బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌, చీజ్‌ తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..

www.mannamweb.com


గజిబిజీ జీవితంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్‌ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే హడావుడిగా బ్రెడ్ తింటూ పనుల్లోకి వెళ్లిపోతుంటారు.

బ్రెడ్‌లో చీజ్‌ కలుపుకొని తింటుంటారు. ముఖ్యంగా చిన్నారులు చీజ్‌, బ్రెడ్‌ను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్రెడ్‌, చీజ్‌లను కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బ్రెడ్‌, చీజ్‌ కలిపి తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* చీజ్‌లో సోడియం కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో చీజ్‌ను ఎక్కువగా తీసుకుంటే.. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక చిన్న చీజ్‌ ముక్కలో దాదాపు 200 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది.

* చీజ్‌ ముక్కలు చక్కనైన ఆకృతి, స్మూత్‌గా ఉండడానికి వాటిలో కొన్ని రకాల కెమికల్స్‌ కలుపుతారు. వీటిలో ఎమల్సిఫైయర్‌లు, స్టెబిలైజర్‌లతో పాటు కృత్రిమ రంగులను జోడిస్తారు. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలుకు దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు వంటి సమస్యలకు దారి తీస్తుంది.

* చీజ్‌లో ప్రాసెస్ చేసిన కొవ్వులను కలుపుతారు. ఇవి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. టైప్‌ 2 డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* నేచురల్‌ జున్నుతో పోల్చితే చీజ్‌ ముక్కల్లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రోబయోటిక్స్ వంటి తక్కువ ముఖ్యమైన సమ్మేళనాలు ఉంటాయి.

* జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా చీజ్‌ దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే చీజ్‌ తినడం వల్ల మలబద్ధకం సమస్య వచ్చే అకాశం ఉంటుంది. అందులోనూ మైదా ఎక్కువగా ఉండే బ్రెడ్‌తో తింటే మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.