షుగర్ పేషెంట్లు బంగాళదుంప తినవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

www.mannamweb.com


బంగాళదుంపలు అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. వీటితో చేసే స్నాక్స్ అయితే తిరిగే ఉండదు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌లో ఆలూతో చేసిన స్నాక్స్ వడ్డిస్తారు.

చికెన్ రుచితో పోటీ పడి మరీ వీటి రుచి ఉంటుంది. వీటితో కూరలు, వేపుళ్లు ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి.

ఇంత రుచిగా ఉండే బంగాళ దుంపల్ని మాత్రం షుగర్ పేషెంట్స్ తినాలంటే భయ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ లెవల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆలుగడ్డలను తింటే బ్లడ్‌లోని షుగర్ లెవల్స్ అనేవి అమాంతం పెరిగిపోతాయని అనుకుంటారు.

కానీ మధుమేహం ఉన్నవారు ఎలాంటి డౌట్ లేకుండా ఆలు గడ్డలను తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో షుగర్ లెవల్స్ పెరుగుతాయన్న భయం లేదని అంటున్నారు. మరీ ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో తీసుకోవచ్చని తాజాగా అధ్యయనాల్లో వెల్లడైంది

షుగర్ ఉన్నవారు బంగాళ దుంపల్ని తినాలి అంటే ఉడక బెట్టి మాత్రమే తీసుకోవాలట. అంటే వీటితో చేసిన వేపుళ్లు, కూరలు, చిప్స్ వంటివి తీసుకోకూడదు. వీటిని ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం లేదని అంటున్నారు. అది కూడా స్వల్ప మోతాదులోనే తీసుకోవాలని చెబుతున్నారు.

ఉడికించిన బంగాళ దుంపలతో ఆలూ పరోటాలు కూడా తయారు చేసుకుని ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి. అంతే కానీ చిప్స్, రోస్ట్ వంటి కర్రీలు తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా ఉడికించిన ఆలు గడ్డలను తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరగవని అంటున్నారు.