ఓరి దేవుడో.. కొండల మధ్య బొజ్జ గణపయ్య.. వీడియో చూస్తే కళ్లు భైర్లు కమ్మాల్సిందే..

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయాలు ఉన్నాయి.. అయితే దట్టమైన అడవిలో కొలువైన బొజ్జ గణపతి మందిరం వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ గణపయ్య గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పదండీ..


ఈ మందిరం.. ఛత్తీస్‌గఢ్‌లోని ధోల్కల్ కొండపై ఉన్న 1,000 సంవత్సరాల పురాతనమైనది.. వినాయకుడికి హారతి ఇస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. ఓ భక్తుడు ఈ వీడియోను షేర్ చేసాడు.. అది ధోల్కల్‌ గణేష్‌ ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం బైలాడిలా పర్వత శ్రేణి దట్టమైన అడవిప్రాంతంగా కనిపిస్తుంది. చుట్టూ అద్భుతమైన కొండ.. కన్నుల విందును అందిస్తుంది.

అంత ఎత్తైన కొండపై వినాయకుడిని భక్తితో పూజిస్తున్నాడు పూజారి. ధూపదీప నైవేధ్యాలు సమర్పించి భూమి, ఆకాశాలకు సైతం నివేదిస్తున్నాడు. అతడు చేసే పూజలు చుట్టూ ఉన్న బండరాళ్లపై నిలబడి ఉన్న ప్రజలు భయపడుతూనే భక్తితో చూస్తున్నారు.. ఇక ధోల్కల్ గణేష్ అని పిలువబడే గణేశ మందిరం అనేక వందల సంవత్సరాల క్రితం కనుగొనబడింది. ఇది ‘ధోల్’ ఆకారంలో ఉన్న పర్వత శ్రేణిలో ఉంది. ఈ విగ్రహం 9వ లేదా 10వ శతాబ్దంలో నాగవంశీ రాజవంశం కాలంలో రూపొందించబడిందని నమ్ముతారు. ఆలయానికి చేరుకోవడానికి రహదారి అందుబాటులో లేనందున అటవీ మార్గం గుండా దాదాపు 40 నిమిషాల పాటు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది.. ఆ గణపతి పర్యాటకులను తెగ ఆకర్షిస్తున్నాడు.. రిస్క్ అయినా చాలా మంది అక్కడకు వెళ్తున్నారు. ఆ గణపతి మందిరం వీడియోను మీరు చూడండి..