పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఇండస్ట్రీ మీద పడతారేంటి?: చిరంజీవి

www.mannamweb.com


సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు పరిణామాలు చోటుచేసుకున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత సినిమా ఇండస్ట్రీపై మొత్తం బన్నీకి సంఘీభావం తెలుపుతూ అండగా నిలిచింది.

అయితే ఇండస్ట్రీ వ్యవహార తీరును తెలంగాణ ప్రభుత్వం తప్పు పట్టింది. ఇకపై ఏ సినిమాలో కూడా ప్రీమియర్ షోలు ఉండవని, టికెట్ రేట్లకు అనుమతించబోమంటూ రేవంత్ రెడ్డి సర్కార్ సంచల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం సంచలన నిర్ణయంతో ఇండస్ట్రీ మొత్తం అయోమయ పరిస్థితిలో పడింది. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించగల వ్యక్తి ఎవరో ? అంటూ ఇండస్ట్రీ పెద్దదిక్కు కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి ఏ విషయాలను ప్రస్తావించారంటే?

మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వస్తే .. ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని, నలుగురు కడుపునిండా తినగలరని అన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను తప్పుగా చిత్రీకరిస్తూ.. పార్లమెంట్ లో చర్చించడం సరికాదని, సినిమాలను తీస్తున్నామంటే నలుగురికి ఉపాధి దొరుకుతుందని ఉద్దేశంతోనే తాము సినిమాలను నిర్మిస్తున్నామని, సినిమాలలో నటిస్తున్నాం కాబట్టే తమకు డబ్బులు ఇస్తున్నారని చిరంజీవి స్పష్టం చేశారు.

సినిమాల మీద సినిమాలు తీస్తున్నారంటే డబ్బుల మీద డబ్బులు వస్తున్నాయని కాదనీ, నలుగురికి ఉపాధి దొరుకుతుందని నలుగురికి వినోదం పంచిన వాళ్ళం అవుతామని చిరంజీవి అన్నారు. అయితే ఇటీవల టాలీవుడ్ ను రాజకీయాలు చుట్టూముడుతున్నాయని, దేశంలో వేరే సమస్య లేనట్లు.. ఇండస్ట్రీ సమస్యలను పెద్దల సభలలో కూడా చర్చిస్తున్నారని, ఈ పరిణామం చాలా దూరదృష్టకరమంటూ చిరంజీవి ఆగ్రహం వ్యకత్ం చేశారు. రాజకీయాలకు సినిమాలకు మధ్య దూరం ఉండనివ్వండి, మా కష్టాలు మేము పడతాము. మీరు ప్రభుత్వాలు ఆదరిస్తే మరీ సంతోషం అంటూ చిరంజీవి రిక్వెస్ట్ చేసుకున్నారు.

సినిమాలకు రాజకీయాలకు పొంతనలేదని, తాను సినిమాలో చూశాను రాజకీయాలు చూశాను అంటూ అవసరమైతే ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడండి. కానీ, సినిమా ఇండస్ట్రీని అణగదొక్కడానికి గాని, ఈ సమస్యను దేశవ్యాప్తంగా తప్పుగా ఎత్తి చూపిస్తూ పెద్దల సభ వరకు తీసుకువెళ్లడం సరికాదు అంటూ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడితే బాగుంటుందని, దాంతోపాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణంతో పాటు రైల్వే కనెక్షన్స్, ఉపాధి కల్పన అలాంటి విషయాలపై మాట్లాడితే బాగుంటుందని కాస్త ఘాటుగా మాట్లాడారు.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా సినిమాపై పడటం సబబు కాదన్నారు చిరంజీవి. వాస్తవానికి ఈ వీడియో వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ ఫంక్షన్లో చిరంజీవి.. ఆనాటి జగన్ ప్రభుత్వం పై ఘాటుగా చేసిన వ్యాఖ్యలను తెలుస్తోంది. తాజాగా ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నట్లు అర్థమవుతుంది.