చియా గింజలు, సబ్జా విత్తనాల మధ్య తేడా ఏమిటి? అవి ఎలాంటి ప్రయోజనాలు ఇస్తాయంటే

www.mannamweb.com


బరువు తగ్గడానికి ప్రస్తుతం ఎక్కువ మంది తమ ఆహారంలో చియా విత్తనాలను చేర్చుకుంటున్నారు. వీటితో స్మూతీస్‌తో సహా అనేక రకాల పానీయాలు తయారు చేస్తారు.

అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ చియా విత్తనాలు, సబ్జా గింజల మధ్య తేడాను గుర్తించలేరు. ఈ రెండిటి విషయంలో గందరగోళానికి గురవుతారు. ఒకొక్కసారి చియా గింజలకు బదులుగా సబ్జా.. సబ్జాకు బదులుగా చియా విత్తనాలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు విత్తనాలు ప్రయోజనకరమైనవి.. మంచి మొత్తంలో పోషకాలను కలిగి ఉన్నప్పటికీ.. శరీరం ప్రయోజనాలను వివిధ మార్గాల్లో పొందుతుంది.

బరువు తగ్గడానికి చియా గింజలను తీసుకుంటారు. అయితే ఏవి సబ్జా గింజలు, ఏవి చియా గింజలా అని అయోమయంలో పడేవారిలో మీరు కూడా ఒకరా.. అయితే వీటి ఎలా గుర్తించవచ్చు.. ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం..

సబ్జా గింజలు అంటే ఏమిటి?

సబ్జా గింజలను తులసి గింజలు అంటారు. తులసి గింజలు చాలా చక్కగా, ముదురు రంగులో ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. చేతిలో తులసి గింజలను తీసుకున్నప్పుడు లేదా దంతాల క్రింద వీటిని ఉంచినప్పుడు.. ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు సబ్జా గింజలను నీటిలో వేసినప్పుడు అవి చియా గింజల్లా ఉబ్బుతాయి. కానీ ఇవి జెల్ లాగా మారవు. వీటిని ఫలూడా, షర్బత్‌లో కూడా ఉపయోగించవచ్చు.

చియా విత్తనాలు

చియా విత్తనాలను చియా మొక్కల నుంచి లభిస్తాయి. దీని శాస్త్రీయ నామం సాల్వియా హిస్పానికా. చియా విత్తనాలను నీటిలో నానబెట్టినప్పుడు.. అవి చాలా మృదువైనదిగా మారతాయి. అంతేకాదు చియా విత్తనాలు జెల్ లాగా మారతాయి. ఇవి ఓవల్, మృదువైనవిగా మారతాయి. తేలికగా ఉంటాయి. పానీయాలు, పుడ్డింగ్‌లు, ఓట్‌మీల్ మొదలైన వాటిని తయారు చేయడానికి చియా విత్తనాలను ఉపయోగిస్తారు.

సబ్జా విత్తనాల ప్రయోజనాలు

మలబద్ధకంతో బాధపడేవారికి సబ్జా గింజలు మేలు చేస్తాయి. అంతేకాదు ఇవి శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సబ్జా గింజలు ఎముకలకు కూడా మేలు చేస్తాయి. ఇందులోని తక్కువ కేలరీల కారణంగా ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.

చియా విత్తనాల ప్రయోజనాలు

బరువు తగ్గుతున్న వారు, కండరాలను టోన్ చేయాలనుకునే వారు చియా సీడ్స్ తీసుకోవాలి. ఇవి ప్రోటీన్ కు మంచి మూలం. అంతేకాదు చియా విత్తనాలలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా మంచి పరిమాణంలో ఉంటాయి. వీటి పోషకాల విలువలో స్వల్ప వ్యత్యాసం ఉంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)