బీపీ మెడిసిన్ వాడే వాళ్లు ఈ విషయాలు పక్కాగా తెలుసుకోవాలి

www.mannamweb.com


బిపి ఉన్నవాళ్లు బీపీ మెడిసిన్స్‌ని ఎంత త్వరగా మొదలు పెడితే అంత త్వరగా గుండె సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు బారిన పడకుండా చూసుకోవచ్చని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

కానీ బీపీకి మందులు వాడుతున్న వాళ్ళు విధిగా కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలంటున్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ పీఎస్ వలీ.

మొట్టమొదట ఫాలో అవ్వాల్సింది రోజు క్రమం తప్పకుండా వాడాలి. రాత్రిపూట వాడాలని సూచించిన మందుల్ని రాత్రిపూట వాడాలి అలా కాకుండా తరచుగా మర్చిపోతూ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడం వల్ల మన శరీర వ్యవస్థలు కన్ఫ్యూజ్ అయిపోయే చాన్స్ ఉంది.
బిపి మెడిసిన్స్ వాడే వాళ్ళు తెలుసుకోవాల్సిన రెండో అంశం ఎప్పుడైనా విపరీతంగా విరేచనాలు అవుతున్నా, వాంతులవుతున్నా, లేక తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా… లో బీపీ వచ్చే అయ్యే ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి రోజుల్లో ఇంటిదగ్గర బీపీ చూసుకొని బిపి సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉంటే మాత్రమే బిపి టాబ్లెట్స్ వాడాలి.
ఆహారంలోఒక్కసారిగా విపరీతంగా మార్పులు చేసినా , బిపిలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆహారంలో పూర్తిగా ఉప్పు తగ్గించినా లేక ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నా క్రమం తప్పకుండా ఇంటి దగ్గర బీపీ చూసుకొని, బీపీలో వచ్చే మార్పులను వైద్యులకు తెలియజేసి వారి సలహా ప్రకారం బిపీకి మెడిసిన్స్ డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది.

పైన చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవ్వడం వల్ల బిపి టాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని మనం చాలా వరకు తగ్గించుకోగలం అని డాక్టర్ పీఎస్ వలీ తెలిపారు.