తెల్లగలిజేరుతో అనారోగ్యాలకు చెక్.. కిడ్నీ సమస్యలే కాదు.. మరెన్నో

www.mannamweb.com


ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మందికి ఆకుకూరలు అనగానే తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర.. మహా అయితే బచ్చల కూర మాత్రమే తెలుసు. మిగిలిన ఆకుకూరల గురించి పెద్దగా అవగాహన ఉండదు. మార్కెట్‌లో కూడా ఇవే ఎక్కువ లభిస్తుండటంలో ఆకుకూరలంటే ఇవే అనే భ్రమలో బతికేస్తున్నారు. కానీ మన ఇంటి చుట్టూ పెరిగే కొన్ని ఆకు కూరలు వండుకోవచ్చు, తినొచ్చు అనే విషయం తెలియక డబ్బులు ఖర్చు పెట్టి మరీ లీఫీ వెజిటెబుల్స్ తెస్తుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి గలిజేరు. దీనికి మరో పేరు పునర్నవ. పొలాలపై గట్లపై పెరిగే మొక్కే గలిజేరు. నేలను చక్కగా అదును చేసుకుని ఏపుగా పెరుగుతుంటాయి. పచ్చగా నిగనిగలాడుతూ చూసేందుకు చూడముచ్చటగా ఉంటాయి. ఈ గలిజేరులో రెండు రకాలు ఉన్నాయి తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు. వీటిని రైతులు కలుపు మొక్కగా భావించి.. పీకేస్తుంటారు. కానీ వీటిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

చూసేందుకు రెండు ఓకేలా ఉన్నా.. ఎర్ర గలిజేరు కన్నా తెల్ల గలిజేరులో ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. పునర్నవ అంటే శరీరంలో చెడిపోయిన అవయవాలను ‘పునరుద్ధరించేది’ అని అర్ధం. దీని శాస్త్రీయ నామం బోరేవియా డిఫ్యూసా. తెల్ల గలిజేరును ఇంగ్లీష్‌లో హాగ్‌వీడ్, స్టెర్లింగ్, టార్విన్ కూడా అంటారు. ఈ మొక్కలో ప్రోటీన్లు, విటమిన్ సి,డి సోడియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఈ తెల్లగలిజేరు ఆకు, కాండం, వేరుతో సహా ఔషధగుణాలు నిండి వున్నాయి. తెల్ల గలిజేరు యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది కీళ్ల, కండరాల నొప్పిని తగ్గించడంతో ఉపయోగపడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల ప్రమాదలను తగ్గిస్తుంది. ఇది భయంకరమైన ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.

ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చివరకు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ ఆకు తీసుకుంటే.. దివ్య ఔషధంగా పని చేస్తుంది. పిడికెడు ఆకులు తీసుకుని నీటిలో మరిగించి, చల్లారాక పరగడుపు తీసుకుంటే కిడ్నీల శుద్దితో పాటు మూత్రనాళ సమస్యలు తగ్గుతాయి. బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. సుమారు మూడు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తీసుకోలేని వాళ్లు..కూరగా చేసుకుని తీసుకోవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా ఇబ్బంది పెడుతున్న సమస్య షుగర్. అయితే గలిజేరులో చక్కెర స్థాయిలో నియంత్రించే హైపోగ్లేసీమిక్ గుణం ఉంది. ప్రాణాంతక వ్యాధి అయిన బ్లడ్ క్యాన్సర్‌ను దరి చేరనివ్వదట ఈ ఆకు.

తెల్ల గలిజేరు ఆకు నిత్యం తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. లివర్ వాపు, వరిబీజం, వాతం, శ్వాస సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. అలాగే మహిళల్లో పీరియడ్స్ సమస్యలను నయం చేస్తుంది. ఈ ఆకుకూరలో ఉండే శక్తివంతమైన బయోయాక్టివ్‌లు శరీరంలో ఉంటే చెడు కొలస్ట్రాల్ కరిగించి బరువును తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఇది గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు హార్ట్ ఎటాక్, రక్తం గడ్డకట్టడం వంటి ప్రమాదాలని తగ్గిస్తుంది. ఇక ఆకు కూర రూపంలో లేకపోతే.. ఇప్పుడు మార్కెట్‌లో పౌడర్, చూర్ణం, క్యాప్సుల్స్ రూపంలో కూడా దొరుకుతుంది. తీసుకుని వినియోగించుకోవచ్చు. అయితే గర్భిణీ స్త్రీలు, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పునర్నవ క్యాప్సుల్, చూర్ణం తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.