సీజన్ మారింది, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మారిన సీజన్‌తో పాటు వ్యాధులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చికున్ గున్యా, డెంగ్యూ కేసులు దేశంలో భారీగా నమోదవుతున్నాయి.
దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు వ్యాధుల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ రెండు వ్యాధులకు ప్రధాన కారణం దోమలు కుట్టడమే. దోమల వృద్ధిని అరికడితే వ్యాధులకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
దోమల సంతానోత్పత్తిని పెరగడానికి ప్రధాన కారణం చుట్టుపక్కల నీరు నిల్వ ఉండడం. నిల్వ ఉన్న నీరులో దోమలు గుడ్లు పెడుతుంటాయి. కుండీల్లో నాటిన మొక్కలు, పాత టైర్లు, బకెట్స్ ఇలా వీటిలో పేరుకుపోయిన నీటిలో దోమలు గుడ్లు పెట్టడం వల్ల వాటి ఉత్పత్తి పెరుగుతోంది. ఇక ఇంటి చుట్టు పక్కనల కాలువలు, నీటి ప్రవాహాలు న్నా దోమల పెరుగుదల పెరుగుతుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇంట్లో ఉన్న ట్యాప్‌లు లీక్ అవుతుంటే జాగ్రత్తలు పాటించాలి. వీటి ద్వారా కూడా నీరు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కూడా దోమలు గుడ్లు పెట్టడానికి కారణమవుతుండొచ్చు.
ఇక దోమలు ఇంట్లోని ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం డోర్లకు, కిటీకీలకు నెట్‌లను ఉపయోగించాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో దోమలు ఒక్కసారిగా ఇంట్లోకి వస్తుంటాయి. కాబట్టి ఆ సమయంలో తలుపులు మూసివేయాలి. సాయంత్రం పూట ఫ్యాన్ ఆన్ చేసి ఉంచాలి. దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు సిట్రోనెల్లా కొవ్వొత్తులును ఉపయోగించాలి. ఈ నూనెలు దోమలను తరిమికొట్టడంలో ఉపయోగపడతాయి. అలాగే దోమలను అరికట్టేందు మస్కిటో కాయిల్స్‌ను ఉపయోగించాలి. శరీరం నుంచి చెమట ఎక్కువగా వచ్చే వారిని కూడా దోమలు కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుభ్రంగా ఉండడడానికి ప్రయత్నించండి. అలాగే నలుపు రంగు దుస్తులను ధరించకుండా ఉండండి. ఇక రాత్రుళ్లు పడుకునే ముందు ప్యాంట్స్, పొడవాటు చేతులు ఉండే దుస్తులను ధరించడం ఉత్తమం. దీనివల్ల దోమల కాటు నుంచి తప్పించుకోవచ్చు. ఇలాంటి చిట్కాలు పాటించడం ద్వారా దోమ కాటు నుంచి తప్పించుకోవచ్చు. అలాగే డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధు బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.