Friday, November 15, 2024

వైరల్ అవుతున్న అనుష్క , ప్రభాస్ లుక్స్.. ఇద్దరు ఒకేలా

అనుష్క శెట్టి , ప్రభాస్ ఈ పెయిర్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ ఆన్ స్క్రీన్ కపుల్ ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒకటైతే చూడాలని ఎంతో మంది కల. ఆ మధ్య వీరిద్దరి పెళ్లి గురించి గాసిప్స్ కూడా బాగానే వినిపించాయి. కానీ అవి ఎటూ తేలట్లేదు అది వేరే విషయం. సరే పోనీ ఆన్ స్క్రీన్ మీద అయినా వీరిద్దరిని కలిపి చూద్దాం అనుకుంటే.. అది కూడా జరగట్లేదు. బాహుబలి తర్వాత మళ్ళీ ఈ జంటను కలిసి చూసిందే లేదు. దీనితో ఈ ఇద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ ఈ పెయిర్ కలయిక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క , ప్రభాస్ ఇద్దరూ సిమిలర్ లుక్ లో ఉన్న ఫోటో ఒకటి కనిపించింది. ఇంకేముంది దొరికిందే ఛాన్స్.. ఆ రెండు ఫొటోస్ ను పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. బాహుబలి తర్వాత ఈ అమ్మడు భాగమతి అంటూ ఓ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మరో డీసెంట్ హిట్. దాదాపు అనుష్క అన్నీ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ అమ్మడు క్రిష్ దర్శకత్వంలో.. ఘాటి అనే సినిమాతో రాబోతుంది. అనుష్క బర్త్ డే సంధర్బంగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో అనుష్క చాలా డిఫరెంట్ గా కనిపించింది. ఇప్పటివరకు అనుష్క ఇలా ఎప్పుడు కనిపించలేదు. సిగార్ పొగ మధ్యలో చాలా ఇంటెన్స్ లుక్ లో అనుష్క ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత అనుష్క మళ్ళీ కనిపించింది కాబట్టి.. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సహజం. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే… ఇప్పుడు ఈ లుక్స్ ను డీకోడ్ చేసి ప్రభాస్ లుక్స్ తో పోల్చుతున్నారు. రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా రాజాసాబ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ కూడా ఓల్డ్ గెటప్ లో.. స్మోకీ లుక్ తో దర్శనం ఇచ్చాడు. దీనితో ఇప్పుడు ఇద్దరూ సిగార్ తాగుతూనే కనిపించారంటూ.. ఇద్దరి ఫొటోస్ పక్క పక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు. రాజావారు రాణి వారు అంటూ.. అసలు మీరిద్దరూ ఎందుకు కలిసి సినిమా తీయకూడదు.. అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ ను , స్వీటీ ని ఒకే స్క్రీన్ మీద చూసి చాలా కాలం అయింది కాబట్టి.. వారి కామెంట్స్ వెనుక వాస్తవం లేకపోలేదు. ఇలా కోఇన్సిడెంట్ గా కలిసినా ఉన్న ప్రభాస్ , అనుష్కల ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఫ్యూచర్ లో సినిమాలు వస్తాయో లేదో తెలియదు కానీ.. ఒకవేళ వస్తే మాత్రం అది మరో కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ అవుతుందని ఎవరైనా చెప్పేస్తారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కు రాజాసాబ్ , అనుష్క కు ఘాటీ ఎలాంటి సక్సెస్ ను అందిస్తాయో చూడాలి

UPI యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై రోజుకు రూ. లక్ష

ఇటీవల దేశ వ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ సర్వీసులు ఎంతగా సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. యూపీఐ సేవల కారణంగా దేశంలో ఆన్‌లైన్ పేమెంట్స్ భారీగా పెరిగిపోయాయి. చేతిలో స్మార్ట్, ఇంటర్నెట్ ఉంటే చాలు జేబులో డబ్బులు అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది. చిన్న చిన్న టీ దుకాణాల నుంచి మొదలు పెడితే.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు కస్టమర్లు. యూపీఐ సేవలను ఉపయోగిస్తున్న NRI ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఎన్ఆర్ఐ లు తమ కుటుంబ సభ్యులకు యూపీఐ ద్వారా రోజూ ఒక లక్ష రూపాయల వరకు పంపించుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. నాన్ రెసిడెంట్ ఎక్స్ టర్నల్ (NRE), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ(NRO) ఖాతాలు ఏన్న ఎన్ఆర్ఐ లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ద్వారా ఇకపై రోజుకు రూ.1 లక్ష రూపాయల వరకు చెల్లించుకోవచ్చు. సదరు యూజర్లు భారత్ లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు, ఇతర చెల్లింపులకు నగదు పంపించుకోవచ్చు.

అంతర్జాతీయ మొబైల్ నెంబర్ ను ఉపయోగించి స్మార్ట్ ఫోన్ ద్వారా ఉచిత లావాదేవీల కోసం యూపీఐ ఉపయోగించుకునే సదుపాయం కల్పించారు. ప్రస్తుతం ఈ సదుపాయం యూఎస్, యూకే, సింగపూర్, యూఏఈ, కెనెడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మలేషియా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారలైకు ఈ అద్భుతమైన అవకాశం కల్పించబడింది. ఈ కొత్త సౌకర్యంతో భారత్ ఉన్న తమ కుటుంబ సభ్యులు ఎక్కువ డబ్బు పంపించుకునే సదుపాయం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అంటున్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండస్ ఇండ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కెమెరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఈక్విటా స్మాల్ పఐనాన్స్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంకులు ఈ అవకాశాన్ని కల్పించాయి.

సాధారణంగా ఎక్కడైనా అంతర్జాతీయ సెల్ ఫోన్ నెంబర్లకు ఫోన్ పే, పేటీఎం, బీమ్, గూగుల్ పే, బీమ్ ఏయూ, ఫెడ్ మొబైల్, బీమ్ ఇండస్ పే, ఎస్‌బీఐ మిర్రర్ ప్లస్, ఐమొబైల్ వంటి పేమెంట్స్ యాప్స్ సపోర్ట్ చేస్తుంటాయి. ఇక ఎన్ఆర్ఐ లు తమ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ వో ఖాతాల మధ్య అదే విధంగా దేశంలోని ఖాతాలకు యూపీఐ లావాదేవీలు చేసుకునే సదావకాశం కల్పించబడింది. ఎన్ఆర్ఓ ఖాతా నుంచి ఎన్ఆర్ఈ ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌వర్ చేసుకోవచ్చు. కొత్తగా తీసుకు వచ్చిన ఈ సదుపాయం వల్ల ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంతో మేలు కలుగుతుందని కస్టమర్లు అంటున్నారు.

మీకు సొంతిల్లు, భూమి, ఇంకా ఇతర ఆస్తులు ఉన్నాయా? అయితే ఈ విషయం తెలుసుకోకుంటే నష్టపోతారు

చాలా మందికి కూడా ఆస్తులు ఉంటాయి కానీ, వాటిని కాపాడుకోవడం తెలీదు. ముఖ్యంగా చదువు లేని వాళ్ళకు ఆస్తులకు సంబంధించి చాలా విషయాలు తెలీవు. అవి తెలీక తమ ఆస్తులను పోగొట్టుకుంటారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే విషయం నగారాల్లో నివసించే ప్రజలకు తెలుసు కానీ పల్లె టూర్లలో నివసించే చాలా మందికి కూడా తెలికపోవచ్చు. ఈ విషయం తెలీకపోతే కచ్చితంగా నష్టపోవడం పక్కా. ఇంతకీ ఆ విషయం ఏంటి? దాని గురించి తెలుసుకోకపోతే కలిగే నష్టాలు ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు డీటైల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మన ఆస్తులను కాపాడుకోవాలంటే కచ్చితంగా సేఫ్ డాక్యుమెంటేషన్‌ అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలాంటి ప్రూఫ్ లేదు. అందువల్ల చాలా మంది ఆస్తులు కోల్పోయే వారు. అందుకే మన ఆస్తులను నిర్ధారించడానికి ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈమధ్య కాలంలో ఆస్తి మోసం మరియు నకిలీ పత్రాలతో కూడిన బ్లాక్‌మెయిల్ సంఘటనలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అందుకే ఆస్తి యజమానులను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.రెవెన్యూ శాఖ, తాలూకా కార్యాలయాల ద్వారా ఆస్తుల రికార్డులను డిజిటైజేషన్ చేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డిజిటైజేషన్ అనేది ప్రాపర్టీ డాక్యుమెంట్ యాక్సెస్‌ను ఈజీ చేస్తుంది. దీని వల్ల మీ ఆస్తికి మీరే యజమాని అని చాలా ఈజీగా ప్రూవ్ చేయవచ్చు. పైగా దీని వల్ల ఎవరు కూడా మీ సంతకాలను ఫోర్జరీ చేయలేరు.

డిజిటైజేషన్ అంటే ఆస్తి యజమానులు తమ ఆస్తి డాక్యుమెంట్లను గవర్నమెంట్ పోర్టల్‌లకు అప్‌లోడ్ చేయాలి. ఈ విధంగా డిజిటల్ రికార్డులను కలిగి ఉండటం వలన ఆస్తి యజమానులు ఆస్తి సంబంధిత డాక్యుమెంటేషన్ కోసం ఎటువంటి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మోసాలు జరగకుండా కచ్చితంగా ఆస్తి పత్రాలకు ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి. ఈ లింకేజీ ఆస్తికి నిజమైన యాజమనులను వెరిఫై చేయడంలో సహ్యపడుతుంది. ఇది అనధికార అమ్మకాలను కూడా తగ్గిస్తుంది. డిజిటైజేషన్ వల్ల మోసగాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కష్టం అవుతుంది. ఈ డిజిటైజేషన్ ప్రాసెస్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆస్తి యజమానులు ఆస్తి పత్రాలను సేకరించి, ఆధార్ లింకేజీని వెరిఫై చేసుకొని రెఢీ గా ఉండండి. మీ ఆస్తిని కాపాడుకోండి.

ఇండస్ట్రీలో అఖీరా ఎంట్రీ పై హాట్ టాపిక్

ఇండస్ట్రీలో తరం మారుతుంది. వారసుల ఎంట్రీ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు కొత్త యుద్దానికి రెడీ అవుతున్నారు. ప్రేక్షకులు కూడా వారికి ఓపెన్ హార్ట్ తో గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. వీరిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ ఎంట్రీ అందరికి హాట్ టాపిక్ గా మారింది. అంతకముందు వరకు అకీరా నందన్ గురించి బజ్ ఏమి లేదు. కానీ ఈ మధ్యన మాత్రం తెగ వైరల్ అవుతున్నాడు. అఖీరా ఓజిలో క్యామియో చేస్తున్నాడంటూ.. రీసెంట్ గా ఓ న్యూస్ కూడా బాగా సౌండ్ చేసింది. కానీ దీనిపై మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్సుమెంట్ రాలేదు. క్యామియో సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ ఎంట్రీ గురించే డిస్కషన్ మొదలైంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు పవన్ వారసుడి వంతు వచ్చింది.

త్వరలో అఖీరా ఎంట్రీ అయితే కన్ఫర్మ్. అది ఓజి నా లేదా మరో సినిమానా అని అయితే క్లారిటీ లేదు. కానీ అందుకు బీజం పడిందన్న వార్తలు మాత్రం క్లియర్ గా వినిపిస్తున్నాయి. గతంలో రేణు దేశాయ్ కూడా చాలా సందర్భాల్లో అఖీరా ఎంట్రీ గురించి చెప్పుకొచ్చారు. ఇక అఖీరాకు కూడా ఒక హీరోలో ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అఖీరా స్కిల్స్ , లుక్స్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో అఖీరా న్యూయార్క్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు అతను సత్యానంద్ యాక్టింగ్ స్కూల్‌లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అక్కడే యాక్టింగ్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు తండ్రి బాటలోనే కొడుకు కూడా నడుస్తున్నాడు . అఖీరా ఎంట్రీ గురించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ.. ఒక్కసారి ఎంట్రీ ఇస్తే మాత్రం పవన్ అభిమానులు అఖీరాకు బ్రహ్మరథం పడతారన్న మాట వాస్తవం.

అటు అభిమానులతో పాటు మూవీ లవర్స్ అంతా కూడా అఖీరా ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఎంట్రీ ఇస్తే ఎలాంటి కథలను ఎంచుకుంటాడు. ఏ దర్శకుడి ద్వారా లాంచ్ అవుతాడు.. తండ్రి స్టార్ డం ను క్యారీ చేయగలుగుతాడా లేదా.. అనే ప్రశ్నలతో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ కుర్రాడు హీరోగా రాణించే రోజు ఎప్పుడు వస్తుందో.. ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు , ఓజి సినిమాల షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా లైన్ లో ఉంది. కానీ దీని గురించి మాత్రం ఎప్పుడు ఏంటి అనే అంతగా టాక్ వినిపించడం లేదు.

వాహనదారులకు షాకింగ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న RTO

ఇప్పుడు చెప్పే వార్త దేశవ్యాప్తంగా కూడా వాహన యజమానులకు చేదు వార్తనే చెప్పాలి. తాజాగా RTO కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వాహనదారులకు కష్టాలు తప్పవు. ఇక RTO తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటి? కొత్త రూల్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత కాలంలో రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. దీని వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులకు కూడా కష్టాలు తప్పట్లేదు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా వాహనదారులు చాలా మంది కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. బాధ్యత లేకుండా నడుచుకుంటున్నారు.

ఇక రవాణాశాఖ దీన్ని గుర్తించి కఠిన రూల్స్ అమలు చేస్తోంది. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఎంత నిఘా ఉంచినా కానీ, రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాలు నడుపుతున్న వారు ఎక్కువ అయిపోయారు. ఇలాంటివి ఎక్కువ అవడంతో ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు స్ట్రిక్ట్ గా చెకింగ్ లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ రూల్ ని ఇంకా కఠినతరం చేశారు. కొందరు వాహనదారులు కావాలనే ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించి రోడ్డు పక్కనే స్నానాలు చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఇలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి కచ్చితంగా రూ.10,000 జరిమానా విధించనున్నారు.అలాగే జరిమానాలతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తారు.అలాగే పొలుష్యన్ అండర్ కంట్రోల్(PUC) సర్టిఫికేట్ లేని వాహనాలకు భారీ షాక్ తగలనుంది. ఇలాంటి వాహనదారులకు పెట్రోల్ పంపుల వద్ద జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఇంకా అదే విధంగా ఆ సర్టిఫికెట్ సకాలంలో రెన్యువల్ చేసుకోకపోతే కూడా కచ్చితంగా రూ.10,000 ఫైన్ కట్టాల్సిందే.

ఇంకా అదే విధంగా రవాణా శాఖ వాహనాలకు HIGH SECURITY REGISTRATION PLATES (HSRP) ని తప్పనిసరి చేసింది. జనవరి 1 తర్వాత దీని అమలును కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తారు, దీనికి డిసెంబర్ దాకా అనుమతి ఉంటుంది. దీన్ని పెట్రోల్ బంకులో కూడా చెక్ చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా ఈ నంబర్ ప్లేట్ పొందాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్రైవర్ల సేఫ్టీ కోసం ఈ రూల్ అనేది అమలు చేయబడింది. దీన్ని ఉల్లంఘిస్తే బైకులకు, ట్రాక్టర్లకు రూ.2 వేలు, పెద్ద వాహనాలకు రూ.5 వేలు జరిమానా విధిస్తారు. ఈ రూల్స్ దేశంలోని అన్నీ రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయి. కాబట్టి కచ్చితంగా ఈ రూల్స్ గుర్తు పెట్టుకోండి.

విద్యార్థులకు వరం పీఎం విద్యాలక్ష్మి స్కీమ్.. ఏకంగా రూ. 7.5 లక్షలు పొందే ఛాన్స్.

సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేక చదువుకు దూరమవుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. డబ్బు లేని కారణంగా చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. మరికొంత మంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా ఆర్థిక కారణాలతో ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. చదువును ఆపేసి ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి. ఆర్థిక సాయం అందించే పథకాలను తీసుకొస్తూ అండగా నిలుస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్స్, విద్యా రుణాలను అందిస్తూ ఉన్నత చదువుల వైపు ప్రోత్సహిస్తున్నాయి.

విదేశాల్లో చదువుకునేందుకు కూడా తక్కువ వడ్డీకే లక్షల్లో లోన్స్ అందిస్తూ సాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. విద్యార్థులకు లోన్స్ అందించేందుకు పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన వారు ‘విద్యాలక్ష్మి పథకం’ ద్వారా లోన్స్ పొందవచ్చు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 3,600 కోట్లను కేటాయించింది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులు రూ. 7.5 లక్షల లోన్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రూ. 7.5 లక్షల లోన్ పొందొచ్చు. ఈ రుణంలో 75 శాతం వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది.

దీంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది. పీఎం విద్యాలక్ష్మీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో లోన్స్ లభించనున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే మెరిట్ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండనున్నది. లక్షలాది మంది విద్యార్థులకు లాభం చేకూరనున్నది. అయితే ఈ పథకం ద్వారా లోన్ పొందాలంటే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలని తెలిపింది. రూ.10లక్షల వరకు రుణాలపై రూ.3శాతం వడ్డీరాయతీ కల్పించనున్నారు.

ఏదైనా ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం విద్యా లక్ష్మీ పథకాన్ని యూజ్ చేసుకుని మీ ఉన్నత విద్యను పూర్తి చేసుకోవచ్చు. మీ కలల జీవితాన్ని సాకారం చేసుకోవచ్చు.

సంచలన నిర్ణయం.. ఇకపై 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌!

వినియోగదారులు వయోపరిమితిలోపు ఉండేలా చూసుకోవడం సోషల్ మీడియా, టెక్ కంపెనీల బాధ్యత అని అన్నారు. ఈ బాధ్యత పిల్లల తల్లిదండ్రులపై ఉండదన్నారు. ఎందుకంటే పిల్లల ఆన్‌లైన్ భద్రత గురించి వారు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని అన్నారు.

పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వ్యసనం పెరగడం సర్వసాధారణమైపోయింది. మొబైల్ ఫోన్ల వల్ల పిల్లలు చదువుతో పాటు శారీరక శ్రమకు దూరమవుతున్నారు. దీంతో వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. అటువంటి పరిస్థితిలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గురువారం వెల్లడించారు. పిల్లల భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవడంలో టెక్ కంపెనీలు విఫలమయ్యాయని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వం ఈ చర్య తీసుకోనుంది. ఈ నిర్ణయం తల్లిదండ్రుల కోసమేనని ఆయన తెలిపారు. నిజానికి సోషల్ మీడియా పిల్లలకు హాని చేస్తోంది. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది.

ఆంథోనీ అల్బనీస్ ఈ సంవత్సరం ప్రారంభంలో సోషల్ మీడియా వినియోగం గురించి చాలా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా వినియోగంపై వయోపరిమితి విధించడంపై ఆయన మాట్లాడటం ఇదేం తొలిసారి కాదు. ఈ నిర్ణయం ప్రభావం మెటా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో పాటు టిక్‌టాక్, ఎక్స్ లపై కనిపిస్తుందని ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి మిచెల్ రోలాండ్ చెప్పారు.

వినియోగదారులు వయోపరిమితిలోపు ఉండేలా చూసుకోవడం సోషల్ మీడియా, టెక్ కంపెనీల బాధ్యత అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు. ఈ బాధ్యత పిల్లల తల్లిదండ్రులపై ఉండదన్నారు. ఎందుకంటే పిల్లల ఆన్‌లైన్ భద్రత గురించి వారు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని అన్నారు.

ఈ నిర్ణయానికి సానుకూల స్పందన

సోషల్ మీడియా వినియోగానికి వయోపరిమితిని నిర్ణయించాలన్న నిర్ణయానికి సానుకూల మద్దతు లభించింది. కొత్త చట్టాలను ఈ వారంలోగా వెల్లడిస్తామని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. దీంతో పాటు నవంబర్‌లో ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆస్ట్రేలియా నుండి ప్రారంభమవుతుందని, భవిష్యత్తులో దీని ప్రభావం ఇతర దేశాలలో కూడా కనిపిస్తుందని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాల వల్ల చిన్నారులకు హాని కలుగుతోంది. అందుకే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

మానవాళిని వదలని వైరస్‌లు.. లండన్‌లో మంకీఫాక్స్ సరికొత్త వేరియంట్.. నలుగురు బాధితులు గుర్తింపు

కరోనా మహమ్మారి ప్రపంచానికి దాదాపు రెండేళ్లపాటు గజగజా వణికించింది. ఆ పీడకల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను రకరకాల వైరస్ లు వెలుగులోకి వస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. వీటిల్లో కొన్ని వైరస్ లు గత కొన్నేళ్ళ క్రితం నుంచి ఉన్నవే.. అవి కొత్త రూపం దాల్చి మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మంకీపాక్స్ (mpox ) కొత్త వేరియంట్ ఆఫ్రికా వెలుపల నమోదు అయింది.

ఆఫ్రికా దేశాలను చుట్టేసిన ప్రమాదకర మంకీపాక్స్‌ వైరస్‌ ఇప్పుడు సరికొత్త రూపాన్ని సంతరించుకుని ఇతర దేశాల్లో వెలుగులోకి వస్తూ ఆందోళన రేకెత్తిస్తోంది. కాంగోలో మొట్టమొదట సారి వెలుగులోకి వచ్చిన mpox కొత్త వేరియంట్ కు సంబంధించిన నాలుగు కేసులను గుర్తించినట్లు బ్రిటీష్ ఆరోగ్య అధికారులు చెప్పారు. ఈ వేరియంట్ ఆఫ్రికా వెలుపల అనారోగ్య సమస్యలకు కారణమైంది. అయితే ఈ సరికొత్త వేరియంట్ వలన ప్రమాదం తక్కువగానే ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గత వారం UK లో మంకీపాక్స్‌( mpox ) కొత్త వేరియంట్ కు సంబంధించిన మొదటి కేసును గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఈ వేరియంట్ బాధితులు రోజు రోజుకీ పెరుగుతున్నుయి. ఈ వైరస్ వ్యాప్తితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం కేసు మంకీపాక్స్‌ కొత్త వేరియంట్ కు సంబంధించిన బాధితులు లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ వారం UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అదే ఇంటిలో నివసించిన మరో మూడు కేసులను గుర్తించినట్లు తెలిపింది. వీరు కూడా ఇప్పుడు లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ బాధితులకు పరిచయం ఉన్న కుటుంబాలలో ఈ అంటువ్యాధి వ్యాపించే అవకాశం ఉందని.. మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ముఖ్య వైద్య సలహాదారు సుసాన్ హాప్కిన్స్ చెప్పారు.

మంకీపాక్స్‌ వైరస్‌ (mpox) కొత్త వేరియంట్ ఈ సంవత్సరం మొదట్లో తూర్పు కాంగోలో కనుగొనబడింది. ఈ వేరియంట్ లక్షణాలు చాలా తేలికగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఈ లక్షణాలను మొదట్లో గమనించడం కష్టం.. కనుక ఈ వేరియంట్ చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే ఈ వైరస్ సోకినట్లు ప్రజలకు తెలియకపోవడమే అని అంటున్నారు. కాంగో తో పాటు ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలలో ఈ వేరియంట్ వ్యాప్తి పెరగడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టులో ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
100 కంటే ఎక్కువ దేశాలలో కేసులు నమోదయ్యాయి. 2022లో బ్రిటన్‌లో మరొక రకమైన mpox కేసులు 3,000 కంటే ఎక్కువ నమోదయ్యాయి. బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాలో కూడా వ్యాప్తి చెందింది అంతేకాదు స్వీడన్, భారత్, జర్మనీ, థాయ్‌లాండ్‌లకు చెందిన ప్రయాణికులకు ఈ వైరస్ సోకింది. ఈ రోజు వరకు ఆ ఫ్రికాలో దాదాపు 43,000 అనుమానిత మంకీ ఫాక్స్ కేసులు ఉన్నాయి. 1,000 కంటే ఎక్కువ మంది మరణించారు. mpox మహమ్మారితో పోరాడుతున్న తొమ్మిది ఆఫ్రికన్ దేశాలకు WHO బుధవారం 899,900 వ్యాక్సిన్లను కేటాయించినట్లు తెలిపింది.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై వైసీపీ చీఫ్ జగన్ ఫైర్

నిబంధనలు పాటించకుండా అరెస్ట్‌లు చేస్తున్నారు.. కేసుల మీద కేసులు పెట్టి దారుణంగా వ్యవహరిస్తున్నారని వైఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబసభ్యులను కూడా స్టేషన్లకు తీసుకెళ్తున్నారని.. డీజీపీ మీద కావాలనే ఒత్తిడి తెస్తున్నారంటూ పేర్కొన్నారు. వ్యతిరేకంగా ఉన్న స్వరాలను తట్టుకోలేక కేసులు పెడుతున్నారని.. ఏపీలో అరాచక పరిస్థితి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ఆరోపించారు.రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని.. ప్రశ్నించే వాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు.

హామీలు అమలు చేయకుండా అందరినీ మోసం చేస్తున్నారని.. అన్ని వ్యవస్థలను నీరుగార్చి.. నాశనం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యావ్యవస్థలో సంస్కరణలను నిర్వీర్యం చేశారని.. వైద్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు.. టీడీపీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే పథకాలు అందిస్తున్నారని.. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు తొలగించారంటూ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని.. 5 నెలల్లో 91మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయంటూ జగన్ పేర్కొన్నారు.

జమిలి ఎన్నికలు అంటున్నారని.. త్వరలోనే ఈ ప్రభుత్వం పడిపోవచ్చు.. తర్వాత వచ్చేది తామేనని వైఎస్ జగన్ ధీమా వ్యక్తంచేశారు. రెడ్ బుక్ పెట్టుకునేది వాళ్లే కాదు.. ఇవాళ నష్టపోయిన ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇలానే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమంటూ చెప్పారు.

సరస్వతి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని..ఆ భూముల్లో ఎలాంటి అక్రమాలు లేవని వైఎస్ జగన్ పేర్కొన్నారు. విచారణకు వెళ్లిన ఎమ్మార్వోనే పరిశీలించి నిజాలు చెప్పారని పేర్కొన్నారు.

మాది ప్రజా ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ

హోమంత్రిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఏపీ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే.. ఈ విషయంలో హోం మంత్రి అనిత వివరణ ఇచ్చినప్పటికీ.. విమర్శలు మాత్రం ఆగలేదు.. ఈ క్రమంలో హోం మంత్రి అనిత ఆసక్తికర పోస్ట్ చేశారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో మార్యదపూర్వకంగా సమావేశమైనట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారన్నారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం తమ కూటమి ప్రభుత్వం అంటూ అనిత పేర్కొన్నారు.

ఇటీవల పిఠాపురం పర్యటనలో రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ క్రమంలో హోం మంత్రి బాధ్యత వహించాలని.. మరింత కఠినంగా వ్యవహరించాలంటూ పవన్ కల్యాణ్ సూచించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందిచిన హోంమంత్రి అనిత.. దీనిని తాను పాజిటివ్‌గా తీసుకుంటున్నానని చెప్పారు.. హోంమంత్రిగా తాను ఫెయిల్‌ అని పవన్ ఎక్కడా అనలేదని.. పవన్‌ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే.. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం.. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం.. వెనువెంటనే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హోమంత్రి అనిత సమావేశం అవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..

ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరుగుతుందట.. సైలెంట్ కిల్లర్‌కు ఇలా చెక్ పెట్టండి

ప్రస్తుత కాలంలో హై కొలెస్ట్రాల్ పెను ప్రమాదకరంగా మారుతోంది.. ఇది ఊబకాయం బారిన పడేలా చేయడంతోపాటు.. ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది..

అందుకే.. శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించేందుకు ఇప్పటినుంచే జీవనశైలి, ఆహారాన్ని మార్చుకోవడం మంచిది.. కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్.. ఇది రక్త సిరల్లో ఫలకం పేరుకుపోవడానికి కారణమవుతుంది.. ఇది రక్తం సరఫరాకు అడ్డంకిని కలిగించి అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు మరింత కారణమవుతుంది. అయితే.. ఉదయాన్నే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు అవేంటో తెలుసుకోండి..

ఉదయాన్నే ఇవి తీసుకోండి..

వాల్‌నట్స్: వాల్నట్స్ లో ఎన్నో పోషకాలున్నాయి.. ప్రతిరోజూ మీ అల్పాహారంలో కొన్ని వాల్‌నట్‌లను తింటే.. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బాదం: బాదం మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఉదయాన్నే పరగడుపున బాదంపప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఉదయాన్నే వీటిని తినడం మంచిది.

ఆలివ్ నూనె: ఆలివ్ నూనెలో ఆరోగ్యానికి చాలా మంచిది.. దీంతో వంట చేసుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనె మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అవిసె గింజలు: అవిసె గింజలలో ఎన్నో పోషకాలతో పాటు.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అవిసె గింజల పొడిని వరుసగా 3 నెలల పాటు ఉదయం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మార్నింగ్ వాక్ – వ్యాయామం – యోగా: మార్నింగ్ వాక్, వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రెగ్యులర్ ఏరోబిక్ వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా యోగా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఆరెంజ్ జ్యూస్: విటమిన్ సీ పుష్కలంగా ఉన్న ఆరెంజ్ జ్యూస్ ఉదయం పూట ఒక గ్లాసు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

డిగ్రీ అర్హతతో బ్యాంకు కొలువులు.. ఐడీబీఐ బ్యాంకులో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌).. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1000 ఎగ్జిక్యూటివ్ (సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు నవంబర్‌ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

యూఆర్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 448
ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 94
ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 127
ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 231
ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 100

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్, ఐటీ సంబంధిత అంశాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి అక్టోబర్‌ 01, 2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు నవంబర్‌ 16, 2024వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.1050, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష డిసెంబర్‌ 1, 2024 నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.29,000 నుంచి రూ.31,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం..

మొత్తం 200 ప్రశ్నలకు మార్కులు 200 కేటాయిస్తారు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్ విభాగం నుంచి 60 మార్కులకు 60 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో 40 మార్కులకు 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 40 మార్కులకు 40 ప్రశ్నలు, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ ఐటీ/ కంప్యూటర్ విభాగంలో 60 మార్కులకు 60 ప్రశ్నలు చొప్పున వస్తాయి. పరీక్ష కాల వ్యవధి 120 నిమిషాలు.

క్యాన్సర్ పై యుద్ధం చేసేందుకు ఏపీ సిద్ధం.. 9 నెలల పాటు క్యాన్సర్‌ స్క్రీనింగ్ డ్రైవ్‌

క్యాన్సర్‌పై ఏపీ ప్రభుత్వం యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టబోతోంది.

త్వరలోనే ఏపీ వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రజలకు అవగాహన కల్పంచడంతోపాటు ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్‌ను పారదోలేందుకు చర్యలు తీసుకోబోతోంది. ఇంతకీ..ఈ కేన్సర్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది?.. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల ప్రక్రియ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం..

టాప్‌లో చైనా, అమెరికా.. మూడవ స్థానంలో భారత్

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ 2022 రిపోర్ట్‌ ప్రకారం ప్రతి ఏటా దాదాపు 2 కోట్ల మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారు. క్యాన్సర్‌తో మరణిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ఏపీ నుంచి క్యాన్సర్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు తొమ్మిది నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. విజయవాడలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్‌కు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల దృష్ట్యా.. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. ఏపీలో 18 ఏళ్లు నిండిన 3.94 కోట్ల మందికి నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ పరీక్షలను వారి ఇళ్ల వద్దే ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ డ్రైవ్‌పై సెలబ్రిటీలతో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి సత్యకుమార్‌.

క్యాన్సర్ నివారణకు ఏడాదికి రూ.700 కోట్లు ఖర్చు

ఇక.. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ డ్రైవ్‌ కోసం లెక్కలతో ప్రత్యేక కార్యచరణ రూపొందించింది ఏపీ ప్రభుత్వం. 18 ఏళ్లు పైబడిన దాదాపు 2 కోట్ల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ టెస్టులు, 30 ఏళ్లు పైబడిన 1.63 కోట్ల మంది మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేస్తామన్నారు మంత్రి సత్యకుమార్‌. ఈ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ డ్రైవ్‌లో ఆరోగ్య సిబ్బంది పూర్తి అవగాహనతో పనిచేయాలనే ఉద్దేశ్యంతో హోమీ బాబా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌ సారథ్యంలో ఇప్పటికే ట్రైనింగ్‌ పూర్తయిందని చెప్పారు. దాదాపు 18 వేల మంది ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తారని.. వారిలో 15 వేల మంది ఏఎన్ఎంలు, 3 వేల మంది కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్లు,125 మంది ఆంకాలజీ స్పెషలిస్టులు ఉంటారన్నారు. ఈ డ్రైవ్‌లో గుర్తించిన క్యాన్సర్ బాధితులను రిఫరల్ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే.. సమగ్ర ఆరోగ్య సర్వేలో భాగంగా నిర్వహించే ఈ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ డ్రైవ్‌లో షుగర్, బీపీ, హీమోగ్లోబిన్ మోతాదు లాంటి టెస్టులు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీలో క్యాన్సర్ నివారణకు ఏడాదికి దాదాపు 700 కోట్లు ఖర్చు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు మంత్రి సత్యకుమార్‌.

మొత్తంగా.. క్యాన్సర్‌ మహమ్మారిపై ఏపీ ప్రభుత్వం పోరాటానికి దిగింది. హోమీ బాబా ఇనిస్టిట్యూట్‌ సాయంతో ఏపీని క్యాన్సర్‌ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు డిసైడ్‌ అయింది. ఈ నేపథ్యంలోనే.. క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని.. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిదేందుకు సహకరించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

జేఈఈ మెయిన్ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో కొత్త చిక్కు.. తలపట్టుకుంటున్న విద్యార్ధులు

జేఈఈ మెయిన్ దరఖాస్తులో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విద్యార్ధులను పలు ఇబ్బందులు పెడుతుంది. పలు రకాల కొర్రీలు పెట్టి విద్యార్ధులకు మానసిక క్షోభను కలిగిస్తుంది.

తాజాగా జేఈఈ మెయిన్‌ 2025 తొలివిడత నోటిఫికేషన్‌ విడుదలవగా… దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 22, 2024 వరకు కొనసాగనుంది. అయితే ఈసారి జేఈఈ మెయిన్‌ దరఖాస్తు విధానంలో ఎన్టీఏ కొన్ని కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ జేఈఈ మెయిన్‌ పరీక్షలు రాసే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-నాన్‌ క్రీమిలేయర్‌ (ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు తమకు రిజర్వేషన్‌ వర్తిస్తుందని డిక్లరేషన్‌ ఫాంపై టిక్‌ పెట్టి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉండేది. కానీ ఈసారి ఆ నిబంధనను మార్చి దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్‌ సంఖ్య, దాన్ని ఎవరు ఇచ్చారు.. ఏ తేదీన ఇచ్చారు.. వంటి పలు వివరాలు పేర్కొనాలని ఎన్‌టీఏ తెలిపింది. దీంతో ఇప్పటికిప్పుడు వాటిని ఎక్కడనుంచి తీసుకురావాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ ధ్రువపత్రాలకు ఎలాంటి కాలపరిమితి లేదు. అవి ఒకసారి తీసుకుంటే ఎన్నేళ్లయినా వినియోగించుకోవచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ సర్టిఫికెట్లను మాత్రం కుటుంబ వార్షిక ఆదాయం ప్రకారం ఇస్తారు. కుటుంబ ఆదాయం ప్రతి సంవత్సరం మారే అవకాశం ఉన్నందున అవి ఒక ఏడాదికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. దీంతో ఈ కోటా కింద సీటు పొందాలంటే ఏప్రిల్‌ 1 తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటవుతాయి. ఇప్పుడు ఆ సర్టిఫికెట్‌ తీసుకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 తర్వాత మళ్లీ తీసుకోవాల్సి వస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎన్‌టీఏకు విద్యార్ధులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై ఎన్‌టీఏ స్పందించి తుది నిర్ణయంలో మార్పులు ఏమైనా చేస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. ఆయా విద్యార్థులు ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసి నంబరు తీసుకొని సిద్ధంగా ఉండాలని, కొద్ది రోజుల తర్వాత జేఈఈకి దరఖాస్తు చేయాలని కళాశాలలు, శిక్షణ సంస్థల నిర్వాహకులు సూచిస్తున్నారు.

మరోవైపు జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సర్టిఫికెట్లలో పేర్ల తేడా ఉంటే వారి దరఖాస్తులను కూడా ఎన్టీయే స్వీకరించలేదు. పదో తరగతి లేదా ఇంటర్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డులపై పేర్లలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తును నిరాకరిస్తూ వచ్చింది. విద్యా ధ్రువపత్రాలపై ఇంటిపేరు పూర్తిగా ఉండి… ఆధార్‌లో సంక్షిప్త రూపంలో ఉన్నాసరే దరఖాస్తు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఫిర్యాదులు రావడతో ఎన్టీయే దిగొచ్చింది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి, పేర్లు మిస్‌మ్యాచ్‌ అయినట్లు చూపితే ఆ విండోను మూసివేస్తే కొత్త విండో ఓపెన్‌ అవుతుందని.. అప్పుడు ఆధార్‌ కార్డుపై ఉన్నట్లు వివరాలు నమోదు చేస్తే సరిపోతుందని ఎన్‌టీఏ స్పష్టంచేసింది. సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డుపై ఉన్న రెండు పేర్లను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపింది.

ఎన్టీఆర్‌ దేవరతో సహా ఓటీటీలోకి వచ్చేసిన పాన్ ఇండియా సినిమాలు

ప్రస్తుతం థియేటర్లలో లక్కీ భాస్కర్, క, అమరన్ ల సందడి కొనసాగుతోంది. అందుకే ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ లేవీ రిలీజ్ కావడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ లు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి .

ఎన్టీఆర్ దేవర, రజనీకాంత్ వేట్టయన్, టొవినో థామస్ ఏఆర్ఎమ్ వంటి పాన్ ఇండియా లు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. వీటితో పాటు సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా ఓటీటీ ఆడియెన్స్ ను అలరిస్తోంది. మరోవైపు సుహాస్ ‘జనక అయితే గనక’ లాంటి కామెడీ ఎంటర్‌టైనర్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ శుక్రవారం ఏయే లు ఏయే ఓటీటీల్లో చూడొచ్చో తెలుసుకుందాం రండి.

ఆహా ఓటీటీలో

జనక అయితే గనక – తెలుగు
బ్యాక్ అండర్ సీజ్ – స్పానిష్ వెబ్ సిరీస్
ఇన్వెస్టిగేషన్ ఏలియన్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
మిస్టర్ ప్లాంక్టన్ – కొరియన్ వెబ్ సిరీస్
ద బకింగ్‪హమ్ మర్డర్స్ – హిందీ
ద కేజ్ – ఫ్రెంచ్ వెబ్ సిరీస్
ఉంజోలో: ద గాన్ గర్ల్ – ఇంగ్లిష్
విజయ్ 69 – తెలుగు డబ‍్బింగ్
ఆర్కేన్ సీజన్ 2 – ఇంగ్లిష్ వెబ్ సిరీస్ (నవంబర్ 09)
ఇట్ ఎండ్స్ విత్ అజ్ – ఇంగ్లిష్ (నవంబర్ 09)
కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్
ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 -ఇంగ్లిష్ వెబ్ సిరీస్
అమెజాన్ ప్రైమ్ వీడియో
వేట్టయన్ – తెలుగు డబ్బింగ్
ఎవ్రీ మినిట్ కౌంట్స్ – స్పానిష్ వెబ్ సిరీస్
సిటాడెల్: హన్నీ బన్నీ – తెలుగు డబ్బింగ్ సిరీస్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఏఆర్ఎమ్ – తెలుగు డబ్బింగ్

ద ఫైరీ ప్రియస్ట్ సీజన్ 2 – కొరియన్ వెబ్ సిరీస్

బుక్ మై షో

బాటో: రోడ్ టూ డెత్ – నేపాలీ

జియో

క్వబూన్ క జమేలా – హిందీ మూవీ

టెన్త్‌ అర్హతతో నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 5,647 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక

నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎన్‌ఎఫ్‌ఆర్‌ పరిధిలోని డివిజన్‌, వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ గువాహటిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,647 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ఎస్‌&టి, పర్సనల్, అకౌంట్స్, మెడికల్ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 3, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కతిహార్ & తింధారియా, అలీపుర్‌దువార్, రంగియా, లుమ్‌డింగ్, టిన్‌సుకియా, న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్, దిబ్రూగర్, ఎన్‌ఎఫ్‌ఆర్‌ హెడ్‌ క్వార్టర్‌/ మాలిగావ్ డివిజన్‌లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు

మొత్తం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు 5,647

తిహార్ & తింధారియాలో ఖాళీలు: 812
అలీపుర్‌దువార్‌లో ఖాళీలు: 413
రంగియాలో ఖాళీలు: 435
లుమ్‌డింగ్లో ఖాళీలు: 950
టిన్‌సుకియాలో ఖాళీలు: 580
న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్లో ఖాళీలు: 982
దిబ్రూగర్‌లో ఖాళీలు: 814
ఎన్‌ఎఫ్‌ఆర్‌లో ఖాళీలు: 661

పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్‌టీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 3, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. మెట్రిక్యులేషన్‌, ఐటీఐలో వచ్చిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

సోషల్ మీడియా చుట్టూ ఏపీలో పొలిటికల్ హీట్

సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తప్పుడు పోస్టులు పెట్టేవాళ్లను వెతికిమరీ పట్టుకుని అధికారులు కటకటాల్లోకి పంపిస్తున్నారు.

ఈ పరిణామాలతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను వైసీపీ తప్పుబడుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ తీరును జగన్ తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు.

అయితే మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టేవాళ్లు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వాళ్లను వదిలిపెట్టాలా అని నిలదీశారు సీఎం చంద్రబాబు. మదమెక్కి ఆంబోతుల్లాగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మదమెక్కి, కొవ్వుపట్టి పోస్టులు పెట్టేవాళ్లను వదిలెయ్యాలా? అని ప్రశ్నించారు.

తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి టీడీపీ నేతల కాళ్లు పట్టిస్తున్నారన్నారని ఆరోపించారు. సైకో పార్టీలతో కొంత మంది సైకోలు కలిసి సోషల్ మీడియాలో నీచంగా ప్రవర్తిస్తున్నారంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా, ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా.. వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అసభ్యకర పోస్టులు, వ్యక్తిత్వ హననానికి పాల్పడేవాళ్లను కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు.

ఇక విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ లేనట్లే! కూటమి సర్కార్ కొత్త ప్లాన్ ఇదే..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం కింద అందే నగదును నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అయ్యేలా గత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

అయితే ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో కాకుండా కళాశాలల యాజమాన్య ఖాతాల్లోకే వేయాలని తాజాగా కూటమి సర్కార్‌ నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానలను త్వరలోనే ప్రకటించనుంది. 2014-19 మధ్య హయాంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటును కళాశాలల యాజమాన్య ఖాతాల్లోకే జమ చేసేవారు.

అయితే జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లుల ఖాతాల్లోకి వేసే విధానం అమలులోకి తెచ్చారు. నేరుగా తల్లుల ఖాతాల్లోకే జమ అవుతుందనే కారణంగా కళాశాలల యాజమాన్యాలు నిర్దేశిత గడువుకు ఫీజుల్ని చెల్లించాల్సిందేనని విద్యార్థులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కొంతమంది ఫీజులు కట్టలేక పరీక్షలకు దూరం అవ్వవల్సిన పరిస్థితి నెలకొంది. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు కలిపి మొత్తం రూ.3,840 కోట్లు బకాయిలు ఉన్నాయి. దీంతో ఇందులో ఉన్న ఇబ్బందులను గ్రహించిన కూటమి ప్రభుత్వం విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో కాకుండా కళాశాలల యాజమాన్య ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంటు ఫీజు వేయాలని భావిస్తోంది.

తెలంగాణలో మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించిన వివాదం సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పీజీ మెడికల్‌ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం అక్టోబరు 28న జారీ చేసిన జీవో నం.148ను సవాలు చేస్తూ మంచిర్యాలకు చెందిన డాక్టర్‌ ఎస్‌ సత్యనారాయణతోపాటు మరొక విద్యార్ధి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె శ్రీనివాసరావుల ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్నారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎం సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. తెలంగాణకు చెందిన పిటిషనర్లు మరోచోట ఎంబీబీఎస్‌ చేశారన్న కారణంగా స్థానిక కోటాను తిరస్కరించినట్లు తెలిపారు. తెలంగాణ బయట ఉన్న సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ విద్యార్థులను స్థానికులుగా పరిగణించడం చెల్లదని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల11వ తేదీకి వాయిదా వేసింది.

టీటీడీ బోర్డు మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం బెస్ట్ ఫ్రెండ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్ సాయి క్లోజ్ ఫ్రెండ్స్. . తొలి ప్రేమ సినిమ కంటే వీరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇక జనసేన ప్రయాణంలో, గెలిచాక కూడా పవన్ వెంట ఉంటున్నాడు ఆనంద్ సాయి.

కొన్ని రోజుల క్రితం పవన్ వెంట ఆనంద్ సాయి కూడా వచ్చి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ బోర్డు మెంబర్ గా ఆనంద్ సాయికి ప్రాధాన్యం దక్కింది. తాజాగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. భార్య వాసుకీ, తదితర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆనంద్ సాయి. అనంతరం టీటీడీ అర్చకుల వేదాశీర్వచనం అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా టీటీడీ బోర్డు మెంబర్ గా సెలెక్ట్ చేసినందుకు ఎమోషనల్ అయ్యారు ఆనంద్ సాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఒక ఆసక్తికర పోస్ట షేర్ చేశాడు.

‘ నాపై నమ్మకముంచి ఈ అపురూపమైన గౌరవాన్ని నాకు కల్పించిన నా ప్రియ మిత్రుడు పవన్ కల్యాణ్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని కాపాడడంలో ఆయన అంకితభావం నిజంగా స్ఫూర్తి దాయకం. పవన్ దార్శనికత, నాయకత్వం ఎంతో మందికి ఆదర్శం. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసినందుకు నేనెంతో కృతజ్ఞుడిని. టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. నాకున్న నైపుణ్యం, అనుభవంతో తిరుమల శ్రీవారికి సేవ చేసుకుంటాను’ అని రాసుకొచ్చారు ఆనంద్ సాయి.

టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌ అప్లికేషన్ ప్రక్రియ ప్రాంరంభం! భారీగా తగ్గిన దరఖాస్తు ఫీజు

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024) 2024 దరఖాస్తుల ప్రక్రియ నవంబర్‌ 7 (గురువారం) రాత్రి 11 నుంచి ప్రారంభమైంది.

ఈ మేరకు టెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు నవంబర్‌ 5వ తేదీ నుంచే టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా 2 రోజులు ఆలస్యమైంది. 7వ తేదీ నుంచి టెట్‌ వెబ్‌సైట్‌ అందుబాటులోకి తెస్తామని,అభ్యర్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు టెట్ అభ్యర్థులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. గత మేలో నిర్వహించిన టెట్‎కు దరఖాస్తు చేసుకున్నోళ్లందరూ వచ్చే జనవరిలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని అప్పట్లో సీఎం రేవంత్‌ ప్రకటించారు. దీంతో తాజా టెట్‌కు వీరందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా టెట్‌ దరఖాస్తు ఫీజును కూడా భారీగా తగ్గించింది.

గతంలో ఒక పేపర్‎కు రూ.1000, రెండు పేపర్లు రాస్తే రూ.2 వేల ఫీజు చెల్లించవల్సి వచ్చేది. ప్రస్తుతం దాన్ని రూ.750కి కుదించారు. అంటే ఒక పేపర్‌ రాసేవారు రూ.750 చెల్లించాలి. రెండు పేపర్లు రాసేవారికి రూ.వెయ్యిగా నిర్ణయించింది. ఈ మేరకు టెట్ డిటెయిల్డ్ నోటిఫికేషన్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, టెట్ కన్వీనర్ రమేశ్ గురువారం విడుదల చేశారు. మేలో నిర్వహించిన టెట్‌లో క్వాలిఫై అయినా, కాకపోయినా అప్లై చేసుకునే వారు వచ్చే జనవరిలో జరిగే టెట్‌కు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో ప్రకటించారు. టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 7 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఫీజు చెల్లించి, అధికారిక వెబ్‌సైట్లో అప్లై చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష ఉంటుంది. ఇక టెట్‌ 2024 ఫలితాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రకటిస్తారు. మొత్తం 8 భాషల్లో టెట్‌ పరీక్ష జరగనుంది. తెలుగుతోపాటు ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఐదో తరగతి వరకు బోధించే వారు పేపర్ 1, ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే వారు పేపర్​2కు అప్లై చేసుకోవచ్చు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు. టెట్ మొత్తం 150 మార్కులకు ఉంటుంది. క్వాలిఫై మార్కులు.. జనరల్ కేటగిరీకి 60%, బీసీ కేటగిరీకి 50%, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీకి 40%గా విద్యాశాఖ నిర్ణయించింది. ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. టెట్ ఆఫీస్: 70750 88812 / 70750 28881, వెబ్ సైట్ రిలేటెడ్: 70750 28882/ 70750 28885, టెక్నికల్ రిలేటెడ్: 70329 01383/ 90007 56178 నంబర్లకు పని వేళల్లో ఫోన్‌ చేసి సంప్రదించవచ్చు.

ట్రాఫిక్‌లో కారు 1 నిమిషం ఆగి ఉంటే పెట్రోల్ ఎంత ఖర్చవుతుందో తెలుసా

మీరు మీ వాహనాన్ని డ్రైవింగ్‌ చేస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా బెంగళూరు ట్రాఫిక్‌లో కొన్నిసార్లు గంటల తరబడి ఆగిపోవాల్సి వస్తుంటుంది.

కొంతమంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు వాహనాన్ని ఆఫ్‌ చేయకుండా ఆన్‌లోనే ఉంచేస్తుంటారు. అది కారు గానీ, బైక్‌ గానీ. అటువంటి పరిస్థితిలో మీ కారులో ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. కానీ, ఈ సందర్భంలో ఇంధన వినియోగం ఎంత ఉంటుందో మీరు ఎప్పుడైనా ఊహించారా?. కారును ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆపడం, లేదా సిగ్నల్స్ వద్ద ఆపడం వల్ల ఇంధనం (పెట్రోల్/డీజిల్) వినియోగం కారు రకం, ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మీ కారు ఇంజిన్ 1000 నుండి 2000 cc మధ్య ఉంటే, 1-నిమిషం స్టాప్‌కు 0.01 నుండి 0.02 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుంది.

చిన్న ఇంజన్లు (1000 నుండి 1200 సిసి): చిన్న ఇంజన్లు కలిగిన వాహనాలు 1 నిమిషంలో సుమారుగా 0.01 లీటర్ పెట్రోల్‌ను ఖర్చవుతుంది.

మధ్యస్థ ఇంజిన్‌లు (1500 cc వరకు): ఈ వాహనాలు నిమిషానికి 0.015 లీటర్లు వినియోగించుకుంటాయి.

పెద్ద ఇంజన్లు (2000 cc పైన): పెద్ద ఇంజన్లు 1 నిమిషంలో 0.02 లీటర్ లేదా అంతకంటే ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకుంటాయి.

దీని ఆధారంగా మీ కారు నిరంతరం ట్రాఫిక్ సిగ్నల్స్‌ వద్ద ఆగాల్సి వస్తే ఒక నెలలో ఎంత ఇంధనం ఖర్చవుతుందో ఆలోచించండి.

ట్రాఫిక్ సిగ్నల్‌ వద్ద కారును ఆపివేయడం మంచిది:

ట్రాఫిక్ సిగ్నల్‌ వద్ద ఎక్కువ సేపు ఆగినప్పుడు వాహనం ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల చాలా ఇంధనం ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆపే సమయం 30 సెకన్ల కంటే ఎక్కువ ఉంటే ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఇంజిన్ ఆఫ్ చేయడం ఉత్తమ మార్గం.

సిగ్నల్స్‌ వద్ద ఇంజిన్‌ ఆఫ్‌ చేస్తే ప్రయోజనాలు:

ఇంధన ఆర్థిక వ్యవస్థ: ఇంజిన్ నడుస్తున్నప్పుడు ఇంధనం నిరంతరం ఉపయోగించబడుతుంది. ఇంజిన్ ఆఫ్ చేయడం ద్వారా ఇంధన వినియోగం వెంటనే ఆగిపోతుంది. దీని ద్వారా ఇంధనం ఆదా చేసుకోవచ్చు.

కాలుష్యం తగ్గింపు: వాహన ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల ఉద్గారాలు ఆగిపోతాయి. ఇది పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

ఇంజిన్ డ్యూరబిలిటీని పెంచుతుంది: ఇంజిన్‌ను ఎక్కువసేపు రన్నింగ్‌లో ఉంచడం వల్ల దాని జీవితకాలం తగ్గుతుంది. అందుకే ఆఫ్ చేయడం వల్ల దాని సామర్థ్యం కూడా పెరుగుతుంది. మీరు ట్రాఫిక్ సిగ్నల్‌ వద్ద 30 సెకన్ల కంటే ఎక్కువసేపు ఆగవలసి వస్తే, ఇంజిన్ ఆఫ్ చేయడం మంచి నిర్ణయం.

భారమైనా భరించాల్సిందే.. విద్యుత్ చార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

విద్యుత్‌ చార్జీల పెంపు వైసీపీ పాపమే.. ఈసారికి తప్పదు. భారమైనా భరించాల్సిందే. వాళ్ల అప్పుల పాపాలు.. మనకు శిక్షలు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఏపీలో విద్యుత్ ట్రూఅప్‌ చార్జీలపై పొలిటికల్ దుమారం మొదలైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ఛార్జీల భారమైతే తప్పదంటూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. గత ప్రభుత్వ పాపాలకు పర్యవసానం అని.. డిస్కమ్‌లకు ఇచ్చిన అనుమతిని రద్దుచెయ్యలేమన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపు వైసీపీ పాపమే అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం మాత్రం ఐదేళ్లు ఏ భారం మోపదని భరోసా ఇచ్చారు.

ట్రూఅప్ చార్జీలంటే ఏంటి..?

అయితే.. ట్రూఅప్ చార్జీల రూపంలో ఏపీ ప్రజలు జనవరి నుంచి 15 నెలలపాటు అదనపు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అసలు ట్రూ అప్‌ అంటే ఏంటంటే.. ఈఆర్‌సీ ఆమోదించిన రెవెన్యూ వ్యయం కన్నా అధికంగా చేసిన ఖర్చులను డిస్కమ్‌లు ట్రూ అప్‌ చార్జీల పేరుతో వినియోగ దారులు నుంచి వసూలు చేసుకుంటాయి.

ఇంతకీ.. ట్రూ అప్‌ చార్జీల భారం ఎంతో తెలుసా! అక్షరాలా.. 17వేల 898 కోట్ల రూపాయలు. ఇందులో 6 వేల 72 కోట్ల రూపాయల మేర ట్రూ అప్ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసుకోడానికి ప్రభుత్వం అనుమతించింది. తాజాగా మరో 11 వేల కోట్ల రూపాయల భారం వేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారమంతా యూనిట్ల రూపంలో డివైడ్ చేసి.. రాబోయే 15నెలలపాటు ట్రూఅప్ చార్జెస్ వసూలు చేస్తారన్నమాట..

ఏపీ సర్కార్ పై విపక్ష పార్టీల ఫైర్..

ఓవైపు వైసీపీ తప్పులతోనే ఈ భారమని చంద్రబాబు అంటుంటే.. మరోవైపు పెంపునకు నిరసనగా ఆందోళన చేస్తామంటోంది వైసీపీ. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసి చార్జీలను తగ్గించాలంటోంది.

ఛార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్, వామ పక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళన బాటపట్టాయి. అటు ఫ్రీ సిలిండర్లు ఇటు బాదుడా అంటూ ప్రశ్నిస్తున్నాయి.

అయితే చంద్రబాబు నుంచి మాత్రం ఒక హామీ వచ్చింది. గత ప్రభుత్వం మోపిన భారాన్ని తగ్గించలేం గానీ.. రాబోయే 5ఏళ్లు మాత్రం తమ వైపు నుంచి ఎలాంటి వడ్డన ఉండదని భరోసా ఇచ్చారు.

ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ ఎందుకు పేలుతుందో తెలుసా

ఛార్జింగ్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్‌ పేలిందన్న మనం తరచూ వినే ఉంటాం. కొన్నిసార్లు ఈ పేలుడు తీవ్రత భారీ స్థాయిలో ఉంటుంది. ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు చూశే ఉంటాం.

ముఖ్యంగా ఛార్జింగ్‌ పెడుతున్న సమయంలోనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఫోన్‌లు పెరగడానికి అసలు కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫోన్‌లు పేలడానికి ప్రధాన సమస్యల్లో ఓవర్‌ ఛార్జింగ్ సమస్య ప్రధాన మైంది. నిజానికి బ్యాటరీ ఫుల్‌ అవ్వగానే సర్క్యూట్‌ ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. కానీ సర్క్యూట్‌ సరిగ్గా పని చేయకపోతే బ్యాటర్‌ ఓవర్‌ ఛార్జ్‌ అవ్వడం ప్రారంభమవుతుంది. దీంతో బ్యాటరీలో అదనపు వేడి ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. ఎక్కువ సమయం ఇలాగే కొనసాగితే.. బ్యాటరీ పేలిపోవడానికి కారణమవుతుంది. ఇక ఫోన్‌ పేలడానికి బ్యాటరీ నాణ్యత కూడా ఒక కారణమని అంటున్నారు.

నాణ్యతలేమి బ్యాటరీలు ఏమాత్రం సురక్షితం కాదు. బ్యాటరీ పేలవమైన పదార్థాలతో తయారు చేసే అది వేడెక్కగానే పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్‌ ఎక్కడ పెడుతున్నామన్న అంశం కూడా బ్యాటరీ పేలడానికి కారణమవుతుందని అంటున్నారు. ఛార్జింగ్ అయ్యే సమయంలో దలదిండు కింద, టీవీలపై, ఫ్రిజ్‌ల ఉంచడం వల్ల ఫోన్‌ వేడి ఒక్కసారిగా పెరుగుతుంది. ఈ అదనపు వేడి బ్యాటరీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణంగా బ్యాటరీ పేలిపోతుంది.

ఇక నాణ్యతలేని ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల బ్యాటరీలు పెరగడానికి కారణమవుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. క్వాలిటీ లేని ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల బ్యాటరీకి కరెంట్‌ ఎక్కువ మొత్తంలో సప్లై అవుతుంది. ఇది బ్యాటరీ వేడి పెరగడానికి కారణమవుతుంది. దీర్ఘకాలంలో బ్యాటరీ పేలడానికి ఇది కారణమవుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు ఒరిజినల్ ఛార్జర్‌లను ఉపయోగించాలి.

తలనొప్పికి ట్యాబ్లెట్ వేస్తున్నారా..? ఇక చాలు.. ఈ చిట్కాలతో వెంటనే రిలీఫ్.

నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. తలనొప్పి సమస్య ఏ వయస్సులోనైనా రావొచ్చు.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది..

తలనొప్పి రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి, పెరిగిన ఆందోళన, అలసట, ఎక్కువ పని లేదా ఏదైనా చెడు అలవాటు వంటివి అనేక కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు తలనొప్పి భరించలేనిదిగా మారుతుంది.

అయితే, తలనొప్పి వస్తే చాలా మంది పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వినియోగిస్తుంటారు.. చిటికి మాటికి వచ్చే తలనొప్పికి నొప్పి నివారణ మందులు తీసుకోవడం ఆరోగ్యం పెను ప్రభావం చూపుతుంది. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. తలనొప్పి వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఇంటి నివారణలను ప్రయత్నిస్తే.. నొప్పి సమస్యను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తలనొప్పి వదిలించుకోవడానికి ఇంటి నివారణ చిట్కాలు..

హైడ్రేటెడ్ గా ఉండండి: తలనొప్పికి ఒక సాధారణ కారణం శరీరంలో నీరు లేకపోవడం. రోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.

యోగా – ధ్యానం: ధ్యానం మానసిక ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఇది సాధారణ రోజుల్లో కూడా చేయాలి. రోజూ దీన్ని ఆచరించడం వల్ల ఒత్తిడిని తగ్గించి, తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.

నట్స్ తినండి: నట్స్ మానసిక ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. వాల్‌నట్‌లు, బాదంపప్పులు, జీడిపప్పు వంటి గింజలను తినడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఎందుకంటే వాటిలో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది.. ఇది తలనొప్పిని దూరం చేస్తుంది.

అల్లం టీ: అల్లం టీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది. చాలా మందికి, అల్లం టీ సాధారణ రోజుల్లో కూడా మానసిక నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.

విశ్రాంతి: భరించలేని తలనొప్పి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు ప్రతి విషయాన్ని ఆలోచించకుండా వదిలేస్తే బాగా నిద్ర ప్రయత్నించండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

సూపర్ లుక్‌తో స్కోడా కైలాక్.. బుకింగ్‌లు షురూ

కైలాక్ కారు లుక్ చాలా స్లైలిష్ గా ఉంది. ఆధునిక ఫీచర్లు, నాణ్యమైన ఇంజిన్, ఇతర ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బుక్కింగ్ లు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ లేదా వచ్చే ఏడాది నుంచి కార్లను డెలివరీలు చేస్తారు.

స్కోడా కైలాక్ కారు ఆవిష్కరణతో స్కోడా ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. సబ్ ఫోర్ మీటర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్ యూవీ) విభాగంలోకి చేరింది. దీని ధర రూ.7.89 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ వెన్యూ, మారుతీ సుజుకీ బ్రెజ్టా, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ వో తదితర వాటికి పోటీకి నిలుస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

స్కోడా కైలాక్ కారుపై ఆ కంపెనీ సీఈవో క్లాస్ జెల్మెర్ మాట్లాడుతూ తమ కొత్త బ్రాండ్ కు భారత దేశం ఎంట్రీ పాయింట్ గా మారిందన్నారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్ అయిన ఇండియాలో కొత్త కార్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్నారు. వీటిలో దాదాపు 50 ఎస్ యూవీలు ఉంటున్నట్టు తెలిపారు. తమ కారుకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నామన్నారు. స్కోడా కైలాక్ కారులో 1.0 లీటర్ పెట్రోలు ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 113 బీహెచ్ పీ శక్తి, 178 టార్కు ను ఉత్పత్తి అవుతుంది. ఆరు స్పీడ్ మాన్యువల్, ఆరు స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్ మిషన్ తో ఇంజిన్ కు జత చేశారు. కేవలం 10.5 సెకన్లలో వంద కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది.

స్కోడా కొత్త కారులో 8 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్ లెస్ ఫోన్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్ గా సర్దుబాటు చేయగల డ్రైవింగ్ సీట్లు, కాంటన్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆరు ఎయిర్ బ్యాగులు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ట్రాక్సన్ కంట్రోల్, త్రీ పాయింట్ బెల్టులు, ప్రయాణికులందరికీ హెడ్ రెస్టులు తదితర ఫీచర్లు ఉన్నాయి. చెక్ రిపబ్లిక్ కు చెందిన స్కోడా కంపెనీ మన దేశంలో తన కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు ప్రణాళిక రూపొందించింది. 2026 నాటికి పది వేల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌకర్యం, నాణ్యత, బెస్ట్ డిజైన్, భద్రత అనే నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగుతోంది.

వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. దీని ఉపయోగం ఏంటంటే.

ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తూ వస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. సెర్చ్‌ ఆన్‌ వెబ్‌ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

ఇంతకీ ఈ ఫీచర్‌ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా వాట్సాప్‌లో ఏదైనా ఫొటోను పంపాలనుకుంటే గూగుల్‌ లేదా మరే ఇతర సెర్చ్‌ ఇంజన్‌లో అయినా వెతుక్కొని డౌల్‌లోడ్‌ చేసుకొని పంపిస్తుంటారు. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

సెర్చ్‌ ఆన్‌ వెబ్‌ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు ఇతర బ్రౌజర్‌లోక వెళ్లకుండానే వాట్సాప్‌లో ఇమేజెస్‌ను సెర్చ్‌ చేసుకోవచ్చు.

వాట్సాప్‌ చాట్‌ ఓపెన్‌ చేయగానే పైన రైట్‌ సైడ్‌లో కనిపించే త్రీ డాట్స్‌ను క్లిక్‌ చేయాలి. దానిపై క్లిక్‌ చేయగానే సెర్చ్‌ ఆన్‌ వెబ్‌ ఆనే ఆప్షన్‌ కనిపిస్తుంది. మీరు ఎలాంటి ఫొటో కావాలనుకుంటున్నారో ఎంటర్ చేస్తే ఫొటోలు వచ్చేస్తాయి.

ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ ఇటీవల పలు ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ట్రంప్‌ ఎఫెక్ట్‌.. మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన తర్వాత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, గురువారం దేశ రాజధానిలో బంగారం మరియు వెండి ధరలు క్షీణించాయి.

మూడు రోజుల్లో రూ.3750 పతనమై రూ.79,500 మార్కుకు చేరుకుంది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధరపై భారీగా తగ్గుముఖం పట్టింది. ఏకంగా రూ.17,90 పతనమై రూ.78,710 వద్దకు చేరుకుని ప్రస్తుతం రూ.80వేల దిగువకు పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,150 వద్ద కొనసాగుతోంది. అలాగే బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,150 వద్ద కొనసాగింది. మరోవైపు కిలో వెండి ధర రూ.3000 తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.93,800 వద్ద కొనసాగుతోంది. బుధవారం కిలో వెండి ధర రూ.96,000 వద్ద స్థిర పడింది. గ్లోబల్ ట్రెండ్ తగ్గుముఖం పట్టడంతో సెంటిమెంట్ బలహీనపడిందని, స్థానిక ఆభరణాల వ్యాపారుల్లో డిమాండ్ పడిపోవడంతో బంగారం ధరపై ఒత్తిడి పెరిగిందని వ్యాపారులు తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌ను వ్యాపార వర్గాలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. అందువల్ల పెట్టుబడిదారులు బంగారం లోహానికి బదులుగా బిట్‌కాయిన్, ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి ఎంచుకుంటున్నారు. దీంతో బంగారం ధర తగ్గిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు. యుఎస్ బాండ్ లాభాలు, డాలర్ విలువ పెరుగుదల కూడా ఎల్లో మెటల్ ధర తగ్గుదలను ప్రభావితం చేశాయని తెలిపారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,710 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,560 వద్ద ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,560 వద్ద ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,560 వద్ద ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,560 వద్ద ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,560 వద్ద కొనసాగుతోంది.

ఇలా చేస్తే ఐదేళ్లలో మీరే లక్షాధికారి.. ఆ పోస్టాఫీసు పథకంతో ఎంతో లాభం

సాధారణంగా అధిక ఆదాయం సంపాదించేవారే ఎక్కువ పొదుపు చేయగలరని అందరూ భావిస్తారు. కానీ పొదుపు అనేది ఒక అలవాటు. తక్కువ ఆదాయం పొందేవారు కూడా తమ స్థాయికి అనుగుణంగా పొదుపు చేసుకుంటే దీర్ఘకాలంలో అధిక రాబడి పొందుతారు.

సామాన్యులు పొదుపు చేయడానికి పోస్టాఫీసు పథకాలు చాలా బాగుంటాయి. ప్రతి గ్రామంలోనూ దాదాపు పోస్టాఫీసు ఉండడం దీనికి ప్రధానం కారణం. అలాగే తక్కువ మొత్తాలను కూడా దాచుకునే అవకాశం ఉంటుంది. మహిళలు డబ్బులు దాచుకునేందుకు పోస్టాఫీసు పథకాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా రికరింగ్‌ డిపాజిట్‌ స్కీములుగా చెప్పే ఆర్‌డీలలో పొదుపు చేస్తే నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో సహా పొదుపును తీసుకునే అవకాశం ఉంటుంది. వీటిలో రూ.500, రూ.వెయ్యి, రూ.మూడు వేలు చొప్పున ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పేద మహిళలకు కూడా వీటిలో డబ్బులు కట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకనే కొత్తగా ఎన్ని పెట్టుబడి పథకాలు వచ్చినా ఆర్‌ డీలకు డిమాండ్‌ తగ్గడం లేదు.

పోస్టాఫీసుల్లోని రికరిండ్‌ డిపాజిట్‌ పథకం కాల వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. అప్పటి వరకూ క్రమం తప్పకుండా దీనిలో పొదుపు చేయాలి. ఐదేళ్లకు మెచ్యురిటీ తర్వాత వడ్డీతో కలిసి పొదుపును తీసుకోవచ్చు. ప్రతి నెలా కట్టిన డబ్బులు మెచ్యురిటీ అనంతరం పెద్ద మొత్తంలో చేతికి అందుతాయి. అవసరమనుకుంటే మెచ్యురిటీ తర్వాత మరో ఐదేళ్లకు స్కీమును పొడిగించుకోవచ్చు. అలాగే ముందుగానే ఆపేయ్యాలనుకుంటే మూడేళ్ల తర్వాత మూసివేసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే ప్రీ మెచ్యూర్‌ క్లోజింగ్‌ అంటారు. ఇలా చేయడం వల్ల వడ్డీలో కోత విధిస్తారు. రికరింగ్‌ డిపాజిట్‌ పథకాలకు ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ అందిస్తున్నారు.

మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీరేటుపై సమీక్ష ఉంటుంది. అయితే ఎప్పుడూ ఇవి స్థిరంగానే కొనసాగుతాయి. వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లకు వడ్డీరేట్లు పెంచిన నేపథ్యంలో ఆర్‌డీలపై కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రికరింగ్‌ డిపాజిట్లలో పొదుపును మీ వీలును బట్టి చేసుకోవచ్చు. ప్రతి నెలా మీరు కట్టిన చిన్న మొత్తం ఐదేళ్ల తర్వాత భారీస్థాయిలో చేతికి వస్తుంది. ఉదాహరణకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు పొదుపు చేస్తే మెచ్యురిటీ తర్వాత వడ్డీతో కలిసి రూ.72 వేలు చేతికి వస్తాయి. మూడువేలు చొప్పున కడితే రూ.2.18 లక్షలు, నెలకు రూ.5 వేల కడితే 3,64,500 అందుకోవచ్చు. అలాగే రూ.20 వేలు చొప్పున కడితే ఏకంగా 14 లక్షల రూపాయలు చేతికి వస్తాయి.

ఆన్‌లైన్‌లో ఎంగేజ్ మెంట్‌

కరోనా కాలం మనిషిని ఎంతగానో మార్చేసింది. ఆన్‌లైన్‌ వర్క్ ట్రెండ్‌ పెరిగింది. ఆన్‌లైన్‌లో కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు.. ఏకం పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి కూడా జరిపించేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ జంట ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం చేసుకోవడం కనిపించింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అమ్మాయి ఉంది.. కానీ అబ్బాయి మాత్రం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాడు. అలాగే, నిశ్చితార్థం కొనసాగించారు ఇరువురి తల్లిదండ్రులు, బంధుమిత్రులు. ఈ వింత వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ ఇంటర్నెట్ వినియోగదారులను విస్మయానికి గురి చేస్తోంది. navvarababu_Instagram ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఒక అమ్మాయి ఫైబర్ కుర్చీపై కూర్చుని ఉంది. నుదుటిపై తిలకం పూసారు. ఆ పక్కనే మరో కూర్చీలో అత్యంత షాకింగ్ ఘటన కనిపించింది. అక్కడ కూర్చీలో ఫోన్‌ కెమెరాలో ఒక యువకుడి చిన్న ఫ్రేమ్ ఫోటో ఉంచారు. ఆ ఫోటో చుట్టూ చాలా నోట్ల కట్టలు కూడా కనిపిస్తున్నాయి. బహుశా ఈ డబ్బు కట్నం కావచ్చు. వీడియోను షేర్‌ చేస్తూ..దానికి క్యాప్షన్ కూడా ఇచ్చారు..ఇది కదా డిజిటల్ ఇండియా అంటే.. అని రాశారు.

కుప్పంలో సైకిల్ స్పీడ్‌కు ఫ్యాన్ ఖాళీ

కుప్పం నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా అన్న సంగతి తెలిసిందే.. 1989 నుంచి కుప్పంలో ఇప్పటి దాకా ఓటమి ఎరగని నేతగా చంద్రబాబు కొనసాగుతున్నారు.

అయితే 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కుప్పంలో టీడీపీ పని అయిపోయిందన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వైసీపీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికలు జరిగిన నాలుగు నెలల లోపే వైసీపీ ప్రాబల్యం తగ్గపోతుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో దూకుడును ప్రదర్శించి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వై నాట్ 175 అనే నినాదం వైసీపీ ఎత్తుకుంది.

కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీపీలను, కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకున్న వైసీపీకి రాష్ట్రంలో జరిగిన అధికార మార్పు నాలుగు నెలల్లోనే కుప్పంలో సీన్ రివర్స్ అయ్యేందుకు కారణమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని మెజారిటీని సాధించడం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో కుప్పంలో వైసీపీ అని చెప్పుకునేందుకు లీడర్లు ముందుకు రావడం లేదు. కొందరు అజ్ఞాతంలోకి వెళితే మరికొందరు పార్టీ కండువా మార్చాల్సి వచ్చింది. మరికొందరిపై కేసులు నమోదు కావడంతో జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇలా కుప్పంలో వైసీపీ ఖాళీ కాగా మిగిలిన మరికొందరు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో కుప్పం ఇలాకాలో చంద్రబాబుకు మరోసారి తిరుగు లేదని తేలిపోయింది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ సీఎం చంద్రబాబును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసిన సుధీర్ భవిష్యత్తుకు చంద్రబాబు భరోసా కూడా ఇచ్చారని తెలిసింది. దీంతో మరికొందరు ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీలోని మరికొందరు నేతలు టీడీపీలో చేరుతున్నారు. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కుప్పం వైసీపీ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ నియోజకవర్గానికి రాకపోవడంతో పార్టీ కేడర్ ఆందోళనలో ఉంది.

Health

సినిమా