Monday, November 18, 2024

ఓటీటీ ఆడియన్స్‌కు పండగే.. శుక్రవారం ఒక్కరోజే 15 సినిమాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం థియేటర్లలో దసరా లే రన్ అవుతున్నాయి. రజనీ కాంత్ వేట్టయాన్, గోపీచంద్ విశ్వ, సుహాస్ జనక అయితే గనక చిత్రాలే సందడి చేస్తున్నాయి. దీంతో ఈ వారంలో థియేటర్లలో పెద్ద లేవీ రిలీజ్ కావడం లేదు.

ఏవో కొన్ని చిన్న లు రిలీజ్ అవుతున్నా వాటిపై పెద్దగా బజ్ లేదు. అయితే ఎప్పటిలాగే ఓటీటీలో మాత్రం పలు కొత్త లు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే కలి, లెవెల్ క్రాస్ వంటి సస్పెన్స్, సైకలాజికల్ హార్రర్ లు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక వీటికి తోడుగా శుక్రవారం ( అక్టోబర్ 17) మరికొన్ని మూవీస్, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ లు పెద్దగా లేకున్నా ఆసక్తికరమైన డబ్బింగ్ మూవీస్, సిరీసులున్నాయి. మరి శుక్రవారం ఏయే ఓటీటీల్లో ఏయే లు స్ట్రీమింగ్ కు రానున్నాయో ఒక లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్

ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్‌ఓస్ (స్పానిష్ ) – అక్టోబర్ 18
ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లిష్ ) – అక్టోబర్ 18

అమెజాన్ ప్రైమ్ వీడియో

కల్ట్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
కడైసి ఉలగ పొర్ (తమిళ్ ) – అక్టోబర్ 18
లాఫింగ్ బుద్ధా (కన్నడ ) – అక్టోబర్ 18
స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) – అక్టోబర్ 18

డిస్నీప్లస్ హాట్‌స్టార్

1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
రైవల్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 18
రోడ్ డైరీ (ఇంగ్లిష్ ) – అక్టోబర్ 18

జియో

క్రిస్పీ రిస్తే (హిందీ ) – అక్టోబర్ 18
హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 19
హిస్టీరియా (ఇంగ్లిష్ ) – అక్టోబర్ 19

ఆహా

రైడ్ (తెలుగు డబ్బింగ్ )- అక్టోబర్ 19
లెవెల్ క్రాస్- ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.

బుక్ మై షో

బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ ) – అక్టోబర్ 18

ఈటీవీ విన్

కలి-ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.

కారు సర్వీస్ చేసే ముందు ఈ పనులను పూర్తి చేయండి.. లేకుంటే మోసపోతారు

కారును సర్వీసింగ్ చేయడానికి ముందు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడం చాలా ముఖ్యం. తద్వారా మీరు మంచి సర్వీసును పొందవచ్చు. లేకుంటు మోసపోయే ప్రమాదం ఉంది.

అదేంటో తెలుసుకుందాం.

సర్వీస్‌ మాన్యువల్ : మీ కారు సర్వీస్ మాన్యువల్‌ని జాగ్రత్తగా . ఇది ఎప్పుడు సర్వీస్ చేయాలి? ఏ భాగాలను తనిఖీ చేయాలి? వంటి కారు నిర్వహణ గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.
సర్వీస్‌ ప్యాకేజీని అర్థం చేసుకోండి: సర్వీస్ సెంటర్ అందించే వివిధ ప్యాకేజీలను అర్థం చేసుకోండి.

మీ కారు అవసరాలకు ఏ ప్యాకేజీ సరిపోతుందో తెలుసుకోండి. కొన్నిసార్లు సర్వీస్ సెంటర్లు అనవసరమైన సేవలకు ఛార్జీలను జోడిస్తాయి.
సర్వీసుకు ముందు మొత్తం ధరలు: సర్వీసులో ఏ పనులు జరుగుతాయి? వాటి ధర ఎంత ఉంటుందో తెలుసుకోండి. మీ కారుకు కొన్ని సమస్యలు ఉంటే, వాటి జాబితాను తయారు చేసి, సర్వీస్ సెంటర్‌కు ఇవ్వండి.

దీంతో ఆ సమస్యలన్నీ సక్రమంగా పరిష్కారమవుతాయి.
ఓడోమీటర్ రీడింగ్‌ను గమనించండి:మీ కారు ఓడోమీటర్ రీడింగ్‌ని రాసుకోండి. ఇది మీ కారు సర్వీస్ సెంటర్‌లో ఎంతసేపు ఉందో తెలియజేస్తుంది. అలాగే ఏదైనా తప్పుడు కార్యకలాపాలను నివారించవచ్చు.
విలువైన వస్తువులను తీసివేయండి: మొబైల్ ఛార్జర్లు, సన్ గ్లాసెస్ లేదా ఇతర వ్యక్తిగత వస్తువుల వంటి విలువైన వస్తువులను కారు నుండి తీసివేయండి. తద్వారా ఏదైనా కోల్పోయే ప్రమాదం ఉండదు.

మీ కారులో అవసరమైన సామాను మాత్రమే ఉంచండి.
కారు పరిస్థితిని వీడియో చేయండి: సర్వీస్‌కు ముందు మీ కారు వీడియో లేదా ఫోటో తీయండి. తద్వారా ఏదైనా కొత్త గీతలు లేదా డెంట్‌లు ఏర్పడితే మీరు అడగవచ్చు. సర్వీస్‌ ప్రారంభమయ్యే ముందు సర్వీస్‌ సలహాదారుని కలవండి. మీ సమస్యలన్నింటినీ అతనికి చెప్పండి.
బిల్లులు, వర్క్‌షాప్ నోట్‌లను తనిఖీ చేయండి: సర్వీస్‌ తర్వాత అందించిన బిల్లును తనిఖీ చేయండి. అన్ని సేవలు, భాగాలు సరిగ్గా వివరంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు మీ కారు సరైన సేవను పొందుతున్నారని, మీరు తర్వాత మోసపోయినట్లు భావించకుండా చూసుకోవచ్చు.

మళ్లీ బుల్లితెరపై స్మృతి ఇరానీ! స్వయంగా క్లారిటీ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి

హిందీ సీరియల్స్‌లో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీకి ఎంతో క్రేజ్ ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఆమె నటిగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సీరియల్స్‌లో నటించడం మానేశారు. అయితే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఓడిపోయారు. అందుకే ఆమె మళ్లీ సీరియల్స్‌లో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఐతే ఇది నిజమేనా? కాదా? ఈ విషయంపై స్వయంగా స్మృతి ఇరానీ క్లారిటీ ఇచ్చారు. ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’ సీరియల్ 2000 నుండి 2008 వరకు ప్రసారం ప్రసారమైంది. ఇందులో స్మృతి ఇరానీ కీలక పాత్ర పోషించింది. ఈ ధారావాహికలో స్మృతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పట్లో ‘క్యుంకీ సాస్‌ భీ కభీ బహు థీ’ అనే సీరియల్‌ కూడా బాగా ప్రేక్షకాదరణ పొందింది. ఈ క్రేజ్ తోనే స్మృతి ఇరానీ 2003లో రాజకీయాల వైపు దృష్టి సారించారు. అయితే గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆమె మళ్లీ సీరియల్స్ వైపు మొగ్గు చూపుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై స్పంపదించిన స్మృతి తాను ఏ సీరియల్‌లోనూ నటించనని స్పష్టం చేసింది.

హిందీ సీరియల్ ‘అనుపమ’లో స్మృతి ఇరానీ అతిథి పాత్రలో మెరవనున్నారని ‘టెలీ చక్కర్’ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయబడింది. ఇది స్వయంగా స్మృతి ఇరానీ దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్‌పై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. అది తప్పుడు వార్త అని క్లారిటీ ఇచ్చారు. తద్వారాతనపై వస్తోన్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.

జమిలి ఎన్నికలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఘోరపరాజయంతో డీలాపడ్డ పార్టీశ్రేణులను యాక్టివ్ చేసేందుకు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు వై.యస్‌ జగన్. ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులను, పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షులను నియమించిన జగన్మోహన్‌రెడ్డి..

నియోజకవర్గాలకు కూడా సమన్వయకర్తల నియామకాన్ని మొదలుపెట్టారు. ఎలా పని చేయాలి, ప్రజలకి ఎలా అందుబాటులో ఉండాలనేదానిపై తాడేపల్లి పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో జరిగిన వర్క్‌ షాప్‌లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఈ వర్క్‌షాప్‌కి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. పూర్తి స్థాయి కార్యవర్గాల ఏర్పాటుతో పాటు కీలక అంశాలపై నేతలతో జగన్ చర్చించారు. పార్టీపరంగా చేపట్టబోయే కార్యక్రమాలను నేతలతో షేర్ చేసుకున్నారు. ఇంట్లో కూర్చుంటే ఏమీ జరగదని.. ప్రజాసమస్యలపై రోడ్లపైకి వచ్చి పోరాడాలని నేతలకు పిలుపు ఇచ్చారు. నాలుగు నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని.. ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ముఖ్యంగా సోషల్ మీడియాను బలంగా మార్చుకోవాలని.. నాయకులకు పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉంటాయని జగన్ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలపైన పార్టీ శ్రేణులతో మాట్లాడిన జగన్ జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ ఉండాలని తాజాగా నేతలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల చేతిలో దాడికి గురైన వైసీపీ నాయకులు, కార్యకర్తలను త్వరలో ఇళ్లకు వెళ్లి పరామర్శించబోతున్నారు వైఎస్‌ జగన్‌. దీంతో పాటు ప్రజలకు అనేక హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వంపై పోరాటాలకు పార్టీశ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మొత్తానికి అధినేత వరుస మీటింగ్‌లతో ఫ్యాన్‌ స్పీడ్‌ పెరుగుతోందన్న ఉత్సాహంతో ఉన్నారు వైసీపీ నేతలు.

ఎన్డీయే కూటమి అగ్రనేతలో ప్రధాని మోడీ భేటీ.. ఆ అంశాలపై చర్చ

వందరోజుల పాలనలో సాధించిన విజయాలు.. వచ్చే నాలుగున్నరేళ్లలో చేరుకోవాల్సిన లక్ష్యాలపై సుదీర్ఘంగా చర్చించారు ఎన్డీఏ నేతలు. 2047 అమృత్‌కాల్‌ విజన్‌తో పాటు జాతీయ అభివృద్ధి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు.

సంవిధాన్ కా అమృత్ మహోత్సవ్ అలాగే ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ హత్య దినంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. హర్యానాలో హ్యాట్రిక్‌ విజయం సాధించిన నేపథ్యంలో త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నేతల మధ్య చర్చ జరిగింది.

హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎన్డీఏ పార్టీల నేతలు..కార్యక్రమం అనంతరం చండీగఢ్‌లో జరిగిన కూటమి భేటీలో పాల్గొన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారు మూడోసారి కొలువు దీరిన తర్వాత కూటమి నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలొచ్చాక ఢిల్లీలో ఒకసారి సమావేశమైనా.. అది లాంఛనప్రాయమే. సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

హర్యానా ఇచ్చిన ఊపును కొనసాగించాలన్న వ్యూహాన్ని కూడా అక్కడి నుంచే అమలు చేయాలన్నది ఎన్‌డీఏ ప్రణాళిక. అందుకే.. ప్రమాణస్వీకారం తర్వాత పంచకులలో ఎన్‌డీఏ కీలక సమావేశం జరిగింది. NDAలోని మొత్తం 31 పార్టీల నేతలు సమావేశానికి హాజరయ్యారు.

మహారాష్ట్ర ఎన్నికల రూపంలో మోదీ 3.0కు అతిపెద్ద సవాల్‌ ఎదురయింది. మహారాష్ట్ర ఒకప్పుడు రెండు శిబిరాలకు మాత్రమే రాజకీయ రణక్షేత్రం పరిమితమయ్యేది. ఓవైపు బీజేపీ-శివసేన.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీలు తలపడేవి. అయితే 2019 ఎన్నికల తర్వాత సీన్ మారింది. సీఎం పదవి కోసం బీజేపీ హ్యాండిచ్చి.. కాంగ్రెస్‌ కూటమిలో చేరింది శివసేన. ఆ విధంగా ఏర్పడిందే మహా వికాస్‌ అఘాడీ. తర్వాత ఏక్‌నాథ్‌ షిండే రూపంలో శివసేనలో పుట్టిన ముసలం.. బీజేపీకి ఊతమిచ్చింది. తర్వాత ఎన్‌సీపీలో కూడా చీలికలొచ్చి మహా పాలిటిక్స్‌ని మరింత రసవత్తరంగా మార్చేశాయి. కూటమి వర్సస్‌ కూటమిగా మారిన మహారాష్ట్రలో పాగా వేయడం ఎన్డీఏ ముందున్న అతిపెద్ద సవాలు

మహారాష్ట్రలో తగ్గిన ఉపాధి అవకాశాలు, గ్రామీణ రైతాంగంలో పెరిగిన అసంతృప్తి, పార్టీల్లో చీలికల తర్వాత ఉద్ధవ్‌-శరద్‌ పవార్‌లపై ఏర్పడ్డ సానుభూతి..ఇవన్నీ ఎన్‌డీఏ కూటమికి ఇప్పదిగా మారాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లే దక్కినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్ని తేలిగ్గా తీసుకోవద్దని భావిస్తోంది ఎన్డీఏ కూటమి. మహారాష్ట్రతో పాటే ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్‌లో పోయిన అధికారాన్ని తిరిగి తెచ్చుకోవడం కూడా బీజేపీకి ఛాలెంజ్‌గా మారింది. 2014 ఎన్నికల్లో 37 సీట్లను గెల్చుకున్న బీజేపీ.. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేఎంఎం ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి పంచ్‌ ప్రాణ్‌ పేరుతో వాగ్దానాలు చేసింది బీజేపీ. మరి పంచకుల వేదికగా జరిగిన ఎన్‌డీఏ నేతల భేటీ ఎంతవరకూ సక్సెస్‌ అయిందో తెలియాలంటే.. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.

సల్మాన్‌ ఖాన్‌ ప్రాణాలను కాపాడుతోన్న బ్రేస్ లెట్! దీని స్పెషాలిటీ ఏంటంటే?

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్ 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. టెలివిజన్‌ చరిత్రలోనే అతిపెద్ద రియాల్టీ షో ఇది. ఇదే కాకుండా సల్మాన్ ఖాన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టుల ఉన్నాయి.
అందులో సికిందర్ ఒకటి. మురుగదాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

హిందీ చిత్రసీమలో సల్మాన్‌ ఖాన్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఆయన బాలీవడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఓ వైపు లు చేస్తూనే, మరోవైపు బిగ్ బాస్ వంటి ప్రముఖ టీవీషోల్లోనూ మెరుస్తున్నాడు. ఈ కారణంగానే సల్మాన్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

అయితే ఇటీవల తన సన్నిహితుడు బాబా సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఖాన్ బాగా కలత చెందాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాబాను హత్య చేసినట్లు అధికారికంగా ప్రకటించుకుంది.

కాగా సల్మాన్ ఖాన్ చేతికి ఎప్పుడూ బ్రాస్లెట్ ఉంటుంది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగానే ఆయన దానిని ధరిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ బ్రాస్లెట్ ధరించడం వల్ల ప్రతికూల అంశాలు తొలగిపోతాయని సల్మాన్ నమ్ముతున్నాడట.

ఈ బ్లూ కలర్ స్టోన్ బ్రాస్లెట్ ధరించడం వెనుక రహస్యాన్ని సల్మాన్ ఖాన్ ఒక సందర్భంలో బయటపెట్టాడు ‘మా నాన్న ఎప్పుడూ ఇలాంటి బ్రాస్‌లెట్‌ను ధరించేవారు. అందుకే నేను కూడా ధరిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు సల్లూ భాయ్.

సల్మాన్ ఖాన్ చాలా ఏళ్లుగా తన కుడి చేతికి బ్రాస్‌లెట్‌ను ధరించాడు. ఈ రత్నాన్ని ఫిరూజా అని పిలుస్తారు. దీనిని ధరించడం అదృష్టమని, కష్టాల తొలగిపోతాయని సల్మాన్ నమ్ముతున్నాడట.

మనీలాండరింగ్ కేసులో తమన్నా.. మిల్కీ బ్యూటీని ప్రశ్నించిన ఈడీ.. అసలేం జరిగిందంటే..

టాలీవుడ్ హీరోయిన్ తమన్నాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ చేపట్టారు. అక్రమ నగదు బదిలీ ఆరోపణలపై ఈడీ ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి.

HPZ టోకెన్ మొబైల్ యాప్‏కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమన్నాను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. యాప్ ద్వారా బిట్ కాయిన్, క్రిప్టోకరెన్సీలను మైనింగ్ సాకుతో చాలామంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో తమన్నా పై ఎలాంటి నేరారోపణలు లేవు. కానీ కేవలం యాప్‏ను ప్రమోట్ చేసినందుకే ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఈడీ కార్యాలయానికి తన తల్లితో కలిసి వచ్చింది తమన్నా. యాప్‏ను ప్రమోట్ చేశారని.. అందుకు కొంత డబ్బు కూడా తీసుకున్నారని.. ఆమెపై ఎలాంటి నేరారోపణలు లేవని సంబంధిత వర్గాలు స్పష్టం చేయగా.. నిన్న తమన్నా వాంగూల్మం తీసుకున్నారు.

తమన్నా భాటియా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మహదేవ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన కేసులో తమన్నాను విచారించింది. మహాదేవ అనుబంధ సంస్థ అయిన ఫెయిర్ ప్లే యాప్‏లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గేమ్ మ్యాచులను ప్రసారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మహారాష్ట్ర సైబల్ సెల్ ఏప్రిల్ ను విచారణకు పిలిచింది. మార్చిలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో 76 చైనీస్ నియంత్రిత సంస్థలతో సహా 299 సంస్థలను నిందితులుగా చేర్చింది. ఇందులో పది మంది చైనీస్ మూలాలు ఉన్న డైరెక్టర్లు ఉన్నారు. రెండు సంస్థలు ఇతర విదేశీ పౌరులతో నియంత్రించబడుతున్నాయని పేర్కొంది.

HPZ యాప్ ద్వారా పెద్ద స్కామ్ జరిగింది. ప్రతిరోజు రూ.4 వేలు లాభం ఇస్తానని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.57 వేలు తీసుకున్నారు. నకిలీ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి అక్రమ నగదు బదిలీ. దీనికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు రూ.497.20 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. కోట్లాది రూపాయల కుంభకోణానికి కారణమైన హెచ్‌పిజెడ్ యాప్‌ను తమన్నా ప్రమోట్ చేశారు. అందుకు తమన్నా భారీగానే పారితోషికం తీసుకుంది. దీంతో ఈ కేసులో తమన్నాను ఈడీ విచారిస్తోంది.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్ వారెంట్ జారీ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ వారెంట్ జారీ చేసింది.

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. విధిలేని పరిస్థితుల్లో ప్రధానిగా ఉన్న షేక్‌హసీనా పదవి నుంచి వైదొలిగారు. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.

జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాపై ఐసీటీకి 60కి పైగా కంప్లయింట్స్‌ వచ్చాయి. వాటిపై ట్రైబ్యునల్‌ దర్యాప్తు చేస్తోంది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని, ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్‌ గతంలో పేర్కొన్నారు. హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడానికి యూనస్‌ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ భారత ప్రభుత్వాన్ని కోరింది.

తాజాగా షేక్‌ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ అరెస్టు వారెంట్ జారీ అయింది. నవంబరు 18లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హసీనాతో పాటు ఆమె హయాంలో ఎంపీలకు జారీ చేసిన దౌత్య పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు బంగ్లాదేశ్‌ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

నగరంలో చెడ్డీ గ్యాంగ్ దిగిందా.. అడుగడుగునా జల్లెడ పడుతున్న పోలీసులు!

ఒంగోలు నగరంలో చెడ్డీ గ్యాంగ్ దిగిందా… తాళం వేసిన ఇళ్శు, ఒంటరి మహిళలే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడేందుకు స్కెచ్ వేసిందా..? అనుమానంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఒంగోలులో దోపిడీ దొంగల కదలికలపై అనుమానంతో పోలీసులు అర్ధరాత్రి నగరాన్ని జల్లెడ పట్టారు. 400 మంది పోలీసులతో జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ దృష్ట్యా అర్ధరాత్రి స్వయంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్. దామోదర్ స్వయంగా తనిఖీల్లో పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొత్త వ్యక్తులను, అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒంగోలులోని రామ్ నగర్, భాగ్యనగర్, మంగమూరు రోడ్డు, NSP కెనాల్, త్రోవగుంట, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలోను ఎస్పీ అర్ధరాత్రి పర్యటించి సిబ్బందికి, అధికారులకు సూచనలు చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహించాలని, అనుమానితులు, గుర్తు తెలియని వ్యక్తుల వివరాలు తెలుసుకోవాలని, ఆధార్ కార్డులు పరిశీలించాలని ఆదేశించారు. అనుమానితులను పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఒంగోలు నగరంలో 35 టీములు, జిల్లా వ్యాప్తంగా 400 మంది పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హైవేలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, గ్రామ శివారులు, ఫ్లైఓవర్ల పక్కన నివసించే అనుమానితుల వ్యక్తులను విచారించారు. వాహనాల తనిఖీలు చేశారు. బీట్ సమయంలో ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ డివైస్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు.

ఇళ్లల్లో జరిగే దొంగతనాల నియంత్రణ కోసం పోలీసు పరంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టడుతున్నామని ఎస్పీ దామోదర్ తెలిపారు. వివాహాలు, పండుగలకు ఊరికి వెళుతున్న ప్రజలు విలువైన వస్తువులు, ఆభరణాలు ఇంట్లో పెట్టుకోకూడదని, బ్యాంకుల్లో సురక్షితం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఎవరైనా అనుమానుస్పద వ్యక్తులు ఉంటే వెంటనే డయల్ 100 లేదా స్ధానిక పోలీస్ స్టేషన్‌కు తెలియచేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.

మేక పాలు తాగితే.. డెంగ్యూ తగ్గుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే.

నిపుణుల ప్రకారం.. మేక పాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాలు మాదిరిగానే మేక పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

పోషకగుణాలు అధికంగా ఉండే ఈ పాలను తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చునని చెబుతున్నారు.

ప్రొటీన్స్, కాల్షియం ఎక్కువగా ఉండే మేక పాలను తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. మేక పాలల్లో అమినోయాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని సక్రమంగా అందుతాయి. ఇది ఆవు పాల కంటే ఎక్కువ ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, తక్కువ లాక్టోస్ కలిగి ఉంటుంది, దీని కారణంగా ఇది సులభంగా జీర్ణమవుతుంది.

ఒక కప్పు మేక పాలు తీసుకోవడం వల్ల 30 శాతం ఫాటీ ఆమ్లాలను శరీరం అధికంగా పొందుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మేక పాలలో ఉండే బయోఆర్గానికి సోడియం శరీరానికి చాలా మేలు చేస్తుంది. కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మేక పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ప్రతిరోజు మేకపాలు తాగడం వల్ల రక్తపోటు నియంత్రిస్తుంది. మేక పాలను తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

డెంగ్యూ సోకిన వారికి రక్తంలో ప్లేట్ లేట్స్ తగ్గిపోతుంటాయి. వారికి మేక పాలు ఇస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. కానీ, డెంగ్యూ చికిత్సతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక పోషకమైన ఎంపిక, శరీరానికి అవసరమైన పోషణను అందించగలదని నిపుణులు అంటున్నారు, అయితే ఇది ప్లేట్‌లెట్లను పెంచడంలో లేదా డెంగ్యూ వైరస్ ప్రభావాన్ని నేరుగా నియంత్రించడంలో సహాయపడదు.

డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. డెంగీ దోమ కుట్టడం వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇక.. ఈ దోమ కుట్టిన తర్వాత విపరీతమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూకి ఉత్తమ చికిత్స ఫ్లూయిడ్ థెరపీ అని నిపుణులు అంటున్నారు, రోగి వీలైనంత ఎక్కువ ద్రవాన్ని తీసుకోవాలి, ORS తీసుకోవాలి, ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

ఏ వయస్సు వారు ఎంత ఉప్పు తీసుకోవాలి.. ఉప్పు తగ్గించే చిట్కాలేంటంటే

ఉప్పు లేని కూరను ఊహించుకోవడం కూడా కష్టమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కూరకు రుచిని అందించడంలో ఉప్పుదే కీలక పాత్ర. ఎన్ని రకాల మసాలాలు వేసినా ఉప్పు లేకపోతే కూరకు రుచి లభించదు.

నిజానికి శరీరానికి కచ్చితంగా ఉప్పు లభించాల్సిందే. అయితే మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు.

ఉప్పు అధికంగా తీసుకునే వారిలో అధిక రక్తపోటుతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. దీర్ఘకాలంలో కడుపు క్యాన్సర్‌కు కూడా ఉప్పు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం శాతం పెరుగుతుంది. ఇది పక్షవాతానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అందుకే ఉప్పును మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే తీసుకునే ఉప్పు వయసుపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పెద్దలు రోజూ 6 గ్రాములకు మించిన ఉప్పును తీసుకోకూడదని అంటున్నారు. ఇక పిల్లల విషయానికొస్తే వారి వయసు ఆధారంగా 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇంతకు మించి ఉప్పు తీసుకుంటుంటే ఆరోగ్యంపై ప్రభావం పడడం ప్రారంభమవుతుంది. తీసుకునే ఆహారంలో ఉప్పు తగ్గాలంటే కొన్ని రకాల చిట్కాలు పాటించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అన్నం తినే చోట లేదా డైనింగ్‌ టేబుల్‌పై ఎట్టి పరిస్థితుల్లో ఉప్పును పెట్టుకోకూడదు. దీనివల్ల కూరలో ఉప్పు తక్కువగా ఉందన్న భావనతో వేసుకుంటారు. ఉప్పుకు బదులుగా వీలైనంత వరకు ఛాట్​ మసాలా, యాలకుల పొడి వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇక సాయంత్రం స్నాక్స్ తయారీలో ఉప్పుకు బదులుగా.. దాల్చిన చెక్క పొడి, నల్లమిరియాల పొడి, యాలకుల పొడిని ఉపయోగిస్తే ఉప్పు వినియోగం తగ్గుతుంది. ఇవి రుచిని అందించడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తాయి. అయితే ఒకేసారి కాకుండా క్రమంగా ఉప్పును తగ్గిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్యాకేజ్‌ చేసిన ఫుడ్‌ను తీసోకూడదు. ఇక నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: పవన్ కల్యాణ్

వాల్మీకి జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. రామాయణాన్ని సంస్కృతంలో రచించి భారతావనికి అందించిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి జీవితాన్ని, పరిపాలనను కళ్ళకు కట్టే రామాయణం ప్రజలకు నైతిక వర్తనను వెల్లడిస్తుందని, ధర్మాన్ని అనుసరించి ఎలా జీవించాలో దిశానిర్దేశం చేస్తుందన్నారు.

వాల్మీకి (Valmiki) జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోవలసిన ఇతిహాసం రామాయణం అని, మన వాఙ్మయంలో ఆదికావ్యంగా నిలిచిన రామాయణాన్ని (Ramayanam) సంస్కృతంలో రచించి భారతావనికి అందించిన మహనీయుడు వాల్మీకి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్నారు. గురువారం వాల్మీకి జయంతి (Valmiki Jayanti) సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి జీవితాన్ని, పరిపాలనను కళ్ళకు కట్టే రామాయణం ప్రజలకు నైతిక వర్తనను వెల్లడిస్తుందని, ధర్మాన్ని అనుసరించి ఎలా జీవించాలో దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకి ఋషి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందన్నారు.

రామాయణ మహా కావ్యాన్ని మానవాళికి అందించిన వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వేటగాడైన రత్నాకరుడు తారక మంత్రోపదేశం పొంది వాల్మీకిగా మారి రామాయణ కావ్యాన్ని రచించిన క్రమాన్ని తెలుసుకొంటే ఆధ్యాత్మిక జ్ఞానం విలువ తెలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా దైవ చింతన కలిగే ప్రతి ఒక్కరికీ, వాల్మీకిని ఆరాధించేవారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి..

కాగా యువగళం పాదయాత్రలో టీడీపీ యువనేత, మంత్రి లోకేశ్‌ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 17న వాల్మీకి జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని పేర్కొంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు అప్పట్లో భారీ సంఖ్యలో వినతులు అందాయి. ఈ నేపథ్యంలో బీసీల ఆత్మగౌరవానికి ప్రాముఖ్యతనిస్తూ అప్పట్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు యువగళం పాదయాత్రలో తనను కలిసి విన్నవించారన్నారు. వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

మంత్రి నారాయణ అన్నీ చెప్పారు కానీ ఆ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.. రాజధాని నోటిఫికేషన్‌పై ఇంకా మౌనమే..

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని గడువు ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా రాజధాని నగరంగా అమరావతిని ఖరారు చేస్తూ ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం చర్చనీయాంశంగా మారింది. సిఆర్‌డిఏ సమావేశం తర్వాత కూడా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.
అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో కదలిక, డిసెంబర్ నాటికి టెండర్లు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది రూ.15వేల కోట్లు ఇస్తామని ప్రకటించడంతో టెండర్లను ఖరారు చేసే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సిఆర్‌డిఏ 38వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అమరావతిలో పలు అభివృద్ది పనులకు సంబందించిన అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు మినహా మిగిలిన అన్ని పనులకు టెండర్లను డిశంబరు చివరికల్లా పిలువనున్నామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ పనులు అన్నీ ఏడాది నుండి రెండున్నర్రేళ్లలోపు పూర్తి అవుతాయన్నారు.

2014-19 మధ్య కాలంలో అమరావతి రాజదాని ప్రాంతంలో దాదాపు 3,600 అపార్టుమెంట్లను కట్టారు. వాటిలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు మరియు ఐ.ఏ.ఎస్. అధికారులు నివాసానికి సంబందించి 432 ప్లాట్లతో కూడిన 18 టవర్ల నిర్మాణాలను గతంలోనే పూర్తి చేశారు. ఈ భవనాలకు సివరేజ్ ప్లాంట్, త్రాగునీటి సరఫరా, క్లబ్ హౌస్ నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని రూ.524 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు తాజా సమావేశంలో క్లియరెన్సు ఇచ్చారు.
సిఆర్‌డిఏ భవనానికి అమోదం..

రెండు మూడు రోజుల్లో వాటికి సంబందించిన టెండర్లను పిలిచి 20 రోజుల్లో ఈ పనులను ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. సీఆర్డిఏ కార్యాలయం కోసం గతంలో తమ ప్రభుత్వం జి+7 భవన నిర్మాణాన్ని చేపట్టి స్ట్రక్చర్ పూర్తి చేయడం జరిగిందని, అయితే గత ప్రభుత్వం దాని నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం తో రూ.160 కోట్లతో దాన్ని పూర్తి చేసేందుకు నేటి సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ పనులకు సంబందించిన టెండర్లు ఖరారు అయిన నేపధ్యంలో పనులను నాలుగైదు రోజుల్లో ప్రారంభించనున్నారు.

సీఆర్‌డీఏ, ఏడీసీ, మెప్మా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, మునిసిపల్ ఆఫీసు తదితర కార్యాలయాలను ఈ భవనంలో ఏర్పాటు చేయనున్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతి డవలెప్మెంట్ కార్పొరేషన్ దాదాపు 360 కి.మి. మేర ట్రంక్ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టిందని అవి వివిద దశల్లో ఉన్నాయని నారాయణ వివరించారు. వాటి కాలపరిధి పూర్తి అయిన నేపథ్యంలో డిశంబరు కల్లా తిరిగి టెండర్లను పిలువనున్నామన్నారు.

వరద ముంపు నివారణ చర్యలు..

రాజధాని ప్రాంతం ఎటు వంటి వరదలకు, ముంపుకు గురి అయ్యే అవకాశం లేకుండా ఉండేందుకై కొండవీటి వాగు, పాలవాగు, గ్రామిటీ కెనాల్ డిజైన్లను రూపొందించే పనిని నెథర్లాండ్ వారికి అప్పగించారు. ఇటీవల బుడమేరు వల్ల విజయవాడ నగరానికి సంభవించిన ముంపును దృష్టిలో ఉంచుకుని మరింత పటిష్టవంతంగా డిజైన్లు రూపొందించాలని ఆర్.వి. కన్సల్టెన్సీకి అప్పగించినట్టు చెప్పారు. ఆ డిజైన్ పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయని, వాటికి సంబందించిన టెండర్లను నవంబరులో పిలువనున్నారు.

సెక్రటేరియట్‌ అడ్మినిస్ట్రేటివ్ ఐకానిక్ టవర్లకు సంబందించిన టెండర్లను కూడా డిశంబరుకల్లా పిలవనున్నారు. 2009 లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని కరకట్ట రోడ్డు డిజైన్ చేసినా బుడమేరు వరద దృష్ట్యా రిడిజైన్ చేసేందుకు కన్సల్టెన్సీకి అప్పగించారు. ఈ పనులనకు సంబందించి 15 రోజుల్లో టెండర్లను పిలవనున్నారు.
హైవేతో అనుసంధానం..

జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మించేందుకు ప్రతిపాదించిన E-7/9/11/13 రోడ్ల నిర్మాణ పనులకు సంబందించి టెండర్లను రెండు నెలల్లో ఖరారు చేయనున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.15 వేల కోట్ల మంజూరుకు సంబందించి పర్యావరణం మరియు సోషల్ మేనేజ్మంట్ తదితర అంశాలపై చర్చలు జరుగుచున్నాయని, ఈ ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చిందని, నవంబరు లేదా డిశంబరులో ఈ నిధులు కూడా మంజూరు అయ్యే అకాశం ఉందన్నారు.

ఇకపై ఎప్పటికప్పుడు సీఆర్‌డీఏ అకౌంట్స్ సబ్మిట్ చేయడం జరుగుతుందన్నారు. రాజధాని రైతులకు త్వరలోనే ప్లాట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. పరిహారం విషయంలో కూడా రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో దాదాపు జంగిల్ క్లియరెన్స్ కూడా పూర్తి కానున్నట్టు వివరించారు.
ప్రస్తావనే లేని రాజధాని నోటిఫికేషన్‌…

ఉమ్మడి రాజధాని గడవు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏమిటనే దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఉమ్మడి రాజధానికి జూన్‌ 2వ తేదీతో కాలం చెల్లడంతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరాన్ని నోటిఫై చేస్తూ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వెలువడలేదు. గతంలో మూడు రాజధానులంటూ జరిగిన పరిణామాలతో పెట్టుబడిదారుల్లో అమరావతిపై అపోహలు నెలకొన్నాయి. ప్రభుత్వాలు మారితే ప్రాధాన్యతలు మారిపోతాయనే అపప్రద మూటగట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు షెడ్యూల్ 9,10 ఆస్తుల విభజన అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజధాని నిర్మాణంలో భాగంగా వేల కోట్లను వెచ్చిస్తున్నా అమరావతి నగరానికి సాధికారత కల్పించే విషయంలో తాత్సారం జరుగుతూనే ఉంది.

ఆధార్ త‌ర‌హాలోనే విద్యార్థుల‌కు ‘అపార్’ కార్డులు

ప్ర‌తి విద్యార్థికి ‘అపార్’ కార్డు అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సన్న‌ాహాలు చేస్తోంది. కేజీ నుంచి పీజీ వ‌ర‌కు చ‌దివే ప్ర‌తి విద్యార్థికి గుర్తింపు సంఖ్య‌ను కేటాయించనుంది. కార్డుపై క్యూఆర్ కోడ్‌తో పాటు 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. అపార్‌తో ఎక్క‌డి నుంచైనా ప్ర‌వేశాలు పొందవ‌చ్చు.

విద్యార్థుల‌కు కొత్త కార్డులు రానున్నాయి. ఆధార్ కార్డు త‌ర‌హాలోనే విద్యార్థ‌కుల‌కు కూడా ఆటోమేటెడ్ ప‌ర్మినెంట్ అకాడ‌మిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఆపార్) కార్డులు రానున్నాయి. నూత‌న విద్యా విధానంలో భాగంగా ప్ర‌తి విద్యార్థికి అపార్ అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సన్న‌హాలు చేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌ల్లో తొమ్మిది, ప‌దో త‌ర‌గ‌తులు చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు ఈ కార్డులు జారీ చేసేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది.

వ‌న్ నేష‌న్‌-వ‌న్ స్టూడెంట్ నినాదంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ అపార్ కార్డుల జారీకి శ్రీ‌కారం చుట్టింది. కేజీ నుంచి పీజీ వ‌ర‌కు చ‌దివే ప్ర‌తి విద్యార్థికి గుర్తింపు సంఖ్య‌ను కేటాయించనుంది. ఒక విద్యార్థికి వ‌చ్చిన గుర్తింపు సంఖ్య‌, మ‌రో విద్యార్థికి రాదు. ప్ర‌స్తుతం ఆధార్ కార్డుల‌కు కూడా ఇదే త‌ర‌హాలోనే ఉన్నాయి. దేశంలో ఒక వ్య‌క్తికి ఉన్న ఆధార్ నెంబ‌ర్ మ‌రొ వ్య‌క్తికి ఉండ‌దు. స‌రిగ్గా ఇదే త‌ర‌హాలో విద్యార్థుల‌కు కూడా గుర్తింపు సంఖ్య‌ను కేటాయించ‌నున్నారు.
కార్డులో ఏ వివ‌రాలు ఉంటాయి ?

అపార్ కార్డులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, క్యూఆర్ కోడ్‌, 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మాత్రం విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, క్యూఆర్ కోడ్‌, 12 అంకెల గుర్తింపు సంఖ్యతో పాటు ఆ విద్యార్థి మార్కులు, గ్రేడ్లు, ఉప‌కార వేత‌నాల వివ‌రాలు, అవార్డులు, డిగ్రీలు, క్రీడ‌లు, ఇత‌ర అంశాల్లో సాధించిన విజ‌యాల‌తో పాటు విద్యా సంబంధింత వివ‌రాల‌తో స‌మ‌గ్ర రికార్డును అందుబాటులో ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయ‌గానికి మొత్తం వివరాల‌ను తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. ఇది విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, అధ్యాప‌కులకు ఉప‌యోగ‌ప‌డుతోంది.

తొలుత ఈ త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కే…!

తొలుత తొమ్మిదో త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉన్న విద్యార్థుల‌కు ఈ కార్డులు ఇవ్వ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం పాఠ‌శాల విద్యార్థుల‌కు యూడైస్ వెబ్‌సైట్లో పెన్ (ప‌ర్మినెంట్ ఎడ్యుకేష‌న్ నంబ‌ర్‌) ఉంది. దీని ఆధారంగానే విద్యార్థుల‌కు ప్ర‌వేశాలు, టీసీలు జారీ చేస్తున్నారు. ఇదే త‌ర‌హాలోనే ఇక‌పై అపార్‌తో అన్ని కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తారు.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌ల్లో తొమ్మిది, ప‌దో త‌ర‌గ‌తులు చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు ఈ కార్డులు జారీ చేసేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేశారు. అలాగే వెబ్‌సైట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర విద్యా శాఖ నిర్వ‌హ‌ణ‌లో ఈ అధికారిక వెబ్‌సైట్‌ https://apaar.education.gov.in/ అందుబాటులోకి వ‌చ్చింది.

అపార్‌తో ఎక్క‌డి నుంచైనా ప్ర‌వేశాలు పొంద వ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసే గుర్తింపు సంఖ్య ఆధారంగా అపార్ కార్డులో విద్యార్థి బ్యాంకు ఖాతా నంబ‌ర్‌, డీజీ లాక‌ర్‌తో అనుసంధాన‌మై ఉంటుంది. ఈ కార్డుల‌ను జారీ చేసే ముందు కేంద్ర ప్ర‌భుత్వం అక‌డ‌మిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ)ని ప్రారంభించింది. డీజీ లాక‌ర్ ద్వారా వివ‌రాలు న‌మోదు చేస్తే విద్యార్థి పేరుతో స‌హా ఆపార్ కార్డు వ‌స్తుంది. దీన్ని నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దీనిద్వారా వివిధ విద్యా సంస్థ‌ల్లో ప్ర‌వేశాలు, ప్రవేశ ప‌రీక్ష‌ల్లో వివ‌రాల న‌మోదు, ధ్రువీక‌ర‌ణ త‌దిత‌ర ప‌నులన్నీ సులువుగా పూర్తి అవుతాయి. స్కాల‌ర్ షిప్స్ మంజూరు, ఉద్యోగాల భ‌ర్తీ, ఇత‌ర సంద‌ర్భాల్లో ఇదే కీల‌కం కానుంది.

మ‌రోవైపు అపార్ డేటా భ‌ద్ర‌త‌, గోప్య‌త‌కు ప్రాధ్యాత ఇస్తుంది. గోప్య‌త‌, భ‌ద్ర‌త కోసం అవ‌స‌ర‌మైన ప్ర‌భుత్వ ఏజెన్సీల‌తో మాత్ర‌మే స‌మాచారాన్ని పంచుకుంటుంది. స‌మాచారంపై విద్యార్థుల‌కు నియంత్ర‌ణ ఉండలా చేస్తుంది.

ఈ క్రెడిట్ కార్డులకు ఏన్యువల్ ఫీజు ఉండదు; అదనపు ప్రయోజనాలు కూడా..

సాధారణంగా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు వార్షికంగా నిర్ణీత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని బ్యాంక్ లు స్వయంగా లేదా వివిధ సంస్థలతో భాగస్వామ్యంతో వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అవి ఇతర క్రెడిట్ కార్డుల మాదిరిగానే అన్ని ప్రయోజనాలను కల్పిస్తాయి.

బడ్జెట్ ఫ్రెండ్లీ క్రెడిట్ కార్డు కోసం చూస్తున్నారా? వార్షిక రుసుములు లేని క్రెడిట్ కార్డులు మీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడానికి పొదుపైన మార్గం అవుతుంది. అదనపు ఖర్చులు లేకుండా ఉపయోగకరమైన ప్రయోజనాలను అందించే క్రెడిట్ కార్డ్ లు అందుబాటులో ఉన్నాయి. అలా వార్షిక రుసుము లేకుండా, అన్ని ప్రయోజనాలు, రివార్డులు అందిస్తూ, ఫ్రీ సర్వీస్ ఇస్తున్న 5 క్రెడిట్ కార్డుల వివరాలను ఇక్కడ చూడండి..

వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డులు
1. ఆర్బీఎల్ బ్యాంక్ బ్యాంక్ బజార్ సేవ్ మ్యాక్స్ క్రెడిట్ కార్డు

ఎక్స్ ప్రెస్ క్యాష్: మీ అకౌంట్ లోకి ఇన్ స్టంట్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ అవుతాయి.

రివార్డులు: బుక్ మైషో, జొమాటో లావాదేవీలపై 10% క్యాష్ బ్యాక్ (నెలకు రూ.100 వరకు).

ఈఎంఐ ఇన్ఫినిటీ పాస్: స్ప్లిట్ అండ్ పే ఫీజుపై డిస్కౌంట్లు.

మేనేజ్మెంట్ యాప్: మీ కార్డు ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లించవచ్చు. ఆఫర్లను యాక్సెస్ చేయవచ్చు. ఆర్బిఎల్ బ్యాంక్ మై కార్డ్ యాప్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేయవచ్చు.

2. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు

రివార్డులు: అపరిమితం, గడువు లేకుండా.

రీడీమ్: అమెజాన్, ఇతర వ్యాపారుల వద్ద 100 మిలియన్లకు పైగా ఉత్పత్తుల కోసం మీ క్రెడిట్లను ఉపయోగించండి.

నో కాస్ట్ ఈఎంఐ: అమెజాన్ కొనుగోళ్లపై మూడు లేదా ఆరు నెలల వరకు అందుబాటులో ఉంటుంది.
3. హెచ్ ఎస్ బీసీ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డు

క్యాష్ బ్యాక్: హెచ్ ఎస్ బీసీ ఇండియా మొబైల్ యాప్ ద్వారా మొదటి 30 రోజుల్లో కనీసం రూ.5,000 ఖర్చు చేస్తే రూ.500 క్యాష్ బ్యాక్ పొందండి.

ఇంధన పొదుపు: ఇంధన చెల్లింపులపై వార్షికంగా రూ.3,000 వరకు ఆదా అవుతుంది.

ఫ్లైట్ మైళ్లు: వివిధ విమానయాన సంస్థలతో రివార్డు పాయింట్లను మైళ్లుగా మార్చండి.
4. ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డు

రివార్డులు: రిటైల్ స్టోర్లలో ఖర్చు చేసిన ప్రతి రూ. 100కు రెండు రివార్డ్ పాయింట్లు సంపాదించండి (పెట్రోల్ మినహా).

ఇంధన మాఫీ: హెచ్ పీసీఎల్ పంపుల్లో 1 శాతం సర్ చార్జ్ మాఫీ (రూ.4,000 వరకు).

సెక్యూర్ పేమెంట్స్: క్విక్ అండ్ సెక్యూర్ పేమెంట్ టెక్నాలజీ.
5. ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డు

ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్: డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ లకు ఉచిత ప్రవేశం.

ప్రయాణ ప్రయోజనాలు: తక్కువ ఫారెక్స్ మార్కప్, ట్రిప్ క్యాన్సిలేషన్ కవరేజీ.

సినిమా టికెట్లు: పేటీఎం ద్వారా రూ.125 వరకు విలువైన బై-వన్- గెట్ వన్ సినిమా టికెట్లు.

రివార్డ్ పాయింట్లు: మీ మొదటి నాలుగు లావాదేవీలపై (రూ. 200 వరకు) 100% క్యాష్ బ్యాక్ పొందండి.
వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు

జీవితకాల ఉచితం: కార్డు సేవలను ఆస్వాదించడానికి వినియోగదారులు ఎటువంటి వార్షిక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఖర్చు ఆదా: కొన్ని కార్డులు ఇంధన లావాదేవీలపై సర్ ఛార్జీలను మాఫీ చేస్తాయి.

వివిధ సౌకర్యాలు: ఎయిర్ పోర్ట్ లాంజ్ లకు యాక్సెస్, షాపింగ్, డైనింగ్, ఫుడ్ డెలివరీ, సినిమా టిక్కెట్లు, మరెన్నో డిస్కౌంట్లను అందిస్తాయి.

వెల్ కమ్ బెనిఫిట్స్: చాలా కార్డులు బోనస్ రివార్డ్ పాయింట్స్, వోచర్లు, ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్, సైన్ అప్ పై అదనపు బెనిఫిట్స్ అందిస్తున్నాయి.
ఏన్యువల్ ఫీజు లేని క్రెడిట్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ఆన్ లైన్ అప్లికేషన్

ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇస్తున్న బ్యాంక్ ను ఎంపిక చేసుకుని ఆ బ్యాంక్ వెబ్సైట్ కు సందర్శించండి. వివరాలు చెక్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్ నింపండి. అవసరమైన వ్యక్తిగత వివరాలను అందించండి. అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి. వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయండి. మీ దరఖాస్తును ఆమోదించే ముందు బ్యాంక్ మీ వివరాలు మరియు పత్రాలను తనిఖీ చేస్తుంది. మీకు అర్హత ఉంటే, మీకు క్రెడిట్ కార్డును మంజూరు చేస్తుంది.

ఆఫ్ లైన్ అప్లికేషన్

వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డు కోసం ఆఫ్ లైన్ లో అప్లై చేయడానికిి సంబంధిత బ్యాంక్ అధికారిక బ్రాంచ్ కు వెళ్లండి. అక్కడ సిబ్బందిని సంప్రదించి, అప్లికేషన్ ఫామ్ ను నింపండి. అవసరమైన వ్యక్తిగత వివరాలను అందించండి. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి. మీ దరఖాస్తును ఆమోదించే ముందు బ్యాంక్ మీ వివరాలు మరియు పత్రాలను సమీక్షిస్తుంది.
సరిగ్గా వాడకపోతే నష్టపోతారు..

వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డులను చవకైన ఆర్థిక సాధనంగా ఉపయోగించుకోవచ్చు. అయితే, ఇతర క్రెడిట్ కార్డుల (CREDIT CARD) మాదిరిగానే, గడువు తేదీలోగా మీ బకాయిని చెల్లించకపోతే, అధిక వడ్డీ బారిన పడే ప్రమాదముంది. అందువల్ల, ప్రతీ నెల గడువులోపు మొత్తం బకాయి చెల్లించే అలవాటు చేసుకోండి. వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డును ఎంచుకునేటప్పుడు, రివార్డు ప్రోగ్రామ్ లు, వడ్డీ రేట్లు, క్రెడిట్ పరిమితులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోండి.

ఫోల్డబుల్ ఫోన్ కొంటున్నారా?.. ముందు ఈ 5 విషయాలు పరిశీలించిన తరువాతే డిసైడ్ కండి..

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లేటెస్ట్ క్రేజ్ ఫోల్డబుల్ ఫోన్స్ ది. ఇప్పుడు చాలామంది స్లీక్ అండ్ స్లిమ్ గా ఉంటూ, ఈజీగా క్యారీ చేయొచ్చని ఫోల్డబుల్ ఫోన్స్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అయితే,ఫోల్డబుల్ ఫోన్ ను సెలెక్ట్ చేసేముందు, ఈ ఐదు ముఖ్య లక్షణాలను పరిశీలించండి.

ఫోల్డబుల్ ఫోన్లకు ఈ మధ్య కాలంలో ఆదరణ పెరుగుతోంది. అధిక ధరలు, పరిమిత పనితీరు వంటి ప్రారంభ సవాళ్లను అధిగమించి, వినియోగదారుల విశ్వాసాన్ని పొందుతున్నాయి. 2023 లో డిజైన్, ధరలో పురోగతి చోటు చేసుకోగా, 2024 లో ఎక్కువ సంఖ్యలో ఫోల్డబుల్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చాయి. శాంసంగ్, గూగుల్, షియోమీ, మోటరోలా, వన్ప్లస్ వంటి ప్రధాన బ్రాండ్ లు ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ ను అందిస్తున్నాయి. మీరు ఫోల్డబుల్ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే, ఈ కింద పేర్కొన్న ఐదు ముఖ్య లక్షణాలను గుర్తుంచుకోండి.

1. డిస్ ప్లే క్వాలిటీ

ఏదైనా ఫోన్ కు డిస్ ప్లే కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. మంచి పిక్సెల్ సాంద్రత కలిగిన హై-రిజల్యూషన్ స్క్రీన్ వల్ల టెక్స్ట్ కు, ఇమేజ్ లకు స్పష్టత వస్తుంది. ముఖ్యంగా అన్ ఫోల్డ్ చేసినప్పుడు, లేదా ఔట్ డోర్ లో ఉన్నప్పుడు ప్రకాశవంతంగా కనిపించే డిస్ ప్లే ఉన్న పరికరాన్ని ఎంపిక చేసుకోండి. ఫోల్డబుల్ టెక్నాలజీలో క్రీజెస్ సాధారణం అయినప్పటికీ, క్రీజ్ తక్కువగా ఉండే మోడల్ ను ఎంచుకోండి.

2. ఫ్లిప్ లేదా ఫోల్డ్?

ఫోల్డబుల్ ఫోన్లు ప్రధానంగా రెండు కేటగిరీలుగా ఉంటాయి. అవి 1. బుక్-స్టైల్ ఫోల్డింగ్, 2. క్లామ్ షెల్-స్టైల్ ఫోల్డింగ్. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, వన్ప్లస్ ఓపెన్ వంటి బుక్-స్టైల్ ఫోల్డింగ్ ఫోన్లు మల్టీటాస్కింగ్, మీడియా వినియోగానికి అనువైన టాబ్లెట్ లాంటి ఇంటర్ ఫేస్ ను సృష్టిస్తాయి. దీనికి విరుద్ధంగా, శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, మోటరోలా రేజర్ 50ఎఫ్ వంటి నిలువుగా ఫోల్డ్ చేయగల ఫోల్డింగ్ మోడళ్లు పోర్టబిలిటీపై దృష్టి పెడతాయి. మీ రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉండే మోడల్ ను ఎంచుకోండి.
3. హింజ్ మెకానిజం

ఫోల్డబుల్ ఫోన్ వినియోగం, మన్నికలో హింజ్ కీలక పాత్ర పోషిస్తుంది. మృదువైన హింజ్ స్థిరమైన పనితీరుకు వీలు కల్పిస్తుంది. మన్నిక కీలకం. పదేపదే ఫోల్డ్ చేయడం, ఓపెన్ చేయడం వల్ల హింజ్ లో సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వాటిని తట్టుకునేలా డిజైన్ చేసిన మోడల్ ని ఎంచుకోండి. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 వంటి కొన్ని మోడళ్లు “ఫ్లెక్స్ మోడ్” ను కలిగి ఉంటాయి. ఇవి వివిధ కోణాలను అనుమతిస్తుంది.

4. కెమెరా సిస్టమ్

ఫోల్డబుల్ ఫోన్లను ఎంపిక చేసే ముందు కెమెరా సామర్థ్యాలను పరిశీలించండి. బహుళ లెన్స్ లు ఉన్న బహుముఖ కెమెరా వ్యవస్థ—వెడల్పు, అల్ట్రా-వైడ్ మరియు టెలిఫోటో—వివిధ ఫోటోగ్రఫీ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో, వన్ప్లస్ ఓపెన్ వంటి డివైజ్ లు ఆకట్టుకునే కెమెరా టెక్నాలజీ కలిగి ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, తక్కువ-కాంతి పనితీరు వంటి లక్షణాలున్న ఫోల్డబుల్ ఫోన్ ను ఎంచుకోండి. కొన్ని ఫోల్డబుల్స్ కవర్ స్క్రీన్ ను వ్యూఫైండర్ గా పనిచేయడానికి అనుమతిస్తాయి, సెల్ఫీ అనుభవాన్ని పెంచుతాయి.
5. బ్యాటరీ లైఫ్, మన్నిక

ఫోల్డబుల్ ఫోన్లు తరచుగా వాటి విస్తారమైన డిస్ప్లేల కారణంగా పెద్ద బ్యాటరీలను కలిగి ఉంటాయి, అయినప్పటికీ బ్యాటరీ జీవితకాలం మారవచ్చు. దీర్ఘకాలికంగా ఉపయోగించడానికి వీలుగా గణనీయమైన బ్యాటరీ సామర్థ్యం ఉన్న డివైజ్ కోసం చూడండి. బ్యాటరీ ని తక్కువగా వినియోగించే ప్రాసెసర్, సాఫ్ట్ వేర్ లు ఉన్న ఫోన్ ను ఎంపిక చేసుకోండి. ఫోల్డబుల్ ఫోన్ విషయంలో కూడా మన్నిక చాలా కీలకం. వాటర్ అండ్ డస్ట్ నిరోధకత ఉన్న మోడళ్లను ఎంచుకోండి. మంచి స్క్రీన్ ప్రొటెక్టర్ ఉన్న మోడల్ ను పరిగణించండి.

ఇక ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. ఈ-ఫైలింగ్ పోర్టల్ 3.0పై కసరత్తు

ఆదాయపు పన్ను శాఖ కొన్ని అవసరమైన మార్పులతో కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ 3.0ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ పోర్టల్ ఉపయోగించడం చాలా సులభం కానుంది. దీని సహాయంతో ఆదాయపు పన్ను రిటర్నులను చాలా తక్కువ సమయంలో దాఖలు చేయవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ దాఖలు చేసే ప్రక్రియను మరింత సులభతరం చేయబోతోంది. ఈ మేరకు అవసరమైన కొన్ని మార్పులతో కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ 3.0ను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పోర్టల్ ఉపయోగించడం చాలా సులభంగా ఉండనుంది. దీని సహాయంతో ఆదాయపు పన్ను రిటర్నులను చాలా తక్కువ సమయంలో దాఖలు చేయవచ్చు.

ప్రస్తుతం ఈ-ఫైలింగ్ పోర్టల్లో ఈ-ఫైలింగ్, సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్(ఐఈసీ) 2.0 వ్యవస్థను అనుసంధానం చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ సర్క్యులర్లో పేర్కొంది. ఐఈసీ 3.0ను కొత్త ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. హైస్పీడ్ ఐటీ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఐటీ శాఖ. ఐటీఆర్‌ల వెరిఫికేషన్, ప్రాసెసింగ్, జారీ ప్రక్రియను వేగవంతం చేయనుంది.

పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండేలా కొత్త ఐటీఆర్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించే ముందు ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. అన్ని అభిప్రాయాలు, సూచనలను జాబితా చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దాని ఆధారంగా పోర్టల్లో గణనీయమైన మార్పులు చేస్తారు.

ప్రస్తుత ఐఈసీ 2.0 విధానంలో కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పోర్టల్‌లో ట్రాఫిక్ పెరిగే కొద్దీ స్లో అవుతుంది. ఒక్కోసారి సైట్ క్రాష్ కూడా అవుతుంది. దీంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు గడువులోగా రిటర్నులు దాఖలు చేయడం లేదు.

ఈ ప్రాజెక్ట్ పన్ను చెల్లింపుదారులకు ఇ-ఫైలింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. దీని సహాయంతో ఆన్లైన్ ఆదాయపు పన్ను రిటర్నులను ఎక్కడి నుంచైనా దాఖలు చేయవచ్చు. పన్ను వ్యవహారాలకు సంబంధించిన ఇతర ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని ఇతర సేవలను వినియోగించుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. పన్ను చెల్లింపుదారులు తమ పాత ఐటీఆర్ ఫారాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వర్షాకాలంలో కారును ఎలా నడపాలి? సింపుల్ టిప్స్‌తో మీరు, మీ కారు సేఫ్

వర్షాకాలం నీటితో కారుకు ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు మీరు కూడా ప్రమాదంలో పడవచ్చు. అందుకే వానాకాలం కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే మీరు, మీ కారు సేఫ్‌.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. చెన్నై, బెంగళూరులాంటి నగరాల్లోనూ భారీగా వానలతో వరదలు వస్తున్నాయి. ఈ సమయంలో మీ కారును ఎలా నడపాలి అని కూడా మీరు తెలుసుకోవాలి. భారీ వర్షంలో డ్రైవింగ్ అనేది మీకు, మీ కారుకు మంచిది కాదు. సరిగా కనిపించకపోవడం, జారుడు రోడ్లు, నీటి గుంతలతో ప్రమాదాలు జరగవచ్చు. సురక్షిత డ్రైవింగ్ చేసేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.

వానాకాలంలో తెలియని రోడ్లపై డ్రైవింగ్ చేయకూడదు. కారణం ఏంటంటే చాలా చోట్ల వానలు పడి రోడ్లన్నీ జలమయమవుతాయి. దీంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో మీకు తెలియదు. కొండ ప్రాంతాల్లో వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల వైపు వెళ్లకూడదు.

వానాకాలంలో ఎంత అనుభవం ఉన్న డ్రైవర్ అయినా ప్రమాదాలకు గురికావొచ్చు. వర్షంలో నెమ్మదిగా నడపడం ఉత్తమం. తడి రోడ్లపై బ్రేకులు పెద్దగా స్పందించవు. కారుపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తుంటే సడెన్ బ్రేక్ వేస్తే స్కిడ్డింగ్ జరగొచ్చు. అందుకే నెమ్మదిగా వెళ్లాలి.

నీటితో నిండిన రోడ్లపై ప్రయాణించాలని నిర్ణయించుకుంటే వేగాన్ని తగ్గించేటప్పుడు కూడా మీ పాదాలను యాక్సిలరేటర్ పెడల్‌పై ఉంచాలి. ఎగ్జాస్ట్ నుండి నీటిని గ్రహించగలవు. ప్రమాదాలు తక్కువ జరిగే అవకాశం ఉంటుంది.

వానాకాలంలో రోడ్డుపై నీటి లోతు తెలియదు. నీరు నిలిచిన రోడ్లపై వాహనాలు నడపవద్దు. మీ కారు వరదలు ఉన్న రహదారిపై పార్క్ చేస్తే.. వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించవద్దు. ఎందుకంటే నీరు ఇంజిన్‌లోకి ప్రవేశించి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. దీంతో చాలా డబ్బులు ఖర్చవుతుంది.

వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు కనిపించేలా చూసుకోవడం ముఖ్యం. కారు వైపర్‌లను చెక్ చేయండి. వైపర్‌లపై ఉన్న రబ్బరు రోడ్డును క్లియర్‌గా చూపించేందుకు సాయపడుతుంది. నీటిని, దుమ్మును తొలగించడంలో సహాయపడుతుంది. బయటకు వెళ్లేముందు విండ్‌షీల్డ్ వైపర్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోండి.

వర్షంలో కారు నడుపుతున్నప్పుడు సడన్ బ్రేక్ వేయకండి. ఇలా సడన్‌గా బ్రేక్‌ వేసినప్పుడు వెనుక నుంచి వచ్చే వాహనం మీ కారును ఢీకొట్టే అవకాశాలున్నాయి. వానాకాలంలో ముందు ఉన్న వాహనాలు సరిగా కనిపించకపోవచ్చు. ఇంకా నీరు ఉంటే ఎగ్జాస్ట్ పైపు ద్వారా నీరు ఇంజిన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సడన్ బ్రేక్ వేస్తే కారు బోల్తా పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో కారు జారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

టయోటా నుంచి పాపులర్ ఎస్‌యూవీ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ ప్రయోజనం

పండుగ సీజన్ సందర్భంగా టయోటా తన టైజర్ ఎస్‌యూవీ లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. అయితే కొన్ని ప్రయోజనాలను మాత్రం అక్టోబర్ 31 వరకు తీసుకున్నవారికే ఇస్తుంది.

టయోటా తన టైజర్ ఎస్‌యూవీ లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. ఇది కాంప్లిమెంటరీ యాక్సెసరీలలో భాగం, కారు ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌ను మార్చడానికి పనిచేస్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ రూ.20,160 విలువైన టయోటా జెన్యూన్ యాక్సెసరీస్(టీజీఏ)తో లభిస్తుంది. దీని ధర రూ.10.56 లక్షలు. వెలుపల గ్రానైట్ గ్రే అండ్ రెడ్ ఫ్రంట్ అండ్ రియర్ అండర్ స్పాయిలర్స్, డోర్ సిల్ గార్డ్స్, హెడ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ గార్నిష్, ఫ్రంట్ గ్రిల్, సైడ్ మౌల్డింగ్స్ ఉన్నాయి. క్యాబిన్ లోపల, లిమిటెడ్ ఎడిషన్‌లో డోర్ వైజర్లు, ఆల్-వెదర్ త్రీడీ మ్యాట్లు, డోర్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రయోజనాన్ని వినియోగదారులు అక్టోబర్ 31 వరకు మాత్రమే పొందుతారు.

టయోటా టైజర్ మారుతి ఫ్రాంక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని కొలతలు ఫ్రాంక్స్‌ను పోలి ఉంటాయి. కానీ ఇది ప్రత్యేకమైన కొత్త లుక్ కోసం కొత్త ఫ్రంట్‌‌ను కలిగి ఉంది. కూపే-స్టైల్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో నలుపు, కొత్త ట్విన్ ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లలో ఫినిష్ చేసిన కొత్త హనీకోంబ్ మెష్ గ్రిల్‌ను పొందుతుంది. మధ్యలో ఆకర్షణీయమైన టయోటా లోగో ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు కూడా లభిస్తాయి. ఇవి బూట్ పై లైట్ బార్ ద్వారా కనెక్ట్ అవుతాయి. మోడల్ కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ ను కూడా పొందుతుంది.

ఈ క్యాబిన్ మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ను పోలి ఉంటుంది. ఇందులో 9-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, మధ్యలో ఎంఐడి యూనిట్‌తో కూడిన ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. క్యాబిన్ కొత్త డ్యూయల్-టోన్ ట్రీట్మెంట్ పొందుతుంది. అయితే దాదాపు అన్ని ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 360 డిగ్రీల కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, డీఆర్ఎల్‌తో కూడిన ఆటోమేటిక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీలో 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్ /స్టాప్, రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి.

1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో టైజర్ లభిస్తుంది. ఇందులోని 1.2 ఇంజన్ గరిష్టంగా 89బిహెచ్‌పీ పవర్, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుండగా, టర్బోచార్జ్‌డ్ యూనిట్ 99బిహెచ్‌పీ పవర్, 148ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలు రెండు పవర్ ఇంజిన్లతో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుతాయి. ఆటోమేటిక్‌గా ఆస్పిరేటెడ్ మోటారు 5-స్పీడ్ ఎఎమ్టి, టర్బో పెట్రోల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ను పొందుతాయి. దీనికి సీఎన్జీ పవర్ట్రెయిన్ కూడా ఉంది.

సేవింగ్ అకౌంట్‌లో ఇంతకంటే ఎక్కువ జమ చేస్తున్నారా?.. లిమిట్ దాటితే ఏమవుతుందంటే

ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను మెయిన్ టైన్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా, వ్యాపారం ప్రారంభించేందుకు లోన్ కావాలన్నా బ్యాంకుల్లో అకౌంట్ ఉండాల్సిందే. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు కూడా బ్యాంక్ ఖాతా తప్పనిసరి. బ్యాంకులు తమ కస్టమర్లకు సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ వంటివి అవసరానికి తగ్గట్టుగా ఇస్తుంటాయి. ఉద్యోగులు శాలరీ అకౌంట్ తెరుస్తుంటారు. అయితే ఎక్కువ మంది సేవింగ్ ఖాతాలనే కలిగి ఉంటారు. సంపాదించిన డబ్బును సేవింగ్స్ ఖాతాల్లో పొదుపు చేసుకుంటుంటారు ఖాతాదారులు. సేవింగ్ అకౌంట్లలో డబ్బును సురక్షితంగా భద్రపరుచుకోవడమే కాకుండా దానిపై వడ్డీ కూడా పొందొచ్చు.

ఒక్కోసారి ఇతరుల డబ్బులను కూడా తమ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో సేవింగ్స్ ఖాతా లిమిట్ దాటుతుంది. అసలు సేవింగ్ ఖాతాలో లిమిట్ ఎంత? పొదుపు ఖాతాలో ఎంత డబ్బును జమ చేసుకోవచ్చు? లిమిట్ దాటితే ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఆ వివరాలు చూసినట్లైతే.. సేవింగ్ ఖాతాలో లిమిట్ దాటితే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి నోటిసులు వస్తాయి. మరి ఇలా కాకూడదు అంటే సేవింగ్ ఖాతాలో ఎంత డబ్బు ఉండొచ్చో ఇప్పుడు చూద్దాం. సేవింగ్స్ ఖాతాలో ఎన్ని డబ్బులైనా జమ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి లిమిట్ లేదు. కానీ, ఆదాయపు పన్ను శాఖ.. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో జమ చేయగల డబ్బులపై రూ. 10 లక్షల పరిమితి విధించింది.

అంటె ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. 10 లక్షలకు మించి డబ్బుల్ని జమ చేస్తే మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారు. ఆ నగదుపై మీరు పన్ను చెల్లించాల్సి రావొచ్చు. పరిమితికి మించి ఎక్కువ నగదు జమ చేసినట్లయితే ఆ ఖాతా వివరాలను బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తాయి. పరిమితికి మించి సేవింగ్ చేస్తే అది ఆదాయపన్ను శాఖ పరిధిలోకి వెళ్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 285బీఏ ఈ నిబంధనలు సూచిస్తోంది. సేవింగ్స్ ఖాతాలోని డబ్బును ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు అందులో ఇచ్చిన సమాచారంతో సరిపోలకపోతే ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.

అప్పుడు ఖాతాదారులు ఆ ఆదాయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీ శాఖకు తప్పుడు సమాచారం ఇస్తే కొన్నిసార్లు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుంది. కాబట్టి సేవింగ్ ఖాతాలో ఎంత డబ్బు ఉండొచ్చో ముందే తెలుసుకుంటే ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. మీ పొదుపు ఖాతాలోని సొమ్ములపై వచ్చే వడ్డీ మీ ఆదాయానికి జమ అవుతుంది. వడ్డీపై పన్ను కట్టాలి. బ్యాంకు ఇచ్చే వడ్డీపై 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. బ్యాంక్ ఖాతాలోని నగదుపై వచ్చే వడ్డీ రూ.10 వేల కంటే తక్కువుంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

చెన్నైలో భారీ వర్షాలు .. స్తంభించిన జనజీవనం

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రతో పాటు తమిళనాడు, చెన్నైపలు జిల్లాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ వరద నీటితో పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది.. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, ఐటీ కంపెనీల్లో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. అల్పపీడనం తీరం చేరుకోవడంతో చెన్నై నగరానికి హై అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బుధవారం తమిళనాడులో పలు ప్రాంతాలకు భారీ వర్షాలు ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. పూర్తి వివరాల్లోకి వెళితే..

చెన్నై నగరం మళ్లీ నీట మునిగింది. దాదాపు 300 ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్ పేట జిల్లాల్లో విద్యాసంస్థలను సెలవు ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సేవల మినహా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలను కూడా మూసివేయాలని పేర్కొంది. బుధవారం ఈ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు గురువారం నాటికి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంట నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 60 కిలో మీటర్ల వేగంతో గాలులు విచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. భారీ వర్ష సూచన కారణంగా ప్రైవేట్ ఐటీ కంపెనీలు అక్టోబర్ 18 వరకు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఉద్యోగులకు సూచించారు సీఎం స్టాలిన్.

ఇదిలా ఉంటే.. అక్టోబర్ 15 అర్ధరాత్రి నుంచి చెన్నైలో కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షపు నీటితో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని పలు జంక్షన్లో వరద నీరు చుట్టుముట్టింది. చెన్నైలో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని రద్దు చేయగా, మరికొన్ని వాయిదా వేశారు.ఉత్తర చెన్నై లోని పెరంబూర్, పట్టాళం ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిరువాన్మియూర్ లోని వాల్మీకీ నగర్, ఏజీఎస్ కాలనీ, అడయార్ లోని శాస్త్రి నగర్, నేతాజీ కాలనీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. కార్లు ఇళ్ల ముందు ఉంచితే.. వరదల్లో కొట్టుకు పోవొచ్చు అన్న ఆందోళనతో ఫైఓవర్లపై పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నై- వేళచ్చేరి ఫ్లై ఓవరపై కార్లు వరుసగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. తెలంగాణలోనే.. ఎక్కడంటే

మానసిక ఉల్లాసం కోసం చాలా మంది టూర్లకు వెళ్తుంటారు. వర్క్ నుంచి రిలీఫ్ కోసం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా గడిపేందుకు విహార యాత్రలకు వెళ్తుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలకు కొదవ లేదు. భారత్ లో కూడా రమణీయమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉంది. తాజ్ మహల్, గోల్డెన్ టెంపుల్, ఎర్రకోట వంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. దేశంలోని రాజభవనాలు, అన్యదేశ వన్యప్రాణులు, ద్వీపాలు పర్యాటకులను ఎంతగాను ఆకర్షిస్తుంటాయి.

ప్రసిద్ధమైనవిగా చెప్పుకునే ప్రదేశాల్లో ఢిల్లీ, ఆగ్రా, సిమ్లా, మనాలి, కూర్గ్, ఊటీ, మన్నార్, గోవా, పాండిచ్చేరి, నైనిటాల్, మహాబలేశ్వర్, ఉదయపూర్, ద్వారక, సోమనాథ్, మదురై, అజంతా గుహలు, గ్యాంగ్ టక్, డార్జిలింగ్ అత్యంత ప్రసిద్ధమైనవి. దేశవ్యాప్తంగా అనేక రకాల మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ.. తాజ్ మహల్, రాజస్థాన్, కేరళ, గోవా, వారణాసి, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ముందు స్థానంలో ఉన్నాయి. అయితే మన దేశంలో అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మల్దీవులకు వెళ్తుంటారు. అయితే పర్యాటకుల మది దోచే మాల్దీవుల కోసం అక్కడికి వెళ్లాల్సిన పని లేదండోయ్. తెలంగాణలో కూడా మినీ మాల్దీవులున్నాయి.

మీరు టూర్ కోసం ప్లాన్ చేసుకున్నట్లైతే తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలవబడే సోమశిల బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్లాలి అనేదానిపై క్లారిటీ లేకపోతే బడ్జెట్ ధరలో సోమశిలను సందర్శించి మాల్దీవులను చూసిన ఫీలింగ్ పొందొచ్చు. తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలవబడే సోమశిల హైదరాబాద్‌ నగరానికి దగ్గర్లోనే ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ ప్రముఖ పర్యాటక ప్రాంతం ఉంటుంది.
హైదరాబాద్ కు 180 కి.మీ దూరంలో ఉన్న సోమశిల.. నదీ జలాలు, పచ్చని అడవుల మధ్య పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సోమశిలకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా అవార్డు కూడా దక్కింది. కృష్ణా నదీ తీర ప్రాంతంలో ఉండే సోమశిల ఒక ద్వీపం మాదిరిగా ఉంటుంది.

కృష్ణా బ్యాక్‌వాటర్ ఉండటంతో సోమశిల మాల్దీవుల్లో ఉన్నట్లుగా ద్వీపం అనుభూతిని పంచుతుంది. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. టూరిజం శాఖ ద్వారా బోటింగ్ సదుపాయం కూడా ఉంది. పర్యాటకులు బస చేయటానికి కాటేజీలు కూడా నిర్మించారు. కృష్ణా నదీ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటింగ్‌తో పాటుగా ప్రత్యేకంగా అక్కడ దొరికే చేప వంటకాలను రుచి చూడవచ్చు. ఈ ప్రాంతం నుంచి శ్రీశైలానికి బోటింగ్ ద్వారా చేరుకోవచ్చు. సోమశిలలో దాదాపు 15 దేవాలయాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సోమశిల జలాశయంలో ఉండే సంగమేశ్వర ఆలయం.

అది నది గర్భంలో ఉండటంతో వర్షాకాలంలో నీటిమట్టం పెరిగి ఆలయం మొత్తం మునిగిపోతుంది. దీంతో ఆ సంగమేశ్వర ఆలయం ఏడాదిలో సగం కాలానికి పైగా నీటిలోనే ఉంటుంది. వేసవి సమీపించే సమయంలో భక్తులకు దర్శనమిస్తుంది. సోమశిలకు చేరుకోవడానికి నేషనల్ హైవే 65పై నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సోమశిల గ్రామం ఉంటుంది. అక్కడకు చేరుకోవటానికి టూరిజం డిపార్ట్ మెంట్ నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఉంటాయి. మరి మీరు కూడా వీకెండ్ లో టూర్ ప్లాన్ చేసుకుంటే తెలంగాణ మినీ మాల్దీవులను సందర్శించి సరదాగా గడిపేయండి.
చెన్నైలో భారీ వర్షాలు .. స్తంభించిన జనజీవనం

Jio నుంచి కొత్త టెక్నాలజీ.. కంప్యూటర్లుగా మారనున్న టీవీలు

ఫేమస్ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో తన సర్వీస్ లని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే పనిలో పడింది. అందుకోసం చాలా స్పీడ్ గా ముందుకు దూసుకుపోతుంది. టెక్నాలజీని తన కస్టమర్లకు వేగంగా దగ్గర చేసేలే ముందడుగులు వేస్తుంది.తాజాగా మరో కొత్త సెన్సేషన్ క్రియేట్ చెయ్యటానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం కంప్యూటర్ అనేది ప్రతీ రంగంలో కూడా నిత్యావసర భాగమైపోయింది. ఎందుకంటే ఎక్కువ స్పీడ్ తో పని చెయ్యడానికి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చెయ్యడానికి, ముఖ్యంగా ఆన్​లైన్​ లో ఫాస్ట్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్నెట్​ వాడుకునేందుకు వీలుగా కంప్యూటర్ ఉంటుంది. అందుకే దీనిని ఆఫీస్​లతో పాటు ఇళ్ళల్లో కూడా ఎక్కువగా వాడుతుంటారు. అందువల్ల ప్రతి ఇంట్లో కూడా టీవీల లాగే కంప్యూటర్ కూడా ఉండటం సర్వ సాధారణం అయిపోయింది.అయితే చాలా మంది కూడా టీవీ, కంప్యూటర్ రెండూ డివైస్​లను కొనడానికి ఎక్కువగా ఇష్టపడరు. కొంత మంది దగ్గర కంప్యూటర్ కొనే బడ్జెట్ ఉండదు. అందుకే ఇప్పుడు వారికి ప్రత్యేకంగా కంప్యూటర్ కొనుగోలు చేసే అవసరం లేకుండా కొత్త టెక్నాలజీని లాంచ్ చేసింది రిలయన్స్ జియో. ఇంతకీ ఆ టెక్నాలజీ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జియో ఇప్పుడు కేవలం ఒకే ఒక్క యాప్‌ సాయంతో స్మార్ట్‌ టీవిని కంప్యూటర్‌లాగా మార్చుకునే ఫెసిలిటీని ఇస్తుంది. ముఖ్యంగా ఇది మధ్య తరగతి వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. దీని వలన వాళ్ళకి సపరేట్ గా కంప్యూటర్ కొనే పని ఉండదు. ఎంచక్కా తమ టీవినే కంప్యూటర్ గా వాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. జియో ఈ అప్డేటెడ్ టెక్నాలజీని ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ – 2024 ఈవెంట్‌లో కూడా పెర్ఫార్మ్ చేసింది. ఈ టెక్నాలజి పేరు జియో క్లౌడ్‌ పీసీ. ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో మీ స్మార్ట్‌ టీవీని ఏకంగా కంప్యూటర్‌గా మార్చుకోవచ్చని జియో తెలిపింది.స్మార్ట్‌ టీవీతో పాటు ఇంటర్నెట్ ఫెసిలిటీ, కీబోర్డ్, మౌస్‌, ఉంటే చాలు.. జియో క్లౌడ్‌ పీసీ యాప్​ సహాయంతో టీవిని కంప్యూటర్‌ లాగా చేంజ్ చేసుకోవచ్చు. అందుకు ఫస్ట్ మీరు జియో క్లౌడ్ పీసీ యాప్​లో లాగిన్‌ అవ్వాలి.

కంప్యూటర్‌ లాగానే స్మార్ట్ టీవీలో ఈమెయిల్స్‌, మెసేజింగ్‌, సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ వంటి పనులు చేసుకోవచ్చు. ఈ డేటా అంతా కూడా క్లౌడ్‌లోనే స్టోర్‌ అవుతుంది. కంప్యూటర్ కొనే స్థోమత లేని వారికి ఈ టెక్నాలజీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.అయితే, ఈ జియో క్లౌడ్​ పీసీ యాప్‌ను ఎప్పుడు రిలీజ్ చేయనుందో? ఎంత ధరకు తీసుకురానుందో? ప్రస్తుతానికి పూర్తి వివరాలు తెలపలేదు జియో. కానీ అందుబాటు ధరలోనే తీసుకురానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే జియో వీటి వివరాలను తెలపనుంది. ఇదీ సంగతి. దీంతో ఈ టెక్నాలజీ సాయంతో మీ టీవిని కంప్యూటర్ గా మార్చుకోవచ్చు.

పెట్టుబడి తక్కువ.. మోసం ఎక్కువ.. బయటపడ్డ 500 కోట్ల HIBOX స్కామ్

దేశంలో ఆన్‌లైన్‌ స్కామ్‌లు ఘోరాతి ఘోరంగా పెరిగిపోతున్నాయి. చాపాకింద నీరులా దేశం నలుమూలాల ఈ స్కామ్స్ వ్యాపిస్తున్నాయి. ఆ రకంగా టెక్నాలజీ పెరిగిపోతుంది. ఈ టెక్నాలజీ మంచి పనులకేమో కానీ చెడ్డ పనులకు అస్త్రంగా మారింది. మోసగాళ్లు చాలా సునాయసంగా మోసం చేస్తున్నారు. సామాన్యులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. చాలా మంది సులభంగా డబ్బులు సంపాదించాలని చాలా స్కాముల్లో చిక్కుకుంటున్నారు. అలాంటి వారి కోసం కొన్ని యాప్స్ పుట్టుకు వస్తున్నాయి. వాటిలో పడి ఘోరంగా మోసపోతున్నారు. తక్కువ ఇన్వెస్ట్ చెయ్యండి, ఎక్కువ ప్రాఫిట్స్ పొందండి. అని కొన్ని యాప్స్ డబ్బుల ఆశలు చూపిస్తున్నాయి. చివరకు సామాన్యులను నట్టేట ముంచేస్తున్నాయి. రీసెంట్ గా హైబాక్స్‌ (HIBOX) మొబైల్ యాప్‌ అనే స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అసలు ఈ స్కామ్ ఏంటి? ఈ హై బాక్స్ యాప్ ఏంటి? దీని వెనకాల ఉన్నది ఎవరు? ప్రజలు ఈ స్కామ్ లో పడి ఎలా మోసపోతున్నారు? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ హైబాక్స్ యాప్ ని వాడుకొని స్కామర్లు ప్రజల నుంచి భారీగా డబ్బులు కాజేసి మాయమైపోయారు. ఈ భారీ స్కామ్‌ వెనకాల పలు బాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా ఉన్నారు. ఈ స్కాంలో పాపులర్‌ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్, కమెడియన్ భారతీ సింగ్ ఉన్నారు. అలాగే సౌరవ్ జోషి, అభిషేక్ మల్హన్, పురవ్ ఝా, హార్ష్‌ లింబాచియా, లక్షయ్ చౌదరి, ఆదర్శ్ సింగ్, అమిత్, దిల్‌రాజ్ సింగ్ రావత్ వంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీళ్ళకి ఢిల్లీ పోలీసులు సమన్లు ​​కూడా జారీ చేశారు. ప్రస్తుతం వారిపై విచారణ జరుగుతోంది. ఈ యాప్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినవారికి ఎక్కువ రిటర్న్స్‌ ఇస్తామని హామీ ఇచ్చారు యాప్‌ నిర్వాహకులు. దాంతో వీరు ప్రజల నుంచి ఏకంగా 500 కోట్ల రూపాయలను వసూలు చేసి దారుణంగా మోసం చేశారు. హైబాక్స్‌ స్కామ్ ని పక్కాగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారని డిప్యూటీ కమిషనర్ హేమంత్ తివారీ తెలిపారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు హైబాక్స్‌ను బాగా ప్రమోట్ చేశారు. ఇందులో ఇన్వెస్ట్ చేయమని తమ ఫాలోవర్స్‌ కి నమ్మకం కలిగించారు. దాంతో నమ్మి మోసపోయిన వారు దీనిపై కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు 500 కంటే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి. దాంతో ఈ స్కామ్‌పై పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. హైబాక్స్ ద్వారా మోసపోయామని ఆగస్టు 16న 29 మంది ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ & స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేశారు. బాధితులకు రోజూ 1% నుంచి 5%, నెలకు 30% నుంచి 90% వరకు రిటర్న్స్‌ ఇస్తామని యాప్‌ మ్యానేజర్స్ హామీ ఇచ్చారట.

అసలు ఈ స్కామ్ ని వెనుక నుండి నడిపిస్తుంది చెన్నైకి చెందిన 30 ఏళ్ల శివరామ్ అనే వ్యక్తి. అతను 2024 ఫిబ్రవరిలో HIBOX యాప్‌ను స్టార్ట్ చేశాడు. ఈ యాప్ మొదట్లో జనాలను బాగానే నమ్మించింది. ఇన్వెస్టర్లకు ఎక్కువ రిటర్న్స్ అందించింది. దీంతో ఎక్కువ మంది ఇందులో డబ్బుని ఇన్వెస్ట్ చేశారు. కానీ జులై నాటికి, యాప్ నుంచి పేమెంట్స్ చేయడం ఆపేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్‌, చట్టపరమైన సవాళ్లు, జీఎస్టీ కాంప్లికేషన్స్‌ వల్ల పేమెంట్లు చేయలేకపోతున్నట్లు నిర్వాహకులు సాకులు చెప్పారట. ఆ తర్వాత హైబాక్స్‌ వెనుక ఉన్న స్కామార్లు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఆఫీస్ ని క్లోస్ చేసి పారిపోయారని DCP తివారీ తెలిపారు.ఈ స్కామ్‌లో పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌లు కూడా చిక్కుకున్నాయి. EASEBUZZ, PhonePe లని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. హైబాక్స్‌ యాప్‌లో ట్రాన్సాక్ష‌న్‌స్ జరపడానికి వీటిని వాడారట. ట్రాన్సాక్షన్లకు అనుమతించే ముందు ఈ కంపెనీలు యాప్‌ను సరిగ్గా వెరిఫై చేయలేదని పోలీసులు తెలుపుతున్నారు. పోలీసులు ప్రస్తుతం 127 కంప్లైంట్ లను తీసుకున్నారు. ఈ పేమెంట్‌ యాప్ లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూల్స్ ని అతిక్రమించాయా అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదీ సంగతి. ఈజీగా డబ్బులు కావాలని ఇలాంటి యాప్ లని వాడకండి.

ప్రభుత్వ బ్యాంక్ లో ఉద్యోగాలు.. ఎటువంటి రాత పరీక్ష అవసరం లేదు

గవర్నమెంట్ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రిక్రూట్మెంట్ తాజాగా విడుదల అయ్యింది. మరి ఇందులో ఏ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి? మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఈ పోస్టులకు విద్యార్హత ఏంటి? వీటికి ఎలా అప్లై చేసుకోవాలి? ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎంత? ఈ పోస్టులకు జీతం ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో గ్రామీణ్ డాక్ సేవక్(GDS) పోస్టుల నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఇందులో 344 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధుల విద్యార్హత విషయానికి వస్తే.. భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి. అలాగే అభ్యర్ధికి 2 సంవత్సరాలు GDS గా పని చేసిన అనుభవం ఉండాలి. ఇక వయసు విషయానికి వస్తే.. ఈ GDS పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్ధి వయస్సు 20 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధి వయసు సెప్టెంబర్ 1 2024 నాటికి 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీకి వయస్సులో సడలింపు ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌లో మీకు వచ్చిన మార్కుల శాతం ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మాక్సిమం ఆన్‌లైన్ టెస్ట్ ఉండదు. కానీ అవసరం అయితే ఆన్లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000/- జీతం చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) అధికారిక వెబ్‌సైట్ https://ippbonline.com/లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ 31 అక్టోబర్ 2024 వరకు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఫారమ్‌లను చివరి రిజిస్ట్రేషన్ తేదీ కంటే ముందే సబ్మిట్ చేయాలి.

ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) వెబ్‌సైట్‌ https://ippbonline.com/ను ఓపెన్ చెయ్యండి. హోమ్ పేజీలో Careers ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందులో మీకు Engagement of Gramin Dak Sevak from Department of Posts to IPPB as Executive అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో అప్లికేషన్ ప్రాసెస్, గైడ్ లైన్స్ పూర్తిగా చదవండి. తరువాత మీకు అందులో apply now ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ పేరు, పూర్తి వివరాలు ఇంకా ఇమెయిల్‌ను ఎంటర్ చేయండి. అప్పుడు మీకు సిస్టమ్ ద్వారా ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వస్తాయి. వాటి ద్వారా లాగిన్ అయ్యి ముందుగా మీరు చదువుకున్న గైడ్ లైన్స్ ప్రకారం ఫోటో & సిగ్నేచర్ ని అప్‌లోడ్ చేయండి. తరువాత 750/- రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించండి. దాంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. తరువాత ఈ అప్లికేషన్‌ను కచ్చితంగా డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి. ఇదీ ప్రాసెస్. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఇప్పుడే అప్లై చేసుకోండి.

కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

A అంటే అమరావతి.. P అంటే పోలవరం అంటున్న ఏపీ ప్రభుత్వం.. ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమరావతి పనులపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.

కలల రాజధానికి ఇంకెంత దూరం అని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. డిసెంబర్ నుంచి అన్ని రకాల పనులు మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ కనిపిస్తోంది. నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుండడంతో వేగంగా నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే అమరావతిలో నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలవనున్నారు. అంతేకాదు… రాజధానిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అమరావతికి కొత్త కళ వస్తోంది. దాదాపుగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కావడంతో.. అమరావతి రాజధాని యథాస్థానానికి చేరుకోనుంది. డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు డిసైడ్‌ అయ్యారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి సర్దుబాటు చేయించింది. ఈ నిధులు సైతం త్వరలోనే విడుదల కానున్నాయి. దీంతో అమరావతిలో నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నాయి. డిసెంబర్‌ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం జనవరి నెలాఖరులోపు టెండర్లు పిలుస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సింగపూర్‌ను సంప్రదించాలా..?, వద్దా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. 360 కిలో మీటర్ల మేర రోడ్లకు టెండర్లు పూర్తి చేస్తామన్న ఆయన.. అమరావతిలో 18 టవర్లలో 432 అపార్ట్ మెంట్ల పూర్తికి రూ.524 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అమరావతిపై వర్షాలు, వరదల ప్రభావం ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న వేళ.. వాటన్నింటిని కొట్టిపడేశారు మంత్రి నారాయణ. ఎంత ఫ్లడ్ వచ్చినా అమరావతిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. వరదలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమన్నారు. మొత్తంగా… ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఏపీ సర్కార్‌.. పనులను మరింత స్పీడప్‌ చేస్తోంది.

దిల్‌ ఖుష్‌ చేస్తున్న ప్రకృతి అందాలు.. వర్షాలతో జలపాతాలకు కొత్త శోభ

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. వాయుగుండం ఎఫెక్ట్‌తో కురుస్తున్న వర్షాలతో జలపాతాలకు కొత్త శోభ వచ్చింది. ప్రకృతి అందాల కనువిందు చేస్తున్నాయి. దీంతో పర్యాటకులు పెద్ద ఎత్తున జలపాతాలను వీక్షించేందుకు క్యూ కుడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి..

వాయుగుండం ఎఫెక్ట్‌తో జోరుగా కురుస్తున్న వర్షాలకు… జలపాతాలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. జలసవ్వడితో ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇటు తిరుమలగిరులు కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంటే….అటు నెల్లూరు జిల్లాలోని ప్రకృతి అందాలు రారమ్మంటున్నాయి. దంచికొడుతున్న వర్షాలతో… ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవటంతో తిరుమల పరిసరాలు సరికొత్తగా కనిపించాయి. జడివానలో తిరుమల గిరుల అందాలు కనువిందు చేశాయి. వర్షంలో శ్రీవారి ఆలయ పరిసరాలను తనివితీరా ఆస్వాదించారు శ్రీవారి భక్తులు.

ఓ పక్క వెంకన్న నామస్మరణ.. మరోపక్క మనసును ఆహ్లాదపరిచే జడివానలో శ్రీవారి భక్తులు పరవశించిపోయారు. తిరుమల అందాలను వీడియోలు, ఫోటోల్లో బంధించారు. భక్తి భావం.. ప్రకృతి అందాలన్ని ఒకేచోట రాశి పోయినట్లుగా కనువిందు చేస్తున్న తిరుమల గిరులు కళ్లు తిప్పుకోనివ్వటంలేదంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు భక్తులు. ఇక గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లాలోని పెంచలకోన అడవులు… పారే సెలయేళ్లు, దుమికే జలపాతాలతో అందాలను వలకపోస్తున్నాయి. సెలయేర్లు తెల్లటి నురుగులు కక్కుతూ పరవళ్లు తొక్కుతూ ఆహ్లాదకరణ వాతావరణాన్ని పంచుతున్నాయి. ఈ అందాలను తిలకించేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.

భారీ వర్షాలకు ఇటు వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి కొండలు… అద్భుతంగా కనిపిస్తున్నాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేస్తున్నాయి. మొత్తంగా వాయుగుండం ప్రభావంతో దంచికొడుతున్న వర్షాలు… ప్రకృతిని అందాలను చూపిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికుల దిల్‌ ఖుష్‌ చేస్తున్నాయి.

థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి సూపర్ స్టార్ సినిమా.. వెట్టయన్ వచ్చేది అప్పుడేనా.?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వెట్టయన్. జైలర్ తర్వాత రజినీకాంత్ నటించిన కావడంతో ఈ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ అక్టోబర్ 10న విడుదలైంది. వెట్టయన్ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ కు జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా నిర్మించింది. ప్రస్తుతం చెన్నైలో కురుస్తున్న వర్షాల కారణంగా థియేటర్లలో విడుదలైన ఈ కలెక్షన్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ఓటీటీలోకి ఈ మూవీ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వెట్టయన్ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది.

కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం వెట్టయన్ త్వరలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ లో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, రితికా సింగ్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిషోర్, తుషార విజయన్, రక్షణ ఇలా చాలా మంది నటించారు. తమిళం, తెలుగు, హిందీ ల్లో నటించిన ప్రముఖ నటీనటులు ఈ లో కనిపించారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ లో రజనీ విభిన్న పాత్రలో కనిపించి మెప్పించారు. ప్రేమ, హత్య కేసులు, భావోద్వేగాలతో కూడిన యాక్షన్ వెట్టయన్. ఈ లో రజనీ భార్యగా నటి మంజువారియర్ నటించారు.ఈ దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా 86 కోట్లకు పైగా వసూలు చేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 240 కోట్లకు పైగా బాక్సాఫీస్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. రజనీకాంత్ వెట్టయన్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జైలర్‌లాగే ఈ చిత్రం కూడా మంచి వసూళ్లు సాధించింది కాబట్టి. రూ. 90 కోట్లకు పైగా ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిందని అంటున్నారు. వెట్టయన్ చిత్రం అమెజాన్ OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్ 7 న ఈ ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

రెడ్ వైన్ తాగడం మంచిదేనా.. శరీరంలో జరిగే మార్పులు ఇవే

రెడ్ వైన్‌ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. రెడ్ వైన్ మంచిదని చాలా మంది తాగుతూ ఉంటారు. రెన్ వైన్‌ని కేవలం మగవారే కాకుండా.. ఆడవారు కూడా తాగవచ్చు.

చర్మాన్ని అందంగా మార్చడంలో ఈ రెడ్ వైన్ చక్కగా పని చేస్తుందని.. చాలా మంది తాగుతూ ఉంటారు. అయితే రెడ్ వైన్ వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఎక్కువ మందికి ఈ రెడ్ వైన్ గురించి లాభాలు తెలియక పోవచ్చు. అప్పుడప్పుడూ రెడ్ వైన్ తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మనకు చక్కగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మరి ఈ రెడ్ వైన్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది:

రెడ్ వైన్‌ తీసుకోవడం వల్ల టైప్ – 2 షుగర్ వ్యాధి అనేది కంట్రోల్ అవుతుంది. ఈ టైప్ – 2 డయాబెటీస్‌తో ఇబ్బంది పడేవారు వైద్యుల సలహా మేరకు రెడ్ వైన్ తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. రెడ్ వైన్‌ని మోడరేట్‌గా తీసుకోవడం వల్ల చాలా మంచిది.

లివర్ ఆరోగ్యం:

రెడ్ వైన్‌లో ఆల్క హాల్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరికొన్ని రెడ్ వైన్స్‌లో ఆల్కహాల్ లేకుండా తయారు చేస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా దూరం అవుతాయి. క్యాన్సర్‌కి కూడా దూరంగా ఉండొచ్చు. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో రెడ్ వైన్ సహాయ పడుతుంది.

ఒత్తిడి దూరం:

రెడ్ వైన్ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేది దూరమవుతాయి. మనసు చాలా రిలాక్స్ అవుతుంది. నిద్ర కూడా చక్కగా పడుతుంది. కాబట్టి ఒత్తిడితో ఉండే వారు చిన్న టీ గ్లాస్ సైజు పరిమాణంలో తీసుకుంటే చాలా మంచిది. తల నొప్పి కూడా తగ్గుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. అదే విధంగా చర్మం కూడా అందంగా మారుతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్:

రెడ్ వైన్‌ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకు తగిన మోతాదులో రెడ్ వైన్ తీసుకోవచ్చు. రక్తంలో పేరుకు పోయిన కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

పెద్ద టీవీలపై భారీ ఆఫర్లు.. మళ్లీ మళ్లీ రావు.. త్వరపడండి..

శామ్సంగ్ డీ సిరీస్ క్రిస్టల్ 4కే వివిడ్ ప్రో అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఈ 55 అంగుళాల టీవీ అధిక నాణ్యత కలిగిన పిక్చర్ ను అందిస్తుంది.

ఇది భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ టీవీల్లో ఒకటి. దీనిలో మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. హెచ్డీఎంఐ, యూఎస్బీ, వైఫై, బ్లూటూత్ వంటివి ఉంటాయి. 20వాట్ల డాల్బీ ఆడియో కలిగిన స్పీకర్స్ ఉంటాయి. ఈ టీవీపై అమెజాన్ సేల్లో 36శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 43,990గా ఉంది.

ప్యానసోనిక్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఇది ప్రీమియం బ్రాండ్ టీవీ. 4కే హెచ్డీఆర్, డిమ్మింగ్, గ్రెయిన్ నాయిస్ రిడక్షన్, 4కే అప్ స్కేలింగ్, 4కే స్టూడియో కలర్ ఇంజిన్ వంటి వాటితో పిక్చర్ క్వాలిటీని అద్భుతంగా అందిస్తుంది. దీనిలో 20వాట్ల సామర్థ్యంతో సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. ఆడియో బూస్టర్ ప్లస్ డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. దీనిలో మూడు హెచ్డీఎంఐ పోర్టులు, డ్యూయల్ యూఎస్బీ పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. అమెజాన్ సేల్లో దీనిపై 35శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 40,990గా ఉంది.

టీసీఎల్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ.. ఈ మొత్తం జాబితాలో ఇది చాలా ఇంటరెస్టింగ్ టీవీ. దీనిలో 55 అంగుళాల 4కే రిజల్యూషన్ తో 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన డిస్ ప్లే ఉంటుంది. దీనిలో ఒకే సమయంలో అనేక రకాల డివైజ్ లను కనెక్ట్ చేసుకునే వెసులబాటు ఉంటుంది. గేమింగ్ కన్సోల్, హోమ్ థియేటర్, వంటి వాటిని ఒకే సారి కనెక్ట్ చేసి వినియోగించుకోవడానికి అవసరమైన హెచ్డీఎంఐ పోర్టులు ఉంటాయి. దీనిపై అమెజాన్లో 66శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ టీవీ ధర రూ. 40,990గా ఉంది.

వీయూ వైబ్ సిరీస్ క్యూఎల్ఈడీ 4కే టీవీ.. దీనిలో ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ ఉంటుంది. అది 88వాట్ల సామర్థ్యంతో వస్తుంది. డాల్బీ ఆడియో సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. 4కే క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో ఐపీఎస్ ప్యానల్ సహాయంతో శక్తివంతమైన విజువల్స్ ను అందిస్తోంది. దీనిపై అమెజాన్ లో 37శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ టీవీ ధర రూ. 37,901గా ఉంది.

ఎల్‌జీ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ.. ఈ టీవీలో 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన డిస్ ప్లేను అందిస్తుంది. మూడు హెచ్డీఎంఐ స్లాట్స్, రెండు యూఎస్బీ స్లాట్స్, బ్లూటూత్ 5.0, ఎథర్ నెట్(ల్యాన్) స్లాట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. దీనిలో టూ చానల్ స్పీకర్ సెట్ 20వాట్ల సామర్థ్యంతో వస్తుంది. ఏఐ సౌండ్ సిమ్యూలేటెడ్ 5.1 సరౌండ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. దీనిపై అమెజాన్లో 40శాతం డిస్కౌంట్ ఉంది. దీని ధర రూ. 42,990గా ఉంది.

Health

సినిమా