ఆరోగ్యం బాగుండాలంటే బీపీని (Blood Pressure) కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కిడ్నీ డ్యామేజ్ వంటి సమస్యలు వస్తాయి.
బ్యాలెన్స్‌డ్ డైట్, ఎక్సర్‌సైజ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌తో బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తం ప్రసరించేటప్పుడు ధమనుల గోడలపై కలిగే పీడనాన్నే ‘బ్లడ్ ప్రెజర్’గా వ్యవహరిస్తారు. దీన్ని ‘మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యురీ’ల్లో (mm Hg) కొలుస్తారు.
బీపీ సాధారణంగా 122/79 mm Hgగా ఉండాలని డాక్టర్లు చెబుతుంటారు. పై నంబర్ సిస్టోలిక్ ప్రెజర్‌ను, అంటే రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ముడుచుకుపోయినప్పుడు రక్తనాళాలపై కలిగే ఒత్తిడిని సూచిస్తుంది. కింది నంబర్ డయాస్టోలిక్ ప్రెజర్, అంటే గుండె రెండుసార్లు వరుసగా కొట్టుకోవడానికి మధ్యలో రక్తనాళాలపై ఉండే ప్రెజర్‌ను తెలియజేస్తుంది. ఈ బ్లడ్ ప్రెజర్ రేంజ్ వయసును బట్టి మారుతుంది. ఈ నేపథ్యంలో ఏ వయసులో ఎంత బీపీ ఉండాలో చూద్దాం..
* పిల్లల్లో..
1 నెల నవజాత శిశువులు: సిస్టోలిక్ – 60 -90 mm Hg ; డయాస్టోలిక్ – 20-60 mm Hg
శిశువులు: సిస్టోలిక్ 87-105 mm Hg ; డయాస్టోలిక్ 53-66 mm Hg
చిన్నారులు: సిస్టోలిక్ 95-105 mm Hg ; డయాస్టోలిక్ 53-66 mm Hg
ప్రీస్కూలర్లు: సిస్టోలిక్ 95-110 mm Hg ; డయాస్టోలిక్ 56-70 mm Hg
పాఠశాల వయసు పిల్లలు: సిస్టోలిక్ 97-112 mm Hg ; డయాస్టోలిక్ 57-71 mm Hg
కౌమారదశలో ఉన్నవారు: సిస్టోలిక్112-128 mm Hg ; డయాస్టోలిక్ 66-80 mm Hg
* వయోజనుల్లో..
18-39 ఏళ్లు: 110/68 mm Hg ;119/70 mm Hg
40-59 ఏళ్లు: 122/74 mm Hg ; 124/77 mm Hg
60+ ఏళ్లు: 139/68 mm Hg ;133/69 mm Hg
ఈ లిమిట్స్ కంటే తక్కువ ఉన్నా .. లేదా పెరిగినా ఆ వ్యక్తి బీపీని కింది ఏదో ఒక కేటగిరీలో డాక్టర్లు చేరుస్తారు.
నార్మల్ బీపీ అంటే: సిస్టోలిక్ 120 కంటే తక్కువ; డయాస్టోలిక్ 80 కంటే తక్కువ
ఎలివేటెడ్: సిస్టోలిక్ 120-129, డయాస్టోలిక్ 80 కంటే తక్కువ
హైపర్‌టెన్షన్ స్టేజ్ 1: సిస్టోలిక్ 130-139, డయాస్టోలిక్ 80 – 89
హైపర్‌టెన్షన్ స్టేజ్ 2: సిస్టోలిక్ 140 లేదా అంతకంటే ఎక్కువ, డయాస్టోలిక్ 90 లేదా అంతకంటే ఎక్కువ
ఇక సిస్టోలిక్ ప్రెజర్ 180, డయాస్టోలిక్ ప్రెజర్ 120 దాటితే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
* ఈ లెవెల్ దాటిందంటే స్ట్రోక్..
అధిక బీపీ (High BP) వల్ల స్ట్రోక్ వచ్చే ముప్పు పెరుగుతుంది. బ్రెయిన్‌లో రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఇది చివరకు ప్రాణాల మీదకు తెస్తుంది. బీపీ రీడింగ్ 130/80 mm Hg దాటిందంటే స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. అయితే, చాలా మంది కేవలం సిస్టోలిక్ ప్రెజర్ పైనే దృష్టి సారిస్తారు. కానీ, డయాస్టోలిక్ ప్రెజర్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. పై నంబర్ నార్మల్ రేంజ్‌లోనే ఉన్నా.. డయాస్టోలిక్ ప్రెజర్ లేకపోతే సమస్యలు తప్పవు.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.
































