చిన్న వ్యాపారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఎలాంటి హామీ లేకుండా రూ.90 వేల వరకు రుణం

సామాన్య ప్రజల కోసం దేశంలో మోడీ సర్కార్‌ ఎన్నో పథకాలను తీసుకువస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి స్వానిధి యోజన పథకం ఒకటి.


ఈ స్కీమ్‌ను జూన్ 1, 2020న ప్రారంభించింది కేంద్రం. ఇది వీధి వ్యాపారుల కోసం చిన్న మొత్తంలో అదించే రుణ పథకం. ఈ పథకం వల్ల చిన్న వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

దీని ద్వారా ప్రజలు సులభంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించి మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. ఈ పథకం కింద లబ్ధిదారులకు గతంలో ఎటువంటి భద్రత/హామీ లేకుండా రూ.80,000 వరకు రుణం పొందవచ్చు. దీనిని ఇప్పుడు రూ.90,000కి పెంచారు. దీంతో పాటు, ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకాన్ని మార్చి 31, 2030 వరకు పొడిగించింది. చిన్న వ్యాపారులు ఎలాంటి పూచికత్తు లేకుండా సులభంగా రుణం పొందవచ్చు.

మూడు విడతల్లో రుణం:

కొత్త నిబంధనల ప్రకారం.. ఈ స్వానిధి యోజన కింద రుణం మూడు విడతలలో రుణం లభిస్తుంది.

  • మొదటి విడత: రూ.15,000 (గతంలో రూ.10,000)
  • రెండో విడత: రూ.25,000 (గతంలో రూ.20,000)
  • మూడో విడత: రూ.50,000 (మార్పు లేదు)

మొత్తం రూ.90,000 రుణం పొందడానికి లబ్ధిదారులు మొదటి, రెండో విడతల రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించాలి. మొదటి విడత రూ.15,000 తిరిగి చెల్లించిన తర్వాత రెండో విడత రూ.25,000 అందుబాటులోకి వస్తుంది. అలాగే, రెండో విడత చెల్లించిన తర్వాత మూడో విడత రూ.50,000 అందుబాటులోకి వస్తుంది. ఇలా చిన్నపాటి వ్యాపారం ప్రారంభించేందుకు రుణం పొందవచ్చు. రుణం సరిగ్గా చెల్లిస్తే మళ్లీ పొందేందుకు అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. రుణాన్ని వాయిదాల వారీగా చెల్లించాల్సి ఉంటుంది.

అంటే, రుణాన్ని 12 నెలల్లోపు తిరిగి చెల్లించాలి. పథకం కింద రుణం పొందడానికి వ్యాపారులు ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని తర్వాత, మీ లోన్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

మీరు ప్రధాన్ మంత్రి స్వానిధి యోజన వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. మీ ఆధార్ నంబర్‌ను మీ మొబైల్ నంబర్‌తో లింక్ చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు e-KYC ధృవీకరణ ఉంటుంది. మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. అలాగే, రుణగ్రహీతలు పట్టణ స్థానిక సంస్థల నుండి లేఖను పొందాలి. ఈ పథకం కింద కేవలం నాలుగు కేటగిరీల వ్యాపారులు మాత్రమే రుణానికి అర్హులు. ప్రధాన్ మంత్రి స్వానిధి యోజన పథకం కింద రుణం పొందాలనుకునే వారు ఆన్‌లైన్‌లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు (RRB), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFB), కో-ఆపరేటివ్ బ్యాంకులకు వడ్డీ రేట్లు ప్రస్తుత ధరల ప్రకారం ఉంటాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.