షాకింగ్.. ముద్దుతో క్యాన్సర్.. ఎంత ప్రేమ ఉన్నా అలా మాత్రం పెట్టుకోవద్దు..

ప్రేమను వ్యక్తపరిచే మార్గాల్లో ఒకటి కిస్. కాగా ముద్దు గాఢతను బట్టి ఎదుటివ్యక్తిపై ఉన్న ప్రేమలోతు తెలుస్తుంది. ఎంత ప్రేమిస్తున్నారో మాటల్లో చెప్పలేనప్పుడు ఇలా ముద్దుతో చెప్పేస్తారు.


అయితే గొప్ప బంధాలకు కారణమయ్యే ఈ కిస్.. దీర్ఘకాలిక అనారోగ్యాలకు కూడా కారణమవుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. మీ భాగస్వామిని ముద్దు పెట్టుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలుసుకుందాం.

క్యాన్సర్

చాలా మంది పెదాల కలయికతో ముద్దును అక్కడే ఆపేస్తారు. కానీ కొంత మంది మాత్రం డీప్‌గా వెళ్తారు. ఇలాంటి వారిలో ఒక్కరు ఓరల్ సెక్స్ తరుచుగా చేసినట్లయితే.. వారికి గొంతు లేదా నాలుకపై హ్యూమన్ పాపిల్లోమా అనే వైరస్ ఉండిపోతుంది. అలాంటి వ్యక్తిని ముద్దు పెట్టుకుంటే వైరస్ ట్రాన్స్‌ఫర్ అయిపోయి..గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశముంది.

దంతాల అనారోగ్యం

దంతాలు అనారోగ్యం అనేక సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడే చాన్స్ ఉంది. కాబట్టి కిస్ పెట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. డీప్ కిస్ చిగుళ్లపై ఎఫెక్ట్ చూపే బ్యాక్టీరియా ట్రాన్స్‌ఫర్ అయ్యేందుకు దారితీస్తుంది. అందుకే ముద్దు పెట్టే ముందు నోరు శుభ్రం చేసుకోవాలని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.

శ్వాసకోశ సమస్యలు

ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ఉన్న వ్యక్తి శృంగార భాగస్వామిని ముద్దుపెట్టుకున్నప్పుడు ఆ వైరస్ బదిలీ అవుతుంది. దీని కారణంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. జలుబు, గొంతు నొప్పి, జ్వరం, బాడీ పెయిన్స్, సైనస్, ఐ అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడేందుకు దారితీస్తుంది. ీఅంతేకాదు హెర్పెస్ వైరస్ కారణంగా నోటి పుండ్లు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.