చైతన్యకు 200 సార్లు చూసినా బోర్ కొట్టని చిత్రాలివే

ప్రతీ హీరోకి అభిమాన హీరోలుంటారు. పదే పదే చూసి ఆస్వాదించే కొన్ని చిత్రాలుంటాయి. ఈ విషయంలో సెలబ్రిటీ అయినా ఓ అభిమానే. నచ్చిన సినిమా వస్తుందంటే?


చూడాలనే ఆసక్తి వ్యక్తమవుతుంది. మరి నాగ చైతన్యకు అలాంటి సినిమాలు ఏవైనా ఉన్నాయా? ఎన్ని సార్లు చూసి బోర్ కొట్టని సినిమాలు ఉన్నాయా? అంటే ఓ రెండు చిత్రాలు ఉన్నాయంటున్నాడు. నాగార్జున నటించిన `నిన్నే పెళ్లాడుతా` సినిమా తనకు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదన్నారు. ఇప్పటి వరకూ ఓ వందసార్లు ఆ సినిమా చూసానన్నారు.

మరో వందసార్లు చూడటానికైనా తాను సిద్దంగా ఉన్నానన్నారు. అలాగే మేనమామ వెంకటేష్ నటించిన `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు` సినిమా కూడా అంతే ఇష్టమన్నారు. ఆ సినిమా కూడా ఇప్పటికే 100 సార్లు చూడ టం పూర్తి చేసానన్నారు. టీవీలో ఆ సినిమాలు వచ్చినప్పుడు తనలో కొత్త ఉత్సాహం ఫాం అవుతుందన్నారు. వాళ్లిద్దరు ఎన్నో సినిమాలు చేసినా? ఆ రెండు సినిమాల విషయంలో తానెంతగానో కనెక్ట్ అవుతానన్నారు.

ఇక చైతన్య సినిమాల సంగతి చూస్తే.. కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. `తండేల్` తో వంద కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టారు. ఈనేపథ్యంలో తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. `విరూపాక్ష` తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్తీక్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో నాగ చైతన్య కోత్త రికార్డులు అందుకుంటాడు? అన్న అంచనాలు భారీగా ఉన్నాయి. మైథలాజికల్ థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉండటంతో సినిమాకు పెద్ద ఎత్తున మార్కెట్ జరుగుతోంది.

చైతన్య `తండేల్` తో సెంచరీ కొట్టడంతో బిజినెస్ స్పాన్ పెరిగింది. ఇలా చైతన్య కొత్త సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అలాగే తదుపరి చిత్రాల ప్రణాళిక కూడా ఎంతో స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. హిట్ దర్శకుల్ని మాత్రమే క్యూలో పెట్టారు. స్టోరీ పరంగా రిస్క్ తీసుకున్నా? దర్శకుల పరంగా రిస్క్ లేకుండా చూసుకుంటున్నారు. శివ నిర్వాణతో కూడా మరోసారి లవ్ స్టోరీ చేయడానికి సిద్ద పడుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.