మీకు సెంటు భూమి అందుబాటులో ఉంటే చాలు. ఈ ఐడియాతో ఈజీగా కోటీశ్వరులు అయిపోతారు. అందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు. ఇంట్లోనే దర్జాగా కూర్చుని సంపాదించుకోవచ్చు. అదేంటో తెలుసుకోండి..
ఈ కాలంలో డబ్బు సంపాదన ఎంత కష్టమో.. ఖర్చు చేయడం అంత సులభం. నెలంతా ఒళ్లు హూనం చేసుకుని పనిచేస్తే జీతం రాగానే రెండు రోజుల్లోనే సంపాదన మొత్తం హుష్ కాకి అయిపోతుంది. అన్ని వస్తువుల ధరలకు రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నా సంపాదన మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. వర్క్ టెన్షన్స్, ఒత్తిడి ఉండనే ఉంటాయి. ఆఫీస్‌లో బాస్‌తో చీవాట్లు తినేకంటే ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అనుకునేవారు బోలెడు. కాకపోతే, ఏ వ్యాపారం చేయాలి అనే అవగాహన ఉండదు. ధైర్యం చేసి జాబ్ వదులుకుని బిజినెస్‌లోకి దిగినా నష్టాలొస్తే ఎలా అనే భయమూ ఉంటుంది. సేఫ్ సైడ్ తక్కువ పెట్టుబడితో పార్ట్ టైంగా మంచి ఆదాయం వచ్చే వ్యాపారం ఏంటా అని వెతికేవాళ్లకి ఈ ఐడియా బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం, మీరు జస్ట్ సెంటు భూమి ఏర్పాటు చేసుకుంటే చాలు. సొంతమైతే మరీ మంచిది. ఇంట్లోనే కూర్చున్నా నెలకే లక్షల్లో ఆదాయం అందుకోవచ్చు..
బంగారం, వెండి ధరలు ఏ రోజుకా రోజు ఎలా మారిపోతుంటాయో పెట్రోల్, డీజిల్ ధరలూ అంతే. ఎప్పటికప్పుడూ నంబర్ పైకి వెళ్లడమే తప్ప కిందకి దిగడం అంటూ ఉండదు. ఇక బైక్, కారు లేనివాళ్లు నేటికాలంలో అరుదు. కాబట్టి, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ పెట్రోల్, డీజిల్ నిత్యావసరాల్లో ఒకటిగా మారిపోయాయి. వీటితో పాటు సీఎన్‌జీ ధర కూడా పెరుగుతోంది. అందుకే ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రజలు. ఇందుకోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరమూ లేదు. వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు కాబట్టి ప్రభుత్వాలు ఈవీల వాడకాన్ని ప్రమోట్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ-రిక్షాలు విరివిగా వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు నడవాలంటే ఛార్జింగ్ తప్పనిసరి. బయటికి వెళ్లినపుడు దారి మధ్యలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్‌కు ఎలా వెళతారో.. ఈవీల్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఓ పవర్ స్టేషన్ తప్పనిసరిగా అవసరం పడుతుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ (EV ఛార్జింగ్ స్టేషన్).
ఇప్పుడిప్పుడే ఈవీల వాడకం జోరందుకుంటోంది. కాబట్టి మీరు గనక రోడ్డు పక్కన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభిస్తే.. కాసులు కురవటం ఖాయం. ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు 50 నుండి 100 చదరపు గజాల ఖాళీ ప్లాట్ ఉంటే చాలు. గ్రామం, పట్టణం, నగరం ఇలా ఎక్కడైనా సరే ఖాళీ స్థలం మీ పేరు మీద ఉంటే చాలు. లేకపోతే 10 సంవత్సరాలు లీజుకు తీసుకోండి.
ఈవీ స్టేషన్ వ్యాపారం ప్రారంభించేందుకు ఇవి అవసరం..
ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే ఆసక్తి ఉంటే కొన్ని అనుమతులు తప్పనిసరి. మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖ,అటవీ శాఖల నుంచి NOC సర్టిఫికేట్ తీసుకోవాలి. ఛార్జింగ్ స్టేషన్‌లో కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్, రాకపోకలకు కోసం తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి. త్రాగునీరు, రెస్ట్ రూం, అగ్నిమాపక యంత్రం, వెంటిలేషన్, వాష్ రూం వంటి ప్రాథమిక సౌకర్యాలు కచ్చితంగా అందుబాటులో ఉంచాలి.
ఎంత పెట్టుబడి కావాలంటే..
సామర్థ్యాన్ని బట్టి EV ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటుకు 40లక్షలు లేదా అంతకంటే తక్కువే ఖర్చవుతుంది. మినిమం కెపాసిటీ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ఇన్‌స్టాల్ చేస్తే రూ.15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు.
రోజుకు కనీసం రూ.10000 సంపాదన..
ఉదాహరణకు 4000 KW ఛార్జింగ్ స్టేషన్‌ను ఇన్‌స్టాల్ చేశారని అనుకుందాం. మామూలుగా ప్రతి కిలోవాట్‌కి 2.5రూపాయలు వస్తుంది. ఈ లెక్కన ఒక్క రోజులో రూ.10,000లు ఈజీగా సంపాదించవచ్చు. అదే నెలలో అయితే రూ.3లక్షల వరకూ వస్తుంది. అన్ని ఖర్చులూ పోగా రూ.2 లక్షలు మీ ఖాతాలో పడిపోతుంది. అయితే, EV ఛార్జింగ్ స్టేషన్ సామర్థ్యం ఎంతుంది అనే దానిపైనే మీ ఆదాయం ఆధారపడి ఉంటుంది.