మందులు అవసరం లేదు.. బీపీ నియంత్రణకు వీటిని తింటే చాలు..!

www.mannamweb.com


ప్రస్తుతం మనలో చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు (BP) ఒకటి. అధిక రక్తపోటుకు మన జీవనశైలిలో చోటుచేసుకునే కొన్ని మార్పులు కారణమవుతుంటాయి.

స్థూలకాయం, నిద్రలేమి, ఉప్పు అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడికి గురి కావడం వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల గుండె పోటు, కిడ్నీ సమస్యలు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందట. మన ఇంట్లో ఫుడ్ డైట్ ఫాలో అయితే చాలు బీపీ తగ్గించడంలో సహాయపడుతుంది. అవేంటో ఇప్పుడూ తెలుసుకుందాం.

ఖర్చూరాలు

ఖర్జూరాలు రక్తపోటు నియంత్రణలో సహాయపడే సహజ పదార్థాలుగా గుర్తించబడ్డాయి. వీటిలో ఎక్కువగా పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, ఇవి హై బీపీని తగ్గించడంలో సహాయపడతాయి. ఖర్జూరాలు తినడం వల్ల రక్తనాళాల శ్రేయస్సు మెరుగుపడుతుంది. ప్రతిరోజూ 3-4 ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

క్యారెట్లు..

క్యారెట్లను ప్రతిరోజు తినడం వల్ల హై బీపీని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. కారెట్లను సలాడ్‌గా, సూప్‌గా, లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

దాల్చిన చెక్క

దాల్చినచెక్క కేవలం మీ ఆహారానికి రుచిని కలపడమే కాదు, రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది. మీ రోజువారీ ఆహారంలో చిన్న మోతాదులో దాల్చినచెక్కను చేర్చడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

ఎండుద్రాక్షలు

ఎండుద్రాక్షలో పొటాషియం సమృద్ధిగా కలిగి ఉండటంతో, ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. వీటిని రోజుకు 10-15 తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇది రక్తనాళాల శ్రేయస్సును కూడా మెరుగుపరుస్తుంది.

అరటిపండ్లు

అరటిపండ్లు రక్తపోటును తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉన్న పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, మీకు మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉంటే, డాక్టర్‌ను సంప్రదించిన తర్వాత మాత్రమే అరటిపండ్లు తినండి.

వీటిని తినడం మాత్రమే కాకుండా, మీ జీవనశైలిలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పెద్ద ప్రయోజనాలను కలిగిస్తాయి. బీపీని అదుపులో ఉంచడానికి ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.