కేవలం డిగ్రీ హోల్డర్ మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.. నెలకు రూ. 86,000

: ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది.


అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లొ దరఖాస్తు చేసుకోండి.

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి డీటైయిల్డ్‌గా తెలుసుకుందాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 266

ఇందులో మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఆన్ లైన్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 21

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 9

2025 మార్చిలో ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది.

ఎగ్జామ్ అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.850.(ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 ఉంటుంది)

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. (బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంది.)

జోన్ల వారీగా వెకన్సీలు:

అహ్మదాబాద్: 123

చెన్నై: 58

గువహటి: 43

హైదరాబాద్: 42

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి 85,920 వరకు వేతనం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం:

మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులకు గానూ ఎగ్జామ్ నిర్వహిస్తారు. 80 నిమిషాల సమయం కేటాయిస్తారు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 20 ప్రశ్నలు, బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 60 ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు, ఎకానమిక్ సెనారియో అండ్ జనరల్ అవెర్నెస్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నలకు ఒక్కో మార్కు ఉంటుంది.

రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూకి 30 శాతం వెయిటేజ్ ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.centralbankofindia.co.in/en