డియర్ కళ్యాణ్ హృదయం ఉప్పొంగుతోంది.. చిరు ఎమోషనల్ ట్వీట్

Chiranjeevi Congratulates Pawan Kalyan oVer Victory: పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆయనకు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది మెగా ఫ్యామిలీ నుంచి మెగా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ గెలుపు నేపథ్యంలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది.


నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.