ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల నెట్ వర్క్ అసోసియేషన్(AP Specialty Hospitals Network Association) (ఆషా) సంచలన నిర్ణయం తీసుకుంది. పెండింగ్ బిల్లుల(Pending Bills) విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది.
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు(NTR Medical Service Trust) కింద అందిస్తున్న అన్నీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం కొనసాగించమని తెగేసి చెప్పింది. దీంతో ఈ రోజు ఉదయం నుంచే ఆయా నెట్ వర్క్ ఆస్పత్రుల్లో చికిత్సలను అందించడంలేదు.
మరోవైపు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యం కొనసాగించాలని ప్రభుత్వం కోరుతోంది. కానీ బిల్లులు చెల్లించాల్సిందేనని ఆషా పట్టుబట్టింది. ఇప్పటి వరకూ రూ. 3,500 కోట్ల విలువైన బిల్లులు చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే వైద్యం కొనసాగిస్తామని చెబుతోంది.
ప్రస్తుతానికి నెట్ వర్క్ ఆస్పత్రుల్లో చికిత్సలు నిలిపివేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా లబ్ధిపొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, ఆషా నిర్వాహకులు చర్చించుకుని చికిత్సలు కొనసాగించాలని కోరుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.