Sunday, November 17, 2024

పొలిటికల్‌ లవర్‌ బాయ్‌ దారెటు.. రాజకీయంగా కథ ముగిసినట్టేనా?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో.. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగని, ఆయన ఆరేడుసార్లు ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిచిన పెద్దనాయకుడేం కాదు.

దూకుడు స్వభావంతో మొదట శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రీనివాస్‌.. కుటుంబ వివాదం, ప్రేమ వ్యవహారంతో… ఇప్పుడు మోస్ట్‌ పాపులర్‌ పొలిటికల్‌ లవర్‌ బాయ్‌గా మారిపోయారు. ఏపీలో ప్రభుత్వం మారిన మరుక్షణం నుంచి… ఆయన పేరు మీడియాలో, సోషల్‌ మీడియాలో మార్మోగుతూనే ఉంది. దీంతో, ఈ లేటు వయసు లవర్‌బాయ్‌.. రాజకీయ భవితవ్యం ఏమిటన్న దానిపై సందిగ్ధత నెలకొంది.

నారినారి నడుమమురారిలా దువ్వాడకు ఫేమ్‌

కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపుకోసం పరితపిస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌కు.. అది సాధ్యం కాలేదుగానీ, నారి నారి నడుమ మురారి టైపులో… ఇటీవల బాగా ఫేమ్‌ వచ్చేసింది. ఎటు చూసినా దువ్వాడ శ్రీను, ఆయన భార్య వాణి, ఆయన ప్రేయసి దివ్వల మాధురి… వీళ్ల గురించే చర్చంతా. తెలుగు రాష్ట్రాల్లో రచ్చరచ్చ చేసిన ఈ కుటుంబ వ్యవహారం.. దువ్వాడ వాణి సైలెంట్ అయిపోయాక మరో టర్న్‌ తీసుకుంది. మాధురి, శ్రీనివాస్ లు వ్యవహరిస్తున్న తీరు మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ అంశం పొలిటికల్‌గా దువ్వాడకు పెద్దదెబ్బ అవుతుందన్నది పొలిటికల్‌ విశ్లేషకుల మాట.

రచ్చకెక్కిన కుటుంబవ్యవహారం.. రాజకీయంగా సంకటం

వాస్తవానికి శ్రీనివాస్‌ స్వస్థలం పలాస. టెక్కలి నియోజకవర్గంకి చెందిన వాణిని వివాహం చేసుకొని… అక్కడి నుంచే రాజకీయం చేయడం ప్రారంభించారు. వైసిపి అధినేత జగన్‌కు వీరవిధేయుడిగా మారి.. రాజకీయంగా చాలా అవకాశాలు దక్కించుకున్నారు. కానీ, విజయవంతం కాలేదు. నమ్మిన బంటుగా భావించి దువ్వాడకు MLC పదవిని కట్టబెట్టారు జగన్‌. కానీ, అందుకు తగ్గట్టుగా దువ్వాడ వ్యవహరించడం లేదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న కుటుంబ వివాదాలు.. ఎన్నికల ఫలితాల తర్వాత రచ్చకెక్కడంతో… రాజకీయంగా ఆయన పరిస్థితి దారుణంగా మారిందట. వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టుకోవాల్సింది పోయి… రోడ్డున పడేసుకున్నారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఆందోళన విరమించిన వాణి, సైలెంట్‌గా న్యాయపోరాటం చేస్తుంటే.. ప్రియురాలు మాధురితో శ్రీనివాస్ టూర్ లు వేస్తూ, రీల్స్ చేస్తూ రాజకీయంగా మరీ పలచనవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల కంటే లేటు వయసు ఘాటు ప్రేమకే శ్రీనివాస్‌ ప్రాధాన్యత ఇస్తుండటంతో… ఇక ఆయన పొలిటికల్‌ కెరీర్‌ ముగిసినట్టేనన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే పార్టీ కార్యక్రమాలకు,కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారట దువ్వాడ. MLC గా ఉన్నప్పటికీ ZP సర్వ సభాసమావేశానికి, అధికారులతో జరిగిన జిల్లా స్థాయి సమీక్షలకు దూరంగా ఉన్నారట. ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షులు, శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ పాల్గొనలేదు దువ్వాడ శ్రీను. వైఎస్ఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలనూ పట్టించుకోలేదు.

దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్‌కు జిల్లా పగ్గాలు

ఇప్పటికే, నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి దువ్వాడను తప్పించిన అధిష్ఠానం.. ఆ బాధ్యతలను పేరాడ తిలక్‌కి అప్పగించింది. అయినా సరే, దువ్వాడలో ఇసుమంతైనా మార్పు రావడం లేదట. ఇది పొలిటికల్‌గా తమకు కూడా నష్టమని.. కేడర్ కూడా ఆయనను దూరం పెడుతోందట. ఇక దువ్వాడ పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనని జిల్లా మొత్తం టాక్‌ నడుస్తోంది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న టెక్కలి నియోజకవర్గంలో… అందివచ్చిన అవకాశాన్ని దువ్వాడ చేజేతులా నాశనం చేసుకుంటున్నారనీ… సొంత క్యాడరే గుసగుసలాడుకుంటోంది. పొలిటికల్‌గా ఇక చేసేదేమీ లేదని అంచనాకు వచ్చాకే… దువ్వాడ ఇలా వ్యవహరిస్తున్నారనే వారూ ఉన్నారు. మరి, మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపలు.. చూడగానే నోరూరిపోతుంది..! కొనాలంటేనే ఏడుపోస్తుంది

Bluefin Tuna- మనం 2024 సంవత్సరంలో అత్యంత ఖరీదైన చేప గురించి మాట్లాడినట్లయితే ముందుగా వచ్చే పేరు బ్లూఫిన్ ట్యూనా. ఈ చేపల శరీరం పెద్దది. టార్పెడో ఆకారంలో ఉంటుంది.

ఇది క్రాస్ సెక్షన్‌లో వృత్తాకారంగా ఉంటుంది. ఈ చేప ధర పౌండ్‌కు 5000 డాలర్లు (4 లక్షల 20 వేల రూపాయలు) వరకు ఉంది. ఇది చాలా రుచికరమైన చేపలలో ఒకటిగా చెబుతారు.

American Glass Eel- ఈ చేప ఉత్తర అమెరికాలోని ఈశాన్య తీరాలలో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన చేప. ఇది మీకు గాజులా కనిపిస్తుంది. వాటి పరిమాణం చాలా చిన్నది (సుమారు 3 అంగుళాలు). అమెరికన్ ఈల్స్ 4 అడుగుల వరకు పెరుగుతాయి. వాటి ధర పౌండ్‌కు 3000 డాలర్లు (రూ. 2,52,181) వరకు ఉంటుంది.

Pufferfish- పఫర్ ఫిష్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చేపలలో ఒకటి మాత్రమే కాదు, చాలా ప్రమాదకరమైనది కూడా. దీని ముళ్ళు చాలా విషపూరితమైనవి. అందుకే ఈ పఫర్‌ఫిష్‌ని అమెరికాలోని 50 కంటే తక్కువ రెస్టారెంట్లలో మాత్రమే అందిస్తారు. ఈ చేప ధర పౌండ్ (17 వేల రూపాయలు) 200 డాలర్ల వరకు ఉంది.

Wild Alaskan King Salmon- ఈ చేప అలస్కాలోని అందమైన నీటిలో కనిపిస్తుంది. ఈ చేప రెడ్ కింగ్ సాల్మన్ లాగా కనిపిస్తుంది. ప్రజలు ఎంతో ఇష్టంగా దీన్ని తింటారు. దీన్ని కొనడానికి ఎంత డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకడుగు వేయరు. సాధారణంగా ఈ చేప పౌండ్‌కు $70 (రూ. 5,884) వరకు లభిస్తుంది.

Swordfish- కత్తిలాంటి ముక్కు కారణంగా ఈ చేపకు ఆ పేరు వచ్చింది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది. దాన్ని పట్టుకోవడమే కాకుండా తినడానికి కూడా జనం ఎక్కువ ఆసక్తిగా ఉంటారు. ఈ చేప బరువు 91 కిలోల వరకు ఉంటుంది. మీరు ఈ చేపను పౌండ్‌కు 60 డాలర్లు అంటే 5100 రూపాయల వరకు మార్కెట్లో లభిస్తుంది.

13 ఫోర్లు, 3 సిక్స్‌లు.. బెంగళూరులో సర్ఫరాజ్ తుఫాన్ సెంచరీ..

శనివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.

తొలి టెస్టు సెంచరీ కొట్టేందుకు సర్ఫరాజ్ ఖాన్‌కు ఏడు ఇన్నింగ్స్‌లు పట్టింది. సర్ఫరాజ్ ఖాన్ 110 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ ఘనతను సాధించాడు.

శుభ్‌మన్ గిల్ గాయంతో భారత జట్టులో చోటు దక్కించుకున్న 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్.. ఈ ఏడాది రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. కివీస్‌తో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో, అతను డకౌట్‌కి ఔటయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పునరాగమనం చేశాడు. విరాట్ కోహ్లితో మూడో వికెట్‌కు వందకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఈ నెల ప్రారంభంలో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్‌లో ముంబై తరపున సర్ఫరాజ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 15 సెంచరీలు చేశాడు.

మూడో రోజు చివరి బంతికి విరాట్ కోహ్లీ (70 పరుగులు) ఔటయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ చేతికి చిక్కాడు. 52 పరుగుల వద్ద రోహిత్ శర్మ, 35 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యారు. అజాజ్ పటేల్ 2 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్ తీశారు. కోహ్లీ, సర్ఫరాజ్ మధ్య మూడో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆ జట్టు 356 పరుగుల ఆధిక్యం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో రెండో రోజు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 46 పరుగులకు ఆలౌట్ చేసింది. వర్షం కారణంగా తొలిరోజు ఆట జరగలేదు.

ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటున్నారా.? ‘డెడ్‌ బట్‌ సిండ్రోమ్‌’ తప్పదు..

గంటలతరబడి కదలకుండా ఒకే చోట కూర్చునే వారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగం, వ్యాపారం ఇలా గంటలతరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.

ఎక్కువసేపు ఒకేచోట ముఖ్యంగా ఒకే భంగిమంలో కూర్చోవడం వల్ల సమస్యలు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా 45 నిమిషాల కంటే ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం చాలా ప్రమాదకరం.

ఇలా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల డెడ్ బట్ సిండ్రోమ్ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ డెడ్ బట్ సిండ్రోమ్‌ అంటే ఏటి.? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.? ఈ సమస్య బారిన పడినట్లు తెలుసుకునే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా సమయం తర్వాత ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి.

డెడ్ బట్ సిండ్రోమ్‌ను గ్లుటియల్ మతిమరుపు అని కూడా అంటారు. ఈ సమస్య వల్ల తుంటి ప్రదేశంలో తిమ్మిరి వస్తుంది. ఆ పార్ట్ కొంతసేపు పనిచేయడం ఆగిపోతుంది. డెడ్‌ బట్ సిండ్రోమ్‌ సమస్య వల్ల వీపు, మోకాలుతో పాటు చీలమండలలో తీవ్రమైన నొప్పి వస్తుంది. హిప్ స్ట్రెయిన్‌తో పాటు.. తుంటి కింది భాగంలో జలదరింపుగా అనిపిస్తుంది. తుంటి చుట్టూ తిమ్మిరి, మంట, నొప్పి వేధిస్తుంది.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం మానుకోవాలి. కనీసం 20 నిమిషాలకు ఒకసారైనా పైకి లేకి కూర్చోవాలి. అదే విధంగా ఆఫీసుల్లో, ఇంట్లో లిఫ్ట్ ఉపయోగాన్ని తగ్గించాలి, మెట్లను ఉపయోగించాలి. అలాగే జీవితంలో వాకింగ్‌ను అలవాటు చేసుకోవాలి. ప్రతీ రోజూ కచ్చితంగా 30 నిమిషాలైనా వాకింగ్ చేయాలి. అలాగే వర్క్‌ చేస్తున్న సమయంలో అప్పుడప్పుడు లేచి స్ట్రెచ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేస్తుండాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

గుండెపోటు వచ్చే వారం ముందు.. ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి

కరోనా తర్వాత గుండె సంబంధిత సమమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గుండె వ్యాధులను ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు.

అయితే శరీరం మనల్ని ముందుగానే ఇందుకు సంబంధించి అలర్ట్‌ చేస్తుంది. వీటి ఆధారంగా జాగ్రత్తపడితే సమస్య నుంచి బయటపడొచ్చు. గుండెపోటు వచ్చే ముందు వారం రోజుల ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గుండెపోటు వచ్చే వారం రోజుల ముందు ఛాతీలో నొప్పి వస్తుంది. అయితే సాధారణంగా అసిడిటీ వంటి సమస్యలు తలెత్తిన సమయంలో కూడా ఛాతి నొప్పి కూడా సవ్తుంది. అయితే గుండె పోటు సమయంలో వచ్చే ఛాతి నొప్పి మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. మరీ ముఖ్యంగా ఎడమ వైపు ఎక్కువ నొప్పి ఉంటుంది.

* గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో భుజం, చేతుల్లో నొప్పులు కూడా కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఉన్నపలంగా ఎడమ భుజంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు అంటున్నారు.

* కొన్ని సందర్భాల్లో అరచేతితో పాటు చేతుల్లోనూ విపరీతమైన నొప్పి వేధిస్తుంది. భరిలంచలేని నొప్పి వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి. సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిది.

* గుండెపోటుకు, వెన్నునొప్పికి మధ్య సంబంధం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎలాంటి శ్రమ లేకున్నా వెన్నునొప్పి ఉన్నపలంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలను చేయించుకోవాలి.

* గుండెపోటు వచ్చే ముందు దవడల్లో నొప్పి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎడమవైపు దవడలో సడెన్‌గా నొప్పి వస్తుంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి. సంబంధిత పరీక్షలను చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

తక్కువ పెట్టుబడితో ఊహకందని లాభాలు.. ఇప్పుడిదే ట్రెండీ బిజినెస్‌

ప్రస్తుతం వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటున్నారు.

ఇందుకోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్‌ కోసం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..

ప్రస్తుతం చాలా మంది ఇల్లలో ఇన్‌స్టాంట్ ఇడ్లీ పౌడర్‌ను ఉపయోగిస్తున్నారు. బిజీ లైఫ్‌ కారణంగా ఇలాంటి ఇడ్లీ పౌడర్లకు భలే డిమాండ్ ఏర్పడుతుంది. మరి ఈ ఇడ్లీ మిక్స్ తయారీని వ్యాపారంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇడ్లీ మిక్స్‌ను ఎలా తయారు చేస్తారు.? దీని వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇడ్లీ రవ్వ తయారు చేయడానికి.. పెద్దగా స్థలం అవసరం కూడా లేదు. ఇంట్లో ఒక పెద్ద గది ఉన్నా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలాగే ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఇడ్లీ రవ్వ తయారీ మిషన్‌ అవసరపడుతుంది. మీ బిజినెస్‌ కెపాసిటీ ఆధారంగా ఈ మిషిన్‌ సైజ్‌ను ఎంచుకోవచ్చు. ప్రారంభంలో ఉపయోగించే మిషన్‌ ధర రూ. 50,000గా ఉంటుంది. పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించాలంటే రూ. 5 లక్షల వరకు మిషిన్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇక ఇడ్లీ మిక్స్‌ తయారీకి కావాల్సిన వాటిలో ప్రధానంగా బియ్యం కావాలి.

అలాగే మీ సొంత బ్రాండింగ్‌తో ఇడ్లీ రవ్వను ఉత్పత్తి చేయాలనుకుంటే ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్‌, లోకల్‌ మున్సిపల్ పర్మిషన్‌తో పాటు జీఎస్‌టీ అవసరం ఉంటుంది. ఇక ఇడ్లీ రవ్వ తయారీ విషయానికొస్తే. బియ్యాన్ని 8 గంటల పాటు నీటిలో నానబెట్టి ఆ తర్వాత బాగా ఆరబెట్టుకోవాలి. పొడిగా తయారైన బియ్యాన్ని మిషిన్స్‌లో వేసుకోవాలి. మిషిన్‌లో ఉండే బ్లేడ్స్ ఆధారంగా ఉప్పా రవ్వ, ఇడ్లీ రవ్వను తయారు చేసుకోవచ్చు. అనంతరం రవ్వను ప్యాక్‌ చేసి విక్రయించుకోవచ్చు.

లాభాల విసయానికొస్తే.. ఒక కేజీ ఇడ్లీ రవ్వను తయారు చేయడానికి సుమారు రూ. 25 ఖర్చు అవుతుంది. అయితే ప్రస్తుతం కేజీ ఇడ్లీ రవ్వ సుమారు రూ. 45 నుంచి రూ. 50 వరకు ఉంటుంది. ఈ లెక్కన కిలో రవ్వపై తక్కువలో తక్కువలో హోల్‌సేల్‌లో విక్రయించినా కిలో ఇడ్లీ రవ్వపై రూ. 10 లాభం వస్తుంది. దీనిబట్టి మీ లాభాలు ఉంటాయి. ఇందుకోసం ముందుగా మీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవాలి. స్థానికంగా ఉండే హోటల్స్‌తో పాటు, దుకాణాలను సంప్రదించి విక్రయించుకోవడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు.

కివీ ఫ్రూట్‌ని ఎలా తింటే పోషకాలు బాగా అందుతాయి

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా తినే వాటిల్లో కివీ ఫ్రూట్ ఒకటి. ఇది తియ్యగా, పుల్లగా ఉంటుంది. ఎక్కువ శాతం పుల్లగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.

కివీని తొక్కతో తినాలా లేక లోప ఉండే పండు తినాలా అనే డౌట్ వచ్చే ఉంటుంది. కివీని ఏ విధంగా తిన్నా పోషకాలు చక్కగా అందుతాయి. అయితే శుభ్రంగా క్లీన్ చేసి తొక్కతో తింటే పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. పై తొక్కలో ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది.

కివీ ఫ్రైట్ ఎందుకు తినాలి అని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఇందులో పలు రకాల పోషకాలు లభిస్తాయి. పెద్ద మొత్తంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ఈ రెండూ ఖచ్చితంగా కావాలి.

కివీ ఫ్రైట్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మందిలో ప్లేట్ లేట్స్ కౌంట్ అనేవి పడిపోతున్నాయి. కివీ తింటే ఈ కౌంట్ చక్కగా పెరుగుతుంది. ఇలాంటి వారు కివీని తినడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత పడొచ్చు.

కివీ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసేలా సహాయ పడుతుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది. కివీలో నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. చర్మ, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నేరుగా తినలేని వారు హనీతో కలిపి తినవచ్చు.

గుంటూరులో డ్రగ్స్ కలకలం.. స్టన్ అయ్యే విషయాలు చెప్పిన పోలీసులు

రాత్రి సమయంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కోలాహలంగా ఉంది. ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, వస్తున్న బస్సులతో ఆ ప్రాంతమంతా రద్దీగా ఉంది. ప్రయాణీకులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

అయితే అదే సమయంలో కొత్తపేట పోలీసులు ఆర్టిసి బస్టాండ్ వద్దకు వచ్చారు. అటుగా వెలుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఆపారు. బస్సులో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. వారికొచ్చిన ముందుస్తు సమాచారం మేరకు ఆ బస్సులో వారందరిని చెక్ చేశారు. వారికొచ్చిన సమాచారం నిజమే అయింది.

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుండి గుంటూరు వస్తున్న ట్రావెల్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి లగేజ్ చెక్ చేయగా 68 గ్రాముల డ్రగ్స్ దొరికింది. వారిద్దిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొస్తున్నారో అన్నదానిపై విచారణ ప్రారంభించారు. పెడ్లర్ బెంగళూరులో ఉన్నట్లు అనుమానితులు చెప్పడంతో ప్రత్యేక పోలీస్ బృందం బెంగళూరికి బయలు దేరింది. రవాణా చేస్తున్న వారితో పాటు వారికి విక్రయించిన వారిని అదే విధంగా కొనుగోలు చేసే వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు.

అయితే గతంలోనూ కొంతమంది గుంటూరుకు చెందిన డ్రగ్స్ రవాణా చేసే వారిని పోలీసులు హైదరాబాద్లో పట్టుకున్నారు. దీంతో ఈ డ్రగ్స్ రవాణా చేసిన వారికి గత నేరస్తులతో సంబంధం ఉందా లేదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజ్ ఉండడంతో విద్యార్ధులనే టార్గెట్ చేసి కొంతమంది డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గుంటూరు పోలీసులు ఎప్పటికప్పుడు కాలేజ్ హాస్టల్స్‌పై తనిఖీలు చేస్తూ విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులు పకడ్బందిగా చర్యలు చేపట్టినా అడపాదడపా గుంటూరు కేంద్రంగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది.

బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. టెలికాస్ట్ ఆపేయాలని కోర్టులో పిటిషన్

కన్నడ టెలివిజన్‌లో అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. స్టార్ హీరో సుదీప్ ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 11 వ సీజన్ వరుసగా వివాదాలు ఎదుర్కొంటోంది.

కొత్త సీజన్ ప్రారంభమై 19 రోజులు అవుతుండగా, ఇప్పటికే పలు కాంట్రవర్సీలు చోటు చేసుకున్నాయి. ‘బిగ్ బాస్’ హౌస్‌లో మహిళా కంటెస్టెంట్ల గోప్యతకు భంగం కలుగుతోందని మహిళా కమిషన్‌కు లేఖ ద్వారా ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. అలాగే ఈ షోలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీమ్ మేల్కొని ఈసారి నరకం-స్వర్గం అనే భావనకు స్వస్తి పలికి కంటెస్టెంట్స్ అందరూ ఒకే హౌస్ లో ఉండే అవకాశం కల్పించారు. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ టీమ్ కు మరో చిక్కు ఎదురైంది. బిగ్ బాస్ 11వ సీజన్ ప్రసారాన్ని శాశ్వతంగా ఆపేయాలంటూ సాగర్ అనే న్యాయవాది షిమోగా జిల్లాకు చెందిన గౌరవనీయమైన చీఫ్ కమర్షియల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కన్నడ కలర్స్ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 11కి వ్యతిరేకంగా షిమోగా జిల్లాకు చెందిన సాగర్‌కు చెందిన న్యాయవాది కెఎల్ భోజరాజ్ బిజినెస్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 39 రూల్ 1, 2 రెడ్‌తో సెక్షన్ 151 కింద ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. సివిల్ అండర్ సివిల్ కోసం న్యాయవాది కెఎల్ భోజరాజ్ దరఖాస్తును న్యాయమూర్తి చాందిని జి.యు స్వీకరించారు. విధాన నియమావళి చట్టం U/sec.26,order7,rule1 ప్రకారం కలర్స్ కన్నడ ఛానెల్ నిర్మాతలు, సంపాదకులకు అత్యవసర నోటీసును జారీ చేశారు. ఈ పిటిషన్ తదుపరి విచారణ అక్టోబర్ 28న జరగనుంది.

కాగా కన్నడలో బిగ్ బాస్ అంటే సుదీప్. సుదీప్‌ అంటే బిగ్‌బాస్‌ అని అక్కడి ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ నుంచి బిగ్ బాస్ హోస్ట్ చేయనని సుదీప్ అధికారికంగా ప్రకటించాడు. ఈ సంచలన ప్రకటన వెనక కారణాలేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

జియో నుంచి దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.101 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ డేటా!

రిలయన్స్ జియో దేశంలోనే నంబర్ వన్ టెలికాం కంపెనీ. దాదాపు రెండేళ్ల తర్వాత జూలై నెలలో జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచింది. జియో తన రీఛార్జ్ ప్లాన్‌లలో అనేక ఆఫర్‌లను ఇస్తుంది.

అందుకే ఖరీదైన ప్లాన్‌లు ఉన్నప్పటికీ, ఈ రోజు కంపెనీ టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థ. 49 కోట్ల మంది కస్టమర్లతో జియో నంబర్ వన్ స్థానంలో ఉంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో జియో సిమ్ కలిగి ఉంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

వివిధ అవసరాల కోసం జియో జాబితాలో వేర్వేరు ప్లాన్‌లు ఉన్నాయి. వినోదం కోసం ప్రత్యేక ప్లాన్‌లు, డేటా బూస్టర్‌ల కోసం ప్రత్యేక ప్లాన్‌లు, ఓటీటీ కంటెంట్‌ కోసం ప్రత్యేక ప్లాన్‌లు ఉన్నాయి. అదేవిధంగా జియో కూడా కొన్ని గొప్ప డేటా ప్యాక్‌లను కలిగి ఉంది. కంపెనీ జాబితాలో ఒక ప్లాన్ ఉంది. దీనిలో మీరు దాదాపు రూ.100 ఖర్చు చేయడం ద్వారా అపరిమిత డేటాను పొందవచ్చు.

జియో ఇటీవల తన కోట్లాది మంది కస్టమర్ల కోసం రూ.101 గొప్ప ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ చౌక ప్లాన్‌లో కంపెనీ ఎటువంటి పరిమితి లేకుండా వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను అందిస్తోంది. ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ ప్లాన్లలో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక డేటా ప్యాక్ మాత్రమే. ఈ డేటా ప్యాక్‌కి “ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ + 6GB” అని పేరు పెట్టారు.

ఈ ప్యాక్ బెనిఫిట్స్ అందుకోవాలంటే ముందుగా డైలీ 1GB, 28 రోజుల వ్యాలిడిటీ అందించే ఒక బేస్ ప్లాన్‌కు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రోజూ 1.5GB డేటా, 28-56 రోజుల వ్యాలిడిటీ కలిగిన యాక్టివ్‌ ప్లాన్‌ ఉండాలి. ఈ మూడింటిలో ఏ వ్యాలిడిటీ ప్లాన్ యాక్టివ్‌లో ఉన్నా వారు రూ.101 ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ + 6GB ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 6జీబీ 4జీ డేటా ఆఫర్ చేస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్ డేటా అందిస్తుంది.

జియో ఇంతకు ముందు రూ.51కే అపరిమిత 5జీ డేటా అందించే అప్‌గ్రేడ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇది 3GB 4G డేటా కూడా అందిస్తుంది. రోజు 1.5GB డేటా, 28 డేస్ వ్యాలిడిటీ కలిగిన సింగిల్ ప్యాకేజీతో మాత్రమే దాన్ని అందించింది. అంటే దీని వ్యాలిడిటీ గరిష్టంగా ఒక నెల మాత్రమే ఉంటుంది. కొత్త ప్లాన్ మాత్రం దాదాపు రెండు నెలల పాటు అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్ ఇస్తుంది.

ఏపీలో స్కూల్స్‌కు గుడ్ న్యూస్.. స్టూడెంట్స్‌కు పండగే.

విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ చొరవతో పాఠశాలల నిర్వహణకు వందకోట్లకు పైగా విడుదల అయ్యాయి. దీంతో పాఠశాలల నిర్వహణ నిధుల కోసం వ్యయప్రయాసలు భరించే ప్రధానోపాధ్యాయులకు ఉపశమనం లభించనుంది.

కోవిడ్ తర్వాత పాఠశాలలకు సంబంధించిన కాంపోజిట్ గ్రాంట్లను, మండల రిసోర్సు కేంద్రాల నిర్వహణ నిధుల కొరత నెలకుంది. నిధులలేమితో పాఠశాలలు సమస్యల వలయాలుగా మారిన దుస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని గుర్తించిన విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ నిధుల విడుదలకు మార్గం సుగమం చేశారు.

విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ చొరవతో 2024-25 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 855 పీఎం శ్రీ పాఠశాలలకు వార్షిక గ్రాంట్ల వినియోగం కింద మొత్తం రూ. 8.63 కోట్లు, కేజీబీవీల్లో డైట్-మెయింటెనెన్స్ ఖర్చులకు రూ. 35.16 కోట్లు, మండల రిసోర్సు కేంద్రాలకు రూ. 8.82 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రంలో పీఎం శ్రీ పాఠశాలలు, కేజీబీవీలు, మిగిలిన 40728 ప్రాథమిక, మాధ్యమిక, సీనియర్ సెకండరీ పాఠశాలలకు కూడా రూ.51.90 కోట్లు స్కూల్ కాంపోజిట్ నిధులు ఇచ్చారు. ప్రతి పాఠశాలకు 50 శాతం చొప్పున కాంపోజిట్ గ్రాంట్లు రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ నిధులు ఆయా పాఠశాలల నిర్వహణకు, నిరంతర అభివృద్ధికి, పాఠశాల పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలకు, విద్యుత్ చార్జీల చెల్లింపులు, సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, పాఠశాల విద్యా సామగ్రి (TLM), రిజిస్టర్లు, రికార్డులు తదితర స్టేషనరీ కొనుగోలు చేయడానికి వెచ్చించేందుకు కేటాయించారు. పాడైపోయిన పాఠశాల సామగ్రి, వినియోగపడని క్రీడా సామగ్రి బాగు చేయడానికి నిధులు అందుబాటులోకి తెచ్చారు. పాఠశాలల్లో ప్రయోగశాలలు, ఇంటర్నెట్, నీరు, ఉపకరణాలు కోసం నిధులు ఖర్చు చేయొచ్చు. విద్యా సంబంధిత దినోత్సవాలు, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ సమస్యలు గుర్తించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో చర్చించిన తరువాత అత్యవసరంగా నిధులివ్వాల్సిన అవసరం ఉందని గుర్తించి భారీగా నిధులు విడుదల చేశారు.

బైకర్స్ అలెర్ట్.. లేకుంటే మీక్కూడా ఇదే గతి.!

ఒంగోలులో బైక్‌ రేసర్ల ఆగడాలకు జనం బెంబేలెత్తుతున్నారు. రోడ్డు పక్కనుంచి రయ్యి రయ్యిమంటూ పెద్ద శబ్దంతో దూసుకుపోతున్న బైకర్ల ధాటికి వృద్దులు, మహిళలు హడలిపోతున్నారు.

బైక్‌ సైలెన్సలర్లను మాడిఫైడ్ చేసి ఎక్కువ శబ్దం వచ్చేలా తయారు చేసిన సైలెన్సర్లను అమర్చి రోడ్లపై దూసుకుపోతున్న బైకర్ల ఆగడాలు శృతి మించడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెద్ద శబ్దంతో రోడ్లపై దూసుకుపోతున్న బైక్‌లను అడ్డుకుని వాటిని సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులో 500పైగా స్వాధీనం చేసుకున్న మాడిఫైడ్ సైలెన్సర్లను అదే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా వాటిని బుల్‌డోజర్లతో తొక్కించి నలిపేశారు. వారికి జరిమానా కూడా విధించారు.

వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా రోడ్డు భద్రతా నియమాలను పాటించేలా చూడటమే లక్ష్యంగా ఒంగోలు నగర పరిధిలో విపరీతమైన ధ్వని పుట్టించే బైక్‌ సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేస్తున్నట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. నెల రోజులుగా ఒంగోలు టౌన్ పరిధిలో ట్రాఫిక్ పోలీస్లు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా అధిక శబ్దం చేసే 515 సైలెన్సర్లను స్వాధీనం చేసుకోగా వాటిని ఎస్‌పీ ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డురోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఒంగోలులోని అద్దంకి సెంటర్ దగ్గర స్వాధీనం చేసుకున్న అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లను జనం అంతా చూస్తుండగా ధ్వంసం చేశారు. నంబర్‌ ప్లేట్లు లేని, ఇర్రెగ్యులర్ నంబర్‌ ప్లేట్లు ఉన్న వాటిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. మోటార్ వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించి మాడిఫైడ్ సైలెన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించమని హెచ్చరించారు.బైకులకు విపరీత శబ్దాన్నిచ్చే సైలెన్సర్ అమర్చుకుని శబ్ద కాలుష్యం సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా జరిమానా విధిస్తామని, వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్లను విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్‌ హెచ్చరించారు.

షాకింగ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా అరెస్ట్! కారణమిదే

బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్ ఆర్‌జే శేఖర్ బాషాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక కేసులో భాగంగా అతనిని అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సుమారు 4 గంటల పాటు శేఖర్ బాషాను విచారిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల యూట్యూబర్ హర్ష సాయి పై ఒక అమ్మాయి పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనపై లైంగికంగా దాడి చేయడంతో పాటు మానసికంగా వేధించాడంటూ ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. హర్షసాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2కోట్ల తీసుకొని మోసం చేసినట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద హర్ష సాయిపై కేసులు నమోదు చేశారు. అయితే పోలీసు కేసు నమోదు అయినప్పటి నుంచి హర్ష సాయి కన్పించకుండా పోయాడు. హర్షసాయి విదేశాలకు వెళ్లాడనే తెలియడంతో అతని కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు. అయితే ఇప్పుడిదే కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్ అయ్యాడు.

హర్షసాయి కేసులో ఆర్జే శేఖర్ బాషా తల దూర్చాడని సమాచారం. పలు యూట్యూబ్ ఛానెల్స్ లో హర్ష సాయికి మద్దతుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే బాధితురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శేఖర్ బాషాను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తొంది. కాగా గతంలో రాజ్ తరుణ్, లావణ్య కేసులో కూడా ఇలాగే ఇన్వాల్వ్ అయ్యాడు శేఖర్ బాషా. రాజ్ తరుణ్ కు మద్దతుగా మాట్లాడుతూ లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కారణంగానే ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో లావణ్య శేఖర్ బాషాను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది.

10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష అవుతుందా? ఎప్పుడు?

10 గ్రాముల బంగారం లక్ష రూపాయిలు. ఈ మాట వింటేనే గుండె కలుక్కుమంటుంది. వెంటనే ఇంట్లో మహిళల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నేను అక్కడికీ కొనమని చెబుతూనే ఉన్నాను..

మీరే పట్టించుకోలేదు.. చూడండి.. ఇప్పుడు పది గ్రాముల బంగారం లక్ష రూపాయలు అవుతుందంట.. అన్న డైలాగులు భర్తలకు ఎదురవుతాయి.

అయితే.. ఇప్పుడు దాని రేటు ఇంకా లక్ష రూపాయిలు అవ్వలేదు. కానీ త్వరలో ఆ ముచ్చటా ఉంటుంది అంటున్నారు. నిపుణులు, ఆల్రెడీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79 వేల మార్కును టచ్ చేసింది.

ఇక ఇది దీపావళి, ధన్ తేరస్ వంటి పండుగల సీజన్. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. ఇంకేముంది.. పసిడి పరుగుకు కళ్లెం వేయడానికి అవకాశమే లేకుండా పోయింది.

సీతా ఫలంతో ఇలా రబ్డీ చేయండి.. తిన్నవాళ్లు మైమరచిపోతారు..

పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. ఇది సీజనల్ ఫ్రూట్. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిన పండ్లలో ఇది ఒకటి. సీతాఫలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

శరీర ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఇందులో లభిస్తాయి. ఇది తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. సీతా ఫలం తినడం వల్ల పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఇంత రుచిగా ఉండే సీతా ఫలంతో రబ్డీ చేస్తే.. ఆహా ఆ రుచే వేరు. రబ్డీ రుచి గురించి చెప్పేది ఏముంది. చాలా మంది దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి రబ్డీలో సీతా ఫలం కలిపితే ఆ రుచి మరింత పెరుగుతుంది. అలాగే చాలా త్వరగా అయిపోతుంది. మరి ఇంత రుచిగా ఉండే సీతా ఫలం రబ్డీని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సీతా ఫలం రబ్డీకి కావాల్సిన పదార్థాలు:

సీతా ఫలం గుజ్జు, పాలు, తేనె లేదంటే బెల్లం, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స తరుగు, గులాబీ రేకులు.

సీతా ఫలం రబ్డీ తయారీ విధానం:

ముందుగా పాలను ఓ గిన్నెలో వేసి చక్కగా అయ్యేంత వరకు మరగ బెట్టుకోవాలి. మూడు సార్లు ఉడుకు వచ్చాక మంట తగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు సగానికి ఇంకిపోయి.. చిక్కబడ్డాక యాలకుల పొడి, బెల్లం లేదా పంచదార లేదంటే తేనె కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత సీతా ఫలం గుజ్జు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగాక.. మరో ఐదు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

చివరగా పైన గులాబీ రేకులు, డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి. సిల్వర్ వార్క్‌తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఈ స్వీట్‌ని ఇలా వేడిగా ఉన్నప్పుడు తినొచ్చు.. లేదంటే ఫ్రిజ్‌లో పెట్టి కూల్‌గా ఉన్నప్పుడు తిన్నా రుచిగానే ఉంటుంది. అంతే ఎంతో రుచిగా ఉండే సీతా ఫల్ రబ్డీ సిద్ధం. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కేవలం పదే నిమిషాల్లో ఈ కిచిడీ సిద్ధం.. రుచి అదుర్స్..

ఒక్కోసారి ఇంట్లోని పనుల వల్ల లేదంటే లేటుగా లేవడం వల్ల అస్సలు పని అవ్వదు. అందులోనూ బయట ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది.

ఒక్క అరగంట, గంట లేటు అయినా మొత్తం మారిపోతుంది. ఇలాంటి బిజీ టైమ్‌లో కూడా వంట త్వరగా పూర్తి చేయవచ్చు. అది కూడా రుచిగా చేయవచ్చు. అదేంటా అనుకుంటున్నారా.. ఆలూ కిచిడీ. కిచిడీల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల కిచిడీల గురించి తెలుసుకున్నాం. కిచిడీలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చాలా ముందు రెసిపీ. ఇంతకు ముందు పెద్దలు కేవలం బియ్యం, పప్పు, బంగాళ దుంపలతో కలిపి కిచిడీ చేసేవారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు కూడా అందుతాయి. మరి ఈ రుచికరమైన ఆలూ కిచిడీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

ఆలూ కిచిడీకి కావాల్సిన పదార్థాలు:

బియ్యం, ఆలు గడ్డలు, కంది పప్పు, నెయ్యి, పచ్చి మిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ, ఎండు మిర్చి, పసుపు, కొత్తిమీర, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, జీరా పొడి, ఆయిల్.

ఆలూ కిచిడీ తయారీ విధానం:

కుక్కర్ గిన్నెలోకి ముందుగా బియ్యం, పప్పు కలిపి శుభ్రంగా తీసుకోవాలి. బియ్యం కప్పు తీసుకుంటే.. పప్పు అర కప్పు తీసుకుంటే చాలు. ఇందులోనే తోట కూర తరుగు, ఆలు గడ్డ ముక్కలు, పచ్చి మిర్చి వేసి మూత పెట్టి ఓ ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా అయితే కాస్త మెత్తగా ఉడుకుతాయి. వేడి చల్లారే వరకు కుక్కర్ పక్కన పెట్టాలి.

ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఎండు మిర్చి వేసి వేగాక.. ఉల్లి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులో పసుపు, కొత్తిమీర, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, జీరా పొడి, వేసి వేయించాలి. ఇవి వేగుతున్నప్పుడు ఉడకబెట్టిన అన్నం కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. చివరలో కొద్దిగా కొత్తిమీర వేస్తే సరి. ఎంతో రుచిగా ఉంటే ఆలూ కిచిడీ సిద్ధం.

భారమంతా బన్నీ పైనే.. భారీగా ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్

లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్పా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటది.. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ అలాంటి కిక్ కోసమే ప్రయత్నిస్తున్నారు..
ఈ ఏడాదిలో ఎన్ని లు వచ్చినా ఏడాది చివరన తన ద్వారా వచ్చే కిక్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు బన్నీ..

లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్పా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారుగా ఓ డైలాగ్..! ఈ కిక్ కోసమే ట్రై చేస్తున్నారిప్పుడు అల్లు అర్జున్. ఏడాదిలో ఎన్ని లొచ్చినా.. చివర్లో వచ్చే ఆ కిక్ కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఏడాది భారమంతా బన్నీపైనే ఉందిప్పుడు. మరి 2024ను పుష్ప ఎలా ముగించబోతున్నారు..? ఆయన రూల్ దేశమంతా ఎలా ఉండబోతుంది..?

2024లో అదిరిపోయే పాన్ ఇండియన్ హిట్లు తక్కువగానే ఉన్నాయి. సంక్రాంతికి హనుమాన్‌తో మొదలైంది ఈ మ్యాజిక్.. ఈ ఏకంగా 350 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత అన్ని భాషల్లో మ్యాజిక్ చేసిన కల్కి 2898 ఏడి.

ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 1100 కోట్లు వసూలు చేసింది. గతేడాది డిసెంబర్‌ను కూడా సలార్‌తో ఘనంగా ముగించారు రెబల్ స్టార్. కల్కి తర్వాత మళ్లీ ఆ స్థాయి మ్యాజిక్ దేవర చేస్తుందిప్పుడు. కాకపోతే కేవలం తెలుగు, హిందీలోనూ ఈ చిత్ర దూకుడు సాగుతుంది

తమిళ, మలయాళంలో మాత్రం ఊహించిన స్థాయిలో వసూళ్లు రావట్లేదు. దాంతో ఈ భారం బన్నీ తీసుకుంటున్నారు. పుష్ప 2తో 2024ను ఘనంగా ముగించే బాధ్యత తనదే అంటున్నారు ఐకాన్ స్టార్.

డిసెంబర్ 6న విడుదల కానుంది పుష్ప 2. ఈ ఏడాది రానున్న చివరి మోస్ట్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఇదే. నార్త్‌లోనూ దీనిపై అంచనాలు మామూలుగా లేవు. 2021లోనూ డిసెంబర్‌లోనే వచ్చి రచ్చ చేసారు పుష్ప. మూడేళ్ళ గ్యాప్‌తో మరోసారి ఇదే నెలలో వస్తున్నారు. అన్నీ కుదిర్తే ఇండియన్ లో నెక్ట్స్ 1000 కోట్ల ప్రాజెక్ట్ పుష్ప 2నే. మరి ఇన్ని బాధ్యతలు బన్నీ ఎలా మోస్తారో చూడాలిక.

బ్రేక్‌ఫాస్ట్‌కి మొలకెత్తిన పెసర్లు తింటే.. గుండె జబ్బులు జీవితంలో రానేరావు

మొలకెత్తిన పెసర్లు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఇవి బరువు తగ్గడానికి కీలకంగా పని చేస్తాయి. మొలకెత్తిన మొలకెత్తిన పెసర్లు ఎన్నో పోషకాలు ఉంటాయి.

మొలకెత్తిన పెసర్లు క్రమం తప్పకుండా అల్పాహారంగా తినడం ద్వారా అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు. మొలకెత్తిన ముంజలు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

మొలకెత్తిన పెసర్లు ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు సులభంగా జీర్ణమవుతాయి. మొలకెత్తిన పెసర్లు తినడం వల్ల గ్యాస్-గుండె మంట సమస్యను నివారించవచ్చు.

మొలకెత్తిన పెసర్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుందని ‘జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ’లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది

మొలకలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే మొలకెత్తిన పెసర్లు తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుం. గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది

మొలకెత్తిన పెసర్లలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. మొలకెత్తిన ముంగ్ బీన్స్ తినడం వల్ల అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదాన్ని దూరంగా ఉంచుతుంది.

స్మార్ట్‌ఫోన్‌ జీవిత కాలం ఎంత? ఎన్ని సంవత్సరాలకు కొత్త ఫోన్‌ మార్చాలి?

స్మార్ట్‌ఫోన్‌ జీవిత కాలం ఎంత? ఎన్ని సంవత్సరాలకు కొత్త ఫోన్‌ మార్చాలి? మొబైల్‌లు ఇకపై కేవలం కాల్స్ చేయడానికి మాత్రమే పరిమితం కావు.

స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు చాలా ఉపయోగకరమైన ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఇవి మన అనేక పనులను తక్కువ సమయంలో పూర్తి చేయడంలో సహాయపడతాయి. అయితే, మీరు చాలా సంవత్సరాలుగా ఫోన్‌లను ఉపయోగిస్తుంటారు. ఫోన్ జీవిత కాలం ఎంత? అనే విషయం తెలుసా?

కొంతమందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి ఉండవచ్చు, కానీ ఇప్పటికీ చాలా మందికి తెలియదు. మొబైల్ జీవితకాలం ఎంత అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఫోన్‌ను మార్చాలి?

ఆపిల్ తన పాత మోడళ్లను వాడుకలో లేకుండా చేస్తుంది, కంపెనీ ప్రకారం.. ఐఫోన్‌ 5, 7 సంవత్సరాల కంటే తక్కువ అమ్మకానికి ఉన్నప్పుడు ఫోన్‌ను పాతకాలపు విభాగంలో చేర్చుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ తయారీ కంపెనీ ఫోన్‌ను ఎన్ని సంవత్సరాలు వాడాలో ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

మీరు మీ ఫోన్‌ను ఎప్పుడు మార్చాలి?: ఏదైనా కొత్త ఫోన్ లాంచ్ అయినప్పుడు ఆ ఫోన్ ఎన్ని సంవత్సరాలలో సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందో కంపెనీ తెలియజేస్తుంది. మార్కెట్‌లోని కొన్ని కంపెనీలు 5 సంవత్సరాల పాటు అప్‌డేట్‌లను అందిస్తే, కొన్ని కంపెనీలు 7 సంవత్సరాల పాటు అప్‌డేట్‌లను అందిస్తాయి.

మీరు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఫోన్ వాడినట్లయితే, మీ ఫోన్ కంపెనీ నుండి అప్‌డేట్‌లను స్వీకరించడం ఆపివేసినట్లయితే, మీ ఫోన్ పాతది అయినట్లు అర్థం. అటువంటి పరిస్థితిలో ఫోన్ భద్రతా ప్రమాదాలు, అనుకూలత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు ఈ సమస్యను నివారించాలనుకుంటే ఫోన్‌ను మార్చడం మంచిది.

రాతి చేపకు జీవం వస్తే కలియుగం అంతమే.. ఎక్కడో తెలుసా?

అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో సౌమ్యనాథస్వామి దేవాలయం ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన దేవాలయం 10 ఎకరాల విస్తీర్ణం కలిగి 108 స్తంభాలతో నిర్మించబడింది.

ఈ దేవాలయంలో 108 ప్రదక్షిణలు చేసి స్వామి వారిని మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. సౌమ్యనాథ స్వామి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఈ ఆలయం స్థానిక ఇతిహాసాలు మరియు ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఆలయ వాస్తుకళకు ఆదరణ పొందిన చోళ రాజవంశ పాలనలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. శతాబ్దాలుగా ఈ ఆలయం విష్ణు భక్తులకు అతి ముఖ్యమైన ప్రదేశం. స్వౌమ్యనాధస్వామి ఆలయ నిర్మాణమే ఒక అద్భుతం సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూలవిరాట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయ నిర్మాణం జరగడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో కొన్ని శాసనాలపై సూర్య చంద్ర చిహ్నాలు ఉన్నాయి. ఆలయ కుడ్యాలపై మత్య్స, సింహ తదితర చిహ్నాలు ఉన్నాయి. ఆలయంలోని శిల్ప కలలకు ఎంతో పురాతన చరిత్ర దాగి ఉంది. అంతే కాదు కలియుగం అంతానికి చేపకు సంబంధం కూడా ఉందంటారు.

యుగాంతం గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలుపుతూ వచ్చారు. మరి కొన్ని పురాణాలూ యుగాంతం గురించి చెబుతూనే వచ్చాయి. ఐతే యుగంతాం గురించి సౌమ్యనాథ స్వామి ఆలయంలోని చేప కూడా చెబుతుంది. స్వామివారి ఆలయంలో అంతర్ భాగంలో పైన ఒక రాతిపై చేప ఆకారాన్ని శిల్పంగా చెక్కారు. అక్కడ మత్స్య ఆకారాన్ని చెక్కడానికి పెద్ద చరిత్ర ఉంది. అక్కడి వేద పండితులు చెప్పే విషయాల ప్రకారం భవిష్యత్తులో భారీ వరదలతో ఈ ఆలయంలో లోపలికి నీరు చేరుకుంటుందని, ఆ నీరు ఈ చేపని తాకిన వెంటనే ఆ చేపకి ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందని పురాణాలు చెబుతున్నాయని వేదపండితులు అంటున్నారు. అప్పుడు ఈ కలియుగం అంతం అవుతుందని స్థల పురాణం చెప్తోందని అంటున్నారు. ఇంతకీ చేపకు జీవం వస్తుందా కలియుగం అంతం అవుతుందా అనేది శాస్త్రీయం. ఇది ఏమైనా కలియుగ అంతంపై అనేక పురాణాలు ఉన్నాయి అందులో ఇది ఒకటి.

మోదీ హయాంలో పన్ను వసూళ్లు ఎంత పెరిగాయో తెలుసా? ఈ ఏడాది ఎంత?

2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన ప్రభుత్వం దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించింది. ఈ దేశాల్లో ఒకదానిలో ప్రత్యక్ష పన్ను వసూళ్లను పెంచేందుకు సవరణ కూడా చేశారు.

ఇప్పుడు దాని ప్రయోజనాలు కూడా కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్లలో దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 182 శాతం పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎంత పన్ను వసూలు అయ్యిందో తెలుసా?

గత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.19.60 లక్షల కోట్లు. ఈ ప్రత్యక్ష పన్ను సేకరణ FY 2014-15లో ప్రత్యక్ష పన్ను వసూళ్లతో పోలిస్తే మొత్తం 182 శాతం వృద్ధిని సూచిస్తుంది.

పెరిగిన వ్యక్తిగత ఆదాయపు పన్ను:

ఆదాయపు పన్ను శాఖ కొత్త నివేదిక ప్రకారం, కార్పొరేట్ పన్ను వసూళ్లు గత 10 సంవత్సరాలలో రెండింతలు పెరిగాయి. అలాగే ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9.11 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఈ కాలంలో వ్యక్తిగత పన్ను వసూళ్లు కూడా దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. 10.45 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.

2014-15లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలో తొలి ఏడాది ప్రత్యక్ష పన్నుల వసూళ్లు దాదాపు రూ.6.96 లక్షల కోట్లు. అందులో సుమారు రూ. 4.29 లక్షల కోట్లు కార్పొరేట్ పన్ను, రూ. 2.66 లక్షల కోట్లలో వ్యక్తిగత ఆదాయ పన్ను కూడా ఉంది.

ఐటీఆర్‌ ఫైలింగ్‌ల సంఖ్యను రెట్టింపు

దేశంలో ఆదాయపు పన్ను వసూళ్లు పెరగడమే కాకుండా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 4.04 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. 2023-24లో వీటి సంఖ్య 8.61 కోట్లకు పెరిగింది. కాగా, దేశంలో జిడిపికి ప్రత్యక్ష పన్ను నిష్పత్తి 2014-15లో 5.55 శాతం నుంచి 2023-24 నాటికి 6.64 శాతానికి పెరిగింది. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2014-15 అసెస్‌మెంట్ సంవత్సరంలో 5.70 కోట్ల నుండి 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరంలో 10.41 కోట్లకు పెరిగింది.

దేశ ఆర్థిక వ్యవస్థను చక్కగా నడిపేందుకు భారత ప్రభుత్వం అనేక రకాల పన్నులను వసూలు చేస్తుంది. ఇందులో ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను రెండూ ఉంటాయి. ప్రత్యక్ష పన్నులలో ప్రధానంగా కార్పొరేట్ పన్ను, ఆదాయపు పన్నులు ఉంటాయి. జీఎస్టీ, కస్టమ్ డ్యూటీ మొదలైనవి పరోక్ష పన్నులలో చేర్చారు.

విజయవాడ నుంచి తెనాలికి పల్లెవెలుగు బస్సెక్కిన వైఎస్ షర్మిల.. ఎందుకంటే?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీపై నిలదీశారు. విజయవాడ నుంచి తెనాలికి ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికుల పక్కనే కూర్చుని వారితో ఆమె మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు కాకపోవడంపై మహిళల ఉద్దేశం ఏంటో ఆమె తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఫ్రీ బస్సు కోసం తామంతా ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమెకు వారు చెప్పారు. దీంతో ఉచిత బస్సు ప్రయాణం హామీ కోసం గట్టిగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని షర్మిల మహిళా ప్రయాణికులకు సూచించారు. అలాగే ప్రభుత్వాన్ని కూడా వెంటనే ఈ హామీ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు పాలసీల పేరుతో టైంపాస్ చేస్తున్నారంటూ మీడియా ముందు షర్మిల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

తిరుపతిలో మీరిచ్చిన మాట ఎక్కడ పోయింది? మోదీని ప్రశ్నించిన షర్మిల

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో నిలబడి ప్రధాని మోదీ చెప్పారని.. ఆయన ఇచ్చిన మాట ఎక్కడ పోయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే.. పరిశ్రమల కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. పోటీ పడి మరీ ఏపీకి పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాఖండ్‌లో 2 వేల పరిశ్రమలు వచ్చాయని.. హిమాచల్ ప్రదేశ్‌లో దాదాపు 10 వేల పరిశ్రమలు వచ్చినట్లు గుర్తు చేశారు. మరి హోదా మీద మోదీ ఇచ్చిన మాట ఎక్కడ పోయిందని షర్మిల మోదీని ప్రశ్నించింది.

క్లాసిక్​ లుక్​ ఇచ్చే మహీంద్రా స్కార్పియో క్లాసిక్​లో ‘బాస్​’ ఎడిషన్​- అదిరిపోయిందంతే!

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎస్​యూవీ పండగ సీజన్​ వరకే లభిస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో ఫ్యాన్స్​కి క్రేజీ న్యూస్​! పండగ సీజన్​ నేపథ్యంలో మహీంద్రా క్లాసిక్ ఎస్​యూవీకి కొత్త ఎడిషన్​ని సంస్థ లాంచ్​ చేసింది. దీని పేరు మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ బాస్ ఎడిషన్. డీలర్​షిప్ స్థాయిలో యాక్ససరీస్ ద్వారా చేసే కాస్మెటిక్ మార్పులు, ఫీచర్ అడిషన్స్​తో ఈ మోడల్​ రానుంది.

స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ పండుగ సీజన్ కోసం మాత్రమే అమ్మకానికి ఉంటుందని తెలుస్తోంది. ఈలోపే త్వరపడితే బెస్ట్​ డీల్స్​ లభించొచ్చు! ఈ నేపథ్యంలో ఈ కొత్త ఎడిషన్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్: ఎక్స్​టీరియర్​

ఈ ఎస్​యూవీలో బానెట్ స్కూప్, ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్, రేర్​ రిఫ్లెక్టర్, టెయిల్ ల్యాంప్, డోర్ హ్యాండిల్స్, సైడ్ ఇండికేటర్స్, రేర్ క్వార్టర్ గ్లాస్, హెడ్​ల్యాంప్​లపై డార్క్ క్రోమ్ గార్నిష్​తో కొత్త బాస్ ఎడిషన్ వస్తుంది. ఓఆర్వీఎంల కోసం ఫ్రంట్ బంపర్, రెయిన్ వైజర్లు, కార్బన్ ఫైబర్ కవర్లకు యాడ్-ఆన్​గా అమర్చారు. బ్లాక్ పౌడర్ కోటింగ్ తో ఫినిష్ చేసిన ఈ ఎస్​యూవీకి రేర్​ గార్డ్​ను కూడా అమర్చారు.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్: క్యాబిన్..

ఈ మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ బాస్​ ఎడిషన్​లో ఇప్పుడు వెనుక పార్కింగ్ కెమెరాను అమర్చారు, ఇది పార్కింగ్ ప్రదేశాలలో వాహనాన్ని నడపడానికి సహాయపడుతుంది. అప్​హోలిస్టరీని నలుపు రంగులోకి మార్చారు. దానితో పాటు పిల్లో, కుషన్​లను కలిగి ఉన్న మహీంద్రా కంఫర్ట్ కిట్ సైతం వస్తుంది.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్: ఇంజిన్..

ఈ మహీంద్రా స్కార్పియో బాస్​ ఎడిషన్​లో 2.2-లీటర్ ఎంహాక్ డీజల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 3,750 ఆర్​పీఎమ్ వద్ద 130 బీహెచ్​పీ పవర్​, 1,600-2,800 ఆర్​పీఎమ్ వద్ద 300 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్, 4×4 డ్రైవ్ ట్రైన్ ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్: కలర్ ఆప్షన్లు..

మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ని సంస్థ ఐదు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. గెలాక్సీ గ్రే, డైమండ్ వైట్, స్టెల్త్ బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్ ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్: ధర..

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్​ ఎడిషన్​ ఎస్​ మరియు ఎస్ 11 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధర రూ.13.62 లక్షల నుంచి ప్రారంభమై రూ.17.42 లక్షల వరకు ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ అని గుర్తుపెట్టుకోవాలి.

50ఎంపీ ట్రిపుల్​ కెమెరా- 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీతో షావోమీ 15.. బెస్ట్​ ఆల్​రౌండ్​ స్మార్ట్​ఫోన్​?

షావోమీ 15 లాంచ్​కు రెడీ అవుతుంది. అయితే లాంచ్​కి ముందే, ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​కి సంబంధించిన అనేక కీలక ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

షావోమీ స్మార్ట్​ఫోన్స్​కి మంచి డిమాండ్​ ఉంది. అందుకే సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్స్​ని లాంచ్​ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు, ఈ నెలలోనే షావోమీ 15ని లాంచ్​ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి ముందే, ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన ఎన్నో కీలక ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. అవి యూజర్స్​ని చాలా ఎగ్జైట్​ చేస్తున్నాయి! ఈ నేపథ్యంలో రాబోయో షావోమీ 15 స్మార్ట్​ఫోన్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

షావోమీ 15 కీలక స్పెసిఫికేషన్లు ఆన్​లైన్​లో లీక్..

యోగేష్ బ్రార్ లీక్ ప్రకారం షావోమీ 15 6.36 ఇంచ్​ 1.5కే ఫ్లాట్ అమోలెడ్ డిస్​ప్లేతో వస్తుంది. ఇది షావోమీ 14 మాదిరిగానే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ చిప్​సెట్​తో ఈ ఫోన్ పనిచేయనుంది. ఇది ఈ నెలాఖరులో కంపెనీ ఫ్లాగ్​షిప్ ప్రాసెసర్​గా లాంచ్ కానుంది. స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 కలిగి ఉన్న దాని మునుపటి మోడల్ మాదిరిగా కాకుండా, ఈ రాబోయే మోడల్ “ఎలైట్” బ్రాండింగ్​కు అనుకూలంగా “జెన్” నామకరణ సంప్రదాయాన్ని తొలగించే అవకాశం ఉంంది. కెమెరాల పరంగా చూస్తే, షావోమీ 15లో 50 మెగాపిక్సెల్ ఓవీ 50 హెచ్​ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ 3.2 రెట్ల టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. మునుపటి మోడళ్ల మాదిరిగానే, ఈ ఫోన్ ఇమేజ్ నాణ్యతను పెంచడానికి లైకా ఆప్టిక్స్​ని ఉపయోగిస్తుంది.
షావోమీ 15: బ్యాటరీ, ఇతర కీలక అప్​గ్రేడ్స్​..

లీక్స్​ ప్రకారం ఈ షావోమీ స్మార్ట్​ఫోన్​లో 90వాట్ వైర్డ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్​తో కూడిన 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. సాఫ్ట్​వేర్​ విషయానికొస్తే, షావోమీ 15 హైపర్ఓఎస్ 2.0 పై పనిచేసే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 పై ఆధారపడి ఉంటుంది. ఇది ఐపీ68 రేటింగ్ కలిగి ఉంటుందని, డస్ట్​- వాటర్​ రెసిస్టెన్స్​ అందిస్తుందని భావిస్తున్నారు.

మునుపటి మోడళ్లతో పోలిస్తే షావోమీ 15 దాని ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీలో గణనీయమైన అప్​గ్రేడ్స్​ కలిగి ఉంటుందని ఈ లీకులు సూచిస్తున్నాయి. ఫోన్ డిజైన్ ఇంకా అఫీషియల్​గా వెరిఫై అవ్వలేదు కానీ, షావోమీ 15 ప్రో మీద లీకైన రెండర్లు.. షావోమీ 14 ప్రోతో పోలికలను చూపిస్తూ కొన్ని ఆధారాలను అందించాయి. రెక్టాంగ్యులర్​ కెమెరా మాడ్యూల్ ఉంది. ప్రధాన వ్యత్యాసం సెన్సార్ల వెలుపల ఫ్లాష్ పునర్నిర్మాణం!

షావోమీ సంస్థ షావోమీ 15, షావోమీ 15 ప్రోలను మొదట చైనాలో లాంచ్ చేయనుంది. అక్కడి నుంచి కొన్ని నెలల తర్వాత భారతదేశంతో సహా ఇతర మార్కెట్లలో ఈ స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​ అవుతాయి. అయితే అఫీషియల్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీని మీద సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

రైతు బజార్లలో నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు, ఎక్కడా కనిపించని సబ్సిడీ ఉల్లి, టమాటా, వంట నూనెలు

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎక్కడా ఫలితాన్ని ఇవ్వడం లేదు. సబ్సిడీ ధరలకు ఉల్లిపాయలు, టామాటాలు, వంట నూనెల్ని అందించాలని నిర్ణయించినా క్షేత్ర స్థాయిలో ఆ ధరలతో ఎక్కడా అమ్మకాలు జరగక పోవడం మంత్రి తనిఖీల్లో బయటపడింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రకటనలకు, ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన లేదని మంత్రి తనిఖీల్లోనే స్పష్టమైంది. ఏపీలో నిత్యావసర వస్తువుల ధరల భారం నుంచిప్రజలకు ఉపశమనం కలిగించడానికి సబ్సిడీ ధరలతో విక్రయించాలని నిర్ణయించినా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు. రైతు బజార్లు మొదలుకుని సూపర్ బజార్ల వరకు ఎక్కడా సబ్సిడీ ఉత్పత్తుల జాడ కనిపించడం లేదు.

ప్రజలకు విక్రయించే సరుకులు నాణ్యత, ధరలపై విజయవాడలో పడమట రైతుబజార్ , గురునానక్ కాలనీలో ఉన్న ఉషోదయ సూపర్ మార్కెట్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ధరల స్థిరీకరణ విషయంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రైతు బజార్లు, రిటైల్ మార్ట్‌లు, దుకాణాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నాణ్యమైన సరకులను వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బహిరంగ మార్కెట్‌లలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో భాగంగా అన్ని రైతు బజార్లలో వంట నూనెలు, కందిపప్పు, ఉల్లి, టమాటాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం గత వారం పదిరోజులుగా ప్రకటనలు ఇస్తోంది. క్షేత్ర స్థాయిలో సబ్సిడీ ధరలకు విక్రయాలు పెద్దగా జరగడం లేదు. మార్కెటింగ్‌ శాఖ నుంచి అరకొరగా వచ్చే ఉత్పత్తులు రోజూ కొంతమందికి మాత్రం విక్రయిస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో మంత్రి చర్యలు చేపట్టారు.

విజయవాడ పడమట రైతు బజార్‌, గురు నానక్ కాలనీలోని ఉషోదయ సూపర్ మార్కెట్ ను గురువారం మంత్రి నాదెండ్ల ఆకస్మికంగా తనిఖీ చేసి స్పెషల్‌ కౌంటర్‌ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచిన నిత్యావసర సరుకులను పరిశీలించారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు, వంటనూనె చౌక ధరలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.

రైతు బజార్లో సరుకులలో వ్యత్యాసంపై ఎస్టేట్‌ ఆఫీసర్‌ను నిలదీశారు. రైతు బజారులో బియ్యం, కందిపప్పు పంపిణీకి ఏర్పాటు చేసిన కౌంటర్ల నిర్వహణకు సమయపాలన పాటించకపోవడాన్ని గుర్తించి షాపుల నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.

వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. గురు నానక్ కాలనీ ఉషోదయ సూపర్ మార్కెట్ సరుకుల ధరలు పరిశీలించినప్పుడు.. కందిపప్పు ధర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా అమ్మకాలు లేకపోవడానికి మంత్రి సూపర్ మార్కెట్ నిర్వాహకులను నిలదీశారు.అధిక ధరకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వినియోగదారులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు, వంటనూనె రైతు బజార్లు, హోల్‌ సేల్‌, రిటైల్‌ దుకాణాలలో అందుబాటులో ఉంచినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. మార్కెట్‌ ధరల కంటే తక్కువ ధరలకే నిత్యావసర సరుకులను వినియోగదారులకు అందజేయడం జరుగుతుందన్నారు.

పామాయిల్ లీటర్ 110 రూపాయలకు , సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ను లీటర్124 రూపాయలకు , కిలో 67 రూపాయలకే కందిపప్పు, వినియోగదారులకు అందుబాటులో ఉంచామన్నారు.ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేయని వ్యాపారులు..

ధరలు నియంత్రణలో భాగంగా, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయాలు జరపాలని మంత్రులు, అధికారులు పదేపదే చెబుతున్నా వ్యాపారులు మాత్రం ఆ ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. ప్రభుత్వ ధరలకు విక్రయాలు గిట్టుబాటు కావడం లేదంటూ రైతు బజార్లలో సైతం అదనపు ధరలు వసూలు చేస్తున్నారు.

నవంబర్ రెండో వారంలో ఏపీ బడ్జెట్..! 3 ప్రాజెక్టులకు పెద్దపీట.. 6 ముఖ్యాంశాలు

కూటమి ప్రభుత్వం ఇంకా బడ్జెడ్ ప్రవేశపెట్టడం లేదని.. జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. చాలామంది ఏపీ బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ రెండో వారంలో ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

నవంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్‌ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌.. బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. నవంబర్ రెండో వారంలో సమావేశాలు నిర్వహించి.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మూడు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఏపీ బడ్జెట్ 2024కు సంబంధించి 6 ముఖ్యాంశాలు ఇవీ..

1.అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2,86,389 కోట్లకు బడ్జెట్‌ సమర్పించారు. 2024 ఏప్రిల్‌ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు గత ప్రభుత్వం శాసనసభ ఆమోదం తీసుకుంది.

2.జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ సమర్పించాల్సి ఉంది. కానీ.. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. దీంతో మరోసారి ఓటాన్‌ అకౌంట్‌కు ఆర్డినెన్సు రూపంలో ఆమోదం తీసుకున్నారు.

3.ఆగస్టు నుంచి నవంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు, ఇతర కార్యకలాపాల కోసం రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్‌ నుంచి ఆమోదం తీసుకున్నారు. మొత్తం 8 నెలల కాలం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ పద్దుతోనే గడిచిపోయింది.

4. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే వృద్ధాప్య, ఇతర పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. కానీ.. మిగిలిన సంక్షేమ పథకాల అమలు సరిగా జరగడం లేదు. దీంతో ఈ బడ్జెట్‌లో ఆయా పథకాల కోసం నిధులు కేటాయించేందుకు ఆర్థికశాఖ ప్లాన్ చేస్తోంది.

5.గతంలో జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇప్పుడు కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే.. గతంలో కంటే ఎక్కువ నిధులు అవసరం. దాదాపు రూ.20 వేల కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిధుల సమీకరణ, కేటాయింపుల విషయంలో ఆర్థిక శాఖ అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పథకానికి ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలు వేస్తున్నారు.

6.ఈ ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్‌ దాదాపు రూ.2.90 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుకు పెద్దపీట వేయనున్నారు. అటు కేంద్రం నుంచి వచ్చే నిధులు, సాయంపైనా ఈ బడ్జెట్‌లో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

క్రమశిక్షణతో ఉండండి, ప్రజలకు అన్నీ గుర్తుంటాయి.. వైసీపీకి వచ్చిన ఫలితాలే నిదర్శనమన్న చంద్రబాబు

టీడీపీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు క్రమశిక్షణతో ఉండాలని ప్రజలు అన్నీ గుర్తు పెట్టుకుంటారని, ఎన్డీఏతోనే భవిష్యత్తు ఉంటుందనే భరోసా ప్రజలకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన బాబు వైసీపీకి వచ్చిన ఫలితాలు టీడీపీ కూటమికి రాకుండా జాగ్రత్త పడాలన్నారు.
ఎన్డీఏకు వైసీపీ గతి పట్టకూడదని హెచ్చరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

ప్రజలు మౌనంగా ఉన్నంత మాత్రాన అన్ని భరిస్తున్నారని, అన్నీ గమనిస్తారనే అప్రమత్తతో నాయకులు వ్యవహరించాలని, మద్యం వ్యాపారంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుంటే సహించనని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయి ఎన్నికల్లో భారీ మెజార్టీని కట్టబెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమీక్షలో పార్టీ నాయకుల ఏ స్థాయి వారైనా క్రమశిక్షణతో ఉండాలని హెచ్చరించారు. అందరి పనితీరును సమీక్షిస్తున్నామని వైసీపీకి వచ్చిన పరిస్థితి రానివ్వకూడదన్నారు.

ఐదేళ్లలో వైసీపీ చేయని తప్పు లేదు, బెదిరించని విషయం లేదని ఎన్నికల్లో ఆ పార్టీకి 11 స్థానాలకు ఎందుకు పడిపోయిందో ఆలోచించుకోవాలన్నారు. వైసీపీ ఎన్ని సర్వేలు చేసినా, 175చోట్ల వస్తామని చెప్పినా ఎందుకు గెలవలేదని, ఆ రోజు వారు చేసిన పనులన్నీ ప్రజల మనసులో ఉన్నాయని చంద్రబాబు అన్నారు.
మద్యం వ్యాపారంలో వేలు పెట్టొద్దు…

ఏపీలో మాగుంట వంటి కుటుంబాలు ఎప్పటి నుంచో లిక్కర్ వ్యాపారంలో ఉన్నారని, రాజకీయాల్లోకి వచ్చాక కొత్తగా మద్యం వ్యాపారంలోకి రావాలనుకుంటే మాత్రం ఊరుకునేది లేదని, మద్యం వ్యాపారంలో జోక్యాన్ని ఊరుకోనని, అంతా క్రమశిక్షణతో ఉండాల్సిందేనని, అలాంటి వాటిని తాను ఊరుకోనని, అవతల వారి వద్ద వేల కోట్ల డబ్బులున్నాయని, డబ్బులు ఖర్చు పెట్టారని, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే, ప్రజల్లో నమ్మకం లేకపోతే విజయం దక్కదన్నారు. మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకుంటున్న వారిని ఉపేక్షించనని చంద్రబాబు హెచ్చరించారు.
వైసీపీ పరిస్థితి వద్దు…

వైసీపీ హయంలో ప్రజలు విధిలేక మాట్లాడలేదని, టీడీపీ కూడా నిలబడకపోతే ఎన్నికల్లో ఏమయ్యేదో తెలీదని.. టీడీపీ నిలబడి పోరాడింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 93శాతం విజయం సాధించామని చెప్పారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పనిచేయడం, కష్టపడటం, ఓట్లేయడం వాస్తవమేనని, అమెరికా నుంచి కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చి ఎన్నికల పనిచేసి గెలిపించుకున్నామనే తృప్తితో వెళ్లారన్నారు. అయితే ప్రజలు తమను ఇబ్బంది పెడుతున్నారనే భావనకు గురైతే పార్టీకి ఇబ్బందులు తప్పవన్నారు.

వారిలా ప్రవర్తించొద్దు..రావణ కాష్టం చేయోద్దు

ఒక నాయకుడు జైలుకు వెళ్లారు, మరో నాయకుడు టార్చర్‌ అనుభవించారని కానీ అలాంటివి రిపీట్‌ చేస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని, తప్పు చేశారని కక్ష సాధింపులకు పాల్పడితే ప్రజలు క్షమించరన్నారు. ప్రస్తుతం సమిష్టిగా పనిచేస్తే తప్ప ప్రజల అకాంక్షలు నేరవేర్చలేమన్నారు.
ఎవరు తప్పు చేసినా నాదే బాధ్యత..

ప్రతిఒక్కరు క్రమశిక్షణతో వ్యవహరించాలని, చిట్టచివర ఉండే ఉద్యోగి తప్పు చేసినా సిఎం మీదకు వస్తుందని, ఎన్డీఏలో ఉండే ఏ పార్టీ కార్యకర్త తప్పు చేసినా దానికి సీఎం బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఎవరు ఏమి చేసినా దానికి ముఖ్యమంత్రిదే బాధ్యత అవుతుందని, 95లో సీఎం అయినపుడు చాలా వేగంగా వెళ్లామని, అదే సమయంలో ప్రజలు అదే విధంగా ఆశీర్వదించారని, ప్రజలతో ప్రభుత్వం ప్రవర్తించే తీరు వల్లే ఎన్నికల్లో తిరిగి వచ్చే ఫలితాలు ఉంటాయని, అది అంతా గుర్తు పెట్టుకోవాలన్నారు.
వేవ్‌ను వాడుకోలేకపోయి ఓడారు..

తాను అనేక సర్వేలు చేసి, ఫలితాలను సమీక్షించుకుని ముందుకు వెళ్లామన్నారు. తాము తీసుకున్న నిర్ణయాలు కలిసొచ్చాయని, వేవ్‌ కూడా వచ్చిందన్నారు. కొన్ని నియోజక వర్గాల్లో కొందరు ఉపయోగించుకోలేకపోయారని, 25 పార్లమెంటు స్థానాలు గెలిచి ఉండేవారిమని, అసెంబ్లీల్లో రెండు మూడు తప్ప అన్ని స్థానాలు గెలిచి ఉండేవారిమన్నారు.

ప్రజలంతా ప్రభుత్వంపై ఆసక్తిగా చూస్తున్నారు.జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వంపై, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఆసక్తికరంగా గమనిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.2014లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసి కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశామని, ఈసారి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చామని, పార్టీల మధ్య సమన్వయం, ప్రభుత్వం మీద అంచనాలు పెట్టుకున్న ప్రజల అకాంక్షలు నెరవేర్చాలన్నారు. ఐదేళ్లు అన్ని విధాలుగా నష్టపోయి, త్యాగాలు చేసి, బాధలకు గురైన కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యవస్థలు ధ్వంసం…

నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆలోచిస్తే ఎప్పుడూ ఇన్ని అవరోధాలు చవి చూడలేదన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం సర్వ నాశనం చేశారని, అధికారులకు పోస్టింగులు ఇస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, పరిమిత సంఖ్యలో ఆలిండియా సర్వీస్ అధికారులు ఉంటారని, వారికి పరిమితులు ఉంటాయని, అప్పట్లో పనిచేసిన వారిలో చాలామంది ప్రభుత్వానికి లొంగిపోయి, వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారని చెప్పారు. ఏ వ్యవస్థ తన పని తాను చేసే స్థితిలో లేదన్నారు. ఏదో ఒక వ్యవస్థ బాగోకపోతే సరిచేయొచ్చని, వ్యవస్థలు ఏవి సక్రమంగా లేవన్నారు.

కేంద్రం ఇచ్చే డబ్బుల్ని ఎక్కడికక్కడ మళ్ళించేశారని, మనకు రావాల్సిన డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితులు లేవని, దేనికి వాడారో కూడా లెక్కలు లేకుండా వాడేశారని, ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల వినియోగంపై లెక్కలు లేవని, కేంద్రం పంపిన డబ్బులు, ఏ శాఖ, ఎందుకు ఖర్చు చేసిందో లెక్కలు లేవని చెప్పారు.

పంచాయితీరాజ్‌లో రూ990కోట్ల రుపాయలు మళ్ళించారని, దాని వల్ల రూ. 1200కోట్లు రావాల్సిన నిధులు ఆగిపోయాయని, నిధులు వచ్చే పరిస్థితి లేకుండా చేశారని చంద్రబాబు చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లో దేశ రాజకీయాల్లో టీడీపీ క్రియాశీల పాత్ర పోషించిందని గుర్తు చేశారు. యునైటెడ్‌ ఫ్రంట్‌, ఎన్డీఏలలో కీలక పాత్ర పోషించింది. ఆరేళ్లు వాజ్‌పేయ్ ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకోకుండా పనిచేశామని చెప్పారు.
వచ్చే ఎన్నికలకు బీజేపీ సిద్ధం అవుతోంది…

వచ్చే ఎన్నికల కోసం అప్పుడే బీజేపీ సన్నద్ధం అవుతోంది. హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఎన్డీఏ పక్షాల సమావేశాన్ని నిర్వహించారని చంద్రబాబు చెప్పారు.
అవకాశం దక్కని వారికి న్యాయం చేస్తాం…

ఐదేళ్లలో అందరూ అనేక బాధలకు గురయ్యారని, రాజకీయ నాయకులే కాకుండా సాధారణ ప్రజలు కూడా బాధలకు గురయ్యారని, తనను అరెస్ట్‌ చేసినపుడు పవన్ కళ్యాణ్ వచ్చినపుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ప్రకటించారని చెప్పారు. చివర్లో బీజేపీ కూడా తమతో కలిసిందన్నారు.

ఎన్నికల పొత్తులో 31సీట్లను ఆ పార్టీలకు ఇచ్చామని చెప్పారు. పొలిటికల్ రీ ఇంజనీరింగ్‌‌కు వెళ్లి, టీడీపీకి అండగా ఉన్న బీసీ వర్గాలకు అగ్ర స్థానం ఇచ్చామని, ఇప్పటి వరకు ప్రాతినిథ్యం ఇవ్వని వర్గాలకు అవకాశం ఇచ్చామన్నారు. గెలుపే ధ్యేయంగా పనిచేయాలనే లక్ష్యంతో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అని నినాదం ఇచ్చినట్టు చెప్పారు.

ఎన్నికల పొత్తుల వల్ల పార్టీని నమ్ముకున్న వారికి కూడా సీట్లు ఇవ్వలేకపోయామని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చామని, ఒకరిద్దరు తప్ప అంతా సహకరించారని, వారిలో 65మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారని, యువతరం, చదువుకున్న వాళ్లు పార్టీలోకి వచ్చారని చెప్పారు. 18మంది కొత్త మంత్రులు వచ్చారని, ఎమ్మెల్యేలు, ఎంపీలు 80మంది కొత్తవారు వచ్చారన్నారు.
సంక్రాంతికి రాష్ట్రమంతటా రోడ్ల మరమ్మతులు…

సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రమంతటా రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రూ.700కోట్లతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
అన్ని హామీలు నెరవేర్చాం…

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తున్నామని చంద్రబాబు చెప్పారు. చెత్తపన్ను రద్దు, మత్స్యాకారుల కోసం 217జీవో రద్దు, స్వర్ణకారుల కార్పొరేషన్, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్, అర్చకుల జీతాలు పెంపు, దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు కనీస వేతనాలు, దీపదూప నైవేద్యాలకు 15వేలు, వేద విద్య అభ్యసించే వారికి రూ.6వేలు, చేనేత పరిశ్రమకు జిఎస్టీ రద్దు, రియింబర్స్‌మెంట్‌ వంటి నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

చేనేత కార్మికులకు రాయితీలు ఇస్తామని, ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టామని, ఒకే రాజధానికి కట్టుబడి ఉందని చెప్పాము. మన రాజధాని అమరావతి అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం కూడా అమోదం తెలిపిందన్నారు. విశాఖ ఆర్ధిక రాజధాని, విశాఖలో ఎక్కువ ఉపాధికల్పిస్తున్నామన్నారు. కర్నూలులో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్‌ షిప్‌, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం ఫేజ్‌ 1 రెండే‌ళలలో పూర్తి చేస్తామని, ఫేజ్‌ 2కు ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. భారీ వర్షాలతో 95శాతం చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. విజయవాడ వరదల్లో మునిగినా మిగిలిన చోట్ల ఇబ్బంది లేదన్నారు.

ఈనెల 23న ఏపీ కేబినెట్ భేటీ – అంజెడాలో ఉచిత గ్యాస్ స్కీమ్ తో పాటు మరికొన్ని కీలక అంశాలు..!

ఏపీ కేబినెట్ అక్టోబర్ 23వ తేదీన భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. సూపర్ సిక్స్ పథకంలోని ఉచిత గ్యాస్ స్కీమ్ తో పాటు దేవదాయ శాఖకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అక్టోబర్ 16వ తేదీన జరిగిన సమావేశంలో… పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఇదిలా ఉంటే… తాజాగా మరోసారి మంత్రివర్గం భేటీ కానుంది. అక్టోబర్ 23వ తేదీన జరిగే సమావేశంలో… మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రధానంగా చర్చిస్తారని తెలిసింది. అంతేకాకుండా… దేవదాయ శాఖకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ భేటీ నేపథ్యంలో అన్ని శాఖలు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

దీపావ‌ళికి సూప‌ర్ సిక్స్‌లో భాగ‌మైన మ‌హిళ‌ల‌కు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు అమ‌లు చేస్తామ‌ని ఇప్ప‌టికే క‌ర్నూలు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. క‌నుక రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో మ‌హిళ‌ల‌కు ఉచిత గ్యాస్ అంశంపై ఒక నిర్ణ‌యం తీసుకోనే అవకాశం ఉందని తెలుస్తోంది. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, రాజ‌ధాని అమ‌రావ‌తి పునఃనిర్మాణం వంటి అంశాల‌పై రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో చ‌ర్చ జ‌ర‌గే అవకాశం ఉంది.
కీలక అంశాలపై చర్చ…!

రాష్ట్రంలోని 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపైనా ఏపీ మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. మరికొన్ని కీలక నిర్ణయాలు ఉండొచ్చని సమాచారం.

రాష్ట్ర శాసనసభ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 23న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 6 వేల రేషన్‌ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. దీనిపై ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
నవంబర్ లో ఏపీ బడ్జెట్:

మరోవైపు నవంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్‌ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌.. బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

నవంబర్ రెండో వారంలో సమావేశాలు నిర్వహించి.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మూడు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పెద్దపీట వేసే అవకాశం ఉంది.

మారుతి నుంచి కొత్త Swift లిమిటెడ్ ఎడిషన్.. 50 వేల బెనిఫిట్స్

మారుతి సుజుకి కార్లకు ఇండియన్ మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటాయి. పైగా సర్విస్ విషయంలో మారుతి సూపర్ అనే చెప్పాలి. దేశంలో ఎక్కడ చూసిన మారుతి సర్విస్ సెంటర్లకు ఢోకా లేదనే చెప్పాలి. అయితే తన కార్ల అమ్మకాలను పెంచుకోవడంలో మారుతి కస్టమర్లని ఎప్పటికప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. కస్టమర్లకు ఎన్నో రకాల బెనిఫిట్స్ అందిస్తుంది. మారుతి తన బెస్ట్ సెల్లింగ్ కార్ల కోసం స్పెషల్ యాక్సెసరీస్ ప్యాక్‌లను తీసుకువస్తోంది. అందువల్ల మార్కెట్లో వాటి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ విధంగా ఇంతకుముందు బలెనో రీగల్ ఎడిషన్, మారుతి వ్యాగన్ఆర్ వాల్ట్జ్ ఎడిషన్, మారుతి బ్రెజ్జా అర్బనో ఎడిషన్‌లను మారుతి రిలీజ్ చేసింది. అయితే తాజాగా తన బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కార్ అయిన స్విఫ్ట్ ని కూడా కొత్త ఎడిషన్ లో లాంచ్ చేసింది. ఈ ఎడిషన్ పేరు మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ (Maruthi Swift Blitz). ఇదొక లిమిటెడ్ ఎడిషన్. ఇందులో స్పెషల్ ఏంటంటే .. ఇందులో స్పెషల్ యాక్సెసరీస్ ప్యాక్‌ ఉంటుంది. ఇక ఈ ఎడిషన్ లో ఎలాంటి ఫీచర్లు వస్తాయి? ఇందులో ఉండే స్పెషల్ యాక్సెసరీస్ ఏంటి? దీని ధర ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక ఈ సరికొత్త మారుతి స్విఫ్ట్ blitz ఎడిషన్ విషయానికి వస్తే.. ఇది మొత్తం 5 వేరియంట్‌లలో వస్తుంది. ఇందులో LXI, VXI, VXI AMT, VXI(O), VXI(O) AMT వేరియంట్లు ఉన్నాయి. ఈ వేరియంట్‌ల ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కార్లో మనకు “Rear Underbody Spoiler, Fog Lamp, Illuminated Door Sill Guards, Door Visors, Side Body Mouldings, Rear Upper Spoiler” వంటి యాక్సెసరీస్ వస్తాయి. ఆకట్టుకునే అంశం ఏమిటంటే దాదాపు 50 వేలు విలువ చేసే ఈ యాక్సెసరీస్ కిట్‌ను మారుతీ తన కస్టమర్లకు ఫ్రీగానే ఇస్తుంది. ఇక ఈ మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ధర విషయానికి వస్తే రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల దాకా ఉంటుంది. వేరియంట్ ని బట్టి ఈ కార్ ధర మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మేలో మార్కెట్లోకి వచ్చిన స్విఫ్ట్‌కు కంపెనీ CNG వేరియంట్‌ను యాడ్ చేసింది. ఇక ఈ కార్ లో 1.2-లీటర్ త్రీ-సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది.ఇది పెట్రోల్‌పై 82hp, 112Nm, CNGపై 70hp, 112Nm పవర్ ని జనరేట్ చేస్తుంది. పెట్రోల్‌ వెర్షన్ లో దీనికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఉంటుంది. ఎక్స్ట్రా గా 5 స్పీడ్ ఆటోమాటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే ఈ ఆప్షన్ బేస్ వేరియంట్ లో రాదు. బేస్ వేరియంట్ తప్ప మిగతా అన్నింటిలో ఈ ఆప్షన్ ఉంది.

స్విఫ్ట్ బ్లిట్జ్ అనేది ఈ సెగ్మెంట్లో ఫిఫ్త్ స్పెషల్ ఎడిషన్. దీనిలోని అన్నీ వేరియంట్లకు కూడా హిల్ హోల్డ్ కంట్రోల్, ESP, కొత్త సస్పెన్షన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఇంకా ఇందులో క్రూయిజ్ కంట్రోల్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), బ్రేక్ అసిస్ట్ (BA) వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఇక ఈ కార్ మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 24.80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ ఆటోమ్యాటిక్ వేరియంట్ అయితే 25.75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక CNG వేరియంట్ అయితే 32.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Health

సినిమా