BP: బీపీతో బాధపడుతున్నారా.? ఈ మూడు పండ్లు తీసుకుంటే చాలు…

BP: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల అధికరక్తపోటు బారిన పడుతోన్న వారిక సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తోంది.


ఒక్కసారి రక్తపోటు వచ్చిందంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

ఇక రక్తపోటు మరెన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలతో పాటు, బ్రెయిన్ హెమరేజ్, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రక్తపోటును అదుపులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. మరి బీపీ అదుపులో ఉండాలంటే కచ్చితంగా కొన్ని రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కాలంతో సంబంధం లేకుండా లభించే పండు అయిన అరటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడే అరటి పండు రక్తపోటుకు దివ్యౌషధంగా ఉపయోగపడుతంది. ప్రతీరోజూ రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు తీసుకోవడం వల్ల మంచి నిద్రతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* రక్తపోటును అదుపులో ఉంచడంలో కివి కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా కివీలోని యాంటీ-ఆక్సిడెంట్లు, మినరల్స్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటితోపాటు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

* మామిడి పండు కూడా రక్తపోటును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా మామిడి తీసుకోవాలని అంటున్నారు. ఇందులో ఉండే బీటా కెరోటిన్, ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఈ రెండు అంశాలు ఆరోగ్యానికి మేలు చేసే బీపీని నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.