ 2024లో వాహనాల ఎగుమతి నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, గత సెప్టెంబర్ నెల వరకు ఎన్ని వాహనాలు ఎగుమతి చేశారు. ఏ విభాగంలో ఎన్ని యూనిట్లను విదేశాలకు పంపించారన్నదీ ప్రకటించారు.

ఎన్ని వాహనాలు ఎగుమతి..?

ఎగుమతిరంగంలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది నిజంగానే శుభవార్త. మేడ్-ఇన్-ఇండియా వాహనాల డిమాండ్ ఏప్రిల్-సెప్టెంబర్ 2024 మధ్య కాలంలో సంవత్సరానికి 14% పెరిగింది. సెప్టెంబరు 2024లో వాహన విక్రయాల నివేదికను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) విడుదల చేసింది. ఇందులో మేడ్ ఇన్ ఇండియా వాహనాల ఎగుమతి సమాచారం వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, గత నెలలో 4,66,409 యూనిట్ల వాహనాలు అనేక దేశాలకు ఎగుమతి అయినట్లు వెల్లడించింది.

డేటా ప్రకారం, మేడ్-ఇన్-ఇండియా వాహనాల డిమాండ్ ఏప్రిల్-సెప్టెంబర్ 2024 కాలంలో 14% పెరిగి 25,28,248 యూనిట్లకు చేరుకుంది. గత నెలలోనే మొత్తం 4,66,409 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. సెప్టెంబర్ 2023లో ప్రపంచవ్యాప్తంగా 3,91,717 యూనిట్లు ఎగుమతి అయితే, అటువంటి పరిస్థితిలో, సంవత్సర ప్రాతిపదికన, వాహన తయారీదారులు గత నెలలో 19.1 శాతం ఎక్కువ వాహనాలను ఎగుమతి చేశారు.

ప్యాసింజర్ వాహనాలు

ప్యాసింజర్ వాహన విభాగంలో మొత్తం 3,76,912 యూనిట్ల ఎగుమతి అయ్యాయి. YO వాహనాలు – 6,791 యూనిట్లు పెరిగాయి. ఇటు దేశీయ మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్‌లు మరియు సెడాన్‌ల డిమాండ్ మందగమనాన్ని బఫర్ చేయడంలో సహాయపడ్డాయి. 1,67,757 యూనిట్లు బలమైన 43% YoY వృద్ధితో, UVలు మొత్తం PV ఎగుమతుల్లో 44% వాటాను కలిగి ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగం దశలో ప్రయాణీకుల వాహనాల ఎగుమతి అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియా, FY2025లో నాల్గవ ఆర్థిక సంవత్సరంలో తన నంబర్ 1 ఎగుమతిదారు టైటిల్‌ను నిలుపుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్-సెప్టెంబర్ 2024లో 1,47,063 యూనిట్ల షిప్‌మెంట్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇది హ్యుందాయ్ మోటార్ ఇండియా కంటే 62,162 ప్యాసింజర్ వాహనాల కంటే ముందుంది. రెండో స్థానంలో హ్యందాయ్ కొనసాగుతోంది. వోక్స్‌వ్యాగన్ ఇండియా మొదటిసారిగా 35,079 యూనిట్లు, స్టెల్లార్ 74% వృద్ధితో నంబర్ 3 స్థానానికి చేరుకుంది.

ద్విచక్ర వాహనాలు

నివేదిక ప్రకారం, గత నెలలో అత్యధిక ఎగుమతులు ద్విచక్ర వాహనాల విభాగంలో ఉన్నాయి. సెప్టెంబర్ 2024లో ఈ విభాగంలో 3,72481 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి. గత ఏడాది ఇదే కాలంలో 3,02,220 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, మోపెడ్‌లను కలిగి ఉన్న భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమ, ప్రస్తుతం దేశీయ, ఎగుమతి మార్కెట్లు రెండింటిలోనూ మంచి రన్‌ను సాధిస్తోంది. దేశీయ మార్కెట్లో ఏప్రిల్ – సెప్టెంబర్ 2024 మధ్య 1,01,64,980 యూనిట్లు అంటే 10 మిలియన్ యూనిట్ల అమ్మకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా బలమైన 16.31% వృద్ధిని నమోదు చేసింది . టూవీలర్ వాహనాల ఎగుమతి విషయంలో కూడా బాగానే ఉంది. 2025 ప్రథమార్ధంలో, తొమ్మిది OEMల నుండి మొత్తం విదేశీ షిప్‌మెంట్‌లు 19,59,145 యూనిట్లు, అంతేఅదనంగా 273,328 ద్విచక్ర వాహనాలు ఎగుమతి చేయడం జరిగింది. ఫలితంగా 907,85 యూనిట్ల ఎగుమతితో 16% పెరుగుదల నమోదైంది.

టూవీలర్..

మోటార్‌సైకిల్ ఎగుమతులు 16,41,804 యూనిట్లు అంటే 15.60% పెరిగాయి) జూలై 2024 చివరి వరకు మొత్తం ఎగుమతుల్లో 84% వాటా కలిగి ఉండగా, 314,533 యూనిట్లలో స్కూటర్ షిప్‌మెంట్‌లు సంవత్సరానికి 19% పెరిగాయి. ముఖ్యంగా బజాజ్ ఆటో 764,827 యూనిట్లతో అగ్ర ఎగుమతిదారుగా కొనసాగుతోంది. TVS మోటార్ కో దాని రెండవ ర్యాంక్ అంటే 26% వాటాను కొనసాగిస్తోంది. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియాఎగుమతి మార్కెట్ వాటాలో అత్యధిక పెరుగుదలను నమోదు చేసుకుంది. ఇది సంవత్సరం క్రితం 10% నుండి 14%కి పెరిగింది. తొమ్మిది ఎగుమతిలో సుజుకి మాత్రం క్షీణతను చూసింది.

త్రీ వీలర్

సియామ్ నివేదిక ప్రకారం, త్రీ-వీలర్ ఎగుమతుల్లో 18% క్షీణతతో సంవత్సరానికి 18% క్షీణతను నమోదు చేసింది. 97,729 యూనిట్లకు మొదటి ఆరు నెలల్లో 1,53,199 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇది డిమాండ్‌లో పునరుద్ధరణను సూచిస్తోంది. పోటీలో ఉన్న ఆరు కంపెనీల్లో రెండు – TVS,ఫోర్స్ మోటార్స్ క్షీణతను నమోదు చేశాయి. దీని ఫలితంగా వారి ఎగుమతి మార్కెట్ వాటా తగ్గింది.

దేశీయ మార్కెట్ లీడర్ బజాజ్ ఆటో కూడా త్రీ-వీలర్ ఎగుమతులలో నంబర్ 1 గా ఉంది. 87,907 యూనిట్లు, అంటే 13%, ఇది ఒక సంవత్సరం క్రితం 50%తో పోలిస్తే 57% మార్కెట్ వాటాను అందించింది. TVS మోటార్ కో 18% పతనాన్ని చూసింది. అంటే దాని ఎగుమతుల వాటా ఏడాది క్రితం 44% నుండి 37%కి పడిపోయింది.

అయితే పియాజియో వెహికల్స్, 6670 యూనిట్లతో 16% పెరుగుదలను నమోదు చేసింది.2024లో దాని మార్కెట్ వాటా 3.69% నుండి 4.35%కి పెరిగింది. అతుల్ ఆటో కూడా 1,122 యూనిట్లతో మంచి పనితీరును కనబరిచింది. మహీంద్రా & మహీంద్రా 24% వృద్ధిని సాధించింది. ఇది 625 యూనిట్లు ఎగుమతి చేయగలిగింది. ఏడాది క్రితం కంటే 546 అదనపు త్రీ-వీలర్లను రవాణా చేసింది.

సియామ్ నివేదిక ప్రకారం, జూలై నుండి సెప్టెంబర్ వరకు రెండవ త్రైమాసికంలో ఎగుమతులు 13.3 శాతం పెరిగాయి. ఈ కాలంలో, భారతదేశం నుండి మొత్తం 1335681 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి. 2023 రెండవ త్రైమాసికంలో ఈ సంఖ్య 1179008 యూనిట్లుగా ఉంది.

9,745 యూనిట్లు మరియు 27% మార్కెట్ వాటాతో ఇసుజు మోటార్స్ నంబర్ 1 CV ఎగుమతిదారుగా నిలిచింది. 2024లో 16% తగ్గుదల అంటే 65,816 యూనిట్లు ఎగుమతి చేసింది. వాణిజ్య వాహన విభాగం 35,731 యూనిట్ల విదేశాలకు ఎగుమతి చేసింది. ఇది గత సంవత్సరానికి కంటే 12%కి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ దశలో, CV పరిశ్రమ ఇప్పటికే దాని ఎగుమతుల్లో 54% సాధించింది.

ఆసక్తికరంగా,డేటా ప్రకారం, ఇసుజు మోటార్స్ ఇండియా 9,745 యూనిట్లతో బలమైన 25% వృద్ధితో ప్రస్తుతం నంబర్ 1 CV ఎగుమతిదారుగా ఉంది. ఇసుజు మార్కెట్ వాటా ఒక సంవత్సరం క్రితం 24% నుండి 27%కి పెరిగింది. 2024లో ఎగుమతులు 16,329 యూనిట్లను మెరుగుపరచడానికి 6,584 యూనిట్ల దూరంలో ఉంది. మహీంద్రా & మహీంద్రా, 8,496 యూనిట్లతో దాని CV ఎగుమతుల్లో 12% వృద్ధిని నమోదు చేయగా, 7,833 యూనిట్లతో టాటా మోటార్స్ 7% తగ్గింది.దాని మార్కెట్ వాటా 26% నుండి 22%కి పడిపోయింది. అశోక్ లేలాండ్ గత ఆరు నెలల్లో 10% వృద్ధితో 5,644 యూనిట్లను విదేశాలకు రవాణా చేసింది. VE కమర్షియల్ వెహికల్స్ 2,322 యూనిట్లతో 32% వృద్ధిని నమోదు చేసింది.

విషయం ఏమిటంటే, ఇండియా ఆటో ఎగుమతి సంఖ్యలలో పునరుద్ధరణ అన్ని వాహన విభాగాలకు ప్రయోజనం చేకూరుస్తోంది, ఇది రాబోయే ఆరు నెలలు, అంతకు మించిన కాలానికి మంచి సూచన. దేశీయ, విదేశ ఎగుమతి మార్కెట్ విక్రయాల న్యాయబద్ధమైన నిర్వహణ జాబితా నిర్వహణతో పాటు సామర్థ్య వినియోగానికి సహాయపడుతుంది. కీలకమైన గ్లోబల్ మార్కెట్లలో డిమాండ్ పెరగడంతో, పరిస్థితులు మెరుగుపడగలవని అంచనా. ఎగుమతి రంగంలో మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులపై లాభాల మార్జిన్లు తరచుగా మెరుగ్గా ఉంటాయన్నదీ కొసమెరుపు.

బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులు మాత్రమే పని.. 2 రోజుల సెలవు నిబంధన ఎప్పటి నుంచి..?

వారంలో 5 రోజులు మాత్రమే పని చేసే అవకాశం కల్పించాలని, శని, ఆదివారాలు సెలవు ఉండాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని అనేక ప్రైవేట్ కంపెనీలు వారానికి 2 రోజుల సెలవును అందిస్తాయి.

అక్కడ వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాంకుల్లోనూ ఇదే కనిపిస్తోంది. ఈ మార్పు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఏకకాలంలో కనిపిస్తుంది. ఈ డిమాండ్‌కు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ కాన్ఫెడరేషన్ (IBA), బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినందున ఇందులో పురోగతి కనిపిస్తోంది.

ఇప్పుడు ఈ నిర్ణయంపై ప్రభుత్వ తుది ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో బ్యాంకు ఉద్యోగులకు ప్రతి శనివారం, ఆదివారం సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ బ్యాంక్స్ కాన్ఫెడరేషన్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ నిబంధనలోకి వస్తాయి. అయితే, దీన్ని అమలు చేయడానికి ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి అనుమతి కూడా తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంకుల పనితీరుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఒక కన్ను వేసి ఉంచుతుంది.

ఇది బ్యాంకు ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటివరకు వారికి ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారం మాత్రమే సెలవు ఉంటుంది. మిగిలిన శనివారాల్లో బ్యాంకులు సాధారణంగా తెరిచి ఉంటాయి. 2015 నుంచి ప్రతి శనివారం సెలవు ఇవ్వాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ డిమాండ్ దాదాపుగా నెరవేరే దశకు చేరుకుంది.

మార్పులు ఎలా ఉంటాయి?

ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించినట్లయితే, బ్యాంకుల పని వేళలు కూడా మారుతాయి. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. అయితే కొత్త నిబంధన ప్రకారం.. బ్యాంకులు ఉదయం 9:45 గంటలకు తెరిచి సాయంత్రం 5:30 గంటలకు ఉంటాయి. దీని అర్థం బ్యాంకు ఉద్యోగులు రోజుకు 45 నిమిషాలు అదనంగా పని చేయాల్సి ఉంటుంది. ఈ మార్పు ఉద్యోగులకు ఉపశమనం కలిగించడమే కాకుండా, బ్యాంకింగ్ రంగంలో పని చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఉద్యోగులు మరింత శక్తి, నైతికతతో పని చేయగలుగుతారు. ఇది వినియోగదారులకు మెరుగైన సేవలను అందించగలదు.

చాలా కాలంగా కొనసాగుతున్న డిమాండ్‌..

2015లో ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఐబీఏల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. నెలలో రెండో, నాలుగో శనివారాల్లో సెలవు ఇవ్వాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి శని, ఆదివారాలు సెలవులు ప్రకటించాలని బ్యాంకు సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇప్పుడు దీనిపై దాదాపు ఏకాభిప్రాయం కుదిరిందని, ప్రభుత్వ తుది ఆమోదం తర్వాత ఈ విధానం అమలులోకి రానుంది. ఈ ఏడాది చివరిలోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ ప్రభుత్వం దీనిపై కచ్చితమైన నిర్ణయం తీసుకుంటుందని బ్యాంకు ఉద్యోగులు ఆశిస్తున్నారు.

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలకు భారీ భద్రత.. ప్రత్యేక బస్సులు!

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలకు భారీ భద్రత ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అభ్యర్థుల ఆందోళనతో అలర్ట్‌ అయిన అధికారులు.. రేపటి నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి అనుమతి ఉండదు. దివ్యాంగులకు ప్రత్యేకంగా గంట పాటు అదనపు సమయం కేటాయించనున్నారు అధికారులు. పరీక్ష హాల్‌, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే బయోమెట్రిక్‌ కోసం ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 31,383 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలుస్తోంది. మేడ్చల్‌ గ్రూప్-1 పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక్షన్ విధించనున్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

దీనికోసం 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఏర్పాట్లు, పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమైనట్లు తెలిపారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు మళ్ళీ జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే టీజీపీఎస్‌సీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సదుపాయం కూడా ఉంటుందని, అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

రైలులో ఇవి తీసుకెళ్తున్నారా? అయితే మీరు ఇబ్బందుల్లో పడినట్లే..

పండగల సమయంలో రైళ్లు రద్దీగా ఉంటాయి. రైలు ప్రయాణం చేసేటప్పుడు నియమ నిబంధనలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా? సాధారణం రైలు ప్రయాణం చేసేవారు వివిధ రకాల వస్తువులను వెంట తీసుకెళ్తారు.

కానీ కొన్ని వస్తువులను రైళ్లలో తీసుకెళ్లేందుకు నిషేధం ఉంది. అలాంటి వస్తువులతో మీరు పట్టుబడితో జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాలి..? ఎలాంటివి తీసుకెళ్లకూడదో ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైలులో టపాకాయలు, మెరుపులు వంటి మండే వస్తువులను తీసుకెళ్లడంపై కఠిన నిషేధం ఉంది. ఈ నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణికులు ఎలాంటి పటాకులను తీసుకెళ్లకూడదు. నిషేధిత వస్తువులతో ప్రయాణిస్తున్నట్లు తేలితే, అతను రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్య తీసుకోవలసి ఉంటుంది. దీని కింద రూ.1,000 జరిమానా లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.

మీరు నివసిస్తున్న చోట పటాకులు, ఇతర పేలుడు పదార్థాలు చౌకగా లభిస్తే, దీపావళికి వాటిని ఇంటికి తీసుకెళ్లాలని మీరు అనుకుంటే జాగ్రత్తగా ఉండటం మంచిది. రైలులో నిషేధిత వస్తువులతో పట్టుబడితే పెద్ద చిక్కుల్లో పడవచ్చు. ప్రతిసారీ భారతీయ రైల్వే కూడా పటాకులతో ప్రయాణించవద్దని పదే పదే ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తోంది.

3 సంవత్సరాల శిక్ష విధించవచ్చు:

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణ సమయంలో ఒక ప్రయాణీకుడు ఏదైనా నిషేధిత వస్తువులను తీసుకువెళితే, అతనిపై రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్య తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద ప్రయాణీకుడికి రూ.1000 జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. పటాకులు నిషేధిత వస్తువుల కేటగిరీ కిందకు వస్తాయి కాబట్టి, రైలులో వీటిని పట్టుకుంటే మీరు శిక్షకు గురవుతారు. రైలు ప్రయాణీకుల భద్రతకు హాని కలిగించే అనేక వస్తువులను రైలులో తీసుకెళ్లడాన్ని రైల్వే నిషేధించింది. ఇవి రైలులో అగ్ని ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉంది.

ఈ వస్తువులు నిషేధం

స్టవ్‌లు, గ్యాస్ సిలిండర్‌లు, ఏ రకమైన మండే రసాయనాలు, బాణసంచా, యాసిడ్, దుర్వాసన వచ్చే వస్తువులు, తోలు, ప్యాకేజ్‌లలో తెచ్చిన నూనె లేదా గ్రీజు వంటి ప్రయాణికులకు నష్టం కలిగించే వస్తువులు రైలు ప్రయాణ సమయంలో నిషేధించింది రైల్వే. నిబంధనల ప్రకారం.. రైలులో ప్రయాణికులు 20 కిలోల వరకు నెయ్యి తీసుకెళ్లవచ్చు. అయితే నెయ్యిని సరిగ్గా టిన్ బాక్స్‌లో ప్యాక్ చేయాల్సి ఉంది.

కూతురు కోసం మరింత రిస్క్ చేస్తున్న షారుక్ ఖాన్

షారుక్ ఖాన్ నెక్ట్స్ ఏంటి..? జవాన్, పఠాన్ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత డంకీతో అనుకోని షాక్ తగిలింగ్ కింగ్ ఖాన్‌కు. దాంతో మరోసారి బ్రేక్ తప్పదంటున్నారీయన.
చేసే ఏదో కాస్త గ్యాప్ తీసుకునే చేద్దాం.. లేట్ అయిన పర్లేదు కానీ లేటెస్ట్‌గా వద్దాం అనుకుంటున్నారు. మరి బాద్షా నుంచి రాబోయే తర్వాతి ఏంటి..? అదెలా ఉండబోతుంది.? ఐదేళ్ళ కసి అంతా గతేడాది తీర్చుకున్నారు షారుక్ ఖాన్.

షారుక్ ఖాన్ నెక్ట్స్ ఏంటి..? జవాన్, పఠాన్ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత డంకీతో అనుకోని షాక్ తగిలింగ్ కింగ్ ఖాన్‌కు. దాంతో మరోసారి బ్రేక్ తప్పదంటున్నారీయన. చేసే ఏదో కాస్త గ్యాప్ తీసుకునే చేద్దాం..

లేట్ అయిన పర్లేదు కానీ లేటెస్ట్‌గా వద్దాం అనుకుంటున్నారు. మరి బాద్షా నుంచి రాబోయే తర్వాతి ఏంటి..? అదెలా ఉండబోతుంది.? ఐదేళ్ళ కసి అంతా గతేడాది తీర్చుకున్నారు షారుక్ ఖాన్.

మొదట పఠాన్.. ఆ తర్వాత జవాన్ లతో 1000 కోట్ల క్లబ్బులో చేరిపోయారు. ఈ రెండు లతో బౌన్స్ బ్యాక్ అయిపోయారు బాద్షా. డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని ట్రై చేసినా ప్లాన్ వర్కవుట్ కాలేదు.

బడ్జెట్ పరంగా ఈ చిత్రం సేఫ్ అనిపించుకున్నా.. కమర్షియల్‌గా మాత్రం ప్రభావం చూపించలేదు. డంకీ తర్వాత మరోసారి గ్యాప్ తీసుకున్నారు షారుక్ ఖాన్. ఈ మధ్యే తర్వాతి పై క్లారిటీ ఇచ్చారు

తన కూతురు సుహానా ఖాన్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న కింగ్ లో తాను కూడా నటించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు కింగ్ ఖాన్. సుజాయ్ ఘోష్ ఈ ను తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటిస్తున్నారు.

కూతురు కోసం కింగ్ లో షారుక్ అతిథి పాత్ర చేస్తున్నారేమో అనుకున్నారంతా. కానీ అలాంటిదేం కాదు.. తను ఫుల్ లెంత్ పాత్రలోనే నటిస్తున్నానని చెప్పుకొచ్చారు బాద్షా.

అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో వస్తున్న కింగ్ లో కిల్లర్‌గా నటిస్తున్నారు షారుక్ ఖాన్. కూతురు సుహానా కోసం కింగ్ బాధ్యత తీసుకున్నారు కింగ్ ఖాన్.

దీపావళికి మీ ప్రియమైన వారికి బహుమతి ప్లాన్ చేస్తున్నారా..! తక్కువ ఖర్చుతో ఈ విదేశీ ప్రయాణం బెస్ట్ గిఫ్ట్

దీపావళి రాగానే మన సన్నిహితులకు, స్నేహితులకు, మనకు ఇష్టమైన వారికి ఈ సారి ఏం స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలా అని అందరం ఆలోచిస్తాం. చాలామంది సంప్రదాయ పద్ధతులను అనుసరించి స్వీట్లు లేదా ఇతర బహుమతులు ఇస్తారు.

అయితే ఈ దీపావళికి మీరు మీ ప్రియమైన వారిని కొంచెం ఆశ్చర్యపరచాలనుకుంటే… ఇతర బహుమతులను ఇవ్వవచ్చు. కనుక ఈసారి కొత్తదాన్ని ఎందుకు ప్రయత్నించకూడదని మేరు భావిస్తే.. మీ సన్నిహితులకు థ్రిల్, రిలాక్సేషన్, అందమైన జ్ఞాపకాలతో కూడిన యాత్రను ఎందుకు బహుమతిగా ఇచ్చేందుకు ట్రై చేయండి..

ఫెస్టివ్ ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ఈ సంవత్సరం 64% మంది భారతీయులు ఇప్పటికే దీపావళికి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకున్నారని, 41% మంది ప్రజలు లగ్జరీ ట్రిప్‌ల కోసం వెచ్చిస్తున్నారని PickYourTravel సహ వ్యవస్థాపకుడు హరి గణపతి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ తమకు నచ్చిన మెచ్చిన వారికి ట్రావెల్ ట్రిప్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా.. సెలవులను విలాసవంతంగా గడిపేలా ప్లాన్ చేస్తున్నారు. లేదా బడ్జెట్‌లో గొప్ప గమ్యస్థానం కోసం వెతుకుతున్నారు. అయితే ఈ దేశాల్లో ప్రయాణం ప్రత్యేకమైన గమ్యస్థానాలు దివాలీకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ గా జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి.

జపాన్ ప్రయాణం

మీరు కొంచెం విలాసవంతమైన ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే.. జపాన్ ను ఈ జాబితాలో చేర్చుకోవచ్చు. జపాన్ దేశం ఫుజి పర్వతం, హిరోషిమా చారిత్రక వారసత్వం వంటి పర్యటక ప్రాంతాలు అందమైన యాత్రగా మారి.. మీ ప్రియమైన వారికి ఒక మధుర జ్ఞాపకంగా మారుతుంది. ఈ దేశంలో పురాతన సంప్రదాయాలు.. ఆధునికత కలగలిపిన సంగమాన్ని చూడవచ్చు. ఇక్కడికి వెళ్లేందుకు ఒక్కో వ్యక్తికి రూ.2 లక్షలు ఖర్చవుతుందని అంచనా.

టర్కీ

మీ ప్రియమైన వారికి టర్కీకి ప్రయాణ టిక్కెట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ దేశ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి విశిష్టమైన కలయిక ఉంది. ఇక్కడికి వెళ్లడం ద్వారా కప్పడోసియాలో హాట్ ఎయిర్ బెలూన్ ఆనందించవచ్చు. టర్కీతూర్పు , పశ్చిమాల అద్భుతమైన కలయిక. ఇక్కడికి వెళ్లాలంటే లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు అవుతుందని అంచనా.

ఫిన్లాండ్

ఉత్కంఠభరితమైన ప్రకృతి, శక్తివంతమైన నగరాలు, విశిష్ట సంస్కృతితో అద్భుతమైన అనుభూతిని ఇచ్చే ఫిన్లాండ్‌ కూడా పర్యటనకు బెస్ట్ ఎంపిక. ఇక్కడ లైట్ల వెలుగులు చాలా అందంగా ఉంటాయి. ఈ దేశానిక్కి వెళ్లడం ద్వారా శాంతా క్లాజ్ విలేజ్‌ని సందర్శించవచ్చు. ఇక్కడికి వెళ్లాలంటే రూ.1.5 నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా.

వియత్నాం

తక్కువ బడ్జెట్‌లో గొప్ప యాత్రను ప్లాన్ చేస్తుంటే వియత్నాం ఎంపిక బెస్ట్ ఎంపిక. హనోయిలోని సందడిగా ఉండే వీధుల నుంచి డా నాంగ్‌లోని ప్రశాంతమైన బీచ్‌ల వరకు, ఈ ప్రదేశం ప్రతి క్షణం అనుభూతి చెందవచ్చు. కొత్త అందాలను వింత అనుభూతులతో కలిగిన జ్ఞాపకాలను అందిస్తుంది. కేవలం రూ.50 వేలకే ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

భూటాన్

హిమాలయాల ఒడిలో నెలకొని ఉన్న భూటాన్‌లో విశ్రాంతమైన సెలవులను ఎంజాయ్ చేయడం అనేది మంచి ఎంపిక. టైగర్ నెస్ట్ మొనాస్టరీని సందర్శించవచ్చు లేదా థింపూలోని ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించావచ్చు. ఇక్కడ ప్రకృతి, ఆధ్యాత్మికతల అద్వితీయమైన సమ్మేళనం ఎవరికైనా శాంతి, థ్రిల్ రెండింటినీ ఇస్తుంది. ఇక్కడ రూ.50 నుంచి 70 వేల మధ్య ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

హెల్త్‌కేర్ హబ్‌గా ప్రసిద్ధి చెందుతోన్న కాశీ.. శంకర కంటి ఆసుపత్రి సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్నారు. అక్కడ శంకర కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి వారణాసి సహా ఈ ప్రాంతం సమీపంలోని అనేక మంది ప్రజల జీవితాల్లోని చీకటిని తొలగించి..

వారిని వెలుగులోకి తీసుకువెళుతుందని అన్నారు. ఈ ఆసుపత్రి వృద్ధులకు కూడా సేవలందిస్తుంది. పిల్లలకు కూడా వెలుగునిస్తుంది. ఈ ఆస్పత్రిలో భారీ సంఖ్యలో పేదలకు ఉచితంగా వైద్యం అందించనుంది. ఈ ఆసుపత్రి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను తీసుకొచ్చింది.

కాశీ ఎప్పటి నుంచో మతం, సంస్కృతికి రాజధానిగా గుర్తింపు పొందిందని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పుడు కాశీ ఉత్తరప్రదేశ్ , పూర్వాంచల్ లకు ఒక పెద్ద ఆరోగ్య కేంద్రంగా ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. కాశీ ప్రాచీన కాలం నుంచి మతం, సంస్కృతికి సంబంధించిన రాజధానిగా గుర్తించబడింది. ఇప్పుడు కాశీ ఉత్తరప్రదేశ్, పూర్వాంచల్ లకు ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.

కార్తీక మాసంలో కాశీ ప్రయాణం

కార్తీక మాసాన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో కాశీకి రావడం పుణ్యం దక్కుతుందని నమ్మకం. ఈ పవిత్ర క్షేత్రంలో కాశీవాసులు ఉండటమే కాదు, సాధువులకు, పరోపకుల ఆవాసం కూడా. ఇంతకంటే ఆనందకరమైన సంఘటన ఏముంటుంది.. ఇప్పుడు తనకు అత్యంత పూజ్యమైన శంకరాచార్య గారి దర్శనం, ప్రసాదం , ఆశీస్సులు పొందే భాగ్యం కలిగిందన్నారు ప్రధాని.

ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించిన భారతదేశ వ్యూహంలో ఐదు స్తంభాలు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో మొదటి మూలస్తంభం నివారణ ఆరోగ్య సంరక్షణ అంటే వ్యాధి రాకముందే నివారణ. రెండవది సకాలంలో వ్యాధి నిర్ధారణ, మూడవది ఉచిత చికిత్స లేదా తక్కువ ధరలో చికిత్స, మంచి మందులు. నాల్గవది చిన్న పట్టణాలలో మంచి వైద్యం అందించడం, వైద్యుల కొరతను అధిగమించడం .. ఐదవది ఆరోగ్య సంరక్షణలో సాంకేతికతను విస్తరించడమని చెప్పారు.

సిగ్రాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ 6700 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఇందులో 23 అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో రూ.3,200 కోట్ల కంటే ఎక్కువ విలువైన 16 అభివృద్ధి ప్రాజెక్టులు వారణాసికి సంబంధించినవే కావడం విశేషం.

దాదాపు రూ. 2870 కోట్లతో వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే విస్తరణ, కొత్త టెర్మినల్ భవనం, అనుబంధ పనులకు కూడా ప్రధాన మంత్రి మోడీ శంకుస్థాపన చేశారు.

ఐదు పాత్రల్లో శ్రీ విష్ణు నట విశ్వరూపం.. స్వాగ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సామజవరగమన, ఓం భీం బుష్ లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు హీరో శ్రీ విష్ణు. వీటి తర్వాత అతను నటించిన మరో డిఫరెంట్ మూవీ స్వాగ్. గతంలో శ్రీ విష్ణుతో రాజ రాజా చోర వంటి సూపర్ హిట్ ను తెరకెక్కించిన హసిత్ గోలినే ఈ కు కూడా దర్శకత్వం వహించాడు.

రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య హీరోయిన్లుగా నటించారు. శ్రీ విష్ణు గెటప్స్, పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే ఈ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. జెండర్ ఈక్వాలిటీ అనే సున్నితమైన అంశానిక కామెడీని జోడించి ఆసక్తికరంగా స్వాగ్ ను రూపొందించారు. అంచనాలకు తగ్గట్టే అక్టోబర్ 4 న థియేటర్లలో రిలీజైన స్వాగ్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అంతకు ముందు ఎన్టీఆర్ దేవర థియేటర్లలో ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే లో పాత్రలు మరీ ఎక్కువగా ఉండడంతో కొంతమంది కన్ఫ్యూజన్ కు గురయ్యారని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఐదు పాత్రల్లో శ్రీ విష్ణు నట విశ్వరూపానికి సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొత్తానికి థియేటర్లలో బాగానే ఆడిన స్వాగ్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఈ ను ఓటీటీలోకి తీసుకొచ్చేలా డీల్ జరిగిందని టాక్. ఈ లెక్కల ప్రకారం నవంబర్ మొదటి వారంలో స్వాగ్ ఓటీటీ లోకి వచ్చే అవకాశముంది. సోషల్ మీడియాలో వస్తోన్న న్యూస్ ను బట్టి నవంబర్ 4న స్వాగ్ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ స్వాగ్ ను నిర్మించారు. సునీల్, రవి బాబు, గోపరాజు రమణ, గెటప్ శీను, రాజ్య లక్ష్మి, పృథ్వీ రాజ్ తదితరులు ఈ లో కీలక పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ బాణీలు సమకూర్చారు. ఎడిటర్ గా విప్లవ్ నైషధం వ్యవహరించారు. అలాగే టోగ్రఫీ బాధ్యతలను వేదరామన్ శంకరన్ నిర్వర్తించారు. సమాజంలో ఆడ,మగ అనే భేదాలు లేకుండా అందరూ సమానమే అనే భావనతో ఎంతో ఎంటర్ టైనింగ్ గా స్వాగ్ మూవీని తీర్చిదిద్దారు. మరి థియేటర్లలో ఈ ను మిస్ అయ్యారా? అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేద్దురు గానీ..

మీ ఫోన్ పదే పదే హ్యాంగ్ అవుతుందా? ఇలా చేయండి మరింత స్పీడప్‌

మొబైల్ ఫోన్లు పాతబడిన కొద్దీ వాటి పనితీరు మందగిస్తుంది. చాలా మంది స్మార్ట్‌ఫోన్ హ్యాంగింగ్ సమస్యలను ఎదుర్కొంటారు. ఫోన్‌ హ్యాంగింగ్‌

ఫోన్ ఇంటర్నల్‌ స్టోరేజీ లేదా ర్యామ్‌ నిండినప్పుడు మొబైల్ ఫోన్ ఏదైనా ప్రాసెస్ చేయడంలో సమస్యను ఎదుర్కొంటుంది.

అప్పుడు యాప్‌లు నెమ్మదిగా పని చేస్తాయి. కొన్నిసార్లు యాప్‌లు క్రాష్ అవ్వడం కూడా జరుగుతుంటాయి. స్మార్ట్‌ఫోన్ హ్యాంగింగ్ సమస్యలను నివారించడానికి, మీరు ఏదైనా అనవసరమైన డేటా, ఫోటోలు, వీడియోలను తొలగించవచ్చు. స్టోరేజీని ఖాళీ చేయవచ్చు.

అనేక సార్లు యాప్ డెవలపర్లు Google Play Store, Apple App Storeలో యాప్‌లకు అప్‌డేట్‌లను విడుదల చేస్తారు. కానీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత దానిపై శ్రద్ధ పెట్టడం కూడా అవసరం. ఎప్పటికప్పుడు యాప్ డెవలపర్‌లు ఏదైనా యాప్‌కి అప్‌డేట్‌లను అందజేస్తారు.

చాలా సార్లు మీరు యాప్‌లను అప్‌డేట్ చేయరు. మీరు అవసరమైనప్పుడు యాప్‌లను అప్‌డేట్ చేయకపోయినా, మొబైల్ ఫోన్ హ్యాంగ్ కావడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితులలో యాప్‌లను అప్‌డేట్ చేయడం మంచిది.

ఫోన్‌లో ర్యామ్ తక్కువగా ఉండి, బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకేసారి అనేక యాప్‌లు ఓపెన్ అయినట్లయితే, ఈ యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేయడం ప్రారంభించి ఫోన్ పనితీరు తగ్గడం మొదలవుతుంది. ఇలాంటి కారణాల వల్ల కొన్నిసార్లు ఫోన్ హ్యాంగ్ అవుతుంది. అటువంటి పరిస్థితులలో బ్యాక్‌గ్రౌండ్ నుండి అవసరం లేని యాప్‌లను తీసివేయడం ఉత్తమం.

దివ్యౌషధం.. డయాబెటిస్‌తోపాటు ఈ రోగాలన్నీ పరార్.

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో జామకాయ ఒకటి. ఇది రుచిగా ఉండటంతోపాటు.. అనేక సమస్యలను దూరం చేస్తుంది. వీటిలోని పోషకాలు, విటమిన్లు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి..

అయితే.. జామకాయతోపాటు.. దీని ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనవి.. జామాకులు పలు సమస్యలను నివారించడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు… ప్రధానంగా ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను నేరుగా నమలవచ్చు లేదా ఈ ఆకులను ఉపయోగించి తయారుచేసిన డికాక్షన్ ను కూడా తీసుకోవచ్చు. జామ ఆకులు ఎలాంటి వ్యాధులను నియంత్రించడానికి సహాయపడుతాయో తెలుసుకోండి..

రక్తంలో చక్కెర నియంత్రణ: జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి.. దీనిలోని పోషకాలు.. చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది. అంతేకాకుండా ఆహారం నుంచి కార్బోహైడ్రేట్ల శోషణను నియంత్రించడంలో సహాయపడుతుంది.

చర్మం – జుట్టు ఆరోగ్యానికి మేలు : జామ ఆకులతో తయారు చేసిన డికాషన్ తాగడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మం, జుట్టు ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

గుండె జబ్బులను నివారిస్తుంది: జామాకుల నీరు తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. గుండె జబ్బులను నివారించడంలో కూడా ఇది ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: శరీరంలో రోగనిరోధకశక్తితీ పెంచుకోవాలనుకుంటే మీరు జామాకుల వాటర్ తాగవచ్చు. ఇందులో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

జీర్ణ సమస్యలను నయం చేయడానికి: జీర్ణ సమస్యలను నయం చేయడానికి జామాకుల కషాయాన్ని త్రాగవచ్చు. ఇది ఫైబర్ కు మంచి మూలం. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.. ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. దీంతో పాటు మలబద్ధకం, అజీర్తి, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

జామ ఆకుల డికాక్షన్: జామాకుల నీళ్లను తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాసు నీరు.. కొన్ని ఆకులను వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి చల్లారిన తర్వాత తాగాలి. (గమనిక: కేవలం అవగాహన కోసం మాత్రమే.. పాటించే ముందు డైటీషియన్లను సంప్రదించండి..)

రజనీకాంత్ వేట్టయన్‌కు వసూళ్ల వర్షం.. వారందరికీ బిర్యానీ వడ్డించిన టీమ్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్ (ది హంటర్). తమిళంతో పాటు తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజైంది. జై భీమ్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ టీజే జ్ఞాన్ వేల్ ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు.

రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, రోహిణి, అభిరామి, దుశారా విజయన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. దసరా కానుకగా గురువారం (అక్టోబర్ 10)న విడుదలైన వేట్టయన్ కు సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ రజనీ మేనియాను మరోసారి ప్రూవ్ చేసింది. ఇప్పటివరకు వేట్టయన్ కు 129 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో చిత్ర బృందం ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉంది. ఈ నేపథ్యంలో వేట్టయన్ మూవీ యూనిట్ థ్యాంక్స్ గివింగ్ మీట్‌ పేరుతో చెన్నైలో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ వేడుకల్లో చిత్రబృందంతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్ కు హాజరైన ప్రతి ఒక్కరికీ విందు భోజనాలు వడ్డించారు. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ స్వయంగా చిత్రబృందంతో పాటు మీడియా ప్రతినిధులకు బిర్యానీ వడ్డించారు. అలాగే హీరోయిన్ రితికా సింగ్ కూడా అతిథులకు స్వయంగా బిర్యానీ వడ్డించింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వేట్టయన్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అనారోగ్యం కారణంగా రజనీకాంత్ ఈ సక్సెస్ మీట్ కు రాలేకపోయారని తెలుస్తోంది.

లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ కు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. విజయంలో అనిరుధ్ బాణీలు కూడా కీలకమయ్యాయని రివ్యూలు వచ్చాయి.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. బావబామ్మర్దుల అన్‏స్టాపబుల్.. ఫోటోస్ వైరల్..

బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో సీజన్ 4 స్టార్ట్ కాబోతుంది. అక్టోబర్ 25న ఈ షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

నందుమూరి బాలకృష్ణ హోస్ట్‏గా వ్యవహరిస్తున్న సెలబ్రెటీ టాక్ షో ‘అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సీజన్ 4 స్టార్ట్ కాబోతుంది.

అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఆదివారం ఈ ఎపిసోడ్ షూట్ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ షో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నట్లు సమాచారం.

చంద్రబాబు ఈ టాక్ షోలో పాల్గొనడం ఇది తొలిసారి కాదు. గతంలో అన్‏స్టాపబుల్ సీజన్ 3లో పాల్గొన్నారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.

Health

సినిమా