క్యాట్ 2024 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే

www.mannamweb.com


దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) 2024 పరీక్ష మరో 20 రోజుల్లో జరగనుంది.

ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తాగాజా విడుదలయ్యాయి. క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 170 నగరాల్లో నవంబర్‌ 24న క్యాట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో ఫలితాలు వెలువడనున్నాయి. క్యాట్‌లో సాధించిన పర్సంటైల్‌ ఆధారంగా ఐఐఎంలలో సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్‌ స్కోరు ఆధారంగా ఇతర కాలేజీల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు.

క్యాట్ 2024 అడ్మిట్‌ కార్డు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎస్సెస్సీ జీడీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ‘ఎడిట్ ఆప్షన్’.. రాత పరీక్ష ఎప్పుడంటే

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆప్షన్లను మార్చుకోడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను జారీ చేసింది. కానిస్టేబుల్‌ నియామక పరీక్ష దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్‌ నవంబర్‌ 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తుది గడువులోగా తమ దరఖాస్తులో మార్పుచేర్పులు చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ రాత పరీక్ష వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. ఇంగ్లిష్‌, హిందీ భాషలతోపాటు తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. రాతపరీక్ష అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.