ప్రస్తుతం వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటున్నారు.
ఇందుకోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ కోసం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..
ప్రస్తుతం చాలా మంది ఇల్లలో ఇన్‌స్టాంట్ ఇడ్లీ పౌడర్‌ను ఉపయోగిస్తున్నారు. బిజీ లైఫ్ కారణంగా ఇలాంటి ఇడ్లీ పౌడర్లకు భలే డిమాండ్ ఏర్పడుతుంది. మరి ఈ ఇడ్లీ మిక్స్ తయారీని వ్యాపారంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇడ్లీ మిక్స్‌ను ఎలా తయారు చేస్తారు.? దీని వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ రవ్వ తయారు చేయడానికి.. పెద్దగా స్థలం అవసరం కూడా లేదు. ఇంట్లో ఒక పెద్ద గది ఉన్నా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలాగే ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఇడ్లీ రవ్వ తయారీ మిషన్ అవసరపడుతుంది. మీ బిజినెస్ కెపాసిటీ ఆధారంగా ఈ మిషిన్ సైజ్‌ను ఎంచుకోవచ్చు. ప్రారంభంలో ఉపయోగించే మిషన్ ధర రూ. 50,000గా ఉంటుంది. పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించాలంటే రూ. 5 లక్షల వరకు మిషిన్స్ అందుబాటులో ఉంటాయి. ఇక ఇడ్లీ మిక్స్ తయారీకి కావాల్సిన వాటిలో ప్రధానంగా బియ్యం కావాలి.
అలాగే మీ సొంత బ్రాండింగ్‌తో ఇడ్లీ రవ్వను ఉత్పత్తి చేయాలనుకుంటే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, లోకల్ మున్సిపల్ పర్మిషన్‌తో పాటు జీఎస్‌టీ అవసరం ఉంటుంది. ఇక ఇడ్లీ రవ్వ తయారీ విషయానికొస్తే. బియ్యాన్ని 8 గంటల పాటు నీటిలో నానబెట్టి ఆ తర్వాత బాగా ఆరబెట్టుకోవాలి. పొడిగా తయారైన బియ్యాన్ని మిషిన్స్‌లో వేసుకోవాలి. మిషిన్‌లో ఉండే బ్లేడ్స్ ఆధారంగా ఉప్పా రవ్వ, ఇడ్లీ రవ్వను తయారు చేసుకోవచ్చు. అనంతరం రవ్వను ప్యాక్ చేసి విక్రయించుకోవచ్చు.
లాభాల విసయానికొస్తే.. ఒక కేజీ ఇడ్లీ రవ్వను తయారు చేయడానికి సుమారు రూ. 25 ఖర్చు అవుతుంది. అయితే ప్రస్తుతం కేజీ ఇడ్లీ రవ్వ సుమారు రూ. 45 నుంచి రూ. 50 వరకు ఉంటుంది. ఈ లెక్కన కిలో రవ్వపై తక్కువలో తక్కువలో హోల్‌సేల్‌లో విక్రయించినా కిలో ఇడ్లీ రవ్వపై రూ. 10 లాభం వస్తుంది. దీనిబట్టి మీ లాభాలు ఉంటాయి. ఇందుకోసం ముందుగా మీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవాలి. స్థానికంగా ఉండే హోటల్స్‌తో పాటు, దుకాణాలను సంప్రదించి విక్రయించుకోవడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు.