బ్యాంక్‌లో ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే ఫైన్.. పరిమితులు, నిబంధనలు ఇవే..

www.mannamweb.com


భారతదేశంలో మనీ లాండరింగ్, ఎగవేతలు, ఇతర ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఆదాయ పన్ను (Income Tax Department) విభాగం కొన్ని ఆంక్షలు విధించింది.

ముఖ్యంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో నగదు లావాదేవీలు పరిమితి దాటి ఉంటే వాటిపై భారీగా ఫైన్లు విధించింది.

నిత్యావసరాలు రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సంపాదన నుంచి కొంత ఆదాయం భవిష్యత్తు కోసం దాచుకోవడం చాలా అవసరంగా మారింది. అందుకే చాలా మంది బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉంటారు. ఈ సేవింగ్స్ అకౌంట్లను నగదు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేయడం కోసం ఉపయోగిస్తుంటారు. కానీ సేవింగ్స్ అకౌంట్ అయినా, బిజినెస్ అకౌంట్ అయినా నగదు లావాదేవీలపై పరిమితులున్నాయి. ఈ పరిమితులు దాటితే బ్యాంకు ఫైన్ విధిస్తుంది. మీ అకౌంట్ లో నుంచి కోతలు చేస్తుంది. అందుకే ఈ కోతలను తప్పించుకోవడానికి నిబంధనలు తెలసుకోండి.

ఇన్‌కం ట్యాక్స్ రూల్స్ ప్రకారం.. సేవింగ్స్ అకౌంట్ లో నగదు లావాదేవీలు ఈ పరిమితిలోపే చేయాలి.
– సేవింగ్స్ అకౌంట్ లో ఒకరోజులో రూ.1 లక్ష మించి డిపాజిట్ చేయరాదు.
– సేవింగ్స్ అకౌంట్ లో అరుదుగా డబ్బులు డిపాజిట్ చేసేవారికి ఈ పరిమితి రూ.2.50 లక్షలు
– ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే.. బ్యాంకు ఆదాపన్ను శాఖకు సమాచారం అందిస్తుంది. కరెంట్ అకౌంట్ అయితే ఈ పరిమితి రూ.50 లక్షలు.
– బడా వ్యాపారులు.. సర్వీస్ ప్రొవైడర్లు కరెంట్ అకౌంట్ లో నెలకు గరిష్టంగా రూ.1 కోటి నుంచి రూ.కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు.
– రూ.50,000 పైగా క్యాష్ డిపాజిట్ చేసేవారు తమ ప్యాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది.

ఆదాయపన్ను చట్టం సెక్షన్ 194A
– ఇన్‌కం ట్యాక్స్ చట్టం సెక్షన్ 194A ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ (TDS – Tax Deduction At source)ని సూచిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.1 కోటి కంటే ఎక్కువ విత్ డ్రా చేసుకుంటే బ్యాంకు 2 శాతం టిడిఎస్ కోత విధిస్తుంది.
– అయితే మూడు సంవత్సరాలకు పైగా ఆదాయపన్ను రిటర్న్స్ (ఐటిఆర్ – ITR) దాఖలు చేయని వారికి ఇంకా ఎక్కువ టిడిఎస్ చెల్లించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి ఐటిఆర్ ఫైల్ చేయని వారు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకున్నా 2 శాతం టిడిఎస్ చెల్లించాలి. అదే ఐటిఆర్ ఫైల్ చేయని వారు రూ.1 కోటి విత్ డ్రా చేసుకుంటే అప్పుడు 5 శాతం టిడిఎస్ చెల్లించాలి.

ఆదాయపన్ను చట్టం సెక్షన్ 269ST
ఈ చట్ట ప్రకారం.. ఒక వ్యక్తి మరో వ్యక్తి అకౌంట్లో ఒకే ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలకు మించి డిపాజిట్ చేయరాదు. అలా చేస్తే.. పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అయితే ఈ పెనాల్టీ విత్ డ్రా చేసే వ్యక్తిపై ఉండదు.