క్యాన్సర్‌కు కారణం ఈ రెండు పదార్థాలే.. తినడం మానేస్తే వ్యాధి అస్సలు రాదు

www.mannamweb.com


ఈ రోజుల్లో క్యాన్సర్ పేరు వింటేనే చాలామందికి వణుకు పుడుతోంది. ఎందుకంటే ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ఇది. ఎంతోమంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
కానీ, కొన్ని సాధారణ జాగ్రత్తలతో ఈ భయంకరమైన వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ డైటీషియన్ నికోల్ ఆండ్రూస్, ఇటీవల ఒక వైరల్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో క్యాన్సర్‌కు సంబంధించిన షాకింగ్ నిజాలు బయటపెట్టారు. మనం రోజూ తినే ఆహారంలోనే క్యాన్సర్ రిస్క్‌ను పెంచే రెండు ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయని ఆమె హెచ్చరించారు. అవేంటో చూద్దాం.

క్యాన్సర్‌కు ముఖ్యమైన ప్రమాద కారకాలు ఆల్కహాల్ (Alcohol), ప్రాసెస్ చేసిన మాంసాలు (Processed Meats) అని నికోల్ ఆండ్రూస్ చెప్పారు. ఆల్కహాల్ తాగితే లివర్ మాత్రమే కాదు, రొమ్ము, నోరు, గొంతు, అన్నవాహిక, పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుందని ఆమె హెచ్చరించారు. ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లాక ఎసిటాల్డిహైడ్‌ (Acetaldehyde)గా మారుతుంది. ఇది DNAని డ్యామేజ్ చేసి క్యాన్సర్ కణాల వృద్ధికి దారితీస్తుంది. అంటే, ఆల్కహాల్ క్యాన్సర్ కారకంగా పనిచేస్తుందన్నమాట.