పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి.. లక్షణాలు ఇవే

www.mannamweb.com


ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఎక్కువగా అందరినీ కలవరానికి గురిచేస్తున్న వ్యాధుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒకటి. బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది.

లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి వాటి కారణంగా వ్యాధుల తీవ్రత బాగా పెరిగిపోయింది.

అయితే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి 15 ఏళ్ల లోపు చిన్నారులు, 20, 30 ఏళ్లలో ఉండే యువతకి కూడా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని, శరీరంలో ఎలాంటి మార్పులు కనిపించినా వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

బ్రెయిన్‌కి రక్త సరఫరగా సరిగ్గా జరగకపోయినా, రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడినా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మెదడు కణాలు దెబ్బతిని మెదడు పని తీరు తగ్గిపోతుంది. అయితే ముందుగానే ఈ వ్యాధి లక్షణాలను కనుగొనవచ్చట.

అంత ేకాకుండా ఒక్కోసారి చూపు కోల్పోవడం, తలనొప్పి వీపరీతంగా రావడం, శరీర నొప్పులు రావడం వంటివి కూడా బ్రెయిన్ స్ట్రోక్ కిందకు వస్తాయి. కాబట్టీ ఈ లక్షణాలు ఎవరిలో కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)