సోషల్ మీడియా(Social Media) ప్రభావం పెద్దల మీదే కాదు… చిన్న పిల్లలపై కూడా విపరీతంగా పడుతోంది. తల్లిదండ్రులు(Parents) సెల్ ఫోన్లలో యూట్యూట్, ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రతి నిత్యం చూస్తున్నారు.
సరదాగా చిన్న పిల్లలకు కూడా చూపిస్తున్నారు. అయితే పిల్లలు మాత్రం అడిక్ట్ అయిపోతున్నారు. సెల్ ఫోన్‌లో కొత్త కొత్త వీడియోలు, గేమ్స్ చూసేందుకు ఆతృత చూపుతున్నారు. సెల్ ఫోన్ ఇస్తేనే గాని అన్నం తినే పరిస్థితికి వచ్చేశారు.
దీంతో సెల్ ఫోన్ భారీ నుంచి తన పిల్లవాడిని తప్పించేందుకు ఓ తల్లి వినూత్నంగా ఆలోచించారు. తన ఫోన్ వాల్ పేపర్ భయపెట్టే విధంగా ఓ ఫోటోని సేవ్ చేసి పెట్టుకున్నారు. పెద్దగా తెరిచిన నోరు, కళ్లతో ఉన్న దెయ్యం స్క్రీన్‌ను చూసి ఫోన్ ముట్టాలంటేనే పిల్లవాడు భయపడుతున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
































