రిజిస్టర్లో సంతకం పెట్టి విధులకు డుమ్మా కొట్టే టీచర్లకు చెక్

ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి రోజు పాఠశాలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది.


ఆగస్టు ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫేస్ రీడింగ్ సిస్టం ( ఎఫ్ఆర్ఎస్) అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో విద్యార్థులు పాఠశాలకు హాజరైతే ఫేస్ రీడింగ్ సిస్టం అమలు చేసే విధంగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరైతే ఉదయం 9 గంటల సమయంలో చెక్ ఇన్ ఎఫ్ఆర్ఎస్ చేసి సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాలకు చెక్ అవుట్ అమలు జరిగేలా స్కూల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ పాఠశాలతో పాటు కేజీబీవీ, గురుకులాల్లో సైతం అమలు జరుగుతుంది.

ఈ విధానం వల్ల విద్యార్థులకు సక్రమమైన విద్యను అందించేందుకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1180 స్కూల్ కి గాను 5624 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని సాహసం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో విధులకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయులకు చెక్ పెట్టినట్లు అయింది. గతంలో ఈ విధానం అమలు కాకముందు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి బడి అనే పేరుతో బయట కార్యకలాపాలు నిర్వహించే టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అనే సిస్టం చెక్ పెట్టినట్లు అయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.