Sunday, November 17, 2024

బజాజ్‌ బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి స్టైలిష్‌గా బజాజ్ పల్సర్

ద్విచక్ర వాహనాల రంగంలో బజాజ్‌ పల్సర్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. పర్సర్‌ అంటేనే ఎంతో మంది ఇష్టపడేవారున్నారు. అయితే బజాజ్‌ ఆటో పల్సర్‌లో రకరకాల మోడళ్లను విడుదల చేస్తుంది.

ఈ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో తన బజాజ్ పల్సర్ ఎన్125 మోటారు సైకిల్ త్వరలో భారత్ మార్కెట్లో విడుదల చేయనుంది. కొత్త మోడల్‌ బజాజ్‌ పల్సన్ ఎన్125 బైక్‌ అగ్రెసివ్ స్టైలింగ్‌తో భారత మార్కెట్లోకి రానుంది. ఎల్ఈడీ హెడ్ లైట్ తోపాటు ముందు ప్లాస్టింగ్ క్లాడింగ్ ఉంటుంది.

బజాజ్ ఎన్150 నుంచి వీల్స్, బజాజ్ ఫ్రీడం 125 నుంచి డిస్ ప్లే ఇండికేటర్ ఉంటాయి. అంటే బజాజ్ ఎన్125 బైక్‌ ప్రాథమికంగా ఇన్ బిల్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తోంది.

బజాజ్ పల్సర్ ఎన్125 బైక్‌ స్ప్లిట్ సీట్, సైడ్ ప్యానెల్, టెయిల్ సెక్షన్ మీద కొన్ని కొత్త గ్రాఫిక్స్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. టీవీఎస్ రైడర్, హీరో ఎక్స్ ట్రీం 125 ఆర్ వంటి మోటారు సైకిళ్ల మాదిరిగా స్ప్లిట్ సీట్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అయితే దీని ధర రూ.90 వేల నుంచి రూ.1.10 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న పల్సర్‌ బైక్‌ల కంటే సరికొత్తగా ఉండనుందని తెలుస్తోంది.

ఏపీలో మరో రెండు పథకాల అమలుకు మహూర్తం ఫిక్స్.. ఒక్కో విద్యార్థికి . 15వేలు, ఒక్కో రైతుకు రూ.20వేలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలపై ఫోకస్ పెట్టింది. దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు పథకాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆ రెండు పథకాలు ఎప్పటి నుంచి అమలు చేయాలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతోంది.

తల్లికి వందనం పథకాన్ని మరో మూడు నెలల్లో అమలు చేయబోతున్నట్లు సమాచారం. అలాగే రైతులకు సంబంధించిన ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని వచ్చే మార్చి, ఏప్రిల్‌లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి తల్లికి వందనంపై హామీ ఇచ్చింది. చదువుకునే పిల్లలందరికీ.. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి రూ.15వేల చొప్పున ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. వీరందరికీ తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు దాదాపు రూ.12వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తల్లికి వందనం కార్యక్రమం ఆలస్యం కావడానికి కారణాలు ఉన్నాయట.. ఈ పథకానికి సంబంధించి పక్కాగా మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారట. అందుకే కొంత సమయం తీసుకున్నా అన్ని లోపాలను సరిచేసి అమలు చేయబోతున్నారట.

కూటమి ‘అన్నదాతా సుఖీభవ’ పథకం పేరుతో మరో హామీ కూడా ఇచ్చింది. రాష్ట్రంలో అన్నదాతలకు ఏడాదికి రూ.20వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ పథకం కింద వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రైతులకు సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్నదాతా సుఖీభవ ఆలస్యం కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ రెండు పథకాల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోందట.. పక్కాగా విధివిధానాలను రూపొందించాలని భావిస్తున్నారట. గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయగా.. కొన్ని లోపాలు ఉన్నాయని.. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారట. అలాగే కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించేలా చూడాలని భావిస్తున్నారట. ఎలాంటి లోపాలు లేకుండా విధివిధానాలు రూపొందించి.. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు పథకాలకు భారీగా నిధులు సమాకూర్చుకోవల్సి ఉంటుంది. తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలకు నిధులు కూడా ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు శాఖలవారీగా పరిస్థితిని సమీక్షించడానికి సరిపోయింది.. ఆ తర్వాత కూడా సమీక్షలు.. శ్వేతపత్రాల విడుదల, ఆర్థిక పరిస్థితిపై ఫోకస్ పెట్టారు. సెప్టెంబర్ నెలలో వర్షాలతో వరదలు, సహాయ, పునరావాస చర్యలకే నెల గడిచిపోయింది. అందుకే పథకాల అమలు ఆలస్యమైందంటున్నారు.

వైఎస్ జగన్ ప్రెస్‌ మీట్.. కాసేపటికే లిస్ట్ వదిలిన చంద్రబాబు

హామీ అమలు.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఇదే. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తోందని.. హామీల అమలు ఏమైందంటూ వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల సమయంలో చిన్నపిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, నిరుద్యోగ యువతకు, రైతులకు ఇలా అందరికీ హామీలు ఇచ్చారని.. ఇప్పుడం ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అదే తాము అధికారంలో ఉండి ఉంటే.. ఇప్పటికే రైతుభరోసా, చేయూత, అమ్మ ఒడి ఇలా.. అన్ని పథకాలు ఇప్పటికే అమలు చేసి ఉండేవారమని చెప్తున్నారు. టీడీపీ కూటమి సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని.. సూపర్ సిక్స్ కాదు అవుట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇదే విషయమై శుక్రవారం కూడా వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించారు.

అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలకు సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు చంద్రబాబు. ఇదే సమయంలో వైఎస్ జగన్ పదే పదే చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీడీపీ కూటమి సర్కారు చేసిన పనులు ఇవీ అంటూ చంద్రబాబు లిస్ట్ విడుదల చేశారు. వైసీపీ విమర్శలకు దీటుగా బదులివ్వాలని.. ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలు మొదలుపెట్టామని.. త్వరలోనే మరిన్ని అమలు చేస్తామని చెప్పాలన్నారు.

“ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం. మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టాం. గీత కులాలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇచ్చాం. అర్చకుల జీతాలు రూ.10 వేలకు పెంచాం. నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనం పెంచాం. ధూపదీప నైవేద్యాలకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచాం. వేద పాఠశాలల్లో చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తున్నాం. చేనేత వస్త్రాలకు జీఎస్టీ ఎత్తేయాలని కేంద్రాన్ని కోరతాం. కేంద్రం ఇవ్వకపోతే రీయింబర్స్ చేస్తాం. చేనేత కార్మికుల ఇళ్ల నిర్మాణాలకు అదనంగా రూ.50 వేలు అందిస్తాం. పారదర్శక పాలనలో భాగంగా జీవోలు కూడా ఆన్ లైన్‌లో పెట్టాం” అని చంద్రబాబు చెప్పారు.

అమరావతే రాజధానిగా ఉంటుందన్న చంద్రబాబు.. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందన్నారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని.. ఓర్వకల్లు, ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తామని చెప్పారు రైతులకు డ్రిప్‌లు అందిస్తున్నామనీ.. పాడి రైతులకు 90 శాతం సబ్సిడీతో షెడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ క్లియర్ అయ్యిందన్న చంద్రబాబు.. రాజధాని రైతులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లించిన సంగతిని గుర్తుచేశారు. శాంతిభద్రతల విషయంలోనూ రాజీ పడకుండా నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నామని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇస్తున్నామని.. ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు ఇవ్వడంతో పాటు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం అందిస్తామని చెప్పారు. ఇక దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని.. ఇవన్నీ ధైర్యంగా చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఏపీలో మందుబాబులకు మరో షాక్.. ఇక లేనట్లేనా?, వాళ్లకు పండగే!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి.. మూడు రోజులుగా అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మద్యం షాపుల పక్కన పర్మిట్‌ రూమ్‌ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కొత్త పాలసీలో ఈ పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పెట్టలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనే టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు ఈ నిర్ణయం కారణంగా రూ.170 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఈ నిర్ణయం బార్ల యాజమాన్యాలకు కలిసొస్తోంది.. షాపుల పక్కన మద్యం తాగేందుకు పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వకపోవడంతో బార్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

గతంలో ప్రైవేటు పాలసీల్లో పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇచ్చారు.. పర్మిట్ రూమ్‌లు ఉంటే.. ఒక్కో షాపు నుంచి ప్రభుత్వానికి రూ.5 లక్షలు ఆదాయం వచ్చేది. గత ఐదేళ్లు పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు.. చంద్రబాబు సర్కార్ వచ్చాక మళ్లీ ప్రైవేటు మద్యం పాలసీ ప్రకటించినా, పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పర్మిట్ రూమ్‌లు ఇక లేనట్లేనా అని చర్చ జరుగుతోంది. పర్మిట్ రూమ్‌లు లేకపోతే.. మద్యం షాపుల పక్కన రోడ్లపై విచ్చలవిడిగా మద్యం తాగే సంస్కృతి మొదలవుతుందంటున్నారు.

2014-2019తో పాటూ అంతకముందు కూడా ప్రైవేటు మద్యం షాపుల పాలసీలో పర్మిట్‌ రూమ్‌లు ఉండేవి. షాపు పక్కనే మద్యం తాగేందుకు చిన్న గది (పర్మిట్ రూమ్‌)ను ఏర్పాటు చేసేవారు. అక్కడ కుర్చీలు, బల్లలు లేకుండా కేవలం నిల్చొని మద్యం తాగేందుకు మాత్రమే అనుమతి ఉండేది. మద్యం షాపు యజమానులు అక్కడ వాటర్‌ ప్యాకెట్లు, గ్లాసులు, స్నాక్స్‌ వంటవివి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం వచ్చేది. అలాగే పర్మిట్‌ రూమ్‌ల వల్ల మద్యం విక్రయాలు పెరిగేవి అని చెబుతుననారు. ఈ పర్మిట్ రూమ్‌ల వల్ల వ్యాపారికి, ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరేది. ఇప్పుడు పర్మిట్ రూమ్‌లు లేకపోవడంత ఆ ఆదాయం తగ్గింది.

అయితే మద్యం షాపుల దగ్గర పర్మిట్‌ రూమ్‌లు పెట్టుకోవాలంటే లైసెన్సీ అదనంగా ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు అందరూ పర్మిట్ రూమ్‌లు కావాలనే అడుగుతారు. ఆరు రోజుల క్రితం నిర్వహించిన లాటరీలో 3,396 ప్రైవేటు షాపులకు రూ.5లక్షల చొప్పున రూ.169.8 కోట్లు ఒక్క విడతలో వచ్చేవి అంటున్నారు. గీత వృత్తి కులాలకు కోసం రిజర్వ్‌ చేసిన 340 షాపులకు నోటిఫికేషన్‌ వస్తుంది.. ఈ షాపులకు రూ.17 కోట్లు వచ్చేవి. ఈ ఆదాయం మొత్తాన్ని ప్రభుత్వం కోల్పోయింది. మరి ప్రభుత్వ పర్మిట్ రూమ్‌ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇస్తుందా.. గత ప్రభుత్వ విధానాన్నే కొనసాగిస్తుందా చూడాలి.

టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు బంపరాఫర్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు, ఈ చిన్న పని చేస్తే చాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు. ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు మొదలవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నలుగురు ఓటర్లలో ఒకర్ని సభ్యులుగా చేర్పించాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచనలు చేశారు. ఈ ఏడాది నుంచి కొత్తగా జీవితకాల సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నామని గుర్తు చేశారు.. దీని కోసం రూ.లక్ష రుసుంగా నిర్ణయించామన్నారు. ఒకవేళ పార్టీ సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే బీమా మొత్తాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచామన్నారు. అంతేకాదు చనిపోయిన కార్యకర్తల అంత్యక్రియలకు రూ. 10 వేలు చొప్పున తక్షణ సాయం అందిస్తామని చెప్పారు.

వాస్తవానికి సాధారణ మరణం పొందిన కార్యకర్తలకూ బీమా వర్తింపజేయాలని కొందరు ఎమ్మెల్యేలు కోరారు.. అలాంటివారిని పార్టీపరంగా ఆదుకుంటామని చెప్పారు. అయితే గతంలో బీమా రాని 73 మందికి రూ.రెండు లక్షల చొప్పున అందించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు ప్రమాద బీమా కింద రూ. 102 కోట్లు.. సహజ మరణం, ఇతర సమస్యలకు రూ. 18 కోట్లు, విద్యార్థుల చదువు కోసం రూ. 2.35 కోట్లు అందిచామని చెప్పారు. టీడీపీ కేడర్‌కు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. వారికి నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు, ఇతరత్రా ఆదాయ మార్గాలు చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో ఈ పని చూడాలని.. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి త్వరలో నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు నామినేటెడ్‌ పదవుల్లో.. రాష్ట్రం యూనిట్‌గా చేసుకుని టీడీపీకి 80 శాతం, మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు 20 శాతం చొప్పున కేటాయిస్తామన్నారు చంద్రబాబు. మొత్తం 23,500 మంది నేపథ్యంతో పాటుగా పార్టీకి వారు చేసిన సేవల్ని పరిశీలించి.. పూర్తిగా అన్ని అంశాలపై చర్చించిన తర్వాత జాబితాలు సిద్ధం చేశామని చెప్పారు.. త్వరలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఈ పోస్టులు ఇచ్చిన వారి పేర్లు ఓ 4 గంటల ముందు చెబుతానన్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీతో సమన్వయంలో సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు దగ్గర ప్రస్తావించగా.. ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ పరిష్కరిస్తుందని చెప్పారు. జనసేన పార్టీతో సమన్వయంతో పనిచేయాలని.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్తులోనూ ఆ పార్టీతో కలసి ప్రయాణించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల పనితీరుపై ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహిస్తానని చెప్పారు చంద్రబాబు. తాను వివిధ మార్గాల్లో సమాచారం రప్పించుకుంటానని చంద్రబాబు తెలిపారు.. దీనిపై ఐదుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ కమిటీ నుంచి ఎవరికైనా పిలుపు వస్తే.. వారి దగ్గర ఏదో తప్పు జరుగుతోందని గ్రహించాలి అన్నారు. వీరిని కమిటీ ముందు పిలిచి మాట్లాడుతుందని.. అప్పటికీ అవసరమైతే తానే స్వయంగా మాట్లాడతాను అన్నారు. రెండోసారి తప్పు చేస్తే ఇక మాట్లాడటం ఉండదని.. చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. తాను క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటానని.. మళ్లీ
1995 నాటి చంద్రబాబుని చూస్తారన్నారు. ఒకవేళ చర్యలు తీసుకున్నాక తనను ఎవరూ తప్పుగా అనుకోవద్దన్నారు.

మరోవైపు ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ కోసం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని పరిష్కరించే విధానం తీసుకొద్దామని చెప్పారు.. అలాగే మంత్రులు జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలని సూచించారు. కూటమిలో మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టాలన్నారు. గత ప్రభుత్వంలో తప్పు చేసినవారిని చట్ట ప్రకారం శిక్షించే పని ఇప్పటికే మొదలైందన్నారు చంద్రబాబు.

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు.. తక్కువ ధరకే కొనసాగింపు, మంచి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వంటనూనెలను తక్కువ ధరకే సరఫరాను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. పామాయిల్‌ లీటరు రూ.110, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు రూ.124కు అందిస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వంటనూనెల దిగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. వంటనూనెల సరఫరాలో ఇబ్బంది లేకుండా తగినంతగా స్టాక్ అందుబాటులో ఉంచాలని వారికి సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా సబ్సిడీపై అందిస్తున్న వంట నూనెకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందన్నారు మనోహర్. దీంతో సప్లైకి దిగుమతి దారుల నుంచి ఇబ్బందులు లేకుండా సప్లై పెంచడం కోసం ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని.. అందుకే వారికి సబ్సిడీపై వంటనూనెలు అందిస్తున్నట్లు చెప్పారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లై పెంచాలని.. సరైన సమయంలో సప్లై అందించాలని మంత్రి కోరారు.

మరోవైపు మంత్రి మనోహర్‌ రాయితీపై అందించే కందిపప్పు సరఫరాలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కారణాలపై ఆరా తీసిన ఆయన.. సరఫరాదారులను ప్రశ్నించారు. నాణ్యమైన కందిపప్పు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నష్టాలను భరిస్తూ తక్కువ ధరకు కందిపప్పు అందించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఒకవేళ ఏవైనా ఇబ్బందులుంటే ముందే చెప్పాలన్నారు.

కందిపప్పు సరఫరా దారులు ప్రజలకు సహకరించాలని మంత్రి మనోహర్ కోరారు. టెండర్‎లో పేర్కొన్న విధంగానే.. కందిపప్పును పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని ఆదేశించారు. నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయకపొతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కెట్ ధరలకు కందిపప్పు కొనుగోలు చేసి సబ్సిడీ ధరలపై పేదప్రజలకు కందిపప్పు సరఫరా చేయాలన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. ఈ నెలలో తక్కువ ధరకే రైతు బజార్లలో వంటనూనెలు, ఉల్లిపాయలు, టమాటాలను అందించిన సంగతి తెలిసిందే. వంట నూనెల్ని ప్రజలకు సబ్సిడీపై అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

విశాఖవాసులకు పోలీసుల సూపర్ న్యూస్.. ఇక అర్ధరాత్రి 12 వరకు అనుమతి

విశాఖపట్నంలో హోటల్స్, రెస్టారెంట్‌లకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అర్ధరాత్రి 12 గంటల వరకూ అన్నిరకాల హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకోవచ్చని తెలిపారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని.. అయితే బార్లు, వాటికి అనుబంధంగా ఉన్న రెస్టారెంట్లు మాత్రం రాత్రి పది గంటలకే మూసేయాలని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయంతో విశాఖవాసులకు అర్థరాత్రి సమయంలో కూడా ఫుడ్ అందుబాటులో ఉండనుంది.

విశాఖలో హోటళ్ల సమయాలపై ఇటీవల జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. నగరానికి రాత్రి 11 గంటల తరువాత రైళ్లు వస్తుంటాయి.. అయితే ఆ సమయంలో ప్రయాణికులు బయటకు వచ్చి ఏమైనా తినాలంటే కుదరడం లేదు. ఆ సమయంలో హోటళ్లన్నీ మూసేసి ఉంటున్నాయని కొంతమంది ప్రస్తావించారు. అంతేకాదు నగరానికి నిత్యం పర్యాటకులు వస్తుంటారు.. వారికి కూడా రాత్రి సమయంలో 10 తర్వాత వెళితే ఫుడ్ అందుబాటులో ఉండటం లేదు.

విశాఖపట్నం పర్యాటకంగా ఎదుగుతున్న సమయంలో.. ఇలా ఫుడ్ అందుబాటులో లేకపోవడంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో విశాఖపట్నంలో రాత్రి 12 గంటల వరకు ఆహారం లభించేలా హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచుకునేందుకు పోలీసులు అనుమతించాలని రిక్వెస్ట్‌లు వచ్చాయి. అయితే అర్ధరాత్రి వరకూ హోటల్స్, రెస్టారెంట్లు, వ్యాపార కేంద్రాలు తెరిచి ఉంచితే రౌడీమూకలు, ఆకతాయిలతో సమస్యలు వస్తాయని పోలీసులు ఆలోచించారు. నగరంలో రాత్రి సమయాల్లో గస్తీ పెంచి, పర్యాటకులకు అవసరమైనవి అందుబాటులో ఉంచడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్‌ను సీపీ డా.శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. విమానాశ్రయంలో ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్ ఏర్పాటుపై అందిన వినతుల మేరకు, ప్రయాణికుల సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులోని ఈ ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్‌లో పనిచేసే టాక్సీ యజమానులు, డ్రైవర్లు పూర్తి వివరాలతో పాటుగా టాక్సీ జీపీఎస్ ద్వారా పోలీసు వారి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. నవంబర్‌లో పక్కా, ఆ జీవో కూడా రద్దు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-117ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది. స్కూళ్లలో తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు, టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్‌ లాంటి వాటిని అమలు చేసేందుకు ఈ జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని రద్దు చేసి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అధికారులు చర్చలు జరిపారు.

3, 4, 5 తరగతులను గత ప్రభుత్వంలో విలీనం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిగే ఇబ్బందులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మేజర్‌ పంచాయతీలోనూ ఒక మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాప్‌లను వీలైనంత వరకు సులభంగా ఉండేలా, ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు.

నవంబరు 11న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల దినోత్సవం నిర్వహించనున్నారు. నవంబరు 14న ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మెగా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అలాగే రెండు నెలలపాటు ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో ఒక్కో అంశంపై చర్చించి, అభిప్రాయాలు తీసుకోనున్నారు అధికారులు. వచ్చే వారం ప్రమోషనల్లు, బదిలీలపై చర్చించాలని నిర్ణయించారు.

అలాగే ఉపాధ్యాయ సంఘాలు కొన్ని అంశాలను ప్రభుత్వానికి వివరించాయి. ఆరు రోజుల పాటూ ఉపాధ్యాయులకు నిర్వహించాలని నిర్ణయించిన రెసిడెన్షియల్‌ శిక్షణను మార్చాలని.. ఉపాధ్యాయులకు వారానికి 32 పీరియడ్లకు మించి బోధన విధులు ఉండకూడదని విన్నవించారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు-29, 42, 53 అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా సబ్జెక్టు టీచర్లతోనే బోధించాలని.. ఇంగ్లీష్ మీడియంతో పాటూ తెలుగు మీడియంను అమలు చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 20 మించి ఉంటే ఇద్దరు ఎస్జీటీలను ఇవ్వాలని కోరారు.

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. ఇటీవల పాఠశాలలను తనిఖీ చేసిన మంత్రి లోకేష్‌కు నిర్వహణ నిధుల సమస్య రావడంతో.. వెంటనే ఈ నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. మంత్రి లోకేష్ చొరవతో నిధుల విడుదలు కాగా.. రెండు మూడు రోజుల్లో ఈ నిధులు పాఠశాలల అకౌంట్‌లకు చేరనున్నాయి. 855 పీఎంశ్రీ పాఠశాలలకు రూ.8.63 కోట్లు, కేజీబీవీల్లో డైట్‌ నిర్వహణకు రూ.35.61కోట్లు, మండల రిసోర్స్‌ కేంద్రాలకు రూ.8.82కోట్లు, మిగిలిన 40,728 బడులకు కాంపోజిట్‌ గ్రాంట్ల కింద రూ.51.9 కోట్లు ఇచ్చారు.

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్.. ఆ రూ. 12.5 కోట్ల వ్యవహారంలో

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విశాఖపట్నంలోని లాసన్స్‌బే కాలనీలోని ఇల్లు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఎంవీవీ సత్యనారాయణ ఆడిటర్ జీవీ, గద్దె బ్రహ్మాజీ ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేస్తోంది. ఈడీ అధికారులు వచ్చిన సమయంలో ఎంవీవీ అక్కడ లేరని తెలుస్తోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరిలోవ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పైనే ఈడీ ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎంవీవీ సత్యనారాయణపై హయగ్రీవ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్‌ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదుతో.. ఇటీవల నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, క్రిమినల్ బెదిరింపు ఆరోపణలతో ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టును ఆశ్రయించగా.. ముందస్తు బెయిల్ కూడా మంజూరైంది. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, వృద్ధుల గృహాల నిర్మాణం కోసం ప్రభుత్వం తనకు కేటాయించిన 12.5 ఎకరాల భూమిని.. నకిలీ పత్రాలతో సత్యనారాయణ తదితరులు లాక్కునేందుకు ప్రయత్నించారని హయగ్రీవ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్‌ జగదీశ్వరుడు ఆరోపిస్తున్నారు.

జగదీశ్వరుడు, భార్య రాధా రాణిలు ఈ కంపెనీలో ఉన్నారు. 2006 నుంచి కంపెనీ ఉండగా.. 2008లో వీరికి ఎండాడ దగ్గర సీనియర్ సిటిజన్, అనాథ గృహాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12.51 ఎకరాలు మంజూరు చేసింది. 2010లో ఈ భూమిని మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కూడా చేశారని చెబుతున్నారు జగదీశ్వరుడు. ఆడిటర్ జీవీ తనను ఎంవీవీ సత్యనారాయణకు, గద్దె బ్రహ్మాజీకి పరిచయం చేశారని.. ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ కోసం పరిచయం చేశారన్నారు.

ఈ ప్రాజెక్టు కోసం 2020లో ఎంవోయూ చేసుకోగా.. ఎంవీవీ, బ్రహ్మాజీ, జీవీలు కలిసి ఫోర్జరీ సంతకాలు, విక్రయ పత్రాలను తయారు చేశారని..తమను బలవంతంగా ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించారని ఆరోపించారు. తమ విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నారని.. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నారని జగదీశ్వరుడు ఆరోపించారు.
ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్‌గా ఉన్నారు.. గీతాంజలి, అభినేత్రి, లక్ ఉన్నోడు, నీవెవరో వంటి సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.. వైఎస్సార్‌సీపీలో చేరి.. 2019 ఎన్నికల్లో విశాఫట్నం ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2024 ఎన్నికలలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈ ఈడీ సోదాలపై ఎంవీవీ సత్యనారాయణ స్పందించాల్సి ఉంది.

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారికి నెలకు రూ.30వేలు, భారీగా నిధులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు చేకూరేలా.. ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులను, వాలంటీర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు మదర్సాల్లో విద్యా వాలంటీర్ల నియామక పథకానికి ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’గా పేరు పెట్టారు. ఈ మేరకు ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే వీరి నియామకానికి మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్‌ ఆమోదం తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 185 మదర్సాలు ఉండగా.. ఒక్కో మదర్సాలో ముగ్గురు చొప్పున 555 మంది విద్యావాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం అమలు కోసం ఏడాదికి రూ.13 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు అధికారులు. దీనికి ఆర్థికశాఖ నుంచి ఆమోదం రావాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం గతేడాది నూతన విద్యా విధానం అమల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రతి తరగతిలో కనీసం 15 మంది విద్యార్థులు ఉండి.. ఉర్దూ మాధ్యమం చదివే స్కూళ్లలో గౌరవ వేతనం కింద ఉర్దూ భాషా ఉపాధ్యాయుల నియామకానికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. కేంద్రం గతేడాది నుంచే దీన్ని అమలు చేసినా గత ప్రభుత్వ హయాంలో వినియోగించకోలేదు. కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిబంధనల మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది.

ఏపీలో మొత్తం 1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉండగా.. వీటిలో 238 సూళ్లలో ప్రతి తరగతిలో 15 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఆ వెంటనే ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు రూ.30 వేలు గౌరవవేతనం కింద చెల్లించేలా రూ.10 కోట్లను విడుదల చేసింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే అధికారులు నియామక ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.

2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం.. మదర్సాల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు నవీన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు విద్యా వాలంటీర్లను నియమించింది. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయలేదు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మదర్సాల్లో విద్యావాలంటీర్ల నియామకానికి కసరత్తు చేస్తోంది. త్వరలోనే విద్యా వాలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు.

లంబసింగ్ మ్యూజియం కోసం నిధులు విడుదల
మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లంబసింగి సమీపంలోని తజంగి గ్రామంలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి రూ.6.75 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. మొత్తం రూ.35 కోట్లతో మ్యూజియాన్ని నిర్మిస్తుండగా.. ఇందులో కేంద్రం వాటా రూ.15 కోట్లు కాగా.. రాష్ట్ర వాటా రూ.20 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్లో రూ.6.75 కోట్లు విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

బోరుగడ్డ అనిల్ అరెస్ట్ వ్యవహారం.. హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్‌ మీద ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనిల్ అరెస్ట్ విషయంలో కులం ప్రస్తావన తీసుకువస్తుండటాన్ని వంగలపూడి అనిత తప్పుబట్టారు. “డాక్టర్ సుధాకర్‍ను రోడ్డు మీద కూర్చోబెట్టి పిచ్చోణ్ని చేస్తే.. అతని అవమానం తట్టుకోలేక చనిపోయారు. వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేయించారు. ఇవన్నీ జరిగినప్పుడు దళితులకు అన్యాయం జరిగిందని ఎందుకు రోడ్డు మీదకు రాలేదు.ఇప్పుడు దళిత కార్డు బయటికి తీసుకు వస్తున్న వారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు? దళితురాలైన నన్ను సీఎం చంద్రబాబు గారు.. హోం మంత్రిని చేశారు. చట్టానికి-కులానికి సంబందం లేదు. ఏ కులమైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో నాపై 23 కేసులు పెట్టారు. అసలు క్రిమినల్స్‌కు కులం ఏంటి?” అని వంగలపూడి అనిత మండిపడ్డారు.

మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనిల్‌ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. 2021లో ఓ వ్యక్తిని రూ.50 లక్షల కోసం బెదిరించినట్లు బోరుగడ్డ అనిల్ మీద ఆరోపణలు ఉన్నాయి. దీనిపే అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ కేసులోనే బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో బోరుగడ్డ అనిల్ కుమార్ అనేక అరాచకాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు చేశారని చెప్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్, రఘురామ, కోటంరెడ్డి వంటి వారిని బెదిరించాలని టీడీపీ నేతలు చెప్తున్నారు. అప్పటి ప్రతిపక్షనేతలతో పాటుగా వారి కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని.. ఆరోపిస్తున్నారు. దీనిపై అప్పట్లో తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని టీడీపీ ఆరోపణ. మరోవైపు బోరుగడ్డ అనిల్‌పై రాష్ట్రవ్యాప్తంగా 15 వరకు క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తెలిసింది. రౌడీషీట్ కూడా ఉన్నట్లు సమాచారం.

130 కి.మీ రేంజ్​ ఇచ్చే ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై భారీ డిస్కౌంట్​..

జాయ్​ ఈ బైక్​ మిహోస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై భారీ డిస్కౌంట్​ని ఇస్తోందివార్డ్​విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ సంస్థ. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పండగ సీజన్​లో సేల్స్​ పెంచుకునేందుకు అనేక ఆటోమొబైల్​ కంపెనీలు పోటీపడి మరీ తమ పోర్ట్​ఫోలియో ప్రాడక్ట్స్​పై భారీ డిస్కౌంట్స్​ని ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి వార్డ్​విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ చేరింది. ఈ కంపెనీ తన జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, జాయ్ ఈ-రిక్ త్రీ వీలర్ శ్రేణిలో పండుగ సీజన్ కోసం ఆఫర్లను విడుదల చేసింది. తయారీదారు తన ఫ్లాగ్​షిప్​ ఎలక్ట్రిక్ స్కూటర్ జాయ్ ఈ-బైక్ మిహోస్​పై రూ .30,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.

జాయ్ ఈ-బైక్

జాయ్​ ఈ బైక్​ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ .1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్). గ్లోబ్, జెన్ నెక్ట్స్ నాను, వోల్ఫ్, వోల్ఫ్ ఎకో, వోల్ఫ్ ప్లస్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని కూడా ఈ బ్రాండ్ విక్రయిస్తోంది. వీటి ధరలు రూ .70,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

అంతేకాదు పండగ సమయంలో ఎంపిక చేసిన ఎలక్ట్రిక్​ స్కూటర్లపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ అందించడానికి వార్డ్​విజార్డ్ బ్లూబెల్స్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్​తో కలిసి పనిచేస్తోంది. పండగ సీజన్​లో కొనుగోలును సులభతరం చేయడానికి మంగళం ఇండస్ట్రియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎంఐఎఫ్ఎల్) తో పాటు 15 బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల ద్వారా సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా బ్రాండ్ డీలర్​షిప్స్​, డిస్ట్రిబ్యూటర్లతో పాటు అమెజాన్, ఫ్లిప్​కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్​ఫామ్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఈ ప్రయోజనాలు 2024 నవంబర్ వరకు అందుబాటులో ఉంటాయి.

జాయ్ ఈ-బైక్ మిహోస్ స్పెసిఫికేషన్లు..

జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్​ దాదాపు 130 కి.మీ రేంజ్​. ఫ్యామీలిలకు సరిగ్గా సూట్​ అవుతుంది. దీనిని పాలీ డిసైక్లోపెంటాడిన్ (పీడీసీపీడీ) తో సంస్థ తయారు చేసింది. స్టైలింగ్ అనేది రెట్రో లుక్స్​, కర్వ్​డ్​ బాడ షెల్​తో వస్తుంది. ఈ మోడల్​లో పొడవైన, వెడల్పాటి సీటు ఉంటుంది. సీటు ఎత్తు 750 ఎంఎం వద్ద సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో సింగిల్ స్ప్రింగ్ సస్పెన్షన్​ను కలిగి ఉంది. ఈ మోడల్ 175 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్​తో వస్తుంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్​ఫోన్ కనెక్టివిటీ, రిమోట్ ట్రాకింగ్, రివర్స్ మోడ్, జీపీఎస్ ట్రాకింగ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, హైడ్రాలిక్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్) వంటి ఫీచర్లు మిహోస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఉన్నాయి.

ఇందులోని 1500 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ 95 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఈ-స్కూటర్ కేవలం 7 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని పొందుతుంది. ఈ మోడల్ ఎకో, రైడ్, హై అనే మూడు రైడింగ్ మోడ్ లను పొందుతుంది.

ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్​ ఇస్తున్నారు.. ఇది తెలుసుకుంటే మీ డబ్బు ఆదా

మీ బండికి తరచూ పెట్రోల్​, డీజిల్​ కొట్టిస్తుంటారా? మీ ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు గురించి తెలసుకోవాలి.

మీరు రోజు బైక్​ లేదా కారులో ప్రయాణిస్తుంటారా? వెహికిల్స్​కి తరచుగా పెట్రోల్​, డీజిల్​ కొట్టిస్తుంటారా? మరి బిల్లు ఆదా చేసుకోవాలని ఉందా? అయితే ఇది మీకోసమే! మీ ఖర్చులు తగ్గించుకునే విధంగా వార్షికంగా 50 లీటర్ల వరకు ఇంధనాన్ని ఉచితంగా పొందొచ్చు. దీని కోసం మీరు ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు గురించి తెలసుకోవాలి. పూర్తి వివరాలు..

ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు..

కస్టమర్స్​ని ఆకట్టుకునేందుకు, వారి క్రెడిట్​ కార్డు స్పెండింగ్​ని పెంచేందుకు బ్యాంకులు కృషి చేస్తుంటారు. ఇందులో భాగంగానే వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తమ క్రెడిట్​ కార్డులతో కస్టమర్స్​కి మంచి బెనిఫిట్స్​ ఇస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి.. ఈ ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు. దీని ద్వారా వార్షికంగా 50 లీటర్ల వరకు పెట్రోల్​ లేదా డీజిల్​ని ఫ్రీగా పొందొచ్చు.
ఈ క్రెడిట్​ కార్డు ఫీచర్స్​ ఇవే-

వార్షికంగా 50 లీటర్ల వరకు పెట్రోల్​, డీజిల్​ ఫ్రీ!
ఇండియన్​ ఆయిల్​ ఔట్​లెట్స్​లో ఇంధన కొట్టించి 5శాతం వరకు ఫ్యూయెల్​ పాయింట్స్​ పొందొచ్చు. (మొదటి 6 నెలల వరకు ప్రతి నెల గరిష్ఠంగా 250 ఫ్యూయెల్​ పాయింట్స్​, ఆ తర్వాతి 6 నెలల వరకు 1150 ఫ్యూయెల్​ పాయింట్స్​.)
గ్రాసరీ, బిల్​ పేమెంట్స్​పైనా ప్రతి నెల 100 ఫ్యూయెల్​ పాయింట్స్​ వరకు పొందొచ్చు.
రూ. 150 వరకు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్​తో పాటు ఇతర లావాదేవీలపై 1 ఫ్యూయెల్​ పాయింట్​ పొందొచ్చు.

అదనపు ఫీచర్స్​-

IndianOil XTRAREWARDSTM Program (IXRP) membership ని కాంప్లిమెంటరీగా లభిస్తుంది.
రివాల్వింగ్​ క్రెడిట్​, జీరో లాస్ట్​ కార్డ్​ లయబిలిటీ, ఇంటరెస్ట్​ ఫ్రీ క్రెడిట్​ పీరియడ్​ వంటి వాటిని పొందొచ్చు.
సర్​ఛార్జ్​ తొలగింపు- కనిష్ఠంగా రూ. 400 ఇంధన బిల్లుపై 1శాతం ఫ్యూయెల్​ సర్​ఛార్జ్​ని రద్దు చేసుకోవచ్చు.

ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్​- వాలిడిటీ, ఇతర వివరాలు..

ఈ ఫ్యూయెల్​ పాయింట్స్​ వాలిడిటీ గరిష్ఠంగా 2ఏళ్లు.

ఐఓసీఎల్​ ఔట్​లెట్స్​ వద్ద ఈ ఫ్యూయెల్​ పాయింట్స్​ని రిడీమ్​ చేసుకోవచ్చు. 1 ఫ్యుయెల్​ పాయింట్​ అంటే రూ. 96 పైసలు.

లేదా నెట్​బ్యాంకింగ్​, క్యాష్​బ్యాక్​ రూపంలో కూడా రిడీమ్​ చేసుకోవచ్చు. కానీ వీటి వాల్యూ వేరువేరుగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
ఇండియన్​ ఆయిల్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు ఎలిజిబిలిటీ..

సాలరీ పొందుతున్న భారతీయులకు- వయస్సు 21 నుంచి 60ఏళ్ల మధ్యలో ఉండాలి. నెలవారీ జీతం రూ. 12వేలు కన్నా ఎక్కువ ఉండాలి.

వ్యాపారులకు- వయస్సు 21 నుంచి 65 మధ్యలో ఉండాలి. వార్షిక ఆదాయం 6 లక్షల కన్నా ఎక్కువగా ఉండాలి.
ఫీజు- ఇతర ఛార్జీలు..

జాయినింగ్​/ రెన్యువల్​ మెంబర్​షిప్​ ఫీజు- రూ. 500 ప్లస్​ ట్యాక్స్​.

వన్​ప్లస్​ లవర్స్​కి గుడ్​ న్యూస్​! ఇక నుంచి ఆఫ్​లైన్​లో కూడా సేల్స్​.

వన్​ప్లస్​ గ్యాడ్జెట్స్​ ఇక నుంచి ఆఫ్​లైన్​ స్టోర్స్​లో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నట్టు సౌత్​ ఇండియన్​ ఆర్గనైజ్​డ్​ రీటైలర్స్​ అసోసియేషన్​ (ఓఆర్​ఏ) ప్రకటించింది.

వన్​ప్లస్​ లవర్స్​కి గుడ్​ న్యూస్​! దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వన్​ప్లస్​- సౌత్​ ఇండియన్​ ఆర్గనైజ్​డ్​ రీటైలర్స్​ అసోసియేషన్​ (ఓఆర్​ఏ) మధ్య ఉన్న వివాదాలు తొలగిపోయాయి. లో- మార్జిన్​ సహా తమ మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకున్నట్టు ఓఆర్​ఏ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది.

“నిర్మాణాత్మక చర్చలు, పరస్పర సహకారంతో ఇప్పటివరకు పెండింగ్​లో ఉన్న సమస్యలను మేము పరిష్కరించుకున్నాము. ఫలితంగా వన్​ప్లస్​తో తాత్కాలికంగా ఉన్న సమస్యలు తొలగిపోయాయి. వన్​ప్లస్​ సంస్థతో కొలాబొరేషన్​ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నాము,” అని ఆర్గనైజ్​డ్​ రీటైలర్స్​ అసోసియేషన్​ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఈ నిర్ణయం అక్టోబర్​ 1 నుంచే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది.

తాజా పరిణామాల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఓఆర్​ఏ సభ్యులు ఇక నుంచి వన్​ప్లస్​ ప్రాడక్ట్స్​ని కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్​ చేసుకోవచ్చు. కస్టమర్లు ఓఆర్​ఏ నెట్​వర్క్​ ద్వారా వన్​ప్లస్​ గ్యాడ్జెట్స్​ని కొనుగోలు చేసుకోవచ్చు.

పండగ సీజన్​ సమయంలో రీటైలై స్టోర్స్​లో వన్​ప్లస్​ సేల్స్​ రీస్టార్ట్​ అవుతుండటం వ్యాపారులకు, కస్టమర్స్​కి మంచి విషయంగా భావిస్తున్నారు. ఇది కస్టమర్స్​కి, రీటైలర్లకు, వన్​ప్లస్​ పార్ట్​నర్స్​కి భారీగా లబ్ధిచేకూరుస్తుందని ఓఆర్​ఏ ఆశాభావం వ్యక్తం చేసింది.

” మా సభ్యులు, కస్టమర్స్​కి సేవలందించేందుకు, మా పార్ట్​న​ర్స్​తో బంధం బలోపేతం చేసుకునేందుకు ఓఆర్​ఏ నిత్యం కృషిచేస్తుంది. వన్​ప్లస్​తో బంధం మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాము,” అని సౌత్​ ఇండియన్​ ఆర్గనైజ్​డ్​ రీటైలర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ టీ.ఎస్​ శ్రీధర తెలిపారు.
ఇదీ సమస్య..

వన్​ప్లస్ ప్రాడక్ట్స్​​ ఆఫ్​లైన్​ సేల్స్​ని బహిష్కరించాలని ఈ ఏడాది తొలినాళ్లల్లో ఓఆర్​ఏ కీలక నిర్ణయం తీసుకుంది. మార్జిన్లు తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. సర్వీస్​ క్లెయిమ్స్​, వారెంటీలను వన్​ప్లస్​ సంస్థ ఆలస్యం చేస్తుండటం కూడా ఓఆర్​ఏకి నచ్చలేదు.

దేశవ్యాప్తంగా ఉన్న 4500 స్టోర్స్​లో వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్స్​, వాచ్​లు ఇతర గ్యాడ్జెట్స్​ సేల్స్​ని 2024 మే 1 నుంచి నిలిపివేస్తున్నట్టు ఓఆర్​ఏ గతంలో ప్రకటించింది. ఈ స్టోర్స్​ ఇవి ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటకలో అధికంగా ఉన్నాయి.

ఏడాది కాలంగా ప్రత్యేకంగా వన్​ప్లస్​ ప్రాడక్ట్స్​తో సమస్యలు ఎదురుతున్నాయని ఓఆర్​ఏ గతంలో వెల్లడించింది. సమస్యలను పరిష్కరించేందుకు వన్​ప్లస్​ ముందుకు రావడం లేదని, అందుకే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

రీటైల్​ స్టోర్స్​లో వన్​ప్లస్​ ప్రాడక్ట్స్​ లభించకపోవడంతో చాలా మంది అమెజాన్​ వంటి ఈ-కామర్స్​ సైట్లలో కొనుగోళ్లు చేసుకోవాల్సి వచ్చింది.

పర్సనల్​ లోన్​ తీసుకుని ఈఎంఐలు కట్టకపోతే?

పర్సనల్​ లోన్​ తీసుకుని సమయానికి వడ్డీ కట్టకపోతే ఏమవుతుంది? ఇలా జరిగితే కలిగే ఆర్థిక సమస్యలేంటి? వీటి నుంచి ఎలా బయటపడాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్థిక అవసరాల కోసం చాలా మంది పర్సనల్​ లోన్స్​ తీసుకుంటూ ఉంటారు. వీటి మీద ఆధిక వడ్డీ ఉన్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో లోన్​ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే, పర్సనల్​ లోన్​ తీసుకున్న తర్వాత నెలవారీ ఈఎంఐలు (ఈక్వేటెడ్​ మంత్లీ ఇన్​స్టాలేషన్స్​) కట్టకపోతే ఏమవుతుంది? మన మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది? ఇలా అవ్వకుండా ఏం చేయాలి?

లోన్​ డీఫాల్ట్​ క్లాసిఫికేషన్​..

మేజర్​ డీఫాల్ట్​: రుణగ్రహీత 90 రోజులకు మించి చెల్లింపులు చేయడంలో విఫలమైనప్పుడు ఇలా జరుగుతుంది. నిరర్థక ఆస్తులు (ఎన్​పీఏ)గా వర్గీకరించిన రుణాలు ఉంటే మరిన్ని లోన్స్​ పొందడం కష్టమవుతుంది.
మైనర్​ డిఫాల్ట్​: 90 రోజుల కంటే తక్కువ కాలంలో ఈఎంఐలు కట్టకపోతే దాన్ని మైనర్​ డీఫాల్ట్​ అంటారు. అవి మీ క్రెడిట్ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేసినప్పటికీ, చిన్న డిఫాల్ట్​ల నుంచి కోలుకోవడం తరచుగా సాధ్యమే!

పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లింపులు మిస్ కావడం వల్ల కలిగే ప్రభావాలు..

క్రెడిట్ స్కోర్ ప్రభావం: ఈఎంఐ పేమెంట్ మిస్ కావడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ గణనీయంగా తగ్గుతుంది. చాలా మంది రుణదాతలకు సిబిల్ స్కోరు 750 లేదా అంతకంటే ఎక్కువ అవసరం ఉంటుంది. ఒక్కసారి చెల్లింపు మిస్​ అయినా మీ స్కోరును 50 నుంచి 70 పాయింట్లు తగ్గిపోతాయి.
క్రెడిట్ అర్హత: క్రెడిట్ స్కోర్​కి మించి, మీ రీపేమెంట్ హిస్టరీ మీ క్రెడిట్ రిపోర్ట్స్​లో కీలక పాత్ర పోషిస్తుంది. తప్పిపోయిన చెల్లింపుల గురించి ప్రతికూల స్టేట్​మెంట్స్​ ఉంటే రుణదాతలు మిమ్మల్ని నెగిటివ్​గా చూస్తారు. ఇది భవిష్యత్తు రుణాలను సురక్షితంగా ఉంచడం సవాలుగా చేస్తుంది.
ఆలస్య రుసుము, జరిమానాలు: చాలా బ్యాంకులు మిస్డ్​​ ఇన్​స్టాల్​మెంట్​కి ఆలస్య రుసుమును విధిస్తాయి. ఇది మీ ఆర్థిక భారాన్ని పెంచుతుంది.
రికవరీ ఏజెంట్లు: మీ చెల్లింపులు 90 రోజుల కంటే ఎక్కువ గడువు దాటితే, బ్యాంకులు బాకీ ఉన్న మొత్తాన్ని సేకరించడానికి రికవరీ ఏజెంట్లను నియమించవచ్చు. సాధారణంగా, రుణగ్రహీతలు తమ ఖాతాను నిరర్థకంగా గుర్తించడానికి ముందు 60 రోజుల నోటీసును అందుకుంటారు.

లోన్​ డిఫాల్ట్​లను నివారించడానికి వ్యూహాలు

డిఫాల్ట్ ప్రమాదాన్ని తగ్గించడానికి, ఈ కింది వ్యూహాలను పరిగణించండి:

మీ ఫైనాన్స్ ప్లాన్ చేసుకోండి: సమర్థవంతమైన బడ్జెట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మిస్డ్​ పేమెంట్స్ సంభావ్యతను తగ్గిస్తుంది.
తక్కువ ఈఎంఐ రిక్వెస్ట్ చేయండి: మీ ఈఎంఐ బాధ్యతలను తీర్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయని మీరు భావిస్తే, మీ బ్యాంకును సంప్రదించండి. రుణ కాలపరిమితిని పొడిగించడం లేదా అన్ సెక్యూర్డ్ రుణాన్ని సెక్యూర్డ్ రుణంగా మార్చడం వంటి పరిష్కారాలను వారు అందించవచ్చు.
పాక్షిక చెల్లింపులు చేయండి: పాక్షిక చెల్లింపులు చేయడం వల్ల మీ ఈఎంఐ భారం, వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఈ క్రియాశీల విధానం రుణ కాలపరిమితి అంతటా మీ చెల్లింపులను నిర్వహించగలదని నిర్ధారిస్తుంది.
ఈఎంఐ రహిత వ్యవధిని అభ్యర్థించండి: తాత్కాలిక ఆదాయ అంతరాయం ఉన్న సందర్భాల్లో, ఈఎంఐ చెల్లింపుల కోసం గ్రేస్ పీరియడ్​ని అభ్యర్థించడానికి మీ రుణదాతను సంప్రదించండి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా బ్యాంకులు మూడు నుంచి ఆరు నెలల వరకు ఉపశమనం కల్పిస్తున్నాయి.
మీ రుణదాతతో కమ్యూనికేట్ చేయండి: మీ ఆర్థిక పరిస్థితి గురించి మీ రుణదాతతో బహిరంగ సంభాషణ పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలకు దారితీస్తుంది. కొన్ని సంస్థలు కఠినమైన సమయాల్లో మీకు సహాయపడే సరళమైన తిరిగి చెల్లింపు ఎంపికలను అందిస్తాయి.
రీఫైనాన్సింగ్ పరిగణించండి: మీ రుణాన్ని రీఫైనాన్సింగ్ చేయడం వల్ల మీ నెలవారీ ఈఎంఐలు తగ్గుతాయి. అయినప్పటికీ రుణదాతలకు సాధారణంగా ఈ ఎంపికకు మంచి క్రెడిట్ స్కోరు అవసరం.

భారతీయ ఉద్యోగులకు ఈ దేశంలో భారీ డిమాండ్​- వెళితే జీవితం మారిపోతుంది!

హెల్త్ కేర్, ఐటీ, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో క్లిష్టమైన లేబర్ కొరతను తీర్చడానికి భారతీయ ఉద్యోగులను జర్మనీ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో 30 కొత్త కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది.

హెల్త్ కేర్, ఐటీ, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో క్లిష్టమైన కార్మిక కొరతను తీర్చడానికి భారతీయ ఉద్యోగులను ఆకర్షించాలని జర్మనీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ మంత్రివర్గం 30 కొత్త కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. జర్మనీని ఆకర్షణీయ గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి స్కోల్జ్, కార్మిక మంత్రి హ్యూబెర్టస్ హీల్, ఇతర ప్రభుత్వ ప్రతినిధులు వచ్చే వారం భారతదేశానికి రానున్నారు.

కెనడా, యూకే, న్యూజిలాండ్ వంటి దేశాలు వలసదారులకు తలుపులు మూసేస్తున్న తరుణంలో జర్మనీ నుంచి ఇలాంటి వార్తలు అందడం భారతీయులకు నిజంగా మంచి విషయమే.
భారతీయ కార్మికులను ఆకర్షించడానికి జర్మనీ ఎందుకు ప్రయత్నిస్తోంది?

జర్మనీ ప్రస్తుతం వృద్ధాప్య జనాభా, అర్హత కలిగిన కార్మికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. ఇటు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారతదేశం శ్రామిక శక్తిలోకి పెద్ద సంఖ్యలో యువకులను కలిగి ఉంది. ఇంతకాలం భారత దేశీయ కార్మిక మార్కెట్ పెరుగుతున్న శ్రామిక శక్తిని అందిపుచ్చుకోలేక పోవడం, తగినంత కొత్త కార్మికులు లేకపోవడంతో జర్మనీ చాలా సమస్యలు చూసింది. వీటికి చెక్​ పెట్టేందుకు ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఒక భారతీయ ప్రొఫెషనల్ జర్మనీలో ఎలాంటి పనులు చేసే అవకాశం ఉంది?

భారతీయ ప్రతిభావంతులను ఆకర్షించడానికి జర్మనీ చూస్తున్న మూడు ప్రధాన రంగాలు.. ఆరోగ్య సంరక్షణ, ఐటి, ఇంజనీరింగ్
జర్మనీలో పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

ఫుల్​ టైమ్​ భారతీయ ఉద్యోగులకు జర్మనీ సగటు స్థూల నెలసరి వేతనం సుమారు 5,400 యూరోలు. అంటే సుమారు రూ.4,92,037. ఇది మొత్తం మీద ఫుల్ టైమ్ ఉద్యోగుల సగటు వేతనం కంటే 41% ఎక్కువ.

జర్మనీ సాపేక్షంగా తక్కువ జీవన ఖర్చులకు ప్రసిద్ధి చెందింది! దీని ప్రకారం విశ్వవిద్యాలయ గృహనిర్మాణం సాధారణంగా నెలకు 200 నుండి 350 యూరోల వరకు ఖర్చు అవుతుంది. భాగస్వామ్య ప్రైవేట్ గదుల ఖర్చు 300- 650 యూరోల మధ్య, ప్రైవేట్ సింగిల్ గదుల ఖర్చు 450 నుంచి 750 యూరోల మధ్య, స్టూడియో అపార్ట్మెంట్లు 800 నుంచి 1,400 మధ్య ఖర్చు అవుతాయి.

యుటిలిటీస్, ఆహారం సాధారణంగా 200 నుంచి 350 మధ్య ఖర్చు అవుతాయి! రవాణా, ఇతర ఇతర ఖర్చులు 50 నుంచి 100 మధ్య ఉంటాయి.

ఫ్యామిలీ రీయూనిఫికేషన్​ పాలసీల కారణంగా భారతీయ కార్మికులు తమ కుటుంబాలను కూడా తీసుకురావచ్చు.
భారతీయ ప్రతిభావంతులకు మద్దతు ఇవ్వడానికి జర్మనీ ఇప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలను ప్రకటించింది?

వీసా సరళీకరణ: జర్మనీ 2024 చివరి నాటికి డిజిటల్ వీసాను ప్రవేశపెట్టనుంది. ఇది దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

అర్హత గుర్తింపు: అర్హతలను గుర్తించే ప్రక్రియ, ముఖ్యంగా మెడికల్, టెక్నికల్ రోల్స్ విషయానికి వస్తే క్రమబద్ధీకరించడం జరుగుతుంది.

కల్చరల్ అండ్ వర్క్ ప్లేస్ ఇంటిగ్రేషన్: జర్మనీలో జీవితానికి అలవాటు పడేందుకు కార్మికులకు ప్రభుత్వం కల్చరల్ ఇంటిగ్రేషన్ ట్రైనింగ్ ఇవ్వనుంది.

అప్ స్కిల్ అవకాశాలు: వీటన్నింటితో పాటు ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయ కార్మికులకు అప్ స్కిల్ అవకాశాలను కల్పించడం, భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా మద్దతు ఇవ్వడంపై జర్మనీ దృష్టి సారించింది.

జాబ్ మేళా: జర్మన్ ప్రభుత్వం భారతదేశంలో జాబ్ మేళాలను నిర్వహిస్తుంది. ఇది భారతీయ కార్మికులకు భావి జర్మన్ యజమానులకు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది.

ఈ మోస్ట్​ అఫార్డిబుల్​ ఫ్యామిలీ ఈవీపై మరింత డిస్కౌంట్​.. రేంజ్​ సూపర్

తక్కువ ధరకే మంచి రేంజ్​ ఇచ్చే ఎలక్ట్రిక్​ కారును కొనాలని ప్లాన్​ చేస్తుంటే ఇదే రైట్​ టైమ్​! ఇండియాలో మోస్ట్​ అఫార్డిబుల్​ ఈవీల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న టాటా టియాగో ఈవీలపై సంస్థ డిస్కౌంట్స్​ని ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఇండియాలో మోస్ట్​ అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ కార్లలో ఒకటిగా ఉంది టాటా టియాగో ఈవీ. ఇప్పుడు పండగ సీజన్​ నేపథ్యంలో, ఈ ఈవీపై టాటా సంస్థ భారీ డిస్కౌంట్​ని ప్రకటించింది. కస్టమర్లు ఈ ఈవీపై రూ. 75వేల వరకు బెనిఫిట్స్​ని పొందొచ్చు. అంతేకాదు టాటా పవర్​ స్టేషన్స్​లో 6 నెలల ఉచిత ఛార్జింగ్​ ప్రయోజనాలను కూడా ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ కారు వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా టియాగో ఈవీ బ్యాటరీ ప్యాక్..

టాటా టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ సైజుల్లో లభిస్తుంది. ఇందులో 19.2 కిలోవాట్ల యూనిట్, 24 కిలోవాట్ల యూనిట్ ఉన్నాయి. రెండు యూనిట్లు లిక్విడ్-కూల్డ్, మల్టీ-మోడ్ రీజనరేటివ్​ బ్రేకింగ్ సిస్టెమ్​ని కలిగి ఉన్నాయి. 0 నో రెజిన్​తో పాటు 3 మ్యాక్స్​ రెజిన్ కలుపుకుని మొత్తం నాలుగు లెవల్స్ ఉన్నాయి.
టాటా టియాగో ఈవి రేంజ్​ ఎంత?

టాటా టియాగో ఈవీ మీడియం రేంజ్ వేరియంట్లు 221 కిలోమీటర్ల పరిధిని ఇస్తున్నాయి. లాంగ్ రేంజ్ వేరియంట్లు 275 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్నాయి.

టాటా టియాగో ఈవీ కలర ఆప్షన్స్​?

టియాగో ఈవీ ఐదు రంగుల్లో లభిస్తుంది. సిగ్నేచర్ టీల్ బ్లూ, డేటోనా గ్రే, ట్రాపికల్ మిస్ట్, ప్రిస్టీన్ వైట్, మిడ్​నైట్ ప్లమ్ ఉన్నాయి.
టాటా టియాగో ఈవీపై వారంటీ ఎంత?

టియాగో ఈవీలో బ్యాటరీ ప్యాక్, మోటార్ వారంటీ 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్లు. వాహనంపై 3 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ ఉంటుంది.

టియాగో ఈవీ యాక్సిలరేషన్ టైమ్​ ఎంత?

మీడియం రేంజ్ కలిగిన టియాగో ఈవీ.. 6.2 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లాంగ్ రేంజ్ వెర్షన్ 5.7 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
టియాగో ఈవీ పవర్, టార్క్ గణాంకాలు ఏంటి?

ఈ ఎలక్ట్రిక్​ కారు మీడియం రేంజ్ వేరియంట్లు 60బీహెచ్​పీ పవర్, 110ఎన్ఎమ్ పవర్ అవుట్​పుట్​ని కలిగి ఉండగా, లాంగ్ రేంజ్ వేరియంట్లు 73బీహెచ్​పీ పవర్, 114ఎన్ఎమ్ పవర్ అవుట్​పుట్​ను జనరేట్​ చేస్తాయి.
టాటా టియాగో ఈవీపై బెనిఫిట్స్​ ఎప్పటివరకు ఉంటాయి?

టాటా టియాగో ఈవీపై ఆఫర్స్​, డిస్కౌంట్స్​తో పాటు ఇతర వివరాల గురించి మరిన్ని వివరాలను పొందడానికి, ఆసక్తి గల కస్టమర్లు సమీప డీలర్​షిప్​ షోరూమ్స్​ని సందర్శించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రయోజనాలు అక్టోబర్ 31తో ముగుస్తాయని గమనించాలి.

ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో మంచి పోటీ నెలకొంది. ఫలితంగా ధరలు కూడా దిగొస్తున్నాయి. ఎంజీ కామెట్​ ఈవీకి టాటా టియాగో ఈవీ గట్టిపోటీనిస్తోంది. ఇక పండగ సీజన్​ నేపథ్యంలో ఇప్పటికే చౌకైన ఈవీగా ఉన్న ఈ మోడల్​.. మరింత తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం! ఫ్యామిలీలకు ఇది బాగా సూట్​ అవుతుంది.

ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు – దరఖాస్తులకు అక్టోబర్ 21 ఆఖ‌రు తేదీ

ప్ర‌కాశం జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో కాంట్రాక్టు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీలోపు అప్లికేషన్లు పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు.

ప్ర‌కాశం జిల్లా ప‌రిధిలోని మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికార‌త అధికారి కార్యాల‌యం, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాల‌యాల్లో ఖాళీగా ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు అక్టోబ‌ర్ 21 ఆఖ‌రు తేదీ. ఆస‌క్తి గ‌ల వారు నిర్ణీత స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాల‌ని జిల్లా అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

ప్ర‌కాశం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలోని ఖాళీగా ఉన్నఎనిమిది ఉద్యోగాల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను కాంట్రాక్టు ప‌ద్ద‌తిలో భ‌ర్తీ చేస్తున్నామ‌ని తెలిపారు. ప‌నితీరు ఆధారంగా వారి స‌ర్వీసును కొన‌సాగిస్తామ‌ని పేర్కొన్నారు.

ఇందులో అర్హులైన అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి నియామ‌కం జ‌రుపుతారు. ఈ ఉద్యోగాల‌కు ఎటువంటి రాత ప‌రీక్ష ఉండ‌దు. అయితే ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగానికి మాత్రం కంప్యూట‌ర్ ప‌రీక్ష నిర్వ‌హించి ప్ర‌తిభ ఆధారంగా నియామం చేస్తారు.

ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s3f3f27a324736617f20abbf2ffd806f6d/uploads/2024/10/2024100935.pdf ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేయాలి. అనంత‌రం సంబంధిత స‌ర్టిఫికేట్ల‌ను జ‌త‌చేసి, అక్టోబ‌ర్ 21 సాయంత్రం 5 గంట‌ల లోపు ప్ర‌కాశం జిల్లా మ‌హిళ‌, శిశు సంక్షేమ, సాధికారిత అధికారిణి కార్యాల‌యం, ఒంగోలులో అంద‌జేయాలి.
పోస్టుల వివరాలు…

మొత్తం 8 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. సైకో సోష‌ల్ కౌన్సిల‌ర్-1, కేస్ వ‌ర్క‌ర్-1, పారా మెడిక‌ల్ ప‌ర్స‌న‌ల్-1, ఆఫీస్ అసిస్టెంట్ (కంప్యూట‌ర్ పరిజ్ఞానం)-1, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్‌-1, మ‌ల్టీ ప‌ర్ప‌స్ స్టాప్‌-3 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. నెల‌కు సైకో సోష‌ల్ కౌన్సిల‌ర్‌కు రూ.20,000, కేస్ వ‌ర్క‌ర్‌కు రూ.19,500, పారా మెడిక‌ల్ ప‌ర్స‌న‌ల్‌కి రూ.19,000, ఆఫీస్ అసిస్టెంట్‌కు రూ. 19,000, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్‌కు రూ.15,000, మ‌ల్టీప‌ర్ప‌స్ స్టాప్‌కు రూ.13,000 వేత‌నం ఉంటుంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసే అభ్య‌ర్థుల వ‌యో ప‌రిమితి 2024 జులై 1 నాటికి 25 నుండి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది.

సైకో కౌన్సెల‌ర్ (మ‌హిళ‌-1) : సోష‌ల్ కౌన్సెల‌ర్‌కు వేత‌నం నెల‌కు రూ.20,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. సైకాల‌జీ, న్యూరోసైన్స్ లో ప్రొఫెస‌న‌ల్ డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి. మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ హెల్త్ ప్రాజెక్టుల్లో మూడేళ్ల‌ అనుభ‌వం ఉండాలి.

కేస్ వ‌ర్క‌ర్‌ (1) : కేస్ వ‌ర్క‌ర్‌ వేత‌నం నెల‌కు రూ.19,500 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. లా, సోష‌ల్ వ‌ర్క్‌, సోషియాల‌జీ, సైకాల‌జీ, సోష‌ల్ సైన్స్‌లో డిగ్రీ చేయాలి. క‌నీసం మూడేళ్ల‌ అనుభవం ఉండాలి.

పారా మెడిక‌ల్ ప‌ర్స‌న‌ల్ (మ‌హిళ‌-1) : పారా మెడిక‌ల్ ప‌ర్స‌న‌ల్‌కు వేత‌నం నెల‌కు రూ.19,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. పారా మెడిక‌ల్‌లో ప్రొఫెస‌న‌ల్ డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి. మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ హెల్త్ ప్రాజెక్టుల్లో మూడేళ్ల‌ అనుభ‌వం ఉండాలి.

ఆఫీస్ అసిస్టెంట్ (మ‌హిళ-1) : ఆఫీస్ అసిస్టెంట్‌కు నెల‌కు వేత‌నం రూ.19,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. దీనికి అర్హ‌త డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీల్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. డేటా మేనేజ్‌మెంట్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

సెక్యూరిటీ, నైట్‌ గార్డులు (మ‌హిళ‌-1) : సెక్యూరిటీ, నైట్‌ గార్డుల వేత‌నం నెల‌కు రూ.15,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. సెక్యూరిటీగా రెండేళ్ల అనుభవం ఉండాలి.

మ‌ల్టీ ప‌ర్ప‌స్ స్టాఫ్ (మ‌హిళ‌-3) : మ‌ల్టీ ప‌ర్ప‌స్ స్టాఫ్‌కు నెల‌కు వేత‌నం రూ.13,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. హైస్కూల్ పాస్ ఉండాలి. ప‌రిజ్ఞానం, అనుభ‌వం ఉండాలి.

నేడు శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల – ఈనెల 24న రూ. 300 టికెట్ల కోటా జారీ

ఇవాళ తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 24న జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అందుబాటలోకి తెస్తారు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఇవాళ(అక్టోబర్ 19) ఆర్జిత సేవల కోటాను విడుదల కానుంది. వీటిలో కొన్నింటిని ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ కోటా కింద… అక్టోబర్ 21న అందుబాటులోకి తీసుకువస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాలి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ.. ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబరు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

అక్టోబర్ 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
22న వర్చువల్ సేవల కోటా విడుదల : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబరు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అక్టోబరు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు: జనవరి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా : శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను అక్టోబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.
స్పెషల్​ దర్శనం రూ.300 టికెట్లు : అక్టోబర్ 24న జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అందుబాటలోకి తెస్తారు.
తిరుమల, తిరుపతిల‌లో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు:

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఆయన అధికారులతో కలిసి అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధులు, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలం, ఘంటసాల సర్కిల్ , హైస్కూల్ పరిసరాలు, పసుపు మండపం, పూడిరోడ్డు తదితర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ… బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన పంచమి తీర్థం నాడు విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, రేణిగుంట, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు.

భక్తులు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, గోశాల(పూడి రోడ్డు) వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేయాలన్నారు.

ఏపీఎస్డీపీఎస్ లో 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, నెలకు వేతనం రూ.2.5 లక్షలు వరకు!

ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్టు మేనేజర్ పోస్టులకు నెలకు గరిష్టంగా రూ.2 లక్షల నుంచి 2.5 లక్షల జీతం ఉంటుంది.

ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రాజెక్టు మేనేజర్ పోస్టులకు నెలకు గరిష్టంగా రూ.2 లక్షల నుంచి 2.5 లక్షల జీతం ఉంటుంది.

విజయవాడలోని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీఎస్డీపీఎస్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రాజెక్టులో ఏడాది పాటు పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్ 29 లోపు అధికారిక వెబ్ సైట్ http://www.apsdps.ap.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 16న నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హతలు

అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/బీఎస్సీ (కంప్యూటర్స్‌), పీజీ లేదా డాక్టరేట్ (పబ్లిక్ పాలసీ/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ఎకనామిక్స్‌/ ఇంజినీరింగ్/ డెవలప్మెంట్ స్టడీస్) ఉత్తీర్ణత సాధించాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి.
పోస్టుల వివరాలు

1. ప్రోగ్రామ్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్- 04 పోస్టులు

2. కన్సల్టెంట్/ రీసెర్చ్ అసోసియేట్స్‌ – 08 పోస్టులు

3. డేటాబేస్ డెవలపర్- 01 పోస్టు

4.మొత్తం ఖాళీలు – 13
జీతం, వయోపరిమితి, ఇతర వివరాలు

ప్రాజెక్టు మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 01-01-2025 నాటికి 55 ఏళ్లు మించకూడదు. అలాగే డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు, కన్సల్టెంట్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలు, కన్సల్టెంట్ పోస్టులకు రూ.75 నెల నుంచి రూ.1.5 లక్షలు, డేటాబేస్ డెవలపర్ పోస్టులకు రూ.45 వేల నుంచి రూ.75 వేల జీతం ఇస్తారు. అకడమిక్ క్వాలిఫికేషన్, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికే చేస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Step 1 : దరఖాస్తుదారులు ఏపీఎస్డీపీఎస్ అధికారిక వెబ్ సైట్ http://apsdps.ap.gov.in/ పై క్లిక్ చేయాలి.

Step 2 : హోంపేజీలో జాబ్ నోటిఫికేషన్ అప్లై ఆన్ లైన్ పై క్లిక్ చేస్తే వెబ్ పోర్టల్ https://apsdpscareers.com/ డైరెక్ట్ అవుతారు.

Step 3 : అభ్యర్థి అర్హత అనుగుణంగా తగిన పోస్టులకు వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.

Step 4 : అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, గత అనుభవం, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి.

Step 5 : పూర్తి వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

అమరావతి పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ

అమరావతిలో రాజధాని పనులు సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. శనివారం తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద సీఆర్‌డీఏ ఆఫీసు పనులను ప్రారంభించారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూల్ ను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడడంతో అమరావతి రాజధాని మళ్లీ ఊపిరిపోసుకుంది. వైసీపీ హయాంలో మూడు రాజధానులు ప్రకటించడంతో…అమరావతి రైతులు సుదీర్ఘ పోరాటం చేశారు. 2024లో కూటమి పార్టీలు అధికారంలోకి రావడంతో… అమరావతి రైతుల పోరాటం ఫలించినట్లైంది. అయితే గత ఐదేళ్లుగా అమరావతి పనులు ఆగిపోవడంతో…రాజధాని ప్రాంతం జంగిల్ గా మారింది. దీంతో కొత్త ప్రభుత్వం ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టింది. ఇటీవల ఈ పనులు పూర్తిచేసింది. తాజాగా అమరావతిలో పనులు పునః ప్రారంభం అయ్యాయి.

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు శనివారం పునఃప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద సీఆర్‌డీఏ ఆఫీసు పనులను ప్రారంభించారు. సీఆర్డీఏ భవన ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పూజలు నిర్వహించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.160 కోట్లతో ఏడంతస్తులు సీఆర్‌డీఏ ఆఫీసు పనులు చేపట్టారు. 2017లో ఈ పనులు ప్రారంభం కాగా… వైసీపీ పాలనలో పనులు ముందుకుసాగలేదు. మొత్తం 3.62 ఎకరాల్లో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ నగరాన్ని తీర్చిదిద్దామన్నారు. అప్పట్లోనే సైబరాబాద్‌లో 8 వరుసల రోడ్లు నిర్మాంచామన్నారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు 5 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడే వారు ప్రతిచోటా ఉంటారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతి రైతులను ఒప్పించి, రాజధాని కోసం 54 వేల ఎకరాలు సేకరించామన్నారు.
విశాఖ ఆర్థిక రాజధాని

అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఆర్డీఏ ఆఫీస్ ది బెస్ట్ గా ఉండాలన్నారు.

“అమరావతి మునిగిందని జగన్ ఫేక్ ప్రచారం చేశారు. చివరకు నిన్న వచ్చిన బెంగుళూరు వరదల్లో, ఆయన కట్టుకున్న యలహంకా ప్యాలెస్ మునిగిపోయింది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే. ఒకరు నాశనం అవ్వాలని కోరుకుంటే, మనమే నాశనం అవుతాం, గుర్తుపెట్టుకో జగన్. గడిచిన 5 ఏళ్లలో, జగన్ అందరికంటే ఎక్కువ బాధ పెట్టింది, అమరావతి మహిళలని. వైసీపీపై రాణి రుద్రమదేవి కంటే ఎక్కువ పౌరుషంగా మహిళా రైతులు పోరాడారు” -సీఎం చంద్రబాబు

త్వరలో ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్‌, ఆర్‌సీలు.. ప్రయోజనాలేంటి?

ఎలక్ట్రానిక్ కార్డులు ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దీని కింద దరఖాస్తుదారులు ఆధార్ కార్డ్ ప్రింట్ చేసినట్లుగా పత్రాలను స్వయంగా ముద్రించుకోవచ్చు. ఈ కార్డ్‌లకు ప్రత్యేకమైన ID, QR కోడ్ ఉంటాయి. వీటిని ట్రాఫిక్ పోలీసులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఉపయోగిస్తారు..

స్మార్ట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు (డీఎల్), వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల (ఆర్‌సీ) స్థానంలో ఎలక్ట్రానిక్ కార్డులను ప్రవేశపెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. నివేదికల ప్రకారం, ఈ కొత్త కార్డులను ఆధార్ కార్డు వలె జారీ చేసే అవకాశం ఉంది. వాటిని ఉపయోగించడం సులభం అవుతుంది.

ప్రయోజనాలు

ఢిల్లీ రవాణా శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సమీక్షిస్తున్నారు. స్మార్ట్ కార్డ్ వ్యవస్థను డిజిటల్ రూపంలోకి మార్చడమే ఈ పథకం లక్ష్యం. వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ) పంపిణీలో జాప్యం జరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సౌకర్యవంతంగా ఎలక్ట్రానిక్ కార్డ్స్

ఎలక్ట్రానిక్ కార్డులు ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దీని కింద దరఖాస్తుదారులు ఆధార్ కార్డ్ ప్రింట్ చేసినట్లుగా పత్రాలను స్వయంగా ముద్రించుకోవచ్చు. ఈ కార్డ్‌లకు ప్రత్యేకమైన ID, QR కోడ్ ఉంటాయి. వీటిని ట్రాఫిక్ పోలీసులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఉపయోగిస్తారు. రవాణా శాఖ అధికారి ప్రకారం, ఈ ఎలక్ట్రానిక్ పత్రాలను డిజిలాకర్ లేదా mParivahan యాప్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. దీనితో ప్రజలు తమ పత్రాలను చూపించడంలో ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోరు. అలాగే ఈ పని చాలా సులభం అవుతుంది. అయితే రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గతేడాది జారీ చేసిన లైసెన్స్‌లు, ఆర్‌సీలు లక్షల్లో..

2023- 2024 మధ్య, ఢిల్లీ రవాణా శాఖ మే వరకు 1.6 లక్షల డ్రైవింగ్ లైసెన్స్‌లు, 6.69 లక్షల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను జారీ చేసింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు మాత్రమే జారీ చేస్తారు.

డిజిటల్ ఆర్‌సీ వైపు అడుగులు:

డిజిటల్ ఆర్‌సి సౌకర్యాన్ని అధ్యయనం చేయాలని రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారులను ఆదేశించారు. ఢిల్లీ వాసులకు మెరుగైన సేవలందించేందుకు ఈ పథకం ఉద్దేశించి తీసుకువచ్చారు. దీని కింద క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫికేషన్ చేసుకునే సదుపాయం ఉన్న ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ పోర్టల్‌లో డాక్యుమెంట్ల పీఈఎఫ్‌ ఫార్మాట్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, సంబంధిత లింక్‌లు దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు అందుతాయి. తద్వారా వారు తమ పత్రాలను సులభంగా సేకరించవచ్చు.

ఆండ్రాయిడ్‌ 15 వచ్చిందోచ్‌..ఈ స్మార్ట్‌ ఫోన్‌లలో అప్‌డేట్‌

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ఆండ్రాయిడ్‌ 15 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్‌ 14 వెర్షన్‌ ఉండగా, ఇప్పుడు 15వ వెర్షన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఏయే ఫోన్‌లలో అండ్రాయిడ్‌ 15 వస్తుందో చూద్దాం..

ఆండ్రాయిడ్ 15 ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. దీని రాకపై కొంతకాలంగా చర్చ సాగింది. అయితే, ప్రస్తుతం ఇది Google Pixel మొబైల్‌లలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. Android 15తో వినియోగదారులు సెట్టింగ్‌ల యాప్ నుండి నేరుగా ఆర్కైవ్ చేయడం, పునరుద్ధరించడం చేయవచ్చు. ఈ సమయంలో అన్ని Android స్మార్ట్‌ఫోన్‌లకు Android 15 అందుబాటులో లేదు. కొన్ని Google Pixel స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్‌ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసింది. మీకు Google Pixel మొబైల్‌ లేకుంటే, Android 15 కోసం వేచి ఉన్నట్లయితే వేచి ఉండాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 త్వరలో అన్ని స్మార్ట్‌ ఫోన్‌లలో అందుబాటులోకి రానుంది. ఏయే స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగదారులు ఆండ్రాయిడ్ 15 సదుపాయాన్ని పొందబోతున్నారో చూద్దాం.

ఆకట్టుకుంటున్న ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్‌స్.. తగ్గేదేలే అంటున్న క్రీడాకారులు

భారతదేశంలోని అతిపెద్ద గ్రాస్‌రూట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA) ” ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్” ప్రచారం కోసం TV9 నెట్‌వర్క్‌తో జతకట్టింది.సాధారణ టాలెంట్ వేట కంటే, “ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్” దేశంలోని యువకులకు మరియు బాలికలకు (వయస్సు – 12 నుండి 14 మరియు 15 నుండి 17 సంవత్సరాలు) అవకాశాలను అందించడం ద్వారా భారతదేశంలో ఫుట్‌బాల్ సంస్కృతిని మార్చడంపైన వారు దృష్టి పెడుతున్నారు.

బుండెస్లిగా, DFB-Pokal, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్, IFI, BVB, RIESPO భాగస్వామ్యంతో ఈ మైలురాయి ఫుట్‌బాల్ ప్రోగ్రామ్ దేశంలోని ప్రతిభావంతులైన యువకులను అగ్రశ్రేణి స్కౌటింగ్ నెట్‌వర్క్ ద్వారా గుర్తించి, నిమగ్నం చేస్తుంది. లాట్ నుండి అత్యుత్తమమైనవి 2025 ప్రారంభంలో జర్మనీలో సత్కరించబడతాయి. News9 ద్వారా ఒక రకమైన టాలెంట్ హంట్ చొరవ యువ ఫుట్‌బాల్ స్టార్‌లకు పెద్ద వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించడానికి సరైన వేదికను అందిస్తుంది. SFA చాంపియన్‌షిప్స్ 2024 ద్వారా “ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్” చొరవతో అనుబంధించడానికి హైదరాబాద్‌లోని వేలాది మంది యువ ఔత్సాహికులకు SFAతో చారిత్రాత్మక అనుబంధం సువర్ణావకాశాన్ని ఇచ్చింది.

SFA ఛాంపియన్‌షిప్స్ 2024లో విపరీతమైన ఆసక్తిని ఆకర్షిస్తూ, “ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్” టాలెంట్ హంట్ హైదరాబాద్ పిల్లలలో భారీ విజయాన్ని సాధించింది. వారు అనేక వేదికలు, క్రీడా విభాగాలలో పాల్గొని ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ఇచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న SFA ఛాంపియన్‌షిప్‌ల మూడో రోజు బహుళ వేదికలు మరియు క్రీడా విభాగాల్లో ప్రతిభను ఉర్రూతలూగించింది. పల్లవి మోడల్ స్కూల్ మరియు బోడుప్పల్‌కు చెందిన క్రీడాకారులు ప్రొసీడింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించారు మరియు లీడర్‌బోర్డ్‌లో ప్రారంభ ముద్ర వేశారు. యూసుఫ్‌గూడలోని శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో, బాలుర అండర్-13 సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీలు 1, 2, మరియు 3 రౌండ్‌లలో తీవ్రమైన చర్యను చవిచూశాయి. అదే సమయంలో, U-16 లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఉత్కంఠ నెలకొంది. బాలికల ఫుట్‌బాల్ క్వార్టర్-ఫైనల్ సెమీ-ఫైనల్ స్థానాల కోసం జరిగిన పోరులో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను ప్రదర్శించింది. సాంప్రదాయ యోగాసనలో మియాపూర్‌లోని కానరీ ది స్కూల్‌కు చెందిన సమన్వి చలాది బాలికల అండర్-10 విభాగంలో స్వర్ణం గెలుపొందగా, బోడుప్పల్‌లోని పల్లవి మోడల్ స్కూల్‌కు చెందిన యశ్వంత్ రెడ్డి అండర్-14 బాలుర విభాగంలో టాప్ పోడియం ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్‌లోని 5 వేదికల్లో అక్టోబర్ 28 వరకు ఛాంపియన్‌షిప్‌లు కొనసాగుతాయి. ఛాంపియన్‌షిప్‌ల నుండి మ్యాచ్‌లను SFA అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న రవితేజ కూతురు

హిట్స్, ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా తెలుగులో వేగంగా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ఒకరు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయనలో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదని మాస్ మహారాజా సినిమాలు చూస్తే అర్థమవుతాయి. ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించిన రవితేజ ఇప్పుడు తన తర్వాతి సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు.

సినిమా షూటింగుల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న రవితేజ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు. జపాన్, బ్యాంకాక్ తదితర దేశాలు చుట్టి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి కాస్తా వైరలయ్యాయి. ఈ ఫొటోలో రవితేజ, ఆయన భార్య, కొడుకు, కూతురుతోపాటు మరికొందరు బంధువులు కనిపించారు. అయితే అందరి దృష్టి మాత్రం కూతురు మోక్షద భూపతి రాజుపైనే నిలిచింది. బయట పెద్దగా కనిపించని రవితేజ కూతురు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంటుంది. ఎంతో క్యూట్ గా కనిపించే మోక్షద సినిమాల్లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అయితే రవితేజ కూతురు హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా మారాలని నిర్ణయించుకుందట. తండ్రి బ్యానర్ అర్ టీ టీమ్ వర్క్స్ కాకుండా వేరే బ్యానర్ కూడా పెట్టబోతుందట. ఇందుకు రవితేజ కూడా ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

గీజర్ ఉపయోగిస్తున్నప్పుడు ఈ పొరపాట్లు చేయకండి.. పేలిపోయే ప్రమాదం!

ఎలక్ట్రిక్ గీజర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని తప్పులు సాధారణం. కానీ ఇవి తీవ్రమైన ప్రమాదాలకు కారణంగా కావచ్చు. ముఖ్యంగా పేలుళ్లు జరగవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

ఎక్కువ సేపు ఉంచవద్దు : గీజర్‌ని నిరంతరం రన్ చేయడం లేదా ఆఫ్ చేయడం మర్చిపోవడం చాలా ప్రమాదకరం. ఇది వేడెక్కడానికి కారణమవుతుంది. ఇది పేలుడుకు కారణం కావచ్చు. గీజర్ థర్మోస్టాట్ సరిగ్గా పని చేయాలి.

తద్వారా నీటి ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
సేఫ్టీ వాల్వ్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం : గీజర్ లోపల ఒత్తిడిని పెంచడానికి భద్రతా వాల్వ్ పని చేస్తుంది. ఈ వాల్వ్ సరిగ్గా పని చేయకపోతే, గీజర్ లోపల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పేలుడుకు దారి తీస్తుంది.
పాత గీజర్లు : గీజర్ పాతది లేదా ఏదైనా లోపాలు ఉంటే, వెంటనే దాన్ని మార్చండి లేదా మరమ్మత్తు చేయండి. పాత గీజర్‌లు లీకేజ్ లేదా థర్మోస్టాట్‌ సమస్య ఉంటే ఉన్నా ప్రమాదమే.

దీని వల్ల గీజర్ పేలిపోయే అవకాశం ఉంది.
గీజర్‌ను సరిగ్గా ఇన్‌స్టాల్ చేయండి : గీజర్‌ను సరిగ్గా ఇన్‌స్టాల్ చేయడం, సరైన ప్రొఫెషనల్‌ని ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇన్‌స్టాలేషన్‌ సరిగ్గా లేకుంటే గీజర్ నుండి నీటి లీకేజీ లేదా వేడెక్కడం సమస్యలను కలిగిస్తుంది. ఇది విద్యుత్ షాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే కొన్నిసార్లు గీజర్లు కూడా విస్ఫోటనం కావచ్చు. దీంతో నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది.

ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే అమలు చేసిన పథకాల్లో ఉచిత ఇసుక ఒకటి. స్థానిక అవసరాలకు రీచ్‌ల నుంచి ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లకు సైతం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మొన్నటి వరకు కేవలం ఎడ్డ బండ్లకు మాత్రమే అవాకశం ఉండేది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో ట్రాక్టర్లలో కూడా ఇసుకను తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కేవలం స్థానిక అవసరాల కోసం మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉత్వర్వుల్లో స్పష్టం చేశారు.

ఇందులో భాగంగానే.. ఇసుక పాలసీలో సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు ఇసుక కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ట్రాక్టర్లకు కూడా అనుమతులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇకపై రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేదన్న కారణంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోకూడదని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వుల్లో తెలిపారు.

గ్రామాల్లో అవసరాలకు సరిపడేంత మోతాదులో ఇసుక రవాణాకు అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని, అవసరమైనవారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలోనూ రవాణా చేసుకోవచ్చని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

విశాఖ ప్రజలకు అలెర్ట్. మోసగాళ్ల కళ్లన్నీ మీ నగరంపైనే

సైబర్‌ నేరగాళ్లకు విశాఖ ఒక ప్రయోగశాలగా మారింది. వారు చేసే అన్నిరకాల మోసాలను వైజాగ్‌ వాసులపైనే ప్రయోగిస్తున్నారు. తెలిసీతెలియక చాలామంది సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

హనీట్రాప్‌ కేసు విశాఖను కుదిపేస్తుంది. జమీనాను అడ్డుపెట్టుకుని పెద్దగ్యాంగ్ బాధితులను బెదిరించి డబ్బు వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. ప్రీప్లాన్డ్‌గా ట్రాప్‌ చేసి డబ్బు దోచేశారన్నారు.

విశాఖలో కాల్‌ సెంటర్ ఓపెన్‌ చేసిన చైనీస్‌ ముఠా

విశాఖలో కోట్లకు కోట్లు ఈజీ మనీ వస్తుంటే చైనా నుంచి పనిచేయడం ఏంటి అనుకున్నారో ఏమో.. ఏకంగా ఇక్కడే ఓ కాల్‌ సెంటర్‌నే తెరిచింది సైబర్ ముఠా. విశాఖ కేంద్రంగా స్టాక్ మార్కెటింగ్, ఫెడెక్స్, ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడింది. సీ స్మైల్ అపార్ట్‌మెంట్‌లో దాడులు చేసి ఫెడెక్స్ స్కామ్, ఆన్‌లైన్‌ మెసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేశారు పోలీసులు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా కాయ్‌ రాజా కాయ్‌ అంటూ ఆన్‌లైన్‌ బెట్టింగులకు పాల్పడి డబ్బును చైనా, తైవాన్‌కు చేరవేసినట్టు గుర్తించారు పోలీసులు.

మరోవైపు డిజిటల్ అరెస్టుల పేరుతో వైద్యులు, ఉన్నత చదువులు చదువుకున్నవారి దగ్గరి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు ఆన్‌లైన్ మోసగాళ్లు. విశాఖపట్నంలో నమోదవుతున్న కేసులు అందరినీ భయపెడుతున్నాయి. మహిళలు, యువతులే టార్గెట్‌గా చేసుకుని తప్పుడు ప్రచారాలు అసభ్యకరమైన మెసేజ్‌లు హడలెత్తిస్తున్నాయి. ఏ సమయంలో ఎవరి వంతు వస్తుందేమోనని మహిళలు, యువతులు భయపడిపోతున్నారు. వర్కింగ్ ఉమెన్లు, కంపెనీల్లో పనిచేసే మహిళలు, యువతులను టార్గెట్ చేస్తున్నారు. ఫేక్‌ ఐడీలతో వేధింపులకు గురిచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో మోసం

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని డబ్బు పోగొట్టుకున్నవారే కాదు జీవితాలు పోగొట్టుకున్నవారిలోనూ విశాఖ వాసులే అధికం. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో తెలుగువారిని కాంబోడియాకు తీసుకెళ్లి ఆన్‌లైన్‌ మోసాలు చేసేలా ట్రైనింగ్ ఇచ్చింది సైబర్‌ ముఠా. మోసాలకు పాల్పడనందుకు తెలుగు యువకులను చిత్రహింసలకు గురిచేసింది. కొద్ది రోజుల క్రితమే విశాఖ పోలీసులు ఈ ముఠా చేతుల్లో చిక్కిన 58 మందిని రక్షించారు.

సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు

సైబర్ నేరాలపై వైజాగ్‌ సీపీ శంఖబ్రత బాగ్చీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్నాక కొంతమేర సైబర్ క్రిమినల్స్‌ ఆటకట్టిస్తున్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు సీపీ . ఇప్పటి వరకు ఎలాంటి సైబర్‌ క్రైంలు జరిగాయి? ఎన్ని విధాలుగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి? అనే దానిపై డాక్యుమెంటరీని సిద్ధం చేస్తున్నారు. డాక్యుమెంటరీ పూర్తయ్యాక థియేటర్లు, బస్టాండ్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ప్రదర్శిస్తామన్నారు.

2029 ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రయత్నాలు.. పొత్తుపై చంద్రబాబు క్లారిటీ!

కలిసుంటే కలదు సుఖం… కూటమిగా ఉంటేనే బలం… ఐకమత్యంతో వెళ్తేనే విజయం అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇటు జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ సైతం ఇవే డైలాగ్స్‌ రిపీట్‌ చేస్తున్నారు.

అటు కాషాయ పార్టీ నేతలు కూడా ఫ్రెండ్‌షిప్పే తియ్యని పుష్పం అన్న పాట పాడుతున్నారు. మరీ మిత్రబంధం బలంగానే ఉంటుందా..? 2029 ఎన్నికలకూ కలిసే వెళ్తారా…? అధినేతల సంగతి అట్లుంచితే.. ఇన్నర్‌గా కూటమి ఎలా ఉందన్నదీ చర్చ మొదలైంది.

మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. 164 స్థానాలతో ప్రభంజనం క్రియేట్‌ చేసింది. కూటమిలో టీడీపీ ఒక్కటే సొంతంగా 135 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. జనసేన పోటీచేసిన 21 సీట్లలోనూ సత్తాచాటింది. వందశాతం స్ట్రైక్‌ రేట్‌తో, శాససనభలో రెండో పెద్ద పార్టీగా జనసేన కంటిన్యూ అవుతోంది. పది స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కూడా 8 అసెంబ్లీ స్థానాలు ఖాతాలో వేసుకుంది. ఇంతటి విజయానికి కారణం కూటమిగా ఏర్పడటం. యస్‌.. మూడు పార్టీలు జతకట్టినప్పటి నుంచి జనాల్లోకి బలంగా వెళ్లారు. సీట్ల సర్దుబాట్ల దగ్గర నుంచి.. అభ్యర్థుల ఎంపిక, ఆ తర్వాత ప్రచారంలోనూ పక్కా ప్లానింగ్‌తో పనిచేశారు. పదవుల పంపకంలోనూ కలిసే నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా జతకట్టిన దగ్గర్నుంచి… ఇవాళ్టి వరకు మాంచి ఫ్రెండ్‌షిప్‌ మెయిన్‌టేన్‌ చేస్తున్నారు.

ఇక కలిసి కట్టుగా గెలిచారు.. కూటమిగా ఎన్నాళ్లుంటారు..? మిత్రబంధం ఎప్పటిదాకా..? అన్న ప్రశ్నలకు తావివ్వకుండా మూడు పార్టీల అధినేతలు పదేపదే ఫ్రెండ్‌ షిప్‌ సాంగ్స్‌ పాడుతున్నారు. కలిసే ఉంటాం.. కలుపుకునే వెళ్తామంటున్నారు. ఇక లేటెస్ట్‌గా కూటమిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికలకూ కూటమిగానే వెళ్తామంటూ క్లారిటీ ఇచ్చారు. ఎక్కడా మిత్రపక్షాలతో గిల్లికజ్జాలకు దిగొద్దని టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సైతం చంద్రబాబు డైలాగులనే పదేపదే రిపీట్‌ చేస్తున్నారు. కూటమిగానే ఉంటామంటున్నారు. ఉండాలని కూడా జనసేన నేతలకు చెబుతున్నారు. కూటమి నేతలతో మీటింగ్‌ అయినా.. సొంతపార్టీ నేతలతో సమావేశమైనా స్నేహంగానే ముందుకెళ్తామంటున్నారు పవన్‌ కళ్యాణ్‌.

ఇక రాజమండ్రిలో జరిగిన మీటింగ్‌లో బీజేపీ సైతం ఇదే మాట చెబుతోంది. కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి.. జనసేన, టీడీపీ నేతలతో కలిసిమెలిసి ఉండాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మూడు పార్టీలు సమన్వయంతో ముందుకెళ్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇక మొన్న హర్యానాలో జరిగిన ఎన్డీయే మీటింగ్‌లోనూ ఆల్‌ పార్టీస్‌ ఇదే క్లారిటీకొచ్చాయి. 2029 ఎన్నికల కోసం పార్టీలన్నీ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కూటమిగానే వెళ్తామంటున్నారు నేతలు. నెక్ట్స్‌ ఎలక్షన్‌పై టెన్షన్‌ వద్దు… కలిసే ముందుకు అన్న సంకేతాలిస్తున్నారు.

‘అదేనా చివరి కోరిక’.. బాలీవుడ్‌ బాద్‌షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

బాలీవుడ్ బాద్‌షా.. ఈ పేరును సగటు సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘ఇంతింతై’ అన్నట్లు.. షారుఖ్‌ ఖాన్‌ భారత ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.

విదేశాల్లోనూ షారుఖ్‌కు అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం. చిన్న హీరో స్థాయి నుంచి నేడు భారత్‌లో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగిన షారుఖ్‌ జీవితం ఎంతో మందికి ఆదర్శం.

ఇక షారుఖ్‌ నటనకు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ చిత్ర పరిశ్రమకు షారుఖ్‌ చేసిన సేవలకు గాను ‘లోకర్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగానే షారుఖ్‌ పలు ఆసక్తికర విషయాలను పెంచున్నారు. తన చివరి కోరిక అదేనంటూ షారుఖ్‌ చేసిన వ్యాఖ్యలు.. పై ఆయనకు ఉన్న పిచ్చి ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది.

‘జీవితాంతం మీరు నటుడిగానే కొనసాగుతారా?’ అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు షారుఖ్‌ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను చనిపోయే వరకూ ల్లోనే ఉంటానని తేల్చి చెప్పారు. అలాగే.. ఏదైనా సెట్‌లో యాక్షన్‌ చెప్పగానే తాను చనిపోవాలని, కట్‌ చెప్పాక కూడా పైకి లేవకూడదని చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఇదే చివరి కోరిక అంటూ షారుఖ్‌ మనసులో మాట బయట పెట్టారు.

ఇక స్టార్‌డమ్‌కి ఎలా ఫీలవుతారన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాను స్టార్‌డమ్‌ను చాలా గౌరవిస్తానని, దానివల్లే ఫ్యాన్స్‌ ప్రేమ, ఆదరణ, గుర్తింపు, డబ్బు లభించాయని చెప్పుకొచ్చారు. ఇక తనకు సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువన్న షారుఖ్‌. అయితే ప్రస్తుతం ప్రజలు చాలా సున్నితమనసున్నవారయ్యారు. ఏం చెప్పినా డిస్టర్బ్‌ అవుతున్నారు. కాబట్టి సెన్సాఫ్‌ హ్యూమర్‌ లేకపోవడమే మంచిదంటూ చమత్కరించారు షారుఖ్‌.

Health

సినిమా