కొంచెం ఆలోచించి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటే చాలు.. ఎన్నో లాభాలు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న చిత్రం అలాంటిదే! నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన యాదవరెడ్డి తన ఇంటి ఆవరణలోని రెండున్నర గుంటల స్థలాన్ని చదును చేసుకున్నారు.
అందులో మూడు నెలల కిందట క్యాబేజీ, కొత్తిమీర సాగు చేపట్టారు. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో ఇంటి ఆవరణ ఇలా పచ్చగా కళకళలాడుతోంది. మరికొన్ని రోజుల్లో చేతికి వచ్చే క్యాబేజీ, కొత్తిమీరను విక్రయించడం ద్వారా ఆదాయం రానుందని యాదవరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
































