కేంద్రం మతిపోగొట్టే స్కీం.. నెలకు రూ. 55 పొదుపుతో.. ప్రతి నెల 3000 పొందే ఛాన్స్

www.mannamweb.com


కేంద్ర ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నది. సామాన్యులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్నది. ఆర్థిక సాయం అందించే స్కీమ్స్ ను ప్రవేశపెడుతోంది. బాలికలు, మహిళలు, వృద్ధుల కోసం మంచి ప్రయోజనాలు అందించే పథకాలను అందుబాటులో ఉంచుతున్నది. ఆర్థికంగా వెనకబడిన వారికి కేంద్ర పథకాలు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఈ పథకాల పట్ల అవగాహన లేక లబ్ధి పొందలేకపోతున్నారు. కేంద్రం అందించే పథకాల్లో తక్కువ మొత్తంలోనే పెట్టుబడి పెట్టి అధిక లాభాలను అందుకోవచ్చు. కాగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్రేజీ స్కీమ్స్ ను అమలు చేస్తోంది.

ఉద్యోగులకు అయితే రిటైర్ మెంట్ అనంతరం పెన్షన్ వస్తుంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఆ సదుపాయం ఉండదు కదా. అందుకే వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సూపర్ స్కీమ్ ను అందుబాటులో ఉంచింది. అదే ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన స్కీం. దీని ద్వారా అసంఘటిత రంగంలోని వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, బట్టలు ఉతికేవారు, రిక్షా పుల్లర్లు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు తదితరులకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకంలో చేరితే నెలకు రూ. 55 పొదుపుతో ఏకంగా ప్రతి నెల 3 వేల పెన్షన్ అందుకోవచ్చు. మరి ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి. ఆ విషయాలు మీకోసం..

ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన స్కీంలో కార్మికులు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ. 3,000 పెన్షన్‌ అందుకుంటారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నెలవారీ ఆదాయం 15 వేలకు మించకూడదు. కేంద్రం అందించే ఇతర పెన్షన్ పథకాల నుంచి లబ్ధి పొందని వారు అర్హులు. కార్మికుడు కనీసం 20 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పథకానికి కాంట్రిబ్యూట్‌ చేయాలి.

ఈ స్కీమ్ లో ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తూ ఉండాలి. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కట్టొచ్చు. పెట్టుబడి అనేది మీ వయసుపై ఆధారపడి ఉంటుంది. అంటే 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.55 ఇన్వెస్ట్ చేయాలి. అదే 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.200 చెల్లించాలి. కార్మికునికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ ప్రారంభమవుతుంది. ఈ పథకంలో చేరాలనుకునే అసంఘటిత రంగ కార్మికులు కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ పూర్తి సమాచారం కోసం maandhan.in వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.