Chanakya Niti: సంపాదించిన డబ్బు శాశ్వతంగా ఉండాలంటే చాణక్యుడి చెప్పిన ఈ సూత్రాలు పాటించండి..

చాణక్యుడు గొప్ప జ్ఞాని. ఆయన ఆకాలంలో చెప్పిన మాటలు ఇప్పటికీ అనుసరణీయమే. జీవితంలోని అనేక అంశాల గురించి లోతైన అవగాహన ఉన్న వ్యక్తి చాణక్యుడు. తనకున్న జ్ఞానంతో, తన విధానాలతో చరిత్ర గతిని మార్చిన గొప్ప వ్యక్తి.
చాణక్యుడు తన వ్యూహాల ద్వారా చంద్రగుప్తుడిని రాజును చేశాడు. ఆయన చెప్పిన ఎన్నో వ్యాఖ్యలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, సంబంధాలు, స్నేహం, శత్రువలు వంటి జీవితంలోని వివిధ అంశాలపై తన అభిప్రాయాలను చాణక్య నీతి పుస్తకం ద్వారా వెల్లడించారు.


చాణక్యుడు అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఆర్థిక సంబంధ విషయాల గురించి ప్రస్తావించారు. సంపద ఎలా సృష్టించాలి, దానిని ఎలా నిర్వహించాలి, డబ్బు ఎలా ఖర్చు పెడితే రెట్టింపు అవుతుంది లాంటి ఎన్నో విషయాలు చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ గురించి చాణక్యుడు చెప్పిన విషయాలు ఇప్పటికీ అనుసరణీయమే.

డబ్బు ఎలా సంపాదించాలి, ఆ డబ్బును ఎలా ఖర్చు చేస్తే ధనవంతులు కావొచ్చో చాణక్యుడు చెప్పిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అవసరమున్న చోటే ఖర్చు చేయాలి:

* సంపద దాచుకోవడం తెలిసి ఉండాలని చాణక్యుడు చెబుతాడు.
* చెడు సమయాల్లో డబ్బు సహాయం చేస్తుందని చాణక్య నీతి చెబుతోంది.
* ఆపద సమయంలో డబ్బు నిజమైన స్నేహితుడి పాత్ర పోషిస్తుందని చాణక్యుడు సూచించాడు.
* డబ్బు లేనప్పటి కంటే ఉన్నప్పుడు ఉండే ఆత్మవిశ్వాసం ఎక్కువ. పర్సులో 2వేల నోటు ఉన్నప్పుడు, రూపాయి కూడా లేనప్పుడు ఎలా ఉంటుందో గమనించండి.
* ఆర్థిక సమస్యల వల్ల శారీరక సమస్యలు, మానసిక సమస్యలు వస్తాయి. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత ఉండదు. దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి.
* ఆదాయానికి మించి ఖర్చు చేసే వారు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు.
* డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి.
* అవసరానికి లగ్జరీకి మధ్య తేడా తెలుసుకుని ఖర్చు చేయాలని చెబుతోంది చాణక్య నీతి.
* అనవసరమైన చోట డబ్బు ఖర్చు చేస్తే అవసరమైనవి వదులుకోవాల్సి వస్తుందని చాణక్యుడి అర్థశాస్త్రంలో చెప్పబడింది.

అనైతిక పనులకు డబ్బు ఖర్చు చేయవద్దు:

* జీవితంలో విజయం సాధించాలంటే అనైతిక చర్యలకు పాల్పడవద్దని చాణక్య నీతి చెబుతోంది.
* చెడు అలవాట్లు ధనవంతుడిని కూడా పేదవాడిని చేస్తాయి.
* ధనవంతులు కావాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
* తప్పుడు చర్యల ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు.

డబ్బు దాచుకోవాలి:

* డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది.
* డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉన్న వారు నష్టపోయే అవకాశాలు ఎక్కువ.
* రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడతామో.. ఆ రూపాయిని దాచుకోవడానికి కూడా కష్టపడాలి.
* డబ్బు పొదుపు చేయాలి.
* అత్యవసర నిమిత్తం డబ్బు పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన డబ్బుతో వ్యాపారం చేయాలి, పెట్టుబడి పెట్టాలి.

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాణక్య సూత్రం:

లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో చాణక్యుడు వివరంగా చెప్పాడు. అలాగే లక్ష్మీదేవికి కోపాన్ని కలిగించే అంశాలు ఏమిటో కూడా వివరించాడు. దొంగతనం, జూదం, అన్యాయం, మోసం చేసి డబ్బు సంపాదించే వారు త్వరగా ధనవంతులు అవుతారు. కానీ వారి సంపదన చాలా త్వరగానే కరిగిపోతుంది. మోసం చేసి ఎవరినైనా బాధపెట్టి సంపాదించే డబ్బు ద్వారా అనేక సమస్యలు వస్తాయని చాణక్య నీతి చెబుతోంది.