వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై హైదరాబాద్లో కేసు

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంపీ విజయసాయి రెడ్డిపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెల్లలో కూలిపోతుందంటూ..
రాజ్యసభలో ఆన్ రికార్డ్ లో విజయ్ సాయి రెడ్డి మాట్లాడిన విషయాలపై కంప్లైంట్ ఇచ్చారు. బీఅర్ఎస్, వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.

ఏపీలో జరిగే ఎన్నికలకు బీఅర్ఎస్ ఫండింగ్ ఇస్తుందని.. ఇద్దరు మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు కాల్వ సుజాత. తెలంగాణలో సుస్థిర పాలన ఉందని.. ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విజయ్ సాయి రెడ్డి లాంటి నాయకుల వాఖ్యలు చెల్లుబాటు కావని మండిపడ్డారు. ఆయన వాఖ్యలపై సీబీఐతో విచారణ జరిపించి… చర్యలు తీసుకోవాలని కోరారు కాల్వ సుజాత.

Related News