మండే ఎండాకాలం రానే వచ్చింది. ఇప్పటికే ఏసీలు ఉన్న వాళ్లంతా దుమ్ము దులిపి వాటిని ఆన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇల్లు చల్లగా ఉండాలన్నా.. ప్రశాంతంగా నిద్రపోవాలన్నా ఇప్పుడు వస్తున్న 43 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోవాలంటే కచ్చితంగా ఏసీ, కూలర్లు ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే చాలామంది సమ్మర్ వచ్చిన తర్వాత ఏసీలు కొనాలి అని ఫిక్స్ అవుతూ ఉంటారు. కొనాలని ఫిక్స్ అయ్యాక వారి మైండ్ సవాలక్ష ప్రశ్నలు వస్తాయి. ఎలాంటి ఏసీ కొనాలి? ఎంతలో కొనాలి? ఎంత కెపాసిటీ ఉన్న ఏసీ కొనాలి? అసలు ఏ ఏసీ మంచిది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. మరి.. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
ఏసీ కొనే ముందు మీరు మీ అవసరాన్ని తెలుసుకోవాలి. మీరు ఇంటి కోసం ఏసీ కొంటున్నారా? ఆఫీస్ కోసం ఏసీ కొంటున్నారా? ఆఫీస్ కోసం కొనే ఏసీలు కెపాసిటీ ఎక్కువ ఉండాలి. ఎక్కువ స్టార్ రేటింగ్ ఉండేవి మంచిది. ఎక్కువ సంవత్సరాలు వారెంటీలు ఇచ్చే ఏసీలను కొనుగోలు చేయాలి. అదే ఇంటికి అయితే చాలానే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ మీ బడ్జెట్ ఎంత అనేది నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఆ బడ్జెట్ లో ఉన్న మోడల్స్ ని వెతకాలి. ప్రస్తుతం ఏసీ అంటే 35 వేలకు తక్కువలో ఉండటం లేదు. ఏసీ కొనే సమయంలో మీ గది పరిమాణం ఎంతో తెలుసుకోవాలి. ఆ గది సైజ్ ని బట్టి మీరు ఎంత కెపాసిటీలో ఏసీ కొనాలో ఫిక్స్ అవ్వాలి. మీ గది కాస్త చిన్నదే అయితే 1 టన్ ఏసీ సరిపోతుంది. 250 స్వేర్ ఫీట్ ఉండే గది అయితే 1.5 టన్ తీసుకోవచ్చు. అదే మీరు హాల్ లో ఏసీ పెట్టుకోవాలి అన్నా, 350 స్క్వేర్ ఫీట్ గది అయినా 2 టన్ ఏసీ తీసుకోవాల్సి ఉంటుంది.
కెపాసిటీ తర్వాత ఇన్వర్టర్ చూసుకోవాలి. మీరు ఏసీ కొనే సమయంలో ఇన్వర్టర్ ఏసీనో కాదో తెలుసుకోవాలి. అందులోనూ స్టాండర్డ్ ఇన్వర్టర్ కాకుండా ఇప్పుడు మార్కెట్ లోకి వస్తున్న డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీలను కొనుగోలు చేస్తే మంచిది. ఇవి సింగిల్ ఇన్వర్ట్ తో పోలిస్తే.. డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీలు ఎక్కువ చల్లదనాన్ని కూడా ఇస్తాయి. పవర్ వాడకం కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత మీరు స్టార్ రేటింగ్ చూసుకోవాలి. నో స్టార్ ఏసీలు, 1 స్టార్, 2 స్టార్ అంటూ 5 స్టార్ వరకు రేటింగ్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే దీనిలో స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే.. మీకు పవర్ బిల్ అంత తక్కువ వస్తుంది. అలాగే స్టార్ పెరిగే కొద్దీ ఏసీ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తక్కువ బడ్జెట్ లో మీరు ఏసీ ప్లాన్ చేస్తే 3 స్టార్ ఏసీ తీసుకోవడం మంచిది.
3 స్టార్ ఏసీకి 5 స్టార్ ఏసీకి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ధర పెరుగుతుంది. కాస్త తక్కువగా వాడే వాళ్లు అయితే 3 స్టార్ ఏసీ సరిపోతుంది. వీటి తర్వాత మీరు సర్వీస్ గురించి తెలుసుకోవాలి. ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అలాగే వారంటీ గురించి కచ్చితంగా అడిగి తెలుసుకోండి. పీసీబీ వారెంటీ 5 ఏళ్లు, ఇన్వర్టర్ కంప్రెసర్ వారెంటీ 10 ఏళ్లు ఉంటే చాలా మంచిది. ధర తక్కువ అని పీసీబీ వారెంటీ తక్కువ ఉన్న ఏసీలను కొనుగోలు చేయకండి. ఇది 2024 కాబట్టి ఈ ఏడాది మోడల్స్ కొనాలి అనేం లేదు. ఎందుకంటే ఏసీ ఇయర్ మారే కొద్దీ పెద్దగా ఏం ఛేంజెస్ రావు. 2023 ఏసీ అయినా కాస్త తక్కువ ధరలో వస్తే తీసుకోవచ్చు. మీ కోసం ఇ-కామర్స్ సైట్స్ లో బాగా అమ్ముడవుతున్న కొన్ని ఏసీల వివరాలు ఇచ్చాం. నచ్చితే ఆ లింక్ క్లిక్ చేసి కొనేసుకోండి.
- రూ.30 వేలకే లాయిడ్ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
- రూ.33 వేలకే లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
- రూ.37 వేలకే LG 1.5 టన్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
- రూ.37 వేలకు పానసోనిక్ 1.5 టన్ 3 స్టార్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ.. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.