BSNL రోజు రోజుకి ప్రజాదరణ పెంచుకుంటూ పోతుంది. తాజాగా కొన్ని కొత్త సర్వీసులని తీసుకు రాగా అవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వాటి వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. యూజర్లకు సేఫ్ గా మొబైల్ సర్వీసెస్ ని అందించేందుకు స్పామ్ కాల్స్ ని ఆటోమేటిక్గా బ్లాక్ చేసే టెక్నాలజీని తీసుకొచ్చింది BSNL. దీని ద్వారా యూజర్లకు అనవసరమైన కాల్స్ రాకుండా ఉంటాయి. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ 500 కి పైగా లైవ్ ఛానల్స్, పే టీవీ ఆప్షన్‌లతో కూడిన కొత్త ఫైబర్ టీవీ సర్వీసును తీసుకొచ్చింది. ఈ సర్విస్ లో ఫైబర్ ఇంటర్నెట్ సబ్‌స్కైబర్లు అందరూ కూడా తక్కువ ఖర్చుతో ఏకంగా 500 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్ చూడొచ్చు. ఇందులో మరో స్పెషాలిటీ ఏంటంటే టీవీ స్ట్రీమింగ్ కోసం వాడే డేటా నెలవారీ ఇంటర్నెట్ డేటా కిందకి రాదు. అంటే టీవి స్ట్రీమింగ్ డేటా సపరేట్ గా వస్తుంది.
అలాగే ఫైబర్ ఇంటర్నెట్ యూజర్స్ కోసం ఫ్రీ Wi-Fi రోమింగ్ సర్వీస్ ని తీసుకొచ్చింది BSNL. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లు దేశంలో ఎక్కడికి వెళ్లినా కూడా BSNL హాట్‌స్పాట్ తో ఫ్రీగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. అందువల్ల యూజర్లకు డేటా ఖర్చులు తగ్గుతాయి. ఇది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇక వీటితో పాటు యూజర్స్ సిమ్ కార్డ్‌ల మెయిన్టెనెన్స్ ల కోసం ఆటోమేటెడ్ కియోస్క్ (KIOSK)లను స్టార్ట్ చేయనుంది. ఈ కియోస్క్‌లతో కస్టమర్లు BSNL సిమ్ కార్డ్‌లను చాలా ఈజీగా కొనుక్కోవచ్చు. BSNL సిమ్ కొనాలనుకునే యూజర్లకు 24 అవర్స్ అందుబాటులో ఉండేలా ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. అలాగే సిమ్‌లను ఈజీగా అప్‌గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే C-DAC సహాయంతో మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ ని సింపుల్ చేసేందుకు డీ2డీ టెక్నాలజీ, 5జీ నెట్‌వర్క్‌ను అందిస్తుంది BSNL.
అలాగే దేశంలో ఫస్ట్ డైరెక్ట్ టు డివైస్ (D2D) కనెక్టివిటీని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ సర్వీస్ శాటిలైట్, మొబైల్ నెట్వర్క్ లను ఇంటర్కనెక్ట్ చేస్తుంది. ఈ అప్డెటెడ్ కనెక్టివిటీ ఎమర్జెన్సీ కాల్స్, కనెక్ట్ లేని ప్రాంతాల్లో డిజిటల్ సర్వీస్ లని సులభంగా అందించగలదు. ఇక BSNL సబ్‌స్క్రైబర్‌ల కోసం అద్భుతమైన e-auction ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌లను పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ నంబర్లను మనం e-auction లో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆక్షన్ చెన్నై, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో జరుగుతోంది. ఈ సర్వీస్ త్వరలో మరిన్ని ప్రాంతాల్లోకి రానుంది.