Breaking : ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా

www.mannamweb.com


తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసు తదుపరి విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జూలైకి వాయిదా వేసింది. కాగా, ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు నుండి భోపాల్ హైకోర్టు బెంచ్‌కు బదిలీ చేయాలని ఫిబ్రవరిలో బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ ఆలీ, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కేసులో నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ఈ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ప్రతివాదులు కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో విచారణను జూలైకి వాయిదా వేసింది.