అలెర్ట్.. రేపు రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్

స్సుల్లో ప్రయాణించే మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులకు బిగ్ అలెర్ట్. జులై 8 న రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిపివేస్తూ కార్మిక సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.


దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేదు. కేరళలోని ప్రజలకు ఆ రాష్ట్ర కార్మికుల సంఘం కీలక ప్రకటన చేసింది. పలు డిమాండ్స్ కారణంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రేవేటు బస్సులను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

కేరళలోని ప్రజలకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ప్రైవేటు బస్సు నిర్వాహకులు జులై 8న బంద్ కు పిలుపునిచ్చారు. పలు డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రేవేటు బస్సుల యాజమాన్యం నిర్ణయంతో బస్సుల్లో ప్రయాణించే మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పేలా లేదు.

తమ డిమాండ్స్ ను పరిష్కరించాలంటూ ప్రైవేటు బస్సుల యాజమాన్యం.. రాష్ట్ర రవాణాశాఖ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో జులై 8న బంద్ కు పిలుపునిచ్చారు. తమ పెర్మిట్ లను టైమ్ ప్రకారం రెన్యూవల్ చేయాలి, స్టూడెంట్ బస్ టికెట్ ధరలను పెంచాలి, పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్స్ తప్పనిసరి నియమాన్ని ఎత్తివేయాలి.. లాంటి పలు డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే ఈ డిమాండ్స్ కు రవాణాశాఖ ఓకే చెప్పలేదు. దీంతో జులై 8న బస్సులు నిలిపివేస్తున్నట్లు బస్సు ఓనర్స్ జాయింట్ కమిటీ ప్రకటించింది.

అయితే తమ డిమాండ్స్ పరిష్కరించకపోతే జులై 22 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభిస్తామని ప్రేవేట్ బస్సు ఓనర్స్ జాయింట్ కమిటీ ప్రకటించింది. తమ డిమాండ్స్ ను పరిష్కరించాలంటూ ప్రైవేటు బస్సుల యాజమాన్యం.. రాష్ట్ర రవాణాశాఖ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో జులై 8 న ఒక్కరోజు సమ్మె నిర్వహించాలని తీర్మానించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బట్టి జులై 22 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభిస్తామని కమిటీ హెచ్చరించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.