Sunday, November 17, 2024

సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం! న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయి

భారత దేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్ళకు గంతలు ఉండేవి. చట్టం అందరికీ సమానమే అనే ఉద్దేశంతో న్యాయదేవత కళ్లకు గంతలు కట్టేవారు. చట్టం గుడ్డిది కాదు అన్న సందేశాన్ని ఇచ్చేలా న్యాదేవత కళ్లకు కట్టి ఉండే నల్ల రిబ్బన్ ని తొలగించారు. అంతేకాదు శిక్షకు ప్రతీకగా నిలిచే ఖడ్గం స్థానంలో రాజ్యాంగాన్ని సూచించేలా ఓ బుక్‌ని చేర్చారు. కొత్త మార్పులతో న్యాయదేవత (లేడీ ఆఫ్ జస్టిస్) విగ్రహం సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల గ్రంథాలయంలో దర్శనమిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాల మేరకు న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రిటీష్ వలసవాద చట్టాలకు స్వస్తి పలుకుతూ కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో న్యాయదేవత విగ్రహంలోనే మార్పులు చేయాయలని గతంలోనే జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. ‘న్యాయదేవత కళ్లకు గంతలు అనవసరం.. చట్టం ఎప్పటికీ గుడ్డిది కాదు. అందరినీ సమానంగా చూస్తుంది.. కత్తి హింసకు ప్రతీక. కానీ న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టల మేరకే తీర్పునిస్తుంది’ అని అన్నారు జస్టిస్ చంద్రచూడ్. దేశంలోని ప్రతీ కోర్టులో న్యాయదేవత విగ్రహం కచ్చితంగా ఉంటుంది. న్యాయదేవత విగ్రహం పేరు వినగానే మనకు కొన్ని గుర్తుకు వస్తాయి. న్యాయ దేవత కళ్లకు నల్లటి వస్త్రం కట్టి ఉంటుంది, ఎడమ చేతిలో ఒక కత్తి.. కుడి చేతిలో ఒక త్రాసు కనిపిస్తాయి. గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ దేవత అంటే మనకు ఇవే గుర్తుకు వస్తాయి. వెండితెరపై కోర్టు సీన్లు ఎంతో ఎమోషన్ గా కనిపిస్తుంటాయి. ఇప్పుడు న్యాయ దేవత పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు న్యాయ దేవత కళ్లు తెరిచింది.

కొత్తగా మార్పులు చేసిన న్యాయదేవత విగ్రహం.. సుప్రీం కోర్టు జడ్జిల లైబ్రరీలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలుసోషల్ మీడియాలో వైరలగ్‌గా మారాయి. చట్టానికి కళ్లు ఉండవని.. ఎందుకంటే డబ్బు, అధికారాన్ని బట్టి.. నిందితులకు చట్టాలు, తీర్పులు ఉండవని.. న్యాయ దేవత ముందు అందరూ సమానమేనని చెప్పేందుకే అలా ఉంచారు. కానీ ఇప్పుడు కొత్త చట్టాలు అమలవుతున్నాయి.. దానికి తగ్గట్టుగానే న్యాయదేవత ప్రతిమను కూడా మార్చాలన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే న్యాయదేవత విగ్రహంలో మార్పులు తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. ఇన్నాళ్ళు మనం కోర్టుల్లో చూసే న్యాయ దేవత జస్టియా అనే గ్రీకు దేవత. జస్టిస్ అనే పదం నుంచి జస్టియా అనే పేరు వచ్చిందంటారు. 17వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ కోర్టు అధికారి ఈ జస్టియా విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా మన దేశానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 18వ శతాబ్దంలో బ్రిటిష్ కాలంలో న్యాయ దేవత విగ్రహాన్ని ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది.బ్రిటిషర్లు దేశం నుంచి వెళ్లిపోయిన దాదాపు 7 దశాబ్దాల తర్వాత… ఇప్పుడు న్యాయదేవత కళ్లు తెరిచింది.

SBIలో లోన్ ఉందా? అయితే మీకు ఓ శుభవార్త.. తగ్గిన వడ్డీ రేట్లు

ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. స్టేట్ బ్యాంక్ లో ఎవరైతే వడ్డీ తీసుకున్నారో వారికి ఊరటనిచ్చింది. లోన్ వడ్డీ రేటును తగ్గించింది. సాధారణంగా అన్ని బ్యాంకులు కూడా ప్రతి నెలా లోన్లు, డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి. సర్దుబాటు చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన లోన్లు సర్ధుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే అన్ని లోన్ల పైన రేట్లని సవరించలేదు. కేవలం సెలెక్టేడ్ టర్మ్ లోన్లపై మాత్రమే వడ్డీ రేట్లను మార్చింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మార్చిన వడ్డీ రేట్లను అక్టోబర్ 15, 2024 నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇక ఇప్పుడు ఎస్‌బీఐలో వడ్డీ ఎంత పడుతుంది? మనం లోన్ ఈఎంఐ ఎంత కట్టాలి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు ఎస్‌బీఐలో ఎంసీఎల్ఆర్ (MCLR) వడ్డీ రేట్లనేవీ 8.20 శాతం నుంచి 9.10 శాతం మధ్య ఉన్నాయి. నెల రోజుల MCLR రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.20 శాతానికి చేరింది. 3 నెలల MCLR రేటు 8.50 శాతం, 6 నెలల MCLR రేటు 8.85 శాతానికి మార్చబడింది. ఇక కస్టమర్ లోన్ లకు లింక్ అయ్యే ఏడాది టెన్యూర్ MCLR రేటులో మాత్రం ఎలాంటి మార్పుని చేయలేదు. దీనిని 8.95 శాతంగానే ఉంచింది. ఇక రెండేళ్ల MCLR రేటు 9.05 శాతం, మూడేళ్ల MCLR రేటు 9.10 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే సంవత్సరం MCLR రేటు 8.95 శాతంగానే ఉంది. దీనిపై ఎస్బిఐ 20 బేసిస్ పాయింట్లు ఎక్స్ట్రా గా యాడ్ చేసి లోన్ లపై వసూలు చేస్తుంటుంది. అంటే దీని ప్రకారం మినిమమ్ ఇంట్రెస్ట్ రేట్ 9.15 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఆటో లోన్ పై 9.15 శాతం నుంచి 10.10 శాతం దాకా వడ్డీని చార్జ్ చేస్తుంది. క్రెడిట్ హిస్టరీ మంచిగా ఉండి, బ్యాంకుతో మంచి రేలేషన్ కలిగి ఉన్న వారికి తక్కువ వడ్డీ రేటుకే SBI లోన్ ఇస్తుంటుంది.

లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు అనుమతించే మినిమం రేటుని MCLR అని అంటారు. దీనిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిసైడ్ చేస్తుంది. అలాగే లోన్ తీసుకునే వారికి తాము సెలెక్ట్ చేసుకున్న లోన్ టెన్యూర్ ప్రకారం MCLRని బ్యాంకులు లెక్కిస్తాయి. ఎస్‌బీఐ నుంచి మీరు ఒక రూ.10 లక్షల లోన్ తీసుకున్నారు అనుకుందాం. దానికి 5 ఏళ్ల పాటు లోన్ టెన్యూర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు మీకు బ్యాంకు 9.50 శాతం, 10 శాతం వడ్డీ రేట్లపై లోన్ ఇస్తే.. మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుందో ఆన్‌లైన్ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. సపోజ్ 9.50 శాతం వడ్డీ అనుకుంటే నెలకు ఈఎంఐ 21 వేలు కట్టాలసి ఉంటుంది. టోటల్ గా మీరు 2.60 లక్షల వడ్డీని కట్టాల్సి వస్తుంది. అదే మీకు 10 శాతం వడ్డీ రేటుతో లోన్ వస్తే అప్పుడు నెలకు 21, 250 రూపాయల వరకు ఈ‌ఎం‌ఐ కట్టాల్సి వస్తుంది. అప్పుడు మీరు టోటల్ గా కట్టే వడ్డీ 2.74 లక్షలపైన ఉంటుంది. మీకు అప్లై అయ్యే వడ్డీ రేటు, మీరు తీసుకునే టెన్యూర్ ప్రకారం మీ ఈఎంఐ ఉంటుంది.

బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? 600 జాబ్స్ రెడీ.. ఈ అర్హతలుంటే చాలు

బ్యాంక్ జాబ్స్ కు కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. బ్యాక్ జాబ్ సాధించేందుకు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. కోచింగ్ సెంటర్లలో చేరి పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. బ్యాంక్ జాబ్ అయితే ఒత్తిడి ఉండదు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు. అన్నీటికి మించి సెలవులు ఎక్కువగా ఉంటాయి. మంచి జీతం. ఈ కారణాలతో యూత్ అంతా బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. బ్యాంక్ కొలువులు కొట్టాలంటే అంత ఈజీ కాదు. రాత పరీక్షలు రాయాలి. ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలి. అన్ని దశలను దాటితే తప్పా ఉద్యోగం వరించదు. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. రాత పరీక్ష లేకుండానే మీరు బ్యాంక్ జాబ్ ను సొంతం చేసుకోవచ్చు. అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2024 జూన్​ 30 నాటికి 20-28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేస్తారు. తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అర్హులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ట్రైనింగ్ పిరియడ్ లో అప్రెంటీస్​లకు నెలకు రూ.9000 స్టైపెండ్ అందిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలు చూసినట్లైతే.. అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.150 + జీఎస్‌టీ, ఎస్టీ, ఎస్సీలు రూ.100 + జీఎస్‌టీ చెల్లించాలి. దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 24వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం bankofmaharashtra.inను సంప్రదించాల్సి ఉంటుంది.

RBI ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్.. ఎంపికైతే నెలకు రూ. 20 వేలు మీవే.. ఇలా అప్లై చేసుకోండి

యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వారి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి స్కిల్స్ పెంపొదిస్తున్నది. ఈ క్రమంలో పీఎం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. దీని ద్వారా నిరుద్యోగులకు టాప్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందే ఛాన్స్ లభిస్తుంది. అంతేకాదు పీఎం ఇంటర్న్ షిప్ కు ఎంపికైతే ఏడాదికి 60 వేలు సాయం అందిస్తారు. ఇప్పుడు ఇదే రీతిలో బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యువతకు గుడ్ న్యూస్ అందించింది. ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం 2024ను ప్రకటించింది. ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంకు ఎంపికైతే నెలకు రూ. 20 వేలు ఉచితంగా పొందొచ్చు. మరి దీనికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆర్బీఐ అందించే ఈ సమ్మర్ ప్లేస్ మెంట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, లా, కామర్స్, ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను అభ్యసిస్తున్న వారు అర్హులు. అలాగే భారతదేశంలోని ప్రసిద్ధ సంస్థల నుంచి న్యాయశాస్త్రంలో మూడు సంవత్సరాల ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీలలో చేరిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకి అర్హులు. వచ్చే ఏడాది ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకు మూడు నెలల పాటు ఆర్బీఐ ఇంటర్న్ షిప్ ప్రోగామ్ పై శిక్షణ ఇస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,000 స్టైఫండ్ ఇస్తారు. ఆర్బీఐ ప్రతి సంవత్సరం సమ్మర్ ప్లేస్‌మెంట్ కోసం 125 మంది విద్యార్థులను ఎంపిక చేస్తుంది. వచ్చే సంవత్సరం జనవరి/ఫిబ్రవరిలో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆయా రాష్ట్రాల్లోని ఆర్బీఐ కార్యాలయాలలో ఇంటర్వ్యూ చేస్తారు.

ఎంపికైన విద్యార్థుల పేర్లు ఫిబ్రవరి/మార్చిలో ప్రకటిస్తారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం opportunities.rbi.org.in వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేందుకు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ opportunities.rbi.org.in లోకి వెళ్లి హోమ్ పేజీలోని ‘సమ్మర్ ప్లేస్మెంట్స్’ పై క్లిక్ చేయాలి. తర్వాత ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2024 పేజీలోని ఆన్ లైన్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అభ్యర్థి సరైన వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుంటే బెటర్.

ఆ రంగంలో భారీగా జాబ్స్.. ఫ్రెషర్స్‌కి తీపి కబురంటే ఇది కదా.

ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న మొన్నటి వరకు తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. చిన్న చిన్న స్టార్టప్స్‌ మొదలు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి.

మరీ ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు అసలు ఉద్యోగాలే రాని పరిస్థితి ఉంది. చివరికి ఐఐటీల్లో కూడా క్యాంపస్‌ ప్లేస్మెంట్స్‌లో విద్యార్థులు ఎంపిక కాకపోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఐటీ రంగానికి గడ్డు పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఐటీ రంగానికి మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

2024-25 ఏడాదికి సంబంధించి ఐటీ రంగంలో నియామకాలు 20 నుంచి 25 శాతం పెరుగుతాయని తాజాగా సర్వేలో వెల్లడైంది. టీమ్‌లీజ్‌ అనే కంపెనీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టీమ్‌లీజ్‌ డిజిటల్‌ విశ్లేషన్‌ ప్రకారం.. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లు గత సంవత్సరంతో పోలిస్తే వారి తాజా నియామకాలను 40 శాతం పెంచనున్నాయని తెలుస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML)తో పాటు డేటా అనలిటిక్స్ వంటి విభాగాలకు అవసరమయ్యే నైపుణ్యాలున్న వారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టీమ్‌లీజ్‌ అంచనా వేస్తోంది. 2024లో మెషిన్‌ లెర్నింగ్‌ విభాగంలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కంపెనీలు వేగంగా అలవరుచుకునే క్రమంలో ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే విధంగా పైథాన్ ప్రోగ్రామింగ్, ఎథికల్ హ్యాకింగ్, పెనెట్రేషన్ టెస్టింగ్, ఎజైల్ స్క్రమ్ మాస్టర్, AWS సెక్యూరిటీ, జావాస్క్రిప్ట్ వంటి నైపుణ్యాల అవసరం పెరుగుతోందని, ఇది నియామకాలపై ప్రభావం చూపుతుంది అంటున్నారు.

ఇదే విషయమై టీమ్‌లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి శర్మ మాట్లాడుతూ.. “టెక్ పరిశ్రమ వేగంగా రూపాంతరం చెందుతూనే ఉంది. ఇందులో భాగంగా కంపెనీలు ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి రంగాలకు డిమాండ్‌ పెరుగుతోంది. నైపుణ్యం పెంచే ప్రోగ్రామ్‌లలో పెట్టుబడి పెట్టడం అనేది కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదని, అవసరం’ అని చెప్పుకొచ్చారు.

ప్రాజెక్ట్ మేనేజర్‌లు, డేటా సైంటిస్టులు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ ఉన్నట్లు టీమ్‌లీజ్‌ అంచనా వేస్తోంది. వీరి జీతాలు కూడా 2023-24తో పోలిస్తే 7.89 శాతం నుంచి 10.2 శాతానికి పెరిగాయి. డేటా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, డెవాప్స్‌ వంటి రంగాల్లో పనిచేస్తున్న వారి జీతాలు 6.54 శాతం నుంచి 10.8 శాతం వరకు పెరిగింది. అలాగే క్లౌడ్ ఇంజనీరింగ్, డెవలప్‌మెంట్, ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన నియమకాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా 2025 నాటికి భారతదేశం వివిధ రంగాలలో క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగించనుంది. దీంతో రానున్న రోజుల్లో ఏకంగా 20 లక్షల మంది క్లౌడ్‌ నిపుణులు అవసరముంటారని భావిస్తున్నారు.

తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్

తమిళ రాజకీయాలపై ప్రభావం చూపేందుకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆసక్తి చూపుతున్నారు. సనాతన ధర్మంపై ఇప్పటికే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను టార్గెట్‌ చేసిన పవన్‌..

తాజాగా అన్నాడీఎంకేకి మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపారు. తమిళం, ఇంగ్లిష్‌లో ట్వీట్‌ చేశారు. MGR, జయలలిత వారసత్వాన్ని కొనసాగిస్తూ తమిళ ప్రజల బలమైన స్వరంగా నిలవాలని ట్వీట్‌లో పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితోపాటు పార్టీని వీడిన పన్నీర్‌ సెల్వానికి కూడా పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఇద్దరు కలిసి పోవాలని పరోక్షంగా సూచించారు.

తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు ఎక్కడికో దారితీస్తున్నాయి. దక్షిణాదిలో మొలకెత్తిన సనాతన వాదం.. పవన్ కల్యాణ్ వర్సెస్ ఉదయనిధిగా మారింది. వీళ్లిద్దరి సనాతన వాదన.. రెండు రాష్ట్రాల్లో కొత్త చర్చకు తావిచ్చాయి. ఇక ఇదే సమయంలో డీఎంకే పార్టీకి బద్ధశత్రువైన.. అన్నాడీఎంకే పార్టీని అభినందిస్తూ ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అన్నాడీఎంకే పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎంజీఆర్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

మతం… మన దేశంలో పదేపదే రాజకీయ అస్త్రంగా మారుతోంది. మతం ఆధారిత ఓటుబ్యాంకులే టార్గెట్‌గా రాజకీయ పార్టీలకు సంప్రదాయమైంది. తిరుపతి వారాహి డిక్లరేషన్ సందర్భంగా సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్.. ఇదే క్రమంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగాయి. రెండు రాష్ట్రాలకు ఇద్దరూ కొత్తగా కొలువునెక్కిన డిప్యూటీ సీఎంలు. తిరుగులేని పవర్‌ సెంటర్లు. పొలిటికల్ సత్తాలోనే కాదు.. యూత్‌ ఫాలోయింగులో కూడా ఒకరికొకరు తీసిపోరు. గ్లామర్‌లో ఎవరికివాళ్లే తీసిపోరు. వీళ్లు సైగ చేస్తే చాలు వేలాదిమంది కదలి వస్తారు. కానీ.. రాష్ట్రాలు వేరువేరైనా.. వీళ్లిద్దరి మధ్య ఇప్పుడొక అగాధం ఏర్పడింది. సనాతనం సబ్జెక్టు మీద వీళ్లిచ్చిన విరుద్దమైన స్టేట్‌మెంట్లే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తూనే హిందూత్వాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. మనిషిగా మాత్రం నేను రాజీపడని సనాతన వాదిని.. అని నొక్కి చెప్పిన పవన్‌.. తనను తాను హిందుత్వ చాంపియన్‌గా ప్రకటించుకున్నారు. అక్కడితోనే ఆగలేదు. సనాతన ధర్మాన్ని అవహేళన చేసే ఏ శక్తినైనా వదిలే ప్రసక్తే లేదు.. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు.. ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లే కొట్టుకుపోతారు అంటూ కొందరి పేర్లు కూడా ప్రస్తావించారు. వాళ్లలో కాంగ్రెస్ పార్టీ సుప్రీం రాహుల్‌గాంధీ ఒకరు.. డీఎంకె యువ దళపతి ఉదయనిధి స్టాలిన్ మరొకరు. తను చేసే శబ్దం తమిళనాడు దాకా వినబడాలంటూ తమిళంలోనే ఝలక్ ఇచ్చారు పవన్.

ఈ ఒక్క కామెంట్‌తో సనాతన ధర్మంపై ఏపీ, తమిళనాడు ఉప ముఖ్యమంత్రుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. భాషలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా.. సనాతన సబ్జెక్ట్ ఇద్దరినీ ఒక్కటిచేసింది. ఇద్దరి మధ్య మంటలు రాజేసింది. గతంలో సనాతన ధర్మాన్ని వైరస్‌తో పోల్చిన ఉదయనిధి స్టాలిన్.. చాలా గ్యాప్ తర్వాత దేశవ్యాప్తంగా మత రాజకీయాల తేనెతుట్టెను కదిపారు. సరిగ్గా ఏడాది కిందట తను హీరోగా చేసి మామన్నన్ సక్సెస్ మీట్ సందర్భంగా ఉదయనిధి అన్న మాటలు.. అప్పట్లో ఒక సంచలనం అయ్యాయి. అయితే డీఎంకేలో రైజింగ్‌స్టార్‌గా ఎదుగుతున్న తమ యువ కిశోరాన్ని పవన్‌ కల్యాణ్ పరోక్షంగా కామెంట్ చేశారని జీర్ణించుకోలేకపోయారు తమిళ అభిమానులు. స్టాలిన్ వ్యాఖ్యల్ని పవన్ వక్రీకరించారని మధురైలో కేసు కూడా పెట్టారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఏఐడీఎంకే పార్టీని అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం మరోసారి సంచలనంగా మారింది.

మరోవైపు పవన్ వ్యవహారంలో సినీ నటులు ప్రకాష్‌ రాజ్‌ సైతం తలదూర్చారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ప్రకాష్‌ రాజ్‌ కూడా పాల్గొన్నారు. ఆ వేదికపై ఉదయనిధిని ప్రశంసిస్తూ పవన్‌పై నిప్పులు చెరిగారు. ఇక్కడున్న డిప్యూటీ సీఎం సమానత్వం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. సనాతనం పేరుతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ పవన్‌ని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. తాను పశ్నిస్తే దొంగలు భయపడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రకాష్‌ రాజ్‌. ఉదయనిధికి తాము అండగా నిలుస్తామన్నారు.

మొత్తంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలు మధ్య తలెత్తిన వ్యవహారం అటు ఉంచితే తాజాగా పవన్ కళ్యాణ్, ఏఐడీఎంకేను అభినందిస్తూ చేసిన ట్వీట్.. రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి..!

ఇది తెలిస్తే ఇకపై.. బాదం పొట్టును పడేయ్యరు..

ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో బాదం ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వైద్యులు కచ్చితంగా బాదంను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు.

ముఖ్యంగా కరోనా తర్వాత బాదంను ఆహారంలో భాగం చేసుకున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

రోజూ బాదంను తీసుకోవడం వల్ల గుండె, మధుమేహం, బలహీనత, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతుంటారు. అయితే మనలో కొందరు బాదం పొట్టును తీసేసి తింటుంటారు. ముఖ్యంగా రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్ని బాదంను తీసుకునే వారు ఇలా పొట్టును తీసే పడేస్తుంటారు. అయితే బాదం పొట్టులో కూడా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బాదం పొట్టును తినడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెఉలసుకుందాం..

కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో బాదం పొట్టు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇందులోని ఫైబర్, ఫ్లేవనాయిడ్లు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో ఉపయోగపడతాయి. ఇవి కడుపును శుభ్రం చేస్తాయి. దీంతో అజీర్తి, గ్యాంస్‌ వంటి సమస్యలు అస్సలు దరి చేరవు. బాదం పొట్టును ఎండబెట్టి పొడిగా చేసుకొని పాలలో కలుపుకొని తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

ఇక బాదం పొట్టులో విటమిన్‌ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒకవేళ మీకు బాదం పొట్టు తినడం ఇష్టం లేకపోయినా.. బాదం పొట్టును.. గుడ్లు, కొబ్బరి నూనె, అలోవెరా జెల్‌ వంటి వాటితో కలిపి హెయిర్‌ మాస్క్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జుట్టు బలంగా మారడంతో పాఉ, నిగనిగ మెరుస్తుంది.

బాదం పొట్టుతో చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇందులో విటమిన్‌ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్‌ను రక్షించి చర్మం ఎక్కువ కాలంపాటు యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇందుకోసం బాదం పొట్టును ఎండలో ఆరబెట్టి.. అందులో 1/4 కప్పు రోల్డ్ ఓట్స్, 1/4 కప్పు శెనగపిండి, 1/2 కప్పు కాఫీతో గ్రైండ్ చేసి, పెరుగుతో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ప్రతీరోజూ ముఖాన్ని అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

యూట్యూబ్‌లో మూడు కొత్త ఫీచర్లు.. వీటి ఉపయోగం ఏంటో తెలుసా

నిద్రిస్తున్న సమయంలో యూట్యూబ్‌లో పాటలు వినడం లేదా ఇతర కంటెంట్‌ను వీక్షించే వారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. అయితే ఉన్నపలంగా నిద్రలోకి జారుకోవడంతో రాత్రంతా యూట్యూబ్‌ ప్లే అవుతూనే ఉంటుంది.

దీంతో ఛార్జింగ్‌ సమస్య ఏర్పడుతుంది. దీనికి చెక్‌ పెట్టేందుకే యూట్యూబ్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

స్లీప్‌ టైమర్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్ ఏదైన వీడియో చూస్తున్నప్పుడు టైమర్ సెట్ చేసుకోవచ్చు. మనం సెట్ చేసుకున్నటైమ్ తరువాత వీడియో ఆటోమెటిక్ గా ఆగిపోతుంది. ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే. ముందుగా.. వీడియో ప్లే అవుతోన్న సమయంలో స్క్రీన్‌పై కనిపించే సెట్టింగ్స్‌ ఐకాన్‌ను ట్యాప్‌ చేయాలి. ఆ తర్వాత స్లీప్‌ టైమర్‌ ఆప్షన్‌ను ఎంచుకొని కావాల్సిన టైమ సెట్‌ చేసుకోవచ్చు. మొదట్లో ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.

యూట్యూబ్‌ తీసుకొస్తున్న మరో కొత్త ఫీచర మినీ ప్లేయర్‌ను నచ్చిన చోటుకి మార్చుకోవడం. ప్రస్తుతం మినీ ప్లేయర్‌ కుడివైపు భాగంలో కనిపిస్తుంది. అయితే ఈ కొత్త ఫీచర్‌ సాయంతో మీకు నచ్చిన ప్లేసులోకి మార్చుకోవచ్చు. సైజ్‌ను పెంచుకునే లేదా తగ్గించుకునే అవకాశం కూడా కల్పించారు.

సాధారణంగా యూట్యూబ్‌లో ప్లే లిస్ట్ క్రియేట్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్లే లిస్ట్‌ను క్యూ ఆర్‌ కోడ్ సహాయంతో నచ్చిన వ్యక్తులకు పంపించుకునే అవకాశాన్ని తీసుకొచ్చారు. ఈ ప్లేలిస్ట్‌కు నచ్చిన థంబ్‌నెయిల్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.

రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌.. రూ. 10వేలలో స్టన్నింగ్‌ ఫీచర్స్‌

రెడ్‌మీ ఇండియన్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ ఏ4 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాన్‌ 4ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ ప్రాసెసర్‌తో భారత్‌లో వస్తున్న తొలి స్మార్ట్‌ ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెకండరీ కెమెరా కూడా ఉంది. ఇక ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ డ్యూయల్‌ 12 బిట్ ఐఎస్‌పీ కెమరాకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ను బ్లాక్‌, వైట్ కలర్‌లో తీసుకొచ్చారు. తొలి సేల్‌ ఎప్పటి నుంచి అనే విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు ప్రకటించలేదు.

రెడ్‌మీ ఏ4 స్మార్ట్ ఫోన్‌లో 6.25 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. అలాగే బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎమఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇక ధర విషయానికొస్తే రూ. 10 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్

పెసరట్టు తిన్నవాళ్లకే తెలుస్తుంది.. ఆ రుచి ఏంటో.. పెసరట్టు ఉండే రుచే వేరు. అల్లం, పచ్చి మిర్చి వేసి, కొద్దిగా ఉప్మా పెట్టి.. నెయ్యి వేసి దోరగా కాల్చుకుని తింటే..

తిన్నవాళ్లు ఆహా అంటారు. చెబుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అంత రుచిగా ఉంటుంది పెసరట్టు. పెసరట్టుకు మరే పోటీ లేదు. ఇంతకు ముందు రోజుల్లో వారంలో రెండు సార్లు అయినా పెసరట్లు వేసేవారు. కానీ ఇప్పుడు వీటిని పెద్దగా ఎవరూ తినడం లేదు. పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలానే లభిస్తాయి. పెసలతో వడలు వేసినా చాలా రుచిగా ఉంటాయి. ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తీసుకున్నా టేస్టీగానే ఉంటాయి. గ్యాస్ అని చాలా మంది వీటిని పక్కన పెట్టేశారు. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి రోజూ ఉడకబెట్టినవి ఓ గుప్పెడు తిన్నా చాలా మంచిది. పెసలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పెసల్లో ఉండే పోషకాలు:

విటమిన్లు బి2, బి3, బి5, బి6, బి1, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ఫొటాషియం, ఫోలేట్, మాగనీస్, జింక్, ఫైబర్, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి.

రోగ నిరోధక శక్తి:

పెసలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటే ఎలాంటి వ్యాధులు వచ్చినా తట్టుకుంటారు. అలసట, నీరసం దరి చేరకుండా ఉంటాయి. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

జీర్ణ సమస్యలు మాయం:

ప్రస్తుత కాలంలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో పెసలు చక్కగా పని చేస్తాయి. పొట్ట ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. కడుపులో ఉండే మలినాలు, వ్యర్థాలను బయటకు పంపుతుంది.

రక్త హీనత:

రక్త హీనత సమస్యతో ఇబ్బంది పడేవారు పెసలు తినడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ సమస్య లేని వాళ్లు తిన్నా ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. రక్తం పడితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.

బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్:

పెసలు తినడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

అదుపులో షుగర్ వ్యాధి:

బీపీ, షుగర్ వ్యాధులతో బాధ పడేవారు రెగ్యులర్‌గా పెసలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. షుగర్ అనేది అదుపులోకి వస్తుంది. పెసలు తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరగవు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

దసరా తర్వాత 21 రోజులకు దీపావళి ఎందుకు వస్తుంది.. రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్.. ట్వీట్ వైరల్

రామాయణం అత్యంత ముఖ్యమైన హిందూ గ్రంథం. చాలా మందికి రామాయణ కథలతో సుపరిచితం. శ్రీరాముడు, రామాయణానికి భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మానవుడిగా పుట్టిన శ్రీరాముడు నడక, నడతతో దైవంగా పూజించిపబడుతున్నాడు.

ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే దసరా ముగిసి దీపావళి రానున్న నేపధ్యంలో ప్రస్తుతం శ్రీరాముడు శ్రీలంక నుంచి అయోధ్యకు చేరుకోవడానికి 21 రోజుల పాటు ప్రయాణించాడంటూ ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.

శ్రీలంక నుంచి అయోధ్యకు వెళ్లేందుకు 21 రోజుల 10 గంటల సమయం పడుతుందని గూగుల్ మ్యాప్ చెబుతోంది. ముకుల్ దేఖానే తన ఖాతాలో చిన్న Google మ్యాప్ స్క్రీన్‌ను షేర్ చేశారు. ఈ ఫోటోతో ‘దసరా తర్వాత 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు జరుపుకుంటారు? శ్రీరామ చంద్రుడు శ్రీలంక నుంచి అయోధ్యకు వెళ్ళడానికి నడవడానికి 21 రోజులు పట్టింది.. ఇది నిజమేనా? ఇది Google Mapsలో సెర్చ్ చేయగా రిజల్ట్ చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు. లంక నుండి అయోధ్యకు తిరిగి రావడానికి 21 రోజులు పట్టిందని తెలిసి తాను షాక్ తిన్నానని చెప్పాడు.

వైరల్ ఎక్స్ పోస్ట్;
దసరా తర్వాత 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు జరుపుకుంటారు.

శ్రీరాముడు సీతా సమేతంగా తన పరివారాన్ని తీసుకుని శ్రీలంక నుండి అయోధ్యకు చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు. ఈ విషయం గురించి Google మ్యాప్స్‌లో తనిఖీ చేయగా.. 504 గంటలను 24 గంటలు గా డివైడ్ చేస్తే సమాధానం 21.00 21 రోజులని అన్సర్ రావడం చూసి తాను ఆశ్చర్యపోయినట్లు.. ఈ విషయాన్నీ ధృవీకరించుకోవడానికి తాను ఉత్సుకతతో గూగుల్ మ్యాప్‌ని సెర్చ్ చేసినట్లు తెలిపారు. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ .. నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు అని తెలిసింది.. అంటే 21 రోజులు పడుతుందని చూసి నేను ఆశ్చర్యపోయానని తెలిపాడు.

ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘దసరా నుంచి దీపావళి మధ్య 21 రోజుల గ్యాప్‌తో సమానంగా ఉంటుంది’ అని ఒక నెటిజన్ అన్నారు. ఇది దీపావళి, దసరా ప్రాముఖ్యతను హైలైట్ చేసింది’ అని మరొకరు వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ ‘శ్రీరాముని ఇతిహాస యాత్రను.. చూపిస్తూనే హిందూ సంప్రదాయం ప్రకారం త్రేతాయుగం నుంచి దసరా, దీపావళిని జరుపున్నట్లు పురాణాలు తెలిపిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు.

ఏపీ ఎస్‌సీఈఆర్టీలో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుకు వారం రోజులే ఛాన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ)లో టీచర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే ఈ పోస్టులన్నింటినీ డిప్యుటేషన్‌పై తీసుకోనున్నారు.

ఆసక్తి కలిగిన బోధన సిబ్బంది నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ప్రకటన విడుదల చేశారు. ప్రొఫెసర్ పోస్టులు 9, లెక్చరర్ పోస్టులు 20 ఉన్నాయి. వీటితోపాటు కోఆర్డినేటర్లు పోస్టులు ఐదు వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అక్టోబర్‌ 25వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో సమర్పించాలని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను అక్టోబర్‌ 28వ తేదీ నుంచి 30 వరకు పరిశీలిస్తారు. అనంతరం నవంబరు 4, 5వ తేదీల్లో సిబ్బందికి ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపికలు చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఈ ఏడాది సెప్టెంబరు 28 నాటికి తప్పనిసరిగా 15 ఏళ్ల బోధన అనుభవం ఉండాలి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నవారికి, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

అక్టోబర్‌18న యూజీసీ నెట్‌ ఫలితాలు.. అధికారిక ప్రకటన విడుదల

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2024 (యూజీసీ- నెట్‌) ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. అక్టోబర్‌ 18న యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ఫలితాల వెల్లడి విషయాన్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఆగస్టు 21, 22, 23, 27, 28, 29, 30, సెప్టెంబర్‌ 2, 3, 4 తేదీల్లో మొత్తం 83 సబ్జెక్టులకు యూజీసీ నెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ పొందేందుకు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు యూజీసీ నెట్‌ అర్హత ఉపయోగపడుతుంది.

కాగా జూన్ 18వ తేదీన మొత్తం 1,200 కేంద్రాలలో పెన్ను, పేపర్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహించగా.. పరీక్ష జరిగిన 24 గంటల్లోపే పేపర్ లీక్‌ ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ ఈ పరీక్షను రద్దు చేసింది. డార్క్‌ నెట్‌లో యూజీపీ నెట్‌కు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు ప్రత్యక్షమవడం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో నెట్‌ పరీక్షను యూజీసీ రద్దు చేసి, మళ్లీ నిర్వహించేందుకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించింది. ఈ ఫలితాలు రేపు విడుదలకానున్నాయి.

కపుల్స్ తక్కువ ధరతో సందర్శించడానికి బెస్ట్ దేశం థాయిలాండ్.. మరోలోకానికి తలుపులు తెరచినట్లే..

సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ దేశ విదేశాల్లో అందమైన ప్రదేశాలను సందర్శించాలని కోరుకుంటారు. అలా భారతీయులు విదేశాలకు వెళ్ళాలనుకుంటే థాయిలాండ్ బెస్ట్ ప్లేస్.

తాజాగా ప్రముఖ నటి ఫ్యాషన్ డిజైనర్ షామా సికందర్ తన భాగస్వామితో కలిసి థాయిలాండ్‌లోని కొన్ని ప్రదేశాలను అన్వేషిస్తుంది. మీరు కూడా మీ భాగస్వామితో కలిసి విదేశాలలో సందర్శించడానికి వెళ్లాలనుకుంటే.. థాయిలాండ్ కూడా దీనికి ఉత్తమ ఎంపిక. ఇక్కడ మీరు మీ భాగస్వామితో కలిసి ఈ ప్రసిద్ధ స్థలాలను అన్వేషించవచ్చు. ఆ అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం

ప్రముఖ భారతీయ నటి ఫ్యాషన్ డిజైనర్ షామా సికిందర్ ప్రస్తుతం తన భర్త జేమ్స్ మిల్లిరోన్‌తో కలిసి థాయిలాండ్‌లో విహారయాత్ర చేస్తోంది. తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ చిత్రంతో పాటు పచ్చని అడవిలో దాగి ఉన్న ఈ పురాతన దేవాలయం చియాంగ్ మాయిని కనుగొనడం మరొక కాలంలో వెళ్ళడానికి డోరీ తీసినట్లు అనిపిస్తుందనే క్యాప్షన్‌ ఆ పోస్ట్ కు జత చేసింది. మీరు కూడా తక్కువ ధరలో అందమైన థాయిలాండ్ టూర్ ను ఎంజాయ్ చేయవచ్చు.

స్నేహితులతోనే కాదు మీ భాగస్వామితో కలిసి సందర్శించడానికి థాయిలాండ్ చాలా అందమైన ప్రదేశం. పెళ్లి తర్వాత విదేశాలకు వెళ్లాలనుకుంటే మీ బడ్జెట్‌లో థాయ్‌లాండ్‌కు వెళ్లేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు థాయ్‌లాండ్‌లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాల గురించి ఇక్కడికి ఎక్కడికి ఎలా వెళ్లాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఫుకెట్‌లో సందర్శించడానికి ప్రసిద్ధ ప్రదేశాలు

బీచ్‌లో మీ భాగస్వామితో కొంత ప్రశాంతంగా గడపాలనుకుంటే ఫుకెట్‌లోని పటాంగ్ బీచ్‌కి వెళ్లవచ్చు. ఇక్కడి సహజ దృశ్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందమైన బీచ్‌లు, రోడ్లు, మార్కెట్‌లతో పాటు ఇక్కడ రుచికరమైన వంటకాలను కూడా ఆస్వాదించవచ్చు. అంతేకాదు మీరు సమీపంలోని స్థానిక దేవాలయాలను కూడా సందర్శించవచ్చు.

ఫుకెట్‌లోని జేమ్స్ బాండ్ ద్వీపం థాయిలాండ్‌లోని ఫుకెట్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాంగ్ న్గా బేలో ఉంది. స్థానిక ప్రజలలో దీనిని కో తపు అని కూడా పిలుస్తారు. మీరు ఫుకెట్ నుండి స్పీడ్ బోట్ లేదా పెద్ద పడవ ద్వారా ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రదేశం సున్నపురాయి రాళ్లకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఆకుపచ్చ రంగులో భిన్నంగా కనిపిస్తుంది.

చియాంగ్ మాయి
మీరు థాయిలాండ్ లోని చియాంగ్ మాయి సందర్శనానికి బెస్ట్ ప్లేస్. ఇది థాయ్‌లాండ్‌లోని రెండవ అతిపెద్ద నగరం. గణేశ పుణ్యక్షేత్రం చియాంగ్ మాయి ఆర్కేడ్, సువాన్ డాక్ గేట్, మోంతా థాన్ జలపాతం, చియాంగ్ మై నైట్ సఫారి, ఆంగ్‌కేవ్ రిజర్వాయర్, వాట్ ఫా లాట్ హైక్ (సన్యాసుల మార్గం), వాట్ సువాన్ డాక్, తా ఫా వాకింగ్ స్ట్రీట్, వాట్ చియాంగ్ మాన్ యు వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరం ట్రిప్ కూడా ఎంతో మధురమైన జ్ఞాపకంగా మారుతుంది.

థాయ్‌లాండ్‌లో సందర్శించడానికి ప్రసిద్ధ ప్రదేశాలు

ఇవి మాత్రమే కాదు మీరు గ్రాండ్ ప్యాలెస్, ఎలిఫెంట్ నేచర్ పార్క్, టైగర్ కింగ్‌డమ్, చియాంగ్ రాయ్ వైట్ టెంపుల్, ఫాంగ్ న్గా బే, సఫారీ వరల్డ్, బ్యాంకాక్, పట్టాయా, కో ఫై ఫై, చియాంగ్ మాయి, క్రాబి, అయుతయ, కో స్యామ్యూయి, హువా హిన్‌లను కూడా సందర్శించవచ్చు. కాంచనబురి, థాయ్‌లాండ్‌లోని కావో సామ్ రోయ్ యోట్ నేషనల్ పార్క్, సుఖోథాయ్, దోయి సుతేప్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.

సల్మాన్‌కు వై-ప్లస్ సెక్యూరిటీ.. బాలీవుడ్ హీరో భద్రత కోసం ప్రభుత్వం ఏటా ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు వై+ భద్రత కల్పించింది ప్రభుత్వం. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నే బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు ప్రకటించింది.

సల్మాన్ ఖాన్‌తో స్నేహం కారణంగానే బాబా సిద్ధిఖీ హత్య జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత సల్మాన్ నివాసముండే బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో సల్మాన్ భద్రత కోసం ప్రభుత్వం బాగానే ఖర్చు పెడుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. కాగా ప్రముఖుల భద్రతకు సంబంధించి X, Y, Y+, Z, Z+, SPG ఇలా మొత్తం ఆరు కేటగిరీలు ఉన్నాయి. ప్రధాన మంత్రి తదితరులకు SPG భద్రత కల్పిస్తుంది. ఇక సల్మాన్ కు కేటాయించిన Y+ కేటగిరీలో మొత్తం 11 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు. సల్మాన్ తో పాటు అతని ఇంటికి కూడా శిక్షణ పొందిన సాయుధ కానిస్టేబుల్స్ ఉంటారు. అలాగే నటుడికి ఎస్కార్ట్‌ వాహనం కూడా ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా తోడుగానూ ఉంటారు. కాగా ఇక రిపోర్ట్ ప్రకారం సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ ఖర్చు కోట్లలో ఉందని సమాచారం. వై ప్లస్ సెక్యూరిటీకి ఏడాదికి దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలుస్తోంది.

ఏప్రిల్‌లో బాంద్రాలోని సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిగింది. అప్పటి నుంచి ఆయన భద్రతను పెంచారు. ఇప్పుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక ఇటీవల బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడంతో సల్లూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా తమ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ను ఎవరూ సందర్శించవద్దని సల్మాన్ ఖాన్ కుటుంబం సందేశం పంపిందని కూడా తెలుస్తోంది.

మీ మొబైల్ నంబర్‌కు రీఛార్జ్ చేయకపోతే ఏమవుతుంది? వేరొకరికి కేటాయిస్తారా?

ఈ రోజుల్లో చాలా మంది డ్యుయల్ సిమ్ వాడడం సర్వసాధారణం. ఒక సిమ్ వ్యక్తిగత లేదా కుటుంబ అవసరాల కోసం, మరొక సిమ్ బిజినెస్‌, ఇతర పనుల కోసం ఉపయోగిస్తుంటారు.

కొంత మంది మూడు లేదా నాలుగు సిమ్‌లు వాడుతున్నారు. చాలా మంది తమ వ్యక్తిగత సిమ్ లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉంచిన సిమ్‌ని రీఛార్జ్ చేయడం మర్చిపోతారు. ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ, ఇలా రీచార్జ్ చేయకుండా సిమ్ వదిలేస్తే కంపెనీ బ్లాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆ నంబర్ వేరొకరికి కేటాయిస్తుంది.

టెలికాం నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట వ్యవధిలోపు సిమ్ రీఛార్జ్ చేయకపోతే ఆ నంబర్ మరొక వ్యక్తికి కేటాయిస్తారు. చాలా మంది తమ మొబైల్ నంబర్‌ను ఇలా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే, కొంతమందికి ఆ నంబర్ ప్రత్యేకమైనది లేదా ముఖ్యమైన పని కోసం ఉపయోగిస్తుంటారు. ఆ నంబర్‌ చాలా మంది వద్ద ఉండటంతో వేరే నంబర్‌ మారిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కూడా ఒక వేళ సిమ్‌ కార్డుపోయినా, మొబైల్‌ పోయినా ఆ నంబర్‌పైనే మరో సిమ్‌ను పొందుతుంటారు. కొందరేమో సిమ్‌కార్డు పోయినా పట్టించుకోరు. వేరే కొత్త నంబర్‌ను తీసుకుంటారు. అలాగే కొందరేమో ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డును వాడుతూ అందులో కొన్నిటికి రీఛార్జ్‌ చేయరు. అలాగే ఉంచేస్తుంటారు. మీరు మీ సిమ్‌ని రీఛార్జ్ చేయకపోతే కంపెనీ ఎన్ని రోజులు ఆ నంబర్‌ను మరొకరికి ఇస్తుందో చూద్దాం.

మీరు మీ సిమ్‌ని రీఛార్జ్ చేయకుంటే ఆ సిమ్ నంబర్‌ను వేరొకరికి బదిలీ చేయడానికి ముందు కంపెనీలు అనేక ముఖ్యమైన పనులను చేస్తాయి. ముందుగా మీరు 60 రోజుల పాటు సిమ్‌ని రీఛార్జ్ చేయనప్పుడు అది డియాక్టివేట్ చేస్తుంది. దీని తరువాత, రీఛార్జ్ చేయడానికి 6 నుండి 9 నెలల వ్యవధి ఇస్తుంది. ఈ సందర్భంలో మీరు నంబర్‌ను రీఛార్జ్ చేయవచ్చు. దాన్ని మళ్లీ యాక్టివ్‌ చేసుకోవచ్చు.

ఆ తర్వాత కూడా మీరు సిమ్‌ని ఉపయోగించకపోతే, కంపెనీ అనేక హెచ్చరికలు జారీ చేస్తుంది. చివరగా కంపెనీ సిమ్ బ్లాకింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. కొన్ని నెలల తర్వాత ఈ సిమ్ నంబర్ మరొక వినియోగదారుకు బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియ దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. అంటే ఒకరి నుంచి మరొకరికి సిమ్‌ని బదిలీ చేయడానికి ఏడాది సమయం పడుతుంది.

TB రోగులకు శుభవార్త.. కొత్త ఎక్స్‌రే పరికరం సృష్టి.. ఇంటి దగ్గరే పరీక్షించుకునే అవకాశం

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) TB వ్యాధిని గుర్తించడానికి కొత్త హ్యాండ్‌హెల్డ్ ఎక్స్-రే పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ పరికరం సహాయంతో తక్కువ సమయంలో సులభంగా TB వ్యాధిని పరీక్షించవచ్చు.

ఈ ఎక్స్-రే యంత్రం ప్రయోజనం ఏమిటంటే.. ఇక నుంచి ఎవరైనా సరే TB ఉందా లేదా అని పరీక్షించుకోవడానికి ఎక్కడో ఉన్న ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేదు. కొత్త పరికరం సహాయంతో ఇంటి దగ్గర కూడా వ్యాధిని సులభంగా పరీక్షించవచ్చు. టీబీని గుర్తించేందుకు కొత్త హ్యాండ్‌హెల్డ్ ఎక్స్-రే పరికరాన్ని అభివృద్ధి చేశామని.. ఇది వ్యాధిని ముందుగానే గుర్తిస్తుందని 19వ అంతర్జాతీయ ఔషధ నియంత్రణ అధికారుల (ICDRA) ఇండియా-2024లో ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ తెలిపారు.

వాస్తవానికి ఈ హ్యాండ్‌హెల్డ్ ఎక్స్-రే యంత్రాలు చాలా ఎక్కువ ధరతో మార్కెట్ లో అందుబాటులో ఉండేవి. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని ఐఐటీ కాన్పూర్ ఐసిఎంఆర్ భాగస్వామ్యంతో ఎక్స్-రేను అభివృద్ధి చేసిందని డాక్టర్ రాజీవ్ బహ్ల్ చెప్పారు. దేశీయంగా తయారు చేయబడిన ఈ హ్యాండ్‌హెల్డ్ ఎక్స్-రే, హ్యాండ్‌హెల్డ్ ధరలో సగం కంటే తక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. భారతదేశం కూడా MPOX కోసం మూడు టెస్టింగ్ కిట్‌లను అభివృద్ధి చేసిందని డాక్టర్ బహ్ల్ చెప్పారు. MPOX కోసం మూడు టెస్టింగ్ కిట్‌లను అభివృద్ధి చేశామని, మూడు కంపెనీలు అలాంటి కిట్‌లను తయారు చేస్తున్నాయని చెప్పారు.

TB వ్యాధి ఎందుకు వస్తుందంటే

మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ వల్ల TB వస్తుంది. దీనిని 1882లో జర్మన్ శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్ కనుగొన్నారు. TB చికిత్స భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ వ్యాధి కేసులు ఇప్పటికీ నమోదు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ప్రమాదక స్థితికి ప్రజలు చేరుకుంటూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం చాలా మందికి టీబీ లక్షణాల గురించి తక్కువ అవగాహన ఉండటమే. ఈ వ్యాధి శరీరంలో తీవ్రరూపం దాల్చిన తర్వాత మాత్రమే ప్రజలు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తున్నారు.

భారతదేశంలో ఇప్పటికీ TB ఒక పెద్ద సమస్య

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం కొత్త టీబీ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 2025 నాటికి దేశం టీబీ రహిత దేశంగా మారే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యకలాపాలను చేపట్టింది. అనేక TB నిర్మూలన కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమంలో TB సంక్రమణ నివారణ, నియంత్రణ (IPC) చర్యలు ఉన్నాయి. ఇవి TB వ్యాప్తిని ఆపడానికి అవసరమైనవి. అయినప్పటికీ టీబీ కేసులు మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. చాలా మంది టీబీ చికిత్సను మధ్యలోనే వదిలేయడమే దీనికి పెద్ద కారణం. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధి మళ్లీ పెరగుతోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి కళ్లు చెదిరే ప్లాన్‌.. 105 రోజుల వ్యాలిడిటీ

గత మూడు నెలల్లో అత్యధిక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒకటి. బీఎస్‌ఎన్‌ఎల్‌ తన వినియోగదారులకు అత్యంత తక్కువ ధరలకు అత్యంత విలువైన ప్లాన్‌లను అందిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 105 రోజుల చెల్లుబాటుతో ఓ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ రోజుకు 2 GB డేటాతో వస్తుంది. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS కూడా అందిస్తుంది.

ప్లాన్ ధర రూ.666. మీరు 105 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 210 GB డేటాను పొందవచ్చు. మీరు రోజుకు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

ముఖ్యంగా మరే ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఈ రేటుతో, ఇంత వాలిడిటీతో ప్లాన్‌లను అందించలేదు.

దేశంలో BSNL 4G సేవ అందుబాటులోకి వస్తోంది. కంపెనీ ఇప్పటివరకు 35,000 4G టవర్లను ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో టవర్స్‌ను ఏర్పాటు చేసి 4జీ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే 5జీ నెట్‌వర్క్‌ను కూడా త్వరగా తీసుకువచ్చే పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.

శివుడి వాహనం నంది ఎలా అయ్యాడు? ఎలా జన్మించాడు? ఎవరి తనయుడో తెలుసా..

లయకారుడైన శివుడు అనగానే నందీశ్వరుడు గుర్తుకొస్తాడు. శివాలయంలో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. శివ గణాల్లో నందీశ్వరుడు శివునికి అత్యంత ఇష్టమైన భక్తిగా పరిగణిస్తారు.

శివుడు ఎక్కడుంటే.. అక్కడ ఆయన వాహనం అయిన నంది ఉంటుందని చెబుతారు. అంతేకాదు భక్తులకు ఏదైనా కోరిక ఉంటే.. ఆ కోరికను నందీశ్వరుడి చెవిలో చెబితే.. అది శివునికి చేరుతుందని విశ్వాసం. శివాలయంలోని శివ లింగం ముందు ఎద్దు రూపంలో ఉన్న నంది ఖచ్చితంగా ఉంటుంది.

నందీశ్వరుడు ఎవరంటే

ప్రమథగణములకు నాయకుడు నందీశ్వరుడు శివుని నివాసమైన కైలాసానికి ద్వారపాలకుడిగా చెబుతారు. శివుని వాహనంగానే కాకుండా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు కూడా. నందీశ్వరుడిని శక్తి, కృషికి చిహ్నంగా భావిస్తారు.

నందీశ్వరుడు ఎవరి కొడుకు అంటే

పురాణ కథ ప్రకారం పురాతన కాలంలో శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. శిలాదుడు కఠోర తపస్సు చేసి, శివుడి నుంచి వరంగా నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు అయిన కొడుకు కావాలి వారాన్ని పొందాడు. ఆ తర్వాత శిలాదుడు మహర్షి తన తనయుడైన నందికి అన్ని వేదాలు, పురాణాల జ్ఞానాన్ని అందించాడు.

శివుడి వాహనంగా ఎలా మారాడంటే

పురాణాల ప్రకారం ఒకసారి ఇద్దరు మునులు శిలాదుడు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. తండ్రి ఆదేశం మేరకు నందీశ్వరుడు వారికి బాగా సేవ చేసాడు. అప్పుడు తన కుమారుడిని దీర్ఘాయువుగా ఉండమని ఆశీర్వాదం ఇవ్వమని శిలాదుడు కోరాడు. అయితే ఆ ఇద్దరు మునులు అలా దీవించడానికి నిరాకరించారు. ఎందుకంటే నంది అల్పాయుష్కుడని చెప్పారు. శిలాదుడు మహర్షి తన కొడుకు అల్పాయుష్కుడు అని తెలిసి బాధపడ్డాడు. అప్పుడు నంది తన తండ్రితో శివుడి వరంతో జన్మించిన తనను ఆయన మాత్రమే రక్షిస్తాడు అని చెప్పాడు. దీని తరువాత శివుడి అనుగ్రహం కోసం నంది తపస్సు చేయడం మొదలు పెట్టాడు. నందీశ్వరుడు తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై అతనిని తన వాహనంగా చేసుకున్నాడు.

శివుడు ముందు నంది ఎందుకు ఎదురుగా ఉంటుందంటే

నందీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి శివాలయాల్లో శివుడి ఎదురుగా ఉంటాడు. ప్రతిచోటా శివునికి అభిముఖంగా నంది ఉంటాడు. నంది ఉండే ఈ భంగిమ శివుడి పట్ల అతని అచంచలమైన శ్రద్ధ, భక్తికి చిహ్నం. నంది దృష్టి తన దైవంపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది.

నందీశ్వరుడి చెవిలో కోరికలు ఎందుకు చెబుతారంటే

సనాతన ధర్మం ప్రకారం శివుడు తరచుగా తపస్సులో ఉంటాడు. కనుక భక్తులు తమ కోరికలను నందీశ్వరుడి చెవిలో చెబుతారు. నందీశ్వరుడు భక్తుల కోరికలను వింటాడు. శివుడు తపస్సు పూర్తయిన తర్వాత భక్తుల కోరికలను శివుడికి నందీశ్వరుడు చెబుతాడు.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

అమరావతిలో అద్భుతం.. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ ఈవెంట్‌

అమరావతిలో భారీ డ్రోన్ షో జరగబోతోంది. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ ఈవెంట్‌గా ఇది చరిత్ర పుటల్లో నిలవబోతుంది. 5 వేలకు పైగా డ్రోన్లతో అతి భారీ షో నిర్వహిస్తున్నారు.

9 థీమ్స్‌ మీద కార్యక్రమాలు ఉండనున్నాయి. 1800మంది డెలిగేట్స్‌ హాజరవ్వనున్నారు. ఈనెల 22, 23 తేదీల్లో అమరావతిలో డ్రోన్‌ హ్యాకథాన్‌ జరగనుంది. భవిష్యత్తులో అనేక రంగాల్లో డ్రోన్ల సేవలు వినియోగిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. డ్రోన్లకు సంబంధించి రీసెర్చ్.. తయారీ.. ఇన్నోవేషన్ కోసం సీఎం చంద్రబాబు ఓ పాలసీ తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచడం కోసం భారీ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. దేశంలో ఇలాంటి షో తొలిసారి జరుగుతోంది. ఈ షో లో అనేక డ్రోన్ కంపెనీలతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు, డ్రోన్ ఆపరేటర్లు పాల్గొంటారు.

అసలు ఈ డ్రోన్ల వల్ల ఉపయోగాలేంటి అంటే….చాలానే ఉన్నాయి. ప్రస్తుతం డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మొన్నటి విజయవాడ వరదల సందర్భంలోనూ సహాయక చర్యల్లో డ్రోన్లను వినియోగించారు. సహాయక బృందాలు సైతం చేరుకోలేని పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, మందులు సహా అనేక రకాలుగా సహాయం అందించారు. వరదల తర్వాత కూడా డ్రోన్లను ఉపయోగించి సేవలు అందించారు. అలాగే వ్యవసాయ రంగంలో డ్రోన్లను పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో, మారుమూల ప్రాంతాలకు అత్యవసరంగా మెడిసిన్‌ అందించాలంటే డ్రోన్ల మీదే ఆధార పడాల్సి వస్తోంది. లేటెస్టుగా చెన్నైలో వరదల సందర్భంగా పరిస్థితిని సమీక్షించడానికి, ముంపు తీవ్రతలను తెలుసుకోవడానికి కూడా డ్రోన్ల మీదే ఆధార పడాల్సి వస్తోంది.

డ్రోన్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో ఏపీని దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

వాయుగుండం ముప్పు ఇంకా వీడనే లేదు.. మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ

వాయుగుండం ముప్పు ఇంకా వీడనే లేదు.. ఇంతలోనే మరో బాంబు పేల్చింది వాతావరణ శాఖ. ఐఎండి సూచనల ప్రకారం మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

రానున్న నాలుగు రోజులు వాతావరణం కింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ వివరించారు.

18 అక్టోబర్, శుక్రవారం:

• కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

19 అక్టోబర్, శనివారం:

• పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

20 అక్టోబర్, ఆదివారం:

• కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

21 అక్టోబర్, సోమవారం:

• అల్లూరి సీతారామ రాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గురువారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 80.5మిమీ, విశాఖ రూరల్లో 62.2మిమీ, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 60.7మిమీ అధిక వర్షపాతం నమోదైందన్నారు.

పెళ్లిళ్ల సీజన్‌.. ఇది యాపారం..3 నెలల్లో లక్ష పెళ్లిళ్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది. కానీ మంచి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నందువల్ల ప్రీ బుకింగ్స్ ఊపందుకున్నాయి . 3 నెలల్లో లక్ష వివాహాలు జరగనున్నాయి.

ఈ వివాహ సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంది. ఈ కారణంగా వివాహాల కోసం ఫంక్షన్ హాల్స్, దేవాలయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. జ్యోతిష్కులు చెప్పిన ప్రకారం, ఈ ఏడాది చాలా తక్కువ శుభ ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు జరగలేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మంచి ముహూర్తాలు అక్టోబర్ 16, 18, 24, 27, నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 17, 25, డిసెంబర్ 4 నుంచి 7 వరకు ఉన్నాయి. ఈ తేదీల్లో నవంబర్ 8, 10, డిసెంబర్ 6 అత్యంత శుభ ముహూర్తాలుగా ఉన్నాయి.

మంచి తేదీల్లో పెళ్లి చేసుకోవాలనుకున్న కుటుంబాలు హాల్స్ లేదా ఫంక్షన్ ప్లేస్ లభించకపోతే ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివాహాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, కొంత మంది పూజారులు ఒకే రోజు రెండు పెళ్లిళ్లను కూడా జరుపుతున్నారు. వివాహల సీజన్ కావటంతో ఫొటోగ్రఫీకి సైతం భారీ డిమాండ్ ఏర్పడింది. మధ్యతరగతి కుటుంబాలకు ఫంక్షన్ హాల్ ధరలు కట్టుకోవడం కూడా కష్టంగా మారింది. హైదరాబాద్‌లో హాల్ ధరలు అధికంగా ఉండడంతో కొందరు కుటుంబాలు తమ వివాహ వేడుకను వధువు ఇంట్లో జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొంతమంది తమ పెళ్లిళ్లను కమ్యూనిటీ భవనాల్లో లేదా ఇళ్ల ముందు ఖాళీ ప్రదేశాల్లో జరుపుతున్నారు.

ఆ గ్రామంలో దీపావళికి వింత సంప్రదాయం.. తమపై ఆవులను నడిపించుకునే భక్తులు.. ఎక్కడంటే..

మధ్యప్రదేశ్ అజబ్ హై, సబ్సే గజబ్ హై”.. అంటే ఇది మధ్యప్రదేశ్ లో వింత.. అంతేకాదు అన్ని కంటే అద్భుతం అనేది రాష్ట్ర పౌరుల ప్రసిద్ధ నినాదం.. ఇది దీపావళి పండగ సందర్భంగా ఉజ్జయిని జిల్లాలో కనుల ముందు దర్శనం ఇస్తుంది.

అక్కడ దీపావళి సందర్భంగా భక్తులు ఆవులను తొక్కించుకుంటారు. జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలోని బద్‌నగర్ తహసీల్‌లోని భిద్వాడ్ గ్రామంలో ఈ విశిష్ట సంప్రదాయం ఉంటుంది.

దీపావళి పండుగ మర్నాడు ఉదయం ఇక్కడ ఒక మతపరమైన ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారం పాటించడం వలన తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి పండగ తర్వాత రోజు ఉదయం గ్రామంలో గోవులకు పూజలు చేస్తారు. ఆ తర్వాత గ్రామస్తులు నేలపై పాడుకుంటారు. ఇలా పడుకున్న భక్తులపైకి ఆవులను వదులుతారు. గోవులలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని ప్రజల నమ్మకం. ఇలా తమ ఆవులపై నడిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

అంతేకాదు ఈ సంప్రదాయంలో పాల్గొనేవారు మరొక పురాతన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దీపావళి పండగ సందర్భంగా ఐదు రోజుల పాటు భక్తులు ఉపవాసం ఉంటారు. దీపావళికి ఒక రోజు ముందు.. తమ గ్రామ దేవత ఆలయంలో రాత్రి సమయంలో బస చేస్తారు. అక్కడ భజనలు, కీర్తనలు కూడా చేస్తారు.

దీపావళి పండగ తర్వాత రోజు ఉదయం పూజ నిర్వహిస్తారు. అప్పుడు ప్రజలు డప్పులతో గ్రామం చుట్టూ తిరుగుతారు. ఈ సమయంలో గ్రామంలోని ఆవులన్నింటినీ ఒకే చోటికి తీసుకువస్తారు. ప్రజలు నేలపై పడుకుంటారు. అవి తమని తొక్కుకుని వెళ్ళేలా చేస్తారు.

ఆవులు తమని తొక్కుతూ వెళ్ళిన తర్వాత భక్తులు లేచి నిలబడి డ్యాన్స్ చేస్తూ చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఇలా గ్రామమంతా సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ పండగను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తారు. అయితే ఇలా ఆవులు తొక్కిన సమయంలో ఇప్పటి వరకూ ఒక్కరూ గాయపడలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

విశాఖలోని ఓ అపార్ట్‌మెంట్ దుకాణం పెట్టేశారు.. నలుగురు యువతులతో

విశాఖ టు చైనా కేంద్రంగా జరుగుతున్న భారీ ఆన్‌లైన్‌ స్కామ్‌ గుట్టురట్టు చేశారు.. పోలీసులు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, టాస్క్‌ల పేరిట మోసాలు చేస్తున్న ఈ గ్యాంగ్‌కు..చైనా ముఠాతో లింకులు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.

అధిక లాభాల పేరుతో అమాయకులను ట్రాప్‌ చేస్తోంది ఈ గ్యాంగ్‌. విశాఖలోని ఓ అపార్ట్‌మెంట్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు సాగుతున్నాయి. పక్కా సమాచారంతో సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు..నలుగురు యువతులు సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల నుంచి పెద్దసంఖ్యలో ల్యాప్‌టాప్‌లు, చెక్కుబుక్కులు, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

విశాఖను అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్‌కు..అందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు, సిమ్‌కార్డులు, మొబైల్‌ ఫోన్లువయా ఢిల్లీ మీదుగా చైనా నుంచి అందుతున్నాయని చెబుతున్నారు పోలీసులు.

ఈ గ్యాంగ్‌ ఇంతవరకూ 9 కోట్ల రూపాయల లావాదేవీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇలాంటి కంత్రీగ్యాంగ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.

‘ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్‌లలో 50 శాతం భారత్‌ ఉత్పత్తి చేస్తుంది’ కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ పుణ్య

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 8 బిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారు చేసి పంపిణీ చేయగా.. వాటిలో సగం భారత్‌లోనే తయారయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు.

గురువారం యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ నిర్వహించిన వార్షిక ఇండియా లీడర్‌షిప్ సమ్మిట్ 2024లో ఆమె ఈ మేరకు ప్రసంగించారు. భారత్‌ ఫార్మాస్యూటికల్స్‌లో గ్లోబల్ లీడర్‌గా అవతరించిందని, మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా, జనరిక్ మెడిసిన్‌ కీలక సరఫరాదారుగా నిలిచినట్లు పుణ్య తన ప్రసంగంలో తెలిపారు. ఈ రంగంలో భారత్‌ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు గణనీయమైన సహకారం అందించేందుకు దారితీస్తుందన్నారు. ఇందులో US హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ సహకారం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా వెలుపల అత్యధిక సంఖ్యలో US FDA- ఆమోదించబడిన ఔషధ కర్మాగారాలు కలిగి ఉండటమే అందుకు నిదర్శనం. అమెరికా వెలుపల ఉన్న US FDA- ఆమోదించబడిన ప్యాంట్‌లలో వీటి సంఖ్య దాదాపు 25 శాతంగా ఉంది. భారత్‌ కంపెనీల్లో తయారు చేసిన మందుల పంపిణీ ద్వారా 2022లో US హెల్త్‌కేర్ సిస్టమ్‌కి 219 బిలియన్ డాలర్లు పొదుపును అందించాయి. 2013 – 2022 మధ్య మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల పొదుపును అందించాయని ఆమె పేర్కొన్నారు. మందులు మాత్రమే కాకుండా వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో కూడా భారత్‌ ముందుంది. ప్రపంచ వ్యాక్సిన్ల తయారీలో గణనీయమైన వాటాతో ముందుగు సాగుతుంది. భారత్‌ ‘ప్రపంచ ఫార్మసీ’గా దాని పాత్రను నొక్కి చెబుతుందని ఆమె చెప్పారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్‌లలో 50 శాతం ఒక్క భారత్‌లోనే తయారవుతున్నట్లు పుణ్య తెలిపారు.

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది బిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారు చేసి పంపిణీ చేయగా, నాలుగు బిలియన్ డోస్‌లు భారత్లోనే తయారు చేసినట్లు ఆమె చెప్పారు. పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్ధారించడానికి భారత్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ను సంస్కరించిందని, జాతీయ వైద్య కమిషన్ చట్టం, ఇతర సంబంధిత చట్టాలలో కాలం చెల్లిన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లను భర్తీ చేసిందని ఆమె పేర్కొన్నారు. ఇది వైద్య, నర్సింగ్ కాలేజీల సంఖ్య, నమోదులో గణనీయమైన పెరుగుదలకు దారితీసిందన్నారు. ఇది ఆరోగ్య సంరక్షణలో వృత్తిపరమైన లభ్యతలో అసమానతలను పరిష్కరిస్తుందని ఆమె చెప్పారు. పర్యవసానంగా జాతీయ, ప్రపంచ అవసరాలను తీర్చగల ఆరోగ్య శ్రామిక శక్తిని ఉత్పత్తి చేయడానికి భారత్‌ సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు భారత్‌లో ఆరోగ్య సంరక్షణ నాణ్యత, స్థాయి, ఖర్చు క్రమంగా మెరుగుపరిచాయని పుణ్య పేర్కొన్నారు.

2013-2014.. 2021-2022 మధ్య కాలంలో మొత్తం ఆరోగ్య వ్యయం వాటా 25 శాతం తగ్గడమే మా విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సేవలకు నిదర్శనమని ఆమె చెప్పారు. హెల్త్‌ కేర్‌ సెక్టార్‌లో ఇండో-యుఎస్ భాగస్వామ్యంపై పుణ్యా మాట్లాడుతూ.. కోవిడ్‌ వంటి మహమ్మారిని ఎదుర్కోవడంలో సంసిద్ధత, యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్‌లలో.. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ( NCDC), యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్‌ ప్రివెన్షన్ (CDC) మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని తెలుపుతుంది. US CDC సహకారంతో నిర్వహిస్తున్న NCDC, ICMR ఫీల్డ్ ఎపిడెమియాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను (FETP) భారత్‌ అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 200 మందికి పైగా ఎపిడెమిక్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ (EIS) అధికారులు ట్రైనింగ్‌ పొందారని, మరో 50 మంది శిక్షణ పొందుతున్నారని ఆమె అన్నారు. బయో-ఫార్మాస్యూటికల్ సప్లై చైన్‌, ప్రపంచ సరఫరా గొలుసులను ఆప్టిమైజ్ చేయడానికి, బలోపేతం చేయడానికి బయో-5 కూటమి ద్వారా సింగిల్-సోర్స్ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించనున్నట్లు తెలిపారు.

ఉమ్మడి వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించడానికి భారత్‌-యుఎస్ కూడా అంగీకరించాయి. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ క్యాన్సర్‌పై పోరాటానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. US-భారత్ క్యాన్సర్ మూన్‌షాట్ డైలాగ్‌ ఆగస్టులో ప్రారంభించినట్లు తెలిపారు. యుఎస్-ఇండియా బయోమెడికల్ పరిశోధన సహకారాన్ని పెంపొందించడం, గర్భాశయ క్యాన్సర్‌పై దృష్టి సారించడం దీని ప్రధాన లక్ష్యమని పుణ్య పేర్కొన్నారు. ఇది AIIMS, టాటా మెమోరియల్ హాస్పిటల్ వంటి సంస్థలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లు ఆమె తెలిపారు. ఇది ‘వన్‌ వరల్డ్, వన్‌ హెల్త్’ విజన్‌ను ప్రతిబింబిస్తుందన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్ పరీక్షలు, రోగనిర్ధారణకు 7.5 మిలియన్ డాలర్ల నిధులు కేటాయించామన్నారు. రేడియోథెరపీ, క్యాన్సర్ నివారణకు GAVI, క్వాడ్ ప్రోగ్రామ్‌ల కింద ప్రపంచ దేశాలకు భారత్‌ 40 మిలియన్ల వ్యాక్సిన్లు అందిస్తుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో భారత్‌-యుఎస్ ఉమ్మడి భాగస్వామ్యం ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి సహకారం అందిస్తుందని పుణ్య తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

పండగ సమయాల్లో తక్కువ సమయంలో అందంగా కనిపించాలా.. ఈ ట్రిక్ బెస్ట్!

ప్రస్తుతం అంతా పండుగలే ఉన్నాయి. ఒకదాని తర్వాత పండుగలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో పండుగలకు అందంగా కనిపించాలని మహిళలు అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి సమయం ఉండదు.

అలాంటి సమయంలో ఈ డ్రింక్ బెస్ట్‌గా వర్క్ అవుతుంది.

ఈ డ్రింక్ రెండు, మూడు రోజులు వరుసగా తాగారంటే.. మీ ముఖం మిలమిల మెరిసిపోవడం కాదు. బ్యూటీ పార్లర్‌కి వెళ్లినా రాని మెరుపు ఈ డ్రింక్ తాగితే మీకు లభిస్తుంది. మరి ఆ బ్యూటీ డ్రింక్ ఏంటో ఇప్పుడు చూడండి.

ఈ డ్రింక్ తాగడం వల్ల కేవలం అందమే కాకుండా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. చర్మం లోపలి నుంచి గ్లో తీసుకొస్తుంది. అదే క్యారెట్, టమాటా జ్యూస్. ఈ జ్యూస్ రెండు సార్లు తాగితేనే ఆ తేడా మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది.

టమాటా, నిమ్మరసం, క్యారెట్ కలిపి తయారు చేసే ఈ డ్రింక్.. చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మీరు తేనె కలిపి కూడా తాగవచ్చు. ఈ జ్యూస్‌లో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ కణాల ఉత్పత్తిని ప్రేరపిస్తాయి.

కాబట్టి మీ ముఖానికి సహజమైన గ్లో వస్తుంది. ముఖం కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఎండ నుంచి కూడా రక్షణను ఇస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఆపుతుంది. శరీరం డీటాక్సీఫై అయి.. హైడ్రేట్‌గా మారుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

సీను సీనుకో ట్విస్ట్.. నరాలు తెగే ఉత్కంఠ.. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

పెద్ద నటీనటుల ల నుంచి చోటా యాక్టర్ల చిత్రాల వరకు థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక ప్రముఖ ఓటీటీలు సైతం డిఫరెంట్ జోనర్ లను జనాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
మరి OTTలోని టాప్ సైకో థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ లను ఇప్పుడు చూద్దామా..

ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్‌లకు వెళ్లకుండానే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హట్‌స్టార్ వంటి OTT సైట్‌లలో మాంచి మాంచి లు చూస్తున్నారు. ఇక వారి అభిరుచికి తగ్గట్టుగా థ్రిల్లర్, ఫీల్ ఉన్న లను విడుదల చేస్తున్నాయ్ ప్రముఖ ఓటీటీ సంస్థలు. మరి వాటిల్లో నుంచి టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్ లను ఇప్పుడు తెలుసుకుందామా..

ఫస్ట్ మూవీ.. ఏంజిల్స్ అండ్ డిమన్స్, 2009లో వచ్చిన ఈ హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని రాన్ హెవార్డ్ దర్శకత్వం వహించారు. ఒక గుడిలో అర్చకులను రహస్యంగా చంపడం, గుడి కింద ఉన్న ఒక గదిలో రహస్య పుస్తకం భద్రపరచడం లాంటి అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ZEE 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇది 7.2 రేటింగ్‌ను సాధించింది.

నెక్స్ట్ చిత్రం.. ది రెడ్ డ్రాగన్. 2002లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు బ్రెట్ రాట్నర్. ఒక అతీంద్రియ శక్తిని ఓ సైకో ప్రపంచంలోకి తీసుకొచ్చి.. ప్రజలను బలి ఇస్తూ ఉంటాడు. చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ఈ ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

2007లో వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ చిత్రం మోటెల్‌కు.. జేమ్స్ మ్యాంగోల్డ్ దర్శకత్వం వహించాడు. శిథిలమైన నెవాడా మోటెల్‌లో చిక్కుకున్న పది మంది అపరిచితులు ఒకరొకరిగా చంపబడుతూ వస్తారు. ఓ సైకో నుంచి తమను తాము రక్షించుకోవడానికి వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారన్నది స్టోరీ. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

ది ఇన్విజిబుల్ గెస్ట్. ఓరియోల్ పాలో దర్శకత్వం వహించిన ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ 2016లో విడుదలైంది. ఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకకు వచ్చిన ఒక వ్యక్తి ఆ వ్యాపారిని హత్య చేస్తాడు. అసలు ఎందుకు అలా చేశాడు.? ఆ వ్యాపారవేత్తకి అతడికి సంబంధం ఏంటన్న కథాంశంతో సాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఐ సి ది డెవిల్, కిమ్ జీ వూన్ దర్శకత్వం వహించిన 2010 కొరియన్ థ్రిల్లర్ చిత్రమిది. తన భార్యను దారుణంగా హత్య చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే భర్త.. చివరికి ఏం చేశాడన్నది ఈ చిత్ర కథాంశం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

వయసులో ఉన్నప్పుడు చేసే ఈ తప్పులు చిన్న వయసులోనే కీళ్ల నొప్పులకు దారి తీస్తాయ్‌

వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు సర్వసాధారణం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కీళ్ళు, కండరాలలో నొప్పి సంభవిస్తుంది. ఇదేకాకుండా కీళ్ల నొప్పులకు అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

ఎముకలు బలహీనపడటం, యూరిక్ యాసిడ్ పెరగడం, ఆర్థరైటిస్, బలమైనా గాయాలు మొదలైనవి ఉన్నాయి. గతంలో వృద్ధాప్యానికి కీళ్ల నొప్పులు కారణమని చెప్పేవారు. అయితే నేటి రోజుల్లో ఆర్థరైటిస్ సమస్యలు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తప్పుడు ఆహారం తీసుకోవడం

విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించే పోషకాలు. కాల్షియం లోపాన్ని అందించే ఆహారాన్ని తీసుకోకపోతే ఎముకలు బలహీనపడతాయి. దీనివల్ల మీరు చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల బారిన పడవచ్చు. కాబట్టి గుడ్లు, ఎండు చేపలు, పాలు, ఇతర పాల ఉత్పత్తులు, ధాన్యాలు మొదలైనవి మీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. అలాగే కండరాల నొప్పులను నివారించడానికి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం

మీరు పని చేస్తున్నప్పుడు లేదా ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు లేదా టీవీ చూస్తున్నప్పుడు ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చుంటే భుజం కీళ్లు, మోకాలు, మెడ, వెనుక కండరాలలో నొప్పి వస్తుంది. కాబట్టి కనీసం ప్రతి 40 నిమిషాలకు విరామం తీసుకోవాలి. లైట్ స్ట్రెచింగ్ లేదా వాకింగ్ చేయాలి.

బరువు నియంత్రణలో ఉండాలి

మీరు బరువు పెరుగుతున్నట్లయితే, సమయంపై దృష్టి పెట్టాలి. లేదంటే తర్వాత చాలా కష్టం అవుతుంది. స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు మొదలైన వాటి ప్రమాదాన్ని పెంచడమే కాకుండా కీళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది శరీరంలో అవయవాల నొప్పి సమస్యను కలిగించవచ్చు.

వ్యాయామం చేయకపోవడం

యోగా, జాగింగ్, సైక్లింగ్, లైట్ స్ట్రెచింగ్ వంటి ఏదైనా శారీరక శ్రమను రోజువారీ దినచర్యలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఆధునిక జీవనశైలిలో ఆహారం సరైనది కాదు. దీని కారణంగా మీ శరీరం సరైన కదలికలు సంభవించవు. దీంతో కీళ్ల నొప్పులు, కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వ్యాయామం లేకపోవడం వల్ల అనేక ఇతర శారీరక సమస్యలు కూడా పెరుగుతాయి.

అనారోగ్యకరమైన ఆహారాలు

కొంతమందికి అన్నీ తెలిసినప్పటికీ అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటూనే ఉంటారు. ఇది అనేక వ్యాధులకు దారి తీస్తుంది. ఉదాహరణకు శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగిన తర్వాత, ఈ లక్షణాలు ఆర్థరైటిస్‌గా మారవచ్చు. దీని వల్ల చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల సమస్య రావచ్చు. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే.. మూడో ప్రపంచ యుద్ధమేనా?

ఇరాన్ పై ఇజ్రాయెల్ పగతో రగిలిపోతోంది. తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అదును కోసం వేచి చూస్తోంది. ఈసారి ఇరాన్ పై దాడి చేయడమంటూ జరిగితే..

ఆ దేశం అస్సలు కోలుకోలేకుండా ఉండేలా దెబ్బ తీయాలని పక్కా స్కెచ్ ను రెడీ చేస్తోంది. ఇరాన్ లో ఏఏ ప్రాంతాల్లోని.. ఏఏ స్థావరాలపై అటాక్ చేయాలో ఇప్పటికే ప్లాన్ ను రెడీ చేసింది. చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటే తప్ప ఏమాత్రం వెనక్కు తగ్గడానికి నెతన్యాహూ టీమ్ అస్సలు సిద్ధంగా లేదు.

ఇజ్రాయెల్ దళాలు కూడా దాడి చేయడానికి ఊవ్విళ్లూరుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే.. నవంబర్ 5 లోపే అటాక్ చేయాలన్నది ఇజ్రాయెల్ ప్లాన్.

అంటే రెండు నుంచి మూడు వారాల లోపే ఇజ్రాయెల్ తన ప్లాన్ ను అమలు చేయబోతోందని అర్థమవుతోంది. మరి ఈ దాడి జరిగితే.. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పటికే మిగిలిన దేశాలు దానికి సిద్ధమవుతున్నాయా?

అమెరికాతో పాటు.. ఇతర దేశాలు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాయి? యుద్ధమంటూ జరిగితే.. మన దేశం స్టాండ్ ఏమిటి? ఏ దేశాన్ని సపోర్ట్ చేయబోతోంది? లేక.. తటస్థంగా ఉంటుందా?

కారు టైర్లలో రబ్బరు ‘స్పైక్’లు ఎందుకు ఉంటాయి? వీటి వల్ల ఉపయోగమేంటి?

వాహనాల టైర్లపై ‘ముల్లు’ ఆకారపు రబ్బరు ప్రోట్రూషన్‌లు, టైర్ ట్రెడ్ ప్యాటర్న్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ ఉబ్బెత్తులు, నమూనాలు టైర్ రోడ్ గ్రిప్, పనితీరును పెంచడానికి రూపొందించి ఉంటాయి.

టైర్‌పై ఈ ‘ముళ్ళు’ ఎందుకు ఉంటాయి? వాటి పాత్ర ఏమిటో తెలుసుకుందాం. పొడుచుకు వచ్చినట్లు, ట్రెడ్ నమూనాల వంటి ఈ ‘ముళ్ళు’ రహదారిపై టైర్ పట్టును పెంచుతాయి. రహదారి తడిగా లేదా జారుడుగా ఉన్నప్పుడు టైర్ పట్టును పెంచడానికి, స్కిడ్డింగ్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

డ్రైనేజీలో ..

నీరున్న రోడ్లపై టైర్లు నడుస్తున్నప్పుడు వాటికి, రహదారికి మధ్య నీరు చేరుతుంది. ఇది హైడ్రోప్లానింగ్ (టైర్ నీటిపై జారడం) ప్రమాదాన్ని పెంచుతుంది. టైర్ ‘ముల్లు’ ఆకారపు రబ్బరు, రోడ్డు, టైర్ మధ్య నీటిని ఖాళీ చేస్తుంది. తద్వారా టైర్-టు-రోడ్ సంబంధాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

బ్రేకింగ్ సహాయం:

టైర్ చక్కటి ట్రెడ్ నమూనా బ్రేకింగ్ సమయంలో మరింత పట్టును అందిస్తుంది. ఇది టైర్ స్కిడ్డింగ్‌ను నివారిస్తుంది. మీ వాహనాన్ని సురక్షితంగా ఆపడంలో సహాయపడుతుంది.

ట్రాక్షన్, హ్యాండ్లింగ్:

టైర్‌పై ‘ముల్లు’ ఆకారపు ప్రోట్రూషన్‌లు వివిధ రకాల ఉపరితలాలపై ట్రాక్షన్, హ్యాండ్లింగ్‌ను మెరుగుపరుస్తాయి. మలుపులు, ఆకస్మిక మార్పుల సమయంలో వాహనాన్ని స్థిరంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.

టైర్‌లో అలాంటి ‘స్పైక్’ లేదా సరైన ట్రెడ్‌లు లేకుంటే టైర్ గ్రిప్ తగ్గిపోతుంది. ఇది ప్రమాద ప్రమాదాన్ని పెంచుతుంది. కొత్త టైర్లను కొనుగోలు చేసేటప్పుడు ట్రెడ్ ప్యాటర్న్‌పై శ్రద్ధ పెట్టండి. అలాగే సరైన ట్రెడ్ లేకుండా టైర్లను కొనుగోలు చేయవద్దు. బాగా నడిచే టైర్లు సురక్షితమైన డ్రైవింగ్, వాహనం మెరుగైన నిర్వహణ సామర్థ్యాలను అందిస్తాయి.

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్

గతంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు బోరుగడ్డ అనిల్‌ను వెంటాడుతుంది. బుధవారం గుంటూరులో అనిల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు.

అనంతరం ఐదో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆయనకు ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. అనిల్‌ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

గుంటూరుకు చెందిన అనిల్‌ రిపబ్లికన్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వైసీపీ హయాంలో బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియా వేదికగా హాట్‌ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. దీంతో పలు పోలీస్ స్టేషన్‌లలో అనిల్‌పై కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో బోరుగడ్డ అనిల్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతకాలం హైదరాబాద్‌, బెంగుళూరు ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల గుంటూరులోని తన ఇంటికి వచ్చారు అనిల్. పట్టాభిపురంలో అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అయితే తన భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని అనిల్ భార్య ఆరోపించారు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Health

సినిమా