ఆ బ్యాంకుల్లో కార్ల లోన్లపై బంపర్ ఆఫర్లు.. ఇక కార్లకొనుగోదారులకు పండగే

www.mannamweb.com


పండగల సీజన్ వచ్చేసింది. వినాయక చవితి, విజయదశమి, దీపావళితో సందడి మొదలుకానుంది. ఈ పండగ సమయంలో ప్రతి ఒక్కరూ కొత్త వస్తువులను కొనటానికి ప్రణాళిక వేసుకుంటారు.

ముఖ్యంగా మోటారు సైకిళ్లు, కార్లను కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. ఈ పండగల సీజన్ లో కార్ల కంపెనీలు వివిధ రకాల ఆపర్లను ప్రకటిస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేసి పండగ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకులు సైతం తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పాయి. కొత్త కార్లను కొనుగోలు చేయడానికి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఐదేళ్ల కాలపరిమితితో రూ.ఐదు లక్షల రుణాన్ని 8.45 నుంచి 9 శాతం వడ్డీకి అందజేస్తున్నాయి. కొత్త కారు కొనుగోలు కోసం వివిధ బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. ఐదేళ్ల కాలపరిమితికి రూ.ఐదు లక్షలను అందిస్తున్నాయి. ఆగస్టు 14వ తేదీ నాటికి కారు రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో? ఓ లుక్కేద్దాం.

కారు లోన్లపై వడ్డీరేట్లు ఇలా

యూకో బ్యాంకు కారు లోన్ పై 8.45 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.10,246 చెల్లించాలి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త కార్ల రుణాలపై 8.7 శాతం వడ్డీ విధిస్తున్నాయి. రుణగ్రహీతలు ప్రతినెలా రూ.10,307 చొప్పన వాయిదా చెల్లించాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లు ఇస్తున్న రుణాలపై 8.75 శాతం వడ్డీ ఉంటుంది. ప్రతినెలా ఈఎంఐగా రూ.10,319 చొప్పున చెల్లించాలి.
ఐడీబీఐ బ్యాంక్ లో కారు రుణానికి 8.8 శాతం వడ్డీ వసూలు చేస్తారు. నెలవారీ వాయిదా రూ. 10,331 ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లు 8.85 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈఎంఐగా రూ. 10,343 చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొత్త కార్ లోన్‌పై 8.90 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తారు. ఇక్కడ రూ. 10,355 చొప్పున ఈఎంఐ కట్టాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కారు రుణాలపై 8.95 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ప్రతినెలా రూ. 10,367 వాయిదా చెల్లించాల్సి ఉంటుంది.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లో 9 శాతం వడ్డీ ఉంటుంది. ప్రతినెలా ఈఎంఐగా రూ.10,379 కట్టాలి.
ఐసీఐసీఐ బ్యాంక్ లో 9.10 శాతం వడ్డీ, ఈఎంఐగా రూ. 10,403 చొప్పున వసూలు చేస్తారు.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో 9.20 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. రుణ గ్రహీతలు ఈఎంఐగా రూ. 10,428 చొప్పున కట్టాలి.