ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంతంగా కారు ఉండడం చాలా అవసరం. కార్యాలయ అవసరాలతో పాటు ఫ్యామిలీతో టూర్ కి వెళ్లడానికి ఫోర్ వెయికల్ తప్పనిసరిగా మారింది. అయితే సామాన్యులు సైతం సొంత కారు ఉండాలని కోరుకుంటున్న తరుణంలో బడ్జెట్ కార్ల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. వీరి కోసం కొన్ని కంపెనీలు 10 లక్షల లోపు కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రీమియం కార్ల ఫీచర్లతో సహా పోటీ పడుతూ కొన్ని కార్లు తక్కువ ధరకే రావడంతో చాలామంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లేటెస్ట్ గా Skoda కంపెనీకి చెందిన ఓ కారు వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ రూ. 10 లక్షలు ఉండడంతో ఏమాత్రం ఆలోచించకుండా దీనికోసం బుక్ చేసుకుంటున్నారు. అయితే అంతలా ఈ కారులో ఏముందనే విషయం చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఈ కారు ఎలా ఉందంటే..?
SUV కారు కొనాలని చాలామంది అనుకుంటారు కానీ వీటి ధరలు అధికంగా ఉంటాయి ఈ నేపథ్యంలో సబ్ కాంపాక్ట్ SUV కార్లు ఆకర్షిస్తుంటాయి. సబ్ కాంపాక్ట్ SUV వేరియంట్ లో Skoda కంపెనీ నుంచి Kylaq అనే కారును నవంబర్లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే దీని బుకింగ్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభమైంది. Skoda Kylaq మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ ఉన్నాయి. ఇవి మొత్తం ఏడు రంగులలో విక్రయాలు జరుపుకుంటున్నాయి.
స్కోడా కైలాక్ కార్లలో ఆకర్షించే ఫీచర్లు ఉన్నాయి ఇందులో ఎల్ఈడి లైట్స్, ఎలక్ట్రిక్ రింగ్ మిర్రర్ వంటివి ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా వీటిల్లో 6 ఎయిర్ బ్యాగ్స్, టిల్ట్, టెలిస్కోప్ స్టీరింగ్ విల్ ఉన్నాయి. వీటిలో కైలాక్ ప్రెస్టీజ్ ఇంజన్ విషయానికొస్తే.. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది 114 bhp పవర్, 178 nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తాయి. ఈ కారు 10 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
స్కోడా 4 కార్లు వివిధ ధరలతో అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్లాసిక్ కారు 9.35 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. సిగ్నేచర్ మోడల్ 11.35 లక్షల ప్రారంభ ధరతో అమ్ముతున్నారు. సిగ్నేచర్ ప్లస్ 13.93 లక్షలతో అందుబాటులో ఉంది. ప్రెస్టీజ్ 16.30 లక్షల తో విక్రయిస్తున్నారు. అయితే కొత్తగా కారు కొనాలని అనుకునేవారు క్లాసిక్ కారును ఎంచుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఇతర చార్జీలతో కలిపి దీనిని రూ. 10 లక్షల లోపు సొంతం చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి కాకుండా ఈఎంఐ పద్ధతిలోనూ ఈ కారును కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కంపాక్ట్ ఎస్ యు వి కార్లకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో స్కోడా కైలాక్ కార్లకు మంచి డిమాండ్ ఉంటుందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.