చికెన్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అందరూ లొట్టలు ఏసుకుంటూ తింటారు. అసలు చికెన్ ముక్క లేనిదే ముద్ద పెట్టనివారు చాలా మంది ఉన్నారు. అటు ఆరోగ్యానికి సైతం చికెన్ చాలా మంది.
సహజంగా లభించే ప్రోటీన్ కోసం చికెన్ ఒక అద్భుతమైన ఎంపిక. ముఖ్యంగా కండరాలను పెంచుకోవాలనుకునే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే వారికి చికెన్ చాలా సహాయపడుతుంది. కానీ చికెన్‌లోని అన్ని భాగాలు ఒకే రకమైన పోషకాలను కలిగి ఉండవు. ఏ భాగాన్ని ఎలా వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్: ఏ భాగంలో ఎక్కువ ప్రోటీన్..?
మీరు బరువు తగ్గడం లేదా కండరాలను పెంచుకోవాలని అనుకుంటున్నారా..? అయితే చికెన్ ఏ భాగంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందో తెలుసుకోవడం అవసరం. 100 గ్రాముల చికెన్‌లో ఉండే పోషకాలు ఈ కింది విధంగా ఉంటాయి:
చికెన్ బ్రెస్ట్: ఇందులో 31 గ్రాముల ప్రోటీన్, 3.6 గ్రాముల కొవ్వు, 165 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి, కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఎంపిక.
చికెన్ లెగ్స్: ఇందులో 26 గ్రాముల ప్రోటీన్, 10.9 గ్రాముల కొవ్వు, 209 కేలరీలు ఉంటాయి.
చికెన్ వింగ్స్: ఇందులో 30.5 గ్రాముల ప్రోటీన్, 8.1 గ్రాముల కొవ్వు, 290 కేలరీలు ఉంటాయి.
చికెన్ డ్రమ్ స్టిక్: ఇందులో 28 గ్రాముల ప్రోటీన్, 5.7 గ్రాముల కొవ్వు, 175 కేలరీలు ఉంటాయి.
మీ లక్ష్యం ప్రకారం ఎంచుకోండి
బరువు తగ్గే వారికి: చికెన్ బ్రెస్ట్ ఉత్తమ ఎంపిక. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా, కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది కండరాల నిర్వహణకు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జిమ్ చేసే వారికి: చికెన్ థైస్, వింగ్స్, డ్రమ్ స్టిక్స్ మంచివి. వీటిలో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇది కండరాల పెరుగుదలకు, బరువు పెరగడానికి సహాయపడుతుంది.
వంట పద్ధతి కూడా ముఖ్యం
చికెన్‌ను ఎలా వండుతారు అనే దానిపై దాని పోషక విలువలు ఆధారపడి ఉంటాయి.
ఉడకబెట్టడం: చికెన్‌ను ఉడకబెట్టి తినడం బరువు తగ్గడానికి చాలా మంచిది. ఈ పద్ధతిలో అదనపు కొవ్వు కలవదు.
రోస్టింగ్ లేదా గ్రిల్లింగ్: ఈ పద్ధతులు రుచిని పెంచడంతో పాటు అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
వేయించడం: చికెన్‌ను వేయించి తినడం వల్ల కేలరీలు బాగా పెరిగి శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. కనుక ఈ పద్ధతిని నివారించడం మంచిది.
ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చికెన్‌ను ఎంచుకునేటప్పుడు, మీ లక్ష్యం మరియు శరీర అవసరాలకు అనుగుణంగా సరైన భాగాన్ని ఎంచుకోవడం ముఖ్యం.
































