షుగర్‌ పేషెంట్స్‌ ఈ పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే.

www.mannamweb.com


డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లో ఈ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారినపడితే పూర్తిగా కోలుకోవడం చాలా కష్టంతో కూడుకున్న విషయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందుకే డయాబెటిస్‌ బారిన పడిన వారు తమ జీవనశైలిని పూర్తిగా మార్చుకుంటారు. తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానం వరకు అన్నింటిలో మార్పులు చేసుకుంటారు.

ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కొన్ని అపోహలు ఉంటాయి. ఏది తిన్నాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. తినాలని ఎంతో కోరిక ఉన్నా.. డయాబెటిస్‌ ఉందన్న విషయం గుర్తొచ్చి వెనుకడుగు వేస్తుంటారు. అయితే డయాబెటిస్‌ బాధితులు దూరంగా ఉండాల్సిన కొన్ని పండ్లు ఏంటి.? వాటివల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

షుగర్‌ పేషెంట్స్‌ దూరంగా ఉండాల్సిన పండ్లలో అరటి ఒకటి. అరటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే షుగర్‌ ఉన్న వాళ్లు మాత్రం అరటికి దూరంగా ఉండడమే ఉత్తమం. అరటిపండ్లలో ఉండే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది కాబట్టి వీరు అరటికి దూరంగా ఉండడమే మంచిది. షుగర్‌ పేషెంట్స్‌ ద్రాక్షకు కూడా వీలైనంత వరకు దూరంగా ఉండడమే మంచిది. ఇందులోని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ షుగర్‌ లెవల్స్‌ పెరగడానికి కారణమవుతుంది.

షుగర్‌ పేషెంట్స్‌కి మామిడి కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎన్నో మంచి గుణాలు ఉండే మామిడి డయాబెటిస్‌ బాధితులపై మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. ఇందులోని నేచురల్‌ షుగర్స్‌ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పైనాపిల్‌ కూడా డయాబెస్‌ బాధితులకు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. నారిజం పండ్లు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో వాటర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుందని తెలిసిందే. అయితే షుగర్‌ పెషేంట్స్‌ వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మితంగా తీసుకుంటే మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.