భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారు.. ఊబకాయం అనేది ఒక వ్యాధి కాదు, కానీ ఇది అనేక వ్యాధులకు మూలంగా పరిగణిస్తారు.
ఈ పరిస్థితిని వీలైనంత వరకు నియంత్రించాలి. బొడ్డు కొవ్వు పెరగడం వల్ల, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది. అప్పుడు అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, ట్రిపుల్ నాళాల వ్యాధి, కరోనరీ ఆర్టరీ వ్యాధి కి దారితీస్తుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. మీకు స్లిమ్ ఫిగర్ కావాలంటే కొన్ని అలవాట్లను వదులుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొట్ట, నడుము కొవ్వు పెరుగుదల శరీరం మొత్తం ఆకృతిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.. అందుకే.. మీరు కొన్ని చెడు అలవాట్లను వదులుకుంటే స్లిమ్ గా మారవచ్చు..
వైద్యుల ప్రకారం.. మన చెడు అలవాట్ల వల్ల బరువు పెరుగుతుంది.. ఇంకా బొడ్డు కొవ్వును నియంత్రించడం కష్టంగా మారుతుందనే వాస్తవాన్ని మనం తరచుగా విస్మరిస్తాము.. అందుకే ముందే జాగ్రత్తులు తీసుకోవాలి..
బెల్లీ ఫ్యాట్ ను నియంత్రించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శారీరక శ్రమ లేకపోవడం..
నిత్యం 8 నుంచి 10 గంటల పాటు ఆఫీసులో కూర్చొని పని చేసేవారిలో లేదా రోజంతా ఇంట్లోనే ఉండేవారిలో పొట్ట, నడుము కొవ్వు క్రమంగా పెరగడం ప్రారంభమవుతుంది. మీరు శారీరక శ్రమను పెంచుకోకపోతే, ఊబకాయం పెరగడం ప్రారంభమవుతుంది. దీన్ని నివారించాలంటే మార్నింగ్ వాక్, రోజులో వీలైనంత ఎక్కువగా నడవడం, జిమ్ లో చెమటోడ్చడం, మెట్లు ఎక్కడం వంటి చర్యలు తీసుకోవాలి..
నూనె ఆహారం..
ఆయిల్ ఫుడ్ తినే ట్రెండ్ భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఇది రుచిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఇలా మూడు పూటలా నూనెతో కూడిన ఆహారాన్ని తీసుకునే వారి పొట్టలో కొవ్వు వేగంగా పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
మద్యం తాగడం..
ఆల్కహాల్ మన ఆరోగ్యానికి శత్రువు అని అందరికీ తెలుసు.. కానీ ఎవ్వరూ ఈ వ్యసనం నుంచి బయటపడరు.. ఇది అనేక రకాలుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. ఒక సమస్య ఏమిటంటే, ఆల్కహాల్ శరీరంలో ఉండే చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది.. దానిని కొవ్వుగా మారుస్తుంది. దీని వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది..