Chandrababu Naidu | సీఎం రేవంత్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ..

Chandrababu Naidu | తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన అంశాలపై ఈ లేఖ రాశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కలిసి చర్చించుకుందామన్నారు.


పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. విభజన జరిగి పదేళ్లు దాటినా కొన్ని అంశాలు పరిష్కారం కాలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 6న ముఖాముఖి కలిసి కూర్చోని చర్చించుకుందామన్నారు. ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురుచూస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.