ఇంట్లో కొత్త క్యాలెండర్ పెడుతున్నారా? అక్కడ తగిలించారంటే ఏడాదంతా దరిద్రమే

www.mannamweb.com


మరికొన్ని గంటల్లో కొత్త ఏడాది 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ కొత్త ఆశలు,కొత్త కోరికలు,కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు.

కొత్త సంవత్సరం ప్రారంభంలో చాలా మంది వివిధ మతపరమైన ఆచారాలను పాటిస్తారు. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం సమయంలో కొందరు చేసే ఒక్క చిన్న పొరపాటు వాళ్ల ఏడాది మొత్తాన్ని నాశనం చేస్తుంది. దీంతో వారు జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొత్త ఏడాది ప్రారంభ సమయంలో ఏ ఇంట్లో చూసిన,ఆఫీసులో లేదా షాపులో ఇలా ఎక్కడ చూసిన కొత్త ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు కనిపిస్తుంటాయి. ఆఫీసులలో ఇచ్చినవో,లేదా కొనుగోలు చేసిన క్యాలెండర్లను తెచ్చి ఇంట్లో లేదా షాపులో గోడలకు తగిలిస్తుంటాం. పాత క్యాలెండర్లను తొలగించి వాటి ప్లేస్ లో కొత్త క్యాలెండర్లు పెట్టడం ప్రతి ఏటా జరుగుతూనే ఉంటది. అయితే ఇక్కడే చాలామంది తమకు తెలియకుండానే పెద్ద పొరపాటు చేస్తుంటారు.

క్యాలెండర్ తేదీని మార్చేది మాత్రమే కాదు..క్యాలెండర్ వాస్తుతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. కేవలం క్యాలెండర్‌ ను ఉంచడం వల్ల ఫలితం ఉండదు. నిర్దిష్ట సమయం,నిర్దిష్ట ప్రదేశం,నిర్దిష్ట దిశలో దాని ఏర్పాటు ఉండాలి. అప్పుడే కొత్త క్యాలెండర్ మీకు మంచి ఫలితాలను అందిస్తుంది.

క్యాలెండర్ పెట్టడానికి సరైన సమయం

క్యాలెండర్ మార్చడానికి ఉదయం సరైన సమయం అని వాస్తు పండితులు చెబుతున్నారు. సూర్యోదయం అయిన వెంటనే క్యాలెండర్ మార్చుకోగలిగితే అన్నింటికన్నా ఉత్తమమని తెలిపారు. అయితే మధ్యాహ్నం తర్వాత క్యాలెండర్‌ ను మార్చకూడదు. అదేవిధంగా బుధవారం, శుక్రవారం క్యాలెండర్ మార్పులకు అనువైనవి. ఈ సంవత్సరం జనవరి మొదటి రోజు బుధవారం వస్తుంది.

గోడను ఇలా ఎంచుకోండి

క్యాలెండర్‌ను వేలాడదీయాలంటే ఇంటి శుభ్రమైన గోడను ఎంచుకోవాలి. విరిగిన లేదా అపరిశుభ్రమైన గోడలపై క్యాలెండర్లు ఉంచకూడదు.

ఏ దిశలో క్యాలెండర్ ఉంచాలి

క్యాలెండర్లను ఉంచడానికి తూర్పు, ఉత్తర దిక్కు గోడలు అనువైనవి. ఈ దిశలు పాజిటివిటీ, శ్రేయస్సు వైపు చూపుతాయి. అలాగే పాత సంవత్సరం ముగిసిన వెంటనే పాత క్యాలెండర్‌ను తొలగించాలి. అలా చేయడం మర్చిపోతే అది భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాకుండా గదిలో చెరిగిపోయిన లేదా పాడైపోయిన,పాత క్యాలెండర్లు ఏవైనా ఉంటే వెంటనే వాటిని తొలగించండి. అవి ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పెరుగుతుందని వాస్తు నిపుణులు తెలిపారు.

గడియారం, క్యాలెండర్

క్యాలెండర్,గోడ గడియారాన్ని కలిపి ఉంచకూడదు. ఎందుకంటే ఇది సమయం, డబ్బు పరిమితిని సూచిస్తుంది.