తిరుపతిలో కుళ్లిన చికెన్ విక్రయం.. పది రోజుల క్రితం చనిపోయిన కోళ్లను!

తిరుపతిలో కుళ్లిన చికెన్ విక్రయాలు పట్టణంలో సంచలనం రేపింది. విషయం తెలిసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు.ప్రస్తుతం స్థానిక చికెన్ షాపుల్లో కిలో చికెన్‌ రూ.


220 నుంచి 240లకు విక్రయిస్తుండగా, ఆ దుకాణంలో మాత్రం కేవలం రూ. 150కే విక్రయిస్తుండటంతో మార్కెట్‌లోని ఇతర షాపుల యజమానులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

చనిపోయిన కోళ్లను కోసి 10 రోజుల పాటు డీప్‌ఫ్రీజర్‌లో భద్రపరిచి కుళ్లిన చికెన్‌ విక్రయిస్తున్నట్లు గుర్తించారు.దీంతో వారు మున్సిపల్‌ ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చికెన్‌ దుకాణాన్ని పరిశీలించగా చికెన్‌ కుళ్లిపోయి,బూజు పట్టి దుర్వాసన వెదజల్లటాన్ని గుర్తించారు. వెంటనే షాపును సీజ్ చేసి విక్రయదారుడిపై చర్యలకు ఉపక్రమించారు.